వాయు మహా పురాణము
55 - లింగోద్భవస్తవో
ఋషయ ఊచు:-
గుణకర్మ ప్రభావైశ్చకోఽధి కో వదతాం వరః ।
శ్రోతుమిచ్ఛామహే సమ్యగాశ్చర్యం గుణవిస్తరమ్॥
సూత ఉవాచ:-
అత్రాప్యుదాహరన్తీ మితిహాసం పురాతనమ్ ।
మహాదేవస్య మాహాత్మ్యం విభుత్వం చ మహాత్మనః॥
పూర్వం త్రైలోక్యవిజయే విష్ణునా సముదాహృతమ్ ।
బలిం బద్ధ్వామహౌజస్తు త్రైలోకాధిపతిః పురా॥
ప్రణష్ణేషు చ దైత్యేషు ప్రహృష్టే చ శచీపతౌ ।
అథాజగ్ముః ప్రభుం ద్రష్టుం సర్వదేవాః సవాసవాః ॥
యత్రా స్తే విశ్వరూపాత్మా క్షీరోదస్య సమీపతః ।
సిద్ధబ్రహ్మర్షయో యక్షగంధర్వాపురం గణాః ॥
నాగా దేవర్షయశ్చైవ సద్యః సర్వే చ పర్వతాః ।
అభిగమ్య మహాత్మానంస్తువన్తి పురుషం హరిమ్॥
త్వం ధాతా త్వం చ కర్తాస్య త్వం లోకాన్ సృజిసి ప్రభో ॥
త్వత్ప్రసాదాచ్చ కల్యాణం ప్రాప్తం త్రైలోక్యమవ్యయమ్ ।
అసురాశ్చజితాః సర్వే బలిర్బద్ధశ్చ వై త్వయా॥
ఏవముక్తః సురైర్విష్ణుః సిద్దైశ్చ పరమర్షిభిః ।
ప్రత్యువాచ తతో దేవాన్ సర్వాం స్తాన్పురుషోత్తమః॥
శ్రూయాతామభిధాస్యామి కారణం సురసత్తమాః ।
యః స్రష్టా సర్వభూతానాం కాలః కాలకరః ప్రభుః॥
యేన హి బ్రహ్మణా సార్థం సృష్టా లోకాశ్చ మాయయా ।
తస్యైవ చ ప్రసాదేన ఆదౌ సిద్ధత్వమాగతమ్॥
పురా తమసి చావ్యక్తే త్రైలోక్యే గ్రసితే మయా ।
ఉదరస్థేషు భూతేషు లోకేఽహం శయితస్తదా॥
సహస్రశీర్షా భూత్వా చ సహస్రాక్షః సహస్రపాత్ ।
శంఖచక్రగదాపాణిః శయితో విమతేఽ భసి॥
ఏతస్మిన్నంతరే మారాత్ పశ్యామి హ్యమితప్రభమ్ ।
శతసూర్యప్రతీకాశం జ్వలన్తం స్వేన తేజసా॥
చతుర్వక్త్రం మహాయోగం పురుషం కాంచనప్రభమ్ ।
కృష్ణాజినధరం దేవం కమండలు విభూషితమ్॥
నిమేషాన్తర మాత్రేణ ప్రాప్తోఽ సౌ పురుషోత్తమః ॥
ఋషులనిరీ:- గుణ-కర్మల ప్రభావముతో ఎవడధికుడు, వక్తలలో శ్రేష్ఠుడును,అగునో చక్కగా తెలియదలిచితిమి. ఆతని యాశ్చర్యకరమైన గుణవిస్తరమును గూడ దెలియదలచితిమి.
సూతడనెను:- ఈ విషయమునగూడ పెద్దలీపురాతనమైన యితిహాసమును మహాదేవుడైన శివునిమహాత్మ్యమును, ఆమహాత్మునియొక్క సర్వవ్యాపియైనశక్తిని జెప్పెదరు-2. పూర్వము త్రైలోక్యవిజయము తరువాత విష్ణువుచే నీ విషయము చెప్పబడినది. పూర్వము మహాతేజస్వియై త్రైలోక్యాధిపతియైన విష్ణువు బలిచక్రవర్తిని (పాతాళమున) బంధించేను-3. అపుడు దైత్యులు నశించి ఇంద్రుడు సంతసింపగా ఇంద్రునితోబాటు దేవతలందరును ప్రభువైన విష్ణువును జూడనేగిరి-4 విశ్వస్వరూపుడు విష్ణువు క్షీరసముద్ర సమీపమున నుండెను. సిద్ధులు, బ్రహ్మర్షులు, యక్షులు గంధర్వులు, అప్సరోగణములు 5, నాగులు, దేవరులును, నదులు, సమస్త పర్వతములును ఆమహాత్ముడును పురుషుడును నైన హరిని జేరి యీ విధముగ స్తుతింతురు-6. నీవు బ్రహ్మవు, నీవు కర్తవు, నీవు సత్యస్వరూపుడవు. ప్రభో! నీవు లోకములను సృజింతువు, నీయనుగ్రహముననే నాశములేని ముల్లోకముల కల్యాణము లభించినది. సమస్తరాక్షసులు జయింపబడిరి. నీ వామన మూర్తిచేతనే బలిచక్రవర్తి పాతాళమున బద్దుడయ్యెను-7. ఈరీతిగా దేవతలచేతను సిద్దులచేతను పరమఋషులచేతను స్తుతింపబడినవాడై పురుషోత్తముడైన విష్ణువు దేవతలందఱిని గూర్చి మారుపలికెను-8. దేవోత్తములారా! కారణమును జెప్పెదను వినుడు. ఆకారణ స్వరూపుడు సర్వభూతముల స్రష్ట. కాలస్వరూపుడు, కాలకారకుడు ప్రభువును-9. ఆతనిచేతనే బ్రహ్మతో గూడి మాయచేత లోకములు సృజింపబడినవి. ఆతని యనుగ్రహముననే మొదట సిద్దత్వము వచ్చినదీ-10. పూర్వము నేను వ్యక్తముగాని చీకటిలో ముల్లోకములను మ్రింగగా, భూతములన్నియు కడుపులో నిండినపుడు లోకమున నేను నిద్రించితిని. 11. వేల (అనంత) శిరములుగలవాడనై వేల(లేక్కలేని) కన్నులుగలవాడనై, వేలలెక్కలేని పాదములు గలవాడనై, శంఖ చక్ర-గదలు చేతులలోగలవాడనై విమలజలమున నిద్రించితిని-12. ఇంతలో దూరమున నూరు సూర్యులకాంతిగలిగి తనతేజముతో నిండుచున్న యొక యంతులేని కాంతిగల వానిని జూచితిని-13. ఆతడు నాలుగు ముఖములుగలవాడు మహాయోగము బూనినవాడు, పురుషుడు, బంగారువన్నెగలవాడు, కృష్ణ మృగచర్మమును ధరించినవాడు. కమండలువుచే (చేత) నలంకరింపబడినవాడు, దేవుడు ఆతనిని ఈ పురుషోత్తముడు ఒక కన్నురెప్పపాటు కాలములోనే పొందెను.
తతో మామబ్రవీద్బ్రహ్మా సర్వలోక నమస్కృతః ।
క స్త్యం కుతో వా కించేహ తిష్ఠసే వద మే విభో ॥
అహం కర్తాఽస్మి లోకానాం స్వయంభూర్విశ్వతో ముఖః ।
ఏవముక్తస్తదా తేన బ్రహ్మణఽరుమువాచ తమ్॥
అహం కర్తా చ లోకానాం సంహర్తా చ పునః పునః ।
ఏవం సంభాషణాభ్యాం పరస్పరజయైషిణామ్॥
ఉత్తరాం దిశమాస్థాయ జ్వాలాదృష్టాప్యధిష్ఠితా॥
జ్వాలాంతత స్తామాలోక్య విస్మితౌ చ తదాఽనయోః ।
తేజసా చైవ తేనాఽథ సర్వం జ్యోతిః కృతం జలమ్॥
వర్థమానే తదావహ్నావత్యంత పరమాద్భుతే ।
అతిదుద్రావతాం జ్వాలాం బ్రహ్మా చాహం చ సత్వరః ॥
దివం భూమిం చ విష్టభ్య తిష్ఠన్తం జ్వాలమండలమ్ ।
తస్య జ్వాలస్య మధ్యే తు పశ్యామో విపులప్రభమ్॥
ప్రాదేశమాత్రమవ్యక్తం లింగం పరమ దీపితమ్ ।
న చ తత్కాంచనం మధ్యే న శైలం న చ రాజతమ్॥
అనిర్ధెశ్య మచింత్యం చ లక్ష్యాలక్ష్యం పునః పునః ।
మహౌజసం మహాఘోరం వర్థమానం భృశం తథా॥
జ్వాలామాలాయ తం న్యస్తం సర్వభూత భయంకరమ్॥
అస్య లింగస్య యోఽన్తం వై గచ్ఛతే మంత్రకారణమ్ ।
ఘోరరూపిణ మత్యర్థం భిందన్తమీవరోదసీ॥
తతోమామబ్రవీద్బ్రహ్మా అధో గచ్ఛత్వతంద్రితః ।
అంతమస్య విజానీమో లింగస్య తు మహాత్మనః ॥
అహమూర్థ్యం గమిష్యామి యావదన్తోస్య దృశ్యతే ।
తదా తౌ సమయం కృత్వా గతావూర్థ్యమధశ్చ హ॥
తతో వర్షసహస్రం తు అహం పునరధో గతః ।
న చ పశ్యామి తస్యాన్తం భీతశ్చాహం న సంశయః॥
తథా బ్రహ్మా చ శ్రాంతశ్చ న చాంతం తస్య పశ్యతి ।
సమాగతో మయా సార్థం తత్రైవ చ మహాంభసి॥
తతో విస్మయమాపన్నావు భౌ తస్య మహాత్మనః ।
మాయయా మోహితౌ తేన నష్టసంజ్ఞౌ వ్యవస్థితౌ ॥
తతో ధ్యానగతం తత్ర ఈశ్వరం సర్వతో ముఖమ్ ।
ప్రభవం నిధనం చైవ లోకానాం ప్రభుమవ్యయమ్ ॥
బ్రహ్మాంజలిపుటో భూత్వా తస్మై శర్వాయ శూలినే ।
మహాభైరవనాదాయ భీమరూపాయ దంష్ట్రిణే॥
అవ్యక్తాయ మహాన్తాయ నమస్కారం ప్రకుర్మహే ॥
ఆ తరువాత సర్వలోకములచే నమస్కరింపబడిన బ్రహ్మ నాతో నీ విధముననెను. నీవెవ్వడవు? ఎక్కడినుండి వచ్చితివి? ఓ సర్వవ్యాప్తి యైనవాడా! ఇక్కడెందులకున్నావు-15. నేను లోకములకు కర్తనై యున్నాను. స్వయముగా బుట్టినవానిని. (అంతట) నలువైపుల ముఖములుగలవానిని:- ఈ రీతిగా బ్రహ్మచే నడుగబడిన నేను ఆతనితో నిట్లంటిని-16. నేను లోకములకు కర్తను ఆ లోకములను. మరల మరల సంహరించువాడను గూడ నేనే! ఈ విధముగ పరస్పర జయమును గోరిమాట్లాడుచున్నయా యిరువురికి ఉత్తరదిక్కుగా నిలిచి యొక జ్వాల కనబడినది. అది యధిష్ఠితమై కూడనున్నది-17. తరువాత నౌజ్వాలను జూచి వారిరువురాశ్చర్యము జెందిరి. ఆ జ్వాలచేతను ఈయిరువురి (బ్రహ్మవిష్ణువుల) తేజముచేతను జలమంతయు జ్యోతిర్మయముగ జేయబడినది-18. అప్పుడా పరమాశ్చర్యకరమైన యగ్ని (వృద్ధిజెందు) పెరుగుచుండగా నేనునేను బ్రహ్మయును ఆ జ్వాలనుండి మిక్కిలి పరుగెత్తితిమి-19. భూమ్యాకాశములను వ్యాపించియున్న జ్వాలల మండలమును జూచితిమి. ఆ జ్వాలయొక్క మధ్యన విశాలప్రభ గలదియు-20, ప్రాదేశమాత్రముగా (చూపుడు వేలును బొటనవ్రేలును జూచిన కొలతయంత)నున్నదియు, మిక్కిలి ప్రకాశించినదియునై యవ్యక్తమైన లింగమును జూచితిమి. ఆ మధ్యది బంగారుదిగాని, వెండిగాని కాదు-21. అది ఇట్టిది! అని చూపరానిది. ఇట్టిదియని ధ్యానింపరానిది, మాటిమాటికి కనబడి కనబడనది, మహాతేజముగలది, మహాభయంకరమైనది, అప్పుడు మిక్కిలి పెరుగుచున్నది, జ్వాలామాలలచే పొడవైనది, సర్వభూతములకు భయంకరముగా నుంచబడినది-22. మంత్రకారణమై, భయంకరరూపముగలదై భూమ్యాకాశములను భేదించుచున్నట్లున్న యీ లింగము యొక్క చివరకెవడుపోవును? తరువాత బ్రహ్మ “మీరు చురుకుగా క్రిందకు వెళ్లుడు ఈ మహాత్ముని లింగము యొక్క అంతమును దెలిసికొందుము-24. నేను ఈ లింగము యొక్కయంతము కనబడువరకు పైకివెళ్లేదను”అని నాతోననెను. అపుడు వారిరువురీ విధముగా నియమము నేర్పరచుకొని బ్రహ్మవిష్ణువులు ఊర్థాధస్సులకు వెళ్ళిరి-25. తరువాత వేయియేండ్లు ఆలింగముయొక్క యధోభాగమునకు వెళ్లితిని. కాని అంతుచిక్కలేదు. భయముజెందితిని సంశయములేదు-26. అట్లే బ్రహ్మయు యాలింగము యొక్క యంతమును జూడలేదు. అలసటజెందెను. చివరకు నాతో బాటు ఆమహాజలప్రదేశమునకు వచ్చెను-27. తరువాత నాశ్చర్యంజెంది యామహాత్ముని యొక్క (శివునియొక్క) మాయచే మోహితులై దానిచే మూర్చజెందియుండిరి-28. తరువాత నచట వారీశ్వరుని జూచిరి. ఆతడు ధ్యానగతుడై యుండెను. అన్ని వైపులముఖములు (పంచముఖములు) గలవాడైయుండెను. ఆతడు లోకముల జననమరణములకు కారకుడు, ప్రభువు అవ్యయుడు (నాశములేనివాడు). బ్రహ్మచేతులు జోడించి యీ విధముగా స్తుతించెను. శర్వునకు (ప్రళయమున భూతనాశకునకు) నమస్కారము- శూలికి, మహాభయంకర ధ్వని గలవానికి, భయంకరరూపునకు,కోరలు గలవానికి,అవ్యక్తునకు, మహత్తునకేయంతకుడైన వానికిని నమస్కారమును జేయుచున్నాము.
నమోఽస్తుతే లోకసురేశ దేవనమోఽస్తుతే భూతపతేమహాంశ్చ॥
నమోఽస్తుతే శాశ్వతసిద్ధయోనే నమోఽస్తు తే సర్వజగత్ప్రతిష్ఠ॥
పరమేష్ఠీ పరం బ్రహ్మ అక్షరం పరమం పదం ।
శ్రేష్ఠస్త్వం వామదేవశ్చ రుద్రః స్కందః శివః ప్రభుః॥
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారః పరం పదమ్ ।
స్వాహాకారో నమస్కారః సంస్కారః సర్వకర్మణామ్ ॥
స్వథా కారశ్చ జాప్యశ్చ వ్రతాని నియమాస్తథా ।
వేదా లోకాశ్చ దేవాశ్చ భగవానేవ సర్వశః॥
ఆకాశస్య చ శబ్దస్త్యం భూతానాం ప్రభవావ్యయమ్ ।
భూమేర్గంధోరసశ్చాపాం తేజోరూపం మహేశ్వర ॥
వాయోః స్పర్శశ్చ దేవశ్చ వపుశ్చంద్రమసస్తథా ।
బుధో జ్ఞానం చ దేవేశ ప్రకృతా బీజమేవ చ॥
త్వం కర్తా సర్వభూతానాం కాలో మృత్యు ర్యమోఽతకః ।
త్వం ధారయసి లోకాం స్త్రీం స్త్యమేవ సృజసి ప్రభో ॥
పూర్వేణ వదనే నత్వమింద్రత్వం చ ప్రకాశసే ।
దక్షిణేన చ వక్త్రేణ లోకాన్ సంక్షీయసే ప్రభో॥
పశ్చిమేన తు వక్త్రేణ వరుణత్వం కరోషి వై ।
ఉత్తరేణ తు వక్త్రేణ సౌమ్యత్వం చ వ్యవస్థితమ్॥
రాజసే బహుధా దేవ లోకానాం ప్రభవావ్యయః ।
ఆదిత్యా వసవో రుద్రా మరుతశాశ్వినీసుతౌ॥
సాధ్యావిద్యాధరా నాగాశ్చారణాశ్చ తపోధనాః ।
వాలఖిల్యమహాత్మాన స్తపః సిద్దాశ్చ సువ్రతాః॥
త్వత్తః ప్రసూతా దేవేశ యే చాన్యే నియతవ్రతాః ।
ఉమా సీతా సినీవాలీ కుహూర్గాయత్రి రేవ చ॥
లక్ష్మీః కీర్తిద్ర్ధృతిర్మేధా లజ్జా క్షాన్ తి ర్వపుస్తథా ।
తుష్టిః పుష్టిః క్రియా చైవ వాచాం దేవీ సరస్వతీ ॥
త్వత్తః ప్రసూతా దేవేశ సంధ్యారాత్రి స్తథైవచ॥
సూర్యాయుతా నామయుత ప్రభా చ నమోస్తుఽతే చంద్రసహస్రగోచర॥
నమోఽస్తుతే పర్వతరూపధారిణే నమోఽస్తుతే సర్వగుణాకరాయ॥
నమోఽస్తుతే పట్టిశ రూపధారిణే నమోస్తుఽతే చర్మవిభూతిధారిణే॥
నమోస్తుఽతే రుద్ర పినాకపాణయే నమోస్తుఽతే సాయకచక్రధారిణే ॥
నమోస్తుఽతేభస్మవిభూషితాంగ నమోస్తుఽతే కామశరీరనాశన॥
నమోస్తుఽతే దేవహిరణ్యవాససే నమోస్తుఽతే దేవహిరణ్యబాహవే॥
నమోస్తుఽతే దేవహిరణ్యరూప నమోస్తుఽతే దేవహిరణ్యనాభ॥
నమోస్తుఽతే నేత్రసహస్రచిత్ర నమోస్తుఽతే దేవహిరణ్యరేతః॥
నమోస్తుఽతే దేవహిరణ్య వర్ణ నమోస్తుఽతే దేవహిరణ్యగర్భ ॥
నమోస్తుఽతే దేవహిరణ్య చీర నమోస్తుఽ తే దేవహిరణ్య దాయినే॥
నమోస్తుఽతే దేవహిరణ్యమాలినే నమోస్తుఽతే దేవ హిరణ్యవాహినే ॥
నమోస్తుఽతే దేవహిరణ్యవర్త్మనే నమోస్తుఽతే భైరవనాదనాదినే॥
నమోస్తుఽతే భైరవ వేగవేగ నమోస్తుఽతే శంకర నీలకంఠ॥
నమోస్తుఽతే దివ్యసహస్రబాహో నమోస్తుఽతే నర్తనవాదన ప్రియ॥
లోకములకును దేవతలకును ఈశ్వరుడవైన యో దేవా! నీకు నమస్కారము. గొప్పవాడవై. భూతపతివైన నీకు నమస్కారము. శాశ్వతుడవును అష్టసిద్దులకు కారణుడవును నైన నీకు నమస్కారము. సమస్తజగత్తున ప్రతిష్టాకరుడవైన నీకు నమస్కారము పరమేష్ఠివి, పరబ్రహ్మవు, అక్షర స్వరూపుడవు, పరమపదస్వరూపుడవు, శివుడవు.ప్రభుడవు, యజ్ఞస్వరూపుడవు, వషట్కారస్వరూపుడవు, ఓంకారస్వరూపుడవు, ఉత్కృష్టపదస్వరూపుడవు, స్వాహాకారమవు, నమస్కారమవు సర్వకర్మల సంస్కారమవు, స్వధాకారుడవు, జాప్యుడవు (జపింపదగినవాడవు), వ్రతరూపుడవు, నియమరూపుడవు, వేదరూపుడవు, లోకస్వరూపుడవు, దేవరూపుడవు, అంతట భగవంతుడవు-34, ఆకాశభూతమునకు సూక్ష్మతన్మాత్ర రూపమైన శబ్ద స్వరూపుడవు. భూతములకు నాశములేని కారణస్వరూపుడవు, భూమికి గంధస్వరూపుడవు, జలమునకు రసస్వరూపుడవు, తేజస్సునకు రూపమవు, ఓ మహేశ్వరా-, వాయువునకు స్పర్శరూపుడవు. చంద్రునకు శరీరమవు, జ్ఞానివి, జ్ఞానస్వరూపుడవు, ఓ దేవేశ! ప్రకృతియందు బీజరూపుడవు-36. భూతములకు నీవు కర్తవు, కాలస్వరూపుడవు, మృత్యుస్వరూపుడవు, యముడవు, అంతకుడవు (నాశముజేయువాడవు) ఓ ప్రభూ! ముల్లోకములను నీవే సృజింతువు. నీవే భరింతువు. నీవు తూర్పువైపు ముఖముచే ఇంద్రత్వమును ప్రకాశింపజేయుదువు, దక్షిణముఖముతో ఓ ప్రభో! లోకములను క్షీణింపజేయుదువు-38, పశ్చిమ ముఖముతో వరుణత్వమును జేయుదువు. ఉత్తరముఖముతో సౌమ్యత్వము (ఉమాసహితత్వము) వ్యవస్థితమైనది . లోకములకు నాశములేని కారణుడవై యనేక విధముల బ్రకాశింతువు. ఆదిత్యులు వస్తువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినీదేవతలు, సాధ్యులు, విద్యాధరులు, నాగులు, చారణులు, తపోధనులు, మహాత్ములైన వాలఖిల్యులు, తపఃసిద్దులు, సువ్రతులు. తక్కిన నియతవ్రతులును ఓ దేవేశ నీనుండియే జనించిరి. ఉమయు, సీతయు (ఆకాశగంగయు), సినీవాలి (చంద్రకళతోగూడిన యమావాస్యము), కుహువు (చంద్రకళలేనియమావాస్యయు), గాయత్రియు. లక్ష్మియు, కీర్తి, ధృతి, మేధ, లజ్జ, క్షాస్త్రి (క్షమ), వసువు (శరీరము) తుష్టి, పుష్టి, క్రియ, వాగ్దేవియైన సరస్వతియును సంధ్యారాత్రులును వీరందరు నీనుండియే జనించిరి. పదివేల సూర్యులయొక్క పదివేలకాంతియు నీనుండియే పుట్టినది. వేలచంద్రులవలె గనబడువాడా! నీకు నమస్కారము. పర్వతరూపమును ధరించిన నీకు నమస్కారము, సర్వగుణములకు నెలవైన నీకు నమస్కారము. అడ్డకత్తి రూపమును ధరించిన నీకు నమస్కారము. గజచర్మమును విభూతిని ధరించిన నీకు నమస్కారము. ఓ రుద్రదేవా! పినాకధనువుచేతియందుగల నీకు నమస్కారము. బాణమును చక్రమును ధరించిన నీకు నమస్కారము-45 భస్మాలంకృత శరీరుడవైన నీకు నమస్కారము. కాముని దహించిన నీకు నమస్కారము. బంగారువస్త్రములధరించిన దేవా! నీకు నమస్కారము. తేజోవంతమైన బంగారు బాహువులుగలనీకు నమస్కారము. తేజోరూపుడవైనదేవా! నీకు నమస్కారము. బంగారము (తేజస్సు) నాభియందుగల దేవా! నీకు నమస్కారము. వేయికన్నులతో చిత్రముగానున్న నీకు నమస్కారము. అగ్ని స్వరూపుడవైన దేవా! నీకు నమస్కారము హిరణ్యవర్ణుడవైన దేవా! నీకు నమస్కారము. బ్రహ్మస్వరూపుడవైన దేవా నీకు నమస్కారము. బంగారు చీరవస్త్రములు ధరించిన దేవా నీకు నమస్కారము. బంగారమునిచ్చు దేవా నీకు సమస్కారము. బంగారు మాలలు ధరించినదేవా! నీకు నమస్కారము. హిరణ్యమును వహించు దేవా! నీకు నమస్కారము. బంగారు మార్గము (తేజో మార్గము) గలయో దేవా! నీకు నమస్కారము. భయంకరధ్వనిచే ధ్వనించునో దేవా! నీకు నమస్కారము. భయంకరమైనభైరవుని వేగమువంటి వేగముగల యోదేవా! నీకు నమస్కారము. ఓ శంకరా నీలకంఠా నీకు నమస్కారము. ఓ దివ్యమైన వేయి బాహువులు గలవాడా! నీకు నమస్కారము. నర్తనము వేణువీణావాదనమును ప్రియమైనవాడా! నీకు నమస్కారము.
ఏవం సంస్తూయమానస్తు వ్యక్తో భూత్వా మహామతిః ।
భాతి దేవో మహాయోగీ సూర్యకోటి సమప్రభః ॥
అభిభాష్యస్తదా హృష్టో మహాదేవో మహేశ్వరః ।
వక్త్రకోటి సహస్రేణ గ్రసమాన ఇవా పరమ్॥
ఏకగ్రీవస్త్వేకజటో నానాభూషణభూషితః ।
నానాచిత్ర విచిత్రాంగో నానామాల్యానులేపనః॥
పినాకపాణిర్బగవాన్ వృషభాసన శూలధృక్ ।
దండకృష్ణాజినధరః కపాలీ ఘోరరూపధృక్॥
వ్యాలయజ్ఞోపవీతీ చ సురాణామ భయంకరః।
దుందుభిస్వననిర్ఘోష పర్జన్యనినదోపమః ॥
తేన శబ్దేన మహతా వయం భీతా మహాత్మనః ।
తదోవాచ మహాయోగీ ప్రీతోఽహం సురసత్తమౌ ॥
పశ్యేతాం చ మహామాయాం భయం సర్వం ప్రముచ్యతామ్।
యువా చ సూతౌగాత్రేషు మమ పూర్వసనాతనౌ॥
అయం మే దక్షిణో బాహుః బ్రహ్మలోకపితామహః ।
వామోబాహుశ్చమే విష్ణు ర్నిత్యం యుద్ధేషు తిష్ఠతి॥
ప్రీతోఽహం యువయోః సమ్యగ్వరం దద్మి యథేప్సితమ్॥
తతః ప్రహృష్టమనసౌ ప్రణతా పాదయోః పునః ।
ఊచతుశ్చ మహాత్మానౌ పునరేవ తదానఘౌ॥
యది ప్రీతిః సముత్పన్నా యది దేయో వరశ్చ నౌ ।
భక్తిర్భవతు నౌ నిత్యం త్వయి దేవ సురేశ్వర ॥
ఈ విధముగా సంస్తుతింపబడుచున్న మహామతియైన శివుడు బయల్పడినవాడై మహాయోగియైన దేవుడై కోటి సూర్యకాంతులతో సమానమైన కాంతిగలవాడై ప్రకాశించెను. అపుడు మహాదేవుడైన మహేశ్వరుడు సంతుష్టుడై తన సహస్రకోటి ముఖములతో తక్కినవానిని మ్రింగుచున్నాడా యన్నట్లు మాటాడింపదగినవాడయ్యెను. ఒక కంఠము గలవాడు, ఒక జటగలవాడు, అనేకాలంకారములతో నలంకరింపబడినవాడు. అనేక చిత్రవిచిత్రమగు శరీరముగలవాడు, అనేక పుష్పమాలలు గంధాది లేపనములుగలవాడు, పినాకమనుధనువుచేతగలవాడు, భగవంతుడు (అశ్వర్యవంతుడు)శూలధారి,దండమును ష్ణమృగచర్మమును ధరించినవాడు, కపాలధారి, భయంకరరూపమును ధరించినవాడు, సర్పములు యజ్ఞోపవీతములుగాగలవాడు, దేవతలకభయమిచ్చువాడు. అపుడాతనిచే దుందుభియను వాద్యపు ధ్వనితోను, మేఘధ్వనితోను సమానమగు ఒక వికటాట్టహాసము (నవ్వు) నవ్వబడెను. ఆహాసధ్వనిచే ఆకాశమంతయు నిండిపోయెను ఆ మహాత్ముని మహాధ్వనితో మేము భయపడితిమి. అపుడా మహాయోగీ యిట్లు పలికెను. ఓ దేవతలలోని మహాశ్రేష్ఠులారా! నేను సంతసించితిని. మహామాయను జూడుడు, భయమంతయు వదలివేయుడు. నాశరీరభాగములలోనే పూర్వము సనాతనులైన మీరిరువురు పుట్టితిరి. ఈ లోక పితామహుడైన బ్రహ్మ నా కుడిభజము. నా యెడమ భుజము విష్ణువు. నిత్యము యుద్ధములందుండును. సంతసించిన నేను మీకు మీరు కోరిన మంచి వరమునిచ్చెదను. అంతబ్రహ్మ-విష్ణువుల సంతుష్టచిత్తులై మరల మహాదేవుని పాదములకు నమస్కరించి యామహాత్ములైన పుణ్యాత్ములు మరల బలికిరి. మీకు మా వలన సంతసము గలిగెనేని, మాకు వరమీయదగినదేని యోదేవేశ్వరా! దేవా నీయందు మాకెల్లప్పుడును భక్తియుండుగాక అనిరి.
భగవానువాచ:-
ఏవమస్తు మహాభాగౌ సృజతాం వివిధాః ప్రజాః ।
ఏవముక్త్యా సభగవాం స్తత్రైవాంతరధీయత॥
ఏవమేష మయోక్తో వః ప్రభావస్తస్య యోగినః ।
తేన సర్వమిదం సృష్ట హేతుమాత్రావయన్త్విహ॥
ఏతద్ధి రూపమజ్ఞాతమవ్యక్తం శివసంజ్ఞితమ్ ।
అచింత్యం తదదృశ్యం చ పశ్యన్తి జ్ఞానచక్షుషః ॥
తస్మైదేవాధిపత్యాయ నమస్కారం ప్రయుంక్త హ ।
యేన సూక్ష్మమచింత్యం చ పశ్యన్తి జ్ఞానచక్షుషః ॥
మహాదేవ నమస్తేస్తు మహేశ్వర నమోఽస్తుతే ।
సురాసురవరశ్రేష్ఠ మనోహంస నమోఽస్తుతే॥
సూత ఉవాచ:-
ఏతచ్ఛృత్వాగతాః సర్వే సురాః స్వం స్వం నివేశనమ్ ।
నమస్కారం ప్రయుంజానాః శంకరాయ మహాత్మనే॥
ఇమం స్తవం పఠేద్యస్తు ఈశ్వరస్య మహాత్మనః ।
కామాంశ్చ లభతే సర్వాన్ పాపేభ్యస్తు విముచ్యతే॥
ఏతత్సర్వం సదా తేన విష్ణునా ప్రభవిష్ణునా ।
మహాదేవ ప్రసాదేన ఉక్తం బ్రహ్మసనాతనమ్॥
ఏతత్సర్వం మయా ఖ్యాతం మయా మాహేశ్వరం బలమ్॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే లింగోద్భవస్తవో నామ పంచపంచాశోఽధ్యాయః॥
భగవంతుడనెను:- ఓ మహైశ్వర్యవంతులారా! బ్రహ్మవిష్ణువులారా. మీరు కోరినట్లే యగుగాక. ఇక అనేక విధములైన ప్రజలను సృష్టించుడు- ఇట్లని యాభగవంతుడచటనే యంతర్ధానమయ్యెను. ఇట్లు ఆయోగియైన శివుని ప్రభావము నాచే జెప్పబడినది. ఆ శివునిచేతనే ఈ జగమంతయు సృష్టింపబడినది. మేమిటనిమిత్తమాత్రులము. ఈ రూపము తెలియనిది, బయల్పడనిది, శివుడను పేరుగలది. చింతింప నలవికానిది, చూడనలవిగానిది, దీని జ్ఞాననేత్రులే చూడగలరు. ఆదేవాధిపత్యము గల శివునకు నమస్కారము జేసెదము. దాని వలన సూక్ష్ముడును అచింత్యుడనునైనశివుని జ్ఞాననేత్రులు చూతురు. ఓమహాదేవా! నీకు నమస్కారము. ఓ మహేశ్వరా! నీకు నమస్కారము. ఓ సురాసురవరులలో శ్రేష్టమైనవాడా! నీకు నమస్కారము.
సూతుడనెను:- ఇది విని దేవతలందరును మహాత్ముడైన శంకరునకు నమస్కారము జేయుచు తమ తమ స్థానముల కరిగిరి. మహాత్ముడైన యీశ్వరుని యీస్తుతిని పఠించినవాడు సమస్తములైన కోరికలను బొందును. పాపములనుండి విముక్తుడగును. ఇదియంతయు నిత్యము, సమర్థ ప్రభువైన విష్ణువుచే మహాదేవుని యనుగ్రహముచే జెప్పబడినది. ఇదియే సనాతనమైన బ్రహ్మము. ఇది యంతయు సూతుడనగు నాచేత జెప్పబడినది. ఇది మహేశ్వరుని బలము.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున లింగోద్భవస్తవమను నేబదియైదవ యధ్యాయము.