19 - అరిష్టాని

వాయురువాచ:-

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి అరిష్టాని నిబోధత ।

యేన జ్ఞానవిశేషేణ మృత్యుం పశ్యతి చాత్మనః ॥

అరున్ధతీం ధ్రువం చైవ సోమచ్ఛాయాం మహాపథమ్ ।

యో న పశ్యేత్సనో జీవేన్నరః సంవత్సరాత్పరమ్ ॥

ఆరశ్మివన్తమాదిత్యం రశ్మివన్తం చ పావకమ్ ।

యః పశ్యేన్న చ జీవేత మాసాదేకాద శాత్పరమ్ ॥

 వమేన్మూత్రం కరీషం వా సువర్ణం రజతం తథా ।

 ప్రత్యక్షమథవా స్వప్నే దశమాసాన్ స జీవతి ॥

 ఆగ్రతః పృష్ఠతోవాపి ఖండం య స్వపదం భవేత్ ।

పాంసులే కర్దమేవాపి సప్తమాసాన్ స జీవతి ॥

కాకః కపోతే గృధ్రో వా నిలీయేద్యస్యమూర్ధని ।

క్రవ్యాదో వా ఖగః కశ్చిత్ షణ్మాసాన్నాతి వర్తతే ॥

బధ్యేద్వాయస పంక్తీభిః పాంశువర్షేణ వా పునః ।

ఛాయాం వా వికృతాం పశ్యేచ్చతుః పంచ స జీవతి॥

అనభ్రే విద్యుతం పశ్యేత్పక్షిణాం దిశమాస్థితామ్ ।

ఉదకేన్ప్రధనుర్వాపి త్రయోద్వౌవా స జీవతి ॥

అప్సు వాయదివాదర్శే ఆత్మానం యో న పశ్యతి ।

 అశిరస్కం తథాత్మానం మాసాదూర్థ్వం న జీవతి॥

 శవగన్ది భవేద్గాత్రం వసాగన్ధి హ్యథాపి వా ।

 మృత్యుర్హ్యుపస్థితస్తస్య అర్ధమాసం స జీవతి ॥

వాయువు పలికెను:- ఆ పైన అరిష్టములను వినుడు. వాని(వి)జ్ఞానమున మానవుడు తన మరణమును (రాబోవుదానిని) జూడగలడు-1. అరుంధతీ నక్షత్రమును ధ్రువనక్షత్రమును, చంద్రకాగ్రిని, రాజమార్గమును జూడలేని నరుడు సంవత్సరము దాటి జీవింపడు-2. సూర్యుని కిరణములు లేని వానిగను, అగ్నిని కిరణములుగలదానినిగను చూచువాడు పదునొకండు మాసములుదాటి జీవింపడు-3. ప్రత్యక్షముగాగాని, స్వప్నమునగాని, మూత్రమునుగాని, పీడకనుగాని, వెండినిగాని, బంగారమునుగాని వాంతిజేసికొన్నవాడు పదిమాసములు జీవించును-4. ధూళియందుగాని, బురదయందుగాని ముందుగాని వెనుకభాగమునగాని తనయడుగు తెగిపోయినట్లుగనబడినచో వాడు ఏడు నెలలు మాత్రము జీవించును-5. కాకిగాని, పాపురముగాని, గ్రద్దగాని, మాంసము తినుపక్షిగాని తన తలయందు లీనమయినట్లు జూచినవాడు ఆరుమాసములుదాటి జీవింపడు-6. కాకుల పంక్తులతో కట్టివేయబడిన వాడుగాని, ధూళివర్షముతో జుట్టబడినవాడుగాని, తననీడను వికారముగా జూచినవాడుగాని, నాలుగైదు నెలలు జీవించును-7. దక్షిణదిక్కున మేఘములు లేకయే తెలుపునుగాని, జలమున నింద్రధనువును గానీ చూచినవాడు రెండు మూడు నెలలు జీవించును-8. నీటిలోగాని, అద్దములుగాని తనను జూడలేనివాడును, చూచినచో తలలేని తనను జూచువాడును నెలదాటి జీవింపడు-9. తన శరీరమున శవగంధముగాని వసాగంధముగాని వచ్చుచున్నవాడు మరణము సమీపించినవాడు. సగమునెల కూడ జీవింపడు-10.

సంఖిన్నో మారుతో యస్య మర్మస్థానాని కృన్తతి ।

అద్భిః స్పృస్టో న హృస్యేచ్చ తస్య మృత్యురుపస్థితః ॥

ఋక్షవానరయుక్తేన రధేనాశాస్తు దక్షిణామ్ ।

గాయన్నథవ్రజేత్ స్వప్నే విద్యాన్మృత్యురుపస్థితః ॥

కృష్ణాంబరధరా శ్యామా గాయన్ తీ వాథచాంగనా ।

 యన్నయేద్ధక్షిణామాశాం స్వప్నే సోఽపి స జీవతి ॥

ఛాద్రం వాసశ్చ కృష్ణఞ్చ స్వప్నే యోవిధృయాన్నరః ।

భగ్నం వా శ్రవణం దృష్ట్యా విద్యాన్మృత్యురుపస్థితః ॥

ఆమస్తకతలాద్యస్తు నిమజ్జేత్పజ్జ్కసాగరే ।

 దృష్ట్యాతు తాదృశం స్వప్నం సద్యఏవ న జీవతి ॥

భస్మాజ్గారాంశ్చ కేశాంశ్చ నదీం శుష్కాం భుజఙ్గమాన్ ।

నశ్యేద్యో దశరాత్రన్తు న స జీవేత తాదృశః ॥

 కృష్ణైశ్చ వికటైశ్చైవ పురుషైరుద్యతాయదైః ।

పాషాణైస్తాడ్యతే స్వప్నే యః సద్యో న సజీవతి ॥

 సూర్యోదయే ప్రత్యుషసి ప్రత్యక్షం యస్య వై శిపా ।

క్రోశన్తీసమ్ముఖాభ్యేతి స గతాయుర్భవేన్నరః ॥

 యస్య వై స్నాతమాత్రస్య హృదయం పీడ్యతే భృశమ్ ।

జాయతే దన్తహర్షశ్చతం గతాయుష మాదిశేత్ ॥

భూయో భూయః శ్వసేద్యస్తు రాత్రౌ వా యది వా దివా ।

దీపగన్ధం చ నోవేత్తి విద్యాన్మృత్యు ముపస్థితమ్ ॥

ఒక్కసారి భేదించుకొని వచ్చిన వాయువు మర్మస్థానములను గత్తిరించగా నీరు జల్లినను హర్షించనివాడు మృత్యువు సమీపించినవాడు-11. ఎలుగు గొడ్లతోను, కోతులతోను, లాగబడుచున్న రథములో గానము చేయుచు దక్షిణదిక్కునకు బోవుచున్నట్లు తనను స్వప్నమున జూచువాడు మృత్యువు సమీపించినవాడని తెలియవలెను-12. స్వప్నమున నల్లని వస్త్రము ధరించిన నల్లని స్త్రీ గానము చేయుచు దక్షిణదిక్కునకు బోయినచో వాడు జీవింపడు-13. స్వప్నమున రంధ్రములుగల నల్లని వస్త్రమును ధరించినవానికిని, చెవి భగ్నమైనట్లు చూచినవానికీని మరణము సమీపించినదని తెలిసికొనవలె-14. తలనిండగాబురద సముద్రమున తాను మునిగినట్లు స్వప్నమున జూచిన వాడు వెంటనే మరణించును-15. బూడిదను, నిప్పుకణికలను, వెంట్రుకలను, ఎండినగడ్డిని, పాములను, స్వప్నమున జూచినవాడు పదిరాత్రులు గూడ జీవింపడు-16. వికటాకారులై ఆయుధములెత్తిన నల్లని పురుషులచే స్వప్నమున రాళ్లచే గొట్టబడిన వాడు వెంటనే మరణించును-17. సర్యోదయమున ప్రభాతకాలమున ప్రత్యక్షముగా నక్కకూత పెట్టుచూ ఎదురుగా వచ్చినచో మనుష్యుడు మరణించును-18. స్నానము చేసినంతమాత్రమున గుండెమిక్కిలి పిండబడి పండ్లిగిలించినవాని మరణించిన వానిగా జెప్పవలెను-19. రాత్రియందుగాని పగటియందుగాని మాటి మాటికి శ్వాసనుదీయువాడుగాని దీప (నిర్వాణ) గంధమును వాసన జూడలేని వాడుగాని మరణము సమీపించిన వాడగునని తెలియవలె-20.

రాత్రౌ చేన్ద్రాయుధం పశ్చేద్దివా నక్షత్రమండలమ్ ।

 పరనేత్రేషు చాత్మానం న పశ్యేన్న స జీవతి ॥

 నేత్రమేకం స్రవేద్యస్య కర్ణౌ స్థానాచ్చ భ్రశ్యతః ।

 నాసా చ వక్రా భవతి స జ్ఞేయో గతజీవితః ॥

 యస్యకృష్ణాఖరాజిహ్వా పఙ్కభాసం చ వై ముఖమ్ ।

 గండే చిపిటకే రక్తే తస్య మృత్యురుపస్థితః ॥

 ముక్తకేశో హసంశ్చైవ గాయన్ నృత్యం శ్చ యో నరః ।

యామ్యాశాభిముఖో గచ్ఛేత్తదన్ తం తస్య జీవితమ్ ॥

 యస్య స్వేదసముద్భూతాః శ్వేతసర్షప సన్నిభాః ।

స్వేదాభవన్త్యసకృత్తస్య మృత్యురుపస్థితః ॥

రాత్రిలో ఇంద్రధనుస్సును (సింగిడిని), పగలు నక్షత్రమండలమును ఇతరులనేత్రములలో తనను జూచినవాడు బ్రతుకడు-21. ఒక కంటిలో నీరుగారినను, చెవులు తమస్థానమునుండి జారినను, ముక్కువంకరయైనను వాడు చచ్చినవాడని తెలియవలె-22. నాలుక నల్లనై యెండిపోయినను, ముఖము బురుదరంగుదేలినను, చెక్కిళ్లును చప్పిడి ముక్కులును ఎఱ్ఱనైనను, వానికి మృత్యువు సమీపించినదని తెలియవలె-23. వెండ్రుకలు విరబోసికొని, నవ్వుచు, గానము చేయుచు, నాట్యముచేయుచు, దక్షిణదిక్కుగా (స్వప్నమున) బోవువాడు వాని జీవితమును జాలించును-24. మాటి మాటికి తెల్ల ఆవాలవంటి చెమట బిందువులు వంటినిండ ఏర్పడినవాడు మరణము సమీపించినవాడని తెలియవలె-25.

ఉష్ట్రావా రాసభావా పి యుక్తాః స్వప్నే రదేఽ శుభాః ।

యస్య సోఽపి న జీవేత దక్షిణాభిముఖో గతః ॥

 ద్వేచాత్ర పరమేరిష్టే ఏతద్రూపం పరం భవేత్ ।

 ఘోషం న శృణుయాత్ కర్ణే జ్యోతిర్నేత్రే న పశ్యతి ॥

శ్వబ్రే యో నిపతేత్ స్వప్నే ద్వారం చాస్య న విద్యతే ।

న చోత్తిష్ఠతి యః శ్వభ్రాత్తదన్తం తస్య జీవితమ్॥

ఉర్ద్వా చ దృష్టిర్న చ సంప్రతిష్ఠా రక్షా పునః సంపరివర్తమానా ।

 ముఖస్యచోష్మా సుషిరా చ నాభిరత్యుష్ణమూత్రో విషమస్థ ఏవ ॥

దివా వా యది వా రాత్రౌ ప్రత్యక్షం యోఽభిహన్యతే ।

 తం పశ్యేదథ హన్తారం స హతస్తు న జీవతి ॥

స్వప్నమున తన రథమునకు బంటెలుగాని గాడిదలుగాని కట్టబడియుండిన వాడై దక్షిణాభిముఖముగ బోయినవాడుబ్రతుకడు-26. ఇచట రెండు గొప్ప అరిష్టములు. వీని రూపము గొప్పదగును. చెవిలో ధ్వని వినలేడు. కంటిలో జ్యోతిని జూడలేడు-27. స్వప్నమున ద్వారము(దారి)లేనిగోతిలోబడి లేవలేకున్నవాడు వెంటనే మరణించును-28. దృష్టి పైకి బోయినది. నిలకడగా లేదు. మరి యెఱ్ఱనై తిరుగుచుండినది. ముఖరంధ్రము నాభి వేడిగా నున్నవి. మూత్రము మిక్కిలివేడి యైనది. ఇట్టివాడు విషమస్థుడే చచ్చువాడే-29. (స్వప్నమున) పగలుగాని రాత్రిగాని ప్రత్యక్షముగా జంపబడువాడు తనను జంపువానిని జూచినచో ఆచంపబడినవాడు బ్రతుకడు-30.

అగ్నిప్రవేశం కురుతే స్వప్నాన్తే యస్తు మానవః ।

స్కృతిం నోపలభేచ్చాపి తదన్తం తస్య జీవితమ్ ॥

 యస్తు ప్రావరణం శుక్లం స్వకం పశ్యతి మానవః ।

రక్తం కృష్ణమపి స్వప్నే తస్య మృత్యురుపస్థితః॥

ఆరిష్టసూచితే దేహే తస్మిన్ కాల ఉపాసతే ।

త్యక్త్యా భయవిషాదం చ ఉద్గచ్ఛేద్బుద్ధిమాన్నరః ॥

ప్రాచీం వా యది వోదీచిం దిశం నిష్క్రమ్య వై శుచిః ।

 సమేఽతి స్థావరే దేశే వివిక్త జనవర్జితే ॥

ఉదఙ్ముఖః పాఙ్ముఖోవా స్వస్థః స్వాచాన్త ఏ వచ ।

స్వస్తికోప నివిష్టశ్చ నమస్కృత్య మహేశ్వరమ్ ।

సమకాయ శిరోగ్రీవం ధారయేన్నావలోకయేత్॥

యథా దీపో నివాతస్థో నేజ్గతే సోపమాస్మృతా ।

 ప్రాగుదక్ప్రవణే దేశే తస్మాద్యుంజీత యోగవిత్ ॥

ప్రాణే చ రమతే నిత్యం చక్షుషోః స్పర్శనే తథా ।

శ్రోత్రే మనసి బుద్ధౌచ తథా వక్షసి ధారయేత్॥

కాలధర్మం చ విజ్ఞాయ సమూహం చైవ సర్వశః ।

ద్వాదశాధ్యాత్మమిత్యేవం యోగధారణ ముచ్యతే ॥

 శతమష్టశతం వా పి ధారణాం మూర్ద్ని ధారయేత్ ।

న తస్యధారణా యోగాద్వాయుః సర్వం ప్రవర్తతే॥

 తతస్త్యాపూరయేద్దేహ మోఙ్కారేణ సమాహితః ।

అథోఙ్కారమయో యోగీ నక్షరే త్త్యరీ భవేత్॥

 ఇతి శ్రీమహాపురాణే వాయుప్రొక్తే అరిష్టానినామైకొన వింశోఽధ్యాయః॥

 స్వప్నము చివర అగ్ని ప్రవేశం జేసి స్మృతిని బొందని మానవుడు అంతటితోనే మరణించును-31. స్వప్నమున తాను గప్నుకొన్న తెల్లని వస్త్రమును ఎఱ్ఱనిగను నల్లనిదిగను జూచినవానికి మరణము సమీపించును-32. అరిష్టము సూచింపబడినదేహమున ఆ కాలమురాగానే భయమును దు:ఖమును వదిలి బుద్ధిమంతుడైన మానవుడు నిద్రనుండీ లేవవలెను-33. తూర్పునకు గాని ఉత్తరమునకు గాని బయలుదేరి, శుచియై యెగుడు దిగుడులులేక సమతలమై యేకాంతమై నిర్జనమైన కదలికలేక స్థిరమైన ప్రదేశమున-34. ఉత్తరము వైపు గాని తూర్పువైపుగాని ముఖము జేసి స్వస్థుడై చక్కగా ఆచమనము జేసిన వాడై స్వస్తికాసనమున గూర్చున్న వాడై మహేశ్వరుని నమస్కరింపవలెను. శరీరము కంఠము శిరము సమముగానిట్టనిలువుగా నుంచినవాడై కన్నులు మూసి చిత్తమును ఆ మహేశ్వరునియందు నిలుపవలెను. 35. ఆతడు నివాతసిష్కంపమైన ప్రదీపం వలె ధారణాసమాధిలోనుండవలె. కావున యోగమును దెలిసినవాడు తూరుపు-ఉత్తర దిక్కుల ప్రదేశమున యోగధారణము జేయవలె-36. ప్రాణమున (ప్రాణస్థానమైన హృదయమున నిత్యము యోగముతో రమింపవలె. అట్లే నేత్రములందు, స్పర్శనమునందు, చెవులయందు, మనస్సునందు, బుద్దియందు, అట్లే వక్షస్థలమందును యోగధారణము (చిత్తబంధము) జేయవలెను-37. కాలధర్మమునుదేలిసి అన్ని విధముల సమూహము, పండ్రెండు విధములైన యాధ్యాత్మము అనునది యోగధారణమనబడును-38. నూరు పర్యాయములు గాని ఎనిమిదినూరులుల పర్యాయములుగానీ శిరమున యోగధారణములచేయవలె. ధారణాయోగము వలన వాని వాయువు సర్వము ప్రవర్తింపదు. 39. తరువాత సమాధిలోనున్న వాడై దేహమును ఓంకారంతో నింపవలెను. ఆ తరువాత యోగి ఓంకారమయుడగును. నశింపడు అక్షరుడగును (నశింపనివాడగును)-40.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున అరిష్టములు అను పందొమ్మిదవ యధ్యాయము-19.