వాయు మహా పురాణము
17 - పరమాశ్రమ కథనం
వాయురువాచ :-
ఆశ్రమ త్రయముత్సృజ్య ప్రాప్తస్తు పరమాశ్రమమ్ ।
అతః సంవత్సరస్యాన్తే ప్రాప్యజ్ఞాన మనుత్తమమ్ ॥
అనుజ్జాప్య గురుం చైవ విచరేత్పృథీం మిమమ్ ।
సారభూతముపాసీత జ్ఞానం యద్ జ్ఞేయసాధకమ్॥
ఇదం జ్ఞానమీదంజ్ఞేయమితి యస్తుషితశ్చరేత్ ।
అపికల్పసహస్రాయుర్నైవ జ్ఞేయమవాప్నుయాత్॥
త్యక్తసజ్గో జితక్రోధో లఘ్వాహారోజితేన్ద్రియః।
పిధాయ బుద్ధ్యా ద్వారాణి ధ్యానే హ్యేవం మనో దధీత్॥
శూన్యేష్వేవావకాశేషు గుహాసు చ వనే తథా ।
నదీనాం పులినే చైవ నిత్యం యుక్తః సదా భవేత్॥
వాగ్దణ్డాః కర్మదణ్డశ్చ మనోదణ్డశ్చ తే త్రయః ।
యస్యైతే నియతా దణ్డాః స త్రిదణ్డీ వ్యవస్థితః॥
అవస్థితో ధ్యానరతిర్జితేన్ద్రియః శుభాశుభేహిత్య చ కర్మణీ ఉభే ।
ఇదం శరీరం ప్రవిముచ్య శాస్త్రతో న జాయతే మ్రియతే వా కదాచిత్॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్త రమాశ్రమ ప్రాప్తికథనం నామ
సప్తదశోఽధ్యాయః ॥
వాయువు పలికెను:- మూడోశ్రమములను (బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థములను) వదిలి,పరమాశ్రమమైన ‘భిక్షా’ ఆశ్రమమును బొంది, తరువాత సంవత్సరానమున ఉత్తమోత్తమమైన (దీనికన్న మరొక యుత్తమములేనిది) జ్ఞానమును బొందవలేను-1. తరువాత గురువుగారికి తెలిపి ఈ భూమినంతయు తిరుగవలెను. అసలు జేయమైన పరమాత్మను తెలిసికొనుటకు సాధనమైన సారభూతమైన జ్ఞానమును పాటింపవలెను-2. ఇది జ్ఞానము. ఇది యము అని సంతుష్టిజెంది తిరుగువాడు కల్పసహస్రమైన యాయువుగలవాడైనను జ్ఞేయమును బొందలేడు-3. సంగమును త్యజించి, క్రోధమును జయించి, అల్పాహారియై యిద్రియములను జయించి, బుద్ధిచే ద్వారములన్నియు మూసివైచి, మనస్సును ధ్యానమున నిలువ వలెను-4. శూన్యములై నిర్జన ప్రదేశములందు, గుహలయందు వనమునందును, నదులయొక్క యిసుకతిన్నెలందును నిత్యము యోగయుక్తుడుగావలెను-5. వాక్కు అను దండము, కర్మయను దండము, మనస్సు అనుదండము- అనునవి మూడు దండములు. ఈ మూడు దండములు నియతముగా గలవాడు త్రిదండిగా పరిగణింపబడును-6, నిశ్చలముగా నున్నవాడు, ధ్యానమునందాసక్తుడైనవాడు, ఇంద్రియములజయించినవాడు, శుభములును అశుభములునైన రెండు కర్మలను త్యజించి, ఈ శరీరమును వాడు శాస్త్ర ప్రకారంగా ఎప్పుడుగూడ పుట్టడు చావడు-7.
ఇది వాయుమహాపురాణమున పరమాశ్రమ ప్రాప్తికథనమను పదునేడవ యధ్యాయము.