వాయు మహా పురాణము
3 - వైవస్వత సర్గ వర్ణనమ్
సూత ఉవాచ :-
సప్తమే త్వథ పర్యాయే మనోర్వైస్వతస్య హ ।
మారీచాత్కశ్య పాద్దేవాజ్జజ్ఞిరే పరమర్షయః ॥
ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వే మరుద్గణాః ।
భృగవోంఽగిరసశ్చైవ హ్యష్టా దేవగణాః స్మృతాః ॥
ఆదిత్యా మరుతో రుద్రా విజ్ఞేయాః కశ్యపాత్మజాః ।
సాధ్యాశ్చ వసవో విశ్వే ధర్మపుత్రాస్త్రయో గణాః ॥
భృగోస్తు భార్గవో దేవో హ్యంగిరోంఽగిరసః సుతః ।
వైవస్వతేంఽతరే హ్యస్మిన్ నిత్యం తే ఛందజాః సురాః ॥
ఏష సర్గస్తు మారీచో విజ్ఞేయః సాంప్రతః శుభః ।
తేజస్వీ సాంప్రతస్తేషామింద్రో నామ్నా మహాబలః ॥
అతీతానగతా యే చ వర్తంతే యే చ సాంప్రతమ్ ।
సర్వే మన్వంతరేంద్రాస్తు విజ్ఞేయాస్తుల్యలక్షణాః ॥
భూతభవ్య భవన్నాథః సహస్రాక్షః పురందరః ।
మఘవంతశ్చ తే సర్వే శృంగిణో వజ్రపాణయః ॥
సర్యైః క్రతుశతేనేష్టం పృథక్ శతగుణేన తు ॥
త్రైలోక్యే యాని సత్తాని గతిమంతబలానీ చ ।
అభిభూయావతిష్ఠంతే ధర్మాద్యైః కారణైరపీ ॥
తేజసా తపసా బుద్ధ్యా బలశ్రుత పరాక్రమైః ।
భూతభవ్యన్నాథా యథా తే ప్రభవిష్ణవః ॥
ఏతత్సర్వం ప్రవక్ష్యామి బ్రువతో మే నిబోధత ॥
సూతుడనెను :
ఆ తరువాత ఏడవ పర్యాయమున వైవస్వత మన్వంతరమున మరీచి పుత్రుడైన కశ్యపుని వలన దేవతలు పరమరులును బుట్టిరి. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవులు, మరుద్గణములు, భృగువులు, అంగీరసులు, ఈయెనమండుగురు దేవగణములనబడుదురు. ఆదిత్యులు, మరుతులు, రుద్రులు వీరిని కశ్యపాత్మజులుగా దెలియవలె. సాధ్యులు, విశ్వేదేవులు ధర్మపుత్రులును మూడు గణములు. భృగువు నుండి బుట్టినవాడు భార్గవదేవుడు. అంగిరుడు అంగిరసుని పుత్రుడు. ఈ వైవస్వతమన్వంతరమున వారు నిత్య స్వేచ్ఛతో జనించిన దేవతలు. ఈ సృష్టి మారీచముగా (మరీచమహర్షి నుండి బుట్టినదిగా) తెలియదగినది. వీడు సాంప్రతుడు, శుభుడు. వారిలో తేజస్వి సాంప్రతుడు. ఇంద్రుడు పేరుతో మహాబలుడు. భూత భవిష్యత్ వర్తమానములనున్న మన్వంతరేంద్రులందఱును సమాన లక్షణముల గలవారని యెఱుగవలెను. భూత భవిషద్వర్తమాన కాలముల ప్రభువైనవాడు సహస్రాక్షుడైన పురందరుడు (ఇంద్రుడు), ఆ యింద్రులందఱును శృంగములు గలవారై వజ్రమును చేత ధరించినవారు. వారందరు వేరు వేరుగా నూరు యాగముల జేసిరి, ముల్లోకములో నడకగలిగి దుర్బలములైన ప్రాణులను ధర్మాది కారణములచే తిరస్కరించి నిలుతురు. వారు తేజము చేతను, తపముచేతను, బుద్ధిచేతను, బల పాండితీ - పరాక్రమముల చేతను భూత భవిష్య వర్తమానములకు ప్రభువులై యే విధముగ సమర్థులైరో దానినంతయు జెప్పెదను. నా నుండి వినుడు.
భూతం భవ్యం భవిష్యం తత్ స్మృతం లోకత్రయం ద్విజైః ।
భూర్లోకోఽయం స్మృతో భూమిరంతరిక్షం (భూతమంతరిక్షః) భువం స్మృతమ్ ॥
భవ్యం స్మృతం దేవం హ్యేతత్ తేషాం వక్ష్యామి సాధనమ్ ॥
ధ్యాయతా పుత్రకామేన బ్రహ్మణాగ్రే విభాషితమ్ ।
భూరితి వ్యాహృతం పూర్వం భూర్లోకోఽ యమభూత్తదా ॥
భూ సత్తాయాం స్మృతో ధాతుస్తథా ఽసౌ లోకదర్శనే ।
భూతత్వాద్దర్శనత్వాచ్చ భూర్లోకోఽ యమభూత్తతః ॥
అతోయం ప్రథమో లోకో భూతత్వాద్భూద్ద్విజైః స్మృతః ॥
భూతేఽ స్మిన్ భవదిత్యుక్తం ద్వితీయం బ్రహ్మణా పునః ।
భవత్యుత్పద్యమానేన కాలశబ్ధోఽయ ముచ్యతే ॥
భవనాత్తు భువర్లోకో నిరుక్తజ్ఞైర్నిర్నిరుచ్యతే ।
అంతరిక్షం భువస్తస్మాద్ద్వీతీయో లోక ఉచ్యతే ॥
ఉత్పన్నే తు భువర్లోకే తృతీయం బ్రహ్మణా పునః ।
భవ్యేతి వ్యాహృతం, యస్మాద్భవ్యో లోకస్తదాఽభవత్ ॥
అనాగతే భవ్య ఇతి శబ్ద ఏష విభావ్యతే ।
తస్మాద్భవ్యో హ్యసౌ లోకో నామతస్తు దివం స్మృతమ్ ॥
స్వరిత్యుక్తం తృతీయోఽన్యో భావ్యోలోక స్తదాభవత్ ।
భావ్య ఇత్యేష ధాతుర్వై భావ్యే కాలే విభావ్యతే ॥
భూరితీయం స్మృతా భూమిరంతరిక్షం భువం స్మృతమ్ ।
దివం స్మృతం తథా భావ్యం త్రైలోక్య స్యైష సంగ్రహః ॥
త్రైలోక్య యుక్తైర్వ్యాహారైస్తిస్రో వ్యాహృతయో ఽభవన్ ।
నాథ ఇత్యేష ధాతుర్యై ధాతుజ్ఞైః పాలనే స్మృతః ॥
యస్మాద్భూతస్య లోకస్య భవ్యస్య భవతస్తదా ।
లోకత్రయస్య నాథాస్తే తస్మాదింద్రా ద్విజైః స్మతాః ॥
ప్రధానభూతా దేవేంద్రా గుణభూతా స్తథైవ చ ।
మన్వంతరేషు యే దేవా యజ్ఞభాజో భవంతి హి ॥
యక్షగంధర్వ రక్షాంసి పిశాచోరగ దానవాః ।
మహిమానః స్మృతా హ్యేతే దేవేంద్రాణాం తు సర్వశః ॥
దేవేంద్రా గురవో నాథా రాజానః పితరో హి తే ।
రక్షంతీమాః ప్రజాః సర్వా ధర్మేణేహ సురోత్తమాః ॥
ఇత్యేతల్లక్షణం ప్రోక్తం దేవేంద్రాణాం సమానతః ।
సప్తర్షీన్ సంప్రవక్ష్యామి సాంప్రతం యే దివి స్థితాః ॥
గాధిజః కౌశికో ధీమాన్ విశ్వామిత్రో మహాతపాః ।
భార్గవో జమదగ్నిశ్చ ఊరుపుత్రః ప్రతాపవాన్ ॥
బృహస్పతి సుతశ్చాపి భారద్వాజో మహాతపాః ।
ఔతథ్యో గౌతమో విద్వాన్ శరద్వాన్నామ ధార్మికః ॥
స్వాయంభువోఽత్రిర్భగవాన్ బ్రహ్మకోశస్తు పంచమః ।
షష్ఠో వాసిష్ఠపుత్రస్తు వసుమాన్ లోకవిశ్రుతః ॥
వత్సారః కాశ్యపశ్చైవ సప్తైతే సాధుసమ్మతాః ।
ఏతే సప్తర్షయః సిద్ధా వర్తంతే సాంప్రతేంఽతరే ॥
ఇక్ష్వాకుశ్చైవ నాభాగో, ధృష్టః శర్యాతిరేవ చ ।
నరిష్యంతశ్చ, విఖ్యాతో నాభ ఉద్దిష్ట ఏవ చ ॥
కరుషశ్చ, పృషధ్రశ్చ, వసుమాన్నవమః స్మృతః ।
మనోరైవస్వత స్యైతే నవ పుత్రాః ప్రకీర్తితాః ॥
కీర్తితా వై మయా హ్యేతే సప్తమం చైతదంతరమ్ ।
ఇత్యేష వై మయా పాదో ద్వితీయః కథితో ద్విజాః ।
విస్తరేణాఽనుపూర్వ్యా చ భూయః కిం వర్ణయామ్యహమ్ ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే వైవస్వత సర్గవర్ణనం నామ తృతీయోఽధ్యాయః ॥
ఇత్యుపోద్ఘాతపాదః ।
భూతము, భవ్యము, భవిష్యము అనునవి ద్విజులచే లోకత్రయముగా జెప్పబడినవి. భూర్లోకమనునిది భూమియ(భూతమ)నబరీ అంతరిక్షం (ఆకాశము) భువమనబడినది. భవ్యమను నది దివమనబడినది. దానికి సాధనమును జెప్పెదను. పూర్వము పు గోరిన బ్రహ్మ ముందు 'భూః' అని యుచ్చరించెను. అప్పుడిది భూర్లోకమయ్యెను. భూ సత్తాయాం అని భూ ధాతువు సత్తార్థ (ఉండు అను నర్థమున) చెప్పబడినది. అట్లే యిది లోకదర్శనార్థమున గూడ జెప్పబడినది. అంతనప్పుడు భూతమైనందు దర్శనమైనందునను ఇది భూలోకమైనది. కావుననిది మొదటి లోకము. భూతమైనది (మొదటనేర్పడియున్నది)గాన ద్విజులచే 'భ యనబడినది. ఇది యిట్లు జరుగగా బ్రహ్మచే మరల రెండవదిగా 'భవత్' అనబడినది. పుట్టుచుండుటచే ‘భవతి' అన కాలశబ్దముగా జెప్పబడినది (13). భవనాత్ భువర్లోకః = ఉండుట వలన భువర్లోకమని నిరుక్తము దెలిసిన వారిచే జెప్పబడినది. అందువలన నాకాశము భూమి కంటే రెండవలోకముగా జెప్పబడినది (14), భువర్లోకమీవిధముగ బుట్టగా మరల బ్రహ్మ మూడవదిగా "భవ్య' అని యుచ్చరించెను. అందువలననపుడు భవ్యమను లోకమేర్పడెను (15). భవిష్యకాలమున ‘భవ్య' అను శబ్దము సంభావింపబడుచున్నది. కావున భవ్యమను నీలోకము పేరుతో స్వర్గమని చెప్పబడినది (16). స్వర్గమని వేరుగా జెప్పబడిన మూడవది యపుడు 'భావ్య'మనబడినది. ‘భావ్య' అను నీ ధాతువు భవిష్యత్కాలార్థమున విశేషముగ భావింపబడుచున్నది (17). "భూః' అనునిది భూమియనబడినది. భువమనునిది అంతరిక్షమనబడినది. అట్లే దివము భావ్యమనబడినది. ముల్లోకమునకిది సంగ్రహము (18). ముల్లోకముతో గూడిన వ్యాహారములచే (ఉచ్చారణ మాటలచే) మూడు వ్యాహృతులైనవి. ధాతువుల దెలిసిన పండితులు నాథధాతువును పాలించుట యను నర్థముగలదిగా జెప్పిరి (19). భూత భవిష్యద్వర్తమాన లోకత్రయమునకు నాథులైన (పాలకులైన) వారుగా ఇంద్రాదులు చెప్పబడిరి (20), దేవేంద్రులు ప్రధానులుగాను అప్రధానులుగాను ఉందురు. మన్వంతరములలోని దేవతలు య (21). యక్షులు, గంధర్వులు, రక్షస్సులు, పిశాచులు, ఉరగులు, దానవులు - వీరు అంతటను దేవేంద్రుల మహిమలు గలవారు అనబడినారు (22). ఈ లోకమున దేవేంద్రులు, గురువులు, పొలకులైన రాజులు, ఆ దేవతాశ్రేష్టులును ఈ ప్రజలనందరిని ధర్మముగా రక్షింతురు (23), అని యీ దేవేంద్రుల లక్షణము సంగ్రహముగా జెప్పబడినది. ఇపుడు ఆకాశమున నును. సప్తర్వులను జె (24). గాధిపుత్రుడును కౌశికుడును, ధీమంతుడును మహాతపస్వియునైన విశ్వామిత్రుడగు భృగుపుత్రుడును, ఊరువు నుండి బుట్టినవాడును, ప్రతాపవంతుడునైన జమదగ్ని (25), బృహస్పతి కుమారుడును, మహాతపస్వియునైన భారద్వాజుడు, ఉతథ్యపుత్రుడును, విద్వాంసుడును, శరద్వంతుడు, ధార్మికుడునైన గౌతముడు, స్వాయంభువుడు, భగవంతుడు, బ్రహ్మకోశుడునైన అత్రి యైదవవాడు, ఆఱవవాడును, వసుమంతుడును, లోకప్రసిద్ధుడునైన వాసిష్ఠపుత్రుడు (వసిష్ఠుడు) (27), వత్సారుడైన కాశ్యపుడు (కశ్యపుడు) - ఈ యేడుగురు సాధుసమ్మతులు. సిద్ధులైన సప్తర్షులు ఇప్పటి మన్వంతరమున నుందురు (28). ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడైన శర్యాతి, విఖ్యాతుడైన నరీష్యంతుడు, సౌభుడు, ఉద్దిష్టుడు (29), కరుషుడు, పృషధ్రుడు, వసుమంతుడు - అను వీరు వైవస్వతమనువు యొక్క తొమ్మండుగురు పుత్రులుగా జెప్పబడినారు. నా చేత గూడ వీరు చెప్పబడినారు. ఇది యేడవ యంతరము (మన్వంతరము) (30). ఓ ద్విజులారా! ఈ విధముగా రెండవపాదము విస్తరముగను ఆనుపూర్వితోను నాచే జెప్పబడినది. మరల నింకేమి నేను వర్ణించి చెప్పవలెను? .
ఇది శ్రీవాయుమహాపురాణమున వైవస్వతసర్గవర్ణనమను తృతీయాధ్యాయము సమాప్తము. ఇది యుపోదాత పాదము.