7 - 14 శ్లోకము నుండి ఆంధ్రానువాదము

క్షీణే కల్పే తదా తస్మిన్ కాలే హ్యుపస్థితే ।

తస్మిన్ కల్పే తదా దేవా ఆసన్యైమానికాస్తు యే ॥

నక్షత్ర గ్రహతారాస్తు చంద్రసూర్య గ్రహాశ్చ యే ।

అష్టావింశతిరేవైతా: కోట్యస్తు సుకృతాత్మనామ్ ॥

మన్వన్తరే తథైకస్మిన్ చతుర్దశసు వై తథా ।

త్రీణికోటి శతాన్యాసన్ కోట్యాద్వినవతిస్తథా ॥

 అష్టాధికాః సప్తశతాః సహస్రాణాం స్మృతాః పురా ॥

వైమానికానాం దేవానాం కల్పేఽతీతే తు యేఽభవన్ ।

 ఏకైకస్మింస్తుకల్పే వై దేవా వైమానికాః స్మృతాః ॥  

అప్పుడా కల్పము క్షీణించి దాహకాలము వచ్చినది. అప్పుడా కల్పమున దేవతలు వైమానికులై యుండిరి. నక్షత్ర గ్రహతారలు, చంద్ర సూర్య గ్రహములును, సుకృతాత్ముల (పుణ్యాత్ముల) యిరువదియెనిమిది కోటులును ఉండిరి. అట్లే ఒక మన్వంతరమునను పదునాలుగు మన్వంతరములలోను మూడు వందల కోటులును ఒక కోటి తొంబది రెండును, ఏడు వందల యెనిమిది వేలును ఉండిరని పూర్వము స్మరింపబడినది. వైమానికులైన దేవతల కల్పము. గడచిన తరువాత గూడ ఒక్కొక కల్పమున నున్న దేవతలు గూడ వైమానికులుగనే తలంపబడిరి (పరిగణింపబడిరి).

అథ మన్వన్తరే ష్వాసంశ్చతుర్దశసు వై దివి ।

 దేవాశ్చ పితరశ్చైవ మునయో మనవ స్తథా ॥

తేషామనుచరా యే చ మనుపుత్రా స్తథైవ చ ।

వర్ణా శ్రమిభిరీడ్యాశ్చ తస్మిన్ కాహలే తు యే సురా: ॥

మన్వన్తరేషు యే హాసన్ దేవలోకే దీనౌకసః ॥

తే తై స్సంయోజకైస్సార్థం ప్రాప్తే సజ్కలనే తథా ।

 తుల్యనిష్ఠాస్తు తే సర్వే ప్రాప్తే హ్యాభూతసంప్లవే ॥

తతస్తేఽ వశ్యభావిత్వాత్ బుద్ధ్వా పర్యాయమాత్మనః ।

 త్రైలోక్యవాసినో దేవాస్తస్మిన్ ప్రాప్తే హ్యుపప్లవే ॥      

అంత పదునాలుగు మన్వన్తరములలో స్వర్గమున దేవతలును పితరులును మునులును ఉండిరి. వారి సేవకులైన మనుపుత్రులును అట్లే వర్ణాశ్రమ ధర్మములాచరించు వారిచే స్తుతింపదగిన దేవతలు గూడ నుండిరి. మన్వన్తరములలో దేవలోకమున నివసించు దేవతలు వారితో గలిసియున్న వారితో బాటు సంకలనమును (మొత్తముగా లెక్కింపబడిరి) బొందిరి. తుల్యనిష్ఠలు గల ఆయందరు 'ఆభూతసంప్లవము' (పంచ భూతముల విప్లవము ప్రళయము) రాగా, ఆ విప్లవములో వారి వంతు గూడ తప్పక జరుగునని తెలిసికొనిరి. ఆ విప్లవము రాగా ముల్లోకములలో నుండు దేవతలు.

తేనౌత్సుక్య విషాదేన త్యక్త్యా స్థానాని భావతః ।

 మహర్లోకాయ సంవిగ్నా స్తతస్తే దధిరే మతిమ్ ॥

ఉత్సాహము వీడిన దు:ఖముతో తాముయుండు స్థానములు వదిలి కలతజెందిన మనస్సులు గల వారై మహర్లోకమునకు బోవ తల పెట్టిరి.

తే యుక్తా ఉపపద్యన్తే మహసిస్థై శరీరకైః ।

 విశుద్ధిబహులాః సర్వే మానసీం సిద్ధిమాస్థితాః ॥

 తైః కల్పవాసీభిః సార్ధం మహానాసాది తస్తురైః ।

 బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యై స్తద్భక్తైశ్చాప రైర్జనైః ॥

 మత్యా తు తే మహర్లోకం దేవసంఘాశ్చతుర్దశ ।

 తత స్తే జనలో కాయ సోద్వేగా దధిరే మతిమ్ ॥

 విశుద్ధిబహులాః సర్వే మానసీం సిద్ధిమాస్థితాః ।

తైః కల్పవాసిభిః సార్థం మహానాసాదితస్తు యైః ॥

 దశకృత్వ ఇవావృత్త్యా తస్మాద్గచ్ఛన్తి స్వస్తపః ।

తత్ర కల్పాన్ దశ స్థిత్త్వా సత్యం గచ్ఛన్తి వై పునః ॥

 ఏతేన క్రమయోగేన యాన్తి కల్పనివాసినః ॥  

వారు మహస్సులో ఉన్న శరీరములచే (చిన్న శరీరములచే) కూడుకొన్న వారై చక్కగా నున్నారు. వారందరు విశుద్ధితో నిండినవారై మానసి సిద్ధిని పొందియున్నారు. ఆకల వాసులతో బాటు మహా (హాన్) ఫలమును పొందినవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సద్భక్తులైన అపరజనులును. ఆ పదునాలుగు దేవ సంఘములు మహర్లోకమును తలంచి (భావించి) సోద్వేగులై జన లోకమునకు బోవుటకై తల పెట్టిరి. విశుద్ధితో నిండినవారై మానసిసిద్ధిని పొంది ఆకలవాసులతో బాటు మహా(న్) ఫలమును పొందిరి. పదిమారులు (మంత్రము) ఆవృత్తి చేత జనలోకము నుండి స్వస్తపోలోకమునకు బోవుచున్నారు. అచట పదికల్పము లుండి మరల సత్యలోకమునకు బోవుచున్నారు. కల్పవాసులు ఈ క్రమయోగముతో (భూర్లోక, భువర్లోక) స్వర్లోక మహర్లోక, జనోలోక-తపోలోక-సత్యలోకములకు బోవుచున్నారు.

ఏవం దేవయుగానాం తు సహస్రాణి పరస్పరాత్ ।

గతాని బ్రహ్మలోకం వై అపరావర్తినీం గతిమ్ ॥

ఆధిపత్యం వినా తే వై ఐశ్వర్యేణ తు తత్సమాః ।

 భవన్తి బ్రహ్మణస్తుల్యా రూపేణ విషయేణ చ ॥

 తత్ర తే హ్యవతిష్ఠన్తి ప్రతియుక్తాః ప్రసంగమాత్ ।

 ఆనన్దం బ్రహ్మణః ప్రాప్యముచ్యన్తే బ్రహ్మణా సహ ॥

 అవశ్యం భావినాఽర్థే ప్రాకృతేనైవ తే స్వయమ్ ।

నానాత్వేనా భిసంబద్ధాస్తదా తత్కాలభావినః ॥

స్వరూపతో బుద్ధిపూర్వం యథా భవతి జాగ్రతః ।

 తాత్కాల భావితేషాం తు తథా జ్ఞానం ప్రవర్తతే ॥   

ఈ విధంగ ఒకరొకరి నుండి వేల యుగములు గడచినవి. తిరుగులేని స్థానమైన బ్రహ్మలోకము గూడ పొందబడినది. ఒక ఆధిపత్యము దక్క ఐశ్వర్యములో రూపములో స్థానములోను మాత్రము వారు బ్రహ్మతో సమానులగుదురు. అచట వారు సంతోషముతోనుందురు. బ్రహ్మతో మిక్కిలి కలిసియున్నందున బ్రహ్మానందనమును పొంది తరువాత బ్రహ్మతో సహ వదిలి పెట్టబడుదురు (ముక్తి జెందుదురు). వారు స్వయముగా ముందు ప్రాకృతముగ తప్పనిసరిగా జరగబోవు అర్థమునందు నానా భావముతో సంబద్దులైనపుడు తాత్కాలభావులగుదురు. మేలుకొనియున్న వానికి స్వరూపముతో జ్ఞానము బుద్ధి పూర్వమగును. అట్లే వారి జ్ఞానము తాత్కాలభావియగును.

ప్రత్యాహరే తు భేదానాం యేషాం భిన్నాభిసూష్మణామ్ ।

 తైః సార్థం ప్రతిసృజ్యన్తే కార్యాణి కరణాని చ ॥

 నానాత్వదర్శనాత్తేషాం బ్రహ్మలోక నివాసినామ్ ।

 వినష్టస్వాధికారాణాం స్వేన ధర్మేణ తిష్ఠతామ్ ॥

అభి సూష్మములైన భేదముల యొక్క ప్రత్యాహారము నందు (ఉపసంహారము నందు) భిన్నముగా నుండును. కార్యములు కరణములును వానితో బాటే సృజింపబడును. నానాత్య దర్శనము వలన ఆ బ్రహ్మలోక నివాసులకు వినష్టమైన స్వాధికారముగలవారికి స్వధర్మమున నున్న వారికిని (తాత్కాలభావియైన జ్ఞానము ప్రవర్తించును).

 తే తుల్యలక్షణాః సిద్ధాః శుద్ధాత్మానో నీర ఞ్జనాః ।

 ప్రకృతాకారణాతీతాః స్వాత్మన్యేవ వ్యవస్థితాః ॥

 ప్రఖ్యాపయిత్వా హ్యాత్మానం ప్రకృతిస్తేషు సర్వశః ।

 పురుషవ్యాహృతత్వేన ప్రతీతాన ప్రవర్తతే ॥

వారైతే తుల్య లక్షణులు, సిద్ధులు, శుద్ధాత్ములు, నిరంజనులు. ప్రకృతిలో కారణాతీతులు, స్వాత్మలోనే యుండువారు.

ప్రవర్తితే పునః సర్గే తేషాం వా కారణం పునః ।

 సంయోగే ప్రాకృతే తేషాం యుక్తానాం తత్త్వదర్శినామ్ ॥

 ఆత్రాపవర్ణిణాం తేషామపునర్మార్గ గామినామ్ ।

అభావః పునరుత్పత్తౌ  శాస్త్రానామర్చి షామివ ॥

సర్గము (సృష్టి మరల జరుపబడగా మరల వారికి కారణమగును. తత్యదర్శులైనవారు ప్రాకృతమైన ప్రకృతిసిద్ధమై పామరులు చేయునదైన) సంయోగమున యుక్తులగుదురు. ఈ లోకమునకు మరలరాని మోక్షమునందున్నవారు చల్లారిన జ్వాల మరల బుట్టనట్లు, ఇచట మరల బుట్టరు.

తస్తేషు గతేషూర్థ్వం త్రైలో క్యాత్సు మహాత్మసు ।

తైః సార్థం యే మహర్లో కాత్తదానాసాదితా జనాః॥

 తచ్ఛిష్టాశ్చేహ తిష్ఠన్తి కల్పాద్దేహముపాసతే ।

గంధర్వాద్యాః పిశాచాన్తా మానుషా బ్రాహ్మణాదయః ।

ఏశవః పక్షిణశ్చైవ స్థావరాః ససరీసృపా ॥

 తిష్ఠత్సు తేషు తత్కాలం పృధివీతలవాసిషు ।

సహస్రం తు యత్తు రశ్మీనాం సూర్యస్యేహ విభాసతే ॥

తే సప్త రశ్మయో భూత్వా హ్యేకైకో జాయతే రవిః ॥      

అంత ఆ మహాత్ములు త్రైలోక్యము నుండి ఊర్థ్వమునకు వెళ్లిరి. వారితో బాటు మహర్లోకము నుండి జనులు రారైరి. వారు పోగా మిగిలినవారు కల్పమునకు దేహమును పొందుదురు. గంధర్వులు మొదలు పిశాచుల వరకున్న (దేవయోనులు దేవజాతులు) మనుష్యులు, బ్రాహ్మణులు మొదలగువారు, పశువులు, పక్షులును, కదలలేనివి (పర్వతములు) ప్రాకునట్టి పాములున్ను, వీరందరు భూమి పై నుండు వారై యుండగా, ఇచట వేయియై (అనంతములై) భాసించు సూర్య కిరణములు ఏడుగానయి అందొక్కొక్క రవి (సూర్యుడు) పుట్టును.

క్రమేణోత్తిష్ఠమానా స్తే త్రీన్ లోకాన్ ప్రదహన్ త్యుత ।

జజ్గమం స్థావరం చైవ నదః సర్వాంశ్చ పర్వతాః ॥

 పూర్వే శుష్కా హ్యనావృష్ట్యా సూర్యై సైశ్చ ప్రధూపితాః ॥

తదా తే వివిశుః సర్వే నిర్దగ్ధాః సూర్యరశ్మిభిః ।

జజ్గమాః స్థావరాః సర్వే ధర్మాధర్మాత్మకాస్తు వై ॥     

క్రమముగా నా సూర్యులు (ఆకాశము పైకి) లేచుచున్నవారై మూడు లోకములను దహించివేయుదురు. జజ్జిమమును (తిరుగువానిని) స్థావరమును (కదలక నుండువారిని), నదులను సమస్త పర్వతములను (దహించివేయుదురు). అందులో అవి ముందే వర్షములేనందున ఎండిపోయినవి. సప్త సూర్యులచే (నిప్పంటి) పొగరాజినవి. అపుడు ధర్మాధర్మాత్మకములైన ఆ సమస్త స్థావర జజ్జమములు సూర్య కిరణములచే దహించిపోయినవి.

ద గ్ధదేహస్తత స్తే వై గతాః పాపయుగాత్యయే ।

 యోన్యా తయా హ్యనిర్ముక్తాః శుభపాశాను బంధయా ॥

తరువాత పాపయుగము పోయినపుడు దహించిన శరీరములు గల వారు శుభపాశానుబంధము గల యాయోనిచే వదలి పెట్టబడనివారై (జనలోకమునకు) వెళ్ళిరి.

తతస్తే హ్యుపపద్య న్తే తుల్యరూపాజనే జనాః ।

 విశుద్ధిబహులా స్సర్వే మానసీం సిద్ధమాస్థితాః ॥

 ఉషిత్వా రజనీం తత్ర బ్రహ్మణోఽవ్యక్తజన్మనః ।

పునః సర్గే భవ న్తీహ బ్రహ్మణో మానసీ ప్రజాః ॥

ఆ తరువాత 'జన' లోకమున జనులు సమానరూపులుగా నొప్పిరి. వారందరు సర్వపరిశుద్దులు, మానసీ సిద్దిని పొందినవారు.అచట ఒక రాత్రియుండి పుట్టుక తెలియని బ్రహ్మయొక్క సృష్టిలో మరల బ్రహ్మయొక్క మానస ప్రజలుగా బుట్టుదురు.

తత స్తేషు ప్రవృత్తేషు జనే త్రైలోక్యవాసిషు ।

నిర్దగ్ధేషు చ లోకేషు తేషు సూర్యైస్తు సప్తభిః ॥

 వృష్ట్యా క్షితౌ ప్లావితాయాం విశీర్ణేషాలయేషు చ ॥

 సముద్రాశ్చైవ మేఘాశ్చ ఆపశ్చ సర్వాశ్చ పార్థివాః ।

 ప్రజన్యైకార్ణవత్త్వం హి సలిలాఖ్యా స్తదాశ్రితాః ॥

 ఆగతాగతికం తద్వై యదా తు సలిలం బహు ।

 సంఛాద్యేమాం స్థితాం భూమిమర్ణవాఖ్యా తదా చ సా ॥  

ఆ తరువాత ఆ త్రైలోక్య వాసులు జనలోకములో నుండగా, సప్త సూర్యులచే ఆ లోకములు దహింపబడగా, వర్షముచే భూమియంతయు వరదలు పారగా ఆలయములన్నియు ధ్వంసముకాగా, సముద్రములు మేఘములు భూమి పైన సమస్త జలములు వీనికి సంబంధించిన జలములన్నియు కలిసి నేకసముద్రముగానైనవి. పై పైగా వచ్చు ఆ నీరు అధికమైనపుడు ఈ భూమినంతయు నీరు గప్పినది. అపుడా భూమి అర్ణవము (సముద్రమను) పేరుగలదైనది.

ఆభాతి యస్మాన్నాభాన్తి భాసన్తో వ్యాప్తిదీప్తిషు ।

సర్వతః సమనుప్లావతాసాఞ్చ మ్భో విభావ్యతే ॥

తదమ్భస్తనుతే యస్మాత్ సర్వాం పృధ్వీం సమన్తతః ।

 ధాతుస్తనో తిర్విస్తారే తేనామ్భస్తనవః స్మతా: ॥

 అరమిత్యేష శీఘస్తు నిపాతః కవిభిః స్మృతః ।

 ఏకార్ణవే భవన్త్యాపో న శ్రీఘాస్తే న తే నరాః ॥

 తస్మిన్ యుగసహస్రాస్తే సంస్థితే బ్రహ్మణోఽహాని ।

రజన్యాం నర్తమానాయాం తాత త్తత్ సలిలాత్మనా ॥

 తతస్తు సలిలే తస్మిన్నష్టే గ్నౌ పృథీవీతతే ।

ప్రశాన్తవాతేఽన్దకారే నిరాలోకే సమస్తత: ॥ 

ఎందువలననగా వ్యాప్తిదీపులలో (సూర్యకాంతులలో) ప్రకాశించుచున్నవైనను (మనకు) ప్రకాశించుటలేదు. ఆకాంతులలో గూడ అంతట నీరుపారి వాటిని కప్పివేయుచున్నది. ఆ నీరు భూమియంతటను వ్యాపించుటవలనను, తనోతి ధాతువు విస్తార మను అర్థము చెప్పుట చేతను, అవి (కాంతులు) అమ్భస్తనువులని (నీరు శరీరముగా గలవి అని) స్మరింపబడుచున్నవి. 'అర'మన్నది శీఘమను అర్థమున నిపాతముగా కవులు చెప్పినారు. భూమి ఏకార్ణవమైనపుడు ఆ నీరు శీఘ్రముగా లేదు. కావున అవి నీరములు అయినవి. బ్రహ్మయొక్క ఒక పగలై అది యుగ సహస్రాంతముగా, రాత్రియంతయు నీరు రూపములో నుండేను. ఆ తరువాత ఆజలమున భూమి పై అగ్ని నశింప గా, ప్రశాంతమైనవాయువుగా, వెలుగులేని చీకటి అంతట నుండగా-55.

యేనైవాధిష్ఠితం హీదం బ్రహ్మ స పురుషః ప్రభుః ।

 విభాగమస్య లోకస్య పునర్యై కర్తుమిచ్ఛతి ॥

 ఏకార్ణవే తదా తస్మిన్నష్టే స్థావరజజ్గమే ।

తదా స భవతి బ్రహ్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥

సహస్రశీర్షా పురుషో రుక్మవర్ణోహ్యతీన్ద్రియః ।

 బ్రహ్మా నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే తదా ॥   

దీని నంతయు అధిష్ఠించినవాడు బ్రహ్మ ఆతడే పురుషుడు ప్రభువును ఆతడు ఈ లోకము యొక్క విభాగమును మరల జేయుదలచుచున్నాడు. అపుడు ఏకార్ణవమైన దాని యందు స్థావరజజ్ఞమములు నష్టములు కాగా, ఆ బ్రహ్మపుట్టును. ఆ పురుషుడు సహస్రాక్షులు గలవాడు, సహస్రపాదములు గలవాడు, నహస్రశిరములు గలవాడు, బంగారు వర్ణము గలవాడు, ఇంద్రియములకు గోచరముకానివాడు. అపుడు నారాయణుడను బ్రహ్మ జలమున పరుండెను.

సత్త్వోద్రేకాత్ప్ర బుద్ధస్తు శూన్యం లోకమవేక్ష్య చ ।

 ఇమఞ్చోదాహరంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి ॥

ఆపో నారాఖ్యాస్తనవ ఇత్యపాన్నామ శుశ్రుమః ।

ఆపూర్యసాభిం తత్రాస్తే తేన నారాయణః స్మృతః ॥

 సహస్రశీర్షా సుమనాః సహస్రపాత్ స్రచక్షుర్వదనః సహస్రభుక్ ।

సహస్రబాహు: ప్రథమః ప్రజాపతి స్త్రయీపథే యః పురుషో నిరుచ్యతే ॥    

సత్యోదేకము వలన నాతడు మేలుకొని లోకమును శూన్యముగా జూచెను. ఈసందర్భమున నారాయణుని గూర్చి ఈ శ్లోకమును పేర్కొందురు (చెప్పుదురు). ఆపస్సులు (జలముల) పేరు విందుము. (ఆ జలములను) నాభిలో నింపి యచట ఉన్నాడుగావున నారాయణుడని స్మరింపబడినాడు. వేద మార్గమున నిర్వచింపబడిన ఆ పురుషుడు వేయి తలలు గలవాడు, మంచి మనస్సుగలవాడు, వేయి పాదములు గలవాడు వేయి కన్నులు ముఖములును గలవాడు. వేయి బాహువులు గలవాడు. ఆతడు మొదటి ప్రజాపతి బ్రహ్మ.

ఆదిత్యవర్ణో భువనస్య గోప్తా ఏకోహ్యపూర్వ: ప్రథమం తురాషాట్ ।

 హిరణ్యగర్భః పురుషో మహాత్మా స పఠ్యతే వై తమసః పరస్తాత్ ॥

కల్పాదౌ రజసోద్రిక్తో బ్రహ్మా భూత్వా సృజత్ ప్రజాః ।

కల్పాన్తేస్తే తమసోద్రిక్తో కాలో భూత్వాఽగ్రసత్ పునః ॥      

సూర్యవర్ణము గలవాడు, భువనమును రక్షించువాడు, ఒక్కడు, పూర్వము లేనివాడు. మొదటి ఇంద్రుడు హిరణ్యగర్భుడైన (బ్రహ్మయైన) మహాత్ముడైన పురుషుడు ఆతడు తమస్సున కావల నుండువాడుగా పఠింపబడుచున్నాడు. కల్పాదిలో రజోగుణముచే నుద్రేకమునందిన బ్రహ్మయై ప్రజలను సృష్టించెను. కల్పాన్తమువలన తమో గుణముచే నుద్రేకమును జెందిన కాలుడై మరల ప్రజలను మ్రింగెను.

స వై నారాయణాఖ్యస్తు సత్త్వోద్రిక్తోర్ణఽవే స్వపన్ ।

 త్రిధా విభజ్య చాత్మానం త్రైలోక్యేక్య సమవర్తత ॥

సృజతే గ్రసతే చైవ వీక్షన్తే చ త్రిజ్జభిస్తు తాన్ ।

ఏకార్ణవే తధా లోకే నష్టే స్థావరజ్గమే ॥

 చతుర్యుగ సహస్రాన్తే సర్వతః సలిలావృతే ।

బ్రహ్మా నారాయణాఖ్యస్తు అప్రకాశార్ణవే స్వపన్  ॥

 చతుర్విధాః ప్రజాః గ్రస్త్యా బ్రాహ్మ్యం రాత్ర్యాం మహార్ణవే ।

పశ్యన్తి తం మహర్లోకాత్ సుప్తం కాలం మహర్షయ: ॥ 

     ఆ నారాయణు డనువాడే సత్య గుణముచే నుద్రిక్తుడై సముద్రమున పరుండుచు, తనను మూడు విధములుగా విభజించి ముల్లోకమున నుండెను. ఆ మూడింటిచే (త్రివిధావిభక్త శరీరములచే) వారిని సృష్టించును మింగివేయును, చూచును. అప్పుడు స్థావరజఱమరూపమైన లోకము ఏకార్ణవము కాగా, నాలుగు వేల యుగముల చివర, అంతయు జలముచే ఆవరింపబడగా, నారాయణడును బ్రహ్మ వెలుగు లేని సముద్రమున పరుండుచు, నాలుగు విధములైన ప్రజలను మింగి బ్రాహ్మీ రాత్రి యందు నిద్రించిన కాలుని మహర్లోకమునుండి మహర్షులు చూతురు.

భృగ్వాదయో యదా సప్త కల్పేహ్యస్మిన్ మహర్షయః ।

తతో వివర్తమానైస్తే ర్మహాన్ పరిగతః పరః ॥

 గత్యర్థాద్ ఋషయో ధాతోర్నామనిర్వృత్తి రాదితః ।

తస్మాదృషి పరత్వేన మహాంస్తస్మాన్మహర్షయః ॥

 మహర్లోక స్థితైర్ధృష్టః కాలః సుప్త స్తదా చ తైః ।

సత్యాద్యః సప్త తే హ్యాసన్ కల్పేఽ తీతే మహర్షయః ॥

 ఏవం బ్రాహ్మషు రాత్రిషు హ్యతీతా సుసహస్రశః ।

 దృష్టవన్త స్తథా హ్యన్యే సుప్తం కాలం మహర్షయః ॥

కల్పస్యాదౌ తు బహుశో యస్మాత్ సంస్థా శ్చతుర్దశ ।

 కల్పయామాస వై బ్రహ్మా తస్మాత్ కాలో నిరుచ్యతే ॥

 స స్రష్టా సర్వభూతానాం కల్పాదిషు పునః పునః ।

వ్యక్తావ్యక్తో మహాదేవస్తస్య సర్వమిదం జగత్ ॥

ఇత్యేష ప్రతిసన్దిర్వ: కీర్తితః కల్పయోర్ద్వయోః ।

సాంప్రతాతీతయోర్మధ్యే ప్రాగవస్థా బభూవ యా ॥

 కీర్తితా తు సమాసేన కల్పేకల్పే యథాతథా ।

సాంప్రతం తే ప్రవక్ష్యామి కల్పమేతం నిబోధత ॥

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే ప్రతిసన్ధి కీర్తనం నామ సప్తమోఽధ్యాయః ॥      

భృగువు మొదలగు ఏడుగురు మహర్షులు ఈ కల్పమున (నున్నపుడు) నుండిరి. ఆ తరువాత ఆ విధముగా ఉంటున్న సప్తమహర్షులచే పరమైన మహర్లోకము పరిగతమాయెను-68. మొదట సత్యర్థమైన 'ఋ' ధాతువు నుండి 'ఋషయః' అన్న నామము (పదము) ఏర్పడినది. ఆ కారణము వలన ఋషి పరమైన (ఋషి శబ్దము పరముగా నున్న) మహత్ శబ్దము కావున మహర్షయః అయినది. అపుడు మహర్లోకమున నున్న ఆ సప్తర్షుల చేత నిద్రించిన కాలము చూడబడినది. కల్పము ముగియగా, ఆ సప్తమహర్షులు సత్యాదులైరి. ఈ విధముగా బ్రాహ్మీరాత్రులు (బ్రహ్మమానములోని రాత్రులు) వేలకొలది ముగియగానే, ఇతర మహర్షులు గూడ అట్లే నిద్రించిన కాలమును చూచిరి. కల్పాదిలో పదునాలుగు సంస్థలను అనేక పర్యాయములు బ్రహ్మ కల్పించిన కారణముగా కాలము నిర్వచింపబడినది. ఆ కాలము కల్పాదులలో మరల మరల సర్వభూతములకు స్రష్ట యగును. ఆ కాలమే వ్యక్తావ్యక్తుడైన మహదేవుడు (శివుడు) అగును. ఈ జగమంతయు ఆ మహదేవునిది. ఈ విధముగ రెండు కల్పముల యొక్క ప్రతి సన్ది చెప్పబడినది. ఈ ప్రతి సంధి వర్తమాన భూతకాలముల మధ్యన మొదటి (ప్రారంభ) యవస్థ యగును. ప్రతి కల్పమున ఉన్నది యుండునట్లు సంగ్రహముగా ప్రతి సంధి చెప్పబడినది. ఇప్పుడీ కల్పమును గూర్చి చెప్పెదను వినుడు.

ఇది వాయు ప్రోక్తమైన మహాపురాణమున ప్రతిసంధి కీర్తనమను ఏడవ అధ్యాయము.