29 - అగ్నివంశవర్ణనం

యోసావగ్నిరభిమానీ హ్యాపీత్స్వాయం భువేఽన్తరే

బ్రహ్మణో మానసః పుత్రస్తస్మాత్స్వాహా వ్యజాయత

పావకః పవమానశ్చ పావమానశ్చ యఃస్మృతః

శుచిః శౌరస్తు విజ్ఞేయః స్వాహా పుత్రాస్త్రయాస్తు తే

నిర్మధ్య పవమానస్తు శుచిః శౌరస్తు యఃస్మృతాః

పావకా వై ద్యుతాశ్చైవ తేషాం స్థానాని యాని వై

పవమానాత్మజశ్చైవ కవ్యవాహన ఉచ్యతే

పావకాత్ సహ రక్షస్తు వావ్యవాహః శుచేః సుతః

దేవనాం హవ్యవాహోగ్నిః  పితౄణాం కవ్యవాహనః

సహ రక్షోఽసురాణాన్తు త్రయాణాం తు త్రయోఽగ్నయః

ఈ యభిమానియైన యగ్ని స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క మానసపుత్రుడు ఆతని నుండియే స్వాహ జనించినది-1. పావకుడు పవమానుడు, (ఈతడే పావమానుడు) శారుడనబడు శుచియు ఈ ముగ్గురు స్వాహాపుత్రులు 2. నిర్మథనమున వచ్చిన పవమానుడు శుచియైనవాడు ఆతడు శారుడనబడును. పావకములు వైద్యుతములు వానికి స్థానములు-3. పవమానాత్మజుడు కవ్యవాహనుడనబడును. పావకుని నుండి వచ్చిన వాడు సహరక్షుడు. శుచియొక్కసుతుడు హవ్యవాహుడు-4. అగ్ని దేవతలకు హవ్యమును మోయువాడు. పితరులకు కవ్యమును మోయువాడు, అసురులకు (హుతమును) మోయువాడు సహరక్షుడుమువ్వురికి మూడగ్నులు-5.

ఏతేషాం పుత్రపౌత్రాస్తు చత్వారింశన్నవైవ తు

వక్ష్యామి నామతస్తేషాం ప్రవిభాగం పృథక్ పృథక్

వైద్యుతో లౌకికాగ్నిస్తు ప్రథమో బ్రహ్మణః స్మృతః

బ్రహౌదనాగ్నిస్తత్పుత్రో భరతో నామ విశ్రుతః

వైశ్వానరముఖస్తస్యమహః కావ్యో హ్యపారసః

అమృతోఽథర్వణా పూర్వం మథితః పుష్కరో దదౌ

సోఽథర్వాలౌకికాగ్నిస్తు దధ్వజ్ చాథర్వణః సుతః

అథర్వా తు భృగుర్జ్ఞే యోఽప్యఙ్గిరాఽధర్వణః సుతః

తస్మాత్ స లౌకికాగ్నిస్తు దధ్యజ్ చాథర్వణః సుతః

వీరియొక్క పుత్రపౌత్రులు ఇరువది నాలుగు మరియు తొమ్మిది వేరువేరుగా వారి నామములను జెప్పెదను-6. విద్యుత్సంబంధమైన లౌకికాగ్నిమైతే బ్రహ్మ యొక్క మొదటి (పుత్రుడు)వాడనబడెను. ఆతని పుత్రుడు బ్రహ్మాదనాన్ని భరతుడని ప్రసిద్దిజెందెను-7. ఆతని యగ్నిముఖము నీటియొక్క రసరూపమైన కావ్యమైన (శుక్రసంబంధమైన) తేజము పూర్వము జలసముద్రమునందు అమృతము అథర్వునిచే మథింపబడినది. ఆయథరుడు లౌకికాగ్ని దధ్యంచుడు ఆథర్వణుని కుమారుడు-8,9.

అథ యః పవమానోఽగ్ని ర్నిర్మంథాః కవిభిః స్మృతః

స జ్ఞేయో గార్హపత్యోఽగ్నిస్తతః పుత్రద్వయం స్మృతమ్

శంస్యస్త్వాహవనీ యోఽగ్నిర్యఃస్మృతో హవ్యవాహనః

ద్వితీయస్తు సుతః ప్రోక్తః శుక్రోఽగ్నిఃయః ప్రణీయతే

తథా సభ్యాఽవసథ్యౌ వై శంస్యస్యాగ్నేః సుతావుభౌ

శంస్యా(స్య)స్తు షోడశ నదీశ్చకమే హవ్యవాహనః

యోసావాహవనీయోఽగ్నిరభిమానీ ద్విజైః స్మృతః

ఇక నిర్మంథుడని కవులచే తలపబడిన పవమానుడను నగ్నిని గార్హపత్యాగ్నినిగా దెలియవలెను. ఆ యగ్నినుండి యిద్దరు పుత్రులు మొదటి వాడు హవ్యవాహనుడనబడు ఆహవనీయాగ్ని ఈతడు శంష్యుడు (ప్రశంసింపదగినవాడు) రెండవవాడు యజ్ఞములో ప్రణీయమానుడు (కుండమునకు దీసికొనిపోబడువాడు) అగు శుక్రుడనునగ్నిగా జెప్పబడినాడు 10,11. అట్లే శంస్యుడను నగ్నికి సభ్యాన్ని ఆవసధ్యాగ్నియను నిరువురు పుత్రులు. బ్రాహ్మణులచే ఆహవనీయాగ్నియని యభిమానింపబడిన శంష్యుడను హవ్యవాహనాగ్ని పదునాఱు నదులను కామించెను–12.

కావేరీం కృష్ణవేణీం చ నర్మదాం యమునాం తథా

గోదావరీం వితస్తాం చ చంద్రబాగా మిరావతీమ్

విపాశాం కౌశికీం చైవ శతద్రుం సరయూం తథా

సీతాం సరస్వతీం చైవ హ్రదినీం పావనీం తథా

తాసు షోడశథాఽత్మానం ప్రవిభజ్య పృథక్ పృథక్

ఆత్మానం వ్యదధాత్తాసుధిష్ణీష్వథ బభూవ సః

ధిష్ణ్యో ది(హి) వ్యభిచారిణ్య స్తా సూత్పన్నాస్తు దిష్ణయః

ధిష్ణీషు జజ్ఞిరే యస్మాద్దిష్ణయస్తేన కీర్తితాః

ఇత్యేతే వై నదీపుత్రాః దిష్ణీష్యేవ విజజ్ఞిరే

తేషాం విహరణీయా యే ఉపస్థేయాశ్చయేఽగ్నయః

తాన్ శ్రుణుధ్వం సమాసేన కీర్త్యమానాన్ యథా తథా

అనదులివి కావేరి, కృష్ణవేణి, నర్మద, యమున, గోదావరి; వితస్త, చంద్రభాగ, ఇరావతి-13, విపాశ, కౌశికి, శతద్రు, సరయు, సీత, సరస్వతి, ప్రోదిని, పావని-14, ఈనదులను శంష్యుడను ఆహవనీయాగ్ని కామించేను. ఆయగ్ని యీ పదునారునదుల ధిషీల యందు (దిష్ణీలు, నదులలోనే యొక విశిష్టమైన గర్భస్థానము) వేఱువేఱుగా తనను విభజించియుంచెను. తరువాత ఆధిషీలలో అగ్ని జనించెను-15. ఆధిషీలు, వ్యభిచారిణులు, వారిలో బుట్టినవారు ధీష్ణులు (దిష్ణయః) (ఆ పేరవెలసినయగ్నులు) దిషీలలో బుట్టినందున నాయగ్నులు దిష్ణులనబడినవి-16. ఈ విధముగ నీనదీపుత్రులు ధిష్ణులలోనే బుట్టిరి. ఆయగ్నులలో (హోమ కుండములలో) విహరణీయములు (వెడల్పుగా పరుచదగినవి) ఉంచదగినవి (ఒకచోనుంచదగినవియు నేవో అవి యేమనబడునో సంగ్రహముగా జెప్పెదవినుడు-17.

ఋతుః ప్రవాహణోఽగ్నేధ్రః పురస్తా ద్దిష్ణయోఽపరే

విధీయన్తే యథాస్థానం సౌత్యేఽహ్ని సవనక్రమాత్

అనిర్దేశ్యాన్యవాచ్యా నామగ్నీనాం శ్రుణుత క్రమమ్

సమ్రాడగ్నిః కృశానుర్యొ ద్వితీయోత్తరవేదికః

సమ్రాడగ్నిః స్మృతాహ్యష్టౌ ఉపతిష్ఠన్తి తాన్ ద్విజాః

అధస్తాత్పర్షదన్యస్తు ద్వితీయః సోఽత్రదృశ్యతే

ప్రతవ్వోచే నభో నామ చత్వారి స విభావ్యతే

బ్రహ్మజ్యోతిర్వఘుర్నామ బ్రహ్మస్థానే స ఉచ్యతే

హవ్యసూర్యాద్య సంసృష్టః శామిత్రే స విభావ్యతే

విశ్వస్యాథ సముద్రోఽగ్నిర్బ్రహ్మస్థానే స కీర్త్యతే

ఋతుధామా చ స జ్యోతి రౌదుంబర్యా స కీర్త్యతే

బ్రహ్మజ్యోతిర్వఘుర్నామ బ్రహ్మస్థానే స ఉచ్యతే

ఋతువు ప్రవాహణము అగ్నీధ్రము తక్కిన ధిషీలు ధైట్ల నామకములు) ఈయగ్నులు సుత్యసంబంధమైన దినమున సవనక్రమముననుసరించి వానివాని స్థానములలో విధింపబడును-18. ఇక చూపరావియు, చెప్పరానివియునైన యగ్నుల క్రమమును వినుడు. సమ్రాట్ అనునగ్ని మొదటిది. ఉత్తరవేదికి సంబంధించిన కృశానువు అనునగ్ని రెండవది 19. సమ్రాడగ్నిని ఎనమండుగురు బ్రాహ్మణులు సమిపముననుండి యుపాసింతురు. దానిక్రింద పర్షత్ అను వేరొక రెండవయగ్ని యిట గన్పడును-20. దానిని 'నభస్' అనియందురు. అది సాగుగ భావింపబడును. బ్రహ్మజ్యోతి వసువనునది. అది బ్రహ్మస్థానమున నుండునని చెప్పబడును. హవ్యనూ: అనునది మొదట సృష్టింపబడినది. అది శామిత్ర మున (యాగమున) భావించ బడును. తరువాత విశ్వము యొక్కయుగ్ని సముద్ర ము అది బ్రహ్మస్థానముననుండునని చెప్పబడును-21,22, ఋతుధామమన్నది జ్యోతిర్వంతమైన యగ్ని అది మౌదుంబరియందు (మేడియందు లేక రాగియందు) ఉండునని చెప్పబడును. బ్రహ్మజ్యోతి యైనది వసువునునగి అది బ్రహ్మస్థానమున నుండునని చెప్పబడును-23.

అజైకపాదుపస్థేయః స వై శాలాముఖీయకః

అనుద్దేశోఽప్యహిర్బుద్న్యః సొఽగ్నిర్గృహపతిః స్మృతః

శంస్యస్యైవ సుతాః సర్వే ఉపస్థేయా ద్విజైః స్మృతాః

తతోవిహరణీయాంశ్చవక్ష్యామ్యష్టౌ తు తత్సుతాన్

క్రతు ప్రవాహణేఽగ్నీ ధ్రస్తత్ర స్థాధిష్ణయోఽపదే

విహ్రియన్తే యథాస్థానం స్థానం సౌత్యేఽహ్నిసవన క్రమాత్

అజైకపాద్ అనున్న యుపాసింపదగినది. అది శాలాముఖములోనుండును. ఉద్దేశింపదగనిదైనను అహిర్బుధ్య మనబడును. ఆయన్ని గృహపతియనబడినది-24. ఈయన్ని యగ్నులును శంస్యముయొక్క సుతులే అవి బ్రాహ్మణులచే నుపాసింపదగినవిగా జెప్పబడినవి. ఆ తరువాత విహరణీయము లైన (పరువదగిన) యగ్నులను, వాని యెనమండుగురు సుతులను జెప్పుదును-25. క్రతుప్రవాహణము, ఆగ్నీధ్రము అచ్చటనుండు తక్కిన ధిష్ఠులను నగ్నులును సుత్యాదినపుటగ్నిలో సవనక్రమమున వానివాని స్థానములలో విహరింప(పరువ) బడును-26.

పౌత్రేయస్తు తోహ్యగ్నిః స్మృతో యో హవ్యవాహనః

శాన్తిశ్చాగ్నిః ప్రచేతాస్తు ద్వితీయః సత్యఉచ్యతే

తథాఽగ్ని ర్విశ్వదేవస్తు బ్రహ్మస్థానే స ఉచ్యతే

అవక్షురచ్ఛావకస్తు భువః స్థానే విభావ్యతే

ఉశీరాగ్నిః సవీర్యస్తు నైష్ఠీయః సంవిభావ్యతే

అష్టమస్తు వ్యరత్తిస్తు మార్జాతీయః ప్రకీర్తితః

ధిష్ణ్యా విహరణీయా యే సౌమ్యేనాన్యే నఛైవ హి

తయోర్యః పావకో నామ స చాపాంగర్భ ఉచ్యతే

అగ్నిః సోఽవబృథో జ్ఞేయః సమ్యక్ప్రాప్యాఫ్ను హూయతే

హృచ్ఛయస్తత్సుతోఽహ్యగ్నిః జఠరే యో నృణాం స్థితః

మన్యుమాన్ జాఠరస్యాగ్నేర్విద్వానగ్నిః సుతః స్మృతః

పరస్పరోఽచ్ఛ్రితః సోగ్నిర్భూతానాం హవిభుర్మహాన్

పుత్రఃసోఽగ్నేర్మన్యుమతో ఘోరః సంవర్తకః స్మృతః

పిబిన్నపః స వసతి సముద్రే వడవాముఖః

సముద్రవాసినః పుత్రః సహరక్షో విభావ్యతే

సహరక్షసుతః కామో గృహాణి సదహేన్నృణామ్

క్రవ్యాదోఽగ్నిః సుతస్తస్య పురుషానత్తి యోమృతాన్

ఇత్యేతే పావకస్యాగ్నేః పుత్రాహ్యేవం ప్రకీర్తితాః

ఆ తరువాత హవ్యవాహనుడనబడు అగ్ని పౌత్రేయాగ్ని ప్రచేతసుడనబడు అగ్ని శాస్త్ర్యాన్ని మొదటిది. సత్యమనునగ్ని రెండవదిగా జెప్పబడినది-27. అట్లే విశ్వదేవమనునగ్ని బ్రహ్మస్థానమున నుండునని చెప్పబడినది. అవక్షురచ్చావకమనునగ్ని భూస్థానమున నుండునని భావింపబడును-28. సవీర్యమైన ఉశీరాగ్ని (వట్టి శేళ్ళయగ్ని) నైష్ఠీయముగా సంభావింపబడును. ఎనిమిదవదియైన వ్యరత్తియనునగ్ని మార్జారీయమనబడినది-29. సౌమ్యముచేత గాని (సోమసంబంధమైన దానిచేతగాని) వేరొకదానిచేతగాని విహరింప(పరువ) దగిన యగ్నులేవి కలవో, ఆ రెంటిలోని పావకుడనునగ్ని నీటికి గర్భమనబడినది-30. ఆ యగ్నిని ఆవబృథమని తెలియవలెను. అది చక్కగా జేరినీటిలో హోమము జేయబడును. ఆతని సుతుడు హచ్చయుడనునగ్ని (హృదయమున బండుకొనువాడైననగ్ని) అతడు మానవుల జఠరములోనుండి నాడు-31. జఠరాగ్నికి మన్యుమంతుడను విద్వాంసుడైన యగ్ని సుతుడు అనబడినాడు. అన్యోన్యముగా పైకీ విజృంభించిన యా యగ్ని భూతములకు (ప్రాణులకు) మహాప్రభువు-32, ఆ మన్యుమంతుడను నగ్నికి పుత్రుడు ఘోరుడైన (భయంకరుడైన) సంవర్తకుడనబడినాడు. వాడు నీటిని త్రాగుచు ఆడగుఱ్ఱపు ముఖము గలవాడై సముద్రమున నివసించును-33. సముద్రవాసియైన సంవర్తకాగ్నియొక్క పుత్రుడు సహరక్షుడనబడును. సహరక్షాగ్నిసుతుడు కాముడు అనునగి అతడు మనుష్యల యిండ్లను దహించును-34. కాముడను నగ్నికి సుతుడు క్రవ్యాదుడనున్న ప్రవ్యాదుడను నగ్ని మరణించిన పురుషులను దినును. ఈ యగ్నులన్నియు నీ విధముగా పాతకమును నగ్ని యొక్క పుత్రులుగా జెప్పబడిరి-35,

తతః శుచేస్తు యైః సౌరేర్గంధర్యైరసురావృతైః

మథితో యస్త్యరణ్యాం వై సోఽగ్నిరగ్నిః సమిధ్యతే

ఆయుర్నామాఽథ భగవాన్ పశౌయస్తు ప్రణీయతే

ఆయుషో మహిమాన్ పుత్రః సశావాన్నామతః సుతః

పాకయజ్ఞేష్వభిమానీ సోఽగ్నిస్తు సవనః స్మృతః

పుత్రశ్చ సవనస్యాగ్నేరద్భుతః సమహాయశాః

వివిచిస్త్యద్భుతస్యాఽపి పుత్రోఽగ్నేః స మహాన్ స్మృతః

ప్రాయశ్చిత్తేఽథ భీమానాం హుతం భుంక్తే హవిః సదా

వివిచేస్తు సుతో హ్యార్కో యోఽగ్నిస్తస్య సుతాస్త్విమే

అనీకవాన్ వా సృజవాంశ్చరక్షొహాపితృకృత్తధా

సురభిర్వసురత్నా ప్రవిష్టో యశ్చ రుక్మవాన్

శుచేరగ్నేః ప్రజా హ్యేషా వహ్నయస్తు చతుర్ధశ

ఇత్యేతే వహ్నయః ప్రోక్తాః ప్రణీయన్తేఽద్వరేషు యే

ఆ తరువాత సౌర్యాగ్నినుండి అసురులచే నావరింపబడిన గంధర్వులచే అరణియందు మథింపబడిన యగ్ని యగ్నియని చక్కగా ప్రజ్వలింపజేయబడును-36. పశుయాగమున ప్రణీయమానమగు (తీసికొనిరాబడు) అగ్ని భగవంతుడైన ఆయువనున్న ఆయువనున్నయొక్క పుత్రుడు మహిమాన్ అనువాడు వాడు పేరుతో 'శావాన్' అనుసుతుడు-37. పాకయజ్ఞములయందభిమానియైన యగ్ని సవనుడనబడును. సవనుడనునగ్నియొక్క పుత్రుడు మహాయశుడైన ఆద్బుతుడు 38. అద్భుతాగ్ని యొక్క పుత్రుడు వివిచి ఆతడు గొప్పవాడుగా జెప్పబడెను. అతడు ప్రాయశ్చిత్తమున (అగ్ని యందు ఎల్లప్పుడు భముల యొక్కహోమము చేయబడిన హవిస్సును భుజించును-39. వివిచియనునగ్నికి సుతుడు అర్కుడను నగ్ని అరాగ్నికి సుతులు వీరు-అనీకవానుడు, వాసృజవానుడు, రక్షోహుడు, పితృకృత్ అట్లే సురభి, వసురత్నాదులలో ప్రవేశించియున్న రుక్మవానుడు అనువారు-40. శుచియనునగ్నికీది సంతానము అగ్నులైతే పదునాలుగు ఇవి యన్నియు యజ్ఞములలో తీసికొనిరాబడు అగ్నులుగా జెప్పబడినవి-41.

ఆదిసర్గే హ్యతీతా వై యామైః సహ సురోత్తమైః

స్వాయంభువేఽన్తరే పూర్వమగ్నేయస్తేఽభీమానినః

ఏతే విహరణీయాస్తు చేతనాచేతనేష్విహ

స్థానాభిమానినో లోకే ప్రాగాసన్ హవ్యవాహనాః

కామ్యనైమిత్తికాజస్రేష్వేతే కర్మస్వవస్థితాః

పూర్వమన్వన్తరేఽతీతే శుక్లైర్యామైః సుతైః సహ

దేవైర్మహాత్మభిః పుణ్యైః ప్రథమస్యాన్ తరేమనోః

ఇత్యేతాని మయోక్తాని స్థానాని స్థానినశ్చమహ

తైరేవ తు ప్రసంఖ్యాత మతీతానగతేష్యపిః

మన్వన్తరేషు సర్వేషు లక్షణం జాతవేదసామ్

సర్వే తపస్వినోహ్యేతే సర్వే హ్యవభృథాస్తథా

ప్రజానాం పతయః సర్వే జ్యోతిష్మన్తశ్చ తే స్మృతాః

స్వారోచిషాదిషుజ్ఞేయాః సావర్ణ్యం తేషు సప్తసు

మన్వన్తరేషు సర్వేషు నానారూప ప్రయోజనైః

వర్తన్తే వర్తమానైశ్చ దేవైరిహ సహాగ్నయః

అనాగతైః సురైః సార్థం వర్తన్తే నాగతాగ్నయః

ఇత్యేష వినయోఽగ్నీనాం మయా పొక్తో యథాతథమ్

విస్తరేణానుపూర్వ్యా చ పితౄణాం వక్ష్యతే తతః

ఇతిశ్రీమహాపురాణే వాయు ప్రొక్తే అగ్నివంశవర్ణనం నామో నత్రింశోఽధ్యాయః

ఆదిసృష్టిలో యామములతో(జాములతో) బాటు సురోత్తములచే గడచిన యగ్నులు స్వాయంభువ మన్వన్తరమున ముందు అవి యభిమానులను నగ్నులు ఇవి యిచట చేతనా చేతనులలో విహరణీయములై (పరువదగినవై) యగ్నులు. లోకమున ఆయగ్నులుముందు స్థానాభిమానులుగానుండినవి-42,43, మనువుయొక్క ప్రథమ మన్వన్తరమైన పూర్వమన్వన్తరము పుణ్యులై మహాత్ములైన దేవతలతో బాటు శుక్లములైన జాములతో సుతులతో గడచిపోగా, కామ్యములు, నైమిత్తికములు, అజస్రములు (మాటిమాటికీ చేయబడునవి) అయిన కర్మలందు(యజ్ఞములందు) ఇవి యుండినవి 44. అని యివి నాచే జెప్పబడిన స్థానములు గలవియును అగును. భూతభవిష్యత్కాలములందలి యన్నిమన్వన్తరములలో గూడ అగ్నుల లక్షణము వాని చేతనే (పైయగ్నులచేతనే) ప్రకటముగా చక్కగా చెప్పబడినదీ-45. ఈ యగ్నులన్నియు. తపస్వినులు అట్లే ఇవి యన్నియు అవబృథములు, అవియన్నియు ప్రజాపతులు, జ్యోతిష్మన్తములునుగా తలపబడినవి 46. స్వారోచిషము మొదలగు యేడు మన్వంతరములలో సావర్ణ్యములు తెలియదగినవి. సమస్తమన్వన్తరములలోను అచటనుండుదేవతలతో బాటు ఈయగ్నులు నానా రూపములైన ప్రయోజనములతోనుండును-47. అనాగతులైన దేవతలతోబాటు అనాగతాగ్నులుండును-48. అని అగ్నుల వినయము (యజ్ఞకుండమునకు ధీసికొనివచ్చుట) ఉన్నదియున్నట్లుగా నాచే చెప్పబడినది. తరువాత విస్తరముగను ఆనుపూర్వీతోను పితరులకు సంబంధించినది చెప్పబడును-49.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున అగ్నివంశవర్ణనమను నిరువది తొమ్మిదవ యధ్యాయము.