వాయు మహా పురాణము
18 - యతిప్రాయశ్చిత్తవిధిర్నామ
వాయురువాచ:-
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి యతీనామిహనిశ్చయమ్ ।
ప్రాయశ్చిత్తాని తత్త్వేన యాన్యకామీకృతాని తు ॥
అథ కామకృతేజ్ప్యాహుః సూక్ష్మధర్మవిదో జనాః ॥
పాపం చ త్రీవిధం ప్రోక్తం వాజ్మనఃకాయ సంభవమ్ ।
సతతం హి దివారౌత్రా యేనేదం బాధ్యతే జగత్॥
న కర్మాణి నచాప్యేష తిష్ఠతీతి పరా శ్రుతిః ।
క్షణమేవ ప్రయోజ్యంతు ఆయుషస్తు విధారణాత్ ॥
భవేద్ధీరోజ్ప్రమత్తస్తు యోగో హి పరమం బలమ్ ।
న హి యోగాత్పరం కించిన్నరాణామిహ దృశ్యతే ॥
తస్మాద్యోగం ప్రశంసన్తి ధర్మయుక్తా మనీషిణః ॥
ఆ పైన యతుల యొక్క నిజముగా అకామకృతములైన వానికి (తెలియక చేసిన పాపకర్మలకు) ప్రాయశ్చిత్తములను నిశ్చయముగా జెప్పనున్నాను. ధర్మసూక్ష్మమును దెలిసిన వారు కామకృతములకు (కావలెనని తెలిసి చేసిన పాపములకు)ను ప్రాయశ్చిత్తములున్నవనియందురు-1, పాపము మూడు విధములు మాటతో గలిగినది, మనస్సుతో కలిగినది, శరీరముతో గలిగినది. ఈ త్రివిధపాపముచే రాత్రింబవళ్లు ఈజగము బాధింపబడుచున్నది-2. కర్మలు ఉండవు, కర్మలజేయువాడు గూడ ఉండడు- అని శ్రేష్ఠమైన వేదములో చెప్పినది. ఆయుష్యము స్థిరముగా నిలువనిది గావున ప్రాయశ్చిత్తము క్షణకాలమే ప్రయోగింపదగినది-3. ధీరుడైయుండవలె. అప్రమత్తుడైయుండవలె. యోగమేయుత్కృష్టమైన బలము. నరులకు యోగముకన్న వేరైన బలమేదియు లేదు. కావున ధర్మయుక్తులైన విద్వాంసులు యోగమును ప్రశంసింతురు-4.
అవిద్యాం విద్యయా తీర్త్యా ప్రాప్త్యెశ్వర్యమనుత్తమమ్ ।
దృష్ట్యా పరాపరంధీరాః పరం గచ్ఛన్తి తత్పదమ్ ॥
విద్యచే అవిద్యను దాటి, ఉత్తమోత్తమమైన యైశ్వర్యమును బొంది, పరాపరమును (పరమును అపరమును) చూచి ధీరులు ఆపరమపదము నొందుదురు-5.
వ్రతాని యాని భిక్షూణాం తథైవోపవ్రతాని చ ।
ఏకైకాపక్రమే తేషాం ప్రాయశ్చిత్తం విధీయతే ॥
ఉపేత్య తు స్త్రియం కామాత్ ప్రాయశ్చిత్తం నిర్దిశేత్ ।
ప్రాణాయామ సమాయుక్తం కుర్యాత్సాంతపనం తథా ॥
తతశ్చ రతినిర్దేశం కృచ్ఛ్రస్యాన్ తే సమాహితః ।
పునరాశ్రమ మాగమ్య చరేద్భిక్షురతన్ద్రితః ॥
న మర్మయుక్తం వచనం హీనస్తీతి మనీషిణః ॥
తథాజ్పి చ న కర్తవ్యః ప్రసంగో హ్యేషదారుణః ।
అహోరాత్రాధికః కశ్చిన్నాస్త్యధర్మ ఇతిశ్రుతిః ॥
భిక్షువులకు కొన్ని వ్రతములు ఉపవ్రతములు విధింపబడినవి. వానిలో నొక్కొక్కటీ పాటింపబడనప్పుడు వానికి ప్రాయశ్చిత్తము విధింపబడును-6. కామముతో స్త్రీని పొందినప్పుడు ప్రాయశ్చిత్తమును చెప్పవలెను. అతడు ప్రాణాయామముతోబాటు సాంతపన వ్రతమును (మూడు దినములు పగళ్లును, మూడు దినములు రాత్రులును భుజించి, మూడుదినములు ఆయాచిత పదార్థములను భుజించి, పిమ్మట మూడు దినములు నిట్రుపాసముండెడు వ్రతము. కొందరిమతమున పంచ గవ్యమును కుశోదకమును బుచ్చుకొని యొకరాత్రియు ఏవాసముండువ్రతమును) చేయవలెను-7. ఆ తరువాత పై చెప్పిన సాంతపనవ్రతము చివర సమాహితుడై (సమాధియుందున్నవాడై) చెప్పినదానిని చేవలెను. తరువాత ఆశ్రమమునకు మరలవచ్చి సోమరితనము వీడి భిక్షువు చరింపవలెను. కిటుకులు గల మాటలు హింసింపవని పండితులందురు-8. ఐనను ఈ ప్రసంగము మిక్కిలి దారుణము, చేయరాదు. అహోరాత్రములు (ఒకదినము ఒక రాత్రి) మీంచిన యధర్మములేదు. అని శ్రుతి చెప్పినది. (చేసిన యధర్మము ఒక రాత్రింబవళ్లుతో కూడిన దినమునకు మించియుండదని శ్రుతి చెప్పినది-9.
హింసా హ్యేషాపరాసృష్టా దైవతైర్మునిభిస్తథా ।
యదేతద్ద్రవిణం నామ ప్రాణాహ్యేతే బహిశ్చరాః ॥
ఏవం కృత్వా సదుష్టాత్మా భిన్నవృత్తా వ్రతాచ్చ్యుతః ।
భూయో నిర్వేదమాపన్నశ్చరేచ్చాంద్రాయణ వ్రతమ్ ॥
విధినా శాస్త్రదృష్టేన సంవత్సరమితి శ్రుతిః ।
తతః సంవత్సరస్యాన్తే భూయః ప్రక్షీణకల్మషః ॥
భూయోనిర్వేదమాపన్నశ్చరేద్భిక్షార తంద్రితః ॥
ఈ హింస దేవతలచేతను మునులచేతను సృష్టింపబడి పెద్దదైనది. ఈ డబ్బనునది బహిరమున చరించు ప్రాణములు (పంచప్రాణములు)-10. ఈ విధముగాననుకొనివాడు దుష్టాత్ముడు, భిన్నమైన నడవడి గలవాడై వ్రతమునుండి భ్రష్టుడగును. వాడు మరల దుఃఖమును బొంది చాంద్రాయణ వ్రతమును జేయవలెను-11. శాస్త్రము చెప్పిన తీరుగా చాంద్రాయణ వ్రతమును సంవత్సరము జేయవలెనని శ్రుతి యనుచున్నది. తరువాత సంవత్సరాన్తమున మరల క్షీణించిన పాపముగలవాడై మరల వైరాగ్యము జెందినవాడై సోమరితనము లేక భిక్షువు తన ధర్మమును చరింపవలెను-12.
అహింసా సర్వభూతానాం కర్మణా మనసా గిరా ।
అకామాదపి హింసేత యది భిక్షుః పశూన్ మృగాన్ ।
కృచ్ఛ్రాతికృచ్ఛ్రం కుర్వీత చాంద్రాయణమథాపి వా ॥
స్కన్దేదిన్ద్రియదౌర్బల్యాత్ స్త్రియం దృష్ట్యా యతిర్యది ।
తేన ధారయిత వ్యానై ప్రాణాయామాస్తు షోడశ ॥
దీవాస్కన్నయ్య విప్రస్య ప్రాయశ్చిత్తం విదీయతే ।
త్రిరాత్రముపవాసశ్చ ప్రాణాయామశతం తథా ॥
రాత్రే స్కన్నః శుచిఃస్నాతో ద్వాదశైవ తు ధారణాః ।
ప్రాణాయామేన తు శుద్ధాత్మా విరజా జాయతే ద్విజ॥
ఏకాన్నం మధు మాంసం వా హ్యావశ్రాద్ధం తథైవ చ ।
అభోజ్యాని యతీనాం చ ప్రత్యక్షలవణానిచ ॥
ఏకైకాతిక్రమే తేషాం ప్రాయశ్చిత్తం విధీయతే ।
ప్రాజాపత్యేవ కృచ్ఛ్రేణ తతః పాపాత్ప్రముచ్యతే ॥
వ్యతిక్రమాచ్చ యే కేచిద్వాఙ్మనః కాయసంభవమ్ ।
సద్భిః సహనిశ్చిత్య యద్భ్రూయుస్తత్స మాచరేత్ ॥
విశుద్ధబుద్ధిః సమతోష్టకాంచనః సమస్తభూతేషు చరన్ సమాహితః ।
స్థానం ధ్రువం శాశ్వతమవ్యయం సతాం పరం స గత్వానపు ర్హి జాయతే॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే యతి ప్రాయశ్చిత్తవిధిర్నామ
అష్టాదశోఽధ్యాయః ॥
బిక్షువు మనస్సుతో, మాటతో, శరీరముతోను సర్వప్రాణుల యెడ అహింసను పాటించవలె. కావలెనని కాక, ఆబుద్ది పూర్వకముగనైనను, భిక్షువు పశువులను మృగములను హింసించినచో కృచ్చాతికృచ్చవ్రతమునుగాని, చాంద్రాయణ వ్రతమునుగాని ప్రాయశ్చిత్తముగా జేయవలెను-13. యతి స్త్రీని చూచి యింద్రీయ దౌర్బల్యమున వీర్యస్థలనముగావించెనేని. పదహారు ప్రాణాయామములు ప్రాయశ్చిత్తముగా జేయవలెను-14. పగలు వీర్యస్థలనముగావించిన బ్రాహ్మణునకు (యతికి) మూడు రాత్రులుపవాసమును, నూరు ప్రాణాయామములును ప్రాయశ్చిత్తముగావిధింపబడినవి-15. రాత్రియందు వీర్యస్థలనముగావించినవాడు స్నొనముజేసి శుచియై పన్నెండు ధారణలు (యోగముచే మనస్సు నాత్మయందు నిలుపుటలు) ప్రాయశ్చిత్తముగాజేయవలె. బ్రాహ్మణుడైన యతి ప్రాణాయామముతో శుద్ధాత్ముడును రజోగుణములేని శుద్ధసాత్త్యికుడగును-16. యతులు ఏకాన్నమును (కేవలాన్నమును) మధువును (మద్యమును), మాంసమును, ఆమశ్రాద్ధమునందలి భోజనమును, ప్రత్యేకముగానున్న లవణములను తినరాదు-17. నిషేధమునుదాటి ఒక్కొక్కదానిని భుజించినపుడు ప్రాయశ్చిత్తము విధింపబడినది. ప్రాజాపత్యవ్రతముచేతను కృచ్చవ్రతముచేతను ఆ పాపమునుండి విముక్తుడగును-18. నియమమునతిక్రమించి వాక్కు-మనస్సు- శరీరములతో చేసిన పాపములకు సజ్జనులైన విద్వాంసులతో గూడిన వారు నిర్ణయించి చెప్పిన ప్రాయశ్చిత్తమును జేసికొనవలెను-19. విశుద్ధబుద్దియై, మట్టి, బంగారములను సమముగా జూచువాడై, సర్వభూతములందు చరించు సమాధియందుండువాడు, శాశ్వతము, నాశములేని స్థిరమైన పరమైన స్థానమును బొంది పునర్జన్మరహితుడగును-20.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున యతిప్రాయశ్చిత్త విధియను పదునెనిమిదవ యధ్యాయము.