24 - శార్వస్తవం

వాయురువాచ:-

చత్వారి భారతవర్షే యుగాని మునయో విదుః ।

 కృతం త్రేతా ద్వాపరం చ తిష్యం చేతి చతుర్యుగమ్ః ॥

 ఏతత్సహస్రపర్యన్తమహర్యర్బ్రహ్మణః స్మృతమ్ ।

యామాద్యస్తు గణాః సప్త రోమనన్తశ్చతుర్దశ ॥

శరీరాః శ్రయన్ తే సజనలోకం సహానుగాః ।

ఏవం దేవేష్వతీతేషు మహర్లోకాజ్జనం తపః॥

 మన్వన్తరేప్వతీతేషు దేవాః సర్వే మహౌజసః ।

తతస్తేషు గేతేషూర్థ్యం సాయుజ్యం కల్పవాసినామ్॥

సమేత్య దైవై స్తే దేవాః ప్రాప్తే సఙ్కాలనే తదా ।

మహర్లోకం పరిత్యజ్య గణాస్తే వై చతుర్దశ ॥

భూతాదివ్యవశిష్టేషు స్థావరాన్ తేషు భువాదిషు ।

దేవేష్వథ గతేషూర్థ్యం కల్పవాసిషు వై జనమ్॥

 తత్సంహత్యా తతో బ్రహ్మ దేవర్షిగణ దానవాన్ ।

 సంస్థాపయతి వై సర్వాన్ దాహవృష్ట్యా యుగక్షమే ॥

వాయువు పలికెను:- భారతవర్షమున మునులు నాలుగు యుగములని తెలిపిరి. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము తిష్యయుగము అని నాలుగు యుగములు-1. వీని వేయి వరకు బ్రహ్మకు పగలు అనబడును. యామాదులైన గణములు ఏడు, రోమవస్త్రములు పదునాలుగు-2. తోడుగా వచ్చునవై సశరీరములై జనోలోకమునాశ్రయించుచున్నవి. ఈ విధముగ దేవతలు మహర్లోకము నుండి జనోలోకమును తపోలోకమును దాటగా మన్వంతరములు గడచిపోయినవి. మహౌజస్కులైన దేవతలందరు ఊర్థ్వలోకమును జేరిరి. ఆకల్పమునందున్న వారితో సహయోగమును బొందిరి-3,4. అపుడా దేవతలు సంకలనమును (కలయికను) బొందగా ఆ పదునాలుగు గణములు మహర్లోకములను వదలిరి-5. అపుడు భూతాదులు మిగిలిన స్థావరాన్తములు, భువర్లోకము మొదలుకొని మహర్లోకము వరకున్న లోకములు శూన్యములైనవి. కల్పవాసులైన దేవతలు ఊర్థ్వలోకమున జనమును జేరిరీ-6. దాహముతో గూడిన వర్షముచేత యుగము క్షయము గోగా పైవారి సమూహముతో బ్రహ్మ బ్రహ్మర్షి గణములను దానవుల నందరినీ సంస్థాపించును-7.

యోఽతీతః సప్తమం కల్పో మయా వః పరికీర్తితః ।

 సముదైః సప్తభిర్గాఢమేకీభూతైర్మహార్ణవైః ॥

 ఆసీదేకార్ణవం ఘోరమవిభాగం తమోమయమ్ ॥

 మాయయైకార్ణనే తస్మిన్ శంఖచక్రగదాధరః ।

 జీమూతాభోఽబుజాక్షశ్చ కిరీటీ శ్రీపతిర్హరిః ॥

 నారాయణముఖోద్గీర్ణం సోఽష్టమః పురుషోత్తమః ।

అష్టబాహుర్మహోరస్కో లోకానాం యోనిరుచ్యతే ॥

కీమప్యచిన్త్యం యుక్తాత్మా యోగమాస్థాయ యోగవిత్॥

 ఫణాసహస్రకలితం తమప్రతిమ వర్చసమ్ ।

మహాభోగపతే ర్భోగమన్వాస్తీర్య మహోచ్ఛ్రయమ్ ।

 తస్మిన్ మహతి పర్యజ్కే శేతే వై కనకప్రభే ॥

నేనీదివరకు గడచిపోయినట్లుగా చెప్పిన యేడవ కల్పము ఏడు సముద్రములు గాఢముగా కలిసి యొక్కటైన మహా సముద్రములచే భయంకరమై చీకటి నిండి విభజింపరాని యేకార్లవ మయ్యెను. (అంతయు ఒకే సముద్రమయ్యెను)-8. మాయతో నా విధముగా ఏకసముద్రము దానియందు శంఖము చక్రము గదను ధరించినవాడు, మేఘమువలె నల్లనైనవాడు, కమలనేత్రుండును, కిరీటము, శ్రీపతియునైన హరి-9 నారాయణ ముఖము నుండి వెలువడిన యెనిమిదవ పురుషోత్తముడై యుండెను. అతడెనిమిది బాహువులు గలవాడు. విశాల వక్షస్థలముగలవాడు. అతడు లోకములకంతటికిని కారణభూతుడని చెప్పబడుచున్నాడు. అతడు యోగముతో గూడిన యాత్మ గలవాడు చింతింపనలవిగాని, యనిర్వచనీయమైన యోగమునందున్న వాడు. యోగమును తెలిసినవాడు. అతడు ఆదిశేషుని విశాలమైన వేయి పడగలనానుకొని బంగారు పాన్పుపై పడుకొనుచున్నాడు. ఆయాదిశేషుడు సమస్త మహాఫణములు గల సర్పముల కధిపతి. సాటిలేని తేజస్సు గలవాడు-10,11.

ఏవం తత్ర శయానేన విష్ణునా ప్రభవిష్ణునా ।

 ఆత్మారామేణ క్రీడార్థం స్పష్టం నాభ్యాం తు పంకజమ్ ॥

శతయోజన విస్తీర్ణం తరుణాదిత్య వర్చసమ్ ।

వజ్రదండం మహోత్సధం లీలయా ప్రభవిష్ణునా ॥

ఈ విధముగా నచటపడుకొనుచున్న సర్వసమర్థుడైన ప్రభువై యాత్మారాముడైన (తనలో తానే యానందించువాడైన విష్ణువుచేత క్రీడ కోఱకై (విలాసమునకై) నాభియందు కమలము సృష్టింపబడినది-12. ఆ కమలము నూరు యోజనముల వెడల్పయినది. ఉదయించిన సూర్యునికాంతి గలది. వజ్రము దండము (నాళముగా) గలది. మహ్నోతమయినది. ఇట్టి కమలము ప్రభువైన విష్ణువుచే లీలగా సృష్టింపబడినది-13.

తస్యైవం క్రీడమానస్య సమీపం దేవమీఢుషః ।

హేమ బ్రహ్మాండజో బ్రహ్మారుక్మవర్ణో హ్యతీంద్రియః ॥

 చతుర్ముఖో విశాలాక్ష సమాగమ్య యదృచ్ఛయా ॥

 శ్రియాయుక్తేన నవ్యేన సుప్రభేణ సుగన్దినా ।

 తం క్రీడమానం పద్మేన దృష్ట్యా తు బ్రహ్మాతు బేజివాన్ ॥

ఈ విధముగ నాడుచున్న యాదేవమీఢుషునియొక్క సమీపమునకు బంగారు బ్రహ్మాండమువలన బుట్టిన బ్రహ్మ స్వేచ్ఛగా వచ్చెను. ఆ బ్రహ్మ బంగారు వర్ణము గలవాడు. ఇంద్రియములకు మించిన (ప్రత్యక్షముగాఁని) వాడు. నాలుగు ముఖములు గలవాడు. అట్టి బ్రహ్మ మంచి గంధము కాస్తియు గల క్రొత్త శోభతో గూడిన పద్మముతో నాడుకొనుచున్న యా విష్ణువును జూచి ఆశ్చర్యమును బొందెను- 14, 15.

సవిస్మయమథాగమ్య శ(స్వ)స్య సంపూర్ణయా గిరా ।

ప్రోవాచ కో భవాన్ శేతే ఆశ్రితో మధ్యమంభసామ్॥

అథ తస్యాచ్యుతః శ్రుత్వా బ్రహ్మణస్తు శుభఃవచః ।

 ఉదతిష్ఠత పర్యఙ్కాద్విస్మయోత్ఫుల్లలోచనః ॥

 ప్రత్యువాచోత్తరం చైవ క్రియతే యచ్చ కించన ।

 ద్యౌరన్తరిక్షం భూతం చ పరంపదమహంప్రభుః ॥

తరువాత నా బ్రహ్మ తన సంపూర్ణ వాక్కుతో బలికెను. మీరెవరు సముద్రము జల మధ్యము నాశ్రయించి పడుకొనుచున్నారు అని-16. తరువాత బ్రహ్మయొక్క యా శుభవాక్కును విని అచ్యుతుడు ఆశ్చర్యముతో విప్పారిన కన్నులుగలవాడై పాన్పు నుండి లేచి కూర్చుండెను-17. ప్రత్యుత్తరముగా దీవి, అంతరిక్షము, భూతము పరమపదము గూడ ప్రభువైన నేనే అని-18.

తమేవముక్త్యా భగవాన్ విష్ణుం పునరథాబ్రవీత్ ।

కస్త్యం ఖలు సమాయాతః సమీపం భగవాన్ కుతః॥

 కుతశ్చ భూయో గన్తవ్యం కుత్ర వా తే ప్రతిశ్రీయ ।

కో భవాన్ విశ్వమూర్తిస్యం కర్తవ్యం కిం చ తే మయా ।

ఏవం బ్రువాణాం వైకుంఠం ప్రత్యువాచ పితామహః ॥

 యథా భవాం స్తథాచాహమాదికర్తా ప్రజాపతిః ।

నారాయణ సమాఖ్యాతః సర్వ వై మయి తిష్ఠతి ॥

ఈ విధముగా భగవంతుడు పలికి మరలనిట్లనెను. ఓ భగవాన్! నీవెవడవు? నా సమీపమునకెందులకు వచ్చితివి? ఇటునుండి యెక్కడికి బోవలసియున్నది? నీయాశ్రయము (నివాసము) ఎక్కడ? విశ్వమూర్తిగానున్న నీవెవ్వడవు? నాతోనీకు బనియేమి? అని యీ విధముగ బలుకుచున్న వైకుంఠుడైన విష్ణువును గూర్చి బ్రహ్మ ప్రతివచనమీవిధముగ బలికెను. 20 వారు ఆదికర్తయైనట్లే నేను గూడ యాదికర్తయైన ప్రజాపతిని (బ్రహ్మ) సర్వము నాయందున్నవి. అని నారాయణునితో చెప్పెను-21.

సవిస్మయం పరం శ్రుత్వా బ్రహ్మణా లోకకర్తృణా ।

 సోఽనుజ్ఞాతో భగవతా వైకుంఠో విశ్వసంభవః ॥

కౌతూహాలాన్మహాయోగీ ప్రవిష్టో బ్రహ్మణో ముఖమ్ ।

 ఇమానష్టాదశద్వీపాన్ సముద్రాన్ సపర్వతాన్ ।

ప్రవిశ్య సమహాతేజాశ్చాతుర్వర్ణ్య సమాకులాన్ ।

 బ్రహ్మాదిస్తంబపర్యన్తాన్ సప్తలోకాన్ సనాతనాన్ ॥

 బ్రహ్మణస్తూదరే దృష్ట్యా సర్వాన్ విష్ణుమహాయశాః ।

అహోఽస్య తపో వీర్యం పునః పునరభాషత॥

పర్యటన్ వివిధాన్ లోకాన్ విష్ణుర్నానావిధాశ్రమాన్ ।

 తతో వర్షసహస్రాన్తే నాన్తం హి దదృశే తథా ॥

విష్ణు వాశ్చర్యకరమైన బ్రహ్మమాట విని లోకవర్తనమయిన బ్రహ్మచే ననుమతింపబడినవాడై విశ్వకారణుడైన వైకుంఠుడైనను విష్ణువు-22, కుతూహలముతో మహాయోగియై యోగశక్తి గలవాడై బ్రహ్మయొక్క ముఖమును బ్రవేశించెను. ఆ విధముగా బ్రవేశించిన మహాతేజస్వియైన విష్ణువు సముద్రముతోను పర్వతములతోను గూడిన యీ యెనిమిది ద్వీపములను నాలుగు వర్ణములతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములతో సమాకులమైన బ్రహ్మ మొదలుకొని వరి గంట (యొక్క మధ్య భాగము) వరకు గల సనాతనములైన యేడు లోకములను వీనినన్నింటిని బ్రహ్మయొక్క కడుపులో జూచెను. తరువాత మహాయశస్కుడైన విష్ణువు. “ఆశ్చర్యమీతని తపస్సు యొక్క ప్రభావము” అని తనలో మాటిమాటికి బలికెను-23,24. ఆ విధముగా విష్ణువు వివిధములైన లోకములను అనేక విధములైన యాశ్రమములను తిరుగుచుండెను. వేయి యేండైనను విష్ణువపుడు దానికన్తమును జూడలేదు-25.

తదాఽస్య వక్త్రాన్నిష్క్రమ్యపన్న గేన్ద్రారికేతనః ।

అజాతశత్రుర్భగవాన్ పితామహ మథాబ్రవీత్ ॥

భగవాన్ యది మధ్యం చ అన్తకాలదిశోర్న చ ।

 నాహమన్తం ప్రపశ్యామి హ్యుదరస్య తవానఘ ॥

 ఏవముక్త్యా బ్రవీద్భూయః పితామహమిదం హరిః ।

 భవానప్యేవమేవాద్యహ్యుదరం మమ శాశ్వతమ్॥

 ప్రవిశ్య లోకాన్ పశ్యైతాననౌషమ్యాన్ ద్విజోత్తమ ॥

మనః ప్రహ్లాదనీం వాణీం శ్రుత్వా తస్యాభినంద్య చ ।

 శ్రీపతేరుదరం భూయః ప్రవివేశ పితామహ ॥

తానేవలోకాన్ గర్భస్థః పశ్యన్ సోఽచిన్త్య విక్రమః ।

 పర్యటిత్వాది దేవస్య దదర్మాఽన్తం న వై హరేః ॥

అపుడు గరుడధ్వజుడైన విష్ణువు బ్రహ్మదేవుని ముఖమునుండి వెలువడెను. తరువాత శత్రువులే పుట్టని భగవంతుడైన విష్ణువు భగవాన్, పుణ్యాత్ముడవైన నీ యొక్క కడుపు యొక్క మద్యమును, చివరను, కాల దిక్కుల యొక్కయనములను నేను జూడలేదు-26,27. అనియిట్లు పలికి విష్ణువు బ్రహ్మతోనిట్లనెను. ఓ బ్రహ్మా! ఇపుడు నీవు గూడ శాశ్వతమైన నాయుదరము (కడుపు)ను బ్రవేశించి సాటిలోని యీలోకములను జూడుము-28. తరువాత బ్రహ్మ ఆ విష్ణువు యొక్క మనోహరమైన వాక్కును విని యభినందించి-లక్ష్మీపతియైన విష్ణువు యొక్క యుదరమును బ్రవేశించెను-29. గర్భములో బ్రవేశించియుండిన యా చింతింపనలవిగాని పరాక్రమముగల బ్రహ్మయాలోకములనే చూచెను. అచట తిరిగి తిరిగి యాదిదేవుడైన విష్ణువు యొక్క (గర్భములో) యన్తమును చూడలేదు-30.

జ్ఞాత్వాగమం తస్య పితామహస్య ద్వారాణి సర్వాణి పిధాయ విష్ణుః ।

 విభుర్మనః కర్తుమియేష చారు సుఖం ప్రసుప్తోఽస్మి మహాజలౌఘేతి ॥

తతో ద్వారాణి సర్వాణి పిహితాన్యుప లక్ష్యతే! ।

 సూక్ష్మం కృత్వాఽత్మనో రూపం నాభ్యాం ద్వారమవిందత॥

పద్మసూత్రానువర్గేణ హ్యనుగమ్య పితామహః ।

 ఉజ్జహారాత్మనో రూపం పుష్కరాచ్చతురాననః

విరరాజారవిన్దస్థః పద్మగర్భసమద్యుతిః ॥

 ఏతస్మిన్నంతరే తాభ్యామేకైకస్య తు కార్త్స్య్నతః ।

ప్రవర్తమానే సంహర్షే మధ్యే తస్యార్ణవస్య తు

సర్వాత్తర్యామియైన విష్ణువు ఆ బ్రహ్మ వెలుపలికి రానున్నాడని తెలిసియన్నీ ద్వారములు మూసి వెంటనే మహాజలసమూహమున సుఖముగా నిద్రింపదలచెను. మహాజల సమూహమున నిద్రించితిని అనేను-31. అంత సమస్త ద్వారములు మాయబడినట్లు గనబడినవి. అంత బ్రహ్మ తన రూపమును సూక్ష్మముగాజేసి (విష్ణువుయొక్క) నాభియందు ద్వారమును తెలిసికొనెను-32. పద్మసూత్రమును (తామరతూటి దారమును) అనుసరించిన మార్గములనుసరించి వెళ్ళియా బ్రహ్మ నాలుగు ముఖముల యాతామరదుంప నుండి తనరూపమును పైకిలాగి ప్రకాశింపజేసెను. అపుడు పద్మగర్బముతో సమానమైన కాస్తిగలవాడై కమలమున నున్న బ్రహ్మ ప్రకాశించెను-33. ఇంతలో (ఈ మధ్యలో) ఆ సముద్ర మధ్యమున వారిరువురిచే మొత్తము పైన పరస్పరము మిక్కిలి సంతోషముగలుగుచుండెను-34.

సూత ఉవాచ:-

 తతో హ్యపరిమేయాత్మా భూతానాం ప్రభురీశ్వరః ।

 శూలపాణిర్మహాదేవో హైమచీరాంబరచ్ఛదః ॥

 ఆగచ్ఛద్యత్రిసోఽనన్తో నాగభోగపతిర్హరిః ॥

 శీఘ్రం విక్రమతస్తస్య పద్భ్యామత్యన్త పీడితాః ।

ఉద్భూతా సూర్ణమాకాశే పృథులాస్తోయబిందవః॥

 అత్యుష్ణాశ్చాతిశీతాశ్చ వాయుస్తత్ర వవౌభృశమ్॥

సూతుడు ఆనెను:- తరువాత ఆదిశేషుని పడగలపైని ప్రభువై (పరుండి)న విష్ణువు ఉన్న యాచోటికి ఇంతింతయని చెప్పనలవిగాని స్వరూపము గలవాడు, భూతములకు ప్రభువు, ఈశ్వరుడు, శూలము చేత ధరించినవాడు, బంగారు వస్త్రములు ధరించి కప్పుకొన్నవాడును ఐన మహాదేవుడు (శివుడు) వచ్చెను-35. వేగముగా నడచుచున్న యా శివుని పాదములచే మిక్కిలి పీడింపబడి వెంటనే యాకాశమున నేత్తుగా లేవగొట్టబడిన లావైన (సముద్ర) జల బిందువులు (కాలివేగపు తాకిడిచే) యత్యుష్టములై (గాలిచే) అతి శీతలములును ఐనవి. అచట వాయువు మిక్కిలి గొప్పదై వీచెను-36.

తద్దష్ట్యా మహదాశ్చర్యం బ్రహ్మావిష్ణుమ భాషత ।

 అబ్బిందనో హి స్థూలోష్ణాః కంపతే చాంబుజం భృశమ్॥

 ఏతం మే సంశయం బ్రూహి కించానృత్యంచికీర్షసి ॥

 ఆ మహాశ్చర్యమును జూచి బ్రహ్మ విష్ణువుతో నీటి బిందువులు లావై వేడియైనవి. (వానివలన) కమలము మిక్కిలి కంపించుచున్నది. ఈ నా సంశయమును గూర్చి నీవేమి చేయదలచినది చెప్పుము-37.

ఏతదేవం విధం వాక్యం పితామహముఖోద్భవమ్ ।

 శ్రుత్వా ప్రతిమకర్మాహ భగవానపురాన్తకృత్ ॥

కిన్ను ఖల్వత్రమే నాభ్యాం భూతమన్యత్కృతాలయమ్ ।

 వదన్తి ప్రియమత్యర్థం విప్రియే పి చ తే మయా ॥

ఇత్యేవం మనసా ధ్యాత్వా ప్రత్యువాచేద ముత్తమమ్ ।

 కిన్న్వత్ర భగవాంస్తస్మిన్ పుష్కరే జాతసంభ్రమః ॥

 కిం మయా యత్కృతం దేవయన్మాం ప్రియమనుత్తమమ్ ।

భాషసే పురుష శ్రేష్ఠ కిమర్థం బ్రూహి తత్త్వతః ॥

 ఏవం బ్రూవాణం దేవేశం లోకయాత్రాం తు తత్త్వగామ్ ।

ప్రత్యువాచాంబుజాభాస్కో (సో) బ్రహ్మవేదనిధిః ప్రభుః ॥

యోఽసౌ తవోదరం పూర్వం ప్రవిష్ణోఽహం త్వదిచ్ఛయా ।

యథా మమోదరే లోకాః సర్వే దృష్టా స్త్యయా ప్రభో।

 తధైవ దృష్టాః కార్త్న్యేన మయా లోకాంస్తవోదరే॥

 తతో వర్షసహస్రాన్ తే ఉపావృత్తస్య మేఽనఘ ।

 నూనం మత్సరభావేన మాం వశీకర్తుమిచ్చతా।

ఆశు ద్వారాణి సర్వాణి ఘటితాని త్వయా పునః ॥

 తతో మయా మహాభాగ సంచిత్య స్వేన చేతసా ।

 లబ్దో నాభ్యాం ప్రవేశస్తు పద్మసూత్రాద్విసర్గమః ॥

మాభూత్తే మనసోఽల్పోఽపి వ్యాఘాతోఽయం కథంచన ।

 ఇత్యేషానుగతిర్విష్ణోః కార్యాణామౌప సర్గికీ ॥

 యన్మయానన్తరం కార్యం మయాఽధ్యవసితం త్వయి ।

 త్వాం చా బాధితుకామేన క్రీడాపూర్వం యదృచ్ఛయా ।

 ఆశుద్వారాణి సర్వాణి ఘటితాని మయా పునః ।

 న తేఽన్యధావమన్తవ్యో మాన్యః పూజ్యశ్చ మే భవాన్ ।

 సర్వం మర్షయ కల్యాణ యన్మయాప కృతం తవ ।

 తస్మాత్మయోచ్యమానస్యం పద్మాదవతర ప్రభో ॥

బ్రహ్మ ముఖము నుండి వెలువడిన యీ విధమయిన మాటలను విని సాటిలేని క్రియాకారియైన రాక్షససంహారకారియై భగవంతుడైన విష్ణువు-38, “ఇది యేమిటి? యిచట నా నాభియందు వేరొక భూతము (ప్రాణి) నివాసమేర్పరచికొనినది? నీకు నాచే అనిష్టము చేయబడినప్పటికిని అది అత్యంత ప్రియము (ఇష్టమైనది)గా జెప్పుచున్నారు-39. అనీ మనస్సులో ననుకొని యుత్తమముగా నీ మటను బటికేను. ఓ భగవన్ నీవిచట ఆ కమలమునందు ఎందుల కాశ్చర్యము జెందితివి-40. నేను నీకేమి జేసితినని నీవు నాతో మిక్కిలి ప్రేమతో మాటలాడుచున్నావు? ఓ పురుషశ్రేష్ఠ! అది యెందులకు? నీజము జెప్పుము-41. ఈ విధముగా జెప్పుచున్న దేవేశుడైన విష్ణువును గూర్చి కమలకాంతిగలవాడు వేదనిధి, ప్రభువు అయిన బ్రహ్మ నిజముగా జరుగు లోకయాత్రను (లోకము నడకను) బదులుగా బలికెను-42. నీ కోరికతో నేను పూర్వము నీ కడుపులో బ్రవేశించితిని. నీచేత నా కడుపులో సర్వలోకములు చూడబడినట్లే నాచేతగూడ నీ కడుపులో సమస్త లోకములు జూడబడినవి-43. వేయి యేండ్ల తరువాత మరలిన నాకు ఓ పుణ్యుడా! నన్ను వశముజేసికొన గోరి నీవు మాత్సర్యముతో (అసూయతో) వెలుపలికి వచ్చు ద్వారములన్నియు మూసివేసితివి-44. తరువాత ఓ మహాభాగా! నేను నా మనస్సుతో చింతించగా (యోగధారణ చేయగా) నాభిలో నాకు ప్రవేశము లభించినది. కమలనాళపు దారము నుండి వెలువలి వచ్చుట జరిగినది-45. (అది విష్ణువు) ఓ భగవన్ బ్రహ్మా! నీ మనస్సునకిట్టి వ్యాఘాతము (దెబ్బ) ఏ విధముగనైనను కొద్ది మాత్రముగూడ కలుగకుండుగాక- ఇది విష్ణువు (నేను) తన పనులు వికటించినపుడు వానిననుకూలము చేయుట కనుసరించు రీతి-46. నేనే పనిని జేయవలసియున్నదో! ఏపని నీయందు నిశ్చితమయియున్నదో! నిన్ను బాధింపకుండును గోరి, ఆ పనికై నా యిష్టముతోనే, ఒకమాటగా (విలాసముగా) వేగముగా నీవు వెలుపలికి రాదగియున్న ద్వారములను మూసివేసితిని-47. కావున నీవు వేరుగా అవమానింపబడినవానిగా దలంపదగదు.నీవు నాకు గౌరవింపదగినవాడవు. పూజింపదగినవాడవు. ఓ కల్యాణుడా! నేను నీకు జేసిన యపకారమునంతయు క్షమింపుము. కావున ఓ ప్రభో! నేనే జెప్పినట్లు పద్మము నుండి క్రిందికి దిగుము-48.

నాహం భవనం శక్నోమి సోఢుం తేజోమయం గురుమ్ ।

స చోవాచ పరం బ్రూహి పద్మాదవతరామ్యహమ్ ॥

తేజోమయుడవై గురువైన (బరువైన) నిన్ను సహింపలేను. (అని విష్ణువనెను). ఆ బ్రహ్మగూడ వరమును జెప్పుము (ఇమ్ము) నేను పద్మము నుండి దిగెదను అని యనెను-49.

విష్ణురువాచ:-

 పుత్రో భవ మమారిఘ్నముదం ప్రాప్యసి శోభనమ్ ।

 సత్యధనో మహాయోగీ త్వమీడ్యః ప్రణవాత్మక ॥

 అద్యప్రభృతి సర్వేశ శ్వేతోష్ణీష విభూషణః ।

 పద్మయోనిరితీత్యేవం ఖ్యాత నామ్నా భవిష్యసి ।

 పుత్రో మే త్వం భవ బ్రహ్మన్ సర్వలోకాధిప ప్రభో ॥

 తతః స భగవాన్ బ్రహ్మ వరం గృహ్య కిరీటినః ।

ఏవం భవంతు చేత్యుక్త్యా ప్రీతాత్మా గతమత్సరః ॥

ప్రత్యాసన్నమథాయాతం బాలార్కాభం మహాననమ్ ।

 భూతమత్యద్భుతం దృష్ట్యా నారాయణ మథాబ్రవీత్ ॥

విష్ణువనెను:- ఓ శుత్రునాశకుడా! నాకు పుత్రుడవు గమ్ము శోభనమైన ముదమును (సంతసమును) బొందగలవు. నీవు సత్యధనుడవు మహాయోగివి. (అందరిచే) స్తుతింపదగిన వాడవు. ప్రణవస్వరూపుడవు-50. ఇవ్వేళటి నుండి ఓ సర్వేశ! తెల్లని తలపాగా అలంకారముగా గలవాడవు. పేరుతో పద్మయోనిపై ప్రసిద్ధుడవుగా గలవు. ఓ బ్రహ్మన్! సర్వలోకాధిపుడవైన ఓ ప్రభో! నాకు పుత్రుడవు కమ్ము-51. తరువాత ఆ భగవంతుడైన బ్రహ్మ కిరీటీ (విష్ణువు) నుండి వరమును దీసికొని సంతసించిన యాత్మగలవాడై యసూయలేని వాడై అట్లేయగుగాక’ యనియనెను-52. ఇంతలో సమీపమునకు వచ్చినదియు బాలసూర్యుని కాంతిగలదియు, అత్యద్భుతమైనదియు నైన భూతమును జూచి బ్రహ్మ నారాయణునితో ననేను-53.

అప్రమేయో మహావక్త్రో దంష్ట్రీ వ్యస్తశిరోరుహః ।

దశబాహు స్త్రిశూలాజ్కోనయనైర్విశ్వతో ముఖః ॥

 లోక ప్రభుః స్వయం సాక్షార్విక్ఫతో ముంజమేఖలీ ।

మేడ్రేణోర్థ్వేన మహతా నదమానోఽతి భైరవమ్ ॥

 కః ఖల్వేష పుమాన్ విష్ణో తేజోరాశిర్మహాద్యుతిః ।

 వ్యాప్యసర్వాదిశోద్యాం చ ఇత ఏవాభివర్తతే ॥

పరిమితిలేనివాడు పెద్ద ముఖము గలవాడు కోరలుగలవాడు, విరిసిన తల వెంట్రుకలు కలవాడు, పదిబాహువులు గలవాడు, త్రిశూలము (గుర్తుగా) ధరించినవాడు, మూడు కన్నులతో నన్ని వైపుల ముఖములు గలవాడు-54. లోకమునకు ప్రభువు. సాక్షాత్తుగా వీకారమయినయాకారము గలవాడు, ముంజగడ్డితో జేసిన మొలనూలు గలవాడు. పైకి లేచిన పెద్ద పరుషాంగముచేత భయంకరముగ ధ్వనిజేయుచున్నవాడు-55. అయిన యీ పురుషుడెవడు? ఓ విష్ణో! ఈతడు తేజోరాశియై మహాకాంతి గలిగి, అన్ని దిక్కులను ఆకాశమును వ్యాపించి యిటువైపే వచ్చుచున్నాడు. అని బ్రహ్మ విష్ణువుతోననెను-56.

తేనైవ ముక్తో భగవాన్ విష్ణుర్బ్రహ్మాణ మబ్రవీత్ ।

 పద్భ్యాన్తలనిపాతేన యస్య విక్రమతోఽర్ణవే ॥

 వేగేన మహతాకాశే వ్యధితాశ్చ జలాశయా ॥

 ఛటాభిర్విష్ణుతో ఽత్యర్థం సిచ్యతే పద్మసంభవః ।

 ఘ్రాణజేన చ వాతేన కంపమానం త్వయా సహ ॥

దోయతే మహాపద్మం స్వచ్చందం మమ నాభిజమ్॥

 స ఏష భగవానీశో హ్యనాధాశ్చాన్తకృద్విభుః ।

భవానహం చ స్తోత్రేణ హ్యుపతిష్ఠావగోద్వజమ్ 

బ్రహ్మతోనిట్లు చెప్పబడిన భగవంతుడైన విష్ణువు బ్రహ్మతో నిట్లనెను. ఆతడు అనాదియై ప్రళయమును జేయు భగవంతుడైన యీశ్వరుడు సముద్రమున నడచుచున్న యాతని కాలియడుగుల తాకిడికి జలాశయములు వేగముతోనెగిరి పీడింపబడినవి. ఆ నీటి గుంపులచే విష్ణువుకంటే పద్మసంభవుడైన బ్రహ్మయొక్కువగా తడిసిపోవుచున్నాడు. ముక్కునుండి వచ్చినగాలిచే నీతో (బ్రహ్మతో) సహా స్వేచ్చగా నా నాభియందు బుట్టిన కమలము కదులుచు ఊగుచున్నది-57, 58. కావున భగవంతుడైన వృషభధ్వజుని (శివుని) నీవును నేనును స్తోత్రముచే ఉపాసించెదము-59.

తతఃక్రుద్ధోఽబుజాభాస్కం బ్రహ్మా ప్రోవాచ కేశవమ్ ।

న భవాన్ న్యూనమాత్మానం లోకానాం యోనిముత్తమమ్ ॥

బ్రహ్మాణం లోకాకర్తారం మాం చ వేత్తిసనాతనమ్ ।

 కోయం భోః శఙ్కరో నామ హ్యావయోర్వ్యతిరిచ్యతే॥

తస్య తత్ క్రోధజం వాక్యం శ్రుత్వా విష్ణురభాషత ।

 మామైవం వద కల్యాణ పరివాదం మహాత్మనః ॥

మాయా యోగేశ్వరో ధర్మో దురాదర్షో వరప్రదః ।

 హేతురస్యాత్ర జగతః పురాణః పురుషోఽవ్యయః ॥

జీవఃఖల్వేష జీవానాం జ్యోతిరేకం ప్రకాశతే ।

 బాలక్రీడనకైర్దేవః క్రీడతే శఙ్కరః స్వయమ్

 ప్రధానమవ్యయం జ్యోతిరవ్యక్తం ప్రకృతిస్తమః ।

అస్య చైతాని నామాని నిత్యం ప్రసవధర్మిణః

యఃకః స ఇతి దుఃఖార్తైర్మ్యగ్యతే యతిభిః శివః ॥

ఏష బీజీ భవాన్ బీజమహం యోనిః సనాతనః ।

 ఏవముక్తోఽథవిశ్వాత్మా బ్రహ్మా విష్ణుమభాషత ॥

ఆ తరువాత కమలకాంతిగల బ్రహ్మ కోపించినవాడై విష్ణువుతో నిట్లనెను. నీవు (నాకన్న) తక్కువైన నిన్ను లోకములకు ఉత్తమమైన యోనిగా కారణముగా) తెలియవు-60. అట్లే నన్ను లోకకర్తయై సనాతనుడైన బ్రహ్మనుగా గూడ దెలియవు. ఓయి! ఈ శంకరుడను వాడెవడు? మన యిరువునకు వ్యతిరేకముగనున్నాడు. (అనియనెను)-61. విష్ణువా బ్రహ్మయొక్క కోపంమువల్ల గలిగిన మాటను విని యిట్లనెను. వలదు ఓ కల్యాణుడా! మహాత్ముడైన శఙ్కరుని యొక్కయు ఏ వాదమును ఇట్లనుము-62. కారణమేమనగా ఈతడు మాయా యోగేశ్వరుడు. ధర్ముడు తిరస్కరింపనలవిగానివాడు, వరములనిచ్చువాడు ఈ జగమునకు కారణుడు. పురాణమైన పురుషుడు నాశములేనివాడు. జీవులకీతుడు జీవుడు ఒకే జ్యోతి రూపుడై ప్రకాశించును. దేవుడైన శఙ్కరుడు బాలురను ఆట బొమ్మలచేత స్వయముగా వాడుకొనుచుండును-63, 64. ఈతడు నాశనములేని ప్రధానము. వ్యక్తముగాని జ్యోతి. తమోరూపమైన ప్రకృతి నిత్యము సృజించుటయే ధర్మముగల యీతని నామము లవి. దుఃఖపీడితులైన యతులచేత శివుడు యః (ఎవడు?) కః (ఎవడు) సః (వాడు) అని పిలువబడును-65. ఈ శివుడు బీజవంతుడు. బ్రహ్మవైన నీవు బీజము (బీజమవు) నేను సనాతనమైన యోనిని. (బీజము నిక్షేపించుస్థానమును) అని యీ విధముగా జెప్పబడిన విశ్వాత్ముడైన బ్రహ్మ విష్ణువుతో నీ విధముగ మాటాడెను-66.

భవాన్యోనిరహం బీజం కథం బీజీ మహేశ్వరః ।

 ఏతన్మే సూక్ష్మమవ్యక్తం సంశయం ఛేత్తుమర్హసి ॥

జ్ఞాత్వా చైవం సముత్పత్తిం బ్రహ్మణా లోకతంత్రిణా ।

 ఇదం పరమసాదృశ్యం ప్రశ్నమభ్యవదద్ధరి ॥

 అస్మాన్మహత్తరం గుహ్యం భూతమన్యన్న విద్యతే ।

 మహతః పరమంధామ శివమధ్యాత్మినాం పదమ్॥

ద్వైధీభావేన చాత్మానం ప్రవిష్టస్తు వ్యవస్థితః ।

నిష్కలః సూక్షమవ్యక్తః సకలశ్చ మహేశ్వరః

 అస్య మాయా విధిజ్ఞస్య అగమ్య గహనస్యచ ।

 పురా లిఙ్గం భవద్బీజం ప్రథమం త్వాదీసర్గికమ్ ॥

 మయి యోనౌ సమాయుక్తం తద్బీజం కాలపర్యయాత్ ।

 హిరణ్మయమపారం తద్యోన్యామండమజాయత ॥

 శతాని దశవర్షాణామండం చాప్యు ప్రతిష్ఠితమ్ ।

అన్తే వర్షసహస్రస్య వాయునా తద్ద్విధాకృతమ్ ॥

 కపాలమేకం ద్యౌర్జజ్ఞే కపాలమపరం క్షితిః ।

 ఉల్బం తస్య మహోత్సధం యోఽసౌ కనకపర్వతః ॥

తతస్తస్మాత్ప్రబుద్ధాత్మా దేవో దేవవరః ప్రభుః ।

 హిరణ్యగర్భో భగవానహం జజ్ఞే చతుర్భుజః ॥

నీవు (విష్ణువు) యోనివి. నేను (బ్రహ్మను) బీజమును మహేశ్వరుడు బీజి (బీజముగలవాడు) ఎట్లు? ఈ సూక్ష్మమై యవ్యక్తమైన సంశయమును దీర్పగోరుచున్నాను (అని బ్రహ్మ విష్ణువు నడిగెను)-67. లోక తంత్రముగలవాడైన బ్రహ్మచే జరుగు ఉత్పత్తిని దెలిసి విష్ణువు బ్రహ్మయొక్క సాటిలేని పై ప్రశ్నకు సమాధానముగా జెప్పెను-68. ఓ బ్రహ్మన్! ఈ శివుని కంటే మించిన మరొక భూతములేదు. అది మహత్తునకు పరమమయినధామము, (స్థానము) శివము, ఆధ్యాత్మకులకు నెలవైనది-69. అతడు రెండు విధములుగాన తనలో ప్రవేశించియుండెను. అతడు నిష్కలుడు (రూపములేనివాడు) సూక్ష్ముడు అవ్యక్తుడు, సకలుడు (సమస్త స్వరూపుడు) అయిన మహేశ్వరుడు-70. మాయావిధిని దెలిసి యితరులకు చేరనలవిగాని గంభీరుడైన యీ మహేశ్వరునియొక్క లింగము పూర్వము నీవు (బ్రహ్మవు) బీజముగా గలది ఆదిసృష్టి గలది-71. అది యోనియైన నా యందు (విష్ణువునందు) చక్కగా సంపూర్ణముగా కలిసినది. (బీజనిక్షేప చేయబడినది) కాలక్రమమున ఆ బీజము అంతులేని బంగారు (తేజో) మయమయి ఆ విష్ణు యోనిలో అండముగా నయ్యెను-72. వేయి యేండ్లు ఆ యండము నీటియందు నిలుపబడినది. వేయేండ్ల చివర వాయువుచే నాయండము రెండుగా జేయబడినది-73. దాని ఒక్కకపాలము (చిప్ప) ఆకాశమయ్యెను. మరొక కపాలము (చిప్ప) భూమియయ్యెను. దానియొక్క యెత్తైన ఉల్బముయొక్క భాగము ఈ బంగారు (మేరు) పర్వతము-74. తరువాత దాని నుండి మేలుకొన్న యాత్మగల దేవుడు, దేవవరుడు, ప్రభువు, భగవంతుడైన హిరణ్యగర్భుడు (బ్రహ్మవైన నీవు) నాలుగు భుజములు గలనేను (విష్ణువును) బుట్టితిమి. 75

తతో వర్ష సహస్త్రాన్తే వాయునా తద్ద్విధాకృతమ్ ।

 ఆతారార్కే రేందు నక్షత్రం శూన్యం లోకమమేక్ష్య చ ।

 కోయమత్రేత్య భిధ్యాతే కుమారాస్తేఽభవం స్తదా ॥

ప్రియదర్శనాస్పుతనవో యేఽతీతాః పూర్వజాస్తవ ।

 భూయోవర్షసహస్రాన్తే తత్ర ఏవాత్మజాస్తవ ।

భువనానలసంకాశాః పద్మపత్రాయతేక్షణా ॥

శ్రీమాన్ సనత్కుమారస్తు ఋభుశ్చైవోర్థ్వరేతసా ।

సనాతనశ్చ సనకస్తథైవ చ సనన్దనః

ఉత్పన్నాః సమకాలం తే బుద్ధ్యాతీంద్రియదర్శనాః ॥

 ఉత్పన్నాః ప్రతిఘాత్మానో జగదుశ్చ తదైవ హి ।

 నారప్స్యంతే చ కర్మాణి తాపత్రయ వివర్జితా ॥

తరువాత వేయి యేండ్లచివర వాయువుచేత ఆ యండము రెండుగా చేయబడినది. అపుడు తారలు చంద్రుడు నక్షత్రములు లేని లోకమును జూచి ఇక్కడ వీడెవడుండడవలెనని (శివుడు) ధ్యానింపగా ప్రియదర్శనులు (సుందరులు) మంచి శరీరముగలవారు. నీకంటే (బ్రహ్మకంటే) పూర్వమున బుట్టినవారునై గడచినవారునైన (యా) కుమారులు బుట్టిరి 76. మరల వేయేండ్ల చివర ఆయండము నుండియే నీ యాత్మజులు (పుత్రులు), నీటివలేను అగ్నివలెను శుద్దులు, కమలపు రేకులవంటి కన్నులు గలవారును-77. ఆయిన ఊర్థ్వరేతస్కులైన శ్రీమంతుడు సనత్కుమారుడు, ఋభువును, సనాతనుడు, సనకుడును సనందనుడు బుట్టిరి. వారు సమకాలముననే బుద్దిచేత ఇంద్రియములచే ప్రత్యక్షముగాని వానిని (పరమాత్మను) జూచువారైరి-78. అట్లు పుట్టినవారు ప్రతీఘాత్ములై యప్పుడే మాట్లాడిరి. ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మికములను తాపత్రయములను వదిలినవారై కర్మలను ప్రారంభింపరైరి-79.

అస్య సౌమ్యం బహుక్లేశం జలాశోక సమన్వితమ్ ।

 జీవితం మరణం చైవ సంభవం చ పునః పునః ॥

 స్వప్నభూతం పునః సర్గే దుఃఖాని నరకాంస్త థా ।

 విదిత్వాచాగమం సర్వమవశ్యం భవితవ్యతామ్ ॥

 ఋభుంసనత్కుమారం చ దృష్ట్వాతవ వశ స్థితౌ ।

 త్రయస్తు త్రీన్ గుణాన్ హిత్వా ఆత్మజాః సనకాదయః

వైవర్తేన తు జ్ఞానేన నివృత్తాస్తే మహౌజసః॥

 తతస్తేష్వపవృత్తేషు సనకాదిషు వై త్రిషు ।

భవిష్యసి విమూఢస్తు మాయయా శంకరస్య తు ॥

ఈతని (శంకరుని) శాంతమైన జీవన మరణ పునర్జన్మలు బహుకష్టములగలపై జరా (ముసలితనము) దుఃఖములతోగూడినవి-80. పునఃసృష్టిలోనివి స్వప్న (ప్రాయములైనవి. అట్లే దుఃఖములును నరకములును (స్వప్న ప్రాయములైనవి.) ఇదియంతయు రాబోవునది. తప్పనిసరిగా జరుగబోవునది. అని సనకాదులు దెలిసికొనిరి-81. వారు ఋభువు సనత్కుమారుడును నీ (బ్రహ్మ) వశమున నుండినట్లు చూచిరి. ఆనీకుమారులైన సనకాదులు మువ్వురు త్రిగుణములను (సత్వరజస్తమో గుణములను) వదిలి వైవర్త జ్ఞానముతో (ఆత్మవైపు తిరిగి జ్ఞానముతో మహాతేజోవంతులై నివృత్తులైరి (తొలగిరి)-82. తరువాత ఆ మువ్వురు.సనకాదులు తొలగిపోగా శంకరుని మాయచే నీవు (బ్రహ్మవు) విమూఢుడవు (ఏమి తెలియని వాడవు) అగుదువు-83.

ఏవం కల్పే తు వైకల్పే సంజ్ఞా నశ్యతి తేఽనఘ ।

 కల్పశేషాణి భూతాని సూక్ష్మాణి పార్థివాని చ ॥

సాచైషా హ్యైశ్వరీ మాయా జగతః సముదాహృతా ।

 స ఏష పర్వతో మేరుర్దేవలోక ఉదాహృతం ॥

 తవైవేదం హి మాహాత్మ్యం దృష్ట్యాచాత్మానమాత్మనా ।

 జ్ఞాత్వా చేశ్వరసద్భావం జ్ఞాత్వా మామంఋజేక్షణమ్ ॥

 మహాదేవం మహాయోగం భూతానాం వరదం ప్రభుమ్ ।

 ప్రణవాత్మా నమాసాద్య నమస్కృత్య జగద్గురుమ్ ॥

త్వాం చ మాం చైవ సంక్రుద్ధో నిఃశ్వాసాన్నిర్దహేదయమ్ ॥

ఏవం జ్ఞాత్వా మహాయోగమభ్యుతిష్ణన్ మహాబలః ।

అహం త్వామగ్రతః కృత్వా స్తోష్యేఽమనల ప్రభమ్ ॥

ఈ విధముగా కల్పము వికల్పముగాగా ఓ పాపరహితుడా! నీ పేరు నశించును. సూక్ష్మములు పార్థివము (భూసంబంధమైన) లైన కల్సశేషములు గతించినవి-84. జగమునకు సంబంధించినట్టి యా ఐశ్వరీ (ఈశ్వరసంబంధమైన) మాయ చెప్పబడినది. ఈ కనబడు ఆ పర్వతమే దేవలోకమున మేరువని చెప్పబడినది-85. నీ మహాత్మ్యమును జూచి, తనతో తనను దెలిసికొని ఈశ్వరుని యునికిని దెలిసికొని, కమలనేత్రుడినైన (విష్ణువు) నన్ను దెలిసికొని-86, మహాయోగీ, భూతములకు (ప్రాణులకు) వరమునిచ్చువాడు. ప్రభువు, ప్రణవ (ఓంకార) స్వరూపుడునైన మహాదేవునిజేరి, జగద్గురువైన యాతనికి నమస్కరించి కోపించినచో నీతడు (మహాదేవుడు) ఒక్క నిట్టూర్పుతోనే నిన్ను (బ్రహ్మను) నన్ను (విష్ణువు) దహించును-87. అని తెలిసికొని మహాయోగమున యెత్తుగా నిలుచునుచు. మహాబలుడవై నేను (విష్ణువును) నిన్ను (బ్రహ్మను). ముందడుకొని అగ్నీతేజస్కుడైన శంకరుని స్తుతింతును-88.

సూత ఉవాచ:-

బ్రహ్మాణమగ్రతః కృత్వా తతః సగరుడధ్వజం ।

అతీతైశ్చ భవిష్యైశ్చ వర్తమానైస్తథైవ చ।

 నామభిశ్ఛాన్దసైశ్చైవ ఇదం స్తోత్రముదీరయత్॥

సూతుడు పలికెను:- తరువాత ఆ గరుడుడు ధ్వజముగాగల విష్ణువు బ్రహ్మను ముందడుకొని, గడచినవి, రానున్నవి ప్రస్తుతమున్నవియు నైన ఛాందసములగు వైదికములు ఛందోబంధములు నామములతో స్తోత్రమున స్తుతించెను. 88

నమస్తుభ్యం భగవతే సువ్రతేఽనస్తతేజసే ।

నమః క్షేత్రాధిపతయే బీజినే శూలినే నమః ॥

అమేడ్రాయోర్థ్యమేఢ్రాయ నమో వైకుంఠరేతసే ।

 నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ అపూర్వప్రథమాయ చ ॥

 నమోహవ్యాయ పూజ్యాయ సద్యోజాతాయ వై నమః ।

గహ్వరాయ ధనేశాయ హైమచీరాంబరాయచ ॥

 నమస్తే హ్యస్మదాదీనాం భూతానాం ప్రభవాయ చ ।

వేదకర్మావదానానాం ద్రవ్యాణాం ప్రభవే నమః॥

 నమో యోగస్య ప్రభవే సాంఖ్యస్య ప్రభవే నమః ।

 నమో ధ్రువనిశీధానామృషీణాం పతయే నమః ॥

 విద్యుదశని మేఘనాం గర్జిత ప్రభవే నమః ।

 ఉదధీనాం చ ప్రభవే ద్వీపానాం ప్రభవే నమః ॥

అద్రణాంచ ప్రభవే చైవ వర్షాణాం ప్రభవే నమః ।

 నమో నదానాం ప్రభవే నదీనాం ప్రభవే నమః॥

 నమశ్చాషధి ప్రభవే వృక్షాణాం ప్రభవే నమః ।

 ధర్మాధ్యక్షాయ ధర్మాయ స్థితీనాం ప్రభవే నమః ॥

 నమో రసానాం ప్రభవే రత్నానాం ప్రభవే నమః ।

 నమః క్షణానాం ప్రభవే కలానాం ప్రభవే నమః

నిమేష ప్రభవే చైవ కాష్ఠానాం ప్రభవే నమః ।

అహోరాత్రార్థమాసానాం మాసానాం ప్రభవే నమః ॥

నమ ఋతూనాం ప్రభవే సంఖ్యాయాః ప్రభవే నమః ।

 ప్రభవే చ పరార్థస్య పరస్య ప్రభవే నమః ॥

నమః పురాణప్రభవే యుగస్య ప్రభవే నమః ।

 చతుర్విధస్య సర్గస్య ప్రభవేఽనన్తచక్షుషే ॥

 కల్పోదయే నిబద్ధానాం వార్తానాం ప్రభవే నమః ।

నమో విశ్వస్య ప్రభవే బ్రహ్మాది ప్రభవే నమః ॥

 విద్యానాం ప్రభవే చైవ విద్యానాం పతయే నమః ।

 నమో వ్రతానాం పతయే మన్త్రాణాం పతయే నమః ॥

 పితౄణాం పతయే చైవ పశూనాం పతయే నమః ।

 వాగ్వృషాయ నమస్తుభ్యం పురాణ వృషభాయ చ ॥

సురుచారు చారుకేశాయ ఊర్ధ్వ చక్షుః శిరాయ చ ।

 నమః పశూనాం పతయే గోవృషేన్ద్రధ్వజాయ చ ॥

ప్రజాపతీనాం పతయే సిద్దానాం పతయే నమః ।

గరుడోరగ సర్పాణాం పక్షిణాం పతయే నమః ॥

గోకర్ణాయ చ గోషాయ శఙ్కుకర్ణాయ వై నమః ।

 వారాహాయాప్రమేయాయ రక్షోఽధిపతయే నమః

 నమోహ్యప్సరసాం ప్రత్యేయగణానాం (పతయే) హ్రి యే నమః ।

అంభసాం పతయే చైవ తేజసాం పతయే నమః ॥

నమోఽస్తు లక్ష్మీపతయే శ్రీమతే హ్రీమతే నమః ।

 బలాబలసమూహాయ హ్యక్షోభ్యక్షోభణాయ చ ॥

దీర్ఘశృంగైకశృంగాయ వృషభాయ కకుద్మినే ।

నమః స్థైర్యాయ వపుషే తేజసే సుప్రభాయ చ

భూతాయ చ భవిష్యాయ వర్తమానాయ వై నమః ।

సువర్చసేఽథ వీరాయ శూరాయ హ్యతిగాయ చ ॥

వరదాయ వరేణ్యాయ నమః సర్వగతాయ చ ।

నమో భూతాయ భవ్యాయ భవాయ మహతే తథా॥

 జనాయ చ నమస్తుభ్యం తపసే వరదాయ చ ।

నమో వన్ద్యాయ మోక్షాయ జనాయ నరకాయ చ ॥

 భవాయ భజమానాయ ఇష్టాయ యాజకాయ చ ।

అభ్యుదేర్ణాయ దీప్తాయ తత్త్వాయ నిర్గుణాయ చ ॥

నమః పాశాయ హస్తాయ నమః స్వాభరణాయ చ ।

 హుతాయ అపహుతాయ ప్రసూత ప్రశితాయ చ ॥

 నమోఽస్త్విష్టాయ మూ(పూ)ర్తాయ హ్యగ్నిష్టోమర్త్విజాయ చ ।

నమ ఋతాయ సత్యాయ భూతాధిపతయే నమః॥

 సదస్యాయ నమశ్చైవ దక్షిణావబృథాయ చ ।

 అహింసాయాధలోకానాం పశుమన్త్రౌషధాయ చ ॥

 నమస్తుష్టి ప్రదానాయ త్య్రంబకాయ సుగంధినే ।

నమోఽస్త్విన్ద్రియపతయే పరిహారాయ స్రగ్విణే ॥

విశ్వాయ విశ్వరూపాయ విశ్వతోఽ క్షిముఖాయ చ ।

 సర్వతః పాణిపాదాయ రుద్రాయా ప్రమితాయ చ ॥

 నమోఽహవ్యాయ కవ్యాయ హవ్యకవ్యాయ వై నమః ।

 నమః సిద్ధాయ మేధ్యాయ చేష్టాయ త్వవ్యయా చ ॥

సువీరాయ సుఘోరాయ హ్యక్షోభ్యక్షోభణాయ చ ।

సుమేధసే సుప్రజాయ దీప్తాయ భాస్కరాయ చ ॥

 నమోఽనమః సుపర్ణాయ తపనీయనిభాయ చ ।

 విరూపాక్షాయ త్యక్షాయ పిఙ్గలాయ మహౌజసే ॥

 దృష్టిఘ్నాయ నమశ్చైవ నమః సౌమ్యేక్షణాయ చ ।

 నమో ధూమ్రాయ శ్వేతాయ కృష్ణాయ చ ॥

పిశితాయ పిశఙ్గాయ పీతాయచ నిషఙ్గిణే ।

 నమస్తే సవిశేషాయ నిర్విశేషాయ వై నమః॥

 నమో వై పద్మవర్ణాయ మృత్యుఘ్నాయ చ మృత్యువే ।

 నమః శ్యామ్యాయ గౌరాయ కద్రవేరోహితాయచ ॥

 నమః కాన్తాయ సన్ధ్యాభ్రవర్ణాయ బహురూపిణే ।

 నమః కపాలహస్తాయ దిగ్వస్త్రాయ కపర్థినే ॥

 అప్రమేయాయ శర్వాయ హ్యవధ్యాయ వరాయ చ ।

 పురస్తాత్పృష్ఠతశ్చైవ బిభ్రాణాయ కృశానవే ॥

దుర్గాయ మహతే చైవ రోధాయ కపిలాయ చ ।

అర్కప్రభశరీరాయ బలినే రంహసాయ చ॥

 పినాకినే ప్రసిద్దాయ స్థితాయ ప్రసృతాయ చ ।

 సుమేధసేఽక్షమాలాయ దిగ్వాసాయ శిఖండినే ॥

 చిత్రాయ చిత్రవర్ణాయ విచిత్రాయ ధరాయ చ ।

 చేకితానాయ తుష్టాయ నమస్త్యనిహితాయ చ ॥

 నమశిక్షాన్తాయ శాన్తాయ వజ్రసంహననాయ చ ।

రక్షోఘ్నాయ మఖఘ్నాయ చ శితికంఠోర్ధ్వరేతసే॥

అరిహాయ కృతాన్తాయ తిగ్మయుధ ధరాయ చ ।

సమోదాయ ప్రమోదాయ ఇరిణాయైవ తే నమః ॥

ప్రణవ ప్రణవేశాయభక్తానాం శర్మ యదాయ చ ।

మృగవ్యాధాయ దక్షాయ దక్షయజ్ఞహరాయ చ ॥

సర్వభూతాయ భూతాయ సర్వేశాతి శయాయ చ ।

పురభేత్రేచ శాన్తాయ సుగన్ధాయ వరేశవే ॥

పుష్పవన్త స్వరూపాయ ఖగనేత్రాన్తకాయ చ ।

 కణాదాయ విరిష్ఠాయ కామాఙ్గదహనాయ చ ॥

రవేః కరాల చక్రాయ నాగేన్ద్రదమనాయ చ ।

 దైత్యానామన్తకాయాద్గో దివ్యాక్రన్ద కరాయ చ ॥

 శ్మశానరతి నిత్యాయ నమస్త్య్రంబకధారిణే ।

 నమస్తే ప్రాణపాలాయ ధవమాలాధరాయ చ ॥

ప్రహీణ శోకైర్వివిధైర్భూతైః పరిష్ణుతాయ చ ।

 నరనారీశరీరాయ దేవ్యాః ప్రియకరాయ చ ॥

జటినే దండినే తుభ్యం వ్యాలయజ్ఞోపవీతినే ।

 నమోఽస్తు నృత్యశీలాయ వాద్యనృత్య ప్రియాయ చ ॥

మన్యవే శీతశీలాయ సుగీతిగాయతే నమః ।

 కటకకరాయ భీమాయ చోగ్రరూపధరాయ చ ॥

విభీషణాయ భీమాయ భగప్రమథనాయ చ ।

సిద్దసంఘాత గీతాయ మహాభాగాయ వై నమః ॥

నమో ముక్తాట్టహాసాయ క్ష్వేదితా స్ఫోటితాయ చ ।

నదతే కూర్పతే చైవ నమః ప్రముదితాయ చ ॥

 నమోఽద్భుతాయ స్వపతే ధావతే ప్రస్థితాయ చ ।

ధ్యాయతే జృంభతే చైవ తుతే ద్రవతే నమః ॥

చలతే క్రీడతే చైవ లంబోదర శరీరిణే ।

 నమః కృతాయ కంపాయ ముండాయ వికారాయ చ ॥

నమ ఉన్మత్తవేషాయ కింకిణీకాయ వై నమః ।

 నమో వికృతవేషాయ క్రూరో గ్రామర్షణాయ చ ॥

 అప్రమేయాయ దీప్తాయ దీప్త యే నిర్గుణాయ చ ।

 నమః ప్రియాయ వాదాయ ముద్రామణిధరాయ చ ॥

నమస్తోకాయ తనవే గుణైరప్రతిమాయ చ ।

నమోగణాయ గుహ్యాయ అగమ్యా గమనాయ చ ॥

భగవంతుడవైన నీకు నమస్కారము సువ్రతుడవైన నీకు నమస్కారము. అనన్త తేజస్కుడవైన నీకు నమస్కారము. క్షేత్రాధిపతి (ధీరాధిపతి)వైన నీకు నమస్కారము. బీజవంతునకు శూలికి నీకు నమస్కారము-90. సాటిలేని మేడ్రము (పురుషాంగము) గలవానికి, మహోన్నతమైన పురుషాంగము గలవానికి, వైకుంఠమురేతస్సుగా గలవానికి నీకు నమస్కారము. జ్యేష్ఠునకు శ్రేష్ఠునకు మొదలులేని మొదటిదానికి నమస్కారము-91. హవ్య (హోమము చేయదగిన) రూపమమైన వానికి, పూజ్యునకు సద్యోజాతునకు నీకో నమస్కారము. గుహారూపునకు కుబేర రూపునకు బంగారు వస్త్రములను ధరించినవానికి నీకు నమస్కారము-92. మాబోటి ప్రాణులను బుట్టించువానీకి, వేదములు చెప్పిన పరిశుద్ద కర్మలకును ద్రవ్యములకును పుట్టుస్థానమైనవానికి నీకు నమస్కారము-93. యోగ ప్రభువునకు సాంఖ్య ప్రభువునకు నీకు నమస్కారము. ధ్రువ నీశీధులకు ఋషులకు పతియైనవానికి నీకు నమస్కారము-94. మెరుపులు పిడుగులు మేఘములు గర్జములు వీనికి ప్రభువైనవానికి నీకు నమస్కారము. సముద్ర ప్రభువునకు ద్వీపముల ప్రభువునకు నీకు నమస్కారము-95. పర్వత ప్రభువు నీకు వర్ష ప్రభువునకు నీకు నమస్కారము. నదముల ప్రభువునకు నదుల ప్రభువునకు నీకు నమస్కారము-96. ఓషధి ప్రభువునకు వృక్షప్రభువునకు నీకు నమస్కారము. ధర్మాధ్యక్షునకు ధర్మ స్వరూపునకు నీకు స్థితుల ప్రభువునకు నీకో నమస్కారము-97. రసముల ప్రభువుకు రత్నముల ప్రభువునకు నీకు నమస్కారము క్షణముల ప్రభువునకు క్షణము 16000 కనురెప్పపాటు కాలము) నీకు నమస్కారము-98. కనురెప్పలపాటు కాలమైన నిమేషమునకు ప్రభువైనవానికి కాష్ఠలకు ప్రభువైన వానికి (కాష్ఠ = 18 కనురెప్పపాటు) నీకు నమస్కారము. రాత్రింబగళ్ళకు సగము నెలలకు నెలలకును ప్రభువైన నీకు నమస్కారము-99. ఋతువుల ప్రభువునకు సంఖ్య యొక్క ప్రభువునకు నమస్కారము. బ్రహ్మయాయువులో సగము పదార్థము అట్టి పరార్థకాలమునకు ప్రభువైన నీకు నమస్కారము. బ్రహ్మయాయువు పరము. అట్టి పరమునకు ప్రభువైన నీకు నమస్కారము-100. ప్రాచీనముల ప్రభువునకు, యుగముల ప్రభువునకు నీకు నమస్కారము తొలుగు విధములై సృష్టికి ప్రభువైన నీకు నమస్కారము. అనన్తములైననేత్రములు గల నీకు నమస్కారము-101. కల్పప్రారంభమున నేర్పరచిన వృత్తులకు ప్రభువైన నీకు నమస్కారము. విశ్వప్రభువునకు నీకు నమస్కారము-102. విద్య ప్రభువునకు నీకు నమస్కారము 103. పితృదేవతల పతికి, పశుపతికి నీకు నమస్కారము. వాక్ శ్రేష్ఠరూపునకు నీకు నమస్కారము. పురాతనమైన బీజములు వర్ణించువానికి నీకు నమస్కారము సర్వ బీజములను, వర్షించు పురాణ వృషభ స్వరూపుడని భావము)-104. మిక్కిలి సుందరమైన వెంట్రుకలు గలవానికి ఊర్థ్యముగా నేత్రములు శిరమును గలవానికి నీకు నమస్కారము. పశువుల పతికి గోవు వృషభ శ్రేష్ఠము ధ్వజముగా గలవానికి నీకు నమస్కారము-105. ప్రజాపతుల బ్రహ్మలకు) పతికి, సిద్దుల పతికి నీకు నమస్కారము. గరుడులకు ఉరగములకు సర్పములకు పక్షులకును పతియైన నీకు నమస్కారము-106. గోకర్ణస్వరూపునకు, గోవునందుండువానికి శంకుకర్ణునకు నీకు నమస్కారము. వరాహావతార రూపునకు జ్ఞానాతీతునకు రక్షస్సుల యధిపతికి నీకు నమస్కారము-107. అప్సరసల పతికి గణముల పతికి జలములకు తేజస్సులకు పతికి నీకు నమస్కారము-108. లక్ష్మీపతికి శ్రీమంతునకు ప్రీమంతునకు నీకు నమస్కారము. బలాబల స్వరూపునకు అక్షోభ్యుల క్షోభింపజేయువానికి నీకు నమస్కారము-109. పొడవైన ఒకే కొమ్ము గలిగి మంచి యెత్తైన మూపురముగల వృషభ స్వరూపుడవైన నీకు నమస్కారము ఛైర్యముగలిగి తేజోవంతమైన మంచి కాంతిగల శరీరము గల నీకు నమస్కారము-110. భూతభవిష్యద్వర్తమాన స్వరూపునకు నీకు నమస్కారము. మంచి వర్చస్సు గలిగి అందరి నతిక్రమించి వీరశూరతలు గలవానికి నీకు నమస్కారము-111. వరమునిచ్చువానికి, వరింపదగిన వానికి సర్వమునందున్న వానికి నీకు నమస్కారము. భూతభవిష్యత్కాల స్వరూపునకు మహాదేవుడై భవుడవైన నీకు నమస్కారము-112. జనస్వరూపునకు తపస్స్వరూపునకు వరదునకు నీకు నమస్కారము నమస్కరింపదగిన వానికి మోక్షస్వరూపునకు జనరూపునకు నరకరూపునకు నీకు నమస్కారము-113. భవునకు అందరిచే సేవింపబడువానికి యజ్ఞ స్వరూపునకు యజ్ఞము చేయించు పురోహిత స్వరూపునకు మహోదార స్వరూపునకు, మిక్కిలి ప్రకాశించిన ప్రకాశ స్వరూపునకు (పరమాత్మ స్వరూపునకు) నిర్గుణ స్వరూపునకు-114. పాశహస్తునకు తనకు తానే యాభరణ (అలంకార) మైన వానికి హోమము చేయబడిన ద్రవ్యరూపునకు అపహుతునకు హోమము చేయబడని ద్రవ్య స్వరూపునకు) ప్రహుత ప్రశి(సి)తునకు (అధికముగా హోమము చేయబడిన హోమద్రవ్యమునందు అత్యంతాసక్తి గల నీకు నమస్కారము 115. ఇష్టస్వరూపునకు (యజ్ఞ స్వరూపునకు ప్రియ స్వరూపునకు) హోమదానాదిక్రియ అంతర్వేదిలో దానమీయబడినది ఇష్టము తత్స్వరూపునకు), మూర్తిమత్స్వరూపునకు (చెరువుల దేవాలయములు మొదలగువాని నిర్మాణముల స్వరూపునకు ఋతస్వరూపునకు సత్యస్వరూపునకు భూతాధిపతియైన నీకు. నమస్కారము-116. సదస్య (యజ్ఞ సభలోని సభ్యుల) స్వరూపునకు దక్షిణావబృథ స్వరూపునకు లోకుల యహింసా స్వరూపునకు పశుమన్త ఔషధి స్వరూపునకు నీకు నమస్కారము 117. తుష్టినిచ్చువానికి త్ర్యంబకునకు (మూడు కన్నుల వానికి) మంచి గంధముగలవానికి ఇంద్రియములయధిపతికిని అన్ని దోషములకు పరిహారమైన వానికి (పూల) మాలలు ధరించిన వానికిని నీకు నమస్కారము-118. విశ్వుడును, విశ్వరూపుడును. అంతటను నేత్రములు ముఖములు గలవాడును అంతటను చేతులు కాళ్ళుగలవాడును రుద్రుడును ప్రమితుడును (నిజముగా నెరుగబడినవాడు) అగు నీకు నమస్కారము-119. హవ్య (దేవయోగ్యమయిన అన్నము) స్వరూపునకు, కవ్య (పితరులకు యోగ్యమయిన యన్నము) స్వరూపునకు హవ్యకవ్య స్వరూపునకు నీకు నమస్కారము. సిద్ద స్వరూపునకు పవిత్రాత్మునకు, చేష్టా స్వరూపునకు నాశములేనివానికి నీకు నమస్కారము-120. చక్కని వీరునకు, చక్కని భయంకరునకు క్షోభింపనలవిగాని వారిని గూడ క్షోభింపచేయువానికి చక్కని మేధావంతునకు చక్కని సంతానముగలవానికి, ఉజ్జ్వల ప్రకాశవంతునకు, సూర్యస్వరూపునకు నీకు నమస్కారము-121. చక్కని రెక్కలు గల గరుడస్వరూపునకు, బంగారు కాంతిగల వానికి నీకు మరల మరల నమస్కారము విరూపమయిన కన్నులు గలవానికి మూడు కన్నులు గలవానికి, పింగళస్వరూపునకు (సూర్య స్వరూపునకు) మహాతేజస్వికి నీకు నమస్కారము-122. దృష్టిని (కుదృష్టిని) పోగొట్టువానికి, శాంతమైన చూపులు గలవానికి, పొగవర్ణము గలవానికి, తెల్లనైనవానికి, నల్లనైన వానికీ ఎఱ్ఱనైనవానికి నీకు నమస్కారము-123. మాంస స్వరూపునకు, కోతివర్ణము గలవానికి, పచ్చనైనవానికి, అమ్ములపొది గలవానికి, విశేష స్వరూపములు గలవానికి, ఏ విశేషములు లేనివానికి నీకు నమస్కారము-124. పద్మమువంటి వర్ణముగలవానికి, మృత్యువును (యముని) జంపినవానికి మృత్యుస్వరూపునకు, శ్యామునకు (నల్లనివానికి) గౌరునకు (తెల్లనివానికి) కద్రు (గోరోచన) వర్ణము గలవానికి, ఎఱుపువానికి నీకు నమస్కారము-125. కాస్తునకు (మనోహరునకు) సంధ్యాకాల మేఘము వంటి వర్ణము గలవానికి, బహురూపములు గలవానికి, పుఱ్ఱెచేతియందు గలవానికి దిక్కులే వస్త్రములుగాగల దిగంబరుడైన వానికి, జటాజూటముగలవానికి నీకు నమస్కారము-126. జ్ఞానాతీతునకు శర్వునకు, వధింపనలవిగాని వానికి, వరు (శ్రేష్టు)నకు, ముందును, వెనుకను స్వరూపములను ధరించినవానికి, అగ్ని స్వరూపనకు నీకు నమస్కారము-127. చేరనలవిగాని వానికి, మహత్స్వరూపునకు, అడ్డినవానికి, కపిల వర్ణము గలవానికి, సూర్యకాంతి వంటి శరీరము గలవానికి బలవంతునకు, వేగవంతునకు నీకు నమస్కారము-128. పినాకమనుధనువు ధరించిన వానికి, ప్రసిద్దునకు స్పీతు (విశాలు)నకు, ప్రసరించినవానికి, చక్కని మేధాస్వరూపునకు, దిక్కులే వస్త్రములు గలవానికి శిఖగల వానికి నీకు నమస్కారము-129. చిత్ర స్వరూపునకు చిత్రమైన వర్ణములు గలవానికి, విచిత్రునకు సర్వము ధరించువానికి, చేకితానునకు, తుష్టునకు, అనిహితునకు (ఎక్కడను ఉంచబడని వానికి) నీకు నమస్కారము-130. క్షానునకు (క్షమగలవానికి) శాన్తునకు (శరణుగలవానికి), వజ్రము వంటి శరీరము గలవానికి రాక్షసుల జంపువానికి, దక్షయజ్ఞమును ధ్వంసము జేసినవానికి, నల్లని కంఠమును ఊర్థ్వరేతస్సును గలవానికి నీకు నమస్కారము-131. శుత్రవుల సంహరించువానికి యమస్వరూపునకు తీక్ష్మమైన యాయుధముల ధరించినవానికి, మోదము (సంతోషము)తో గూడిన వానికి, అతిసంతోష స్వరూపునకు, శూన్యస్వరూపునకు నీకు నమస్కారము-132. ఓంకార స్వరూపునకు ఓంకారాధీశ్వరుడవు భక్తులకు సుఖమునిచ్చువాడవు, మృగమును వేటాడు వాడవు సమర్థుడవు. దక్షయజ్ఞ ధ్వంసముజేసినవాడవునైన నీకు నమస్కారము-133. సర్వమైనవాడవు. త్రిపురముల ఛేదించినవాడవు, శాస్త్రుడవు, సుగంధుడవు వరులకు గూడ ప్రభువైనవాడవునైన నీకు నమస్కారము-134. పుష్పవన స్వరూపుడవు (సూర్య చంద్ర స్వరూపుడవు), భగనేత్రాన్తకుడవు (ఇంద్రాంతకుడవు) కణాదస్వరూపుడవు, వరిష్టుడవు. కొముని శరీరముగాల్చిన వాడవునైన నీకు నమస్కారము-135. సూర్యుని భయంకర చక్ర స్వరూపుడవు. నాగరాజు నణచిన వాడవు దైత్యులకంతకుడవు, దివ్యులకు రోదనము గలుగజేయువాడవునైన నీకు నమస్కారము-136. శ్మశాన ప్రియుడవై నిత్యడవైన నీకు నమస్కారము. మూడు నేత్రములు ధరించువాడవు, ప్రాణములను పాలించువాడవు, కదలుచున్నమాలలను ధరించువాడవునైన నీకు నమస్కారము-137. శోకము వీడిన యనేక ప్రాణులచే బాగుగా స్తుతింపబడినవాడవు. నరనారీ శరీరము (అర్థనారీశ్వర శరీరము) గలవాడవు. పార్వతీదేవికి ప్రియమును జేయువాడవునైన నీకు నమస్కారము-138. జటాధారివి దండధారివి సర్ప యజ్ఞోపవీతముగల వాడువైన నీకు నమస్కారము. నృత్య స్వభావముగలవాడవు. వాద్యములు నృత్యములు ఇష్టమైనవాడవునైన నీకు నమస్కారము-139. మను (కోప) స్వరూపుడవు, చల్లని శీలము గలవాడవు, చక్కనీ గీతులను గొనముజేయువాడవు. కంకణములు చేతులలో నలంకరించుకొన్నవాడవు. భయంకరుడవు. భయంకరరూపమును ధరించినవాడవునైన నీకు నమస్కారము-140. విభీషణుడవు (మిక్కిలి భయంకరుడవు, భయంకరుడవు, సూర్యుని (దక్షయజ్ఞములో) మథించినవాడవు. సిద్ద సమూహములచే గానము జేయబడినవాడవు మహాభాగుడవు (మహాభాగ్యవంతుడవు నైన నీకు నమస్కారము-141. పెద్ద నవ్వుగలవానికి, సింహనాదము చటుచుట లేక చీల్చుటయు గలవానికి, ధ్వనిచేయుచున్నవానికి, దుముకుచున్న వానికి మిక్కిలి సంతసించిన వానికిని నీకు నమస్కారము-142. అద్భుత రూపునకు, నిద్రించువానికీ, పరిగెత్తువానికి, పీడించుచున్నవానికి, (పరిగెత్తుచున్నద్రవీభావము జెందుచున్నవానికి, నీకు నమస్కారము-143. కదులుచున్నవానికి, ఆడుచున్నవానికి, లావైన కడుపు శరీరము గల వానికి నీకు నమస్కారము కృతస్వరూపుడు వికార రూపములైన చేతులుగల వానికి, నీకు నమస్కారము-144. పిచ్చివేషముగలవానికి చిరుగజ్జెలు గలవానికి, వికృత వేషము గలవానికి క్రూరునకు నీకు నమస్కారము-145. జ్ఞానాతీతునకు ఉజ్జ్వల ప్రభావంతునకు, ప్రభాస్వరూపునకు, నిర్గుణునకు, ప్రియునకు నాదస్వరూపునకు ముద్రలను మణులను ధరించిన వానికి నీకు నమస్కారము-146. అపత్య (సంతాన) స్వరూపునకు సూక్ష్మ శరీరికి, గుణములచే సాటిలేనివానికి, గుణ స్వరూపునకు, యక్ష (రహస్య రూపునకు, తెలియనలవిగాని దానిని గూడ దెలిసికొను వానికి నీకు నమస్కారము-147.

లోకధాత్రీత్వయం భూమిః పాదౌ సజ్జనసేవితా ।

 సర్వేషాం సిద్దయోగానామధిష్ఠానం తవోదరమ్ ॥

మధ్యేఽన్తరిక్షం విస్తీర్ణం తారాగణవిభూషితమ్ ।

తారాపథ ఇవాభాతి శ్రీమాన్ హరస్తవోరసి ॥

దిశోదశభూజాస్తే వై కేయూరాఙ్గద భూషితాః ।

 వీస్తీర్ణపరిణాహశ్చ నీలాంబుదచయో పమః ॥

 కంఠస్తే శోభతే శ్రీమాన్ హేమసూత్ర విభూషితః ।

 దంష్ట్రాకరాల దుర్ధర్షమనౌమ్యం ముఖం తవ ॥

 పద్మమాలాకృతోష్ణీషం శీర్షణ్యం శోభతే కథమ్ ।

 దీప్తిః సూర్యేవపుశ్చన్ద్రే స్థైర్యే భూర్హ్యనిలో బలే ॥

తైక్ష్ణ్యమగ్నౌ ప్రభాచన్ద్రే ఖే శబ్దః శైత్యమప్సు చ ।

 అక్షరోత్తమనిష్పన్దాన్ గుణానేతాన్విదుర్బుధాః ॥

లోకమును ధరించునది (నీకు) భూమి నీ పాదములు సజ్జనులచే సేవింపబడినవి. నీయుదరము సమస్త సిద్ధయోగముల కధిష్టానము-148. నీ నడుము తారాగణములతో నలంకరింపబడినదై విశాలమైన యంతరిక్షము (ఆకాశము) నీ వక్ష స్థలమున తారాపథము (పాలవెల్ల చుక్కల మార్గము)వలే హారము ప్రకాశించుచున్నది-149. నీ పదిభుజములు కేయూరములతో (భుజకీర్తులతో) అంగదములతో (మరికొన్ని భూజాలంకారములతో) నలంకరింపబడిన పదిదిక్కులు. నీ కంఠము వెడల్పై వైశాల్యము గలదై నల్లని మేఘసమూహము వంటిదై-150. శ్రీమంతమై (విషముగలదై) బంగారు సూత్రములతో నలంకరింపబడినదై ప్రకాశించుచున్నది. కోరలచే భయంకమైన దుర్భరమై తిరస్కరింపనలవి కానిదై సాటిలేనిది నీ ముఖము 151. కమలమాలలతో తలపాగాగా చుట్టబడిన నీ శిరస్త్రాణము (లేదా నీ విరబోసిన తల వెంట్రుకలు) ఎంత చక్కగా ప్రకాశించుచున్నది. నీ యుజ్జ్వలకాంతి సూర్యుని యుందున్నది. నీ శరీరము (కాంతి) చంద్రునియందున్నది. నీ ఛైర్యమున భూమియున్నది. నీ బలమున వాయువున్నది-152. నీ తీక్షత అగ్నిలోనున్నది. నీ కాంతి చంద్రునియుందున్నది. నీశబ్దమాకాశమునందున్నది. నీ చల్లదనము నీటిలోనున్నది. పండితులు ఈ నీగుణములను అక్షరములై (నాశరహితములై) ఉత్తమములై (అత్యున్నతములై) నిష్పదములై ఏ మాత్రము కదలికలేనివైనవిగా స్థిరమైనవిగా దెలియుదురు-153.

జపో జప్యో మహాయోగీ మహాదేవో మహేశ్వరః ।

 పరేశయో గుహావాసీ ఖేచరో రజనీచరః ॥

తపోనిధిర్గుహగురుర్నందనో నందివర్ధనః ।

 హరశీర్షో ధరా ధాతా విధాతా భూతవాహనః ॥

 బోద్ధవ్యో బోధనో నేతా ధూర్వహొదుష్ప్రకంపకః ।

 బృహద్రథో భీమకర్మా బృహత్కీర్తి ర్ధనంజయః ॥

 ఘంటాప్రియో ధ్వజీ ఛత్రీపతాకాధ్వజినీపతిః ।

 కవచీ పట్టిశీ శంఖీ పాశహస్తః పరేశ్వభృత్ ॥

 ఆగమస్త్యనఘః శూరో దేవరాజారిమర్దనః ।

త్వాం ప్రసాద్య పురాఽ స్మాభిర్ద్విషన్తో నిహతా యుధి ॥

 అగ్నిస్త్వం చార్ణవాన్ సర్వాన్ పిబన్నైవ న తృప్యసే ।

 క్రోధాగారః ప్రసన్నాత్మా మహా కామదః ప్రియః ॥

 బ్రహ్మణ్యో బ్రహ్మచారీ చ గోఘ్నస్త్యం శిష్టపూజితః ।

వేదానామవ్యయః కోశస్త్యయా యజ్ఞం ప్రకల్పితః ॥

 హవ్యం చ వేదం వహతి వేదోక్తం హవ్యవాహనః ।

 ప్రీతే త్వయి మహాదేవ వయం ప్రీతా భవామహే ॥

 భవానీశో నాదిమాన్ ధామరాశిర్బ్రహ్మా లోకానాన్త్వ కర్తాత్వారిసర్గః ।

 సాంఖ్యాః ప్రకృతిభ్యక్తి పరమం త్వాం విదిత్వా క్షీణధ్యానాస్తే న మృత్యుం విశన్తి ॥

 యోగేన త్వాన్ధ్యాని నో నిత్యయుక్తాః జ్ఞాత్వాభోగాన్ సన్త్యన్తే పునస్తాన్ ।

 యేఽన్యే మర్త్యాస్త్వాం ప్రపన్నా విశుద్ధాస్తే కర్మభిర్ధివ్యభోగాన్ భజన్తే ॥

 అప్రమేయస్య తత్యస్య యథావిద్మః స్వశక్తితః ।

 కీర్తితం తమాహాత్మ్యమపారం పరమాత్మనః ।

శివో నో భవ సర్వత్ర యోఽసి సోఽపి నమోస్తుతే ॥

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే శార్వస్తవంనామ చతుర్వింశోఽధ్యాయః ॥

జపస్వరూపుడు, జపింపదగినవాడు, మహాయోగి, మహాదేవుడు, మహేశ్వరుడు పరమునందు శమించువాడు గుహలో (బుద్దిలో) నుండువాడు ఆకాశమున చరించువాడు. రాత్రియందు చరించువాడు-154. తపోనిధీ కుమారస్వామి నందనుడు (ఆనందింపజేయువాడు) గుఱ్ఱపుతల గలవాడు (ఐశ్వర్యమును వాహనముగా జేసికోన్న వాడు)-155. తెలియదగినవాడు. తెలియజేయువాడు. నేత (పరమపదమును జేర్చువాడు) ధూళిని వహించువాడు. దుష్టులను కంపింపజేయువాడు. బృహద్రథుడు (గొప్ప రథము, బృహత్సామము రథముగా గలవాడు) భయంకరమైన కర్మగలవాడు. విశాలమైన కీర్తి గలవాడు. ధనంజయుడు (అగ్ని స్వరూపుడు సర్వవ్యాపియైన ధనంజయ వాయుస్వరూపుడు)-156. ఘంటా ప్రియుడు, ధ్వజముగలవాడు ఛత్రము గలవాడు. జండాగల సేనకు పతియైనవాడు. కవచము గలవాడు పట్టీ (ఆయుధశ విశేషము గలవాడు. శంకముగలవాడు. పాశము హస్తమందుగలవాడు. పరశ్వమను ఆయుధము గలవాడు-157. పొందనలవిగానివాడు. పాపరహితుడు, శూరుడు ఇంద్రశత్రువులైన రాక్షసులను జంపువాడు. నిన్ను ప్రసన్నుని జేసికొని పూర్వము మాచేత యుద్ధమున శత్రువులు చంపబడిరి-158. నీ వగ్నివి సముద్రడవు అందరిని త్రాగుచు గూడ తృప్తి చెందవు. నీవు కోపమున కిల్లును. ప్రసన్నమైన యాత్మగల వాడువు. కాముని జంపినవాడవు. కోరికల నిచ్చువాడవు. ప్రియుడవు-159. బ్రహ్మణ్యుడవు. వైదిక కర్మలకు సాధువయినవాడవు. బ్రహ్మచారీవీ. గోఘ్నుడవు (ఇంద్రియములను జంపువాడవు) నీవు శిష్టులచే (వేదము చెప్పి నడుచుకొనువారిచే) పూజింపబడినవాడవు. వేదములకు తరగని కోశము (నిధి) ఐనవాడవు. నీ చేతనే యజ్ఞము కల్పింపబడినది 160 వేదమును వేదోక్తమయిన హవ్యమును హవ్యవాహనుడైనచో మేమందరము ప్రీతులమగుదుము-161. నీవు భవానీశుడవు. పుట్టువు లేని యశుడవు. లోకములకు నెలవైన రాశిపై కర్తవైన బ్రహ్మవు. నీవు ఆది సృష్టి స్వరూపుడవు. సాంఖ్యుడు నిన్ను ప్రకృతులకంటే పరమునిగా దెలిసికొని క్షీణించిన ధ్యానముగలవాడై మృత్యువులో బ్రవేశింపరు-162. ధ్యానయోగులు తమ ధ్యానముచే నీతో నిత్యము గూడినవారై నిన్ను దెలిసికొని యా భోగములనైతే పూర్తిగా వదలివేయుదురు. ఇక తదితరులైన మానవులు నిన్ను శరణుబొంది పరిశుద్ధులై కర్మలచే దివ్యభోగములను అనుభవించుచుందురు-163. జ్ఞానాతీతమైన పరమాత్మవైన నీ తత్త్యము యొక్క అపారమైన మాహాత్మ్యమును మా శక్తికొలది తెలిసికొన్నంతవరకు మేము కీర్తించితిమి. నీవు ఎవడవైన వాడి నగదువుగాక (నీవు ఎవడవైనను అగుదువు గాక) అట్టి నీకు నమస్కారము. మాకు మాత్రమంతటను శివుడవగుమని వేడుచున్నాము.

ఇది శ్రీ వాయుమహాపురాణమున శార్వస్తవమను నిరువది నాల్గవ యధ్యాయము