33 -  స్వాయంభువంశానుకీర్తనం 

సూత ఉవాచ:-

మన్వంతరేషు సర్వేషు అతీతానాగతేష్విహ ।

తుల్యాభిమానినః సర్వే జాయంతే నామరూపత: ॥

దేవాశ్చ వివిధా యే చ తస్మినన్వంతరేఽధిపాః ।

ఋషయో మానవాశ్చైవ సర్వే తుల్యాభిమానినః॥

మహర్షిసర్గః ప్రొక్తో వై వంశం స్వాయంభువస్య తు ।

విస్తరేణానుపూర్వ్యా చ కీర్త్యమానం నిబోధత॥ 

సూతుడనెను:- భూత భవిష్యత్కాలపు మన్వంతరముల యన్నింటిలోను ఇచట నామరూపములలో సమానాభి మానములు గలిగి-1, అనేక విధములైన యే దేవత లందరు బుట్టిరో వారు ఆ మన్వంతరమున అధిపులు ఋషులును మానవులు గూడ నందరును (దేవతలవలెనే) సమానముగా (నామరూపములలో) నభిమానులు-2. మహర్షుల సృష్టి చెప్పబడినది. ఇక స్యాయంభువ మనువుయొక్క వంశము ననుక్రమముగా విస్తారముగా జెప్పెద వినుడు-3.

మనోః స్వాయంభువస్యాసన్ దశ పౌ త్రాస్తు తత్సమాః ।

యైరియం పృథివీ సర్వా సప్తద్వీప సమన్వితా ॥

ససముద్రాకరవతీ ప్రతివర్షం నివేశితా ।

స్వాయం భువేంఽతరే పూర్వమాద్యే త్రేతాయుగే తదా॥

స్వాయంభువ మనువునకు ఆతనితో సమానులైన పదుగురు పుత్రులుండిరి. వారిచేత సప్త ద్వీపములు గలిగి సముద్రములు నిధులు గలిగిన యీ భూమియంతయు ప్రతి సంవత్సరము వ్యాపించి నివాసముగా జేసికొనబడినది-4 అపుడు స్వాయంభువ మన్వంతరమున మొదటి త్రేతాయుగము-5.

ప్రియవ్రతస్య పుత్రైస్తైః పౌత్రైః స్వాయం భువస్యతుః ।

ప్రజాసర్గ తపోయ్యేగై స్తైరియం వినివేశితాః॥

ప్రియవ్రతాత్ప్రజావంత: వీరాత్కన్యా వ్యజాయత ।

కన్యా సా తు మహాభాగ కర్దమస్య ప్రజాపతేః ॥

కన్యే ద్వేశతపుత్రాంశ్చ సమ్రాట్ కుక్షిశ్చ తే ఉభే ।

తయోర్యై భ్రాతరః శూరాః ప్రజాపతిసమా దశ॥

అగ్నీధ్రశ్చ వపుష్మాంశ్చ మేధా మేధాతిథిర్విభుః ।

జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ హవ్యః సవనః సర్వ ఏవ చ॥

ప్రియవ్రతోఽభిషిషిచ్యైతాన్ సప్తసప్త సుపార్థివాన్ ।

ద్వీపేషు తేషు ధర్మేణ ద్వీపాంస్తాంశ్చ నిబోధత॥ 

ప్రజాసృష్టికి తగిన తపము యోగముగల వారును, స్వాయంభువునకు పౌత్రులును (మనుమలును) ఐన, ప్రియవ్రతుని పుత్రులచే ఈ భూమియంతయు నివాసభూమిగా జేసికొనబడినది-6. వీరుడైన ప్రియ వ్రతునివల్ల సంతానవంతులైనారు. స్వాయంభువ మనువునకు కన్య (దేవహూతి) కలిగెను. ఆ మహాభాగ్యవంతురాలు కర్దమ ప్రజాపతికి భార్యయైనది-7. (ప్రియవ్రతునకు?) సమ్రాట్, కుక్షియను వారలిరువురు కన్యలును, నూరుగురు పుత్రులును గలిగిరి. ఆ యిరువురి కన్యల సోదరులైన పదుగురు శూరులు ప్రజాపతితో సమానులును-8. వారు (1)అగ్నీధ్రుడు, (2)వపుష్మంతుడు, (3)మేధుడు (4)మేధాతిథి (5)విభువు, (6)జ్యోతిష్మంతుడు (7)ద్యుతిమంతుడు, (8)హవ్యుడు, (9)సవనుడు (10)సర్వుడు అనువారు-9. ప్రియవ్రతుడు ధర్మప్రకారముగా నీ యేడుగురిని ఏడు ద్వీపములందు పట్టాభిషిక్తులను జేసెను. ఆ ద్వీపముల వినుడు-10.

జంబూద్వీపే శ్వరం చక్రే ఆగ్నీధ్రం తు మహాబలమ్।

ప్లక్షద్వీపే శ్వరశ్చాపి తేన మేధాతిథిః కృతః॥

శాల్మలౌ తు వపుష్మన్తం రాజానమభిషిక్తవాన్ ।

జ్యోతిష్మంతం కుశద్వీపే రాజానం కృతవాన్ ప్రభు: ॥

ద్యుతిమంతం చ రాజానం క్రౌంచద్వీపే సమాదిశత్ ।

శాకద్వీపేశ్వరం చాపి హవ్యం చక్రే ప్రియవ్రత:॥

పుష్కరాధిపతిం చాపి సవనం కృతవాన్ ప్రభుః॥   

ప్రియవ్రతుడు - మహాబలుడైన అగ్నీధ్రుని జంబూద్వీపమునకు రాజుగా జేసెను. మేధాతిథిని ప్లక్షద్వీపమునకు రాజుగా జేసెను-11. వపుష్మంతుని శాల్మల ద్వీపమునకు పట్టాభిషిక్తుని జేసెను. జ్యోతిష్మంతుని కుశద్వీపమునకు రాజుగా జేసెను–12. ద్యుతి మంతుని క్రౌంచద్వీపమునకు రాజుగా జేసెను. హవ్యుని శాకద్వీపమునకు రాజుగా జేసెను -13. సవనుని పుష్కరద్వీపమునకు రాజుగా జేసెను.

పుష్కరే సవనస్యాపి మహావీతః సుతోఽభవత్ ।

ధాతకిశ్చైవ ద్వావేతౌ పు త్రౌ పుత్రవతాం వరౌ ॥

మహావీతం స్మృతం వర్షం తస్య నామ్నా మహాత్మనః ।

నామ్నా తు ధాతకేశ్చాపి ధాతకీఖండ ఉచ్యతే॥

పుష్కర ద్వీపమున సవనునకు మహవీతుడను పుత్రుడు కలిగెను. (మహావీతుడు) ధాతకియును అను నీయిరువురు పుత్రవంతులు శ్రేష్ఠులైన పుత్రులు -14. మహాత్ముడైన యాతని పేర మహావీత వర్థమని యాదేశము పిలువబడినది. ధాతకియను పేర ధాతకీ ఖండమని కూడ యాదేశము పిలువబడినది-15.

హవ్యో వ్యజనయత్పుత్రాన్ శాకద్వీపేశ్వరాన్ ప్రభుః ।

జలదం చ కుమారం చ సుకుమారం మణీచకమ్॥

వసుమోదం సుమోదాకం సప్తమం చ మహాద్రుమమ్॥

జలదం జలదస్యాథ వర్షం ప్రథమముచ్యతే ।

కుమారస్య చ కౌమారం ద్వితీయం పరికీర్తితమ్॥

సుకుమారం తృతీయం తు సుకుమారస్య కీర్తితమ్ ।

మణీచకస్య చతుర్థం మణీచక మిహోచ్యతే॥

వసుమోదస్య వై వర్షం పంచమం వసుమోదకమ్ ।

మోదాకస్య తు మోదకం వర్షం షష్ఠం ప్రకీర్తితమ్॥

మహాద్రమస్య నామ్నాతు సప్తమం తు మహాద్రుమమ్ ।

ఏషాం తు నామభిస్తానీ సప్తపర్వాణి తత్ర వై॥ 

ప్రభువైన హవ్యుడు శాకద్వీపరాజులైన పుత్రులను గనెను. వారు జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మణీచకుడు, వసుమోదుడు, సుమోదాకుడు, మహాద్రుముడు-అనునేడుగురు-16. జలదునిది జలదవర్షము (దేశము) మొదటిది. కుమారునిది కౌమారవర్షము రెండవది-17 సుకుమారునిది సుకుమారవరము మూడవది, మణీచకునిది మణీచకవర్షము నాల్గవది వసుమోద వర్షము ఐదవది, మోదాకునిది మోదాకవర్షము ఆజవది. మహాద్రుమునిది మహాద్రుమవర్షము ఏడవది. వీరియొక్క నామములతోనే యేడుపర్వములు (దేశములు) ప్రసిద్ధినొందినవి -20.

క్రౌంచద్వీపేశ్వర స్యాపి పుత్రాద్యుతి మతస్తు వై ।

కుశలో మనుగశ్చోష్ణః పీవరశ్చాంధకారకః॥

మునిశ్చ దుందుభిశ్చైవ సుతా ద్యుతిమతస్తు వై॥

తేషాం స్వనామభిర్దేశాః క్రౌంచద్వీపాశ్రయాః శుభాః ।

ఉష్ణస్యోష్ణః స్మృతో దేశః పీవరస్యాపి పీవరః॥

అంధకారక దేశస్తు అంధకారశ్చ కీర్త్యతే ।

మునేస్తు మునిదేశో వై దుందుభేర్దుందుభిః స్మృతః॥

ఏతే జనపదాః సప్త క్రౌంచద్వీపే తు భాస్వరా:॥  

క్రౌంచద్వీప రాజైన ద్యుతిమంతునకు గూడ పుత్రులున్నారు. వారు కుశలుడు, మనుగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారుడు, మునిదుందుభి-యనువారు ఏడుగురు ద్యుతిమంతుని పుత్రులు -21. వారి స్వనామములతో వెలసి క్రౌంచద్వీపాశ్రయములైన దేశములు శుభములు. ఉష్ణుని దేశము ఉష్ణమనబడినది. పీవరునిది పీవరమనియు-22. అంధకారకుని దేశము అంధకారమనియు, మునియొక్క దేశము మునియనీయు, దుందుభిది దుందుభియనియు అనబడినవి. క్రౌంచద్వీపములోని యీ యేడు దేశములు భాస్వరములు ప్రకాశవంతములు -23.

జ్యోతిష్మతః కుశద్వీపే సప్తైతే సుమహౌజస ।

ఉద్భిదో వేణుమాంశ్చైవ స్త్వెరథో లవణో ధృతిః॥

షష్ఠః ప్రభాకరశ్చైవ సప్తమః కపిలః స్మృతాః ॥

ఉద్భిదం ప్రథమం వర్షం ద్వితీయం వేణుమండలమ్ ।

తృతీయం స్యైరథాకారం చతుర్థం లవణం స్మృతమ్॥

పంచమం ధ్రుతిమద్వర్షం షష్ఠం వర్షం ప్రభాకరమ్ ।

సప్తమం కపిలం నామ కపిలస్య ప్రకీర్తితమ్॥

తేషాం ద్వీపాః కుశద్వీపే తత్సనామాన ఏవ తు ।

ఆశ్రమాచారయుక్తాభిః ప్రజాభిః సమలంకృతా: ॥    

కుశద్వీపమున జ్యోతిష్మంతునకు చక్కని మహాతేజస్వులైన యేడుగురు పుత్రులు వీరు- ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరథుడు, లవణుడు, ధృతి, ఆరవవాడు ప్రభాకరుడు, ఏడవవాడు, కపిలుడును అనువారు -24. మొదటి వర్షము (దేశము) ఉద్భిదము, రెండవది వేణుమండలము. మూడవది స్యైరథాకారము. నాలుగవది లవణము. అనబడినది-25. ఐదవది. ధ్రుతిమద్వర్షము ఆజవది ప్రభాకర వర్షము, ఏడవది కపిలునిది కపిలమనబడినది -26. కుశద్వీపములోనున్న వారి ద్వీపములు వారి పేరులతోనే వెలసినవి. అవి బ్రహ్మచర్యాది ఆశ్రమములయాచారములతో గూడిన ప్రజలచే నలంకరింపబడినవి -27.

శాల్మలస్యేశ్వరాః సప్త పుత్రా స్తేతు వపుష్మత ।

శ్వేతశ్చ హరితశ్చైవ జీమూతో రోహిత స్తథా॥

వైద్యుతో మానసశ్చైవ సుప్రభ: సప్తమస్తథా॥

శ్వేతస్య శ్వేతదేశస్తు రోహితస్య చ రోహితః ।

జీమూతస్య చ జీమూతో హరితస్య చ హారితః॥

వైద్యుతో వైద్యుతస్యాపి మానసస్యాపి మానసః ॥

సుప్రభః సుప్రభస్యాపి సప్తైతే దేశపాలకాః॥     

(శాల్మలరాజైన) వపుష్మంతుని పుత్రులు ఏడుగురు వారుశాల్మల ద్వీపాధిపతులు వారు- శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు, ఏడవవాడు సుప్రభుడు అనువారు-28. శ్వేతునిది శ్వేతదేశము రోహితునిది రోహితము జీమూతునిది జీమూతము హరితునిది హారితము-29. వైద్యుతునిది వైద్యుతము మానసునిది మానసము. సుప్రభునిది సుప్రభము. ఈ ఏడుగురు ఈ దేశములకు పాలకులు-30.

సప్తద్వీపే తు వక్ష్యామి జంబుద్వీపాద నంతరమ్ ।

సప్త మేధాతిథేః పుత్రాః ప్లక్షద్వీపేశ్వరా నృపా: ॥

జ్యేష్ఠః శాంతభయస్తేషాం సప్తవర్షాణి తాని వై ।

తస్మాఛ్చాంత భయాచ్చైవ శిశిరస్తు సుఖోదయ:॥

ఆనందశ్చ ధ్రువశ్చైవ క్షేమకశ్చ శివస్తథా।

తాని తేషాం స నామాని సప్తవర్షాణి భాగశః ।

నివేశితాని తైస్తాని పూర్వే స్వాయంభువేఽన్తరే॥      

జంబుద్వీపము తరువాత సప్తద్వీపమున (సముదాయమున) జరిగిన విషయమును జెప్పెదను. ప్లక్ష ద్వీపాధిపతియైన మేధాతిథి యొక్క పుత్రులు ఏడుగురు ప్లక్ష ద్వీపరాజులైరి-31. వారిలో జ్యేష్ఠుడు శాంతభయుడు ఆ ఏడు వర్షములను (దేశములను) ఏలెను. ఆ శాంత భయుని తజువాత శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, ధ్రువుడు, క్షేమకుడు, శివుడు అనువారు ఆ ఏడు వర్షములనేలిరి-32. ఆ యేడు వర్షములు ఏడు భాగములుగా వారి వారి పేరులతోనే పూర్వము స్వాయంభువమన్వంతరమున పరిపాలింపబడినవి -33.

మేధాతిథేస్తు పుత్రస్తైః సప్తద్వీప నివాసిభిః ।

వర్ణాశ్రమాచారయుక్తాః ప్లక్షద్వీపే ప్రజాః కృతాః॥

ప్లక్ష ద్వీపాదికే ష్వేవ శాకద్వీపాన్తరేషు వై ।

జ్ఞేయః పంచసుధర్మో వై వర్ణాశ్రమ విభాగశః॥

సుఖమాయుశ్చ రూపం చ బలం ధర్మశ్చ నిత్యశః ।

పంచ స్వేతేషు ద్వీపేషు సర్వం సాధారణం స్మృతమ్॥     

ప్లక్ష ద్వీపమున సప్తద్వీప నివాసులైన మేధాతిథి పుత్రులచేత ప్రజలు వర్ణాశ్రామాచారములతో గూడిన వారుగా జేయబడిరి-34. ప్లక్ష-శాల్మల-కుశ-క్రౌంచ-శాకద్వీపములైదింటిలోనే వర్ణాశ్రమవిభాగము ప్రకారము ధర్మముండెనని తెలియదగును-35. సుఖము, ఆయువు, రూపము, బలము, ధర్మమున్ను ఈ ఐదు ద్వీపములందునిత్యము సర్వ సాధారణముగా నుండెడివనీ తెలియబడినది-36.

సప్తద్వీప పరిక్రాంతం జంబూద్వీపం నిబోధత ।

ఆగ్నీధ్రం జ్యేష్ఠదాయాదం కన్యాపుత్రం మహాబలమ్॥

ప్రియవ్రతో ఽభ్యషించత్తం జంబుద్వీపేశ్వరం నృపమ్॥

తస్య పుత్రా బభూవుర్హి ప్రజాపతి సమేజసః ।

జ్యేష్ఠో నాభిరితి ఖ్యాత స్తస్య కింపురుషోఽనుజః॥

హరివర్ష స్తృతీయస్తు చతుర్థో ఽభూదిలావృతః ।

రమ్యః స్యాత్పంచమః పుత్రో హరిన్మాన్ షష్ఠ ఉచ్యతే॥

కురుస్తు సప్తమస్తేషాం భద్రాశ్వో హ్యాష్టమః స్మృతః ।

నవమః కేతుమాలస్తు తేషాం దేశాన్ని బోధత॥      

ఏడు ద్వీపములతో జుట్టియున్న జంబూద్వీపమును గూర్చి వినుడు. ఆగ్నీధ్రుడు జ్యేష్ఠదాయాదుడు ద్రాయభాగమును హరించువాడు). కన్యాపుత్రుడు మహాబలుడు. ప్రియవ్రతుడు ఆతనిని జంబూద్వీపమునకధిపతియైన రాజునుగా పట్టాభిషిక్తుని జేసెను-37. ఆతనికి తొమ్మండుగురు పుత్రులుండిరి. వారు బ్రహ్మాతో సమానమైన తేజముగలవారు. వారిలో జ్యేష్ణుడు నాభియను వాడుగా బ్రసిద్ధిజెందెను. ఆతని తమ్ముడు కింపురుషుడనువాడు -38. మూడవ వాడు హరివరుడు నాలుగవవాడు ఇలావతుడు. ఐదవ కుమారుడు రమ్యుడు. ఆరవవాడు. హరిన్మంతుడు -39. ఏడవవాడు కురువు. ఎనిమిదవవాడు. భద్రాశ్వుడు. తొమ్మిదవ వాడు కేతుమాలుడు- అనువారు వారిదేశములను వినుడు -40.

నాభేస్తు దక్షిణం వర్షం హిమాహ్వంతు పితా దదౌ ।

హేమకూటం తు యద్వర్షం దదౌ కింపురుషాయ తత్॥

నైషధం యత్ స్మృతం వర్షం హరివర్షాయ తద్దదౌ ।

మధ్యమం యత్సుమేరోస్తు స దదౌ తదిలావృతే॥

నీలం తు యత్ స్మృతం వర్షం రమ్యాయైతత్ పితా దదౌ ।

శ్వేతం యదుత్తరం తస్మాత్ పిత్రా దత్తం హరిన్మతే॥

యదుత్తరం శృంగవతో వర్షం తత్కురవే దదౌ ।

వర్షం మాల్యవతశ్చాపి భద్రాశ్వాయ న్యవేదయత్॥

గంధమాదనవర్షం తు కేతుమాలే న్యవేదయత్ ।

ఇత్యేతాని మహాన్తీహ నవవర్షాణి భాగశః॥

ఆగ్నీధ్రస్తేషు సర్వేషు పుత్రాంస్తానభ్యషించ త ।

యథాక్రమం స ధర్మాత్మా తతస్తు తపసి స్థితః॥

ఇత్యేతైః సప్తభిః కృత్స్నాః సప్తద్వీపా నివేశితాః ।

ప్రియవ్రతస్య పుత్రై స్తైః పౌత్రైః స్వాయంభువస్య తు॥

యాని కింపురుషాద్యాని వర్షాణ్యష్టౌ శుభాని తు ।

తేషాం స్వభావతః సిద్ధిః సుఖప్రాయా హ్యయత్నతః॥

విపర్యయో న తేష్వస్తి జరామృత్యుభయం న చ ।

ధర్మాధర్మౌ న తేష్వాస్తాం నోత్తమాధమ మధ్యమాః॥

న తేష్వస్తి యుగావస్థా క్షేత్రే ష్వేవ తు సర్వశః॥     

అగ్నీధ్రుడు తన మొదటి కుమారుడైన 'నాభి'కి 'హిమ'మను పేరుగల దక్షిణ వర్ష (దేశమునిచ్చెను. కింపురుషునకు హేమకూట వర్షదేశము నిచ్చెను-41. హరివరునకు నైషధమను వర(దేశమునిచ్చెను. ఇలావృతునకు మేరువుయొక్క మధ్యదేశమునిచ్చెను. రమ్యునకు నీలమను వర్షదేశమునిచ్చెను. హరిన్మంతునకు (పైదానికి) ఉత్తరపుదైన శ్వేతమను వర్షదేశమునిచ్చెను-43. కురువునకు శృంగవంతపుటుత్తర దేశమునిచ్చెను. భద్రాశ్వునకు మాల్యవ ద్వదేశము నిచ్చెను 44. కేతుమాలునకు గంధమాద వర్షదేశ)మునిచ్చెను. ఇవి యిట భాగములుగా గొప్పవైన తొమ్మిది వర్ష (దేశములు-45. ధర్మాత్ముడైన ఆగ్నీధ్రుడు వరుసగా తన పుత్రులను పైన జెప్పిన యన్ని (తొమ్మిది) దేశములలో నభిషేకించి తాను తపమున నుండెను -46. ఈ విధముగా స్వాయంభువుని పౌత్రులైన ప్రియవ్రతుని యీ యేడుగురి పుత్రులచే సమస్తములైన సప్తద్వీపములు రాజ్యము చేయబడినవి-47. కింపురుషాదులైన యెనిమిది శుభవర్షదేశములేవి కలవో వానియొక్క సిద్ధ స్వభావసిద్ధముగనే యత్నము లేకుండగనే సుఖముతో నిండినది-48. ఆదేశములలో సుఖవ్యతిరేకమైన దుఃఖము లేదు. ముసలితనము మరణము-వీని భయము లేదు. ఆ క్షేత్రములలో ధర్మాధర్మములు ఉత్తమ-అధమ-మధ్యమములును యుగావస్థయును లేవు. (వీని కతీతములా క్షేత్రములు) -49.

నాభేర్హి సర్గం వక్ష్యామి హిమా హ్వేతన్ని బోధత ।

నాభిస్త్యజనయత్ పుత్రం మేరుదేవ్యాం మహాద్యుతి: ॥

ఋషభం పార్థివ శ్రేష్ఠం సర్వక్షత్రస్య పూర్వజమ్॥

ఋషభాద్బరతో జజ్ఞే వీరః పుత్రశతాగ్రజః ।

సోఽభిషిద్యాథ భరతః పుత్రం ప్రావ్రాజ్యమాస్థితః॥

హిమాహ్వం దక్షిణం వర్షం భరతాయ న్యవేదయత్ ।

తస్మాత్తద్భారతం వర్షం తస్య నామ్నా విదుర్బుధా: ॥

భరతస్యాత్మజో విద్వాన్ సుమతిర్నామ ధార్మికః ।

బభూవ తస్మింస్తద్రాజ్యం భరతః సంన్యయోజయత్॥

పుత్రసంక్రమిత శ్రీకో వనం రాజా వివేశ సః।

తేజసస్తు సుతశ్చాపి ప్రజాపతిరమిత్రజిత్ ।

తైజసస్యాత్మజో విద్వానింద్రద్యుమ్న ఇతి శ్రుతః॥

పరమేష్ఠీ సుతశ్చాథ నిధనే తస్య శోభనః ।

ప్రతీహారకులే తస్య నామ్నా జజ్ఞే తదన్వయాత్॥

ప్రతిహర్తేతి విఖ్యాతో జజ్ఞే తస్యాపి ధీమత: ॥

ఉన్నేతా ప్రతిహర్తుస్తు భువస్తస్య సుతః స్మృతః ।

ఉద్గీథస్తస్య పుత్రోఽభూత్ ప్రతావిశ్చాపి తత్సుతః॥

ప్రతావేస్తు విభుః పుత్రః పృథుస్తస్య సుతో మతః ।

పృథోశ్చాపి సుతో నక్తా నక్తస్యాపి గయః స్మృతః॥

గయస్య తు నరః పుత్రో నరస్యాపి సుతో విరాట్ ।

విరాట్పుత్రో మహావీర్యో ధీమాంస్తస్య సుతోఽభవత్॥

ధీమతశ్చ మహాన్ పుత్రో మహతశ్చాపి భౌవనః ।

భౌవనస్య సుతస్త్వష్టా అరిజస్తస్యచాత్మజః॥

అరిజస్య రజః పుత్రః శతజిద్రజసో మతః ।

తస్య పుత్రశతం త్వాసీద్రాజానః సర్వఏవ తే॥

విశ్వజ్యోతి: ప్రధానాయై స్తైరీమావర్ధితాః ప్రజాః ।

తైరిదం భారతం వర్షం సప్తఖండం కృతం పురా॥

తేషాం వంశప్రసూతైస్తు భుక్తేయం భారతీధరా ।

కృతత్రేతాదియుక్తాని యుగాఖ్యాన్యే కసప్తతి: ॥

యేఽతీతాస్తైగైః సార్థం రాజానస్తే తదవ్యయాః ।

స్వాయంభువేఽన్తరే పూర్వం శతశోఽథ సహస్రశః॥

ఏష స్వాయంభువః సర్గో యేనేదం పూరితం జగత్ ।

ఋషిభిర్దైవ తైశ్చాపి పితృగంధర్వ రాక్షసైః॥

యక్షభూత పిశాచైశ్చ మనుష్యమృగపక్షిభిః ।

తేషాం సృష్టిరియం లోకే యుగైః సహ వివర్తతే॥

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే స్వాయంభువ వంశానుకీర్తనం నామత్రయస్త్రింశోఽధ్యాయః ॥    

హిమవర్షమున నాభియను నాతని సృష్టిని జెప్పుదును. దానిని వినుడు. మహాద్యుతి యైన 'నాభి' మేరుదేవియందు ఋషభుని గనెను. ఋషభుడు సమస్తక్షత్రియజాతికి మొదటి వాడైన రాజశ్రేష్ఠుడు-50. ఋషభుని వలన భరతుడుపుట్టెను. ఆతడు వీరుడు నూరుగురు కుమారులలో మొదటివాడు భరతుడు తన పుత్రునకు రాజ్యాభిషేకముజేసి సన్యాసమును స్వీకరించేను-51. ఋషభుడు దక్షిణ హిమవర్ష(దేశమును భరతున కిచ్చినందున దీనిని భారతవర్షదేశ) మనుపేర పండితులు పిలిచిరి-52. భరతుని కుమారుడు విద్వాంసుడు ధార్మికుడునైన సుమతియను వాడు భరతుడు తన రాజ్యమునాతని కిచ్చెను. పుత్రునకు రాజ్యమును సంక్రమింపజేసి భరతుడు వనమునకు వెళ్లాను-53. తేజసునకు పుత్రుడు శత్రుజేతయైన ప్రజాపతి. తేజసుని మనుమడు జాపతిపుత్రుడు) విద్వాంసుడైన ఇంద్రద్యుమ్నుడు-అనితెలియబడినది-54. తండ్రి మరణానంతరమింద్రద్యుమ్నుడు అందరికిని సుందరుడుగా నుండెను. ఆతని వంశమున నాతనికి ప్రతీహారకులమున 'ప్రతిహర్త' యను పేర పుత్రుడు గలిగెను-55. ప్రతిహర్తకు భూమినుండి ఉన్నేతయను పుత్రుడు కలిగెను. ఉన్నేతకు ఉధీథుడు, ఉధీథునకు, ప్రతావియనువాడును గలిగిరి-56, ప్రతావికి విభువు, విభువునకు పృథువు, పృథువునకు నక్తుడు, నక్తునకు గయుడు, గయునకు నరుడు, నరునకు విరాట్టు, విరాట్టునకు మహావీర్యుడు, మహావీర్యునకు దీమంతుడు బుట్టిరి-58. ధీమంతునకు మహానుడు, మహానునకు భౌవనుడు, భౌవనునకు త్వష్ట, త్వష్టకు అరిజుడును బుట్టిరి-59. అర్జునకు రజుడు రజునకు శతజిత్తు, బుట్టిరి. శతజిత్తునకు నూరుగురు పుత్రులు గలిగిరి. వారందరును రాజులే యైరి-60. ఎవరి చేత ఈ ప్రజలు విశ్వజ్యోతి:ప్రధానులుగా (విశ్వజ్యోతిని వెలిగించుటయే ప్రధానలక్ష్యము గలవారుగా) వర్ధిల్లజేయబడిరో, వారి చేత ఈ భారతవర్షదేశము ఏడు ఖండములు గలదిగా పూర్వము చేయబడినది-61 వారి వంశమునబుట్టిన వారి చేతనే యీ భారత భూమి కృత త్రేతాదులతో గూడిన డెబ్బది యొక్కయుగములు పరిపాలింపబడినది-62. ఏ రాజులు ఆయుగములతో బాటు తాము గతించిరో వారు పూర్వము స్వాయంభువమన్వంతరమున వందలువేలుగానుండి యా వంశమునకు జెందినవారే-63. ఇది స్వాయంభువసృష్టి. దీనిచే జగమునిండినది. ఋషులచేతను, దేవతలచేతను, పితరులచేతను, గంధర్వులచేతను రాక్షసులచేతను-64. యక్ష-భూత-పిశాచులచేతను, మనుష్య-మృగపక్షులచేతను వారి యీ సృష్టిలోకమున యుగములతో బాటు మారుచుండును-65.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున స్వాయంభువ వంశానుకీర్తనమను ముప్పదిమూడవ యధ్యాయము 33.