వాయు మహా పురాణము
5 - కశ్యపీయ ప్రజాసర్గమ్
ఋషయ ఊచుః :-
దేవానాం దానవానాం చ దైత్యానాం చైవ సర్వశః ।
ఉత్పత్తిం విస్తరేణేహ బ్రూహి వైవస్వతేఽ తరే ॥
సూత ఉవాచ :
ధర్మస్య తావద్వక్ష్యామి నిసర్గం తం నిబోధత ।
అరుంధతీ వసుర్యామీ లంబా భానుర్మరుత్వతీ ॥
సంకల్పా చ ముహూర్తా చ సాధ్యా విశ్వా తదైవ చ ।
ధర్మపత్య్నో దశ త్వేతా దక్షః ప్రాచేతసో దదౌ ॥
సాధ్యా పుత్రాంస్తు ధర్మస్య సాధ్యాన్ ద్వాదశ జజ్ఞిరే ।
సాధ్యా నామ మహాభాగాశ్ఛందజా యజ్ఞభాగినః ॥
దేవేభ్యస్తాన్ పరాన్ దేవాన్ దేవజ్ఞాః పరిచక్షిరే ॥
బ్రహ్మణో వై ముఖాత్ సృష్టా జయా దేవాః ప్రజేప్సయా ।
సర్వే మంత్రశరీరాస్తే స్మృతా మన్వంతరేష్విహ ॥
దర్శశ్చ పౌర్ణమాసశ్చ బృహద్యచ్చ రథంతరమ్ ।
చిత్తశ్చైవ విచిత్తిశ్చ ఆకూతిః కూతిరేవ చ ॥
విజ్ఞాతా చైవ విజ్ఞాతో మనో యజ్ఞశ్చ తే స్మృతాః ।
నామాన్యేతాని తేషాం వై జయానాం ప్రథితాని చ ॥
బ్రహ్మశాపేన తే జాతాః పునః స్వాయంభువే జితాః ।
స్వారోచిషే వై తుషితాః సత్యాశ్చైవోత్తమే పునః ॥
తామసే హరయో నామ వైకుంఠా రైవతాంతరే ।
సాధ్యాశ్చ చాక్షుషే నామ్నా ఛందజా జజ్ఞిరే సురాః ॥
ఋషులనిరి :
వైవస్వత మన్వంతరమున దేవతలయొక్కయు, దానవులయొక్కయు, దైత్యులయొక్కయు, అంతట జరిగిన యుత్పత్తిని జెప్పుము .
సూతుడనెను :
ఇపుడు ధర్మునియొక్క సృష్టిని జెప్పెదను. దానిని వినుడు. అరుంధతి, వసువు, యామి, లంబ, భానువు, మరుత్వ సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ - అను నీ పదుగురు ధర్ముని ధర్మపత్నులు. ప్రాచేతసుడైన దక్షుడు వీరిని ధర్మునకిచ్చె అందులో 'సాధ్య' పండ్రెండుగురు సాధ్యులను ధర్మునకు పుత్రులనుగా గనెను. ఈ సాధ్యులను వారు మహాభాగ్యవంతులు, జనించిన వారు, యజ్ఞములో భాగము గలవారు. వారిని దేవతలకంటే నుత్కృష్టులనీ దేవతలను దెలిసినవారు చెప్పిరి (4), బ్రహ్మముఖము నుండి సంతానపు కోరికతో సృజింపబడిన జయులను దేవతలు. ఇట మన్వంతరములలో వారందరు మంత్రశ (5). వారు దర్శుడును, పౌర్ణమాసుడును, బృహద్రథంతరుడును, చిత్త, విచిత్తి, ఆకూతి, కూతీ, (6), విజ్ఞాత, విజ్ఞాతుడు, : యజ్ఞుడు - అనువారని యనబడిరి. ఆ జయులయొక్క యీ నామములు ప్రసిద్ధములు (7). బ్రహ్మ శాపమున మరల స్వార మన్వంతరమున వారు పుట్టిరి. వారు జితులు. స్వారోచిషమన్వంతరమున వారు తుషితులు, మరల ఉత్తమ మన్వంతరము సత్యులు (8). తామస మన్వంతరమున హరులనువారు. రైవత మన్వంతరమున వారు వైకుంఠులు. చాక్షుష మన్వంత సాధ్యులనువారు. వారు దేవతలు. స్వేచ్ఛగా జనించినవారు .
ధర్మపుత్రా మహాభాగాః సాధ్యా యే ద్వాదశామరాః ।
పూర్వం స్మ అనుసూయంతే చాక్షుషస్యాంతరే మనోః ॥
స్వారోచిషేంతరేఽ తీతా దేవా యే వై మహౌజసః ।
తుషీతా నామ తేఽ న్యోన్యమూచుర్వై చాక్షుషేఽ తరే ॥
కించిచ్ఛిష్టే తదా తస్మిన్ దేవా వై తుషితాఽ బ్రువన్ ।
ఇతరేతరం మహాభాగాన్ వయం సాధ్యాన్ ప్రవిశ్య వై ।
మన్వంతరే భవిష్యామస్తన్నః శ్రేయో భవిష్యతి ॥
ఏవముక్త్వా తు తే సర్వే చాక్షుషస్యాంతరే మనోః ।
తస్మాద్ద్వాదశ సంభూతాన్ ధర్మాన్ (త్) స్వాయంభువాత్పునః ॥
ధర్మపుత్రులై మహాభాగులైన యా సాధ్యులు దేవతలు. పూర్వము చాక్షుష మన్వంతరమున వారలను అనుసరించి జని (10). స్వారోచిష మన్వంతరమున గడచిన మహౌజస్కులైన దేవతలు తుషితులను వారై చాక్షుష మన్వంతరమున పరస్పరము మ ఆ చాక్షుష మన్వంతరము కొద్దిగా మిగులగా తుషితులను దేవతలిట్లనిరి:- “మనము పరస్పరముగా మహాభాగులైన సాధ్యులను ప్ర (మరొక) మన్వంతరమున జనించెదము. అది మనకు శ్రేయము గలుగగలదు” (12). వారందరీవిధముగానని, మరల నా స్వా మనువు నుండి పుట్టిన పండ్రెండుగురు ధర్ములను ప్రవేశించి జనించిరి .
నరనారాయణౌ తత్ర జజ్ఞాతే పునరేవ హి ।
విపశ్చిదింద్రో యత్రాసీత్తథా సత్యో హరిశ్చ తౌ ॥
స్వారోచిషేఽ తరే పూర్వమాస్తాం తౌ తుషితౌ సుతౌ ॥
తుషితానాం తు సాధ్యత్వే నామాన్యేతాని వక్ష్యతే ।
మనోఽ నుమంతా ప్రాణశ్చ నరో యానశ్చ వీర్యవాన్ ॥
చిత్తిర్హయో నయశ్చైవ హంసో నారాయణస్తథా ।
ప్రభవోఽథ విభుశ్చైవ సాధ్యా ద్వాదశ జజ్ఞిరే ॥
స్వాయంభువేఽ తరే పూర్వం తతః స్వారోచిషే పునః ।
నామాన్యాసన్ పునస్తాని తుషితానాం నిబోధత ॥
ప్రాణోఽపానస్తథోదానః సమానో వ్యాన ఏవ చ ।
చక్షుః శ్రోత్రం తథా ప్రాణః స్పర్శో బుద్ధిర్మనస్తథా ॥
ప్రాణాపానావుదానశ్చ సమానోవ్యాన ఏవ చ ।
నామాన్యేతాని పూర్వం తు తుషితానాం స్మృతాని హ ॥
విద్వాంసుడైన యింద్రుడున్న చోట మరల నరనారాయణులు పుట్టిరి. వారు సత్యుడు, హరియును. వారు ప స్వారోచిషమన్వంతరమున తుషితులను దేవతలుగా నుండిరి (14). తుషితులు సాధ్యులైనపుడు వారి యీ నామములు చెప్పబడు - 'మనుడు, అనుమంత, ప్రాణుడు, నరుడు, వీర్యవంతుడైన యానుడు (15), చిత్త, హయుడు, నయుడు, హంసుడు, నారాయ ప్రభవుడు, విభువు - అని సాధ్యులు పండ్రెండుగురు జనించిరి (16). మొదట స్వాయంభువ మన్వంతరమున నీ నామములుండినవి. తరువాత స్వారోచిష మన్వంతరమున తుషితులైన వారి నామముల వినుడు (17). ద్రోణుడు, అపానుడు, ఉదానుడు, సమానుడు, వ్యానుడు, చక్షువు, శ్రోత్రము, ప్రాణము, స్పర్శ, బుద్ధి, మనస్సు ప్రాణాపానములును, ఉదానము, సమానము, వ్యానము - ఈనామములు పూర్వము ఇట తుషితులవిగా జెప్పబడినవి .
వసోస్తు వసవః పుత్రాః సాధ్యానామనుజాః స్మృతాః ।
ధరో ధ్రువశ్చ సోమశ్చ ఆపశ్చైవానలోఽ నిలః ॥
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోఽ ష్టౌ ప్రకీర్తితాః ॥
ధరస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహస్తథా ।
ధ్రువపుత్రో భవో నామ్నా కాలో లోకప్రకాలనః ॥
సోమస్య భగవాన్ వర్చా బుధశ్చ గ్రహబోధనః ।
రోహిణ్యాం తౌ సముత్పన్నౌ త్రిషు లోకేషు విశ్రుతౌ ॥
ధారోర్మికలిలాశ్చైవ త్రయశ్చంద్రమసః సుతాః ।
ఆపస్య పుత్రో వైతండ్యః శమః శాంతస్తథైవ చ ॥
స్కందః సనత్కుమారశ్చ జజ్ఞే పాదేన తేజసః ।
అగ్నిపుత్రః కుమారస్తు శరస్తంబే వ్యజాయత ।
తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠజాః ॥
అనిలస్య శివా భార్యా తస్యాః పుత్రో మనోజవః ।
అవిజ్ఞాతగతిశ్చైవ ద్వౌ పుత్రావనిలస్య చ ॥
ప్రత్యూషస్య విదుః పుత్ర ఋషిర్నామ్నా తు దేవలః ।
ద్వౌ పుత్రౌ దేవలస్యాపి క్షమావంతౌ మనీషిణౌ ॥
బృహస్పతేస్తు భగినీ వరస్త్రీ బ్రహ్మచారిణీ ।
యోగసిద్ధా జగత్కృత్స్నమసక్తా విచరత్యుత ॥
ప్రభాసస్య తు యా భార్యా వసూనామష్ఠమస్య హ ।
విశ్వకర్మా సుతస్తస్యా జాతః శిల్పిప్రజాపతిః ॥
స కర్తా సర్వశిల్పానాం త్రిదశానాం చ వర్ధకిః ।
భూషణానాం చ సర్వేషాం కర్తా కారయితా చ సః ॥
సర్వేషాం చ విమానాని దైవతానాం కరోతి సః ।
మానుషాశ్చోపజీవంతి యస్య శిల్పాని శిల్పినః ॥
వసువునకు వసువులు పుత్రులు. వారు సాధ్యులకు అనుజులు (తమ్ములు) అనబడిరి. ధరుడు, ధ్రువుడు, సోముడు, ఆపుడు, అనలుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు - వీరు ఎనమండుగురు వస్తువులనబడిరి (20). ధరునకు హుతమైన హవ్యమును వహించుద్రవీణుడు పుత్రుడు - ధ్రువుని పుత్రుడు భవుడు పేరుతో కాలుడు లోకములను విశేషముగా శిక్షించి కాలనము సుఖము) జేయువాడు కాలుడు (21). సోమునకు భగవంతుడు వర్చస్వి, గ్రహముల మేలుకొలుపు బుధుడును పుత్రులు. వారు రోహిణీ యందు బుట్టినవారు లోకములలో బ్రసిద్ధులు (22). తరువాత ధారోర్మికలలు (ధార - ఊర్మి - కలలు) అను వారు మువ్వురును గూడ చంద్రునిడు వైతండ్యుడు, శముడు, శాంతుడు (23), స్కందుడు, సనత్కుమారుడు పాదతేజస్సుతో బుట్టిరి. అగ్నిపుత్రుడైన కుమారుడు శరస్తంబమున (రెల్లు గడ్డిపొదలో) బుట్టెను. అతని తరువాత అతని ననుసరించి పుట్టినవారు - శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును (24). అనిలు (వాయువు) నకు భార్య శివ. వారికి మనోజవుడు, అవిజ్ఞాతగతి యను నిరువురు పుత్రులు. (25). ప్రత్యూషునకు ఋషి దేవలుడు - అను నిరువురు పుత్రులు. దేవలునకు సైతము ఇరువురు పుత్రులు క్షమ (ఓపిక) గలవారు, విద్వాంసులును (26). బృహస్పతి యొక్క యక్క బ్రహ్మచారిణి, యోగసిద్ధమైన వరస్త్రీ, అనాసక్తయై జగమంతయు దిరుగును (27). వసువులలో నెనిమిదవవాడైన ప్రభాసునియొక్క భార్యకు పుత్రుడు విశ్వకర్మ కలిగెను. ఆతడు శిల్పి బ్రహ్మ (28), సర్వ శిల్పములను నిర్మించువాడు. దేవతలను వర్ధిల్లజేయువాడు. సమస్త భూషణములను నిర్మించువాడును, ఇతరులచే నిర్మింపజేయువాడును (29). ఆతడు సమస్త దేవతలయొక్క విమానములను (మేడలను - ఆకాశయానములను - జలయానములను) నిర్మించును. ఆ శిల్పియొక్క శిల్పములను అనుసరించి మానవులు గూడ జీవింతురు .
విశ్వేదేవాస్తు విశ్వాయా జజ్ఞిరే దశ విశ్రుతాః ।
క్రతుర్దక్షః శ్రవః సత్యః కాలః కామో ధునిస్తథా ॥
కురువాన్ ప్రభవాంశ్చైవ రోచమానశ్చ తే దశ ।
ధర్మపుత్రా స్మృతా హ్యేతే విశ్వాయాం జజ్ఞిరే శుభాః ॥
మరుత్వత్యాం మరుత్వంతో భానవో భానుజాః స్మృతాః ।
ముహూర్తాశ్చ ముహూర్తాయాం ఘోషం లంబా వ్యజాయత ॥
సంకల్పయాం తు సంజజ్ఞే విద్వాన్ సంకల్ప ఏవ చ ।
నాగవీథ్యస్తు జామ్యాం చ పథత్రయ సమాశ్రితాః ॥
పృథివీవిషయం సర్వమరుంధత్యాం వ్యజాయత ।
ఏష సర్గః సమాఖ్యాతో విద్వాన్ ధర్మస్య శాశ్వతః ॥
ముహూర్తాశ్చైవ తిథ్యశ్చ పతిభిః సహ సువ్రతాః ।
నామతః సంప్రవక్ష్యామి బ్రువతో మే నిబోధత ॥
అహోరాత్ర విభాగశ్చ నక్షత్రాణి సమాసతః ।
ముహూర్తాః సర్వనక్షత్రా అహోరాత్ర విదస్తథా ॥
అహోరాత్రకలానాం తు షట్శతీత్యధికా స్మృతా ।
రవేర్గతి విశేషేణ సర్వేషు ఋతుమిచ్ఛతః ॥
తతో వేదవిదశ్చైతాం తిథిమిచ్ఛంతి పర్వసు ।
అవిశేషేషు కాలేషు యోజ్యః-స పితృదానతః ॥
రౌద్రః సార్వస్తథా మైత్రః పిండ్యవాసవ ఏవ చ ।
ఆప్యోఽథ వైశ్వదేవశ్చ బ్రాహ్మో మధ్యాహ్న సంశ్రితః ॥
ప్రాజాపత్యస్తథా ఐంద్రస్తథేంద్రో నిర్ఋతిస్తథా ।
వారుణశ్చ తథార్యమ్ణో భాగాశ్చాపి దినాశ్రితాః ॥
ఏతే దినముహూర్తాశ్చ దివాకర వినిర్మితాః ।
శంకుచ్ఛాయావిశేషేణ వేదితవ్యాః ప్రమాణతః ॥
అజాస్తథాహిర్బుధ్న్యశ్చ పూషా హి యమదేవతాః ।
ఆగ్నేయశ్చాపి విజ్ఞేయః ప్రాజాపత్యస్తథైవ చ ॥
బ్రహ్మసౌమ్యస్తథాదిత్యో బార్హస్పత్యోఽథ వైష్ణవః ।
సావిత్రోఽథ తథా త్వాష్ట్రో వాయవ్యశ్చేతి సంగ్రహః ॥
ఏకరాత్రిముహూర్తాః స్యుః క్రమోక్తా దశ పంచ చ ।
ఇందోర్గత్యుదయా జ్ఞేయా నాలికాః పాదికాస్తథా ॥
కాలావస్థాస్విమా స్త్వేతే ముహూర్తా దేవతాః స్మృతాః ॥
సర్వగ్రహాణాం త్రీణ్యేవ స్థానాని విహితాని చ ।
దక్షిణోత్తరమధ్యాని తాని విద్యాద్యథా క్రమమ్ ॥
స్థానం జారధవం మధ్యే తథైరావత ముత్తరమ్ ।
వైశ్వానరం దక్షిణతో నిర్దిష్టమిహ తత్త్వతః ॥
అశ్వినీ కృత్తికా యామ్యా నాగవీధిరితి స్మృతా ।
పుష్యోఽ శ్లేషా పునర్వసూ వీథిరైవరావతీ మతా ॥
తిస్రస్తువీధయో హ్యేతా ఉత్తరే మార్గ ఉచ్యతే ॥
పూర్వోత్తరే ఫాల్గున్యౌ చ మఘా చైవార్యమీ స్మృతా।
హస్తచిత్రే తథా స్వాతీ గోవీథీత్యభి శబ్దితా ॥
జ్యేష్ఠా విశాఖానురాధా వీధీ జారద్గవీ స్మృతా ।
ఏతాస్తు వీధయస్త్రిస్రో మధ్యమే మార్గ ఉచ్యతే ॥
మూలం చాషాఢే ద్వే చాపి అజవీథ్యభిశబ్దితా ।
శ్రవణం చ ధనిష్ఠా చ మార్గీ శతభిషక్తథా ॥
వైశ్వానరీ భాద్రపదే రేవతీ చైవ కీర్తితా ।
స్మృతా వీధ్యస్తు తిస్రస్తా మార్గే వై దక్షిణే బుదైః ॥
సప్తవింశత్తు యాః కన్యా దక్షః సోమాయ తా దదౌ।
సర్వా నక్షత్ర నామ్న్యస్తా జ్యోతిషే చైవ కీర్తితాః ।
తాసామపత్యోన్య భవన్ దీప్తాన్యమితతేజసా ॥
యాస్తు శేషాస్తదా కన్యాః ప్రతిజగ్రాహ కశ్యపః ।
చతుర్ధశ మహాభాగాః సర్వాస్తా లోకమాతరః ॥
అదితిర్దితిర్ధనుః కాలో అరిష్టా సురసా తథా ।
సురభిర్వితా చైవ తామ్రా క్రోధవశా ఇరా ॥
కద్రుర్మునిశ్చ ధర్మజ్ఞః ప్రజాస్తాసాం నిబోధత ॥
చారిష్ణవేంతరేఽ తీతే యే ద్వాదశ పురోగమాః ।
వైకుంఠా నామ తే సాత్య్రా బభూవుశ్చాక్షుషేంతరే ॥
ఉపస్థితేఽతరే హ్యస్మిన్ పునర్వైవస్వతస్య హ ।
ఆరాధితా హ్యదిత్యా తే సమేత్యాహుః పరస్పరమ్ ॥
ఏతామేవ మహాభాగామదితిం సంప్రవిశ్య వై ।
వైవస్వతేంతరే హ్యస్మిన్ యోగాదర్ధేన చేతసః ॥
గచ్ఛామః పుత్రతామస్యాస్తన్నః శ్రేయో భవిష్యతి ।
అదిత్యాస్తు ప్రసూతానామాదిత్యత్వం భవిష్యతి ॥
ఏవముక్త్వా తు తే సర్వే చాక్షుషస్యాంతరే మనోః ।
జజ్ఞిరే ద్వాదశాదిత్యా మారీచాత్కశ్యపాత్పునః ॥
శతక్రతుశ్చ విష్ణుశ్చ జతే పునరేవ హి ।
వైవస్వతేఽ తరే హ్యస్మిన్ నరనారాయణౌ సురౌ ॥
తేషామపి హి దేవానాం నిధనోత్పత్తి రుచ్యతే ।
యథా సూర్యస్య లోకేఽస్మిన్ ఉదయాస్తమయావుభౌ ॥
ప్రజాపతేశ్చ విష్ణోశ్చ భవస్య చ మహాత్మనః ॥
శ్రేష్ఠానుశ్రవికే యస్మాచ్ఛక్తాః శబ్దాదిలక్షణే ।
అష్టాత్మికేఽణిమాద్యేచ తస్మాత్తే జజ్ఞిరే సురాః ॥
ఇత్యేష విషయే రాగః సంభూత్యాః కారణం స్మృతమ్ ।
బ్రహ్మశాపేన సంభూతా జయాః స్వాయంభువే జితాః ॥
స్వారోచిషే వై తుషితాః సత్యాశ్చైవోత్తమే పునః ।
తామసే హరయో దేవా జాతాశ్చారిష్ణవే తు వై ॥
వైకుంఠాశ్చాక్షుషే సాధ్యా ఆదిత్యాః సాంప్రతే పునః ॥
ధాతార్యమాత మిత్రశ్చ వరుణోఽశో భగస్తథా ।
ఇంద్రో వివస్వాన్ పూషా చ పర్జన్యో దశమః స్మృతః ॥
తతస్త్వష్టా తతో విష్ణురజఘన్యోఽజఘన్యజః ।
ఇత్యేతే ద్వాదశాదిత్యాః కశ్యపస్య సుతాః స్మృతాః ॥
సురభీ కశ్యపాద్రుద్రానేకాదశ విజజ్ఞిరే ।
మహాదేవ ప్రసాదేన తపసా భవితా సతీ ॥
అంగారకం తథా సర్పం నిర్ఋతిం సదసస్పతిమ్ ।
అజైకపాదహిర్బుధ్న్య మూర్ధ్వకేతుం జ్వరం తథా ॥
భువనం చేశ్వరం మృత్యుం కపాలం చైవ విశ్రుతమ్ ।
దేవానే కాదశైతాంస్తు రుద్రాంస్త్రి భువనేశ్వరాన్ ।
తపసా తేన మహాతా సురభీ తానజీజనత్ ॥
తతో దుహితరావన్యే సురభీ ద్వే వ్యజాయత ।
రోహిణీ చైవ రుద్రాభా గాంధారీ చ యశస్వినీ ॥
రోహిణ్యం జజ్ఞిరే కన్యాశ్చతస్రో లోకవిశ్రుతాః ।
సురూపా హంసకీలా చ భద్రా కామదుఘా తథా ॥
సుషువే కామదుఘా తు సురూపా తనయద్వయమ్ ॥
హంసకీలా నృపమృషీన్ భద్రాయాస్తు వ్యజాయత ।
విశ్రుతాస్తు మహాభాగా గంధర్వా వాజినః సుతాః ॥
ఉచ్చైశ్రవాస్తదా జాతాః ఖేచరాస్తే మనోజవాః ।
శ్వేతాః శ్యేనాః పిశంగాశ్చ సారంగా హరితార్జునాః ।
రుద్రా దేవోపబాహ్యాస్తే గంధర్వయోనయో హయాః ॥
భూయో జజ్ఞే సురభ్యాస్తు శ్రీమాన్ చంద్రాభసుప్రభః ।
స్రగ్వీ కకుద్మీ ద్యుతిమానమృతాలయ సంభవః ।
సురభ్యనుమతే దత్తో ధ్వజో మాహేశ్వరస్తు సః ॥
ఇత్యేతే కశ్యపసుతా రుద్రాదిత్యాః ప్రకీర్తితాః ।
ధర్మపుత్రాః స్మృతాః సాధ్యా విశ్వే చ వసవస్తథా ॥
అరిష్టనేమిపత్నీనామ పత్యానీహ షోడశ ।
బహుపుత్రస్య విదుషశ్చతస్రో విద్యుతః స్మృతాః ।
ప్రత్యంగిరసజః శ్రేష్ఠా బుచో బ్రహ్మర్షిసత్కృతాః ॥
కృశాశ్వస్య తు దేవర్షేర్దేవ ప్రహరణాః స్మృతాః ।
ఏతే యుగసహస్రాంతే జాయంతే పునరేవ హి ॥
సర్వే దేవగణా విప్రాశ్రయస్త్రింశత్తు ఛందజాః ।
ఏతేషామపి దేవానాం నిరోధోత్పత్తి రుచ్యతే ॥
యథా సూర్యస్య లోకేఽ స్మిన్ ఉదయాస్తమయాపుభౌ ।
ఏతే దేవనికాయాస్తే సంభవంతి యుగే యుగే ॥
విశ్వకు బుట్టిన విశ్వేదేవులు పదుగురు ప్రసిద్ధులు. క్రతువు; దక్షుడు, శ్రవుడు, సత్యుడు, - కాలుడు, కాముడు, ధుని (31), కురువంతుడు, ప్రభవంతుడు, రోచహనుడు - అని వారు పదుగురు. ధర్మపుత్రులనబడు నీ శుభులు విశ్వయందు బుట్టిరి (32). మరుత్వతియందు మరుత్వంతులు బుట్టిరి. భానవులు భానువునకు బుట్టినవారనబడిరి. ముహూర్తులు ముహూర్తయందు బుట్టిరి. లంబ ఘోషుని గనెను (33). సంకల్పయందు విద్వాంసుడు సంకల్పుడు బుట్టెను. జామియందు పథత్రయమునాశ్రయించిన నాగవీథులు పుట్టిరి (34). సమస్తమైన పృథివీ విషయము. అరుంధతి యందు బుట్టెను. ఈ శాశ్వతమైన విద్వాంసమైన సృష్టి ధర్మునిదిగా జెప్పబడినది (35). ముహూర్తులును తిథులును పతులతో బాటు సువ్రతులు. వారిని పేర్లతో జెప్పెదను వినుడు (36). రాత్రి - పగళ్ళ యొక్క విభాగమును, సంగ్రహ నక్షత్రములను జెప్పెద వినుడు. ముహూర్తములు సర్వనక్షత్రములును అహోరాత్రములను దెలిసినవారు (పగటిలోను రాత్రిలోను ఉండునవి) (37). అన్నిటియందును తన (సం)గతి విశేషముచే ఋతువు (కాలము)ను గోరు రవి వలన అహోరాత్రకలలు ఆయువందలకు మించినవని యనబడినది (38). అందువలననే వేదవేత్తలు పర్వములందు తిథిని గోరుదురు. - అవిశేషములైన కాలములందు పితృదానమును బట్టి కలుపదగినది (39). రౌద్రము, సార్వము, మైత్రము, పిండ్యము, వాసవము, ఆప్యము, వైశ్వదేవము, బ్రాహ్మము, మధ్యాహ్నసంశ్రితము (40), ప్రాజాపత్యము, ఐంద్రము, ఇంద్రము, నిర్ఋతి, వారుణము - అనునవి పితృదేవతలలో నొకడైన అర్యముని యొక్క (సూర్యునియొక్క) దినమునాశ్రయించిన (పగటినాశ్రయించిన) భాగములు (41), ఇవి దినమునందలి ముహూర్తములు. సూర్యునిచే వినిర్మితములైనవి. శంకుచ్ఛాయా విశేషముతో (శంకువు యొక్క నీడలలోని భేదములను బట్టి) ప్రామాణికముగా తెలియదగినవి (42). అజులు, అహిర్భుధ్యులు, పూష - అహి - యమదేవతలు, ఆగ్నేయము, ప్రాజాపత్యము, బ్రహ్మము, సౌ ఆదిత్యము, బార్హస్పత్యము, వైష్ణవము, సావిత్రము, త్వాష్టము, వాయవ్యము - అని సంగ్రహము (44). క్రమముగా జెప్పబడిన ఏకరాత్రముహూర్త ములు. చంద్రుని గతిననుసరించి యుదయములు గలవి నాలికలు పాటికలును. ఇవి కాలావస్థలం ముహూర్తములు దేవతలనబడినవి (45). అన్ని గ్రహములకును మూడేస్థానములు చెప్పబడినవి. అవి క్రమముగా దక్షిణ - మధ్యములు (46). మధ్యన జారధవస్థానము, ఐరావతస్థానముత్తరము. వైశ్వానరస్థానము దక్షిణము - అని యిచట యఁ నిర్దిష్టమైనది (47). అశ్విని, కృత్తిక, యామ్య (భరణి) - నాగవీథియనబడినది. రోహిణి, మృగశీర్ష ఆర్ధ వీథియనబడినది. ఆశ్లేష, పునర్వసువు - ఐరావతీ వీధి యనబడినది. మూడు వీథులివి ఉత్తరమార్గమునందలివని చెప్పబడును (48), పూర ఉత్తర ఫల్గుని, ముఘ - అర్యమీ (వీథి) యనబడినది. హస్త, చిత్ర, స్వాతి - గోవీథియనబడినది (49). జ్యేష్ణా, విశాఖా, ఆ జారధవీ వీథియనబడినది. ఈ వీథులు మూడు మధ్యమ మార్గమునందలివని చెప్పబడును (50), మూల, పూర్వాషాఢ, ఉత్త అజవీథియనబడినది. శ్రవణం, ధనిష్ఠ, శతభిషక్ - మార్గీవీథియనబడినది (51). పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి - వైః యనబడినది. ఆ మూడు వీథులు దక్షిణ మార్గమునందలివని బుధులచే జెప్పబడినవి (52), దక్షుడు తన ఇరువది డే కన్యలను సోమునకు (చంద్రునకు) ఇచ్చేను. నక్షత్ర నామములు గల యా కన్యలు జ్యోతిస్సు (చంద్రుని) కొలకేయని చే వారియొక్క సంతానములు గూడ అమితమైన తేజస్సుతో ప్రకాశించినవి (53). మిగిలిన కన్యకలనైతే కశ్యపుడు స్వీక మహాభాగ్యవతులైన యాపదునలుగురు కన్యకలందరును లోకమాతలైరి (54). అదితి, దితి, దనువు, కొలా, అరిష్ట, సురసా వినత, తామ, క్రోధవశ, ఇర, కద్రువ, ముని, ధర్మజ్ఞ అను వారు వీరు. వారియొక్క సంతానమును వినుడు (55). చారిష్ణు మన్వ గడచిపోగా, యే పండ్రెండుగురు పురోగములై వైకుంఠులనువారుండిరో వారు చాక్షుష మన్వంతరమున సాత్ర్యులుగానైరి (56). నీవైవస్వత మన్వంతరము రాగా అదితిచే నారాధింపబడిన యవ్వారు పరస్పరము ఒకచోట గలిసికొని పరస్పరముగా నిట్లనుకొని “ఈ వైవస్వత మన్వంతరమున, యోగము వలన సగము చిత్తముతో ఈ మహాభాగ్యవతియైన యదితినే ప్రవేశించేదము (58 ప్రవేశించి యీమెకు పుత్రులమమగుదము. దాన మనకు శ్రేయస్సు రాగలదు. అదితి నుండి ప్రసవించిన మనకు ఆదిత్యత్వం కలుగగలదు (59). ఈ విధముగా బలికి వారందరు చాక్షుష మన్వంతరమున మరల మారీచుడైన కశ్యపుని వలన (అదితికి) పండ్రి ఆదిత్యులుగ పుట్టిరి (60), శతక్రతువును, విష్ణువును, మరల వైవస్వతమన్వంతరమున నరనారాయణులుగా దేవతలుగా బుల్స్ సూర్యునకు ఉదయాస్తమయములు రెండున్నట్లు, ఆ దేవతలకు గూడ చావుపుట్టుకలున్నవని చెప్పబడినది. బ్రహ్మకును, విష్ణుః మహాత్ముడైన భవునకును అవి కలవనబడినది (62). ఏ కారణమున శబ్దాది లక్షణమైన శ్రేషానుశ్రవికమున (సురలు) సవ ఆకారణముననే ఎనిమిది రూపములైన అణిమాదులందు (సిద్ధులందు) సమర్ధులై యా దేవతలు పుట్టిరి (63) - అని యీ విషయమ ఐహిక విషయములందలి రాగము సంభూతికి (జన్మకు) కారణమనబడినది. బ్రహ్మశాపముచే బుట్టిన జయులు స్వాం మన్వంతరమున జితులైరి (64). స్వారోచిష మన్వంతరమున తుషితులైరి. ఉత్తమమన్వంతరమున సత్యులైరి. తామసమన్వం హరులైరి. చారిష్ణవ మన్వంతరమున నో దేవతలైరి. చాక్షుష మన్వంతరమున వైకుంఠులైరి. ఇప్పటి మన్వంతరము (వైవస్వ మరల సాధ్యులును ఆదిత్యులునైరి (65), ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వ పూష, పదవవాడు పర్జన్యుడు అనబడెను (66). తరువాత త్వష్ట, అజఘన్యుడు (నీచుడుగానివాడు) అజఘన్యజుడు ( బుట్టినవాడునైన విష్ణువు అని యీ పండ్రెండుగురు ఆదిత్యులు కశ్యపునకు సుతులనబడినారు (67). సురభి కశ్యపుని వలన పద రుద్రులను గనెను. మహాదేవు(శివు)ని యనుగ్రహమున తపము చేత 'సతి' కలుగనున్నది (68). అంగారకుడు, సర్పుడు, ని సదసస్పతి, అజుడై యేకపాదుడైన అహిర్భుధ్యుడు, ఊర్ధ్వకేతువు, జ్వరుడు (69), భువనుడు, ఈశ్వరుడు, మృత్యువు, ప్రసి కపాలి - అను నీ త్రిభువనేశ్వరులైన పదునొకండు రుద్రులను సురభి (ఆ) మహాతపముతో జనింపజేసెను (70). తరువాత వేరుగా నిద్దరు కూతులను గనెను. వారు రుద్రకాంతిగల రోహిణియు, యశస్వినియైన గాంధారియును (71). రోహిణియందు ప్ర నలుగురు కన్యలు గలిగిరి. వారు - సురూప, హంసకీల, భద్ర, కామదుమయును, కామదుఘ సురూప పుతీద్వయమును గని హంసకీల నృపుని గనెను. భద్ర ఋషులను గనెను. మహాభాగ్యవంతులై ప్రసిద్ధులైన గంధర్వులు వెజియొక్క పుత్రులు (73). పైకి నిక్కబొడుచుకొన్న చెవులు గల ఉచ్చైశ్రవములు (గుఱ్ఱములు) పుట్టినవి. అవి మనోవేగము గలవి, ఆకాశమున చరిఁ తెల్లనివి, శ్యేనములు (డేగ వలె నెగురునవి), పిశంగములు (కపిల వర్ణము గలవి), సారంగములు (చిత్రవర్ణము గలవి), హరితార్జు (పసుపు తెలుపు వర్ణము గలవి)యును. రుద్రుని వల్లనే వెలుపలికి వచ్చినయవి గంధర్వయోనులైన గుఱ్ఱములు (74). మరల సురభినుండి శ్రీమంతము (శోభావంతము), చంద్రకాంతి వంటి చక్కనీ కొంతీ గలది, పూలదండలు గలది, మూపురము గలది, కాంతి గలది, సముద్రము నుండి బుట్టినదియునైన వృషభము పుట్టినది. అది సురభి యనుమతితో నిచ్చిన మహేశ్వరుని ధ్వజము (75). ఇవ్వీరు కశ్యపసుతులైన రుద్రాదిత్యులుగా జెప్పబడిరి. అట్లే ధర్మపుత్రులు సాధ్యులు విశ్వులు వస్తువులు అనబడిరి (76). ఇట అరిష్టనేమి పత్నుల సంతానములు పదునాలు. బహుపుత్రుడై విద్వాంసుడైన విద్యుత్తునకు నలుగురు సుతులనబడినారు. ప్రత్యంగిరసునకు బుట్టినవారు శ్రేష్టలైన ఋక్కులు బ్రహ్మర్షి సత్కృతములు (77). దేవర్షియైన కృశాశ్వునకు (పుత్రులు) దేవప్రహరణులనబడిరి. వీరు యుగ సహస్రము చివర మరల బుట్టుదురు (78). అన్ని దేవగణములు విప్రములు (బ్రాహ్మణజాతివి). ముప్పదిమూడు స్వేచ్ఛగా జనించినవారు. ఈ దేవతలకు గూడ హద్దుతో గూడిన జననముండుననబడినది (79). ఈ లోకమున సూర్యునకుదయాస్తమయములు రెండుండునట్లే ఈ దేవసమూహములు గూడ ప్రతియుగమున బుట్టుదురు.
ఋషయ ఊచుః :
సాధ్యాశ్చ వసవో విశ్వే రుద్రాదిత్యస్తథైవ చ ।
అభిజాత్యా ప్రభావైశ్చ కర్మభిశ్చైవ విశ్రుతాః ॥
ప్రజాపతేశ్చ విష్ణోశ్చ భవస్య చ మహాత్మనః ।
అంతరం జ్ఞాతుమిచ్ఛామో యశ్చ యస్మాద్విశిష్యతే ॥
యశ్చయస్మాత్ప్రభవతి యశ్చ యస్మిన్ ప్రతిష్ఠితః ।
జ్యాయాన్యో మధ్యమశ్చైవ కనీయాన్ యశ్చ తేషు వై ॥
ప్రధానభూతో యస్తేషాం గుణభూతశ్చ తేషు యః ।
కర్మభిశ్చాభిజాత్యా చ ప్రభావేణ చ యో మహాన్ ।
ఏతత్ప్ర బ్రూహి నః సర్వం త్వం హి వేత్థ యథాయథమ్ ॥
ఋషులనిరి :
సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు, రుద్రాదిత్యులును మంచివంశముతోను, ప్రభావములతోను, వారి పనులతోను ప్రసీదులు (81). బ్రహ్మయొక్కయు, విష్ణువుయొక్కయు, మహాత్ముడైన శివునియొక్కయు అంతరమును (భేదమును) తెలియగోరుచున్నాము. వారిలో నెవ్వడు ఎవ్వనికంటే గొప్పవాడు? (82) ఎవ్వడు ఎవ్వనికంటే సమర్థుడు? ఎవ్వడు ఎవ్వనియందు ప్రతిష్ఠితుడు? వారిలో నెవ్వడు మిక్కిలి శ్రేష్ఠుడు? మధ్యముడు ఎవ్వడు? కనిష్ఠుడెవ్వడు? (83) వారిలో ప్రధానమైనవాడెవడు? అప్రధానుడెవడు? కర్మలచేతను, మంచివంశము చేతను, ప్రభావముచేతను గొప్పవాడెవడు? నీవున్నది యున్నట్లు తెలిసినవాడవు. ఇదంతయు మాకు జెప్పుము .
సూత ఉవాచ :
అత్ర వో వర్ణయిష్యేఽహమంతరం తేషు యత్ స్మృతమ్ ।
యద్బ్రహ్మ విష్ణురుద్రాణాం శృణుధ్వం మే వివక్షతః ॥
రాజసీ తామసీ చైవ సాత్త్వికీ చైవ తాః స్మృతాః ।
తన్వః స్వయంభువః ప్రోక్తాః కాలే కాలే భవంతి యాః ॥
ఏతాసామంతరం వక్తుం నైవ శక్యం ద్విజోత్తమాః ।
గుణవృద్ధినిబంధత్వాద్ద్విధాను గ్రహబంధతః ॥
ప్రవృత్తిం చ నివృత్తిం చ గుణవృద్ధిమిహ ద్విజాః ।
యథాశక్తి ప్రవక్ష్యామి తనూనాం తన్ని బోధత ॥
ఏకా తు కురుతే తాసాం రాజసీ సర్వతః ప్రజాః ।
ఏకా చైవార్ణవస్థా తు సానుగృహ్ణతి సాత్త్వికీ ॥
ఏకా సా క్షిపతే కాలే తామసీ గ్రసతే ప్రజాః ॥
రజసా తు సముద్రిక్తో బ్రహ్మా సంభవతే తదా ।
పురుషాఖ్యా తదా తస్య సాత్త్వికీ వినివర్తతే ॥
యదా భవతి కాలాత్మా ఉద్రేకాత్తమసస్తు సః ।
బ్రహ్మాఖ్యా సా తదిత్వస్య రాజసీ వినిర్తతే ॥
సత్వోద్రేకాత్తు పురుషో యదా భవతి స ప్రభుః ।
కాలాఖ్యా సా తదా తస్య పునర్న భవతీతి వై ॥
క్రమాత్తస్య నివర్తంతే రూపం నామ చ కర్మ చ ।
త్రైలోకే వర్తమానస్య సర్వానుగ్రహనిగ్రహైః ॥
యదా భవతి బ్రహ్మా చ తదా చాంతరముచ్యతే ।
యదా చ పురుషో బ్రహ్మా న చైవ పురుషస్తు సః ॥
మణిర్విభజతే వర్ణాన్ విచిత్రాన్ స్ఫటికే యథా ।
వైమల్యాదాశ్రయవశాత్తద్వర్ణః స్యాత్తదంజనః ॥
తదా గుణవశాత్తస్య స్వయంభోరను రంజనమ్ ।
ఏకత్వే చ పృథక్త్వే చ ప్రోక్తమేతన్ని దర్శనమ్ ॥
ఏకో భూత్వా యథా మేఘః పృథక్త్వేనావ తిష్ఠతే ।
రూపతో వర్ణతశ్చైవ తథా గుణవశాత్తు సః ॥
భవత్యేకో ద్విధా చైవ త్రిథా మూర్తి వినాశనాత్ ।
ఏకో బ్రహ్మాంతకృచ్చైవ పురుషశ్చేతి తే త్రయః॥
ఏక స్యైతాః స్మృతాస్తిస్రస్తనవస్తు స్వయంభువః ।
బ్రాహ్మీ చ పౌరుషీ చైవ అంతకారీ చ తే త్రయః ॥
తత్ర యా రాజసీ తస్య తనుః సా వై ప్రజాకరీ ।
యా తామసీ తు కాలాఖ్యా ప్రజాక్షయకరీ తు సా ॥
సాత్త్వికీ పౌరుషీ యా తు సానుగ్రహకరీ స్మృతా ॥
రాజస్యా బ్రహ్మణోఽశేన మరీచిః కశ్యపోఽ భవత్ ।
తామసీ చాంతకృద్యా తు తదంశేనాభవద్భవః ॥
సాత్త్వికీ పౌరుషీ యా సా తస్యాః శోచిష్ణురుచ్యతే ।
త్రైలోక్యే తాః స్మృతాస్తిస్రస్త నవస్తు స్వయంభువః ॥
నానాప్రయోజనార్థాం హి కాలోఽ వస్థాం కరోతి యః ।
బ్రహ్మత్వేన ప్రజాః సృష్ట్వా విష్ణుత్వేనానుగృహ్య చ ।
వైష్ణవ్యానుగృహీతాస్తా రౌద్య్రానుగ్రసతే పునః ॥
ఏకః స్వయంభువః కాలస్త్రిభిస్త్రీన్ వై కరోతి సః ।
సృజతే చానుగృహ్ణతి ప్రజాః సంహరతే తథా ॥
ఇత్యేతాః కథితాస్త్రి స్రస్త నవస్తు స్వయంభువః ।
ప్రజాపత్యా చ రౌద్రీ చ వైష్ణవీ చైవ తాః స్మృతాః ॥
ఏకా తనుః స్మృతా వేదే ధర్మశాస్త్రే పురాతనే ।
సాంఖ్యయోగపరే వీరైః పృథక్త్వైకత్వదర్శిభిః ॥
అభిజాతప్రభావజ్ఞైర్ ఋషిభిస్తత్త్వ దర్శిభిః ॥
ఏకత్వే చ పృథక్త్వే చ తాసు భిన్నాః ప్రజాస్త్విహ ।
ఇదం పరమిదం నేతి బ్రువతో భిన్నదర్శనాః ॥
బ్రహ్మాణం కారణం కేచిత్ కేచిత్ ప్రాహుః ప్రజాపతిమ్ ।
కేచిచ్చివం పరత్వేన ప్రాహుర్విష్ణుం తథాఽ పరే ।
అవిజ్ఞానేన సంసక్తాః సక్తా రత్యాదిచేతసా ॥
తత్త్వం కాలం చ దేశం చ కార్యాణ్యావేక్ష్య తత్త్వతః ।
కారణం చ స్మృతా హ్యేతా నానార్ధేష్విహ దేవతాః ॥
ఏకం నిందతి యస్తేషాం సర్వానేవ స నిందతి ।
ఏకం ప్రశంసమానస్తు సర్వానేవ ప్రశంసతి ।
ఏకం యో వేత్తి పురుషం తమాహుర్బ్రహ్మ వాదినమ్ ॥
అద్వేషస్తు సదా కార్యో దేవతాసు విజానతా ।
న శక్యమీశ్వరం జ్ఞాతుమైశ్వర్యేణ వ్యవస్థితమ్ ॥
ఏకాత్మా స త్రిధా భూత్వా సంమోహయతి యః ప్రజాః ।
ఏతేషాం చ త్రయాణాం తు వీచరంత్యంతరం జనాః ॥
జిజ్ఞాసంతః పరీక్షంతః సక్తా రూపావిచేతసః ।
ఇదం పరమిదం నేతి వదంతి భిన్నదర్శినః ॥
యాతుధానాన్విశంత్యేతాః పిశాచాంశ్చైవ తాన్నరాన్ ।
ఏకత్వేన పృధక్త్వేన స్వయం భూర్వ్యవతిష్ఠతే ॥
గుణమాత్రాత్మికాభిస్తు తనుభిర్మోహయన్ ప్రజాః ।
తేష్వేకం యజతే యస్తు స తదా యజతే త్రయమ్ ॥
తస్మాద్దేవాస్త్రయో హ్యేతే నైరంతర్యే వ్యవస్థితాః ।
తస్మాత్పృథక్యమేకత్వ సంఖ్యా సంఖ్యా గతాగతమ్ ।
ఏకత్వం వా బహుత్వం వా తేషు కో జ్ఞాతుమర్హతి ॥
యస్మాత్ సృష్ట్వానుగృహ్ణీతే గ్రసతే చైవ తే ప్రజాః ।
గుణాత్మకత్వాత్రైకాల్యే తస్మాదేకః స ఉచ్యతే ॥
రుద్రు బ్రహ్మాణమింద్రం చ లోకపాలాన్ ఋషీన్ దనూన్ ।
దేవం తమేకం బహుధా ప్రాహుర్నారాయణం ద్విజాః ॥
ప్రాజాపత్యా తనుర్యా చ తనుర్యా చైవ వైష్ణవ ।
మన్వంతరే చ కల్పేచ ఆవర్తంతే పునః పునః ॥
తేజసా యశసా బుద్ధ్యా శ్రుతేన చ బలేన చ ।
జాయంతే తత్సమాశ్చైవ తానపీహ నిబోధత ॥
సూతుడనెను :
ఇట మీకు బ్రహ్మ - విష్ణు - రుద్రులలో ననుకొనబడిన యంతరమును నేను చెప్పెదను వినుడు (85). ప్రతికాలమున బ రాజన - తామస - సాత్త్వికరూపములైన యా బ్రహ్మ - రుద్ర - విష్ణువుల శరీరములు బ్రహ్మకు సంబంధించినవిగనే చెప్పబడిన ఓ బ్రాహ్మణోత్తములారా! వీనిలో భేదమును జెప్పుట సాధ్యము గాదు. కారణము సత్త్వ - రజస్ - తమో గుణముల వృద్ధిచే దేహములు నీబంధింపబడియుండుట. రజస్తమోగుణములు రెండు అనుగ్రహరూపమైన సత్త్వముతో బంధము గలిగియుండుటయు (87). ఓ బ్రాహ్మణులారా! ఆ తనువుల (శరీరముల) ప్రవృత్తిని నివృత్తిని గుణవృద్ధిని యథాశక్తిగా జెప్పెద దానిని వినుడు (88). వానిలో నొకటి రాజసీ తనువు. అదియంతట ప్రజాసృష్టిని జేయును. మరొకటి సాత్త్వికి. అది సముద్రమున నున్నదై సృష్టించిన ప్రజలు అనుగ్రహించును (పాలించును). మరొకటి తామసి. అది ప్రజలను గప్పివేసి మ్రింగివేయును (89). ఇవి యా పరబ్రహ్మయొక్క తనువులే. అపుడు రజోగుణముతోనుద్రిక్తుడై బ్రహ్మ పుట్టును. అప్పుడాతని పురుషుడను పేరు గల సాత్త్విక శరీరము మరలిపోవును (90). తామసగుణముద్రిక్తమైనపుడు కాలాత్మక రుద్రతనువు బుట్టినపుడు బ్రహ్మయను పేరొందిన రాజస శరీరము మరలిపోవును. సత్త్వగుణముద్రిక్తమై (పురాణ) పురుష తనువు పుట్టినపుడు కాలరూప తనువుండదు నివర్తించును (92). సర్వానుగ్రహ నిగ్రహములతో ముల్లోకమున నుండు పరబ్రహ్మయొక్క రూపము నామమును పనియును క్రమముగా నివర్తించుచుండును (రాజస బ్రహ్మబుట్టగా సాత్త్వికపురాణ పురుషుడు నివర్తించును. తామసరుద్రుడు బుట్టగా రాజస బ్రహ్మనివర్తించును. సాత్త్విక పురాణపురుషుడు (విష్ణువు) బుట్టగా తామసరుద్రుడు నివర్తించును) (93). బ్రహ్మ నిజముగా బుట్టినపుడు వారి భేదము చెప్పబడగలదు. కానీ బ్రహ్మపుట్టడు. పురుషుడు (విష్ణువు) బ్రహ్మయైనపుడు ఆతడు నిజముగా పురుషుడు గాడు (94). మణిశుద్ధ స్ఫటికమున తెల్లనిదైనను ఆశ్రయవశమున రంగును స్వీకరించినదై చిత్రమైన వర్ణములను (రంగులను) వేర్వేరుగా జూపును (95). అట్లే రజస్ - తమన్ - సత్త్వగుణవశము వలన బ్రహ్మ తత్తద్గుణ వంతుడై బ్రహ్మాది తనువుల జూపును. ఇది బ్రహ్మయొక్కటియనుటలోను భిన్నమనుటలోను ఉదాహరణముగా జూపబడినది (96). మేఘమొక్కటయ్యు వేరువేరుగా నుండును. అట్లే బ్రహ్మ గుణవశమున రూపముతోను వర్ణముతోను భిన్నుడుగా బ్రహ్మరుద్రవిష్ణువులుగా గనబడును (97). ఒక్కడే రెండుగను మూడుగను తన మూర్తియొక్క (క్రమముగా విష్ణు - బ్రహ్మ - రుద్ర మూర్తులు) నశించుటచేత అగుదురు. ఒక్కడే బ్రహ్మయు, రుద్రుడును, విష్ణువును అని ముగ్గురగును (98). బ్రాహ్మ - పౌరుషి - అంతరారీ - అను నీ మూడు మూర్తులు ఒక్కడైన బ్రహ్మవే కాని అన్యము గాదు (99). అందులో రాజసీ మూర్తి ప్రజలను సృష్టించునది. తామసీ మూర్తి కాలాఖ్యము. అది ప్రజాక్షయము జేయునది. సాత్త్వికీమూర్తి పురుషాఖ్యము. అది ప్రజను అనుగ్రహించి పాలించునది - అనబడినది (100). బ్రహ్మయొక్క రాజసీ మూర్యంశతో మరీచి కశ్యపుడై పుట్టెను. అంతకారియైన బ్రహ్మయొక్క తామసీ మూర్త్యంశతో భవుడు (రుద్రుడు) పుట్టెను (101). బ్రహ్మయొక్క సాత్త్వికీ పౌరుషీ మూర్త్యంశతో విష్ణువు బుట్టెను. ముల్లోకమున నా మూర్తులు మూడు బ్రహ్మవేయని చెప్పబడినవి (102). కాలమనునది అనేక ప్రయోజనములు గల అవస్థనేర్పరచును. పరబ్రహ్మ బ్రహ్మగా ప్రజలను సృష్టించి, విష్ణువుగా వారి ననుగ్రహించి పాలించి, రుద్రునిగా నా ప్రజలను మరల సంహరించును (103). స్వయంభువైన బ్రహ్మ యొక్క ఒకేకాలుడు (కాలస్వరూపుడు) మూటీతో (బ్రహ్మ - విష్ణు - రుద్ర మూర్తులతో, సృష్టి - అనుగ్రహ - సంహారములను జేయును) ఆతడే ప్రజలను సృష్టించును, అనుగ్రహించును, సంహిరంచును (104). అని పరబ్రహ్మయొక్క యీ ప్రజాపత్యా - రౌద్రీ - వైష్ణవీ యనబడు మూడు మూర్తులు చెప్పబడినవి (105), సాంఖ్య - యోగపరమైన వేదమునను పురాతన ధర్మశాస్త్రమునను, భగవంతుని భిన్నత్వమును ఏకత్వమును దర్శించు వీరుల చేత చక్కని వంశప్రభావమును దెలిసిన వారిచేతను, తత్త్వదర్శనులైన ఋషులచేతను ఆ పరబ్రహ్మ మూర్తియొక్కటిగనే చెప్పబడినది (106). ఇచట బ్రహ్మ ఏకత్వమునను, భిన్నత్వమునను ప్రజలు భిన్నులైరి (వేరుగానైరి). “ఇది గొప్పది ఇది కాదు” - అని చెప్పువారు భిన్నదర్శనులు. (భేదమును జూచువారు) (107). అవిజ్ఞానముతో గూడి విషయాసక్తులై రత్యాదులు నిండిన చిత్తముతో కొందరు బ్రహ్మను కారణునిగాను, మరికొందరు ప్రజాపతిని కోరణునిగాను, కొందరు శివుని నుత్కృష్టునిగను, మరికొందరు విష్ణువును త్కృష్టునిగను జెప్పుదురు (108). ఇచట తత్త్వమును, కాలమును, దేశమును, కార్యములను వాని కారణమును నిజముగా వీక్షించి అనే కార్దములచే ప్రయోజనములలో) నీదేవతలు ఏర్పడిన వారుగా జెప్పబడినారు (కాని వారందఱు నొక్కరే) (109). వారిలో నొక్కరిని నిందించిన వాడు అందరిని నిందించినవాడగును. ఒక్కరిని స్తుతించినవాడు అందరిని స్తుతించినవాడగును. పురాణపురుషునొక్కని నెవ్వడు తెలియునో వానిని బ్రహ్మవాది (నిజముగా బ్రహ్మను జెప్పువాడు) యనియందురు (110). విజ్ఞాని దేవతలలో ద్వేషము బూనరాదు. సర్వైశ్వర్యముతో నిండియున్న యీశ్వరుని దెలియుట సాధ్యము గాదు (111). బ్రహ్మవిష్ణు రుద్రరూపముల మూడుగానై ప్రజలను మోహింపజేయువాడొక్కడే (సర్వాత్ముడు). జనులు ఈ మువ్వురిలోను అంతరముతో బ్రవర్తింతురు (112). నైజమును తెలియగోరుదురు - పరీక్షింతురు. రూపమున భ్రాంతి జెంది విషయాసక్తులగుదురు. ఇది గొప్పది ఇదికాదు - అని చెప్పుదురు. వారు బ్రహ్మలో భేదము జూచువారు (113). వీరు రాక్షసులను నరపిశాచులను బ్రవేశింతురు. గుణ - మాత్రాత్మికములైన మూర్తులతో ప్రజలను మోహింపజేయుచు స్వయంభువు పరబ్రహ్మ ఒక్కడుగను వేర్వేరుగను ఉంటున్నాడు (114). వారిలో నొక్కరిని పూజించువాడు కూడ మువ్వురిని పూజించు. కావున నీముగ్గురు దేవతలు భేదము లేకయుండువారు. కావున నిచట పృథక్యము తత్త్వజ్ఞానమునుండి దూరము వేడ వచ్చిన యేకత్వ సంఖ్యారూపము. వారిలోనేకత్వమును గాని బహుత్వమును గాని యెవరు తెలిసికొనగలరు? సృష్టించినందునను, అనుగ్రహించినందునను, సంహరించినందునను భూత భవిష్యద్వర్తమానములలో రజస్సత్త్వతమో? మైనందునను ఆతడొక్కడే యనబడుచున్నాడు (117). బ్రాహ్మణులు ఆ ఒకే దేవుడైన నారాయణుని రుద్రునిగను, బ్రహ్మగను, ఇంక లోకపాలురుగను, ఋషులుగను, దనువులుగను, బహువిధముగా జెప్పుదురు (118). ప్రాజాపత్య యను మూర్తియు, వైష్ణవీ మ మన్వంతరమునను కల్పమునను మరల మరల తిరిగి వచ్చుచుండును (119). తేజమునను, యశమునను, బుద్ధియందును, శ్రుత బలమునను త్రిమూర్తులతో సమానముగా బుట్టుదురు. వారిని గూడ వినుడు.
రాజస్యా బ్రహ్మణోఽశేన మరీచిః కశ్యపోఽ భవత్ ।
తామస్యాస్తస్య చాంశేన కాలాత్మా రుద్ర ఉచ్యతే ॥
సాత్త్విక్యాః పురుషాంశేన యజ్ఞే విష్ణురభూత్తదా ॥
త్రిషు కాలేషు తస్యైతా బ్రహ్మణస్తనవోఽశజాః ।
కాలో భూత్వా పునశ్చాసౌ రుద్రః సంహరతే ప్రజాః ॥
సంప్రాప్తే చైవ కల్పాంతే సప్తరశ్మిర్దివాకరః ।
భూత్వా సంవర్తకాదిత్యో లోకాంస్త్రీన్ స తదాదహత్ ॥
విష్ణుః ప్రజానుగృహ్ణతి నామరూప విపర్యయే ।
తస్యాం తస్యామవస్థాయాం తత్తదుత్పత్తి కారణమ్ ॥
సత్త్వోద్రిక్తా తు యా ప్రోక్తా బ్రహ్మణః పౌరుషీ తనుః ।
తస్యాంశేన విజజ్ఞే స ఇహ స్వాయంభువేఽతరే ॥
ఆకూత్యాం మనసో దేవ ఉత్పన్నః ప్రథమే విభుః ॥
తతః పునః స వై దేవో ప్రాప్తే స్వారోచిషేంతరే ।
తుషితాయాం సముత్పన్నో హ్యతీతసుషితైః సహ ॥
ఔత్తమే చాంతరే చైవ తుషితస్తు విదుః స వై ।
వశవర్తిభిరుత్పన్నో పశవర్తీ హరిః పునః ॥
సత్యాయామభవత్సత్యః సత్యైః సహ సురోత్తమైః ।
తామసస్యాంతరే చాపి సంప్రాప్తే పునరేవహి ।
భార్యాయాం హరిభిః సార్ధం హరిరేవ బభూవ హ ॥
చారిష్ణవేఽతరే చాపి హరిర్దేవః పునస్తు సః ।
వైకుంఠాయామసౌ జజ్ఞే హ్యాభూతరజసైః సహ ॥
వైకుంఠః స పునర్దేవః సంప్రాప్తే చాక్షుషేంఽతరే ॥
ధర్మో నారాయణః సాధ్యః సాధ్యైః సహసురైరభూత్ ।
స తు నారాయణః సాధ్యః ప్రాప్తే వైవస్వతేఽతరే ॥
మారీచాత్కశ్యపాద్విష్ణురదిత్యాం సంబభూవ హ ।
త్రిస్త్రిః క్రమైరిమాన్ లోకాన్ జిత్వా విష్ణురురుక్రమమ్ ॥
ప్రత్యపాదయదింద్రాయ దేవేభ్యశ్చైవ స ప్రభుః ।
ఇత్యేతా స్తనవస్తస్య వ్యతీతాః సప్త సప్తసు ॥
మన్వంతరేష్వతీతేషు యాభిః సంరక్షితాః ప్రజాః ॥
తస్మాద్విష్టమిదం సర్వం పోమనేనేహ జాయతా ।
తస్మాత్స వై స్మృతో విష్ణుర్విశేర్ధాతోః ప్రదేశనాత్ ॥
ఇత్యేతే బ్రహ్మణశ్చైవ వామనస్య మహాత్మనః ।
ఏకత్వం చ పృథక్త్వం చ విశిష్టత్వం చ కీర్తితమ్ ॥
రాజసికి బ్రహ్మయొక్క యంశతో మరీచియైన కశ్యపుడు పుట్టెను. తామసికి ఆ బ్రహ్మయొక్క యంశతో కాలాత్ముడైన పుట్టేనని చెప్పబడినది. సాత్త్వికికి పుషాంశతో యజ్ఞమున నపుడు విష్ణువు కలిగెను (121). మూడు కాలములలో నీత బ్రహ్మయంశమున బుట్టినవి. ఈతడు కాలుడైన రుద్రుడే ప్రజలను సంహరించును (122). కల్పాంతము రాగా సప్తరశి కిరణములు గల) సూర్యుడు ప్రళయాదిత్యుడై యపుడు ముల్లోకములను దహించును (123). నామరూపముల మార్పు జరి. విష్ణువు ప్రజలననుగ్రహించును, పాలించును. ఆయా అవస్థలో (దశలో) ఆయా యుత్పత్తికి కారణమగను (124). సత్త్వగుణో యే బ్రహ్మయొక్క పౌరుషీ తనువు కలదో! దాని యంశతోనీట మొదటి స్వాయంభువ మన్వంతరమున ఆకూతియందు మనసు విభువై దేవుడైన యాతడు (విష్ణువు) పుట్టెను. తరువాత మరల ఆ దేవుడే స్వారోచిష మన్వంతరము రాగా తుషితయందు బు తుషితులతో బాటు గతించెను (126). ఉత్తమ మన్వంతరమున ఆతడు తుషితుడని తెలియుదురు. వశవర్తులతో బుట్టి వశః హరి మరల సత్యయందు (127) సత్యుడై సత్యులయిన సురోత్తముతోబాటు పుట్టెను. తామస మన్వంతరము రాగనే మరల భార్యయందు హరులతో బాటు హరియే పుట్టేనట (128). చారిష్ణవ మన్వంతరమున గూడ మరల ఆతడు హరిదేవుడు. ఈతడు వైకుంఠయందు ఆ భూతరజసులతో బాటు జన్మించెను. చాక్షుష మన్వంతరము రాగనే ఆ వైకుంఠుడే మరల దేవుడు (129). ధర్ముడైన నారాయణుడు సాధ్యుడు సాధ్యులైన సురలతోబాటు పుట్టెను. వైవస్వతమన్వంతరము రాగా ఆ నారాయణుడైతే సాధ్యుడు (దేవజాతివాడు) (130). మారీచుడైన కశ్యపుని వలన అదితియందు విష్ణువు జన్మించెను. ఆవరించు పాదవిక్షేపము గలుగునట్లుగా విష్ణువు తన మూడడుగులతో ఈ లోకములను జయించెను. తరువాత ఆ ప్రభువు (విష్ణువు) వానిని ఇంద్రునకును దేవతలకును ఇచ్చెను - అను నీ యాతని తనువులు గతించిన యేడు మన్వంతరములలో గడచినవి. ఆ తనువుల చేత అప్పటి ప్రజలు రక్షింపబడిరి (132). అందువలననే ఈ లోకమున బుట్టుచున్న వామనునిచేత ఈ సర్వము ప్రవేశింపబడినది. అందువలననే ప్రవేశార్థకమైన ‘విశ్’ ధాతువుతో నేర్పడిన విష్ణు శబ్దముతో బిలువబడెను (133). అను వీరందరు బ్రహ్మకు సంబంధినవారే. మహాత్ముడైన వామనునకు ఏకత్వము, పృథక్యము (వేరుతనము) విశిష్టత్వమును జెప్పబడినవి (134).
దేవతానామిహాంశేన జాయంతే యాస్తుదేవతాః ।
తాసాం తాస్తేజసా బుద్ద్యా శ్రుతేన చ బలేన చ ।
జాయంతే తత్సమాశ్చైవ తా వై తేషా మనుగ్రహాత్ ॥
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛధ్వం విష్ణో స్తేజోఽశ సంభవమ్ ॥
స ఏవం జాయతేఽశేన కేచిదిచ్చంతి మానవాః ।
తతోఽ పరే బ్రువంతీమమన్యోన్యాంశేన జాయతే ॥
ఏవం వివదమానాస్తే దృష్ట్వా తాన్ వై బ్రువంతి హ ।
యస్మాన్న విద్యతే భేదో మనసశ్చేతసశ్చ హ ।
తస్మాదనుగ్రహ స్తేషాం క్షేత్రజ్ఞా స్తే భవంత్యుత ॥
ఏకస్తు ప్రభుశక్త్యా వై బహుధా భవతీశ్వరః ।
భూత్వా యస్మాచ్చ బహుధా భవత్యేకః పునస్తు సః ॥
తస్మాత్సు మనసో భేదాజ్జాయంతే తేజసశ్చ హ ।
మన్వంతరేషు సర్వేషు ప్రజాః స్థావరజంగమాః ।
సర్గాదౌ సకృదుత్పన్నాస్తిష్ఠంతీహ ప్రశంసయా ॥
ప్రాప్తే ప్రాప్తే తు కల్పాంతే రుద్రః సంహరతి ప్రజాః ।
జాయంతే మోహయంతోఽ న్యానీశ్వరా యోగమాయయా ॥
ఐశ్వర్యేణ చరంతస్తే మోహయంతి హ్యనీశ్వరాః ।
తస్మాద్దోష ప్రచారేషు యుక్తాయుక్తం న విద్యతే ॥
భూతాపవాదినో దుష్టా మధ్యస్థా భూతభావినః ।
భూతాపవాదినః శక్తాస్త్రయో వేదాః ప్రవాదినామ్ ॥
దృఢపూర్వశ్రుతత్వాచ్చ ప్రవాదాచ్చైవ లౌకికాత్ ।
చతుర్భిః కారణైరేభిర్యథాతత్త్వం న విందతి ॥
పూర్వమర్థాంతరే న్యస్తాః కాలాంతరగతా అపి ।
తేనాన్యత్ సంతమప్యర్థం ద్వేషాన్న ప్రతిపద్యతే ॥
దర్శానాం ద్రవ్యభూతో యో గుణభూతస్తు తేషు యః ।
కర్మణాం మనసాం కర్తా అభిజాత్యా చ యో మహాన్ ।
శ్రుతజ్ఞైః కారణైరేతైశ్చతుర్భిః పరికీర్త్యతే ॥
అశక్తరుష్టో జానాతి దేవతాః ప్రవిభాగశః ।
ఇమౌ చోదాహరంత్యత్ర శ్లోకౌ యోగేశ్వరం ప్రతి ॥
ఆత్మనః ప్రతిరూపాణీ పరేషాం చ సహస్రశః ।
కుర్యాద్యోగబలం ప్రాప్య తైశ్చ సర్వైః సహాచరేత్ ॥
ప్రాప్నుయాద్విషయాచ్చైవ తథైవోగ్రత పశ్చరన్ ।
సంహరేచ్చ పునః సర్వాన్ సూర్యతేజో గుణానివ ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే కాశ్యపీయప్రజాసర్గో నామ పంచమోఽధ్యాయః ॥
ఈ లోకములో నేదేవతలు దేవతాంశతో జన్మింతురో వారికి ఆ దేవతలు బుద్ధిచేతను, శ్రుతము చేతను, బలము చేతను వారియనుగ్రహమున సమానులై జన్మింతురు (135). ఏయే ప్రాణి విభూతి (మహైశ్వర్యము) గలదియు, సిరిగలదియు దృఢమైనదియునగునో ఆ ప్రాణియంతయు విష్ణువు యొక్క తేజోంశముచేతనే పుట్టినదని తెలియుడు (136). ఆతడు (విష్ణువు) ఈ విధముగా కొద్దియంశతో బుట్టునని కొందరు మానవులు తలంతురు. మరికొందరు ఈతనిని అన్యోన్యాంశతో బుట్టినవానిగా జెప్పుదురు (137). ఈ విధముగా వివాదపడుచునే వారిని జూచి యిట్లందురు - మనస్సుకును చిత్తమునకును భేదము లేనందున వారికి అనుగ్రహము గలుగును. దాన వారు క్షేత్రజ్ఞులగుదురు (138). ఒక్కడే యీశ్వరుడు ప్రభుశక్తిచే బహువిధములుగా నగును. అట్లు బహువిధములుగా నయ్యు సౌతడొక్కడేయగును (139). ఆ దేవతల భేదము వలన తేజము నుండి యన్ని మన్వంతరములలోను స్థావరజంగమరూపులైన జన్మింతురు. వారు సృష్ట్యాదిలోనొక్కమారు పుట్టినవారై ప్రశంసతో నిలుతురు (140). కల్పాంతమువచ్చిన ప్రతిమారును రుద్రుడాద్ర సంహరించును. యోగమాయచే నితరులను మోహింపజేయుచు ఈశ్వరులు పుట్టుదురు (141). ఆ యీశ్వరులు ఐశ్వర్యముతో జరి అనీశ్వరులై మోహింపజేయుదురు. కావున దోషప్రచారములలో యుక్తాయుక్తములుండవు (142). భూతమును గురించి చెడుగా జీవ దుష్టులు. భూతమును భావించువారు మధ్యస్థులు. భూతమును చెడుగా జెప్పువారు శక్తులు. ఇవి ప్రవాదులకు (ఎక్కువగా జెప్ప మూడు వేదములు (143). దృఢమయినందువల్లను, పూర్వమైనందునను (ప్రాచీనమైనందునను) శ్రుతమైనందునను (వినబడినండి లౌకిక ప్రదమైనందునను ఈ సోలుగు కారణముల చేత మానవుడు ఒకదానిని ఉన్నదున్నట్లు తెలిసికొనలేడు (144). పూర్వము యర్ధమున నుంచబడినవియు, కాలాంతరమున నున్నవియు, యథార్థముగా తెలియవు. దాని వలన ఉన్న మరియొక్క య గూడ ద్వేషము వలన దెలియడు (145). ధర్మములకు ద్రవ్యభూతుడను, వానిలోగుణభూతుడును, కర్మలకును మనస కర్తయైనవాడును, ఉత్త మవంశముతో గొప్పవాడైనవాడును శ్రుతమును దెలిసిన యీ నాలుగు కారణములచేత బాగుగా కీర్తింపబ (146). అశక్తుడై కోపించినవాడు దేవతలను విభాగపూర్వకముగా దెలియును. ఈ విషయమున యోగేశ్వరుని గూర్చి యీ శ్లోకం జెప్పుదురు (147). యోగబలమును బొంది తన ప్రతిరూపములను ఇతరులకు వేలప్రతిరూపములుగా జేసి వాటి అన్నింటిక ప్రవర్తింపవలెను. విషయములను (రూపరసగంధ స్పర్శల సుఖములను) పొందవలెను. అట్లే ఉగ్రమైన తపము జేయుచు సూర్య గుణములను వలె సంరింపవలెను (148).
ఇది శ్రీవాయుమహాపురాణమున కాశ్యపీయ ప్రజాసర్గమను నైదవ యధ్యాయము సమాప్తము.