వాయు మహా పురాణము
25 - మధుకైటభోత్పత్తివినాశ వర్ణం
సూత ఉవాచ:-
సంపిబిన్నివ తౌ దృష్ట్యా మధు పిఙ్గాయతేక్షణః।
ప్రహృష్టవదనోఽత్యర్థ మభవచ్చ స్వకీర్తనాత్॥
ఉమాపతి ర్విరూపాక్షో దక్షయజ్ఞవినాశనః ।
పినాకీ ఖండపరశుర్భూత ప్రాన్తస్త్రిలోచనః ॥
తతః స భగవాన్ దేవః శ్రూత్వా వాక్యామృతం తయోః ।
జానన్నపి మహాభాగః ప్రీత (త్రి)పూర్వమథాఽ బ్రవీత్॥
కౌ భవన్తౌ మహాత్మానౌ పరస్పరహితైషిణౌ।
న మే తావంబుజాభాక్షౌ తస్మిన్ ఘోరే జలప్లవే॥
తావూచతుర్మాహాత్మానౌ సన్నిరీక్ష్యహా పరస్పరమ్ ।
భగవాన్ కిం చ తథ్యేన విజ్ఞాతేన త్వయా విభో॥
కుత్ర వా సుఖమానన్త్యమిచ్ఛాచారమృతే త్వయా॥
సూతుడు పలికెను:- తేనేవలే పిజ్ఞ (గోరోచస) వర్ణముతో విశాలమైన నేత్రములుగల ఉమాపతి తన కన్నులతో త్రాగుచున్నాడాయన్నట్లు ఆ బ్రహ్మ విష్ణువులను జూచి, తనను స్తుతించినందున మిక్కిలి సంతసించిన ముఖము గల వాడయ్యెను-1. ఆ ఉమాపతి, విరూపాక్షుడు (మూడు కన్నులు గలవాడు) దక్షయజ్ఞ ధ్వంసమొనర్చినవాడు, పినాకమను ధనువును ధరించినవాడు, ఖండించెడు గండ్రగొడ్డలి గలవాడు, భూతములున్నచోని వధించువాడు మూడు కన్నులు గలవాడు 2. భగవంతుడు ఐన యా శివుడు ఆ బ్రహ్మ విష్ణువుల యిరువురి యమృతమువంటి వాక్యములు విని, తానెరిగియున్నను, ఆ మహానుభాగుడు ప్రీతిపూర్వకముగా నిట్లనెను-3. పరస్పరహితమును గోరు మహాత్ములైన మీరెవరు? ఆ (యీ) భయంకర ప్రళయ జలమయమైన తెప్పపై కమలాక్షు కూడియున్న మీరిరువురెవరు?-4. అంత ఆ మహాత్ములిరువురును ఒకరి నొకరు చూచుకొనియనిది. భగవాన్! విభో! నీచే నిజముదెలిసి యేమి ప్రయోజనము? నీవు లేక స్వేచ్చా చారరూపమై యంతములేని నిత్య సుఖము ఎక్కడిది.
ఉవాచ భగవాన్ దేవో మధురశ్లక్ష్ణయా గిరా।
భోభో హిరణ్యగర్భత్వాం త్వాంచ కృష్ణవదామ్యహమ్॥
ప్రీతోఽ హమనయా భక్త్యా శాశ్వతాక్షరయుక్తయా ।
భవన్ తౌ మాననీ యౌ వై మమహ్యర్హతరావుజౌ॥
యువాభ్యాం కింద దామ్యద్య వరాణాం వరముత్తమమ్॥
భగవంతుడైన మహాదేవుడు మాధుర్యము నిండిన మాటలలో నిట్లనెను. ఓ బ్రహ్మా! ఓ విష్ణో! మీరిరువురికి నేను జెప్పుచున్నాను-6. నేనే ఈమీ శాశ్వతాక్షరయుక్తమైన (శాశ్వతమై నాశములేని వర్ణమాలలు గల స్తుతితో గూడిన) భక్తిచేత సంతుష్టుడనైతిని. మిక్కిలి పూజినీయులైన మీరిరువురును నాకు గౌరవింపదగినవారు ఇప్పుడు మీ యిరువురికి వరములలో నుత్తమమైన వరమేమి యోయవలెను?-7.
తేనైవ ముక్తే వచనే బ్రహ్మాణం విష్ణుమ బ్రవీత్ ।
బ్రూహి బ్రూహి మహాభాగ వరో యస్తే వివక్షితః॥
ప్రజాకామోఽస్మహ్యం విష్ణో పుత్రమిచ్ఛామి ధూర్వహమ్ ।
తతః స భగవాన్ బ్రహ్మ వరేప్సుః పుత్రలిప్సయా॥
అథ విష్ణురువాచేదం ప్రజాకామం ప్రజాపతిమ్ ।
వీరమప్రతిమం పుత్రం యత్తమిచ్చసి ధూర్వహమ్॥
పుత్రత్వేనాభియజ్షీత్వం దేవదేవం మహేశ్వరమ్ ।
సతస్య వాక్యం సంపూజ్య కేశవస్య పితామహః ॥
ఈశానం వరదం రుద్రమభివాద్య కృతాంజలిః ।
ఉవాచ పుత్రకామస్తు వాక్యాని సహ విష్ణునా॥
యది మే భగవాన్ ప్రీతః పుత్రకామస్య నిత్యశః ।
పుత్రో మే భవ విశ్వాత్మన్ స్వతంత్రో వాపి ధూర్వహః॥
న్యాయం వరమహం వవ్రే ప్రీతే త్వయి మహేశ్వర॥
మహాదేవుడిట్లనగానే విష్ణువు బ్రహ్మతో ఓ మహాభాగ! బ్రహ్మ! నీవడగదలచిన వరమేమియో చెప్పుము చెప్పుము అని యనెను-8. అంత భగవంతుడగు ఓ విష్ణో బ్రహ్మ “నేను సంతానమును గోరుదును.” అని పుత్రప్రాప్తికై వరమును బొందగోరి “భారము వహించగల పుత్రుని గోరు బ్రహ్మతో నిట్లనెను. వీరుడు సాటిలేనివాడు భారమును మోయువాడునైన పుత్రుని గోరినచో-9,10. దేవదేవుడైన మహేశ్వరునే పుత్రుని నీవు కోరుము. అనెను. బ్రహ్మ యాకేశవుని మాటను గౌరవించి “ఈశ్వరుడై నారదుడైన రుద్రునికి చేతులు జోడించి మ్రొక్కి పుత్రకాముడై విష్ణువుతో సహ ఇట్లు పలికెను. భగవంతుడనైన నీవు పుత్రకాముడనైన నా విషయమున సంతుష్టుడవైనచో ఓ విశ్వాత్ముడా నాకు పుత్రుడవు గమ్ము వాడు భారము వహించగలిగి నీతో సమానునిగా నుండవలెను. ఓ మహేశ్వర! నా విషయమై సంతుష్టుడవైన నిన్ను న్యాయమైన యీ వరమును గోరుచున్నాను.
తస్య తాం ప్రార్థనాం శ్రుత్వా భగవాన్ భగనేత్రహా! ।
నిష్కల్మషీమమాయం చ భాఢమిత్య బ్రవీద్వచ॥
యదా కార్యసమారంభే కస్మింశ్చిత్త వ సువ్రత।
అనిష్పత్తౌ చ కార్యస్య క్రోధస్త్యాం సముపేష్యతి ॥
ఆత్మైకా దశ యే రుద్రా విహితాః ప్రాణహేతవః॥
సాఽహమేకాదశాత్మా వై శూలహస్తః సహానుగః ।
ఋషిర్మిత్రో మహాత్మా వై లలాట ద్భవితాతదా॥
ప్రసాదమతులం కృత్వా బ్రహ్మణస్తాదీృశం పురా ।
విష్ణుం పునరుజాచేదం దదామి చ వరం తదా॥
భగనేత్రహారియైన మహాదేవుడు బ్రహ్మయొక్క యా ప్రార్థనమును విని నిష్కల్మషముగా మాయలేకుండగా ‘బాఢం’ (అట్లేయగుగాక) యని యనెను. ఓ సువ్రతుడా! బ్రహ్మా! నీవు ఏదేని పని ప్రారంభించగా ఆ పని జరుగునపుడు నీకు కోపము కలుగగలదు. ప్రాణ హేతువులైన నా పదకొండు రుద్రులతో ఈ నేను-15. పదకొండవ వానిని శూలము హస్తమునందుగలవానినై వెంటనుండు వానిని ఋషిని మిత్రుడను మహాత్ముడను అట్టి నేను నీకు కోపము వచ్చినపుడు నీలలాటము నుండి జనింపగలను-16. బ్రహ్మకావిధముగా సాటిలేని వరమునిచ్చి, నీకు గూడ వరమునిచ్చెదను అడుగుమని విష్ణువుతో ననెను.
సహెూవాచ సహామహాభాగో విష్ణుర్బవ మిదం వచః ।
సర్వమేతత్కృతం దేవ పరితుష్ణోజ్సి మే యది ।
త్వయి మే సుప్రతిష్ఠాఽస్తు భక్తీ రంబుదవాహన ॥
ఏవముక్తస్తతో దేవస్తమభాషత కేశవమ్ ॥
విష్ణో శృణు యథాదేవ ప్రీతోఽహం తవ శాశ్వత।
ప్రకాశం చాప్రకాశం చ జంగమం స్థావరం చ యత్ ॥
విశ్వరూపమిదం సర్వం రుద్రనారాయణాత్మకమ్।
అహమగ్నిర్బగవాన్ సోమో భవాన్ రాత్రిరహం దినమ్ ॥
భవానృతమహం సత్యం భవాన్ క్రతురహం ఫలమ్।
భావాన్ జ్ఞానమహం జ్ఞేయం యజ్ఞపిత్వా సదా జనాః ॥
మాం విశన్తి త్వయి ప్రీతే జనాః సుకృతకారిణః।
ఆవాభ్యాం సహితా చైవ గతిర్నాన్యా యుగక్షయే॥
ఆత్మానం ప్రకృతిం విద్ధి మాం విద్ధి పురుషం శివమ్ ।
భవానర్ధశరీరం మే త్వహం తవ యథైవ చ ॥
వామపార్శ్వమహం మహ్యం శ్యామం శ్రీ వత్సలక్షణమ్ ।
త్వం చ వామేతరం పార్శ్వం త్వహం వై నీలలోహితః॥
త్వం చ మే హృదయం విష్ణో తవ చాహం హృది స్థితః ।
భవాన్ సర్వస్య కార్యస్య కర్తాహమధిదైవతమ్॥
తదేహి స్వస్తితే వత్స గమిష్యామ్యంబుదప్రభ।
ఏవముక్త్యా గతో విష్ణోర్దేవో ఽన్తర్థానమీశ్వరః॥
అంత ఆ మహాభాగుడైన విష్ణువు భవునితోనిట్లనెను. ఓ దేవా! ఇదియంతము నీతోనే చేయబడినది. ఈనీచే జేయబడినదంతయు చాలును నా విషయమున నీవు సంతుష్టుడవైనచో ఓ అంబుద వాహన! మహాదేవా! నీయందు నా భక్తి సుప్రతిష్ఠితమగుగాక-18. అని యడుగబడిన యా మహాదేవుడు కేశవునితో నిట్లనెను ఓ శాశ్వతుడవైన దేవా! విష్ణు! నేను నీ విషయమున నెంత సంతసించితినో వినుము-19. ఈ కనబడునది కనబడనిదియునైన స్థావరజంగమాత్మకమైన విశ్వరూపమంతయు రుద్ర నారాయణాత్మకము-20. నేనగ్నిని నీవు సోముడవు. నీవు రాత్రివి. నేనే పగటిని. నీవు ఋతమవు నేను సత్యమును. నీవు క్రతు స్వరూపుడవు. నేను దాని ఫలమును-21. నీవు జ్ఞానము. నేను క్షేయమును (జ్ఞానముచే తెలియదగినవానిని) నిన్ను జపించి జనులెల్లప్పుడు నన్ను బ్రవేశింతురు. నీవు సంతుష్టుడవైనచో జనులు సుకృతమును (పుణ్యమును) జేయువారగుదురు. యుగక్షయమున (యుగానకాలమున) నీ యిరువురితో గూడినదే మార్గము. వేరొక మార్గములేదు-22. నన్ను ప్రకృతినిగా దెలియుము నన్ను పురుషుడైన శివునిగా తెలియుము. నేను నీకు సగము శరీరమైనట్లే నీవు నాయొక్క సగము శరీరమవు-23. ఎడమ ప్రక్క నేను, నాకది నీనల్లనైన శ్రీవత్సలాంఛనము గలది. నీవు కుడి ప్రక్కవు. కానీ అది నీలలోహితుడనైన నేను-24. ఓ విష్ణో నీవు నా హృదయమవు. నీ హృదయమందైతే నేనున్నాను. నీవు సమస్త కార్యమునకు కర్తవు. నేను దానికి దైవతమును-25. కావున ఓ వత్సా! రమ్ము (నాలోగలియుము) నీకు స్వస్తియగుగాక. ఓ మేఘశ్యాముడా! వెళ్ళుదును. ఇట్లు పలికి విష్ణువుయొక్క దేవుడైన యీశ్వరుడు అంతర్ధానమయ్యెను.
తతః సోఽన్తర్హితే దేవే సంప్రహృష్ట స్తదా పునః ।
అశేత శయనే భూపప్రవిశ్యాన్తర్జతే హరిః ॥
తం పద్మం పద్మగర్భాభం పద్మాక్షః పద్మసంభవః ।
సంప్రహృష్టమనా బ్రహ్మ భేజే బ్రాహ్మం తదా సనమ్॥
అథ దీర్ఘేణ కాలేన తత్రాప్యప్రతిమావుభౌ।
మహాబలౌ మహాసత్త్యౌ భ్రాతరౌ మధుకైటభౌ॥
ఊచతుశ్చైవ వచనం భక్ష్యో వై నౌ భవిష్యసి ।
ఏవముక్త్యా తు తౌ తస్మిన్నన్తర్ధానం గతావుభౌ॥
దారుణం తు తయోర్భావం జ్ఞాత్వా పుష్కరసంభవః ।
మాహాత్మ్యం చాత్మనోఽ బుద్ద్వా విజ్జాతుముపచక్రమే॥
కర్ణికాఘటనం భూయో నాభ్యజానాద్యదాగతిమ్ ।
తతః సపద్మనాలేన ఆవతీర్య రసాతలమ్॥
కృష్ణాజినోత్తరా సఙ్గన్దదృశేఽన్త ర్జలేహరిమ్ ॥
స చ తం బోధయామాస విబుద్ధం చేదమబ్రవీత్ ।
భూతేభ్యో మే భయం దేవ త్రాయస్వోత్తిష్ఠ శం కురు॥
తతః సభగవాన్విష్ణుః సప్రహాసమరిందమః ।
న భేతవ్యం నభేతవ్యమిత్యువాచ మునిః స్వయమ్॥
ఓ రాజా! ఆ తరువాత మహాదేవుడు అంతర్థానముగాగానే విష్ణువు అంతర్జాలమున బ్రవేశించి తన శయనమున బరుండెను-27. అపుడు పద్మముల వంటి కన్నులు గలవాడును పద్మము నందు బుట్టిన వాడును అగు బ్రహ్మ సంతసించిన మనము గలవాడై, పద్మగర్బాభమును, (బ్రహ్మతో) విష్ణువుతో, సూర్యునితో సమమై కాంతిగలదియు బ్రహ్మమును (జ్ఞానమయ బ్రహ్మకు సంబంధించినదియు) నైన ఆ పద్మమును జేరెను-28. తరువాత చాలా కాలమునకు, అక్కడ (పద్మమున) సాటిలేని యిరువురు మహాబలులు. అన్నదమ్ములు మధుకైటభులు అనువారు బ్రహ్మను “నీవు మాకు తినదగిన యాహారమగుదువు” అనియని యచ్చటనే యంతర్థానమైరి-29, 30. కమలమున బుట్టిన బ్రహ్మ భయంకరమైన వారి భావమును తెలిసి తన మాహాత్మ్యమును గూడ దెలియక (కర్తవ్యమును) దెలిసికొనుటకు ప్రారంభించేను-31. తాను మరల కమలనాభికూర్పును దాని నుండి పై మార్గమును తెలియక ఆ పద్మనాళము గుండా రసాతలమునకు (పాతాళమునకు) లేదా భూమికి అంతర్జాలమున దిగి కృష్ణముగ చర్మమునుత్తరీయముగా ధరించిన విష్ణువును జూచెను-32. బ్రహ్మయా హరిని మేలుకొల్పెను. మేలుకొన్న యా హరితో నిట్లనెను. ఓ దేవా! భూతములవల్ల నాకు భయమేర్పడినది లెమ్ము రక్షించుము శుభమును గూర్చుము”-33. అంత శత్రుదమనుడైన భగవంతుడైన మునియైన విష్ణువు స్వయంగా నవ్వుతో “భయపడవలదు భయపడవలదు” అని యనెను.
త(య)స్మాత్పూర్వం త్వయా చోక్తం భూతేభ్యో మే మహధ్భయమ్ ।
తస్మాద్భూతాది వాక్యై స్తౌ దైత్యౌ త్వం నాశయిష్యసి॥
భూర్భువః స్వస్తతో దేవం వివిశుస్తమయోనిజమ్ ।
తతః ప్రదక్షిణం కృత్వా తమేవాసీనమాగతమ్॥
గతే తస్మింస్తతోఽ నన్త ఉద్గీర్య భ్రాతరౌ ముఖాత్ ।
విష్ణుం జిష్ణుం చ ప్రోవాచ బ్రహ్మాణమభిరక్షతామ్।
మధుకైటభయోర్ఞ్జా త్వా తయోరాగమనం పునః॥
చక్రా తే రూపసాదృశ్యం విష్ణోర్జిష్ణోశ్చ సత్తమే ।
కృతాసాదృశ్య రూపౌ తౌ తావేవాభిముఖౌ స్థితౌ॥
తతస్తౌ ప్రోచతుర్దైత్యౌ బ్రహ్మాణం దారుణం వచః ।
అస్మాకం యుధ్యమానానాం మధ్యే వై ప్రాశ్నీకో భవ॥
తతస్తౌజలమావిశ్య సం స్తభ్యాపః స్వమాయయా ।
చక్రతుస్తుములం యుద్ధం యస్య యేనేప్పితం తదా॥
నీవు పూర్వము భూతములవల్ల నాకు మిక్కిలి భయముగలదని యంటివి. కావున నీవు భూతాది వాక్యములచేత ఆ యిరువురుని నశింపజేయగలవు (అనెను)-35. అంత, అచట వచ్చి కూర్చునియున్న అయోనిజుడైన విష్ణువునిలో భూర్లోక భువర్లోక- స్వర్గలోకములు ప్రవేశించినవి. అట్లు జరుగగా అనస్తుడు తనముఖము నుండి విష్ణువు జిష్ణువు (విష్ణువు ఇంద్రుడు) అను సోదరులను వెడలగ్రక్కెను. అంత మరల మధుకైటభులరాతను దెలిసికొని విష్ణు జిష్ణువులతో “బ్రహ్మను రక్షించుకొనుడు” అని యనెను-36,37. సత్తములైన మధుకైటభులు విష్ణు-జిష్ణువులతో సమానమై రూపములను ధరించిరి. ఆ విధముగా సమానరూపములు గలవారికి సమానరూపములు గలవారే అభిముఖులుగా నుండిరి-38. తరువాత (విష్ణు జిష్ణు రూపమునుధరించిన) మధుకైటభులు అను రాక్షసులు బ్రహ్మతో భయంకరవచనము లిట్లనిరి.” యుద్దము జేయుచున్న మా విషయముతో ప్రాశికుడవు ఎవరెవరితో యుద్ధముజేయుచున్నారని తెలియనివాడవు అగుము-39. తరువాత వారు జలమును బ్రవేశించి తమ మాయచే జలమును స్తభింపజేసి యపుడు ఎవరేది యిష్టమో అట్టి తుముల (దొమ్మి) యుద్ధమును జేసిరి.
తేషాం తు యుధ్యమానానాం దివ్యం వర్షశతం గతమ్।
న చ యుద్ధ మదోత్సేకో హ్యన్యోఽన్యం స న్యవర్తత॥
లక్షణద్వయ సంస్థానా ద్రూపవన్తౌ స్థితేంగితౌ ।
సాదృశ్యాద్వ్యాకులమానా బ్రహ్మా ధ్యానముపాగమత్॥
స తయోరన్తరం బుద్ద్వా బ్రహ్మా దివ్యేన చక్షుషా ।
పద్మకేసరజం సూక్ష్మం బబంధ కవచం తయోః॥
ఆమేఖలం చ గాత్రం చ తతోమన్త్రముదాహరత్॥
ఆ విధముగా యుద్దము జేయుచున్నవారికి దేవమానముతో నూరు సంవత్సరములు గడచినవి. కాని పరస్పరముగా యుద్ధమదము యొక్క ఉప్పొగం తరగలేదు-41. రెండు గుర్తులతో నున్నందున (విష్ణు జిష్ణు) రూపముల ధరించినవారూ నిగూఢభావబోధకములైన చేష్టలు (ఇంగితములు) గలవారైరి. వారొకే రూపసాదృశ్యంలో నున్నందున బ్రహ్మ వారిని గుర్తింపలేక వ్యాకుల చిత్తుడై ధ్యానము నాశ్రయించెను-42. తరువాత దివ్య దృష్టితో వారిలో భేదమును గుర్తించి, పద్మకేసరము (కింజలము)ల నుండి బుట్టిన సూక్ష్మమైన వారి కవచమును బంధించెను. నడుము వరకున్న వారి శరీరమును గూడ బంధించిన. ఈ తరువాత మన్తము నుచ్చరించెను. (జపించెను).
జపతస్త్వభవత్కన్యా విశ్వరూపసముత్థితా ।
పద్మేందు వదన ప్రఖ్యాపద్మహస్తా శుభాసతీ।
తాం దృష్ట్యా వ్యధితౌ దౌత్యా భయాద్వర్ణ వివర్జితౌ॥
జపించుచున్న బ్రహ్మకు కన్య గలిగెను. ఆమె విశ్వరూపము నుండి బయలు వెడలినదియై పద్మ చంద్రుల వంటి ముఖము గలది. పద్మముల వంటి చేతులు గలది. శుభకరమైనది. ఆమెను జూచి యా యిరువులు రాక్షసులు భయమువలన బాధితులై వివర్ణులైరి.
తతః ప్రోవాచ తాం కన్యాం బ్రహ్మా మధురయా గిరా।
కాఽత్ర త్వమవ గన్తవ్యా బ్రూహి సత్యమనిందితే ॥
సామ్నా సంపూజ్య సా కన్యా బ్రహ్మాణం ప్రాంజలి స్తదా ।
మోహినీం విద్ధి మాయాం విష్ణోః సందేశ కారిణీమ్॥
త్వయా సంకీర్త్యమానాహం బ్రహ్మన్ ప్రాప్తా త్వరయుతా ।
అస్యాః ప్రీతమనా బ్రహ్మా గౌణం నామ చకార హ॥
మయా చ వ్యాహృతా యస్మాత్త్వం చైవ సముపస్థితా ।
మహావ్యాహృతి రిత్యేవ నామతే విచరిష్యతి ॥
ఉత్థితా చ శిరో భిత్త్వా సావిత్రీ తేన చోచ్యతే ।
ఏకానంశాత్తు యస్మాత్త్వమనేకాంశా భవిష్యసి॥
గౌణాని తావదేశాని కర్మజాన్యపరాణి చ ।
నామాని తే భవిష్యన్తి యత్ప్రసాదాత్ శుభాననే॥
ఆ తరువాత బ్రహ్మ మధురములైన మాటలతో ఆ కన్యతో నీవెవ్వతవని తెలియవలెను? ఓ నిందింపబడని దానా! నిజముగా జెప్పుము” అని యడిగెను-45. అప్పుడు ఆ కన్య సామముతో (శాంతముగా సామము వేదముతోను) బ్రహ్మను పూజించి చేతులు జోడించి “నన్ను విష్ణువు యొక్క యాజ్ఞను నెరవేర్చు మోహినీ మాయనుగా నన్ను తెలియుము” అనెను 46. ఓ బ్రహ్మాన్ నీ చేత ధాన్యనింపబడిన దాననై నేను వేగముతో వచ్చితిని. అని యనెను. ఈమె విషయమున సంతసించిన మనస్సు గలవాడై బ్రహ్మయామెకు గౌణమైన (గుణమునాధారముగా చేయబడిన) నామమును (పేరును) బెట్టెను-47. నాచే వ్యాహృతురాలవై (విశేష ధ్యానమున బిలువబడిన దానవై) వచ్చితివి గావున మహావ్యాహృతి యనియే నీ పేరు ప్రచారమగును-48. శిరస్సును భేదించి పైకి వచ్చితివి గావున సావిత్రియని పిలువబడెదవు. ప్రస్తుతము అంశములులేక ఒక్కతెవైనందున అనేకాంశవు అగుదువు-49. ఇవి నీ గౌణములైన (గుణ ప్రధానములైన) నామములు. ఓ శుభాననా! నాయనుగ్రహమున నీ క్రియల వలన గలుగు నామములు వేరుగాగలవు.
తతస్తౌ పీడ్యమానౌ తు వరమేనమయాచతామ్।
అనావృతం నౌ మరణం పుత్రత్వం చ భవేత్తవ ॥
తథేత్యుక్తా తతస్తూర్ణమనయద్యమ సాదనమ్ ।
అనయత్కైటభం విష్ణుర్జిష్ణుశ్చాష్యనయన్మధుమ్॥
తరువాత (ఆమెచే) పీడింపబడినవారై యీతనిని (బ్రహ్మను) “ఆవరణములేని మరణము మాకు గావలెను. మేము నీకు పుత్రులముగూడ గావలెను” అని వరమడిగిరి-51. బ్రహ్మ- మీరడిగినట్లే యగుగాక అని వారిని వెంటనే యమలోకమున కంపెను. విష్ణువు కైటభుని తరువాత జిష్ణువు మధువును యమలోకమునకు బంపిరి.
ఏవం తౌ నిహతౌ దైత్యా విష్ణునా జిష్ణునా సహ!।
ప్రీతేన బ్రహ్మణా చా థ లోకానాం హితకామ్యయా॥
పుత్రత్వమీశేన యథా హ్యాత్మా దత్తో నిబోధత ।
విష్ణునా జిష్ణునా సార్థం నుధుకైట భయోస్తథా॥
సంపరా యే వ్యతిక్రాన్తే బ్రహ్మా విష్ణుమభాషత॥
ఈ విధముగా జిష్ణువుతో గూడిన విష్ణువుతో ఆ యిరువురు రాక్షసులు చంపబడిరి. ఆ తరువాత సంతసించిన యీశుడైన బ్రహ్మచేత లోకముల హితముగోరి-53. ఏ విధముగా పుత్రత్వరూపమున ఆత్మ (తన రూపము) ఈయబడినదో వినుడు. ఆ విధముగా విష్ణు జిష్ణులతో మధుకైటభులకు యుద్ధము జరుగగా బ్రహ్మ విష్ణువుతో బలికెను.
అద్య వర్షశతం పూర్ణం సమయః ప్రత్యుపస్థితః ।
సంక్షేపసంప్లవం ఘోరం స్వస్థానం యామి చాప్యహమ్॥
స తస్య వచసా దేవః సంహారమ కరోత్తదా ।
మహీం నిస్థావరాం కృత్వా ప్రకృతిస్థాంశ్చ జంగమాన్॥
యది గోవింద భద్రం తే క్షిప్త స్తే యాదసాం పతిః ।
బ్రూహి యత్కరణీయం స్యాత్మయా తే లక్ష్మివర్ధన॥
బాఢం శృణు త్వం హేమాభ పద్మయోనే వచో మమ ।
ప్రసాదో యస్త్యయా లబ్ద ఈశ్వరాత్ పుత్రలిప్సయా॥
తం తథా సఫలం కృత్వా మత్తోఽభూదనృణో భవాన్ ।
చతుర్విధాని భూతాని సృజత్వం విసృజస్వ వా॥
ఇవ్వేళ నూరేండ్లు నిండినవి. సమయము ముందుగా వచ్చినది. ఇది సంక్షేపమై భయంకరమైన సంప్లవము (ప్రళయము) నేను నా స్వస్థానమునకు వెళ్ళుచున్నాను అనియనెను-55. బ్రహ్మమాట విని దేవుడు (మహాదేవుడు) అపుడు సంహారమును (సర్వ ప్రాణుల సంహారమును) చేసెను. భూమినంతయు స్థావరములు (చరింపని పర్వత వృక్షాదులు) లేనిదానినిగా జేసెను. జంగమములను (చరించువానిని) వాని మూలమైన ప్రకృతిలో నుండునట్లు చేసెను-56. గోవిందుడైన విష్ణువు యొక్క భద్రత కొరకు సముద్రముంచబడినది. ఓ లక్ష్మీవర్ధనుడవైన విష్ణో! నీకు నేను చేయవలసినదేమైననున్నచో చెప్పుము అని యనెను-57. విష్ణువనెను. ఓ బ్రహ్మన్ బంగారు వన్నెగలవాడా! అదియంతయు సరియ! నా మాట వినుము. పుత్రకాంక్షచే పూర్వము ఈశ్వరుని నుండియే యనుగ్రహం నీకు లభించినదో-58, దానినట్లే సఫలముగాజేసి నానుండి ఋణ విముక్తుడవైనావు. నాలుగువిధములైన ప్రాణులను నీవు సృష్టించుము లేదా వదిలి వేయుము అనెను.
అవాప్య సంజ్ఞాం గోవిందాత్ పద్మయోనిః పితామహః ।
ప్రజాః స్రష్టుమానాస్తేపే తత ఉగ్రం తతో మహత్ ॥
తస్యైదం తప్యమానస్య న కించిత్సమవర్తత ।
తతో దీర్ఘేణ కాలేన దుఃఖాత్క్రోధో వ్యవర్థత॥
సక్రోదావిష్టనేత్రాభ్యామపతన్నశ్రు బిందవః ।
తత్తస్తేభ్యోకSఽ శ్రుబిందుభ్యో వాతపిత్తకఫాత్మకాః॥
మహాభాగా మహాసత్త్వాః స్వస్తికైరభ్యలంకృతాః।
ప్రకీర్ణకేశాః సర్పాస్తే ప్రాదుర్భూతా మహావిషాః॥
సర్పాంస్తథాగ్రజాన్ దృష్ట్యా బ్రహ్మాత్మానమనిందత ।
అహో ధిక్ తపసా మహ్యం ఫలం మీదృశకం యది॥
లోక వైనాశకీ జజ్ఞే ఆదావేవ ప్రజా మమ॥
తస్య తీవ్రాఽ భవన్మూర్చా క్రోధామర్ష సముద్భవా ।
మూర్చాభితాపేన తదా జహౌ ప్రాణాన్ ప్రజాపతిః॥
గోవిందుని వలన పద్మమున బుట్టిన బ్రహ్మ మేలుకొని ప్రజలను సృష్టించు తలంపుగలవాడై ఉగ్రమైన మహా తపస్సు జేసెను-60. ఈ విధముగా తపముజేయుచున్న యా బ్రహ్మకేమియు జరుగలేదని తరువాత చాలాకాలమునకు దుఃఖము : వలన క్రోధము పెరిగెను-61. ఆ క్రోధముచే నిండిన నేత్రముల నుండి కన్నీటి బిందువులు రాలెను. తరువాత ఆ కన్నీటి బిందువుల నుండి వాతపిత్త కఫాత్మకులు మహాభాగులు గొప్పయదృష్టము గలవి) మహాబలవంతములు, స్వస్తిక చిహ్నములచే నలంకరింపబడినవి, విరియబోసిన వెంట్రుకలు గలవి మహావిషముగలవియును అగు (ఆ) సర్పములు బుట్టినవి-62,63. ఆ విధముగా ముందుగా. బుట్టిన సర్పములను జూచి బ్రహ్మ తనను నిందించుకొనెను. అయ్యో! తపస్సుచే నా కిటువంటి ఫలితము లభించినచో ధిక్కారము. నాకు మొదటి సంతానమే లోకముల నశింపజేయునదిగా బుట్టినదే యని యనుకొనెను 64. తరువాత ఆ బ్రహ్మకు క్రోధాసహనముల వలన బుట్టిన మూర్ఛ తీవ్రమయ్యెను.
తస్యాప్రతిమ వీర్యస్య దేహాత్కారుణ్య పూర్వకమ్ ।
ఆత్మైకాదశ తే రుద్రాః ప్రోద్భూతా రుదతస్తదా॥
రోదనాత్ ఖలు రుద్రాస్తే రుద్రత్వం తేన తేషు తత్।
యే రుద్రాఃఖలు తే ప్రాణాః యే ప్రాణాస్తే తదాత్మకాః॥
ప్రాణాః ప్రాణాభృతాం జ్ఞేయాః సర్వభూతేష్వవస్థితాః।
అత్యుగ్రస్య మహత్త్వస్య సాధునాచరితస్య చ ।
తస్య ప్రాణాన్ దదౌ భూయస్త్రిశూలీ నీలలోహిత॥
లలాటాత్పద్మయోనేస్తు ప్రభురేకాదశాత్మకః।
బ్రహ్మణః సోఽదదత్ ప్రాణానాత్మజః స తదా ప్రభుః ॥
ప్రహృష్టవదనో రుద్రః కించిత్యాగతాసవమ్।
అభ్యభాషత్తదా దేవో బ్రహ్మాణం పరమం వచః॥
సాటిలేని వీర్యము గల యాతని (బ్రహ్మయొక్క) దేహము నుండి కారుణ్య పూర్వకముగా ఏడ్చుచున్న తనతో పదకొండుగురైన రుద్రులు బుట్టిరి. రోదించుటవలన వారు రుద్రులు. ఆ కారణముననే వారిలో ఆ రుద్రత్వముండినది 66. ఎవరు రుద్రులో వారు ప్రాణములు గదా ఏవి ప్రాణములో అవి రుద్రాత్మకములు. అవి సర్వభూతములందున్న ప్రాణుల ప్రాణములుగా దెలియదగినవి-67. త్రిశూలియైన నీలలోహితుడు ఏకాదశాత్మకుడైన ప్రభువైన శివుడు అత్యుగ్రుడు మహత్యము గలవాడు చక్కగా నడచినవాడునైన యా బ్రహ్మకు లలాటము నుండి మరల ప్రాణములను ఇచ్చెను-68. అపుడు (బ్రహ్మకు) ఆత్మజుడై ప్రభువైన ఆ శివుడు బ్రహ్మను జూచి సంతసించిన ముఖముగలవాడై యా రుద్రదేవుడు, ఈ విధముగా ఉత్కృష్టమైన వాక్కును బలికెను.
ఉపయాచస్వ మాం బ్రహ్మన్ స్మర్తుమర్హసి చాత్మనః ।
మాం చ వేత్థాత్మజం రుద్రం ప్రసాదం కురు మే ప్రభో ॥
శ్రుత్వా త్వదం వచస్తస్య ప్రభూతం చ మనోగతమ్ ।
పితామహః ప్రసన్నాత్మా నేత్రే పుల్లాంబుజప్రభైః ॥
తతః ప్రత్యాగతా ప్రాణాః స్నిగ్ధగంభీరయా గిరా ।
ఉవాచ భగవాన్ బ్రహ్మశుద్దజాంబూనద ప్రభః॥
భోభో వడ మహాభాగ ఆనందయసి మే మనః ।
కో భవాన్ విశ్వభూతిస్త్వం స్థిత ఏకాదశాత్మకః ॥
హే బ్రహ్మన్, నన్నడుగుకొనుము. నిన్ను నీవు స్మరించుకొనుము. నన్ను నీ యాత్మజుడనైన రుద్రనిగా దెలియుదువు. హేప్రభో! నన్ననుగ్రహింపుము-70. ఈ రుద్రుని వాక్యమును బ్రహ్మవినేను. ఆయన మనోగతము (కోరిక) ప్రభూతమ (ఎక్కువ)య్యెను. వికసించిన కమలము వలె ప్రకాశించు కన్నులచే బ్రహ్మప్రసన్నాత్ముడయ్యెను-71. తరువాత, మరల ప్రాణమును బొందిన బ్రహ్మ శుద్ధమైన బంగారువన్నెగలవాడై స్నేహముతో గూడి గంభీరమైన వాక్కుతోనిట్లనెను-72. ఓఓ మహాభాగుడా నా మనము నానందపరచుచున్నావు విశ్వమును భూతి (ఐశ్వర్యమవు)వి. ఏకాదశాత్మకుడవు ఐన నీవెవడవు? చెప్పుము. అనీ యనెను.
ఏవముక్తో భగవతా బ్రహ్మణానన్తతేజసా ।
తతః ప్రత్యవదద్రుద్రో హ్యభివాద్యాత్మజైః సహ॥
యత్తేవరమహం బ్రహ్మన్ యాచితో విష్ణునా సహ ।
పుత్రో మే భవ వేదితి త్వత్తుల్యో వాపి ధూర్వహః॥
లోకేషు విశ్రుతైః కార్యం సర్వైర్విశ్వాత్మసంభవైః ।
విషాదం త్యజ దేవేశ లోకాంస్త్యంస్రష్టుమర్హసి॥
అనంత తేజస్కుడై భగవంతుడైన బ్రహ్మ యిట్లనగానే తనతోబుట్టిన వారితోబాటు అభివాదనము (నమస్కారము) జేసి రుద్రుడు బదులు పలికెను-74, ఓ బ్రహ్మన్! పూర్వము విష్ణువుతోగూడినన్ను పుత్రుడవుగమ్మని లేదా నీతో సమానముగా భారము వహించు పుత్రునిమ్మని వరమడిగితివి-75. లోకములలో ప్రసిద్ధులైన విశ్వాత్మునివల్ల బుట్టిన యందరిచేతను చేయదగినది గలదు. ఓ దేవేశ! దుఃఖమును వదులుము. లోకములను నీవు సృజింపదగియున్నావు. అని యనెను.
ఏవం స భగవానుక్తో బ్రహ్మా ప్రీతమనాభవత్ ।
రుద్రం ప్రత్యవదద్భూయో లోకాన్తే నీలలోహితమ్॥
ఈ విధముగా జెప్పగానే బ్రహ్మ సంతసించెను. తరువాత లోకాన్తమునకు నీలలోహితుడైన రుద్రునితో మారు పలికెను.
సాహాయ్యం మమ కార్యార్థం ప్రజాః సృజ మయాసహా ।
బీజీ త్వం సర్వభూతానాం తత్ప్రపన్నస్తథాభవ।
బాడమిత్యేవ తార వాణీం ప్రతిజగ్రాహ శంకరః ॥
ఓ మహాదేవా! నా పని కొరకై సహాయపడుము. నాతోగూడి ప్రజలను సృష్టిచేయుము. నీవు సర్వప్రాణులకు బీజవంతుడవు తత్రసన్నుడవై (ఆ బీజములను పొందినవాడవై) బీజవంతుడవు గమ్ము. అని బ్రహ్మయనెను. శంకరుడుగూడ సరియేయని యా మాటను స్వీకరించేను.
తతః స భగవాన్ బ్రహ్మా కృష్ణాజినవిభూషితః ।
మనోఽగ్రే సోఽసృజద్దేవో భూతానాం ధారణం తతః॥
జిహ్వాం సరస్వతీం చైవ తతస్తాం విశ్వరూపిణీమ్॥
భృగుమఙ్గిరసం దక్షం పులస్త్యం పులహంక్రతుమ్ ॥
వసిష్టం చ మహాతేజాః సృజే సప్తమానసాన్ ।
పుత్రోనాత్మ సమానన్యాన్ సోఽ సృజద్విశ్వ సంభవాన్ ॥
తేషాం భూయో సుమార్గేణ గావో వక్త్రా ద్విజజ్ఞిరే।
ఓంకార ప్రముఖాన్ వేదానభిమాన్యాశ్చ దేవతాః ।
ఏవమేతాన్ యథాప్రోక్తాన్ బ్రహ్మాలోకిపితామహః ॥
దక్షాద్యాన్ మానసాన్ పుత్రాన్ ప్రోవాచ భగవాన్ ప్రభుః ।
ప్రజాః సృజత భద్రం వో రుద్రేణ సహ ధీమతా॥
తరువాత ఆ భగవంతుడైన బ్రహ్మ కృష్ణ మృగ చర్మముచే నలంకరింపబడినవాడై మొదట ప్రాణులను ధరించినదైన మనస్సును సృజించెను. తరువాత జిహ్వారూపిణియై విశ్వరూపిణియైన యా సరస్వతిని సృజించెను-79. భృగువు, అజీరసుడు, దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, అను ఏడుగురిని మనస్సున బుట్టిన వారిగా నమహాతేజస్వియైన బ్రహ్మ సృజించెను-80. ఇంక నాతడు తనతో సమానులై విశ్వమున బుట్టినయితరులను గూడ సృజించెను. మరల నా మార్గముననుసరించి వారి ముఖము నుండి గోవులు బుట్టినవి-81. ఓంకారము మొదలుకొని వేదములను, అభిమానింపదగిన దేవతలను సృజించెను. ఈ విధముగా పైన జెప్పబడిన వారి నందరిని లోక పితామహుడైన బ్రహ్మ సృజించెను-82. తరువాత నా భగవంతుడైన ప్రభువు దక్షుడు మొదలగు మానసపుత్రులతో మహాధీశక్తిగల రుద్రునితోగూడి ప్రజలను సృజింపుడు మీకు భద్రమగు గాక” అనెను.
అనుగమ్య మహాత్మానం ప్రజానాం ఏతయస్తదా ।
వయమిచ్చామహే దేవ! ప్రజాః స్రష్టుం త్వయా సహ ॥
బ్రహ్మణస్త్యేష సందేశ స్తవచైవ మహేశ్వర ॥
తైరేవముక్తో భగవాన్ రుద్రఃప్రోవాచ తాన్ ప్రభుః ॥
బ్రహ్మణశ్చాత్మ జా మహ్యం ప్రాణాన్ గృహ్య చ వై సురాః ॥
కృత్వా గ్రజాగ్రజానేతాన్ బ్రాహ్మణానాత్మజాన్మమ!।
బ్రహ్మాదిస్తంబపర్యన్తాన్ సప్తలోకాన్మమాత్మకాన్ ।
భవన్తః స్రష్టుమర్హన్తి వచనాన్మమ స్వస్తి వః
తేనైవ ముక్తాః ప్రత్యూచుః రుద్రమాద్యం త్రిశూలినమ్ ।
యథాజ్ఞాపయసే దేవం తథా తద్యై భవిష్యతి॥
అనుమాన్యమహాదేవం ప్రజానాం పతయస్తదా ।
ఊచుర్ధక్షం మహాత్మానం భవాన్ శ్రేష్ఠః ప్రజాపతిః॥
త్వాం పురస్కృత్య భద్రం తే ప్రజాః ప్రక్ష్యామహే వయమ్ ॥
ఏవమస్త్వితి వై దక్షః ప్రత్యపద్యత భాషితమ్ ॥
తైః సహస్రష్టుమారేభే ప్రజాకామః ప్రజాపతిః।
సర్గస్థితే తతః స్థాణౌ బ్రహ్మా సర్గమథాఽ సృజత్॥
అథాఽస్య సప్తమేఽతీతే కల్పే వై సంబభూవతుః ।
ఋభుః సనత్కుమారశ్చ తపోలోక నివాసినౌ
తతో మహార్షీనన్యాన్ సమానసానసృజత్ప్రభుః॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే మధుకైటభోత్పత్తి వినాశవర్ణనం నామ పంచవింశోఽధ్యాయః॥
అప్పుడు ప్రజాపతులు (దక్షుడు మొ॥ వారు) ఆ మహాత్ముడైన శంకరుని వెంబడించి, ఓ దేవ! నీతోగూడి మేము ప్రజలను సృజింపగోరుచున్నాము. ఓ మహేశ్వర! ఇది బ్రహ్మయొక్కయు నీ యొక్కయు సందేశము (ఆజ్ఞ)-84. ఆ దక్షాదులిట్లనగానే ప్రభువైన రుద్రుడు వారితోనిట్లనెను. బ్రహ్మయొక్క ఆత్మజులైన (కుమారులైన) దేవతలు నాకై నా నుండి ప్రాణములను గ్రహించిరి. ఈ సాకుమారులైన బ్రాహ్మణులను అగ్రజులకంటే నగ్రజులుగాజేసి బ్రహ్మాది సంబ పర్యంతములై బ్రహ్మ మొదలు గడ్డిగుత్తి వరకైన) నేనాత్మగా నున్న యేడు లోకములను మీరు నా మాటవలన సృష్టింపదగును. మీకు శుభమగుగాక"-85,86. ఈ విధముగ రుద్రుడు చెప్పగానే త్రిశూలియైన యాద్యుడైన రుద్రునితో ప్రజాపతులు మీరాజ్ఞాపించినట్లే యది (సృష్టి కాగలదు అనిరి-87. అపుడు ప్రజాపతులు మహాదేవుని ఒప్పించి మహాత్ముడైన దక్షునితో నిట్లనిరి. “నీవు శ్రేష్ఠుడవైన ప్రజాపతివి. నిన్ను ముందుంచుకొని నీకు మేము క్షేమముగా ప్రజలను సృష్టింపగలము-88. దక్షుడట్లేయగుగాకయని వారి మాటనోప్పుకొనెను. ప్రజాకాముడై యా ప్రజాపతి వారితో గూడి ప్రజలను సృష్టింపనారంభించెను. తరువాత స్థాణువు (శంకరుడు) సర్గమునందు (సృష్టియందు) ఉండగా బ్రహ్మ సర్గమును సృష్టిజేసెను-89. ఆ తరువాత బ్రహ్మకేడవ కల్పము గడచిపోగా నీ బ్రహ్మకు ఋభువు, సనత్కుమారుడును బుట్టిరి. వీరిరువురు తపోలోక నివాసులు, ఆ తరువాత ఇతర మహరులను మానసజన్ములుగా నా ప్రభువు సృష్టించెను.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున మధుకైటభోత్పత్తి వినాశ వర్ణనమను ఇరువదియైదవ యధ్యాయము.