వాయు మహా పురాణము
16 - శౌచాచారలక్షణం
వాయురువాచ:-
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి శౌచాచారస్య లక్షణమ్ ।
యదనుష్ఠాయ శుద్ధాత్మా ప్రేత్యస్వర్గం హి చాప్నుయాత్ ॥
ఉదకార్థీ తు శౌచానాం మునీనాముత్తమం పదమ్ ।
యస్తు తేష్వప్రమత్త! స్యాత్ సమునిర్నావసీదతి॥
మానావమానౌ ద్వావేతౌ తామేవాహుర్విషామృతే ।
అవమానం విషం తత్ర మానన్ త్య మృతముచ్యతే॥
యస్తు తేష్వప్రమత్తః స్యాత్ సమునిర్నావసీదతి ।
గురోః ప్రియహితేయుక్తః స తు సంవత్సరం వసేత్॥
నియమేష్వప్రమత్తాస్తు యమేషు చ సదా భవేత్ ।
ప్రాప్యానుజ్ఞాతం తతశ్చైవ జ్ఞానాగమన ముత్తమమ్।
ఆవిరోధేన ధర్మస్య విచరేత్పృథివీమిమామ్॥
వాయువు పలికెను:- ఆపైన శౌచాచారము యొక్క లక్షణమును చెప్పబోవుచున్నాను. దానినాచరించి శుద్దాత్ముడై మరణించిన తరువాత స్వర్గమునే పొందగలడు-1. జలమును గోరువాడు మునులయొక్క శౌచములకు (పవిత్రతలకు) ఉత్తమ స్థానమగును. వాడు శౌచముల విషయములలో అప్రమత్తుడుగానుండవలె. అట్టి ముని నాశమును బొందడు-2. మానావమానములను నీరెండే విష-అమృతములని యందురు. అందులో అవమానము విషము మానము అమృతమనబడినది 3. వానిలోనప్రమత్తుడైన ముని నాశమును బొందడు. గురువు యొక్క ప్రియమై హితమైన కార్యమునకు బూనుకొన్నవాడు సంవత్సరము నుండి గురువును సేవింపవలె-4. అతడు అహింసా సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహరూపములైన యమములోను, శౌచ సంతోష-తపస్-స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన రూపములైన నియములలోను ఎల్లప్పుడు అప్రమత్తుడై యుండవలెను. గురువు దగ్గర ఉత్తమ జ్ఞానమును రాబట్టవలెను. (సంపాదించవలెను) ఆ తరువాత గురువుచే అనుజ్ఞాతుడై అనుమతిని పొందినవాడై ధర్మమునకు విరోధముగాకుండగా ఈ భూమినందతయు తిరుగవలెను.-5.
చక్షుః పూతం ప్రజేన్మార్గం వస్త్రపూతం జలం పిబేత్ ।
సత్యపూతాం వదేద్వాణీమితి ధర్మానుశాసనమ్॥
ఆతిథ్యం శ్రాద్దయజ్ఞేషు న గచ్చేద్యోగవిత్ క్వచిత్ ।
ఏవం హ్యాహింసకో యోగీ భవేదితి విచారణా॥
వహ్నౌ విధూమే వ్యఙ్గారే సర్వస్మిన్ భక్తవజ్జనే ।
విచరేన్మతిమాన్యోగీ తు తేష్వేవ నిత్యశాః॥
యథైవమవమన్యన్ త్యే యథాపరిభవన్ తి చ ।
యుక్తస్తథాచరేదైక్షం సతాం ధర్మమదూషయన్।
భైక్షం చరేద్గృహస్థేషు యథాచార గృహేషు చ ।
శ్రేష్ఠాతు పరమా చేయం వృత్తిరస్యోపదిశ్యతే॥
అత ఊర్థ్యం గృహస్థేషు శాలీనేషు చరేద్ద్విజః ।
శ్రద్దధానేషు దాన్ తేషు శ్రోత్రియేషు మహాత్మసు॥
అత ఊర్థ్యం పునశ్చాపి అదుష్టం పతితేషు చ ।
భైక్షచర్యా వివర్ణేషు జ్యుఘన్యావృత్తిరుచ్యతే ॥
బైక్షం యవాగూం తక్రం వా పయోవకమేవ చ ।
ఫలమూలం విపక్వం వా పిణ్యాకం శక్తితోఽపి వా ॥
ఇత్యేతే వై మయా ప్రోక్తా యోగినాం సిద్ధివర్ధనాః ।
ఆహారాస్తేషు సిద్ధేషు శ్రేష్ఠం, బైక్షమితి స్థితమ్॥
కన్నులు చూచి యిది పవిత్రమైనదియని చెప్పిన మార్గముననే పోవలె. వస్త్రముతో వడియ బోసిన పవిత్రమైన నీటినే త్రాగవలె. అబద్ధమేమాత్రము లేక సత్యముచే పవిత్రమైన మాటనే పలుకవలె. ఇది ధర్మానుశాసనము-6. యోగము దెలిసినవాడు ఎక్కడనైనను శ్రద్ధ యజ్ఞములతో ఆతిథ్యమును స్వీకరింపరాదు. ఈ విధముగా నాచరించినచో యోగి అహింసకుడగును. విచారము-7. పొగలేని యగ్నియున్నచోట, బొగులు లేనిచోట, భక్తజనమున్న చోట నంతటను బుద్దినుంతుడైన యోగి చలింపవలేను. కాని ప్రతి నిత్యముముగా పై చోటులలో చరింపరాదు-8. సజ్జనుల ధర్మమును నిందింపక, జనులు తననవమానింపని విధమున, అట్లే తిరస్కరింపని విధమునను యుక్తుడైన యోగి) భిక్షాటనము జేయవలెను-9. యోగి వేద విహితాచారము గల గృహస్థుల యిండ్లలో భిక్షాచరణము జేయవలె. ఇది యోగ శ్రేష్ఠమైన పరమోత్కృష్టమైన వృత్తియని యుపదేశింపబడినది-10. ఆ పైన మృదు స్వభావము గలవారు, వైదికాచారములందు శ్రద్ధగలవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు (కామ క్రోధాలకు వశముగానివారు) వేదశాస్త్రాధ్యయన సంపన్నులు, మహాత్ములునైన గృహస్థుల యిండ్లలో యోగియైన బ్రాహ్మణుడు భిక్షాచరణము జేయవలెను-11. ఆపైన దుష్టులుగాని పతితులు (భ్రష్టులు) గాని కానట్టి వారి యిండ్లలో భిక్షాచరణము మిక్కిలి నీచవృత్తియనబడి-12. యవాగువులు (జవ్వలు), మజ్జిగ, పాలు, అలసందలు, ఫలములు కంద మూలములు, వండనివి, తెలకపిండి వీనిని భిక్షలో పొందవలెను-13. నాచే ఈ పై జెప్పినవి యోగులకు సిద్దులకు వృద్దిజేయునట్టి యాహారములు అది సిద్ధించినచో భిక్షాచరణము శ్రేష్ఠమైనది-14.
అబ్బిందుం యః కుశాగ్రేణ మాసే మాసే సమశ్నుతే ।
న్యాయతో యస్తు భిక్షేత సపూర్వోక్తాద్విశిష్యతే ॥
యోగినాం చైవ సర్వేషాం శ్రేష్ఠం చాంద్రాయణం స్మృతమ్ ।
ఏకం ద్వేత్రీణి చత్వారి శక్తితో వా సమాచరేత్ ॥
అస్తేయం బ్రహ్మచర్యం చ అలోభస్త్యాగ ఏవ చ ।
వ్రతాని చైవ భిక్షాణామహింసా పరమార్థితా॥
అక్రోధో గురుశుశ్రుషా శౌచమాహుర లాఘవమ్ ।
నిత్యం స్వాధ్యాయ ఇత్యేతే నియమాః పరికీర్తితాః॥
దర్భ చివరి భాగముతో నీటి బిందువును నెల నెలకు త్రాగినవాడు, న్యాయముగా భిక్షనాచరించు వాడు పూర్వము జెప్పిన దానికంటే విశిష్టుడు-15. సమస్తయోగులకును చాంద్రాయణ వ్రతము శ్రేష్ఠమనబడినది. ఒకటి, రెండు, మూడు నాలుగు గాని యథాశక్తిగా (చాంద్రాయణ వ్రతమును) జేయవలెను-16. దొంగతనము జేయకుండుట, బ్రహ్మచర్యము, లోభము లేకుండుట, త్యాగము, ఇవి భిక్షువులకు వ్రతములు, అహింస, పరమార్థమును కోరుట, కోపములేకుండుట, గురు సేవ, శౌచము, తేలికయాహారము (అల్పాహారము) దీసికొనుట. నిత్యము స్వవేదాధ్యయనము ఇయ్యవి నియమములని చెప్పబడినవి.
బీజయోనిర్గుణవపుర్భద్ధః కర్మభిరేవ చ ।
యథాద్విపవారణ్యే మనుష్యాణాం విధీయతే॥
ప్రాప్యతే వాచిరాదేవాజ్కు శేనేవ నివారితః ।
ఏవం జ్ఞానేన శుద్ధేన దగ్ధబీజోహ్యకల్మషః।
విముక్తబన్ధః శాన్తోజ్సౌ ముక్త ఇత్యభిధీయతే ॥
మనుష్యుడు బీజము జన్మ కారణమయినవాడు, త్రిగుణములు శరీరమైనవాడు, కర్మలచే బద్ధుడును అగును. అడవిలో ఏనుగునకువలె మనుష్యులకు సైతము కర్మబంధము విధింపబడును-19. అంకుశముచేత ఏనుగు తన స్వాతంత్ర్యము నుండి నివారింపబడి మావటివానికి వశమైనవాడు చెప్పిపనులెల్ల జేయును. అట్లే మనుష్యుడు గూడ కర్మబద్దుడై స్వాతంత్ర్యము తొలగి వెంటనే ప్రాపంచిక కర్మజేయుచుండును. కావున శుద్దమైన జ్ఞానముచే దహింపబడిన జన్మకారణ బీజము గలవాడై, పాపములు లేనివాడై, బంధములన్నియు వదలినవాడై, శాంతుడైన యీ మనుషుడు ముక్తుడనబడును-20.
వేదైః స్తుత్వా సర్వయజ్ఞ క్రియాస్తు యజ్ఞే జాప్యం జ్ఞానినామాహురగ్య్రమ్ ।
జ్ఞానాద్ధ్యానం సజ్గరాగవ్య పేతం తస్మిన్ ప్రాప్తే శాశ్వతస్యోపలబ్ధిః॥
దమః శమ సత్యమ కల్మషత్వం మౌనం చ భూతేష్వఖి లేష్వథార్జవమ్।
అతీన్ద్రియజ్ఞానమిదం తధార్జవం ప్రాహుస్తథాజ్ఞానవిశుద్ధ సత్త్యామ్॥
సమాహితో బ్రహ్మపరోఽప్రమాదీ శుచిస్తథైవాత్మరతిర్జితేన్ద్రియః।
సమాప్నుయుర్యోగమిమం మహాధియో మహర్షయశ్త్చెవమన్దితామలాః॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే శౌచాచారలక్షణంనామ షోడశోఽధ్యాయః ॥
వేదములచే స్తుతింపదగినవి సమస్త యజ్ఞ క్రియలు, యజ్ఞమునందు జ్ఞానులు జపించినది మిక్కిలి శ్రేష్ఠము.జ్ఞానము వలన సంగరాగములు లేని ధ్యానము గలుగును. అది లభించినచో శాశ్వతుడు లభించును-21. దమము, శమము, అకల్మషత్వము, సత్యము, కల్మషములేమి, మౌనము, అఖిల ప్రాణులయందు కౌటిల్యము లేమి వీనిని జ్ఞానముచే విశుద్ధమైన సత్యము (బలము) గలవారు అతీన్షియ జ్ఞానమునుగాను ఆర్జవమునుగాను జెప్పుదురు-22. సమాహితుడు, బ్రహ్మపరుడు, ప్రమాదము జెందనివాడు. శుచి, ఆత్మయందే రతుడైనవాడు, ఇంద్రియముల జయించినవాడు ఈ యోగమును పొందుదురు. అనిందుతులును మలినము లేనివారునైన మునులు గూడ నీ యోగమును పొందుదురు.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున శౌచాచారలక్షణమనునది పదునారవ యధ్యాయము.