వాయు మహా పురాణము
60 - మహాస్థానతీర్థవర్ణనం
ఋషయ ఉవాచ: -
ఋషయస్తద్వచః శ్రుత్వా సూతమహుః సుదుస్తరమ్ ।
కథం వేదాః పురా వ్యస్తాః స్వన్నో బ్రూహి మహామతే ॥
సూత ఉవాచ:-
ద్వాపరే తు పరావృత్తే మనోః స్వాయంభువేఽన్తరే ।
బ్రహ్మా మనుమువాచేదం తద్వదిష్యే మహామతే ॥
పరివృత్తే యుగే తాత స్వల్పవీర్యా ద్విజాతయః ।
సంవృతా యుగదోషేణ సర్వే చైవ యథా క్రమమ్॥
భ్రశ్యమానం యుగవశాదల్పశిష్టం హి దృశ్యతే ।
దశసాహస్ర భాగే హ్యవశిష్టం కృతాదిదమ్॥
వీర్యం తేజోబలం వాక్యం సర్వం చైవ ప్రణశ్యతి ।
వేద వేదా హి కార్యాః స్యుర్మాభూద్వేద వినాశనమ్॥
వేదే నాశమనుప్రాస్తే యజ్ఞోనాశం గమిష్యతి ।
యజ్ఞే నష్టే దేవనాశ స్తతః సర్వం ప్రణశ్యతి॥
ఆద్యోదశ్చతుష్పాదః శతసాహస్ర సంజ్ఞితః ।
పునర్ధశగుణః కృత్నో యజ్ఞో వై సర్వకామధుక్ ॥
ఋషులనిరి:- దుస్తరమైనయా మాటను విని ఋషులు సూతునితో ననిరి. ఓ మహామతీ! పూర్వము వేదములెట్లు విశాలములై వ్యాకులత నొందినవి? దానిని మాకు జెప్పుము అని యడిగిరి, సూతుడనెను స్వాయంభువ మన్వంతరమున ద్వాపర యుగము జరిగిపోగా బ్రహ్మ మనువుతో నిట్లనెను. ఓ మహామతీ! దానిని జెప్పెదను. యుగము జరిగిపోగా, ఓయీ! యుగదోషము చే జుట్టబడినవాడై వరుసగా ద్విజాతు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరు స్వల్పవీర్యులగుదురు. యుగవశమున కృతయుగము నుండి నశించుచు పదివేల భాగమున నిది (కలి) మిగిలినదై యల్పశిష్టముగా గనబడును వీర్యము, తేజము, బలము, మాటయును సర్వమును నశించును. వేదముల నుండి వేదములు (అధ్యయనముతో) వచ్చునట్లుగా జేయవలయును. వేదవినాశనముగారాదు-5. వేదనాశము గలిగిన యజ్ఞము నాశమందును. యజ్ఞము నశిపంగా దేవతల నాశము, దానివలన సర్వనాశము సంభవింపగలదు. మొదట వేదము చతుష్పాదము లక్ష సంఖ్య గలది. మరల నది పదిరెట్లధికమైనది. మొత్తము యజ్ఞము సమస్త వాంఛలను దీర్చునది
ఏవముక్త స్తథేత్యుక్త్యామనుర్లోకహితే రతః ।
వేదమేకం చతుష్పాదం చతుర్థాప్యభవత్ప్రభుః॥
బ్రహ్మణో వచనాత్తాత లోకానాం హితకామ్యయా ।
తదిదం వర్తమానేన యుష్మాకం వేదకల్పనమ్॥
మన్వంతరేణ వక్ష్యామి వ్యతీతానాం ప్రకల్పనమ్।
ప్రత్యక్షేణ పరోక్షే వై సతన్ని బోధత సత్తమాః ॥
అస్మిన్ యుగే కృతో వ్యాసః పారాశర్యః పరంతపః ।
ద్వైపాయన ఇతిఖ్యాతో విష్ణోరంశః ప్రకీర్తితః ॥
బ్రహ్మణా చోదితః సోఽ స్మిన్ వేదం వస్తుం ప్రచక్రమే।
అథ శిష్యాన్ సజగ్రాహ చతురో వేదకారణాత్ ॥
జైమినిం చ సుమంతుం చ వైశంపాయనమేవ చ ।
పైలం తేషాం చతుర్థం తు పంచమం లోమహర్షణమ్॥
ఋగ్వేద శ్రావకం పైలంఽ జగ్రాహ విధివద్విజమ్ ।
యజుర్వేద ప్రవక్తారం వైశంపాయనమేవ చ ॥
జైమినిం సామవేదార్థ శ్రావకం సోఽన్వపద్యత ।
తథైవాధర్వ వేదస్య సుమంతుమృషి సత్తమమ్॥
ఇతిహాస పురాణస్య వక్తారం సమ్యగేవహి ।
మాం చైవ ప్రతి జగ్రాహ భగవానీశ్వరః ప్రభుః॥
ఏక ఆసీద్యజుర్వేదస్తంచతుర్ధా వ్యకల్పయత్ ।
చతుర్హోత్రమ భూత్తస్మింమన యజ్ఞమకల్పయత్॥
అధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిర్హోత్రం తధైవ చ ।
ఉద్గాత్రం సామభిశ్చక్రే బ్రహ్మత్వం చాప్యథర్వభిః ।
బ్రహ్మత్వమకరోద్యజ్ఞే వేదేనాథర్వణేనతు॥
తతః స ఋచముద్ధత్వ ఋగ్వేదం సమకల్పయత్ ।
హోతృకం కల్ప్యతే తేన యజ్ఞవాహం జగద్ధితమ్ ॥
సామభిః సామవేదం చ తేనోద్గాత్రమరోచయత్ ।
రాజ్ఞస్తధర్వవేదేన సర్వకర్మాణ్యకారయత్॥
ఆఖ్యానైశ్చాప్యు పాఖ్యానైర్గాధాబిః కులకర్మభిః పురాణసంహితాశ్చక్రే పురాణార్థవిశారదః
యచ్ఛిష్టం తు యజుర్వేదే తేన యజ్ఞమధాయుజత్ ।
యుంజానః స యజుర్వేదే ఇతిశాస్త్ర వినిశ్చయః
లోకహితమునందాసక్తి గల మను ప్రభువీ విధముగా నడుగబడి, యట్లే చెప్పెదనని నాలుగు పాదములు గల యొకే వేదమును నాలుగు విధములుగా విభజించెను-8. ఓయీ! బ్రహ్మయాజ్ఞవలన లోకహితమును గోరి ప్రస్తుతకాలముతో మీకు వేదకల్పనము జెప్పెదను. ఓ సత్తములారా! (ఓ మిక్కిలి జ్ఞానులారా) ప్రత్యక్షముగగాని పరోక్షముగాని దాని వినుడు 9,10. ఈ యుగమున పరమ తపస్వియైన పరాశర పుత్రుడు వ్యాసుడుగా జేయబడినవాడు. అతడు ద్వైపాయనుడని ప్రసిద్ధిజెందినవాడు. విష్ణువు యొక్కయంశమని చెప్పబడినాడు-11. బ్రహ్మచే ప్రేరేపింపబడినవాడై యాతడీయుగమున వేదమును విభజించటకు బూనుకొనెను. తరువాత నాతడు వేదకారణమున నలుగురును శిష్యులను గ్రహించెను–12. వారు జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు నాల్గవాడు పైలుడు, ఐదవవాడు లోమహర్షణుడును-13. ఋగ్వేద శ్రావకునిగా ద్విజుడైన పైలుని స్వీకరించెను. యజుర్వేద ప్రవక్తగా వైశంపాయనుని స్వీకరించెను-14. సామవేదార్థ శ్రావకునిగా జైమినిని స్వీకరించెను. అట్లే యథర్వవేద శ్రావకునిగా ఋషిసత్తముడైన సుమంతుని స్వీకరించెను-15. భగవంతుడై యీశ్వరుడైన ప్రభువైన యా పారాశర్య వ్యాసుడు ఇతిహాస పురాణములకు చక్కని వక్తనుగా నన్ను (సూతుని) స్వీకరించేను-16. యజుర్వేదమొక్కటే నుండును. దానిని (వ్యాసుడు) నాలుగు విధములుగా విభజించెను. దానియందు చతుర్దోత్రము పుట్టెను. దానితో యజ్ఞమును కల్పించేను- 17. యజుస్సులతో ఆధ్వర్యమును, ఋక్కులతో హోత్రమును, సామములతో ఉద్గాత్రమును, అధర్వములతో బ్రహ్మత్వమును జేసెను. యజ్ఞమున నధర్వణ వేదముతో బ్రహ్మత్వమునుజేసెను-18. దాని నుండి ఋక్కునుద్ధరించి ఋగ్వేదమును కల్పించెను. దానిచేత యజ్ఞవాహమై జగద్దితమైన హోతృకము కల్పింపబడును-19. సామములతో సామవేదమును, దానితో నుద్దాత్రమును ప్రకాశింప జేసెను. అధర్వణవేదముతో రాజుయొక్క యన్ని కార్యములను జేయించెను-20. పురాణార్థ విశారదు(పండితు)డు ఆఖ్యానములతోను. ఉపాఖ్యానములతోను, గాథలచేతను, కులకర్మలచేతను పురాణ సంహితలను జేసెను-21. యజుర్వేదమున మిగిలినదానితో యజ్ఞమును గూర్చెను. ఆ విధముగా యజుర్వేదమున యజ్ఞమును గూర్చుచున్నవాడయ్యెనని శాస్త్ర నిర్ణయము.
పదానమద్దృతత్వాచ్ఛ యజూంషి విషమాణి వై ।
స తేనోద్ధృతవీర్యస్తు ఋత్విగిర్వేదపారగైః ॥
ప్రయుజ్యతే హ్యశ్వమేధస్తేన వా యుజ్యతే తు తం॥
ఋచోగృహీత్వా పైలస్తు వ్యభజత్తద్ధ్విధా పునః ।
ద్విష్కృత్వా సంయుగే చైవ శిష్యాభ్యామదదత్ప్రభుః ॥
ఇంద్ర ప్రమతయే చైకాం ద్వితీయాం భాష్కలాయచ ।
చతస్రః సంహితాః కృత్వా బాష్కలిద్ద్విజ సత్తమః ।
శిష్యానధ్యాపయా మాస శశ్రూషాభిరతాన్ హితాన్ ॥
బోధం తు ప్రధమాం శాఖాం ద్వితీయామగ్ని మాఠరమ్ ।
పారాశరం తృతీయాం తు యాజ్ఞవల్క్య మథాపరామ్ ॥
ఇంద్రప్రమతిరేకాం తు సంహితాం ద్విజసత్తమః।
అధ్యాపయన్మహాభాగం మార్కండేయం యశస్వినమ్॥
సత్యశ్రవసమగ్య్రం తు పుత్రం స తు మహాయశాః ।
సత్యశ్రవాః సత్యహితం పునరధ్యాపయద్విజః ॥
సోఽపి సత్యతరం పుత్రం పునరధ్యాపయద్విభుః ।
సత్యశ్రియం మహాత్మానం సత్యధర్మ పరాయణమ్॥
అభవం స్తస్య శిష్యా వై త్రయస్తు సమహౌజసః ।
సత్యశ్రియస్తు విద్వాంసః శాస్త్రగ్రహణతత్పరాః ॥
శాకల్యః ప్రథమ స్తేషాం తస్మాదన్యో రథంతరః ।
బాష్కలిశ్చ భరద్వాజ ఇతి శాఖాప్రవర్తకా॥
దేవమిత్రస్తు శాకల్యో జ్ఞానాహంకారగర్వితః ।
జనకస్య సయజ్ఞేవై వినాశమగమద్ద్విజః ॥
పదములెత్తి తీసికొనుట వలన యజుస్సులు విషయములు ఆ కారణముచేత వేదసారమును దెలిసిన ఋత్విక్కులచేత నాతడు ఉద్దృత వీర్యుడయ్యెను. ఆతని చేత అశ్వమేధయాగము ప్రయోగింపబడెను. దానిచే నాతడు యోగ్యుడయ్యెను-23. పైలుడు ఋక్కులను గ్రహించి మరల వానిని రెండు విధములుగ విభజించెను. ఆ ప్రభువైన పైలుడు ఆ విధముగా రెండుగాజేసి సంయుగమున (పోరున) ఇద్దరు శిష్యులకిచ్చెను-24. ఒకదానిని ఇంద్రప్రమతికాని, రెండవ దానిని బాష్కలునకునునిచ్చేను. బ్రాహ్మణ విద్వాంస శ్రేష్ఠుడైన బాష్కలి (ఋగ్వేదమును) నాలుగు సంహితలుగా జేసి వానిని సేవాపరాయణులైహితులూ ఐన శిష్యులకు నేర్పించేను-25. బోధుని ప్రథమ శాఖను, అగ్నిమాఠరుని ద్వితీయ శాఖను, పారాశరుని తృతీయ శాఖను, యాజ్ఞవల్క్యుని నాలుగవ శాఖను జదీవించెను-26. బ్రాహ్మణ పండితోత్తముడైన యింద్ర ప్రమతీ మహాభాగ్యుడై కీర్తిమంతుడైన మార్కండేయుని నొక సంహితను జదివించెను-27. మహాయశస్వియైన యింద్రప్రమతి తన జ్యేష్ఠపుత్రుడైన సత్యశ్రవసుని జదివించెను. ద్విజుడైన సత్యశ్రవసుడు మరల సత్యహితుని జదివించెను-28. విభువైన సత్యహితుడు తన పుత్రుడైన సత్యతరుని జదివించెను. ఈ సత్యతరుడు సత్యశ్రీగలవాడు, మహాత్ముడు సత్యధర్మ పరాయణుడును-29. ఆ సత్యతరునకు మహాతేజస్వులైన ముగ్గురు శిష్యులు గలరు. వారు సత్యమైన సిరిగలవారు, విద్వాంసులు, శాస్త్ర గ్రహణమున తత్పరులును-30. వారిలో శాకల్యుడు మొదటివాడు. మరొకడు రథంతరుడు, తరువాతివాడు బాష్కలి. ఆ తరువాతివాడు భరద్వాజులు అను వీరు శాఖాప్రవర్తకులు-31. దేవమిత్రుడైన శాకల్యుడు జ్ఞానాహంకారముచే గర్వితుడు. ఆ బ్రాహ్మణుడు జనకుని యజ్ఞమున వినాశమును బొందెను.
శాంశపాయన ఉవాచ:-
కథం వినాశమగమత్సమునిర్ఞానగర్వితః।
జనకస్యాశ్వమేధేన కథం వాదో బభూవ హ ॥
కిమర్థం చాభవద్వాదః కేన సార్థమథాపితా ।
సర్వేమేతద్యథావృత్తమాచక్ష్య విదితం తవ॥
ఋషీణాం తు వచః శ్రుత్వా తదుత్తరమథాఽక బ్రవీత్॥
శాంశపాయనుడనెను:- జ్ఞానగర్వితుడైన యా ముని యెట్లు వినాశమందెను? జనకుని యొక్క యశ్వమేధముతో వాదమెట్లు జరిగెను?-33. వాదమెందులకు జరిగెను? ఎవరితో జరిగెను? ఇదియంతయు ఉన్న యువుట్లు నీకు దెలిసినది. పూర్తిగా జెప్పుము. ఋషుల యీ మాటను వినిన తరువాత దానికి సమాధానము సూతుడు చెప్పెను.
సూత ఉవాచ:-
జనకాశ్వమేధే తు మహానాసీత్సమాగమః ।
ఋషీణాం తు సహస్రాణి తత్రాజగ్మురనేకశః॥
రాజర్షేర్జనకస్యాథ తం యజ్ఞం హి దిదృక్షవః ॥
అగతాన్ బ్రాహ్మణాన్ దృష్ట్యా జిజ్ఞాసాస్యాభవత్తతః।
కొన్వేషాం బ్రహ్మణః శ్రేష్ఠః కథం మే నిశ్చయో భవేత్ ।
ఇతి నిశ్చిత్య మనసా బుద్ధిం చక్రే జనాధిపః॥
గవాం సహస్రమాదాయ సువర్ణమధికం తతః ।
గ్రామాన్ రత్నాని దాసాంశ్చ మునీన్ ప్రాహ నరాధిపః॥
సర్వానహం ప్రపన్నోఽ స్మి శిరసాశ్రేష్ఠభాగినః॥
యదేతదాహృతం విత్తం యో వః శ్రేష్ఠతమో భవేత్।
తస్మై తపనీతం దుహి విద్యావిత్తం ద్విజోత్తమాః॥
జనకస్య వచః శ్రుత్వా మునయస్తే శ్రుతిక్షమాః ।
దృష్ట్యా ధనం మహాసారం ధనవృద్ధ్యాజఘృక్షవః ।
శ్రద్ధయాంచక్రురన్యోన్యం వేదజ్జానమదోల్పణాః ॥
మనసాగతత్తాస్తే మమేదం ధనమిత్యుత ।
మమైవేతన్నవేత్యన్యో బ్రూహి కిం వా వికల్ప్యతే ॥
ఇత్యేవం ధనదోషేణ వాదాంశ్చ క్రురనేకశః ।
తధాన్యస్తత్ర వై విద్వాన్ బ్రహ్మవాహసుతః కవిః ।
యాజ్ఞవల్క్యో మహాతేజాస్తపస్వీ బ్రహ్మవిత్తమః ॥
బ్రహ్మణోఽ గాత్స ముత్పన్నో వాక్యం ప్రోవాచ సుస్వరమ్ ।
శిష్యం బ్రహ్మవిదాం శ్రేష్ఠో ధనమేతద్గృహాణ భో॥
నయస్వ చ గృహం వత్స మమైతన్నాత్ర సంశయః ।
సర్వదేవేష్వహం వక్తా నాన్యః కశ్చిత్తుమత్సమః ।
యో వా న ప్రీయతే విప్రః సమేహ్వయతు మాచిరమ్ ॥
తతో బ్రహ్మార్ణవః క్షుణ్ణః సముద్రవ సంప్లవే ।
తానువాచ తతః స్వస్థో యాజ్ఞవల్క్యో హసన్నివ॥
క్రోధం మాకార్షుర్విద్వాంసో భవంతః సత్యవాదినః ।
వదామహే యథాయుక్త జిజ్ఞాసంతః పరస్పరమ్ ॥
తతోఽభ్యుపాగమంస్తేషాం వాదా జుగ్మురనేకశః ।
సహస్రధా శుభైరర్దై సూక్ష్మదర్శన సంభవైః ॥
లోకే వేదే తథాఽధ్యాత్మ విద్యాస్థానైరలం కృతాః ।
శాపోత్తమగుణైర్యుక్తా నృపౌఘపరివర్జనాః ॥
ఋషయస్త్యేకతః సర్వే యాజ్ఞవల్క్య స్తథైకతః ।
సర్వే తే మునముయస్తేన యాజ్ఞవల్క్యేన ధీమతా ।
ఏకైకశస్తతః పృష్టా నైవోత్తరమథాఽ బ్రువన్ ॥
తాన్విజితమునీన్ సర్వాన్ బ్రహ్మరాశిర్మహాద్యుతిః ।
శాకల్యమితిహోవాచ వాదకర్తారమంజసా ॥
శాకల్య వద వక్తవ్యం కిం ధ్యాయన్నవతిష్ఠసే ।
పూర్ణస్త్వం జడమానేన వాతాధ్మాతో యధాధృతిః ॥
ఏవం సపర్షిత స్తేన రోషాత్తామాస్యలోచనః ।
ప్రోవాచ యాజ్ఞవల్క్యం తం పురుషం మునిసన్నిధౌ ॥
త్వమస్మాంస్తృణవత్త్యక్త్వా తథైవేమాన్ ద్విజోత్తమాన్ ।
విద్యాధనం మహాసారం స్వయం గ్రాహం జఘృక్షసి ॥
శాకల్యేనైవముక్తః స్యాద్యాజ్ఞవల్క్యః సమబ్రవీత్ ।
బ్రహ్మిష్ఠానాం బలం విద్ధి విద్యాతత్త్వార్థ దర్శనమ్॥
కామశ్చార్థేన సంబద్ధస్తేనార్థం కామయామహే ।
కామప్రశ్నాధనా విప్రాః కామప్రశ్నాశ్వదామహే॥
పణశ్చైషోఽస్యరాజర్షేస్తస్మాన్నతం ధనం మయా ।
ఏతచ్ఛృత్వా వచస్తస్య శాకల్యః క్రోధమూర్ఛితః।
యాజ్ఞవల్క్య మథోవాచ కామప్రశ్నార్థమద్వచః ॥
బ్రూహీదానీం మయోద్ధిష్టాన్ కామప్రశ్నాన్యథార్థతః ।
తతః సమభవద్వాదస్తస్య యో ర్బ్రహ్మవిదో ర్మహాన్॥
సాగ్రం ప్రశసహస్రం తు శాకల్యస్తమచూచురత్ ।
యాజ్ఞవల్క్యోఽ బ్రవీత్సర్వాన్ ఋషీణాం శృణ్వతాం తదా॥
శాకల్యేఽపి నిర్వాదే యాజ్ఞవల్క్య స్తమబ్రవీత్ ।
ప్రశ్నమేతం మమాపి త్వం వద శాకల్యకామికమ్ ॥
శాపః పణోఽస్య మదస్య అబ్రువన్ మృత్యుమా వ్రజేత్॥
అథ సన్నోదితం ప్రశ్నం యాజ్ఞవల్క్యేన ధీమతా ।
శాకల్యస్తమవిజ్ఞాయ సద్యోమృత్యు మవాప్నుయాత్॥
ఏవం మృతః సశాకల్యః ప్రశ్న వ్యాఖ్యానపీడితః ।
ఏవం వాదశ్చ సుమహాన్ నాసీత్తేషాంధనార్థిభిః ॥
ఋషీణాం మునిభిః సార్థం యాజ్ఞవల్క్యస్య చైవ హి ॥
సర్యైః పృష్టాంస్తు సంప్రశ్నాన్ శతశోఽథ సహస్రశః।
వ్యాఖ్యాయ వై మునే తేషాం ప్రశ్నసారం మహాశ్నగతిః॥
యాజ్ఞవల్కో ధనం గృహ్యయశో విఖ్యాప్య చాత్మనః ।
జగామ వై గృహం స్వస్థః శిష్యైః పరివృతో వశి॥
జనకుని యొక్కయు యశ్వమేధ యాగమున గొప్ప పండిత సమావేశము జరిగెను. అచట అనేక విధములుగా వేలకొలది ఋషులు రాజర్షియైన జనకుని యజ్ఞమును జూడగోరి వచ్చిరి-35. వీరిలో బ్రాహ్మణ శ్రేష్టుడెవడు? ఈ విషయమున నిశ్చయము గలుగును? అని యనుకొని జనక మహారాజు మనసుతో నాలోచించెను-36. తరువాత వేయి గోవులను అధికమైన బంగారమును రత్నములను దాసులను గ్రామములను (వాని దాన పత్రములను) దెప్పించి యా మునులను గూర్చి జనకుడు పలికెను. ఓ బ్రాహ్మణోత్తములారా! సభలో శ్రేష్ఠభాగులైన మీయందరికిని శిరస్సుతో బ్రణమిల్లుచున్నాను మీలో మిక్కిలి శ్రేష్ఠుడైన వానికై యీ ధనమంతయు విద్యాధనముగా దీసికొనబడినది. అని యనెను-38 ఆ వేదారులైన మునులు జనకుని మాటను విని, మహాసారమైన ధనమును జూచి, ధనాతిశయ కారణమున దానిని బొందదలచినవారై వేదజ్జానమదముచే పొంగినవారై పరస్పరముగా నా ధనమునకై శ్రద్ధ వహించిరి-39. మనస్సుతో సాధనమును బొందినవారై ఈ ధనము నాదియనియు, మరొకడు ఈ ధనము నాదేయేనా కాదా? యనియు ఎందులకు సంశయింపబడుచున్నదో చెప్పుము. (నాదేయనుట నిశ్చయము) అనియు ధనదోషముతో అనేక విధములుగా వాదములు జేసిరి-40. అట్లే యచట విద్వాంసుడు, బ్రహ్మవాహుని (వేదముల బూర్తిగా జదివినవాని) పుత్రుడును, కవియు మహాతేజస్వియై బ్రహ్మవేత్తలలో నత్యుత్తముడైన బ్రహ్మయొక్క యంగమునుండి బుట్టి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్యుడు శిష్యునితో సుస్వరముగా నిట్లు పలికెను. ఓయి ఈ ధనమంతయు దీసికొని వెళ్ళుము. ఓ వత్సా! యింటికి దీసికొనివెళ్ళుము. ఈ ధనము నాదియే సంశయము లేదు. అన్ని వేదములలో నేను వక్తను. నాతో సముడు మరొకడెవ్వడు లేడు. దీనికిష్టపడని బ్రాహ్మణుడు వెంటనే యాలసింపక నన్ను వాదమునకు బిలుచుగాక. (అనియనెను)-41,42,43. అంత బ్రహ్మసముద్రము బ్రాహ్మణ మునులను సముద్రము) మహా ప్రళయములో వలె నల్లకల్లోలమయ్యెను. యాజ్ఞవల్క్యుడు నవ్వుచున్నవాని వలె నా మునులతో నిట్లనెను-44. ఓ విద్వాంసులారా! కోపింపకుడు. మీరు సత్యవాదులు. యుక్తాయుక్తమును దెలుసుకొనదలచుచున్నవారమై పరస్పరము వాదించుకొందము-45. అంతవారెదురకు జేరిరి. సూక్ష్మధర్శనము వలన గలిగిన శుభార్థములతో వారి వాదములు అనేక విధముల నడచినవి-46. లోకమునను వేదమునను, ఆధ్యాత్మమునను విద్యాస్థానములతో నలంకరింపబడినవియు, శపింపగల ఉత్తమ గుణములతో గూడినవియు, రాజసమూహములకు దూరమై నవియునైన యామహాత్ముల వాదములు ధనకారణముగా నచట జరిగినవి-47. ఋషులందఱు నొకవైపును యాజువల్క్యుడొక వైపునునైరి. ధీశాలియైన యాజ్ఞవల్క్యుడు ఆ మునులందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న నడిగెను. వారు వానికి సమాధానమును జెప్పలేకపోయిరి-48. ఆ విధముగ మునులనందరిని జయించి బ్రహ్మరాశియు (జ్ఞానరాశియు) మహాతేజస్వియైన యాజ్ఞవల్క్యుడు వెంటనే వాదము జేయనున్న శాకల్యునిట్లునెను-49. ఓ శాకల్య! చెప్పదలచిన దానిని చెప్పుము. చింతించువానివలె నెందులకూరకున్నావు? గాలియూదిన తిత్తివలె స్తబ్దమైన యభిమానముతో నిండినవాడవు-50. ఈ విధముగ యాజ్ఞవల్క్యునితో తిరస్కరింపబడినవాడైన శాకల్యుడు కోపమువలన నెట్టని మోము కన్నులు గలవాడై మునుల సన్నిధిలో పురుషుడైన యా యాజ్ఞవల్కునితో నిట్లనెను-51. ఓ యాజ్ఞవల్క్య నీవు మమ్ములను గడ్డిపోచగా వదిలి యీ మునులను గూడ నట్లే వదిలి మహాసారమైన విద్యాధనమును నీయంతటనీవే గ్రహింపదలచితివి-52. శాకల్యునిచే నీ విధముగ జెప్పబడిన యాజ్ఞవల్క్యుడు చక్కగానిట్లు చెప్పెను. బ్రహ్మిష్ణు (జ్ఞాననిష్ణు)ల యొక్క బలము విద్యయొక్క తత్యార్థ దర్శనము అని తెలియుము-53. కామమర్థముతో సంబద్ధమైనది. కావున అర్థమును (ధనమును) కోరుకొనుచున్నాము. కామ ప్రశ్నయే ధనముగా గలవారు బ్రాహ్మణులు కావున కామ ప్రశ్నలనే చెప్పుచున్నాము-54. ఈ రాజర్షి యొక్క పందెముకూడ నిదియే. కావున నేనాచేధనము గొంపోబడినది. యాజ్ఞవల్క్యుని యీ మాటను విని కోపముతో గప్పబడినవాడై తరువాత,యాజ్ఞవల్క్యునితో కామ ప్రశ్నార్థముగల వాక్కుల బలికేను-55. ఇపుడు నాచే నుద్దేశింపబడిన కామప్రశ్నలను యథార్థముగా జెప్పుము అని తరువాత బ్రహ్మవేత్తలైన వారిరువురికి గొప్పవాదము జరిగెను-56. శాకల్యుడు యాజ్ఞవల్క్యుని తీక్షమైన వేయి ప్రశ్నలనడిగెను. అపుడు ఋషులు వినుచుండగా నన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పెను-57. శాకల్యుడు వాద ప్రశ్నలు లేనివాడు గాగా యాజ్ఞవల్క్యుడాతనిని ఓ శాకల్యా నీవు నాయొక్క కామికమైన ప్రశ్నకు సమాధానము జెప్పుమనెను. ఈ వాదమునకు పందెము ప్రశ్నకు సమాధానము జేప్పనివాడు మరణము నొందవలెను-58. తరువాత ధీశాలియైన యాజ్ఞవల్క్యునిచే ప్రశ్న యడుగబడినది. శాకల్యుడు దానికి సమాధానము దెలియక వెంటనే మరణమునొందెను-59. ఈ విధముగ ప్రశ్న వ్యాఖ్యానముచే పీడింపబడినవాడై శాకల్యుడు మరణించెను. ఈవిధముగ ఋషులకును యాజ్ఞవల్క్యునకు ధనార్డులైన మునులతో గొప్పవాదము జరిగెను. ఓ మునీ! అందరిచేత నడుగబడిన నూర్లకొలది వేలకొలది ప్రశ్నలను వ్యాసారమును మహాజ్ఞానియు ఇంద్రియాదులను వశమందుంచుకొన్నవాడునైన యాజ్ఞవల్క్యుడు వ్యాఖ్యానించి, ధనమును దీసికొని, కీర్తిని వ్యాపింపజేసి స్వస్థుడై శిష్యునితో జుట్టబడి (కూడుకొని) గృహమునకు వెళ్ళెను.
దేవమిత్రస్తు శాకల్యో మహాత్మా ద్విజసత్తమః ।
చకార సంహితాః పంచ బుద్ధిమాన్ పదవిత్తమః॥
తచ్ఛిష్యా అభవన్ పంచముద్గలో గోలకస్తథా ।
ఖాతీయశ్చ తథామత్స్యః శైశిరేయస్తు పంచమః ॥
ప్రోవాచ సంహితా స్తిసః శాకపూర్ణరథీ తరః ।
నిరుక్తశ్చ పునశ్చక్రే చతుర్థం ద్విజసత్త మః ॥
తస్య శిష్యాస్తు చత్వారః కేతవోదాలకి స్తథా ।
ధర్మశర్మా దేవశర్మా సర్వేవ్రతధరా ద్విజాః ॥
శాకల్యే తు మృతే సర్వే బ్రహ్మఘ్నాస్తే బభూవిరే ।
తదా చింతాం పరాం ప్రాప్యఽగతాస్తే బ్రహ్మణోంతికమ్॥
తాన్ జ్ఞాత్వా చేతసాం బ్రహ్మా ప్రేషితాః పవనే పురే ।
తత్ర గచ్ఛత యూయం వః సద్యః పాపం ప్రణశ్యతి॥
ద్వాదశార్కం నమస్కృత్య తథైవై వాలుకేశ్వరమ్ ।
ఏకాదశతథారుద్రాన్ వాయుపుత్రం విశేషతః
కుండే చతుష్టయే స్నాత్వా బ్రహ్మహత్యాం తరిష్యథ॥
సర్వే శీఘ్రతరా భూత్వా తత్పురం సముపాగతాః ।
స్నానం కృతం విధానేన దేవానాం దర్శనం కృతమ్॥
ఉత్తరేశ్వరం నమస్కృత్య వాడవానాం ప్రసాదతః ।
సర్వే పాపవినిర్ముక్తా గతాస్తే సూర్యమండలమ్॥
తదా ప్రభృతి తత్తీర్థం జాతం పాతకనాశనమ్।
వాయోః పురం పవిత్రం చ వాయునా నిర్మితం పురా॥
అంజనాగర్భ సంభూత హనుమాన్ సత్యవిక్రమః ।
తదేవం నిర్మితం తీర్థం వాయునా బ్రహ్మయోనినా॥
ఊర్వ్యాం జాతస్తు యే శూద్రి బ్రాహ్మణానాం నివేదితాః ।
వృత్త్యర్థం బ్రహ్మయజ్ఞార్థం కరస్తేషు కృతో మహాన్॥
అనేన విధినా జాతః విప్రాణాం శాసనం మహత్ ।
గోఘ్నోవాపి కృతఘ్నో వాసురాపీ గురుతల్ప గః॥
వాడాదిత్యం నమస్కృత్య సర్వపాపైః ప్రముచ్యతే॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే మహాస్థాన తీర్థవర్ణనం నామ
షష్టితమోఽధ్యాయః ॥
దేవమిత్రుడైన శాకల్యుడు మహాత్ముడు బ్రాహ్మణ పండితోత్తముడు పదవేత్తలలో నుత్తముడైన యా బుద్ధిమంతుడు, ఐదు సంహితలను జేసెను. ఆతని కైదుగురు శిష్యులుండిరి. ముద్గలుడు, గోలకుడు, ఖాతీయుడు, మత్యుడు ఐదవవాడు శైశిరేయుడును-64, శాకపూర్ణ రథోతరుడు మూడు సంహితల ను జెప్పెను. బ్రాహ్మణ పండితోత్తముడైన నిరుక్తుడు నాల్గవ సంహితను జెప్పెను-65. ఆతని శిష్యులు నలుగురు కేతవుడు, దాలకి, ధర్మశర్మ, దేవశర్మ వీరందరును వ్రతమును ధరించిన ద్విజులు-66. శాకల్యుడు మరణింపగనే వారందరు బ్రహ్మహత్యజేసిన వారైరి. అపుడు మిక్కిలి చింతను బొంది వారందరు బ్రహ్మ సమీపమునకు వెళ్ళిరి-67. బ్రహ్మ మనస్సుతోనే వారిని దెలిసికొని పవనపురమునకు బంపెను. మీరు వెంటనే పవనపురమునకు బొండు మీ పాపము వెంటనే నశించుననెను-68. అచట ద్వాదశారునకు నమస్కరించి, వాలుకేశ్వరునకు నమస్కరించి పదకొండు రుద్రులను, విశేషించి వాయుపుత్రుని గూడ నమస్కరించియు నాలుగు కుండములలో స్నానముచేసి బ్రహ్మహత్య నుండి తరించుడు అనేను-69. అంత అందరును మిక్కిలి వేగముగలవారై యా పవనపురమునకు వచ్చిరి. చెప్పినట్లు విధివిధానముగా స్నానము చేయబడినది. దేవతల దర్శనము గూడ చేయబడినది-70. ఉత్తరేశ్వరునకు నమస్కరించి బ్రాహ్మణుల యనుగ్రహమున వారందరును పాపముక్తులై సూర్యమండలము జేరిరి-71. అది మొదలు ఆ తీర్థము పాతకనాశన తీర్థమయినది. పూర్వము వాయువుచే నిర్మింపబడినదిన పవిత్రమైన వాయువు యొక్క పురము-72. అంజనాదేవి గర్భమున బుట్టిన హనుమంతుడైన పవన పుత్రుడు, సత్యపరాక్రముడునునైన మహాదేవ హనుమంతుడు పుట్టినపుడు బ్రహ్మ యోనియైన
యాజ్ఞవల్క్యునితో నీవు చదివినదంతయు మరల నాకిచ్చివేయుము అని యనెను-18. ఇట్లనగనే బ్రహ్మ విత్తముడైన యాజ్ఞవల్క్యుడు రక్తసిక్తములైన రూపముదాల్చిన యజుస్సులను వమనముజేసి గురువుకిచ్చెను-19. తరువాత నో ద్విజులారా! యాజ్ఞవల్క్యుడు ధ్యానయోగమున నిలచి సూర్యునారాధించెను. యాజ్ఞవల్క్యునినుండి వెలువడిన యజుర్వేదమంతయు నాకాశమునకు బోయి వేదాత్మకుడగు సూర్యుని జేరి నీలచినది-20. తరువాత పైకి సూర్యమండలమును జేరిన యజుస్సులనన్నింటిని సంతుష్టుడైన సూర్యుడు వేదమునకు విధానరూపుడైనట్టియు, ధీశాలియైనట్టియు, తన యశ్వరూపుడైనట్టి యాజ్ఞవల్క్యునకు నిచ్చెను-21. బ్రహ్మచేతగాని మరెవ్వరిచేతగాని అశ్వరూపుడగు యాజ్ఞవల్క్యునిచే నిచ్చిన యజుస్సుచే యధ్యయనము జేయబడును. అందువలన నవి వాజులు (గుఱ్ఱములు) అనబడినవి-22. బ్రహ్మహత్య యెవ్వరిచే చీర్ణమైనదో (చరింపబడినదో) వారు చరించుట వలన చరకులనబడినారు. వైశంపాయన శిష్యులైనట్టి వారు చరకులని చెప్పబడిరి.
ఇత్యేతే చరకాః ప్రోక్తా వాజినస్తాన్ని బోధత।
యాజ్ఞవల్క్యస్య శిష్యాస్తే కణ్వవైధేయ శాలినః॥
మధ్యందినశ్చ శాపేయా విదిగ్ధశ్చాష్య ఉద్దలః ।
తామ్రాయణశ్చ వాత్స్యశ్చ తథాగాలవశైశిరీ॥
అటవీ చ తథా పర్ణీ వీరణీ సపరాయణః ॥
ఇత్యేతే వాజినః ప్రోక్తా దశపంచచ సంస్మృతాః।
శతమేకాధికం కృత్నం యజుషాం వై వికల్పకాః ।
అను వీరు చరకులని చెప్పబడిరి. వాజులైన వారిని గూర్చి వినుడు. వారు యాజ్ఞవల్క్యుని యొక్క శిష్యులు. వారు కణ్వవైధ్యలు, శాలులు-24, మధ్యందినుడు శాపేయి, విదిగ్దుడు ఆప్యుడు, ఉద్దలుడు, తామ్రాయణుడు, పాత్యుడు, గాలవుడు, శైశిరి, ఆటవి, పర్లి, వీరణీ పరాయణుడు అను వీరు పదియైదుగురు వాజులని చెప్పబడిరి. యజుస్సుల యొక్క వికల్పములు మొత్తము నూటయొక్కటి.
పుత్రమధ్యాపయామాస సుమంతుమథజైమిని।
సుమంతుశ్చాపి సుత్వానం పుత్ర మధ్యాపయత్ప్రభుః॥
సుకర్మాణం సుతం సుత్వా పుత్రమధ్యాపయత్ప్రభుః॥
ససహస్రమధీత్యాశు సుకర్మాప్యథ సంహితాః।
ప్రోవాచాథ సహస్రస్య సుకర్మా సూర్యవర్చసః॥
అనధ్యాయేషధీయానాం స్తాంజఘాన శతక్రతుః।
ప్రాయోపవేశమకరోత్తతో సౌఽశిష్య కారణాత్॥
క్రుద్దం దృష్ట్యా తతః శక్రో వరమస్మై దదౌ పునః।
భావినౌ తే మహావీర్యౌ శిష్యావనలవర్చసౌ॥
అధీయానౌ మహాప్రాజ్ఞౌ సహస్రం సహితావుభౌ।
ఏతౌ సురౌ మహాభాగౌ మాక్రుద్ద్య ద్విజసత్తమ॥
ఇత్యుక్త్యా వాసవః శ్రీమాన్ సుకర్మాణం యశస్వినమ్।
శాంతక్రోధం ద్విజం దృష్ట్యా తత్రైవాంతర ధీయత॥
తస్య శిష్యో భవేద్దీమాన్ పౌష్యం ద్విజసత్తమాః।
హిరణ్యనాభః కౌశిక్యో ద్వితీయోఽభూన్నరాధిపః ॥
అధ్యాపయత్తు పౌష్యంజీ సహస్రార్థం తు సంహితాః।
తేనాం న్యోదీచ్య సామాన్యాః శిష్యాః పౌష్యంజినః శుభాః ॥
శతానిపంచ కౌశిక్యః సంహితానాం చ వీర్యవాన్।
శిష్యాహిరణ్యనాభస్య స్మృతాస్తే ప్రాచ్యసామగాః ॥
లోకాక్షీ కుడుమిశ్చైవ కుశీతీ లాంగలిస్తథా।
పౌష్యంజిశిష్యాశ్చత్వారస్తేషాం భేదాన్ని బోధత॥
రాణాయనీయః సహితం డి పుత్రస్త స్మాదన్యో మూలచారీ సువిద్వాన్।
సకతిపుత్రః సహసాత్యపుత్ర ఏతాన్భేదాన్విత్త లోకాక్షికాస్తు॥
త్రయస్తు కుధుమేః పుత్రా ఔరసోర సపాసరః।
భాగవిత్తిశ్చ తేజస్వీ త్రివిధాః కౌధుమాః స్మృతా॥
శౌంద్యుః శృంగి పుత్రశ్చ ద్వావేతా చరితౌవ్రతౌ।
రాణాయనీయాః సౌమితాః సామవేదవిశారదౌ॥
ప్రోవాచ సంహితాస్తిస్రః శృంగిపుత్రో మహాతపాః చైలః ప్రాచీన యోగశ్చ సురాలశ్చ ద్విజోత్తమాః ॥
ప్రోవాచ సంహితాః షట్ట్తు పారాశర్యస్తు కౌధుమః ।
ఆసురాయణ వైశాఖ్యౌ వేదవృద్ద పరాయణౌ॥
ప్రాచీనయోగపుత్రశ్చ బుద్ధిమాంశ్చ పతంజలిః కౌథుమస్య తు భేదాస్తే పారాశర్యస్య షట్ స్మృతాః
లాంగలిః శాలిహోత్రశ్చ షట్ షట్ ప్రోవాచ సంహితాః॥
భాలుకిః కామహానిశ్చ జైమినిర్లోమగాయినః।
కండశ్చ కోలహశ్చైవ షడేతే లాంగలాః స్మృతాః।
ఏతే లాంగలినః శిష్యాః సంహితా యైః ప్రసాధితాః ॥
తతో హిరణ్య నాభస్య కృతశిష్యో నృపాత్మజః।
సోఽకరోచ్చ చతుర్వింశత్యంహితా ద్విపదాం వరః।
ప్రోవాచ చైవ శిష్యేభ్యో యేభ్యస్తాంశ్చ నిబోధత॥
రాడశ్చ మహవీర్యశ్చ పంచమో వాహనస్తథా।
తాలికం పాండకశ్చైవ కాలకోః రాజికస్తథా॥
గౌతమశ్చాజ బస్తశ్చ సోమరాజా పతత్తతః॥
పృష్ఠఘ్నః పరికృష్టశ్చ ఉలూఖలక ఏవ చ।
యవీయసశ్చ వైశాలో అంగులీయశ్చ కౌశికః॥
సాలిమంజరి సత్యశ్చ కాపీయః కానికశ్చయః।
పారాశరశ్చ ధర్మాత్మా ఇతి కాంతాస్తు సామగాః॥
సామగానాం తు సర్వేషాం శ్రేష్ఠౌ ద్వౌ తు ప్రకీర్తితౌ।
పౌష్యంజిచ్చ కృతిశ్చైవ సంహితానాం వికల్పకౌ॥
అధర్వాణ ద్విధా కృత్వా సుమంతుదర ద్విజా ।
కబంధస్తు ద్విధా కృత్వా పధ్యాయైకం పునర్దదౌ।
ద్వితీయం వేదస్పర్శాయ స చతుర్థాఽకరోత్పునః
మోదో బ్రహ్మ బలశ్చైవ పిప్పలాదస్తథైవ చ।
శౌక్వాయనిశ్చ ధర్మజ్ఞ శ్చతుర్థ స్తపనః స్మృతః
వేదస్పర్శస్య చత్వారః శిష్యాస్వేతే దృఢవ్రతాః॥
పునశ్చ త్రివిధం విద్ధి పథ్యానాం బేధముత్తమమ్।
జాజలిః కుముదాదిశ్చ తృతీయః శౌనకః స్మృతః॥
శౌనకస్తు ద్విధా కృత్వా దదావేకం తు బభ్రవే ।
ద్వితీయాం సంహితాం దీమాన్ సైంధవాయ న సంజ్ఞితే॥
సైంధవో ముంబకేశాయ భిన్నా సా చ ద్విధా పునః।
నక్షత్ర కల్పో వై తానస్తృతీయః సంహితా విధిః ॥
చతుర్థోఽ గిరసః కల్పః శాంతికల్పశ్చ పంచమః॥
శ్రేష్ఠస్త్వథర్వణో హ్యేతే సంహితానాం వికల్పనాః।
షట్శః కృత్వా మహాప్యుక్తం పురాణమృషి సత్తమాః॥
తఱువాత జైమిని తన పుత్రుని సుమంతుని జదివించేను. ప్రభువైన సుమంతుడు గూడ పుత్రుడైన సుత్వానుని జదివించేను-27. సుకర్ముడు సైతము సహస్రుని వేగముగా జదివించి సుకర్మ సూర్యవర్చస్వియైన సహస్రునకు సంహితలను జెప్పెను-28. ఇంద్రుడు అనధ్యాయదినములలో జదువుచున్న వారిని జంపెను. తరువాత సుకర్ముడు శిష్యుల కారణముగా ప్రాయోపవేశము (నిరాహారదీక్ష) జేసెను-29. తరువాత ఇంద్రుడు కోపించిన సుకర్ముని జూచి యాతనికి “నీకు మహవీర్యవంతులు, అగ్నితేజస్కులునైన శిష్యులు గలుగనున్నారు-30. వీరు మహా ప్రజ్ఞాశాలురునైన యీ యిద్దరును చక్కగా జదువువారు. వీరిరువురు దేవతలు, మహాభాగులు. ఓ బ్రాహ్మణోత్తమా! కోపింపకుము-31. ఈ విధముగా నింద్రుడు సుకర్మునకు జెప్పి యా సుకర్మను శాంతక్రోధునిగా జూచి యచటనే యంతర్థానమందెను-32. ద్విజులారా! ఆ సుకర్ముని శిష్యుడు బుద్ధిశాలియైన పౌష్యంజియయ్యెను. కుశిక వంశజుడైన హిరణ్యనాభుడు అను రాజు రెండవ శిష్యుడయ్యెను-33. పౌష్యంజి వేయిన్నర (ఏబది) సంహితలను (శిష్యులకు) జదివించెను. దానిచేత పౌష్యంజి శిష్యులు అన్యోదీచ్య (ఇతరులైన యుత్తర దిక్కువారు) సామాన్యులై శుభులై-34, వీర్యవంతుడైన కౌశిక్య హిరణ్యనాభుడు ఐదువందల (నూటయైదు) సంహితలను జదివించేను. హిరణ్యనాభుని శిష్యులు ప్రాచ్య సామగులుగా చెప్పబడినారు. లోకాక్షి, కుథుమి, కుశలి, లాంగలి యను నలుగురు పౌష్యంజీ శిష్యులు. వారి భేధములను వినుడు-36. రాణాయనీయుడు ఆదడు తండి పుత్రుడు, వానికంటే వేరైన వాడు మూలచారి మంచి విద్వాంసుడు. సతి పుత్రుడు, సహసాత్యని పుత్రుడు వీరి లోకాక్షియొక్క భేదములుగా దెలిసికొనుడు-37. కుడుమీ యొక్క పుత్రులు ముగ్గురు. ఔరసుడైన రసపాసరుడు, భాగవిత్త, తేజస్వీ అను విధముగా కామములు మూడు విధములుగా జెప్పబడినారు. శాంద్యుర్యుడు, శృంగిపుత్రుడు (శౌర్జుడు) వీరిద్దరును చక్కగా వ్రతమాచరించినవారు. రాణాయనీయుడు, సౌమిత్రియు సామవేద పండితులు-39. మహాతపస్వియైన శృంగిపుత్రుడు మూడు సంహితలను జెప్పెను. బ్రాహ్మణోత్తములారా! చైలుడు, ప్రాచీన యోగుడు, సురాలుడును సంహితలను జెప్పిరి-40. పారాశర్యుడైన కౌథుముడు ఆజు సంహితలను జెప్పెను. ఆ సురాయణుడు, వైశ్యాఖ్యుడును వేదవృద్దులందాసక్తి గలవారు 41. ప్రాచీన యోగ పుత్రుడును బుద్ధిమంతుడునైనవాడు పతంజలి. కౌధుముని యా భేదములు సారాశర్యుని యొక్క యాలు (భేదములు)గా జెప్పబడినవి. లాంగలియు శాలిహోత్రుడును చెరియొక యాలు సంహితలను జెప్పిరి-42. భాలుకి, కామహాని, జైమిని, లోమగాయి, కుండుడు, కోహలుడు, ఈ యాజుగురును లాంగలులని చెప్పబడిరి. ఈ లాంగలులైన శిష్యులు సంహితలను ప్రసాదించిరి-43.. ఆ తరువాత హిరణ్యనాభునకు శిష్యుడై, మానవశ్రేష్ఠుడై రాజకుమారుడు ఇరువది. నాలుగు సంహితలను జేసెను. ఆ సంహితలు శిష్యులకు జెప్పెను. ఆ శిష్యులను వినుడు-44. వారు రాడుడు, మహవీర్యుడు, రోదవహడు వాహనుడును. తాలకుడు, పాండవకుడు, కాలికుడు, రాజికుడు గౌతముడు అజబస్తుడు, తజువాత సోమరాజు వచ్చెను-45. పృష్టఘ్నుడు, పరీకృష్ణుడు, ఉలూఖలకుడు, యవీయసుడు, వైశాలుడు, అంగుళీయుడు, కౌశికుడు, 46 సాలిమంజరి సత్యుడు, కాపీయుడు, కానీకుడు ధర్మాత్ముడైన పారాశరుడు అని క్రాంతులైనవారు సామగులు- 47. సామగులందరిలో శ్రేష్ఠులిద్దరని చెప్పబడిరి. వారు పౌష్యంజియు కృతయును వీరు సంహితల వికల్పకులు-48. ఓ బ్రాహ్మణులారా! సుమంతుడు అధర్వములను రెండు విధములుగా జేసి కబంధునకిచ్చెను. ఆతడుగూడ యథా క్రమముగా మొత్తము దెలిసికొనెను-49. కబంధుడు రెండుగాజేసి యొకదానిని పభ్యునకిచ్చెను. రెండవదానిని వేదస్పర్శునకిచ్చేను. ఆతడు దానిని నాలుగు విధములుగ జేసెను-50. వేదస్పర్శునకు దృఢవ్రతలైన నలుగురు శిష్యులు బ్రహ్మబలుడైన మోదుడు, పిప్పలాదుడు, ధర్మజ్ఞుడైన శాక్వాయనియు నాలుగవవాడు తనుడు అనబడెను-51. పథ్యులయొక్క యుత్తమ భేదమును మరల మూడు విధములని తెలిసికొనుము. జాజలి, కుముదాది, మూడవవాడు శౌనకుడనబడెను-52. శౌనకుడు సంహితను రెండుగాజేసి యొకదానిని బ్రభువునకిచ్చెను. ధీమంతుడైన శౌనకుడు రెండవదానిని సైంధవాయనుడను పేరు గలవానీకిచ్చెను-53, సైంధవుడు ముంజకేశునకిచ్చెను. ఆ సంహిత మరల రెండుగా భిన్నమయ్యెను. నక్షత్ర కల్పము, వైతానము, మూడవది సంహితావిధి, నాలుగవది యంగిరసంకల్పము, ఐదవది శాంతికల్పము-56. ఆధర్వణము శ్రేష్ఠము. ఇవి సంహితల యొక్క వికల్పనములు. ఓ ఋషి సత్తములారా! ఆలుగాజేసి నాచేతగూడ పురాణము చెప్పబడినది.
ఆత్రేయః సుమతిర్దీమాన్ కాశ్యపోహ్యకృతవ్రణః ।
భారద్వాజోఽగ్ని వర్ణశ్చ వసిష్ఠో మిత్రయుశ్చ యః।
సావర్ణిః సోమదత్తస్తు సుశర్మా శాంశపాయనః॥
ఏతే శిష్యా మమ బ్రహ్మన్ పురాణేషు ధృఢవ్రతాః।
త్రిభిస్తిస్రః కృతాస్తి స్త్రిః సంహితాః పునరేవ హి॥
కాశ్యపః సంహితా కర్తా సావర్ణిః శాంశపాయనః।
సామికా చ చతుర్థీస్యాత్సా చైషా పూర్వసంహితా॥
సర్వాస్తాహి చతుష్పాదాః సర్వాశ్చైకార్థవాచికాః।
పాఠాంతరే పృథగ్భూతా వేదశాఖా యథాతథా॥
చతుః సాహస్రికాః సర్వాః శాంశపాయని కామృతే॥
లోమహర్షణికా మూలాస్తతః కాశ్యపికాః పరాః ।
సావర్ణికాస్తృతీయాస్తా యుజుర్వాక్యార్థ పండితాః॥
శాంశపాయనికాశ్చాన్యానోదనార్థ విభూషితాః సహస్రాణి ఋచామష్టా షట్ శతాని తధైవ చ ॥
ఏతాః పంచదశాన్యాశ్చ దశాన్యాదశభి స్తథా।
వాలఖిల్యాః సమప్రైభాః (షాః) ససావర్ణాః ప్రకీర్తితాః॥
అష్టౌ నామ సహస్రాణి సామాని చ చుతర్దశః।
అరణ్యకం సహోమం చ ఏతద్గాయంతి సామగాః ॥
ద్వాదశైవ సహస్రాణి ఛంధ ఆధ్వర్యవం స్మృతమ్।
యాజుషాం బ్రాహ్మణానాం చ యథా వ్యాషోవ్యకల్పయత్॥
సంగ్రామ్యారణ్యకం తత్స్యాత్ సమంత్ర కరణం తథా।
అతఃపరం కథానాం తు పూర్వా ఇతి విశేషణమ్॥
గ్రామ్యారణ్యం సమంత్రం చ ఋగ్బ్రాహ్మణయుజుః స్మృతమ్।
తథాహారీద్రవీయాణాం ఖలాన్యుప ఖలాని చ।
తథైవ తైత్తిరీయాణాం పరక్షుద్రా ఇతి స్మృతమ్॥
ఆత్రేయుడు, సుమతి, ధీమంతుడు, కాశ్యపుడు, అకృతవ్రణుడు, భారద్వాజుడు, అగ్నివర్ణుడు, వసిష్ఠుడు, మిత్రయుడు, సావర్ణి, సోమదత్తి, సుశర్మ శాంశపాయనుడు-56, హేబ్రహ్మన్! వీరు నా శిష్యులు, పురాణములలో దృఢవ్రతులు, మూడు సంహితలు మువ్వురిచే మరల మూడుగాచేయబడినవి-57. కాశ్యపుడు సంహితాకర్త. సావర్ణి శాంశపాయనుడును (సంహితాకర్తలు). సౌమికా, అనునది నాలుగవ సంహిత. ఆ యిది పూర్వసంహిత-58. ఆ సంహితలన్నియు నాలుగు పాదములు గలవి. అన్నియు నొకే అర్థమును జెప్పునవి. పాఠాంతరమున వేదశాఖలవలే వేరుగానైనవి. అన్ని సంహితలును శాంశపాయనిక సంహితను విడిచి నాలుగువేలు-59. లోమహర్షణికులు మూలములైనవారు. అటు తరువాత వారు కాశ్యపికులు, మూడవవారు సావర్ణికులు యజుర్వాక్యార్థ పండితులు ఇతరులు ప్రేరణార్థముతో నలంకరింపబడిన శాంశపాయనులు. వీరి ఋక్కులు ఎనిమిదివేల యాజువందలు-61. ఇవియు, మజీపదియైదును మరివందయును వాలఖిల్యులు సమాన పైషలుగలవారై ససావర్ణులుగా జెప్పబడిరి-62. సామవేదగాయకులు ఎనిమిది వేల పదునాలుగు సామములు ఆరణ్యకముగా హోమముతోబాటు గానము జేయుదురు-63. వ్యాసుడు వికల్పించిన ప్రకారము యజుస్సుల యొక్కయు, బ్రాహ్మణుల యొక్కయు పండ్రెండు వేలే కలవు. ఛందము ఆధ్వర్యవమనబడినది-64. అది సంగ్రామ్యారణ్యకమగును. అట్లే సమంత్ర కరణము గూడనగును. దీనికి తరువాతి కథలకు పూర్వములు అను విశేషణముండును-65. సమంత్రమైన గ్రామ్యారణ్యము ఋగ్రాహ్మణము యనబడినది. అట్లే హరిద్రవీయుల యొక్కయు, తైత్తిరీయుల యొక్కయు ఖిలములైనవియు ఉపఖిలములైనవియును పరక్షుద్రములనబడినవి.
ద్వే సహస్ర శతన్యూనే వేదే వాజసనేయకే।
ఋగ్గణాః పరిసంఖ్యాతో బ్రాహ్మణం తు చతుర్గుణమ్ ॥
అష్టౌ సహస్రాణి శతాని చాష్టౌ అశీతిరన్యాన్యధికశ్చపాదః॥
ఏతత్ప్రమాణం యజుషామృచాం చ సశుక్రియం సాఖిలయాజ్ఞవల్క్యమ్॥
వాజసనేయ వేదమున ఒక వేయి తొమ్మిది వందలు ఋగ్గణము. లెక్కింపబడినది. బ్రాహ్మణము మాత్రము నాలుగింతలు. ఎనిమిది వేల యెనిమిది వందల యెనుబది యధికమైనది పాదము. ఇది ఋక్కుల యొక్కయు యజుస్సుల యొక్కయు ప్రమాణము. అది శుక్ల యజుస్సుతోను అఖిలయాజ్ఞవల్క్యముతోను గూడినది.
తథాచరణవిద్యానాం ప్రమాణం సంహితాః శృణు।
షట్సాహస్ర మృచాముక్తమచః షడ్వింశతిః పునః॥
ఏతావదధికం తేషాం యజుః కామం వివక్షతి॥
ఏకాదశ సహస్రాణి దశచాన్యాదశోత్తరాః ।
ఋచాం దశసహస్రాణి అశీతి త్రిశతాని చ ॥
సహస్రమేకం మంత్రాణామృచాముక్తం ప్రమాణతః ఏతావద్భృగు విస్తారమన్యచ్చాధర్వికం బహు॥
ఋచామధర్వణాం పంచ సహస్రాణి వినిశ్చయః సహస్రమన్యద్విజ్ఞేయ మృషిభిర్వింశతిం వినా॥
ఏతదంగిరసా ప్రోక్తం తేషామారణ్యకం పునః।
ఇతి సంఖ్యాతా ప్రసంఖ్యాతా శాఖాభేదా స్తథైవచ॥
కర్తారశ్చైవ శాఖానాం భేదే హేతుస్తథైవ చ।
సర్వమన్వంతరేష్వేవం శాఖాభేదాః సమాః స్మృతాః॥
అట్లే చరణ విద్యలయొక్క ప్రమాణము (అయిన) సంహితను వినుము. ఆఱువేల ఋక్కులు చెప్పబడినవి. మఱియు పదినాలు గూడ చెప్పబడినవి. ఈ ఋక్కులకింతయే యధికము. యజుస్సును ఇష్టము వచ్చినట్లు చెప్పదలచును-69. పదునొకండు వేలు మణి పదియైదు పదివేల ఋక్కులు మూడు వందల యెనుబదియు 70 ఒక వేయి మంత్రములు ప్రమాణముగా జెప్పబడినవి. భృగుల విస్తారమంతయు ఇతరమైన యాధర్వికము చాలయున్నది-71. ఐదువేల ఋక్కులు ఐదువేలు అధర్వములు అని నిశ్చయము. ఇరువదిని విడిచి వేయి మరొక్కటియని ఋషులు తెలియవలెను-72. ఇది అంగిరసునిచే చెప్పబడినది. ఇది వారి యారణ్యకము అని యీ విధముగ (ఋక్కులు) లెక్కింపబడినవి. అట్లే శాఖాభేదములు గూడ జెప్పబడినవి-73. శాఖలయొక్క కర్తలును, వారి భేదములలో కారణములను సమస్త మన్వంతరములలో గూడ నిట్లేయుండును. శాఖాభేదములు గూడ సమానమని చెప్పబడినవి.
ప్రాజాపత్యాశ్రుతిర్నిత్యా తద్వికల్పాస్త్విమే స్మృతాః।
అనిత్యభా వాద్దేవానాం మంత్రోత్పత్తిః పునః పునః॥
మన్వంతరాణాం క్రియతే సురాణాం నామ నిశ్చయః ।
ద్వాపరేషు పునర్భేదాః శ్రుతానాం పరికీర్తితాః॥
ప్రాజాపత్యమైన శ్రుతి నిత్యమైనది. ఇవి దాని వికల్పము (భేదము)లనబడినవి. దేవతలయొక్క నిత్య భావము వలన మరల మరల మంత్రోత్పత్తి జరిగినది-75. మన్వంతరముల యొక్కయు, సురలయొక్కయు నామ నిశ్చయము జేయబడుచున్నది. ద్వాపరయుగములందు వినబడిన వేదములకు మరల భేదములు చెప్పబడినవి.
ఏవం వేదం తదాన్యస్య భగవానృషి సత్తమః।
శిష్యేభ్యశ్చ పునర్దత్త్వా తపస్తప్తుం గతో వనమ్॥
తస్య శిష్యప్రశిష్యైస్తు శాఖాభేదాస్త్విమే కృతాః॥
అంగాని వేదాశ్చత్వారో మీమాంసాన్యాయ విస్తరః।
ధర్మశాస్త్రం పురాణం చ విద్యాస్త్వేతాశ్చతుదశ॥
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవ తే త్రయః।
అర్థశాస్త్రం చతుర్థం తు విద్యాస్త్యష్టాదశైవతు॥
జ్ఞేయా బ్రహ్మర్షయః పూర్వం తేభ్యో దేవర్షయః పునః।
రాజర్షయః పునస్తేభ్య ఋషిప్రకృతయ స్త్రయః ॥
తేభ్య ఋషి ప్రకృతయో మునిభిః సంశితవ్రతైః ॥
కశ్య పేషు వశిస్టేషు తథాభృగ్వంగిరో ఽత్రిషు।
పంచ స్వేతేషు జాయంతే గోత్రేషు బ్రహ్మవాదినః।
యస్మాదృషంతి బ్రహ్మాణం తేన బ్రహ్మర్షయః స్మృతాః॥
ధర్మస్యాథ పులస్త్యస్య క్రతోశ్చ పులహస్యచ।
ప్రత్యూషస్య ప్రభాసస్య కశ్యపస్య తథా పునః॥
దేవర్షయః సుతాస్తేషాం నామతస్తాన్నిబోధత।
దేవర్షీ ధర్మపుత్రే తు నరనారాయణావుభౌ॥
వాలఖిల్యాః క్రతోః పుత్రాః కర్ధమః పులహస్య తు।
కుబేరశైవ పౌలస్త్యః ప్రత్యూషస్యాచలస్మృతః॥
పర్వతో నారదశ్చైవ కశ్యపస్యాత్మజావుబౌ।
ఋషంతి దేవాన్ తస్మాత్తే తస్మాద్దేవర్షయః స్మృతాః
మానవే వైషయే వంశే ఐలవంశే చ యే నృపాః ।
ఐలాఇక్ష్వాకనాభాగా జ్ఞేయారాజర్షయస్తు తే ॥
ఋషంతి రంజనాద్యస్మాత్ప్రజా రాజర్షయ స్తతః।
బ్రహ్మలోకప్రతిష్ఠాస్తు స్మృతా బ్రహ్మర్షయో మతాః ।
దేవలోక ప్రతిష్ఠాశ్చ జ్ఞేయా దేవర్షయః శుభాః ।
ఇంద్రలోక ప్రతిష్ఠాస్తు సర్వే రాజర్షయో మతాః ॥
అభిజాత్యా చ తపసా మంత్రవ్యాహరిణై స్తథా।
ఏవం బ్రహ్మర్షయః ప్రోక్తా దివ్యారాజర్షయస్తు యే॥
ఈ విధముగ భగవద్రూపుడైన ఋషి శ్రేష్ఠుడు వేదమును ఇతర శిష్యులకు నిచ్చి మరల తపము జేయుటకు వెళ్ళెను. ఆతని శిష్యుల ప్రశిష్యుల చేత నీ శాఖాభేదములు ప్రవర్తింపజేయబడినవి-77. శిక్షాదులైనయాయి అంగములు (వేదాంగములు) నాలుగువేదములు, మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రము, పురాణము ఇవి చతుర్దశ (14) విద్యలు-78. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము అను నీ మూడును, నాలుగవది యర్థ శాస్త్రము ఇవి యష్టాదశ (18) విద్యలు-79. మొదటివారు బ్రహ్మర్షులని యెఱుగవలెను. వారి నుండి దేవర్షులు వారి నుండి. రాజర్షులు, వారి నుండి మూడు ఋషి ప్రకృతులును వచ్చిరి. అని తీక్షవ్రతులైన మునులచే తెలియదగినది-80. కశ్యపగోత్రములందును, వసిష్ఠ గోత్రములందును, భృగు, అంగీరస గోత్రములందును ఈ యైదు గోత్రములందు బ్రహ్మవాదులు జన్మింతురు. బ్రహ్మను బొందుదురు గావున బ్రహ్మరులనబడినారు-81. ధర్మునకును, పులస్త్యునకును, క్రతువునకును, పలహునకును, ప్రత్యూషునకును, ప్రభాసునకును, కశ్యపునకును-82, సుతులు దేవర్షులు పేరులతో వారిని వినుడు. ధర్మపుత్రులైన దేవర్షులు నరనారాయణులిరువురు-83. క్రతువు యొక్క పుత్రులు వాలఖిల్యులు. పులహునకు పుత్రుడు కర్దముడు. పులస్త్యునకు పుత్రుడు, కుబేరుడు, ప్రత్యూషునకు పుత్రుడు అచలుడు-84. కశ్యపుని పుత్రులు పర్వతుడును నారదుడును నిరువురు. వీరు దేవతలను బొందుదురు గాన దేవర్పులనబడినారు-85. మానవ వంశమునను, వైషయ వంశమునను. ఐలవంశమునను బుట్టి రాజులు ఐలులనియు, ఇక్ష్వాకులనియు నాభాగులనియు వారు రాజర్షులు-86. రంజింపచేయుట వలన ప్రజలు రాజులను బొందుదురు గావున రాజర్షులనబడినారు. బ్రహ్మలోకమున సుప్రతిష్ఠితులైన వారందరిని రాజర్షులుగా నొప్పుదురు. ఇంద్రలోకమున సుప్రతిష్టితులైన వారినందరిని రాజర్షులుగా నొప్పుదురు-87,88. వంశముతోను, తపస్సుతోను మంత్రోచ్చారణములతోను బ్రహ్మర్షులుగా జెప్పబడినారు. దివ్యులైన రాజర్షులు దేవర్షులు.
దేవర్షయస్తథాఽన్యే చ తేషాం వక్ష్యామి లక్షణమ్।
భూతభవ్యభవజ్ఞానం సత్యాభివ్యాహృతం తథా॥
సంబుద్ధాస్తు స్వయం యే తు సంబుద్ధా యే చ వై స్వయమ్।
తపసేహ ప్రసిద్దా యే గర్బే యైశ్చ ప్రణోదితమ్॥
మంత్రవ్యాహారిణో యే చ ఐశ్వర్యాత్సర్వగాశ్చయే।
ఇత్యేతే ఋషిభిర్యుక్తా దేవద్విజనృపాస్తు యే॥
దేవర్షుల యొక్కయు లక్షణమును జెప్పెదను. భూత- భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానము, సత్యము బలుకుట అట్లే స్వయముగా జ్ఞానులైన వారును. తపస్సుచే జ్ఞానులైన ప్రసిద్ధులైనవారును, గర్భమునందుండగనే జ్ఞాన ప్రేరణగలవారును, 91 మంత్రముల బలుకువారును, ఈశ్వర భావమువలన సర్వము దెలసిపోవువారును, అను వీరు దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు అగుదురు.
ఏతాన్ భావానధీయానా యే చైత ఋషయో మతాః।
సప్తైతే సప్తభిశ్చైవ గుణైః సప్తర్షయః స్మృతాః॥
దీర్ఘాయుషో మంత్రకృత ఈశ్వరా దివ్యచక్షుషః ।
బుద్ధాః ప్రత్యక్షధర్మాణో గోత్ర ప్రవర్తకాశ్చ యే॥
షట్కర్మాభిరతినిత్యం శాలినో గృహమేధినః।
తుల్యైర్వవ హరంతి స్మ అదృష్టైః కర్మ హేతుభిః॥
అగ్రామ్యైర్వర్తయంతిస్మ రసైశ్చైవ స్వయం కృతైః।
కుటుంబిన బుద్ధిమంతో బాహ్యాంతర నివాసినః॥
కృతాదిషు యుగాఖ్యేషు సర్వేష్వేవ పునః పునః।
వర్ణాశ్రమ వ్యవస్థానం క్రింయంతే ప్రథమం తు వై॥
ప్రాప్తే త్రేతాయుగముఖే పునః సప్తర్షయస్త్విహ।
ప్రవర్తయంతి యే వర్ణాశ్రమాంశ్చైవ సర్వశః॥
జాయమానే పితాపుత్రే పుత్రః పితరి చైవ హి।
ఏవం సమేత్యావిచ్చేదాద్వర్తయంత్యా యుగక్షయాత్॥
అష్టాతిసహస్రాని ప్రోక్తాని గృహమేధినామ్॥
అర్యమో దక్షిణా యే తు పితృయాణం సమాశ్రితాః దారాగ్ని హోత్రినస్తేవై యే ప్రజా హేతవః స్మృతాః॥
గృహమేధినాం చ సంఖ్యేయాః శ్మశానాన్యా శ్రయంతి యే।
అష్టాశీతి సహస్రాణి నిహితా ఉత్తరాయణే॥
యే శ్రూయంతే దివం ప్రాప్తా ఋషయో హ్యూర్థ్వరేతసః।
మంత్రబ్రాహ్మణకర్తారో జాయంతేహ యుగక్షయే॥
ఈ భావములను అధ్యయనముజేయు వారు ఋషులని యొప్పుదురు. వీరేడుగురు. ఏడుగుణములచే సప్తర్షులనబడినారు-93. వీరు దీర్ఘాయుషులు, మంత్రకర్తలు, ఈశ్వరులు, దివ్యచక్షువులు గలవారు, జ్ఞానులు, ప్రత్యక్షమైన ధర్మము గలవారు. గోత్ర ప్రవర్తకులు-94. షట్కర్మలయందాసక్తి గలవారు (యజన-యాజన-అధ్యయన -అధ్యాపన - దాన - ప్రతిగ్రహములు) షట్కర్మలు. నిత్యమును బ్రకాశించువారు, గృహస్థులు, సమానములై కనబడని కర్మ హేతువులచే వీరు వ్యవహరించుచుందురు-95. స్వయంకృతములై మైథునాది గ్రామ్యములుగాని యానందములతో వర్తింతురు. వారు కుటుంబము గలవారు. బుద్ధిమంతులు. బాహ్యములోను అంతరములోను నివసించువారు-96. వీరు కృతయుగాదులన్నింటిలోను మరల మరల మొదట వర్ణాశ్రమ వ్యవస్థానమును జేయుదురు-97. త్రేతాయుగము రాగా మరల సప్తర్పులిచటనంతటను ఈ బ్రాహ్మణాది వర్ణములను బ్రహ్మచర్యాది ఆశ్రమములను ప్రైవర్తింపజేయుదురు. వారి యొక్క వంశమునందే మరల మరల వీరులు బుట్టుదురు-98. పుత్రుడు గలుగుచుండగా తండ్రియు, తండ్రియుండగా తన పుత్రుడును ఈ విధముగా నొక్కచోజేరి (వంశపారంపర్యము) ఎడతెగకుండగా యుగాంతము వరకును ఈ సప్తర్షులు ప్రవర్తింపజేయుదురు. గృహమేధులకు ఎనుబది యేనియొది వేలు చెప్పబడినవి-99. సూర్యునకు దక్షిణమున నున్న వారు పితృయాణమును సమాశ్రయింతురు. భార్యతో సహ అగ్ని హోత్రముజేయువారై (పితృదేవతలై) సంతానహేతువుల నబడినారు 100. గృహమేధుల సంఖ్యలతో లెక్కింపబడినవారై శ్మశానముల నాశ్రయించినవారు ఎనుబది యెనిమిది వేలు ఉత్తరాయణము నందుంచబడును-101. స్వర్గమును బొందిన యూర్ణ రేతస్కులైన ఋషులు మంత్ర బ్రాహ్మణకర్తలై యుగాంతమున జన్మింతురు.
ఏవమావర్తమానాస్తే ద్వాపరేషు పునః పునః।
కల్పానాం భాష్యవిద్యానాం నానాశాస్త్రకృతః క్షయే॥
భవిష్యే ద్వాపరే చైవ ద్రోణిర్ద్వైపాయనః పునః।
వేదవ్యాసో హ్యతీతేఽస్మిన్ భవితాసు మహాతపాః
భవిష్యంతి భవిష్యేషు శాఖాప్రణయనాని తు।
తస్మైతద్బ్రహ్మణా బ్రహ్మతపసాప్రాప్తమవ్యయమ్॥
తపసా కర్మసంప్రాప్తం కర్మణా హి తతో యశః।
యశసా ప్రాప్య సత్యం హి సత్యేనాప్తొ హి చావ్యయః ॥
అవ్యయా దమృతం శుక్రమమృతాత్ సర్వమేవ హి।
ధ్రువమేకాక్షరమిదం స్వాత్మన్యేవ వ్యవస్థితమ్॥
బృహత్త్వా ద్బృహణాచ్చైవ తద్బ్రహ్మేత్యభి ధీయతే॥
ఈ విధముగ ద్వాపరయుగమున కల్పములయొక్కయు భాష్యవిద్యలయొక్కయు శాస్త్రకారుని యొక్కయు నాశనము జరుగగా ఆ ఋషులు మరల మరల పరిభ్రమించుచుందురు-103. రాబోవు ద్వాపరమున ద్రోణి ద్వైపాయను (వ్యాసు) డగును. గడచిన ద్వాపరమున చక్కని గొప్ప తపస్సుగల వేదవ్యాసుడు వ్యాసుడగును-104. భవిష్యత్కాలములందు శాఖాప్రణయాని (శాఖలను చేర్చుట) కాగలదు. దానికొజకు ఆవేదము తపస్సు చేతను నాశము లేని బ్రహ్మ పొందబడినది-105. తపస్సుచే కర్మపొందబడినది. కర్మచేత కీర్తిపొందబడినది. కీర్తిచేత సత్యమును బొందును. సత్యముచేత అవ్యయుడు (నాశము లేనివాడు) పొందబడును-106. అవ్యయము వలన నమృతమును, అమృతమువలన సమస్తమును బొందును. ఇది ధ్రువమైన (స్థిరము) ఏకాక్షరము స్వాత్మయందే నిలచియున్నది. అది బృహత్తైనందునను (విశాలమైనందునను) బృంహణమైనందునను (విజృంభించిన వ్యాపించునదగుట చేతను) బ్రహ్మయనబడుచున్నది.
ప్రణవావస్థితం భూయో భూర్భువః స్వరిత స్థితమ్।
ఋగ్యజుః సామాధర్వ రూపిణే బ్రహ్మణే నమః ॥
జగతః ప్రలయోత్పత్తౌ యత్తత్కారణ సంజ్ఞితమ్।
మహతః పరమం గుహ్యం తస్మై సుబ్రహ్మణే నమః ॥
అగాధా పరమక్షయ్యం జగత్సం మోహనాలయమ్।
సప్రకాశ ప్రవృత్తిభ్యాం పురుషార్థ ప్రయోజనమ్॥
సంఖ్యాజ్ఞానవతాం నిష్ఠాగతిః సంగదమాత్మనః।
యత్తదవ్యక్తమమృతం ప్రకృతిః బ్రహ్మశాశ్వతమ్॥
ప్రధానమాత్మయోనిశ్చ గుహ్యం సత్త్వం చ శబ్ద్యతే।
అవిభాగ స్తథాశుక్రమక్షరం బహువాచకమ్॥
పరమబ్రహ్మణే తస్మై నిత్యమేవ నమో నమః
కృతే పునః క్రియా నాస్తి కుత ఏవాకృత క్రియా ।
సకృదేవకృతం సర్వం యద్యైలోకే కృతాకృతమ్॥
శ్రోతవ్యం వై శ్రుతం వాపి తధైవా సాధుసాధుతా।
జ్ఞాతవ్యం చాథమంతవ్యం స్ప్రృష్టవ్యం భోజ్యమేవ చ॥
ద్రష్టవ్యం చాథశ్రోతవ్యం జ్ఞాతవ్యం వాథ కించన॥
దర్శితం యదనేనైవ జ్ఞానం తద్వై సురర్షిణామ్।
యద్వైదర్శితవానేష కస్తదన్వేష్టు మర్హతి ॥
సర్వాణి సర్వాన్సర్వాంశ్చ భగవానే వ సోఽబ్రవీత్।
యదా యత్క్రియతే యేన తదా తత్సభిమన్యతే॥
యేనేదం క్రియతే పూర్వం తదన్యేన విభావితమ్॥
యదా తు క్రియతే కించిత్కేన చిద్వాఙ్మయం క్వచిత్।
తేనైవ తత్కృతం పూర్వం కర్తౄణాం ప్రతిభాతి వై॥
విరక్తం చాతిరిక్తం చ జ్ఞానాజ్ఞానే ప్రియాప్రియే।
ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మృత్యుశ్చామృతమేవ చ॥
ఊర్థ్యం తిర్యగధోభాగ స్తస్యైవా దృష్టకారణమ్ ॥
మరలనది ప్రణవమునందు (ఓంకారమునందు) ఉండినదై భూర్భువస్వ అనువ్యాహృతుల రూపమున నుండును. ఋగ్యజుస్సామాథర్వరూపియైన బ్రహ్మకు నమస్కారము-108. జగత్తు యొక్క ప్రళయ ఉత్పత్తులందు కారణమని గుర్తింపబడినదియు మహత్తుకంటే పరమమైనదియు రహస్యమైనదియు నైన యా సుబ్రహ్మకు నమస్కారము-109. అగాధమై యపరమై యక్షయ్యును, జగత్తును సంమోహింపజేయుటకు నిలయమైన వాడును ప్రకాశప్రవృత్తులతో పురుషార్థముల ప్రయోజనమునము గలవాడునైన యాసుబ్రహ్మకు నమస్కారము-110. దేహవిలక్షణమైన యాత్మజ్ఞానముగలవారికి ఒకయునికి రూపమైన ప్రాప్తి స్థానము, ఆత్మకు సంగమునిచ్చునదియు అవ్యక్తమైనదియు, యమృతమైనదియు శాశ్వతమైనది ప్రకృతి బ్రహ్మ-111, అది ప్రధానము, ఆత్మయోని, గుహ్యము, సత్యము అనిపిలువబడును. అట్లే విభాగములేనిది, శుక్రస్వరూపము, అక్షరము, బహువాచకమును (అనేకమును చెప్పునది) నైన యాపరబ్రహ్మకు నిత్యము నమస్కారములు జేయుదును-112. పనిచేయబడగా క్రియయుండదు. చేయనప్పుడు గూడ క్రియయుండదు. (చేయని క్రియయుండదు). క్రియభూత కాలమైనప్పుడు వర్తమానమున క్రియయుండదు. అట్లే క్రియ భవిష్యమైనప్పుడు గూడ వర్తమానమున నుండదు. ఒక్కమారే యంతము జేయబడినది. కావున నది భూతకాల దృష్టితో కృతము భవిష్యత్కాల దృష్టితో అకృతమును అగుచున్నది-113. వినదగినది (భవిష్యత్)గాని, వినబడినది (భూతము)గాని యట్లే సాధువుగాని, తెలియగినదిగాని, మననము జేయదగినదిగాని, తాకదగినదిగాని, భుజింపదగినదిగాని, చూడదగినదిగాని, వినదగినదిగాని తెలియదగినదిగాని యేదైనయుండినచో-114, ఆ బ్రహ్మరుల జ్ఞానము. చూపబడినది. చూపబడిన యాజ్ఞానమును మరలనెవ్వడు వెదకును? భగవంతుడైన వాడే పుం - స్త్రీ వస్తురూపమైన (యన్నింటిని అందరిని) చెప్పెను-115. ఒకచే నొకపని చేయబడినపుడు దానిని వాడభిమానించును. ఒకనిచే పూర్వము చేయబడినది మరొకనిచే భావింపబడును-116. ఒకానొకచోట ఒకనిచే ఒక వాజ్మయము రచింపబడినపుడు పూర్వ మది యాతని చేత చేయబడియుండినదై యాకర్తకు సంబంధించినదిగానే ప్రకాశించును-117. విరక్తమును, యవిరక్తమును, జ్ఞానాజ్ఞానములును, ప్రియాప్రియములును, ధర్మాధర్మములును, సుఖదుఃఖములును, మృత్యువు అమృతమును, పైన అడ్డము, క్రిందయును ఆతని కోసం బంధించిన యదష్టమే కారణముగా గలది.
స్వాయంభువోఽ థజ్యేష్ఠస్య బ్రహ్మణః పరమేష్ఠినః।
ప్రత్యేకవిద్యం భవతి త్రేతాస్విహ పునః పునః
వ్యస్యతే హ్యేకవిద్యం తద్ద్వాపరేషు పునః పునః।
బ్రహ్మాచైతదువాచాదౌ తస్మిన్వైవస్వతేఽ తరే॥
ఆవర్తమానా ఋషయో యుగాఖ్యాసు పునః పునః।
కుర్వంతి సంహితాహ్యేతే జాయమానాః పరస్పరమ్॥
అష్టాశీతి సహస్రాణి శ్రుతర్షీణాం స్మృతాని వై ।
తా ఏవ సంహితా హ్యేతే ఆవర్తంతే పునః పునః ॥
శ్రితాదక్షిణపంథానం యే శ్మశానాని భేజిరే।
యుగే యుగే తు తాః శాఖాః వ్యస్యంతే తైః పునః పునః॥
ద్వాపరేష్వివ సర్వేషు సంహితాశ్చ శ్రుతర్షిభిః ।
తేషాం గోత్రేష్విమాః శాఖా భవంతీహ పునః పునః
తాః శాఖాస్తత్ర కర్తారో భవంతీహ యుగక్షయాత్॥
ఏవమేవ తు విజ్ఞేయం వ్యతీతానాగతేష్విహ।
మన్వంతరేషు సర్వేషు శాఖా ప్రణయనాని వై॥
అతీతేషు అతీతాని వర్తంతే సాంప్ర తేషుచ ।
భవిష్యాణి చ యాని స్యుర్వర్ణ్యం తేనాగతేష్వపి॥
పూర్వేణ పశ్చిమం జ్ఞేయం వర్తమానేన చోభయమ్।
ఏతేన క్రమయోగేన మన్వంతర వినిశ్చయః ॥
సప్తర్షయో మనుశ్చైవ సంతానార్థం వ్యవస్థితాః॥
ప్రజార్థం తపతిం తేషాం తపః పరమదుశ్చరమ్।
ఉత్పద్యంతీహ సర్వేషాం నిధనేష్విహ సర్వశః॥
దేవాసురాః పితృగణామునయో మనవస్తథా।
సర్పాభూతాః పిశాచాశ్చ గంధర్వా యక్షరాక్షసాః ॥
తతస్తేషాం తు యేశిష్టా శిష్టాతాన్ ప్రచక్షతే।
సప్తర్షయో మనుశ్చైవ ఆదౌ మన్వంతరస్యహ।
ప్రారభంతే చ కర్మాణి మనుష్యా దేవతైః సహ॥
మన్వంతరాదౌ ప్రాగేవ త్రేతాయుగముఖే తతః।
పూర్వం దేశాస్తతస్తే వై స్థితే ధర్మే తు సర్వశః॥
ఋషీణాం బ్రహ్మచర్యేణ గత్వా నృత్యంతు వై తతః
పితౄణాం ప్రజయా చైవ దేవానామిజ్యయా తథా॥
పూర్వం దేవేషు తేష్వేవ స్వర్గాయ ప్రముఖే చ।
పూర్వం దేవాస్తతస్తే వై స్థితాధర్మేణ కృత్స్నశః॥
మన్వంతరే పరావృత్తే స్థానాన్యుత్సృజ్య సర్వశః।
మంత్రైః సహోర్ధ్వం గచ్ఛంతి మహర్లోకమనామయమ్॥
వినివృత్తవికారాస్తే మానసీం సిద్దిమాస్థితాః।
అవేక్షమాణా వశినస్తిష్ఠంత్యా భూతసంప్లవమ్॥
దేవతలను ఋషులను లెక్కించుటలో నిష్ణాతులైన బ్రాహ్మణులచేత ఆ సంఖ్యలు నిండు ముప్పది కోట్లుగా లెక్కింపబడినవి-138. అట్లే తక్కినవి లేక్కలో అటువది యేడు లక్షల యిరువదివేలు. ఈ కాలము అధికములను విడిచి లెక్కింపబడినది-139. ఈ మన్వంతరసంఖ్య మానుషగణనలో జెప్పబడినది. దివ్యవత్సరముతో మనువు యొక్క యంతరమును జెప్పెదను-140. దివ్యసంఖ్యలో నెనిమిది వందలు అని చెప్పబడినది. అట్లే తక్కినవి యేబది. రెండువేలధికములని చెప్పబడినది-141. ఈ కాలము నాలుగింతలైనచో అది ఆభూత సంప్లవము. (భూతముల ప్రళయము). అది నిండుగా వేయి యుగములగును. అది బ్రహ్మకొక దీనమనబడినది-142. అధిభూత సంప్లవమున సూర్యకిరణములతో నన్నిభూతములు కాలిపోయినవై బ్రహ్మను ముందడుకొని దేవ-ఋషి-దానవులతోబాటు,దేవశ్రేష్ఠుడు దేవదేవుడునైన మహేశ్వరునిలో బ్రవేశించును. ఆతడు (మహేశ్వరుడు) కల్పాదులలో మరల మరల సర్వభూతములను సృష్టించువాడు. అని యిది దేవర్పులతోబాటు మనువుయొక్క స్థితికాలము-144. సర్వమన్వంతరముల త్రిసంధిని వినుడు. ఈ విషయమున నాలో యుగమను పేరుతో బూర్వమే చెప్పబడినది-145. కృతవ్రేతాదులతోగూడినది చతుర్యుగమనబడినది. అది యిరువది యొక్క మారులు తిరుగుతు వచ్చినది. సాధికము ప్రభువైన భగవంతుడు (దీనిని) మనువుయొక్క యధికారముగా జెప్పెను 146. ఈ విధముగ భూత- భవిష్యత్తులైన మన్వంతరముల లక్షణము, వర్తమానముతో జెప్పబడినది-147. అని యిది స్వాయంభువమనువు యొక్క సృష్టి చెప్పబడినది. దానియొక్కయు వేరొకదానియొక్కయు త్రిసంధిని జెప్పెదను-148. మన్వంతరము యథాపూర్వముగనే ఋషులతోను దేవతలతోను గూడ అవశ్యంభావి (తప్పనిసరిగా జరుగు) అర్థము (విషయము)తో సంబద్ధమై నివర్తించును-149. ఈ మన్వంతరమున పూర్వము త్రైలోక్యమున కీశ్వరులైన సప్తర్షులు, దేవతలు, పితరులు, మనువులును మన్వంతరకాలము సంపూర్ణముగాగానే సాధకులును క్షీణాధికారులై యాత్మయొక్క ప్రతిరూపమును దెలిసినవారై వారందరు మహర్లోకమునకు ఉన్ముఖులై గమనమునకు బూనుకొందురు-151. తజువాత నా మన్వంతరమున ప్రక్షీణులైన యాదేవతలు స్థితికాలము సంపూర్ణముగా ఒక కృతయుగము (వరకు) ఉందురు-152. మన్వంతరేశ్వరులు న్నంతవరకు దేవతలు, పితరులు, ఋషులు మనువును పుట్టుచుందురు. పుట్టబోవుచుందురును-153. మన్వంతరము సంపూర్ణమైనప్పుడు మడొక కలియుగము వచ్చినచో (చీవర కలియుగమేర్పడినచో) అప్పుడు కలితో మిగిలియున్న (కలిశేషించియున్న) యుగములో (చివరి కలియుగములో) కృతయుగ (లక్షణ)ము సంపన్నమగును-154. బుధులు కృతయుగము యొక్క సంతానమును కలి పూర్వకముగా (కలియుగము తనకు పూర్వయుగమైనట్లుగా జెప్పుదురు. అట్లే మన్వంతరముల చివరలలో (కలియున్నదై రానున్న మన్వంతరములకు ఆదియగును (కల్యాదియగును)-155. పూర్వమన్వంతరము క్షీణించి మరొక మన్వంతరము రాగా పూర్వమన్వంతరపు చివరి కలియుగమున మిగిలియున్న సప్తర్షులు, మునులు మన్వంతర సమాప్తి కాలమును జూచుచున్నవారై మరొక మన్వంతరమునకై ప్రతీక్షించుచు తపస్సులో నుండి క్షీణింతురు. మరొక మన్వంతర ప్రారంభమున మన్వంతర వ్యవస్థ కొఱకును అంతట సంతతి కొఱకును పూర్వము వలెనే (పూర్వయుగములో వలెనే) సృష్టిలో ప్రైవర్తింతురు. వృష్టి సృష్టి ప్రవర్తింపగా 156, 157, 158 జంటలు సృష్టింపబడగా, ఓషధులు బుట్టగా, అచ్చటచట ప్రజలు వారి గృహములు నెలకొనగా 159 జీవనోపాయము లేర్పడగా, ఋషులు భావించిన సద్ధర్మములు ప్రవర్తిల్లినవి. అంతకుముందు లోకము నిరానందమైపోయినది. స్థావరజంగమములు నష్టమైనవి- 160. గ్రామ నగరములులేవు. వర్ణాశ్రమములు వదిలివేయబడినవి. ఇట్టి పూర్వమన్వంతరము శేషించినపుడు (చివరనున్నపుడు) ఉన్నటువంటి ధార్మికులు, సప్తర్పులు, మనువును సంతానార్థముగా నెలకొనియుండిరి-161. సంతానమునకై మిక్కిలి సాధ్యమైన తపము నాచరించు వారందరికిని మరణములందు ఇటనంతటను 162 దేవాసురులు, పితృగణములు, మునులు, మనువులు, అట్లే సర్పములు, భూతములు, పిశాచములు, గంధర్వులు యక్షులు, రాక్షసులును బుట్టుదురు-163. తరువాత వారికి మిగిలిన -శిష్టులు శిష్టాచారములను జెప్పుదురు. మన్వంతరము యొక్క ప్రారంభమున సప్తర్పులు మన్వంతరముయొక్క ప్రారంభమున సప్తర్షులు, మనువును కర్మల నారంభింతురు. మనుష్యులు దేవతలతోబాటు కర్మలు చేయుదురు-164. మన్వంతరాదిలో ముందే త్రేతాయుగ ప్రారంభమున మొదట దేవతలు, తరువాత మనుష్యులును అన్ని విధముల ధర్మములును ఉండినవి 165. బ్రహ్మచర్యము (వేదాధ్యయనము)చే ఋషుల ఋణము దీర్చుచుండిరి. సంతానముతో పితరుల ఋణమును దీర్చుచుండిరి. యాగముతో దేవతల ఋణమును దీర్చుచుండిరి-166 పూర్వము స్వర్గము కొరకు ప్రముఖులైన దేవతలలోను మనుష్యులలోను ముందు దేవతలును తరువాత మనుష్యులును ధర్మముతోనే యంతట నుండిరి-168. మన్వంతరము తీరిపోగా వారు అంతటను స్థానములను వదిలి, మంత్రములతో గూడ ఆరోగ్యవంతమైన యూర్థ్వలోకమైన మహర్లోకమునకు బోవుదురు-169. వికారములు పోయినవారై వారు మానస సిద్దియందున్నవారై, ముందును ఎదిరి చూచుచున్నవారై తమ యింద్రియములను తమను వశమునందుంచుకొన్నవారై వారు భూత ప్రళయము వరకు ఉంటున్నారు.
తతస్తేషు వ్యతితేషు సర్వేష్వేతేషు సర్వదా।
శూన్యేషు దేవస్థానేషు త్రైలోక్య తేషు సర్వశః।
ఉపస్థితా ఇహైవాన్యే దేవా యే స్వర్గవాసినః॥
తతస్తే తపసా యుక్తాః స్థానాన్యాపూరయంతి వై।
సత్యేన బ్రహ్మచర్యేణ శ్రుతేన చ సమన్వితాః॥
సప్తర్షీణాం మనోశ్చైవ దేవానాం పితృభిః సహ।
నిధనానీహ పూర్వేషామాదినా చ భవిష్యతా॥
తేషామత్యంతవిచ్ఛేద ఇహ మన్వంతర క్షయాత్।
ఏవం పూర్వానుపూర్వేణ స్థితిరేషానవస్థితా॥
మన్వంతరేషు సర్వేషు యావదాభూత సంప్లవమ్॥
ఏవం మన్వంతరాణాం తు ప్రతిసంధాన లక్షణమ్।
అతీతానాగతానాం తు ప్రోక్తం స్వాయంభువేన తు॥
మన్వంతరేప్వతీతేషు భవిష్యాణాం తు సాధనమ్।
ఏవమత్యంత విచ్ఛిన్నం భవత్యా భూతసంప్లవమ్॥
మన్వంతరాణాం పరివర్తనాని ఏకాంతతస్తాని మహర్గతాన్ని।
మహర్జనం చైవ జనం తపశ్చ ఏకాంతగాని స్మ వసంతి సత్యే॥
తద్బావినాం తత్ర తు దర్శనేన నానాత్వదృష్టేన చ ప్రత్యయేన ।
సత్యే స్థితానీహ తదా తు తాని ప్రాప్తే వికారే ప్రతిసర్గకాలే॥
మన్వంతరాణాం పరివర్తనాని ముంచంతి సత్యం తు తతోఽ పరాంతే
తతోఽభియోగాద్విషమ ప్రమాణం విశంతి నారాయణమేవ దేవమ్॥
మన్వంతరాణాం పరివర్తనేషు చిరప్రవృత్తేషు విధిస్వభావాత్।
క్షణం రసం తిష్ఠతి జీవలోకః క్షయోదయాభ్యాం పరివందమానః।
ఇత్యుత్తరాణ్యేవ మృషిస్తుతానాం ధర్మాత్మనాం దివ్యదృశాం మనూనామ్।
వాయుప్రగీతాన్యు ఫలభ్యదృశ్యం దివ్యౌజసా వ్యాససమాసయోగైః ॥
సర్వాణిరాజర్షిసురర్షిమంతి బ్రహ్మర్షి దేవోరగవంతి చైవ।
సురేశసప్తర్షి పితృప్రజేశైర్యుక్తాని సమ్యక్ పరివర్తనాని॥
ఉదారవంశాభిజన ద్యుతీనాం ప్రకృష్టమేధాభి సమేధితానామ్।
కీర్తిద్యుతి ఖ్యాతిభిరన్వితానాం పుణ్యం హి విఖ్యాపనమీశ్వరాణామ్।
స్వర్గీయ మేతత్పరమం పవిత్రం పుత్రీయమేతచ్చ పరం రహస్యమ్ ।
జప్యం మహత్పర్వసు చైతదగ్య్రం దుఃస్వప్న శాంతిః పరమాయుషేయమ్॥
ప్రజేశదేవర్షిమను ప్రధానం పుణ్యప్రసూతిం ప్రథితామజస్య।
మమాపి విఖ్యాపనసంయమాయ సిద్ధిం జుషద్వం సుమహేశ తత్త్వమ్॥
ఇత్యేతదంతరం ప్రోక్తం మనోః స్వాయంభువస్య తు।
విస్తరేణానుపూర్వ్యా చ భూయః కిమ వర్ణయామ్యహమ్ ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే ప్రజాపతి వంశానుకీర్తనం నామైక షష్టితమోఽధ్యాయః॥
శ్రీమద్వాయుపురాణే పూర్వార్ధం సమాప్తమ్॥
తరువాత ఆ యుగములు గడచిపోగా, వానిలోని యా వారందరును గడచిపోగా, త్రైల్యోక్యమున నంతటను ఆ దేవస్థానములు శూన్యములు గాగా, స్వర్గవాసులైన దేవతలు ఇతరులును ఇచటనే (భూలోకమునను) యున్నారు-171. తరువాత వారు తపస్సుతో గూడినవారై సత్యముతోను, బ్రహ్మచర్యముతోను, వేదముతోను గూడినవారై యా స్థానములను పూరింతురు-172. పూర్వులైన సప్తర్షులకును, మనువునకును, పితరులతోబాటు దేవతలకును భూతకాలము చేతను భవిష్యత్కాలము చేతను నిటనిధనములు (మరణములు) గలుగును-173. మన్వంతర క్షయమువలన వారికీట మరణము గలుగును. ఈ విధముగ పూర్వము ననుసరించి వానియొక్క స్థితి స్థిరమైనది కాదు. ఇది యన్ని మన్వంతరములలోను భూత ప్రళయమువరకు ఉండును-174. ఈ విధముగా స్వాయంభువమనువు చేత భూత భవిష్యత్కాలములోని మన్వంతరముల ప్రతి సంధాన (కలయిక) లక్షణము చెప్పబడినది-175. మన్వంతరములు గడచిపోవగనే భవిష్య మన్వంతరములకు సాధనము (రప్పించు సాధనము) భూత ప్రళయమువరకు పూర్తిగా విచ్చిన్నమయి యుండును-176. మన్వంతరముల పరివర్తనములు (మార్పులు) ఏకాంతముగా (రహస్యముగ) మహర్గతములగును (మహాలోకమున నుండును). మహస్సు (మహాలోకమును) జననము (జనోలోకమును). జనము (జనోలోకము) తపస్సును (తపోలోకమును) అది సత్యమున (సత్య లోకమున నేకాంతముగ జేరియుండును. (ఏడులోకములు పూర్వపూర్వములు ఉత్తరోత్తర లోకములలో నేకాంతముగ నుండును-177. వానిని (లోకములను) భావించువారు వానినచటజూచుటచేతను, నాసాత్వముచేత జూడబడిన జ్ఞానము మన్వాది సృష్టి ప్రతిసర్గ కాలమున వికారము ప్రాప్తింపగా నవి (ఆలోకములు) యపుడు సత్య(లోక)ము నందుండును 178. పరాంతకాలమున మన్వంతర పరివర్తనములు సత్య (లోక)మును వదిలివేయును. తరువాత అభియోగము వలన విషమ ప్రమాణుడైన నారాయణదేవునిలోనే ప్రవేశించును-179. విధి స్వభావము వలన మన్వంతర పరివర్తనములు చాలకాలమునకు బ్రవర్తిల్లగా జీవలోకము క్షయ- అభివృద్దులతో తిరుగుచు క్షణకాలము ఆనందముగా నుండును-180. అనునివి ఋషులచే స్తుతింపబడిన ధర్మాత్ములై దివ్యదృష్టి గల మనువులయొక్క సమాధానములు వాయుదేవునిచే విస్తార సంగ్రహములుగా రచింపబడిన యీ సమాధానములు దివ్యతేజస్సుతో జూడదగినవి-181. అవి యన్నియు యుగములు రాజర్షులతోను దేవర్చులతోను గూడినవి. బ్రహ్మర్పులతోను, దేవతలతోను ఉరగులతోను గూడినవి. ఇంద్రుని చేతను, సప్తర్షులచేతను, పితృదేవతల చేతను రాజులచేతను కూడినవి. చక్కని పరివర్తనములు గలవి-182. ఇది (వాయు పురాణము) గొప్పనైన వంశము, కులము, కాంతియు గలవారును, గొప్పనైన మేధాశక్తితో వృద్ధిచెందినవారును, కీర్తి-కాంత్-ఖ్యాతులతో గూడిన వారునునైన యీశ్వరుల (ప్రభువుల) యొక్కయు ప్రవచనము పుణ్యమైనది గదా!-183. ఇది (వాయు పురాణము) స్వర్గమునిచ్చునది. పవిత్రమైనది, పుత్రులనిచ్చునది. మిక్కిలి రహస్యమైనది. (పరబ్రహ్మమే రహస్యములుగా గలది). మహా పర్వములలో జపించదగినది శ్రేష్ఠమైనది. దుఃస్వప్న శాంతికమైనది. పరమాయుష్యమిచ్చునది-184. రాజులు, దేవర్షులు, మనువు ప్రధానముగా గలిగి ప్రసిద్ధమైన బ్రహ్మయొక్క పుణ్య ప్రసూతిని (సృష్టిని) ఈ వాయు పురాణమున చెప్పినది. దీని ప్రవచన వ్రతమునకై నాయొక్క సిద్ధిరూపమైన చక్కని మహేశ్వరతత్యమును ఓ మునులారా! మీరు పొందుడు-185. అని యీ విధముగ ఆనుపూర్వితో విస్తరముగ స్వాయంభువ మన్వంతరము చెప్పబడినది. ఇంకను నేనేమి చెప్పవలెను?
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ప్రజాపతి వంశానుకీర్తనమను నలువదియొకటవ యధ్యాయము.
ఇది శ్రీమద్వాయుపురాణమున పూర్వార్థము సమాప్తము.