వాయు మహా పురాణము
12 - యోగోపసర్గం నిరూపణం
సూత ఉవాచ:-
అత ఊర్థ్యం ప్రవక్ష్యామి ఉపసర్గా యథాతథా ।
ప్రాదుర్భవన్తి యేదోషా తత్వస్వ దృష్ట దేహినః॥
మానుష్యాన్ వివిధాన్ కామాన్ కామయేత ఋతం స్త్రియః ।
విద్యాదానఫలం చైవ ఉపస్పష్టన్తు యోగవిత్॥
అగ్నిహోత్రం హవిర్యజ్ఞ మేతత్ప్రాయతనం తథా ।
మాయా కర్మధనం స్వర్గముపసృష్టస్తు కాంక్షతి॥
ఏష కర్మసు యుక్తస్తు సొఽవిద్యావశ మాగతః ।
ఉపసృష్టన్తు జానీయాద్భుద్ధ్యా చైవ విసర్జయేత్॥
నిత్యం బ్రహ్మపరోయుక్త ఉపసర్గాత్ప్రముచ్యతే॥
జితప్రత్యుపసర్గస్య జిత శ్వాసస్య దేహినః ।
ఉపసర్గా: ప్రవర్తన్తే సాత్త్వరాజ సతామసా:॥
సూతుడు పలికెను:- ఆపైన (యోగముచే) తత్యమును దర్శించిన దేహికి (ఉత్పాతము రోగము) విఘ్నములు గలుగు విధమును, దోషములు బుట్టు విధమును జెప్పబోవుచున్నాను-1. యోగమును దెలిసి యోగరోగియైన వాడు (యోగమును సరిగాననుసరించనందున గలిగిన రోగములు గలవాడు) ఉపస్పష్టుడు వాడు మనుష్య సంబంధములై వివిధములైన కోరికలను, ఋతువును, స్త్రీలను, విద్యాదాన ఫలమును కోరును-2. యోగరోగి అగ్ని హోత్రమును, హవిస్సును, యజ్ఞమును అట్లే వీని యజ్ఞశాలను, మాయా కర్మను, ధనమును, స్వర్గమును కోరును-3. వీడు కర్మలతో దగులుకొన్నవాడు. అవిద్యకు (అజ్ఞానమునకు) వశమైనవాడు. వానిని ఉపస్పష్టుని (విప్నువంతుని) వానిని (యోగరోగిగా) తెలిసికొని వదిలివేయవలెను. నిత్యము బ్రహ్మపరుడైన యోగి ఉపసర్గము (యోగ విఘ్నము యోగరోగము నుండి విముక్తుడగును- 4. యోగ రోగములను విఘ్నములను జయించిన వాడును శ్వాసను జయించినవాడును ఐన దేహికి గూడ సాత్త్యికములు రాజసములు తామసములు నైన రోగములు కలుగుచుండును .
ప్రతిభా శ్రవణే చైవ దేవానాం చైవ దర్శనమ్ ।
భ్రమావర్తశ్చ ఇత్యేతే సిద్ధిలక్షణ సంజ్ఞితాః॥
విద్యా కావ్యం తథా శిల్పం సర్వం వాచావృతాని తు ।
విద్యార్థాశ్చోపతిష్ఠన్తి ప్రభావస్సైవ లక్షణమ్॥
శ్రుణోతి శబ్దాన్ శ్రోతవ్యాన్ యోజనానాం శతాదపి ।
సర్వజ్ఞశ్చ విధిజ్ఞశ్చ యోగీచోన్మత్త వద్భవేత్॥
వినుటలో ప్రతిభ, దేవతల దర్శనము, భ్రమావర్తము (భ్రమలేకుండుట) అనునవి సిద్ది లక్షణముగా గుర్తింపబడినవి-6. విద్య, కావ్యము, శిల్పము, సమస్తమును వాక్కుచే వరింపబడును. (అతని వాక్కులోనివి యన్నియును గనబడును). విద్యా ప్రయోజనములు గూడ నొతనికి సంప్రాప్తించును. ఇది యాతని ప్రభావమునకు లక్షణము (గురు)-7. నూరు యోజనముల దూరము నుండియైనను వినదగిన శబ్దములను వినును. సర్వజ్ఞుడును, విధిజ్ఞుడు (బ్రహ్మజ్ఞుడు)ను నైన యోగి పిచ్చివానివలే యుండును.
యక్షరాక్షస గన్దర్వాన్ ఋషీంశ్చాపి తథా పితౄన్ ।
ప్రేక్షతే సర్వతశ్చైవ ఉన్మత్తంతం వినిర్దిశేత్ ॥
భ్రమేణ భ్రామ్యతే యోగే చోద్యమానోఽన్ తరాత్మనా ।
భ్రమేణ బ్రాన్తబుద్ధేస్తు జ్ఞానం సర్వం ప్రణశ్యతి॥
వార్తా నాశయతే చిత్తం చోద్యమానోఽన్ తరాత్మనా ।
వర్తనాక్రాన్త బుద్ధేస్తు సర్వం జ్ఞానం ప్రణశ్యతి॥
మహాయోగియైన వాడు యక్షులను, రాక్షసులను గన్ధర్వులను దివ్యులను మనుషులను (దేవతలను మనుష్యులను) తెలియును. ఇది యాతని యుపసర్గమునకు (రోగమునకు ఉత్పాతమునకు) గుర్తు-9. దేవతలను, దానవులను, గన్ధర్వులను, ఋషులను పితృదేవతలను చూచును. అన్ని విధములుగా నాతనిని ఉన్మత్తునిగా జెప్పవలె-10. అన్తరాత్మతో ప్రేరేపింపబడుచున్నవాడై భ్రమతో తిరుగుచుండును. భ్రమతో భ్రాంతిజెందిన బుద్దిగలవాని యొక్క సమస్త జ్ఞానము నశించును-11. అన్తరాత్మతో ప్రేరేపింపబడిన వానికి జనశ్రుతిగాని జీవనోపాయముగాని చిత్తమును నశింపజేయును. జీవనోపాయచింతనముచే నిండిన బుద్దిగలవానికి సమస్త జ్ఞానము నశించును.
ఆవృత్య మనసా శుక్లం పటం వాకం బలం తథా ।
తతస్తు పరమం బ్రహ్మక్షిప్రమేవాను చిన్తయేత్॥
తస్మాచ్చైవాత్మనో దోషాం స్తూపసర్గాను పస్థితాన్ ।
పరిత్యజేత మేధావీ యదీచ్చేత సిద్దిమాత్మనః ॥
ఋషయో దేవగన్దర్వా యక్షోరగ మహాసురాః ।
ఉపసర్గేషు సంయుక్త ఆవర్తన్తే పునః పునః ।
తస్మాద్యుక్తః సదాయోగీ లఘ్వాహారీ జతేన్ద్రియః ।
తథా సుప్తః సుసూక్ష్మేషు ధారణాం మూర్ధ్ని ధారయేత్॥
మనస్సుతో తెల్లని వస్త్రమునుగాని గొంగళిని గాని చుట్టుగా గప్పుకొని తరువాత వెంటనే పరమమైన బ్రహ్మను అనుధ్యానింపవలెను-13. ఆ కారణములన ఆత్మ సిద్ధిని గోరువాడు తన యొక్క (ఆత్మ యొక్క) దోషములను, సంభవించిన ఉపసర్గములను యోగవిఘ్న దోష (రోగములను) మేధావియై వదిలివేయవలెను-14. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, ఉరగులు మహాసురులును ఉపసర్గలలో రగులుకొని మరల మరల తిరుగుచుందురు. కావున యోగి యెల్లప్పుడు యోగయుక్తుడై అల్పాహారియై, ఇంద్రియములను జయించినవాడై సుప్తుడై శిరమున సూక్ష్మములలో యోగధారణను నిలుపవలేను.
తతస్తు యోగయుక్తస్య జితా నిద్రస్య యోగినః ।
ఉపసర్గాః పునశ్చాన్తే భాయన్తే ప్రాణసంజ్ఞకా: ॥
పృథివీం ధారయేత్పర్వాం తతశ్చాఽపోహ్యనన్తరమ్ ।
తతోఽగ్నించైవ సర్వేషామాకాశం మన ఏవ చ॥
తతః పరాం మనోబుద్ధిం ధారయేద్యత్నతో యత్ ।
సిద్ధీనాం చైవ లిజ్గాని దృష్ట్వా దృష్ట్వా పరిత్యజేత్॥
ఆ తరువాత, యోగయుక్తుడు, జతనిద్రుడునైన యోగికి చివర మరల ప్రాణములను పేరుగల ఉపసర్గలు కలుగును-17. మొదట యోగముతో సమస్త పృథివిని ధారణ చేయవలె, ఆ తరువాత జలమును, ఆ తరువాత అగ్నిని, (వాయురూపమైన ప్రాణముతో చిత్తమునొకచో నిలుపుట యోగధారణ గావున వాయుభూతము ప్రత్యేకముగ జెప్పబడలేదు) ఆ తరువాత ఆకాశమును, ఆ తరువాత నందం యొక్క మనస్సును-18, తరువాత దానికి పరమైన మనస్సుతోగూడిన బుద్దిని యతి (యమముగలవాడు) యైన వాడు అతి ప్రయత్నముతో యోగధారణ చేయవలెను. సిద్దుల యొక్క చిహ్నములను చూచి చూచి వదిలివేయవలేను.
పృథివీం ధారయమాణస్య మహీఽసూక్ష్మా ప్రవర్తతే ।
ఆపో ధారయమాణస్య ఆపః సూక్ష్మా భవన్తి హి ॥
శీతారసాః ప్రవర్తనే సూక్ష్మాహ్యమృత సన్నిభా:
తేజో ధారయమాణస్య తేజః సూక్ష్మ ప్రవర్తతే ।
ఆత్మానం మన్యతే తేజః స్తద్భావ మనుపశ్యతి ॥
ఆత్మానం మన్యతే వాయుం వాయువన్మణ్డలం ప్రభో ।
ఆకాశం ధారయ మాణస్యవ్యోమసూక్ష్మః ప్రవర్తతే॥
పశ్యతే మణ్డలం సూక్ష్మం ఘోషశ్చాస్య ప్రవర్తతే ।
ఆత్మానం మన్యతే నిత్యం వాయుః సూక్ష్మః ప్రవర్తతే ॥
తథా మనో ధారయతో మనః సూక్ష్మం ప్రవర్తతే ।
మనసా సర్వభూతానాం మనస్తు విశతే హి స:॥
బుద్ధ్యాబుద్ధిం యదా యుఞ్జేత్తదా విజ్ఞాయ బుధ్యతే।
ఏతానీ సప్తసూక్ష్మాణి విదిత్వా యస్తు యోగవత్ ।
పరిత్యజతి మేధావీ సబుద్ద్యా పరమం వ్రజేత్॥
పృథివిని యోగ ధారణ జేయువానికి పృథివీ మహా భూతము సూక్ష్మమై ప్రవర్తించును. జల (భూత)ములను యోగధారణ జేయువానికి జలమహాభూతము సూక్ష్మమగును. చల్లని రసము (జలము) లన్నియు సూక్ష్మములై అమృతముతో సమానమగును-20. తేజో భూతమును యోగధారణ జేయువానికి తేజో మహాభూతము సూక్ష్మమగును. తనను తేజస్సుగా భావించి తన్ను తేజముగానే చూచును-21. ఓ ప్రభూ తనను వాయువునుగా భావించి తన్ను వాయువుగల మండలముగా జూచును. ఆకాశమును యోగధారణ జేయువానికి ఆకాశ మహాభూతము సూక్ష్మమగు-22. తనను వాయువులు గల మండలమైన మహాభూతవాయువునుగా భావించి వాయుమహాభూతము సూక్ష్మముగానగును. తనను సూక్ష్మ వాయు మండలముగా జూచును. అచటి నుండి దానియొక్క ఘోష (శబ్దము) గూడ బయలుదేరును-23. అట్లే మనస్సును యోగధారణ జేయువానికి మనస్సు సూక్ష్మమై ప్రవర్తిల్లును. అపుడు వాడు మనస్సుతో సర్వభూతముల (ప్రాణుల) మనస్సును ప్రవేశించును. బుద్ధిచేత బుద్ధిని యోగధారణ జేసినప్పుడు చక్కగా (అంతయు) తెలిసికొని మేలుకొను-24. యోగజ్ఞుడైనవాడు ఈ యేడు సూక్ష్మములను దెలిసికొని మేధావియై పరిత్యజించి తన బుద్ధిచే పరమాత్మను బొందును.
యస్మిన్ యస్మింశ్చ సంయుక్తో భూత ఐశ్వర్య లక్షణే ।
తత్రైవ సజ్గం భజతే తేనైవ ప్రవినశ్యతి॥
తస్మాద్విదిత్వా సూక్ష్మాణి సంసక్తాని పరస్పరమ్ ।
పరిత్యజతి యో బుద్ధ్యా స పరం ప్రాప్నుయాద్ద్విజ॥
దృశ్యన్తే హి మహాత్మాన ఋషయో దివ్యచక్షుషః ।
సంసక్తాః సూక్ష్మభావేషు తే దోషాస్తే ఘనసంజ్ఞితాః॥
తస్మాన్ననిశ్చయః కార్యః సూక్ష్మేస్విహ కదాచన ।
ఐశ్వర్యాజ్జాయతే రాగో విరాగం బ్రహ్మచోచ్యతే॥
విదిత్వా సప్తసూక్ష్మాణి షడజ్గం చ మహేశ్వరమ్ ।
ప్రధానం వినియోగజ్ఞం పరం బ్రహ్మాధిగచ్ఛతి॥
యోగ ఐశ్వర్య లక్షణమైన మాయా భూతమునందు యోగధారణ యుక్తుడై యచటనే విడువరాని సంగమును బొంది, దాని చేతనే పూర్తిగా నశించును-26. కావున యోగియైన బ్రాహ్మణుడు సూక్ష్మములను పరస్పర సంసక్తములుగా దెలిసికొని బుద్ధిచేత పరిత్యజించి పరమును బొందును-27. దివ్య చక్షువులై ఋషులైన మహాత్ములు గూడ సూక్ష్మభావములందు సంసంక్తులై కనబడుదురు. అవి దోషములుగా వారియందు గుర్తించబడి నను-28. కావున నెపుడైనను నీట (యోగవిషయమున) సూక్ష్మములందు నిశ్చయమును (ధారణను) జేయరాదు. ఐశ్వర్యము వలన రాగము గలుగును. విరాగము బ్రహ్మయనబడును-29. ఏడు సూక్ష్మములను షడంగునిగా మహేశ్వరుని ప్రధానమును తెలిసికొని వినియోగమును దెలిసినవాడు పరబ్రహ్మను బొందును.
సర్వజ్ఞతా తృప్తిరనాది బోధః స్వతన్త్రతా నిత్యమలుప్త శక్తిః ।
అనన్తశక్తిశ్చ విభోర్విధిజ్ఞాః షడాహురజ్గాని మహేశ్వరస్య॥
నిత్యం బ్రహ్మధనోయుక్త ఉపసరైః ప్రముచ్యతే ।
జితశ్వాసోపసర్గస్యజిత రాగస్య యోగినః ।
ఏకా బహిః శరీరేఽ స్మిన్ధారణా సర్వకామికీ॥
విశేద్యదా ద్విజోయుక్తో యత్ర యత్రార్పయేన్మనః ।
భూతాన్యావిశతే వాపి త్రైలోక్యం చాపి కంపయేత్॥
ఏతయాఽత్ర విశేద్దేహం హిత్వా దేహం పునస్త్విహా ।
మనోద్వారం హి యోగానామాదిత్యం చ వినిర్దిశేత్ ॥
ఆదానాది క్రియాణాన్తు ఆదిత్య ఇతి చోచ్యతే ।
ఏతేన విధినా యోగీ విరక్తః సూక్ష్మవర్జితః ।
ప్రకృతిం సమధిక్రమ్యరుద్రలోకే మహీయతే॥
సర్వజ్ఞత్వము, తృప్తి, అనాదిబోధము, స్వతంత్రత, ఎల్లప్పుడు లోపించు శక్తి, అనన్తశక్తి. ఈ యారింటిని విధిజ్ఞులు విభువైన మహేశ్వరునియొక్క యంగములందురు-31. నిత్యము బ్రహ్మయేధనముగా గల యోగి ఉపసర్గల నుండి విముక్తుడగును. శ్వాసను, ఉపసర్గలను, రాగములను జయించిన యోగికి ఈ బహిఃశరీరమున యోగధారణ జేయుట ఒక్కటే సర్వకామికి (అన్ని కోరికలకు సంబంధించినది) యగును-32. యోగయుక్తుడైన బ్రాహ్మణుడు ఆయా చోటులలో ప్రవేశించి మనస్సు వర్ణించిన యోగయుక్తుడైన బ్రాహ్మణుడు పంచభూతములనైన నావేశింపగలడు. ముల్లోకములను గూడ కంపింపజేయగలడు-33. ఈ యోగశక్తిచేత ఈ లోకమున దేహమును వదిలి పెట్టి మరల దేహమును ప్రవేశించగలడు. యోగులకు సూర్యుణ్ణి మనోద్వారముగా జెప్పవలెను-34. ఆదానాది క్రియలకు గూడ సూర్యుడు మనోద్వారమని చెప్పబడును. ఈ విధానముచే సూక్ష్మవర్జితుడైనయోగి ప్రకృతిని దాటి రుద్రలోకమున గొప్పవాడై పూజింపబడును.
ఐశ్వర్యగుణసంప్రాప్తం బ్రహ్మభూతం తు తం ప్రభుమ్ ।
దేవస్థానేషు సర్వేషు సర్వతస్తు నివర్తతే॥
పైశాచేత పిశాచాంశ్చ రాక్షసేన చ రాక్షసాత్ ।
గాన్దర్వేణచ గన్దర్వాన్ కౌబేరేణ కుబేరజాన్॥
ఇన్ద్ర మైన్ద్రేణ స్థానేన సౌమ్యం సౌమ్యేన చైవ హి ।
ప్రజాపతిం తథా చైవ ప్రాజాపత్యేన సాధయేత్॥
బ్రాహ్మం బ్రాహ్మ్యేన చాప్యేవము పామన్త్రయతే ప్రభుమ్ ।
తత్ర సక్తస్తు ఉన్మత్తస్తస్మాత్సర్వం ప్రవర్తతే ॥
నిత్యం బ్రహ్మపరోయుక్తః స్థానాన్యేతాని వై త్యజేత్ ।
అసజ్యమానః స్థానేషు ద్విజః సర్వగతో భవేత్ ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయు ప్రోక్తే యోగోపసర్గ నిరూపణం నామ ద్వాదశోఽధ్యాయః ॥
అట ఐశ్వర్య గుణమును బొందిన వాడును బ్రహ్మభూతుడును ఐన ప్రభువునుగా జూడవచ్చును. అతడు సమస్త దేవస్థానము లందును తక్కిన యంతటను ఉండక మరలిపోవును(?)-36. పైశాచిక స్థానమచేత తస్థాన ప్రయోగధారణచే, పిశాచములను, రాక్షసస్థానముచే రాక్షసులను, గన్ధర్వుల స్థానముచే గన్ధర్వులను, కుబేర స్థానముచే కుబేరజులను-37, ఇవ్ర స్థానముచే ఇమ్రుని, సోముని స్థానముచే సౌమ్యుని (చంద్ర సంబద్ధుని), ప్రజాపతి స్థానముచే ప్రజాపతిని, సాధింపవలెను 38. బ్రహ్మస్థానముచే తత్ స్థాన (యోగధారణచే) బ్రహ్మజ్ఞాన రూపియైన ప్రభువును దగ్గరగా బిలుచును. ఆ బ్రహ్మయందు సక్తుడైనవాడు ఉన్మత్తుడు. అతని నుండి సర్వము ప్రవర్తించును-39. నిత్యము (ఎల్లప్పుడు) బ్రహ్మరూపుడైన యోగి యీ స్థానములను వదిలివేయవలెను. స్థానములందు (యోగధారణ స్థానములందు) అంటి పెట్టుకొని యుండని బ్రాహ్మణుడు సర్వగతుడగును.
ఇది వాయుపురాణము నందు యోగోపసర్గ నిరూపణమను పండ్రెండవ యధ్యాయము.