59 -  ఋషిలక్షణం

సూత ఉవాచ: -

యుగేషు యాస్తు జాయంతే ప్రజాస్తా వై నిబోధత

 ఆసురీ సర్పగోపక్షి పైశాచీ యక్షరాక్షసీ

 యస్మిన్ యుగే చ సంభూతిస్తాసాం యావత్తు జీవితమ్

 పిశాచాసురగంధర్వయక్షరాక్షస పన్నగాః

యుగమాత్రం తు జీవంతి ఋతేమృత్యు వధేన తే

 మానుషాణాం పశూనాం చ పక్షిణాం స్థావరైః సహ

 తేషామాయుః పరిక్రాంతం యుగధర్మేషు సర్వశః

అస్థితిస్తు కలౌ దృష్టా భూతానామాయుషస్తు వై

 పరమాయుః శతం త్వేతన్మనుష్యాణాం కలౌ స్మృతమ్

 దేవాసురప్రమాణాత్తు సప్తసప్తాంగులం హ్రసత్

 అంగులానాం శతం పూర్ణమష్ట పంచాశదుత్తరమ్

 దైవాసురప్రమాణం తదుచ్ఛ్రాయం కలిజైః స్మృతమ్

 చత్వారశ్చాప్యశీతిశ్చ కలిజైరంగులైః స్మృతమ్

స్వేనాంగుల ప్రమాణేన ఊర్థ్వమాపాదమస్తకమ్

ఇత్యేష మానుషోత్సధో హ్రసతీహ యుగాంతికే

సర్వేషు యుగకాలేషు అతీతానాగతేష్విహ

సేనాంగుల ప్రమాణేన అష్టతాలః స్మృతో నరః

 ఆపాదతో మస్తకం తు నవలాలోభవేత్తు యః

 సంహతాజానుబాహుస్తు ససురైరపి పూజ్యతే

గవాశ్వశాస్తినాం చైమహిషస్థావరాత్మనామ్

 క్రమేణైతేన యోగేన హాసవృద్దీ యుగే యుగే

 షట్సప్తత్యంగులోత్సేధః పశూనాం కకుదస్తు వై

 అంగులాష్టశతం పూర్ణముత్సేధః కరిణాం స్మృతః

అంగులానాం సహస్రం తు చత్వారినాంగులం వినా

 పంచాశతం హయానాం చ ఉత్సేధః శాఖినాం స్మృతః

 మానుషస్య శరీరస్య సన్నివేశస్తు యాదృశః

తల్లక్షణాస్తు దేవానాం దృశ్యతే తత్త్వదర్శనాత్

బుద్ధ్యాతిశయ యుక్తం చ దేవానాం కాయముచ్యతే

 దేవానతిశయం చైవ మానుషం కాయముచ్యతే

 ఇత్యేతే వై పరిక్రాంతా భావా యే దివ్యమానుషాః

 పశూనాం పక్షిణాం చైవ స్థావరాణాం నిబోధత

 గావోహ్యజా మహిష్యోSశ్వాహస్తినః పక్షిణో నగాః

ఉపయుక్తాః క్రియా స్వేతే యజ్ఞయాస్విహ సర్వశః

 దేవస్థానేషు జాయంతే తద్రూపా ఏవ తే పునః

 యథాశయోపభోగాస్తు దేవానాం శుభమూర్తయః

తేషాం రూపానురూపైస్తైః ప్రమాణైః స్థాణుజంగమైః

 మనోజ్ఞై స్తత్వభావజ్ఞైః సుఖినో హ్యుపపేదిరే

సూతుడనెను:- యుగములలోబుట్టు ప్రజలను వినుడు. ఏయుగమున అసురజాతి పుట్టుకయు, సర్ప-గో-పక్షి పిశాచజాతి పుట్టుకయు, యక్షరాక్షస జాతి పుట్టుకయు గలుగునో వారి జీవితము మొత్తము (నిండు)గా నుండును. పిశాచులు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు-వీరు మృత్యు వధలు లేకుండగా ఒక్కయుగమంతయు జీవింతురు. స్థావరములతోబాటు మనుష్యులయొక్కయు, పశువులయొక్కయు, పక్షులయొక్కయు ఆయువు యుగధర్మములలో నంతటను వ్యాపించినది కలియుగమునందు ప్రాణుల యాయుష్యమునకు ఒక స్థితి కనబడదు. కలియందు మనుష్యులకు పరమాయువు నూరేండ్లనబడినది. దేవాసురుల ప్రమాణమునుండీ మేడంగుళములు తగ్గుచు (మానవుల యెత్తు) నిండుగా నూటయేబదియెనిమిది యంగుళములైనది. కలియందు బుట్టినవారిచే దేవ-అసురులయెత్తుల ప్రమాణము వారిఎనుబది నాలుగంగుళములుగా జెప్పబడినది-6. మనుష్యుని పాదములనుండి తలవరకు గలయెత్తు తన యంగుళ ప్రమాణముతో జెప్పబడినది. ఈ మనుష్యుని యెత్తు ఇచట కలియుగమున తగ్గుచుండును. అన్నియుగముల కాలములలోను, భూతభవిష్యత్కాలములలోను తన యంగుళ ప్రమాణముతో నరుడు ఎనిమిది తాలముల ప్రమాణముగలవాడుగా నుండును. (తాలము=బొటన వేలు నడిమివేలు ఇవి రెండును చాచగా నేర్పడిన నడిమికొలత) అని చెప్పబడినాడు. పాదమునుండి తలవజుకు తొమ్మిది తొలముల ప్రమాణము ఎత్తుగలవాడును, శరీరమధ్యమునకు సందులులేక యాను కొనగలిగి మోకాళ్లవజుకు పొడవుగా నున్నబాహువులు(చేతులు)గలవాడు అసురులచేత గూడ పూజింపబడును-9: గోవులు, ఏనుగులు, దున్నపోతులు మజీకదలక స్థిరముగా నుండు వృక్షాదులు-వీనికి ప్రేకాలయోగము చేత యుగయుగమున తరగుట పెఱుగుట యును గలుగుచుండును-. పశువుల(యెద్దుల) మూపురము డెబ్బది యాజుంగుళముల యెత్తుండుననియు, ఏనుగల యెత్తుసంపూర్ణముగా ఎనిమిది వందల యంగుళములుండుననియు వృక్షములకుండుననియు. జెప్పబడినది. ఐదువందల యంగుళములు గుఱ్ఱములకుండుననియు జెప్పబడినది. తత్త్యదర్శనము జేసినందున మనుష్య శరీర సన్నివేశము వంటిదే దేవతల శరీరసన్నివేశము(కూర్పు) ఉండునని కనుగొనబడినది. దేవతల శరీరము బుద్ధ్యతిశయముతో గూడినదనియు, దేవతలను మించని మనుష్యశరీరమనియు జెప్పబడినది. ఇయ్యవి దేవమనుష్యులను జుట్టియున్న భావములు. పశువులయొక్క పక్షుల యొక్కయు స్థావరములైన వృక్షాదులయొక్కయు, భావములను వినుడు. గోవులు, మేకలు, దున్నలు, గుఱ్ఱములు ఏనుగులు, పక్షులు, పర్వతములు. ఇవి యిచట(భూలోకమున) యజ్ఞ క్రియలలో నంతట నుపయుక్తములైనవి- ఆ రూపములలో నుండియే యవి మరల దేవస్థానములలో బుట్టును. దేవతలయొక్క శుభమూర్తులు వారి యాశయముననుసరించిన యుపభోగములగును. వానియొక్క రూపములకు తగిన ప్రమాణములు గలిగినట్టియు, మనోహరములైనట్టియు, సత్యభావములను దెలిసినట్టి స్థావరజంగమములచే సుఖవంతులు సమీపించిరి.

అతఃశిష్టాన్ ప్రవక్ష్యామి సతః సాధూంస్తథైవ చ

 సదితి బ్రహ్మణః శబ్దస్తద్వంతో యే భవంత్యుత

సాయుజ్యం బ్రహ్మణోఽ త్యంతం తేన సంతః ప్రచక్ష్యతే

 దశాత్మకే యే విషయే కారణే చాష్టలక్షణే

న క్రుద్ధ్యంతి న హృష్యంతి జితాత్మానస్తు తే స్మృతాః

 సామాన్యేషు చ ధర్మేషు తథా వైశేషికేషు చ

 బ్రహ్మక్ష్రత్ర విశోయుక్తా యస్మాత్తస్మాద్ద్విజాతయః

 వర్ణశ్రమేషు యుక్తస్య స్వర్గగోముఖచారణః

 శ్రౌతస్మార్తస్య ధర్మస్య జ్ఞానాద్ధర్మః స ఉచ్యతే

విద్యాయాః సాధనాత్సాధుర్భ్రహ్మచారీగురోర్హితః

 క్రియాణాం సాధనాచ్చైవ గృహస్థః సాధురుచ్యతే

సాధనాత్తపసోఽరణ్యే సాధుర్వైఖానసః స్మృతః

యతమానో యతిః సాధుః స్మృతో యోగస్య సాధనాత్

ఏవమాశ్రమ ధర్మాణాం సాధనాత్ సాధనః స్మృతాః

 గృహస్థో బ్రహ్మచారీచ వానప్రస్థోఽథ భిక్షుకః

 న చ దేవా న పితరో మునయో న చ మానవాః

 అయం ధర్మో హ్యయం నేతి బ్రువంతో భిన్నదర్శనాః

అందువలన శిష్టులను గూర్చియు, సత్పురుషులను గూర్చియు, సాధువులను గూర్చియు జెప్పెదను. సత్ అనునది బ్రహ్మయొక్క(వాచక) శబ్దం బ్రహ్మవంతులు బ్రహ్మసాయుజ్యమున నుందురు. కావున వారు సంతులనబడుదురు. దశాత్మకమైన విషయమైనను అష్టలక్షణములు గల కారణమునను కోపింపక సంతసించియుండువారు జితాత్ములనబడుదుర. సామాన్యధర్మములందును వైశేషిక (విశేష) ధర్మములందును బ్రాహ్మణ-క్షత్రియవైశ్యులు యుక్తులైయుందురు. కావున వారు ద్విజాతులనబడిరి. శ్రాత-స్మార్త ధర్మము యొక్క జ్ఞానమువలన వర్ణాశ్రమములందున్నదియు స్వర్గమార్గము నందాచరించునదియు నైనది ధర్మమనబడున. విద్యను సాధించుట వలన సాధువనబడుచున్నాడు. బ్రహ్మచారియై గురువునకు హితుడై క్రియలను సాధించుట వలన గృహస్థుడు సాధువనబడుచున్నాడు. అరణ్యమున తపస్సును సాధించుట వలన వైఖానసుడు సాధువనబడుచున్నాడు. ప్రయత్నము జేయుచున్న యతి గూడ యోగమును సాధించుట వలన సాధువనబడినాడు. గృహస్థుడును, బ్రహ్మచారియు, వానప్రస్థుడును భిక్షుకుడును. ఈ విధముగ నాశ్రమ ధర్మములను సాధించుటవలన సాధువులనబడినారు. ఇది యధర్మము ఇది యుధర్మము-అని చెప్పువారు. అభిన్నదర్శనులు (జీవాత్మ పరమాత్మైక్యమును జూచువారు. దేవతలు గారు. పితరులుగారు, మునులును గారు. మానవులును గారు, మానవులును గూడ (అభేదము జూచువారు) గారు.

ధర్మాధర్మావిహపోక్త్రౌ శాబ్ధావేతౌ క్రియాత్మకౌ

 కుశలాకుశలం కర్మ ధర్మాధర్మావితిస్మిృతౌ

 ధారణాధృతి రిత్యర్థాద్ధాతోర్ధర్మః ప్రకీర్తితః

 అధారణేఽ మహత్యే చ అధర్మ ఇతిచోచ్యతే

 అత్రేష్టప్రాపకాధర్మా ఆచార్యైరు పదిశ్యతే

వృద్ధాహ్యలోలుపాశ్తైవ ఆత్మవంతో హ్యదంభకాః

 సమ్యగ్వినీతా ఋజవస్తానాచార్యాన్ ప్రచక్షతే

 స్వయమాచరతే యస్మాదాచారం స్థాపయత్యపి

ఆచినోతి చ శాస్త్రార్థాన్యమైః సన్నియమైర్యుతః

పూర్వేభ్యోవేదయిత్వేహ శ్రౌతం సప్తర్షయోఽబ్రువన్

ఋజో యజూంషి సామాని బ్రహ్మణోంగాని చ శ్రుతి

మన్వంతరస్యాతస్య స్మృత్వాచారం పునర్జగౌ

 తస్మాత్స్మార్తః స్మృతో ధర్మో వర్ణాశ్రమ విభాగజః

 స ఏష ద్వివిధో ధర్మః శిష్టాచారే హోచ్యతే

 శేషశబ్దాచ్ఛిష్ట ఇతి శిష్టాచారః ప్రచక్ష్యతే

 మనుః సప్తర్షయశ్చైవ లోకసంతాన కారణాత్

 ధర్మార్థం యే చ శిష్టో వై యాథాతథ్యం ప్రచక్ష్యతే

 మన్వాదయశ్చ యే శిష్టా యేమయా ప్రాగుదీరితాః

 తైః శిష్టై శ్చరితో ధర్మః సమ్యగేవ యుగే యుగే

త్రయీ వార్తాదండనీతిరిజ్యా వర్ణాశ్రమాస్తథా

 శిష్టైరాచర్యతే యాస్మాన్మనునా చ పునఃపునః

పూర్యైః పూర్వగతత్వాచ్చ శిష్టాచారః సశాశ్వతః

 దానం సత్యం తపోఽలోభో విద్యేజ్యా ప్రజనీ దయా

 అష్టేతాని చరిత్రాణి శిష్టాచారస్య లక్షణమ్

శిష్టా యస్మాచ్చరంత్యేనం మనుః సప్తర్షయశ్చ వై

మన్వంతరేషు సర్వేషు శిష్టాచారస్తతః స్మృతః

 విజ్ఞేయః శ్రవణాచ్ఛ్రౌతః స్మరణాత్ స్మార్త ఉచ్యతే

 ఇజ్యా వేదాత్మకః శ్రాతః -స్మార్తో వర్ణాశ్రమాత్మకః

 ప్రత్యంగాని చ వక్ష్యామి ధర్మస్వే హతు లక్షణమ్

ఇచట ధర్మాధర్మశబ్దములు క్రియాత్మకముగా జెప్పబడినవి. కుశలా కుశలకర్మలు ధర్మాధర్మములనబడినవి- 27. ధారణ యనగాధృతియనునర్థముగల (ధ) ధాతువువలన ధర్మమను శబ్దము చెప్పబడినది. ధరింపనపుడు మహత్యము లేనపుడు అధర్మమని చెప్పబడును-28. ఇచట ఇష్టములను (కోరిన వానిని)పొందించు ధర్మములు ఆచార్యులచే నుపదేశింపబడును. వృద్దులు. లోభములేనివారు, ఆత్మవంతులు, దంభములు లేనివారు. మంచి వినయము గలవారు. ఏ వంకరలు లేక చక్కగానడచుకొనువారును-వీరిని ఆచార్యులుగా జెప్పుదురు. ఆచార్యుడు తానాచరించినందునను, ఆచారమును స్థాపించి నందునను, యమములతోను మంచి నియమములతోను గూడిన వాడై శాస్త్రార్థములను పరిశీలించియు చేయదగినవానిని సమకూర్చుకొన్నందునను -అవి యాచారములైనవి. సప్తర్షులు పూర్వుల నుండి తెలిసికొని యిచట (భూలోకమున) శ్రాతమును (వేదధర్మమును) జెప్పిరి. ఋక్కులు(ఋగ్వేదము), యజుస్సులు(యజుర్వేదము), సామములు (సామవేదములు), వేదాంగములును (శిక్ష్యావ్యాకరణ ఛందస్-నిరుక్త-జ్యోతిషములు)-ఇవి శ్రుతి యనబడును. (వీని జెప్పబడిన ధర్మము (శౌతము) గడచిన మన్వంతరము యొక్క యాచారమును స్మరించి యాచారమును మరల ఋష్యాదులు జెప్పిరి. కావున వర్ణాశ్రమ విభాగము వలన బుట్టి స్మరింపబడి ధర్మము స్మార్తమయినది. ఆయీ రెండు విధములైన (తస్మార్త) ధర్మము ఇచట శిష్టాచారమన బడినది. శేషశబ్దమువలన శిష్టశబ్దమేర్పడినది. శిష్టమయిన యాచారము శిస్టాచారమనబడినదీ మన్వంతరములలో మిగిలియున్న వారిట ధార్మికులుగా నుందురు. లోకసంతానకారణమువలన ధర్మార్థముగా మిగిలిన మనువు, సప్తర్షులును ఉన్నది యున్నట్లుగా నాచారమును జెప్పుదురు పూర్వయుగమునుండి మిగిలియీ యుగమునున్న వారును నాచే పూర్వము జెప్పబడినవారునునైన శిష్టులచే ప్రతియుగమున చక్కగా నాచరింపబడినది ధర్మము. త్రయీ, వార్తా, దండనీతి, ఇజ్యా, వర్ణ శ్రమములును శిష్టులచేతను మనువుచేతను పూర్వులచేతను మరల మరల నాచరింపబడినవై పూర్వగతమైనందునను ఆ శిష్టాచారము (ధర్మము) శాశ్వతము-36. దానము, సత్యము, తపస్సు, లోభము లేమి, విద్య, ఇజ్యా, (యాగముచేయుట), ప్రజనీ (సంతానము) దయ-అను నీ యెనిమిదింటి యాచరణములును, ఆచారము యొక్క లక్షణము, సమస్త మన్వంతరములలో శిష్టులును, మనువు సప్తర్షులును నీయాచారము నాచరించుటచే శిష్టాచారమనబడినది. చెవులతో వినుటచే తెలిసినది (భౌతము. స్మరించుట వల్ల వచ్చినది స్మార్తము-అనబడినవి. వేదాత్మమైన యజ్ఞము శ్రాతము. వర్ణాశ్రమాత్మకమైనది స్మార్తము. వాని ప్రత్యంగములను ధర్మము యొక్క లక్షణముగా జెప్పెదను.

దృష్ట్యా ప్రభూతమర్థం యః పృష్టో వై న నిగూహతి

 యథాభూత ప్రవాదస్తు ఇత్యేతత్సత్య లక్షణమ్

 బ్రహ్మచర్యం జపో మౌనం నిరాహారత్వమేవచ

 ఇత్యేతత్తపసో మూలం సుఘోరం తర్దురాసదమ్

పశూనాం ద్రవ్యహవిషా మృక్సామయజుషాం తథా

ఋత్విజాం దక్షిణానాం చ సంయోగో యోగ ఉచ్యతే

 ఆత్మవత్సర్వ భూతేషు యో హితాయాహితాయ చ

 సమాప్రవర్తతే దృష్టిః కృత్స్నా హ్యేషా దయాస్మృతా

 ఆకృష్ణోఽభిహతోవాపి నాక్రోశే ద్యో న హన్తి వా

 వాఙ్మనః కర్మభిః క్షాంతిస్తితక్షైషా క్షమా స్మృతా

స్వామినా రక్ష్యమాణా నాముత్సృష్టానాం చ మృత్యు చ

 పరస్వానామనాదానమలోభ ఇహ కీర్త్యతే

మైథునస్యాసమాచారో హ్యచింతనమ కల్పనమ్

నివృత్తిర్బ్రహ్మచర్యం తదచ్చిద్రం దమఉచ్యతే

ఆత్మార్థం వా పరార్ధం వా ఇంద్రియాణీహ యస్య వై

 న మిథ్యా సంప్రవర్తంతే శమస్యైతత్తు లక్షణమ్

 దశాత్మకే యో విషయే కారణే చాష్టలక్షణే

న క్రుధ్యేత్తు ప్రతిహతః స జీతాత్మా విభావ్యతే

యద్యదిష్టతమం ద్రవ్యం న్యాయేనోపాగతం చ యత్

 తత్తద్గుణవతే దేయమిత్యేతద్దాన లక్షణమ్

 దానం త్రివిధమిత్యేతత్ కనిష్ఠ జ్యేష్ఠ మధ్యమమ్

తత్ర నైశ్రేయసం జ్యేష్ఠం కనిష్ఠం స్వార్థసిద్ధయే

 కారుణ్యాత్సర్వభూతేభ్యః సువిభాగస్తు బంధుషు

అధికధనమును జూచియు ఇతరులడిగినపుడు దాచకుండుట జరిగినది జరిగినట్లు చెప్పుటయు- అను నిది సత్యమట్లు యొక్క లక్షణము బ్రహ్మచర్యము, తపము, మౌనము, ఆహారము లేమియు అనునవి. తపస్సునకు మూలము. అవి భయంకరమై పొందనలవిగానివి. పశువులయొక్కయు, ద్రవ్య-హవిస్సుల యొక్కయు, ఋక్సామ యజుర్వేదముల యొక్కయు, ఋత్విక్కుల యొక్కయు, దక్షిణలయొక్కయు సంయోగము యోగమనబడును-42. తనయందువలనే సర్వప్రాణుల యందును హితాహీతములై సమముగా బ్రవర్తించిన దృష్టియంతయు దయయన బడినది లాగబడినను కొట్టబడినను ఏడువక, కొట్టక మనో-వాక్-కర్మలతో నోరువహించియుండుట క్షమయనబడును మట్టిలో స్వామిచే (ధనస్మామిచే) రక్షింపబడుచున్నవి గాని, యితరులసొమ్ములను దానము జేయుకుండుట యిట అలోభమని చెప్పబడును, మైధునము నాచరింపకుండుట సీసంభోగము చేయకుండుట), దానిని చింతింపకుండుట, దానిని కల్పించుకొనకుండుట ఈ విధముగా దానినుండి నివర్తించుట బ్రహ్మచర్యము. అది యచ్చిద్రమైన(రంధ్రములేని) దమమనబడును. తనకై గాని పరులకై గాని ఇంద్రియములను అసత్యముగా బ్రవర్తింపజేయకుండుట శమముయొక్క లక్షణము-47. దశాత్మకమైన విషయమున ఎనిమిది లక్షణములుగల కారణముండగా ఎట్టయెదుటగొట్టబడియు కోపింపనివాడు జితాత్ముడని విశిష్టముగ భావింపబడును. న్యాయముగా వచ్చినదియు తనకు మిక్కిలి యిష్టమైనదియు నైన ద్రవ్యమును గుణవంతనకీయవలెనని యిచ్చుట దానలక్షణము దానమన్నది కనిష్ఠము, జ్యేష్ఠము, మధ్యమమని మూడు విధములు. అందులో సర్వమంగళమునకై (మోక్షమునకై చేయుదానము జ్యేష్ఠము. స్వార్థసిద్ధికై చేయు దానము కనిష్టము. సర్వభూతములకు కారుణ్యముతో నిచ్చునదియు బంధువులలో చక్కగా విభాగము జేసియిచ్చునది యధమము.

శ్రుతిస్మృతిభ్యాం విహితో ధర్మోవర్ణా శ్రమాత్మకః

 శిష్టాచారావిరుద్ధశ్చ ధర్మఃసత్సాధు సంగతః

 అప్రద్వేషో హ్యనిస్టేషు తథేష్టానభినందనమ్

ప్రీతి తాపవిషాదేభ్యోవినివృత్తిర్విరక్తతా

సంన్యాసః కర్మణో న్యాసః కృతానామకృతైః సహ

కుశలాకుశలానాం చ ప్రహాణం త్యాగ ఉచ్యతే

అవ్యక్తార్యోఽవిశేషాచ్ఛ వికారో ఽస్మిన్నచేతనే

 చేతనా చేతనాన్యత్వ విజ్ఞానం జ్ఞానముచ్యతే

ప్రత్యంగానాం తు ధర్మస్య ఇత్యేత ల్లక్షణం స్మృతమ్

ఋషిభిర్ధర్మతత్తజ్ఞైః పూర్వ స్వాయం భువేంతరే

శృతిస్మృతులచే చెప్పబడినది వర్ణాశ్రమాత్మకమైనది ధర్మము శిష్టాచారమునకు విరుద్ధముగానిది. సత్సాధువులనంటి యున్నది ధర్మము. ఇష్టముగాని వారిని ద్వేషింపకుండుట ఇష్టమైన వారిని అభినందింపకుండుట, ప్రీతి తాపము, విషాదము వీని నుండి మజలిపోవుట-విరక్తతయనబడున. చేసిన వానిని చేయనివాని జేర్చియుంచుట (చేయనట్లుగా భావించుట) సంన్యాసము. కుశలమును అకుశలమును రెంటిని వదలుట త్యాగమనబడును. ఈ అచేతనమున అవ్యక్తమునుండియు అవిశేషమునుండియు వికారము గలుగును. చేతన-అచేతనత్వముల విజ్ఞానమే జ్ఞానమనబడును. పూర్వము స్వాయంభువ మన్వంతరమున ధర్మతత్వజ్ఞుల చేత నీది ధర్మము యొక్క ప్రత్యంగముల లక్షణమని చెప్పబడినది.

అత్ర వోఉర్ధయిష్యామి విధిర్మన్వంతరస్య య

 ఇతరేతరవర్ణస్య చాతుర్వర్ణస్య చైవ హి

 ప్రతిమన్వంతరం చైవ శ్రుతిరన్యా విధీయతే

 ఋచోయజూం షి సామాని యథావత్ప్రతి దైవతమ్

 ఆభూతసంప్లవస్యాపి వర్జ్యైకం శతరుద్రియమ్

విధిర్హోత్ర తథాస్తోత్రం పూర్వవత్సం ప్రవర్తతే

ద్రవ్యస్తోత్రం గుణస్తోత్రం కర్మస్తోత్రం తథైవ చ

 చతుర్థమాభిజనీకం స్తోత్రమేత చ్చతుర్విధమ్

మన్వంతరేషు సర్వేషు యథా దేవా భవంతి యే

 ప్రవర్తయతి తేషాం వై బ్రహ్మస్తోత్రం చతుర్విధమ్

 ఏవం మంత్రగుణానాం చ సముత్పత్తి శ్చతుర్విధా

 అధర్వయజుషాం సామ్నాం వేదేష్విహ పృథక్ పృథక్

ఋషీణాం తప్యతాయుగం తపః పరమదుశ్చరమ్

 మంత్రాః ప్రాదుర్భభూవుర్హి పూర్వమన్వంతరేష్విహ

 పరితోషాద్భయా దుఃఖాత్సుఖాచ్ఛోకాచ్చ పంచధా

ఋషీణాం తపః కార్త్యేన దర్శనేన యదృచ్ఛయా

 ఋషీణాం యదృషి త్వం హి తద్వక్ష్యామిహ లక్షణైః

 ఇచట మీకు మన్వంతరవిధిని ఇతరేతరవిధిని, చాతుర్వర్ణ్య విధిని వివరింతును. ప్రతిమన్వంతరమున వేరు శ్రుతి విధింపబడును. ఋక్కులు యజుస్సులు, సామములు భూతప్రళయమువజుకును ఒక శతరుద్రీయమును వదిలి ప్రతిదేవతను గూర్చి యున్నది యున్నట్లే యుపయోగింపబడును. విధియు, హోత్రమును, స్తోత్రమును పూర్వమువలెనే ప్రవర్తిల్లును. ద్రవ్యస్తోత్రము, గుణస్తోత్రము, కర్మస్తోత్రము ఆభిజనికస్తోత్రమని స్తోత్రము నాలుగు విధములు. మన్వంతరముల యన్నింటిలోనున్న దేవతలకు నాలుగు విధములగు బ్రహ్మస్తోత్రము ప్రవర్తింపజేయబడును. ఈ విధముగ మంత్రగుణముల యుత్పత్తియు నాలుగు విధములు. అథర్వ యజుస్ సామవేదములలో వేరువేరుగానీ లోకమున ఆచరింపనివి కాని యుగ్రతపమును ఋషులాచరించుచుందుర పూర్వమన్వంతరములలోనిట (తపమాచరించు మునుల యొక్క) సంతోషము వలనను, భయమువలనను, దుఃఖమువలనను, సుఖమువలనను, శోకమువలనను, మంత్రములు ఐదు విధములుగా బుట్టినవి. స్వేచ్ఛగా ఋషులతపమును పూర్తిగా జూచుటచేత ఋషుల ఋషిత్వమును లక్షణములతో జెప్పెదను.

అతీతానాగతానాం తు పంచధా ఋషి రుచ్యతే

 అతస్త్వృషీణాం వక్ష్యామి హ్యార్షస్య చ సముద్భవమ్

 గుణసామ్యే వర్తమానే సర్వసంప్రలయే తదా

 అతిచారేతు దేవానామతిదే శౌతయోర్యథా

 అబుద్ధిపూర్వకం తద్యై చేతనార్థం ప్రవర్తతే

 తేనహ్యబుద్ధిపూర్వం తచ్చేతనేన హ్యధిష్ఠితమ్

వర్తతే చ యథా తే తు యథామత్యోదకే ఉధే

 చేతనాధిష్ఠితం తత్త్వం ప్రవర్తతి గుణాత్మనాం

 కరణత్వాత్తథాకార్యం తదా తస్య ప్రవర్తతే

 విషయే విషయిత్వాచ్చ హ్యర్థేహ్య త్వాత్తథైవ చ

 కాలేన ప్రాపణీయేన భేదాస్త కారణాత్మకాః

సంసిద్ధ్యంతి తదా వ్యక్తాః క్రమణేన మహదాదయః

మహతశ్చాప్యహంకారస్తస్మాద్భూతేంద్రియాణి చ

 భూత భేదాస్తు భేదేభ్యో జజ్ఞిరే తే పరస్పరమ్

 సింసిద్ధికారణం కార్యం సద్య ఏవ వివర్తతే

 యథోల్ముకస్త్రుట న్నూర్థ్వమేకకాలం ప్రవర్తతే

తథా వివృత్తః కేత్రజ్ఞః కాలేనైకేన కర్మణా

యథాంధకారే ఖద్యోతః సహసా సంప్రదృశ్యతే

తథా వివృత్తోహ్యవ్యక్తాత్ ఖద్యోత ఇవచోల్బణః

సమహాన్ సశరీరస్తు యత్రైవాగ్రే వ్యవస్థితః

తత్రైవ సంస్థితో విద్వాన్ ద్వారశాలాముఖే స్థితః

మహాంస్తు తమసః పారే వై లక్ష్యణ్యాద్వి భావ్యతే

 తత్రైవ సంస్థితో విద్వాంస్తమసోఽత ఇతి శ్రుతిః

 బుద్ధిర్వివర్తమానస్య ప్రాదుర్భూతా చతుర్విధాః

జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం ధర్మశ్చేతి చతుష్ఠయమ్

సాంసిద్ధికాన్యథైతాని సుప్రతీకాని తస్య వై

 మహతః సశరీరస్య వైవర్త్యాత్యిద్ధి రుచ్యతే

 అత్ర శేతే చ యత్పుర్యాం క్షేత్రజ్ఞానమథాపి వా

 పురీశయత్వాత్పురుషః క్షేత్రజ్ఞానాత్ సముచ్యతే

క్ష్రేత్రజ్ఞః క్షేత్రవిజ్ఞానాత్ భగవాన్ మతిరుచ్యతే

యస్మాద్బుద్ద్వా తు శేతే హతస్మాద్భోధాత్మకః స వై

 సంసిద్దయే పరిగతం వ్యక్తావ్యక్త మచేతనమ్

ఏవం నివృత్తిః క్షేత్రజ్జా క్షేత్రజ్ఞే నాభిసంహితా

 క్షేత్రజ్ఞేన పరిజ్ఞాతో భోగ్యోయంఽ వియస్త్వితి

భూతభవిష్యత్కాలములలోని ఋషులు ఐదువిధములుగా జెప్పబడుదురు. అందువలన ఋషులపుట్టుకను, ఋషి సంబంధముల పుట్టుకను జెప్పెదను. ఏ యెక్కువ తక్కువలులేక సత్యరజస్ తమోగుణములు సమోములై నపుడు సర్వసంప్రలయ మేర్పడును. దేవతలకు ఇంద్రియములకు అతిచారము వచ్చినపుడును అతిదేశమువచ్చినపుడును జరిగినట్లే ఆత్మతత్త్యము చేతనమునకై ప్రవర్తించును. అందుచేత అబుద్ధిపూర్వకముగనే (అనుకోకుండగనే) ఆత్మతత్యము చేతనతో నధిష్ఠింపబడును. చేప, నీరును కలిసియున్నట్లే చేతనాధిష్టితమైన తత్యము గుణ స్వరూపమై ప్రవర్తించును. కరణమగుటవలన దానికి కారణము గూడ ప్రవర్తించును. విషయమున విషయందగుట వలనను అర్థమున అర్థిఅగుట వలన-67, కాలమునుబట్టి పొందదగినభేదములు కారణాత్మకములగును బుట్టినవి. ఆ భూతములయొక్క భేదములు వాని పరస్పర భేదములవలన బుట్టినవి. సంసిద్ధికారణమైన కార్యము అప్పటికప్పుడే మారును. కొఱవి విజుగుచు నొక్కమారుగ పైకి బోవును. అట్లే క్షేత్రజ్ఞుడు, (జీవుడు) ఓకే కర్మతో వివృత్తుడగును. (మార్పుజెందును). చీకటిలో మిణుగురు పురుగు అకస్మాత్తుగా గనుబడినట్లే క్షేత్రజ్ఞుడు (జీవుడు) అవ్యక్తము నుండి మార్పుచెంది (వెలిగిన) మిణుగురు పురుగు వలెనే స్పష్టమయి కనిపించును-71. ఆ మహాన్ (గొప్పవాడు-మహద్రూపుడు) సశరీరుడై యెదుట నున్నచోటనే ద్వారశాలాముఖమునున్నవాడై విద్వాంసుడుండును. మహానుడు తమస్సునకు బయట వైలక్షణ్యము వలన భావింపబడును. అచటనే తమస్సునకు చివర విద్వాంసుడుండునని వేదము చెప్పును. పరిభ్రమించుచు మారుచున్నవాని నాలుగు విధములైన బుద్ధి పుట్టినది. జ్ఞానము-వైరాగ్యము-ఐశ్వర్యము-ధర్మం-అనునవినాలుగువిధములు.ఇక, వస్పష్టములైన సాంసిద్దికములు ఆ మహత్స్వరూపుని సశరీరుడైన మహత్స్వరూపుని యొక్క తిరిగి వచ్చుట వలన సిద్ది కలుగునని చెప్పబడినది. ఇచట పురము (శరీరము) నందు శయనించుటచేత గాని జీవులయొక్క శరీరమున శయనించుట చేతగాని, పురమున శయనించుటవల్లను, క్షేత్రజ్ఞానమువల్లను పురుషుడనబడుచున్నాడు. క్షేత్రజ్ఞుడు (జీవుడు) తన క్షేత్రమగుశరీరమున దెలిసికొనుటచే భగవంతుడైన మతియనబడుచున్నాడు. బుద్దితో శయనించుట వల్లనాతడు బోధాత్మకుడైనాడు. సంసిద్దికొటికి వ్యక్తా వ్యక్తమచేతనమైనది. ఈ విధముగా క్షేత్రజ్ఞ (జీవ) రూపమైన నివృత్తి క్షేత్రజ్ఞు(జీవు)ని చే నభిసంహితమై (కూడినదై)నది క్షేత్రజ్ఞు (జీవు) నిచే పూర్తిగా దెలియబడిన వీడు భోగ్యమైన విషయము అని చెప్పబడినది.

ఋషీత్యేష గతౌధాతుః శ్రుతౌ సత్యే తపస్యథ

 ఏతత్సన్ని యతే తస్మిన్ బ్రహ్మణా సఋషిః స్మృతః

 నివృత్తి సమకాలం తు బుద్ద్యావ్యక్త మృషిః స్వయమ్

 పరం హి ఈషతే యస్మాత్ పరమర్షిస్తతః స్మృతః

 గత్యర్ధా దృషతేర్ధాతోర్నామనిర్వృత్తిరాదితః

యస్మాదేష స్వయంభూతస్తస్మాచ్చాత్మర్షితా స్మృతా

 ఈశ్వరాః స్వయముద్భూతా మానసా బ్రహ్మణః స్మృతాః

 యాస్మాదృషంతి యే ధరా మహాంతం సర్వతో గుణై

 తస్మాన్మహర్షయః ప్రోక్తా ఋద్దేః పరమదర్శినః

 ఈశ్వరాణాం శుభస్తేషాం మానసాంతరసాశ్చతే

 అహంకారం తమశ్చైవ త్యక్త్యా చ ఋషితాం గతాః

తస్మాత్తు ఋషయస్తే వై భూతాదౌ తత్త్వ దర్శనాః

 ఋషిపుత్రా ఋషీకాస్తు మైథునాద్గర్భ సంభవాః

తన్మాత్రాణి చ సత్యం చ ఈషంతే తే మహౌజసః

 సత్యర్షయస్తతస్తే వై పరయాః సత్యదర్శనాః

 ఋషీణాం చ సుతాస్తే తు విజ్ఞేయా ఋషిపుత్రకాః

 ఋషంతి వై శ్రుతం యస్మాద్విశేషాంశ్చైవ తత్త్వతః

తస్మాత్ శ్రుతర్షయస్తేఽ పి శ్రుతస్య పరిదర్శనాః

అవ్వక్తాత్మామహాత్మాచాహంకారాత్మా తథైవ చ

 భూతాత్మాచేంద్రియాత్మాచ తేషాం తఙ్ఞానముచ్యతే

ఇత్యే ఋషిజాతీస్తు నామభిః పంచ వై శృణు

ఋషి యను ధాతువు గతియందును, శ్రుతి యందును, సత్యమునందును తరువాత తపస్సునందును వర్తించును. ఇది (గత్యాద్యర్థము) ఋష ధాతువున సన్నియతముగాగా బ్రహ్మచేత నా ఋషి యాయర్ధముననే స్మరింపబడెను. నివృత్తికి సమకాలముననే బుద్దిచే స్వయముగా ఋషి వ్యక్తమయ్యెను. పరమాతనిచే పొందబడును గాన పరమర్షి యనబడినాడు. మొదటినుండియు గత్యర్థకమైన ఋషధాతువునుండి ఋషినామ నిర్వత్తి జరిగినందునను, ఋషి స్వయంభూతుడగుట వల్లను, ఆత్మర్షి యనబడినాడు. ఈశ్వరులు బ్రహ్మయొక్క మానసము నుండి స్వయముగా బుట్టిన వారనబడినారు-81. గొప్పవాడు ఎదుటనందరితో జుట్టబడినవాడై తక్కువగా లెక్కింపబడడు. ధీరులు అంతటను గుణములచే గొప్పవాని జేరుదురు. అందువలన మహర్షులు బుద్దికంటే పరమమును జూచువారుగా చెప్పబడినారు-82. ఆ ఋషులు ఆ యీశ్వరులకును శుభస్వరూపులు. వారు అహంకారమును తమస్సును వదిలి ఋషీత్వమునుబొందిరి-83. అందువలన నాఋషులు (పంచ) భూతములకు ముందే తత్త్యదర్శనులు (తత్త్యమును జూచువారు) ఋషిపుత్రులైన ఋషీకులు మైధునము వలన గర్భంనుండి బుట్టినవారు-84. ఈ మహౌజస్కులు తన్మాత్ర (శబ్దస్పర్శరూప రసగంధము)లను, సత్యమును బొందుదురు. అంతవారు సత్యర్థులై పరములై సత్యదర్శనులగుదురు. 85. ఋషులయొక్క పుత్రులైన వారు ఋషి పుత్రకులు, శ్రుతమును దాని విశేషములను నిజముగా బొందుచున్నారు గావున శ్రుతమును (వేదమును) పూర్తిగా జూచువారై వారు శ్రుతరులగుదురు-86. అవ్యక్తాత్మ-మహాత్మ-అహంకారాత్మ-భూతాత్మ-ఇంద్రియాత్మ-అని యాఋషుల జ్ఞానముగా జెప్పబడినది. ఈ విధముగా ఋషుల జాతులు పేరులతో నైదు వానిని వినుడు-87.

భృగుర్మరీచిరత్రిశ్చ అంగిరాః పులహఃక్రతుః

మనుర్ధక్షోవసిష్ఠశ్చ పులస్త్యశ్చేతి తే దశ

 ప్రవర్తంతే ఋషేర్యస్మాత్ మహాంస్తస్మాన్మ హర్షయః

ఈశ్వరాణాం సుతాస్త్యేతే ఋషయస్తాన్ని బోధత

కావ్యో బృహస్పతిశ్చైవ కశ్యపశ్చోశవాస్తధొ

ఉతధ్యోవామదేవశ్చ అపోజ్య శ్చై శిజస్తథా

కర్దమో విశ్రవాః శక్తిర్వాలఖిల్య స్తథాధరాః

ఇత్యేతే ఋయఃప్రోక్తా జ్ఞానతో ఋషితాం గతాః

ఋషిపుత్రానృషికాంస్తు గర్భోత్పన్నా నిబోధత

వత్సరో నగ్రహూశ్చైవ భారద్వాజస్త థైవ చ

బృహదుత్థః శరద్వాంశ్చ అగస్త్యశ్చౌశిజ స్తథా

ఋషిర్దీర్ఘతమాశ్చైవ బృహదుక్థః శరద్వతః

వాజశ్రవాః సువిత్తశ్చ సువాగ్వేష పరాయణః

దధీచః శంఖమాంశ్చైవ రాజావై శ్రవణ స్తథా

ఇత్యేతే ఋషికాః ప్రోక్తా స్తే సత్యాదృషితాం గతాః

భృగువు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, మనువు, దక్షుడు, వసిష్ఠుడు, పులస్త్యుడు- అని వారు పదుగురు-88. మహాత్ములై ప్రవర్తించినందున నాఋషులు మహర్షులనబడినారు. ఈ ఋషులు ఈశ్వరులయొక్క సుతులు. వారిని గూర్చి వినుడు-89. కావ్యుడు, బృహస్పతి, కశ్యపుడు, ఉశనసుడు, ఉతథ్యుడు, వామదేవుడు, అపోజ్యుడు, ఐశిజుడు, కర్దముడు, విశ్రవసుడు, శక్తి, వాలఖిల్యులు, ధరులు-అనువీరు జ్ఞానమున ఋషిత్వముబొందిన ఋషులుగా జెప్పబడినారు. ఋషిపుత్రులై గర్భమున బుట్టిన ఋషికులను గూర్చి వినుడు. వత్సరుడు,నగ్రహుడు, భారద్వాజుడు, బృహదుక్తుడు, శరద్వతుడు, అగస్త్యుడు, ఔశిజుడు, దీర్ఘతమర్షి, బృహదుక్తుడు, శరద్వతుడు. వాజశ్రవసుడు, సువిత్తుడు, సువాక్కు వేష పారయణుడు, దధీచుడు, శంఖమంతుడు, వైశ్రవణరాజు-అనువీరు సత్యమువలన ఋషిత్వమును బొందిన ఋషికులుగా జెప్పబడినారు.

ఈశ్వరా ఋషికాశ్చైవ యే చాన్యే వై తథా స్మృతాః

 ఏతే మంత్రకృతః సర్వే కృత్స్న శస్తాన్నిబోధత

 భృగుః కావ్వః ప్రచేతాస్తు దధీచోప్యత్మవానపి

 జౌర్వోఽథ జమదగ్నిశ్చ విదః సారస్వతస్తథా

 అద్విషే హ్యరూపశ్చ వీతహవ్యః సుమేధసః

వైన్యఃపృథుర్దివోదాసః ప్రశ్వారోగృత్సమాన్నభః

ఏకోనవింశదిత్యేతే ఋషయో మంత్రవాదినః

ఆంగిరా వేధసశ్చైవ భారద్వాజోఽథబాష్కలిః

 తథా మృతస్తథా గార్గ్యః శేనీ సంహృతిరేవ చ

పురుకుత్సోఽథమాంధాతా అంబరీషస్తథైవ చ

 ఆహార్యోఽ థా జామిఢశ్చ ఋషభో బలిరేవ చ

పృషదశ్వో విరూపశ్చ కద్వొశ్చైవాథ ముద్గలః

 యువనాశ్వః పౌరుకుత్సస్త్రాసదస్యుః సుదస్యుమాన్

 ఉతద్యశ్చభరద్వాజ స్తథావాజ శ్రవాఅపి

ఆయాప్యశ్చసువిత్తిశ్చ వామదేవస్తవైవ చ

 జౌగజోబృహదుక్థశ్చ ఋషిర్దీర్ఘ తపాస్తథా

కక్షీవాంశ్చత్రయ్సత్రింశత్ స్మృతా అంగిరసోవరాః

ఏతే మంత్రకృతాః సర్వేకాశ్యపాంస్తు నిబోధత

 ఈశ్వరులు, ఋషికులు, అట్లే చెప్పబడిన తక్కినవారును-వీరందరు మంత్రకర్తలు వారిని గురించి పూర్తిగా వినుడు. భృగువు, కావ్యుడు, ప్రచేతసుడు, దధీచి, ఆత్మవంతుడు, ఔర్వుడు, జమదగ్ని, విదుడు, సారస్వతుడు. అద్విణుడు, అరూపుడు, వీతరావ్యుడు, సుమేధసుడు, వైన్యుడు, పృథువు, దివోదాసుడు, ప్రశ్వారుడు, గృత్సమదుడు, నభుడు ఈపంతొమ్మండు ఋషులు మంత్రవాదులు. అంగిరసుడు, వేధసుడు, భారద్వాజుడు, బాష్కలి, అమృతుడు, గౌర్యుడు, శానీ, సంహృతి. పురుకుత్సుడు, మాంధాత, అంబరీషుడు, ఆహార్యుడు, అజామీఢుడు, ఋషభుడు, బలి. పృషదశ్వుడు, విరూపుడు, కణ్వుడు, ముద్గలుడు, యువనాశ్వుడు, పౌరుకుత్సుడు, త్రాసదస్యుడు, దస్యుమంతుడు-100. ఉతథ్యుడు, భరద్వాజుడు, వాజశ్రవసుడు, ఆయాప్యుడు, సువిత్తి, వామదేవుడు, జౌగజుడు, బృహదుక్తుడు, దీర్ఘతపుడు, కక్షివంతుడు ఈ ముప్పది ముగ్గురు అంగిరసోవరులనబడిరి. వీరందరు మంత్రకర్తలు ఇక కాశ్యపులను వినుడు.

కాశ్యపశ్చైవ వత్సారో విభ్రమో రైభ్య ఏవ చ

అసితో దేవలశ్చైవ షడేతే బ్రహ్మవాదినః

అత్రి రర్చిసనశ్చైవ శ్యామావాశ్చావనిష్ఠురః

వల్గూతకో మునిర్ధీమాంస్తథా పూర్వాతిధిశ్చ యః

ఇత్యేతే చాత్రయః ప్రోక్తాః మంత్రరామహర్షయః

వశిష్ఠశ్చైవ శక్తిశ్చ తథైవ చ పరాశరః

 చతుర్థ ఇంద్రప్రమతిః పంచమస్తు భరద్వసుం

షష్ఠస్తు మైత్రావరుణః కుండినః సప్తమస్తథా

 సుద్యుమ్నశ్చాష్ట మశ్చైవ నవమోఽథ బృహస్పతిః

 దశమస్తు భరద్వాజో మంత్ర బ్రాహ్మణ కారకా

 ఏతే చైవ కార్తరో విధర్మధ్వంసకారిణః

 లక్షణం బ్రహ్మణశ్చైతద్విహితం సర్వశాఖినామ్

కాశ్యపుడు, వత్సారుడు, విభ్రముడు, రైభ్యుడు అసితుడు, దేవలుడు,- ఈయాజుగురు బ్రహ్మవాదులు. అత్రి అర్చిసనుడు, శ్యామావంతుడు, నిష్టురుడు, వల్లూతకుడు, మునిధీమంతుడు, పూర్వాతిథి- వీరు అత్రులనబడిరి. వీరు మంత్రకారులైన మహర్షులు. వసిష్ఠుడు, శక్తి, పరాశరుడు, నాల్గవవాడు ఇంద్రప్రమతి, ఐదవ వాడు భరద్వసువు, ఆజవవాడు మైత్రావరుణుడు, ఏడవ వాడు కుండినుడు, ఎనిమిదవ వాడు సుద్యుమ్నుడు, తొమ్మిదవ వాడు, బృహస్పతి, పదవవాడు భరద్వాజుడు- వీరు మంత్ర బ్రాహ్మణ కారకులు. వీరుకర్తలు, విధర్మధ్వంసకారులు. స్వర్వశాఖీయుల బ్రహ్మకు (వేదమునకు) ఇది లక్షణముగా జెప్పబడినది.

హేతుర్హితేః స్మృతో ధాతో ర్యన్నిహంత్యుదీతం పరైః

 అథవార్థపరిప్రాప్తేః హి నోతేగతికర్మణః

 తథా నిర్వచనం భ్రూయాదాక్యార్థ స్యావధారణమ్

 నిందాం తామహురాచార్యాః యద్దోషాన్నింద్యతే వచః

 ప్రపూర్వాచ్ఛం సతే ర్దాతోః ప్రశంసాగుణవత్తయా

ఇదం త్విదమిదం వేదమిత్యనిశ్చిత్య సంశయః

ఇదమేవ విధాతవ్యమిత్యయం విధిరుచ్యతే

అన్యస్యాన్యస్య చోక్తత్వాద్బుధైః పరకృతిః స్మృతాః

 యోహ్యత్యంతతరోక్తశ్చ పురా కల్పః స ఉచ్యతే

 పురా విక్రాంతవాచిత్వాత్ పురాకల్పస్య కల్పనా

 మంత్రబ్రాహ్మణకల్పైస్తు నిగమైః శుద్ధవిస్తరైః

అనిశ్చిత్య తామహుర్వ్యవధారణ కల్పనామ్

యథాహీదం తథాతద్వై ఇదం వాపి తథైవ తత్

ఇత్యేష హ్యపదేశోఽయం దశమో బ్రాహ్మణస్య తు

 ఇత్యేతద్బ్రాహ్మణస్యాదౌ విహితం లక్షణం బుధః

 తస్య తద్వృత్తి రుద్దిష్టా వ్యాఖ్యా వ్యనుపదం ద్విజైః

 మంత్రాణాం కల్పనం చైవ విధిదృస్టేషు కర్మసు

 మంత్రోమంత్రయతేర్ధాతో ర్బ్రాహ్మణో బ్రహ్మణోఽవనాత్

 అల్పాక్షరమసందిగ్ధం సారవద్వీశ్వతో ముఖమ్

అస్తోభమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః

ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే ఋషిలక్షణం నామోనషష్ఠితమోఽధ్యాయః

  హేతుశబ్దము హననార్థకమైన హి ధాతువునుండి యేర్పడినట్లుగా జెప్పబడినది. ఇతరులచే వనెత్తిన వాదమును ధ్వంసముచేయబడినది. ఇతరులచే లేవనెత్తినవాదమును ధ్వంసము జేయునది అనునర్థమున హేతు శబ్దమేర్పడినది లేదా గతికర్మకమైన హిధాతువువలన కార్యరూపమైన యర్థమును బొందును అనునర్థమున హేతుశబ్దమేర్పడినది. వాక్యార్థమును నిశ్చయించునట్లుగా నిర్వచనమును జెప్పవలయును. ఏ దోషమువలన వాక్కు(మాట) నిందింపబడునో దానిని నిందగా నాచార్యులు జెప్పుదురు. ప్రపూర్వమైన ‘శంసు’ ధాతువునుండి ప్రశంసా పదమేర్పడినది. గుణవంతమని చెప్పుట ప్రశంస ఇది యిది కాదు. అని నిశ్చయింపలేమి సంశయము. ఇదియే చేయతగినది- యనునది విధి యనబడును. ఇతరులకు చెప్పబడుటవలన బుధులచే పరకృతి యనబడును. ఏది యతిమిక్కిలిగా జెప్పబడినదో యది. పురాకల్పమనబడును. పూర్వపు విక్రాంతమును (పరాక్రమించుటను) జెప్పుటవలన పురాకల్పముయొక్క కల్పన జరుగును. మంత్రబ్రాహ్మణ కల్పముల చేతను. శుద్దమై విస్తరమైన నిగమముల (వేదముల) చేతమును నిశ్చయింపక చేయబడిన దానిని వ్యవధారణ కల్పన మందురు. ఇది యెట్లో అది యట్లే ఇది కూడ నెట్లో అది కూడ నట్లే-అని యీ విధమగు బ్రాహ్మణునియొక్క యుపదేశము పదవది. అనునిది బుధుడు బ్రాహ్మణునకు మొదట జెప్పిన లక్షణము. ఆ బ్రాహ్మణునకు ఆ వృత్తి యుద్దేశింపబడినది. బ్రాహ్మణులచే వెంటనే వ్యాఖ్యగూడ ఉద్దేశింపబడినది. వేదవిధిచే జూడబడిన కర్మలలో మంత్రముల కల్పనము గూడ నుద్దేశింపబడినది. మంత్ర యను ధాతువునుండి మంత్రము (శబ్దము) వచ్చినది. బ్రహ్మ (వేదము) యొక్క రక్షణమువలన బ్రాహ్మణుడయినాడు. (వేదరక్షణము బ్రాహ్మణ లక్షణము). అల్పాక్షరములు గలదియు, సందేహము లేనిదియు, సారవంతమైనదియు, విశ్వతోముఖమైన దియు (అంతట ప్రవర్తిల్లునదియు) ఆపులేనిదియు, నిందలేనిదియు సూత్రమని సూత్రవేత్తలు చెప్పుదురు.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ఋషిలక్షణమను నేబదితొమ్మిదవ యధ్యాయము.