23 - మాహేశ్వరావతారయోగో

వాయురువాచ:-

 ఏకత్రింశత్తమః కల్పః పీతవాసా ఇతి స్మృతః

 బ్రహ్మా యత్ర మహాతేజాః పీతవర్ణత్వమాగతః

ధ్యాయతః పుత్రకామస్య బ్రహ్మణః పరమేష్ఠినః

ప్రాదుర్భూతో మహాతేజాః కుమారః పీతవస్త్రవాన్

పీతగన్ధానులిప్తాంగః పీతమాల్యధరో యువా

పీతయజ్ఞోపవీతశ్చ పీతోష్ణీషో మహాభుజః

వాయువు పలికెను:- ముప్పదియొకటీ యవకల్పము పీతవాసకల్పమనబడినది. అచట మహతేజుడైన బ్రహ్మపీత(పసుపు) వర్ణమును బొందెను-1. పుత్రకాముడై ధ్యానము జేయుచున్న యాపరమేష్ఠియైన బ్రహ్మకు మహాతేజస్వియై పసుపు వస్త్రము ధరించిన కుమారుడు పుట్టెను-2. అతడు పసుపు గంధమును చూసికొన్నయంగములు గలవాడు. పసుపు మాలలు ధరించినవాడు యువకుడు పసుపుయజ్ఞోపవీతమును ధరించినవాడు. పసుపుతలపాగా గలవాడు, మహాభుజములు గలవాడు-3,

తం దష్ట్వా ధ్యానసంయుక్తం బ్రహ్మాలోకేశ్వరం ప్రభుమ్

 మనసా లోకధాతారం వవన్ దే పరమేశ్వరమ్

తతో ధ్యానగతస్తత్ర బ్రహ్మా మాహేశ్వరీం పరామ్

 అపశ్యద్గాం విరూపాం చ మహేశ్వరముఖచ్యుతామ్

చతుష్పదాం చతుర్వక్త్రాం చతుర్హస్తాం చతుఃస్తనీమ్

చతుర్నేత్రాం చతుఃశృంగీం చతుర్దంష్ట్రాం చతుర్ముఖీమ్

 ద్వాత్రింశల్లోక సంయుక్తామిశ్వరీం సర్వతో ముఖీమ్

ప్రభువును అయిన యాలోకేశ్వరుని జూచి బ్రహ్మ మనస్సుతోనే యాలోకస్రష్టయయిన పరమేశ్వరుని నమస్కరించెను 4. తరువాత బ్రహ్మధ్యానమునందుండి పరాస్వరూపిణియు మహేశ్వర ముఖమునుండి వెలువడి మాహేశ్వరియై విశిష్టరూపము గల గోవును చూచేను-5. ఆ గోవు నాలుగు పాదములు గలది నాలుగు నోళ్లు గలది. నాలుగు చేతులు గలది నాలుగు స్తనములు గలది. నాలుగు నేత్రములు గలది. నాలుగు కొమ్ములుగలది. నాలుగు కోరలు గలది. నాలుగు ముఖములు గలది. ముప్పది రెండు లోకములతో గూడుకొన్నది. సర్వతోముఖ (అన్ని వైపుల ముఖములు గలది.) మైనది సర్వాధికారిణియైన యీశ్వరియైనది-6.

స తాం దృష్ట్యామహాతేజాః మహాదేవీం మహేశ్వరీమ్

పునరాహ మహాదేవః సర్వదేవ నమస్కృతః

 మతః స్మృతిర్బుద్ధిరితి గాయమానః పునఃపునః

ఏహ్యేహీతి మహాదేవ సోత్తిష్ఠత్ప్రాంజలిర్భృశమ్

 విశ్వమావృత్యయోగేన జగత్సర్వంవశంకురు

 అథవా మహాదేవేన రుద్రాణీ త్వంభవిష్యసి

బ్రాహ్మణానాం హితార్థాయ పరమార్థం భవిష్యసి

సర్వదేవతలచే నమస్కరింప బడినవాడు మహాతేజోవంతుడు అయిన మహాదేవుడు హహేశ్వరియైన యామహాదేవిని జూచి మరల బలికెను-7. మతిస్మృతి బుద్ధి అని మాటిమాటికి గానము జేయుచుండెను మరలమరల రారమ్మనెను. ఆమహాదేవి కూడ చేతులు జోడించి మ్రిక్కిలి ఎక్కువగా పైకి లేచెను-8. యోగముచే విశ్వమునావరించి జగత్తునంతయు వశము జేసికొనుము (జేసికొందువు) లేదా మహాదేవునిచే నీవు రుద్రాణివి (రుద్రుని భార్యవు) అగుదువు బ్రాహ్మణుల హితముకొజుకు పరమార్థమవగుదువు-9.

అథైనాం పుత్రకామస్య ధ్యాయతః పరమేష్ఠినః

ప్రదదౌ దేవదేవేశ శ్చతుష్పాదాం మహేశ్వరీమ్

తతస్తాం ధ్యానయోగేన విదిత్వా పరమేశ్వరీమ్

బ్రహ్మాలోకనమస్కార్యః ప్రపద్యతాం మహేశ్వరీమ్

 గాయిత్రీం తతో రౌద్రీం ధ్యాత్వా బ్రహ్మా సుయన్ త్రితః

 ఇత్యేతాం వైదికీం విద్యాం రౌద్రీం గాయత్రీమర్పితామ్

 జపిత్వా తు మహాదేవీం రుద్రలోక నమస్కృతామ్

ప్రపన్నస్తు మహాదేవం ధ్యానయుక్తేన చేతసా

ఆ తరువాత పుత్రకాముడైయీమెను ధ్యానము జేయుచున్న పరమేష్ఠికి దేవదేవేశుడు నాలుగు పాదములు గల మహేశ్వరినిచ్చెను తరువాత ధ్యానయోగముతో నామెను పరమేశ్వరిగా దెలిసికొన్న లోకనమస్కార్యుడగు బ్రహ్మయామహేశ్వరిని పొందెను. తరువాత చక్కని నియమబద్దుడై గాయత్రిని రౌద్రిని ధ్యానించెను.11 అని యీ విధముగా వైదిక విద్యారూపిణిని దేవదేవేశునిచే నర్పింపబడిన (ఈయబడిన) గాయత్రీరూపిణియైన రౌద్రీరూపిణిని కావుననే రుద్రలోకనమస్కృతమైన మహాదేవిని జపించెను. తరువాత ధ్యానయుక్తమైన చిత్తముతో మహాదేవుని బొందెను.12

తతస్తస్య మహాదేవో దివ్యం యోగం పునః స్మృతః

 ఐశ్వర్యం జ్ఞానసం పత్తిం వైరాగ్యం చ దదౌ పునః

 అథాట్టహాసం ముముచేంనీషణం దీప్తమిశ్వరః

తతోఽస్య సర్వతో దీప్తాః ప్రాదుర్భూతాః కుమారకాః

పీతమాల్యాంబరధరాః పీతగన్ద విలేపనా

 పీతోష్ణీష శిరస్కాశ్చపీతాస్యాః పీతమూర్ధజాః

 తతో వర్షసహస్రాన్తే ఉషిత్వా విమలౌజసః

యోగాత్మాన స్తతః స్నాతా బ్రాహ్మణానాం హితైషిణః

 ధర్మయోగబలోపేతా ఋషీణాం ధీర్ఘసత్రిణామ్

 ఉపదిశ్య తు తే యోగం ప్రవిష్టా రుద్రమీశ్వరమ్

 ఏవమేతేన విదినా ప్రపన్నాయై మహేశ్వరమ్

 అన్యేఽపి నియతాత్మానోధ్యానయుక్తా జితేంద్రియాః

 తే సర్వే పాపముత్సృజ్య విరజా బ్రహ్మవర్చసః

 ప్రవిశన్తి మహోదేవం రుద్రం తేత్వపునర్భవాః

తరువాత మహాదేవుడు అతనికై (బ్రహ్మాకై) మరల తన దివ్యయోగమును స్మరించెను. అట్లు స్మరించి యైశ్వర్యమును, జ్ఞాన సంపదను వైరాగ్యమును గూడ నిచ్చెను-13. ఆ తరువాత ఈశ్వరుడు భయంకరమై యుజ్జ్వలమైన అట్టహాసమును (పెద్దనవ్యును) జేసెను. (నవ్వెను) ఆ నవ్వు నుండి అన్ని వైపుల వెలుగుల విరజిమ్మిన కుమారకులు పుట్టిరి-14. వారు పసుపుపచ్చని మాలలు వస్త్రములు ధరించినవారు పసుపు గంధములు పై పూతలును పూసికొన్నవారు. పసుపురంగు తలపాగాలు గలిగి పసుపు పచ్చని ముఖములు శిరోజములు (తలవెంట్రుకలు) గలవారు-15. తరువాత వేయి సంవత్సరముల చివర వరకు ఉండి యావిమల తేజోవంతులు, యోగాత్ములు నైనవారు బ్రాహ్మణుల హితమును గోరిన వారై స్నానము జేసిరి-16. వారు ధర్మబలమును యోగబలమును గలవారై దీర్ఘసత్రయాగముజేయు ఋషులకు యోగమునుపదేశించి రుద్రుడైన యీశ్వరునిలో బ్రవేశించిరి-17. ఈ విధానములతో మహేశ్వరుని బొందినవాడును తక్కిననియమబద్దమైన యాత్మలు గల వారును ధ్యానయుక్తులై యింద్రియముల జయించిరి. వారందరు పాపములను వదలి బ్రహ్మతేజోవంతులై పునర్జన్మలేనివారై రుద్రుడైన మహాదేవునిలో బ్రవేశించిరి-18,19.

వాయురువాచ:-

తతస్తస్మిన్ గతే కల్పే పీతవర్ణే స్వయంభువః

 పునరన్యః ప్రవృత్తస్తు సితకల్పో హి నామతః

ఏకార్ణవే తదావృత్తే దివ్యే వర్షసహస్రకే

 స్రష్టుకామః ప్రజాబ్రహ్మా చిన్తయామాస దుఃఖితః

 తస్య చిన్తయమానస్య పుత్రకామస్య వై ప్రభోః

 కృష్ణః సమవద్వర్ణో ధ్యాయతః పరమేష్ఠినః

అథాపశ్యన్మహాతేజాః ప్రాదుర్భూతం కుమారకమ్

కృష్ణవర్ణం మహావీర్యం దీప్యమానం స్వతేజసా

 కృష్ణాంబరవరోష్ణీషం కృష్ణయజ్ఞోప వీతినమ్

కష్ణేన మౌలినీయుక్తం కృష్ణసగను లేపనమ్

వాయువు పలికెను:- తరువాత ఆ పసుపుపచ్చని కల్పము గడచిపోగా స్వయంభువుడగు బ్రహ్మనుండి సితకల్పుడను పేర మరోకడు బయలు దేరెను-20. అపుడు సమస్తము ఏకసముద్రముగా నయినది. దీవ్యములైన వేయియేండ్లు గడచినవి. దుఃఖితుడయిన బ్రహ్మ ప్రజలను సృష్టింపదలచి చింతించెను. (ధ్యానించెను)-21. ఆ విధముగా ధ్యానించుచున్న పుత్రకామియై ప్రభువగు బ్రహ్మయొక్క వర్ణము నల్లని వర్ణమయ్యెను-22. తరువాత ఆ మహాతేజోవంతుడగు బ్రహ్మ ఆవిర్భవించిన యొక్క కుమారకుని జూచెను. ఆ కుమారుడు, నల్లని వాడు మహావీర్య(బల)ముగలవాడు తన తేజముచే వెలుగుల విరజిమ్మువాడు-23. నల్లని వస్త్రము తలపాగా, యజ్ఞోపవీతములు గలవాడు, నల్లని తలగలవాడు. నల్లని మాలలు మైపూతలు గలవాడు-24.

స తం దృష్ట్యా మహాత్మానమమరం ఘోరమన్ త్రిణమ్

 వవన్దే దేవదేవేశం విశ్వేశం కృష్ణపిఙ్గలమ్

 ప్రాణాయామపరః శ్రీమాన్ హృది కత్వా మహేశ్వరమ్

మనసా ధ్యానసంయుక్తం ప్రపన్నస్తు యతీశ్వరమ్

అఘోరేతి తతో బ్రహ్మ బ్రహ్మ ఏవానుచిన్తయన్

 ఏవం వై ధ్యాయతస్తస్య బ్రహ్మణః పరమేష్ఠినః

ముమోచ భగవాన్ రుద్రః అట్టహాసం మహాస్వనమ్

 అథాస్య పార్శ్వతః కృష్ణాః కృష్ణస్రగను లేపనాః

చత్వారస్తు మహాత్మానః సంబభూవుః కుమారకాః

కృష్ణాః కృష్ణాంబరోష్ణీషాః కృష్ణాస్యాః కృష్ణవాససః

తైశ్చాట్టహాసః సుమహాన్ హూఙ్కారశ్చైవ పుష్కలః

 నమస్కారశ్చ సుమహాన్ పునః పునరుదీరితః

బ్రహ్మ అమరుడు, ఘోరమైన మన్రణము (ఆలోచనము) గలవాడు, దేవదేవేశుడు నలుపు గోరోజనమువంటియెరుపును గలవాడునగు విశ్వేశుని నమస్కరించెను-25. ప్రాణాయామపరుడైన శ్రీమంతుడగు (తేజోవంతుడగు) బ్రహ్మమహేశ్వరుని తన హృదయము నందు నెలకొల్పేను. ధ్యానయోగముతో నున్న యాయతీశ్వరుని మనస్సుతో బొందెను. తరువాత బ్రహ్మ అఘోర యని యనుచుపరబ్రహ్మనే ధ్యానించుచుండెను-26. ఈ విధముగ ధ్యానించు పరమేష్ఠియగు బ్రహ్మకు బ్రహ్మను గూర్చి) భగవంతుడైన రుద్రుడు మహాశబ్దముతో పెద్దగా నవ్వెను-27. తరువాత ఆరుద్రుని ప్రక్కల నుండి నల్లని నలుగురు కుమారకులు జనించిరి వారు నల్లని మాలలను లేపనములను ధరించినవారు-28. మహాత్ములు నల్లని వస్త్రములు తలపాగాలు ధరించినవారు నల్లని ముఖములు నల్లని కప్పు వస్త్రములుగలవారు. వారు గూడ పెద్దగా నవ్విరి. గొప్పగా హూంకరించిరి మాటి మాటికి పెద్దగా నమస్కారములను గూడ జెప్పిరి-29.

తతో వర్షసహస్రాన్తే యోగాత్తత్పరమేశ్వరమ్

ఉపాసిత్వా మహాభాగాః శిషేభ్యః ప్రదదుస్తతః

 యోగేన యోగసంపన్నాః ప్రవిష్టా విశ్వమీశ్వరమ్

 ఏవమేతేన యోగేన యేచాప్యన్యే ద్విజాతయః

స్మరిష్యన్తి విధానజ్జా గన్తారో రుద్రమవ్యయమ్

తరువాత వేయి సంవత్సరముల చివర యోగధారణ చేత ఆ పరమేశ్వరను పాసించి మహాభాగులై శిష్యులకు ఆమోగమునిచ్చిరి-30. తరువాత వారా యోగముచే సుసంపన్నులైమనస్సుతో నిర్మలము నిర్గుణము శివము విశ్వేశ్వరమునకు స్థానమును బ్రవేశించిరి-31. ఇట్లే యోగముచే తక్కిన బ్రాహ్మణులు సైతము యోగ విధానమును దెలసిన వారై అవ్యయుడైన రుద్రుని స్మరించి యాతనిని జేరిరి-32.

తతస్తస్మిన్ గతే కల్పే కృష్ణరూపే భయానకే

 అన్యః ప్రవర్తితః కల్పో విశ్వరూపస్తు నామతః

 వినివృత్తే తు సంహారే పునః సృష్టే చరాచరే

 బ్రహ్మణః పుత్రకామస్య ధ్యాయతః పరమేష్ఠినః

ప్రాదుర్భూతా మహానాదా విశ్వరూపా సరస్వతీ

తరువాత ఆ భయంకరమై కృష్ణరూపమైన కల్పము గడచిపోగా విశ్వరూపమను పేరుగల మరొక కల్పము వచ్చినది-33. సర్వసంహారము జరిగి మరల చరాచర (ప్రపంచ)ము సృష్టింపబడినది. పుత్రకామియై ధ్యానము జేయుచున్న పరమేష్ఠియగు బ్రహ్మనుండి మహానాదము గలిగి విశ్వరూపమైన సరస్వతి యావిర్భవించినది-34.

విశ్వమాల్యాంబరధరం విశ్వయజ్ఞోపవీతినమ్

విశ్వోష్ణీషం విశ్వగన్ధం విశ్వస్థానం మహాభుజమ్

అథ తం తు నసాధ్యాత్వా యక్షాత్మా వై పితామహః

వన్దే దేవమిశానం సర్వేశం సర్వగం ప్రభుమ్

 ఓమిశానం నమస్తేఽస్తు మహాదేవ నమోఽస్తుతే

ఉవాచ భగవానీశః ప్రీతోఽహం తే కిమిచ్చసి

 యదిదం విశ్వరూపస్తే విశ్వగం విశ్వమిశ్వరమ్

 ఉవాచ భగవాన్ బ్రహ్మా ప్రితః ప్రీతేన చేతసా

 యదిదం విశ్వరూపస్తే విశ్వగం విశ్వమీశ్వరమ్

ఏతద్వేదితుమిచ్ఛామి కశ్చాయం పరమేశ్వరః

కైషా భగవతీ దేవీ చతుష్పాదా చతుర్ముఖీ

 చతుః శృంగీ చతుర్వక్త్రా చతుర్దన్తా చతుః స్తనీ

 చతుర్హస్తా చతుర్నేత్రా విశ్వరూపా కథం స్మృతా

 కిం నామ ధేయా కోఽస్యాత్మా కింవీర్యా వాపి కర్మతః

తరువాత సమస్తమాలలను వస్త్రములను ధరించినవాడు, విశ్వమే యజ్ఞోపవీతముగా గలవాడు, విశ్వమే తలపాగా గాగలవాడు, సమస్త గంధములు గలవాడు, విశ్మమే స్థానముగాగలవాడు మహాభుజములు గలవాడును-35. అగు ఆ యీశ్వరుని బ్రహ్మ యోగయుక్తుడై తన మనస్సుతో ధ్యానించేను. సర్వేశ్వరుడై సర్వమునందున్న ప్రభువగు ఈశానదేవుని నా బ్రహ్మనమస్కరించేను-36. ఓం ఈశానుడవగు నీకు నమస్కారము. ఓ మహాదేవ! నీకు నమస్కారము (ఇది మన్త్రముగా వున సంస్కృతములోనే చదువవలె) ఈ విధముగా ధ్యానమందుండి నమస్కరించుచున్న బ్రహ్మను గూర్చి నేను సంతసించితిని నీకేమి కావలెను. అని పలికెను-37. తరువాత బ్రహ్మ మహేశ్వరునకు నమస్కరించి వాక్కులతో స్తుతించెను. తరువాత సంతుష్టుడైన బ్రహ్మ సంతుష్టమైన మనస్సుతో యిట్లనెను-38. ఈ నీ విశ్వగమై విశ్వేశ్వరమైన రూపమును దెలిసికొన గోరుచున్నాను. ఈ పరమేశ్వరుడెవరు-39. ఈ భగవతియైన దేవి యెవరు? ఈమె నాలుగు పాదములు గలదియు నాలుగు ముఖములు గలదియు, నాలుగు కొమ్ములు గలదియు నాలుగు నోళ్ళు గలదియు, నాలుగు దన్తములు గలదియు, నాలుగు స్తనములు గలదియు-40. నాలుగు చేతులు, నాలుగు నేత్రములు గలదియునై విశ్వరూపమైనట్లు ఎట్లు తలపబడినది.? ఈమె పేరేమి? ఈమె యాత్మ యెవరు? క్రియలవల్లనేమి బలము గలది? తెలియగోరుచున్నాను. అని బ్రహ్మయనెను-41.

మహేశ్వర ఉవాచ:-

                      రహస్యం సర్వమన్రాణాం పావనం పుష్టివర్ధనమ్                     

శృణు ష్వెతత్పరం గుహ్యమానిసర్గో యాథాతథమ్

అయం యో వర్తతే కల్పో విశ్వరూపస్త్యసౌ స్మృతః

 యస్మిన్ భవాదయో దేవాః షడ్వింశన్మనవః స్మృతాః

 బ్రహ్మస్థానమిదం చాపి యదాప్రాప్తం త్వయా విభో

 తదా ప్రభృతి కల్పశ్చ త్రయస్త్రీం శత్తమోహ్యయమ్

 శతం శతసహస్రాణామతీతా యే స్వయంభువః

పురస్తాత్తవదేవేశ తాన్ శ్రుణుష్వ మహామునే

 ఆనన్దస్తు సవిశ్లేయ ఆనన్దస్తే మహాలయః

 గాలవ్యగోత్రతపసా మమ పుత్రస్యమాగత

 త్యయి యోగశ్చ సాంఖ్యశ్చతపోవిద్యావిధిః క్రియా

ధ్యానం ధ్యానవపుః శాన్తిర్విధ్యా విద్యామతిరృతి

 కార్తా శాస్త్రి  స్మృతిర్మేధా లజ్ఞాశుద్ధి సరస్వతీ

తుష్టిః పుష్టి క్రియాచైవ లజ్జా క్షాస్త్రి  ప్రతిష్ఠితా

 షిడ్వింశతద్గుణా హ్యేషా ద్వాత్రింశాక్షర సంజ్ఞతా

 ప్రకృతిం విద్ధి తాం బ్రహ్మం స్త్యత్పసూతిం మహేశ్వరీమ్

సైషా భగవతీ దేవీ తత్ర్పసూతిః స్వయం భువః

 చతుర్ముఖీ జగద్యోనికి ప్రకృతిరౌః ప్రకీర్తితా

ప్రధానం ప్రకతీం చైవ యదాహుస్తత్వచిత్తకాః

మహేశ్వరుడనెను:- ఇది సర్వమన్త్రములలో రహస్యమైనది. పవిత్రమైనది. పుష్టిని వృద్ధి జేయునది. ఆది సృష్టిలోనున్నది. యున్నట్లుగానున్న యతి రహస్యమును వినుము-42. ఈ ప్రస్తుతమునడుచుచున్న కల్పము విశ్వరూపకల్పమనబడినది. దీనిలో భవుడు మొదలుగాగల ఇరువది యాజుగురు మనువులు చెప్పబడినారు-43. ఓ విభువైన బ్రహ్మనీవీ బ్రహ్మస్థానమును బొందినప్పటినుండి యిది ముప్పది మూడవ కల్పము-44. ఓ దేవేశుడా (బ్రహ్మా) నీ ముందే నూరు వేల(కోటి) స్వయంభువులు (బ్రహ్మలు) గడచిపోయిరి ఓ మహామునీ! వారిని వినుము-45. అది (ముప్పది మూడవ కల్పము) ఆనందమని తెలియదగినది. అదీ నీయొక్క మహాలయరూపమైన ఆనందము గాలవ్యగోత్ర తపస్సుచే(?) నా పుత్రుడవైనీవు వచ్చితివి-46. నీయందు యోగము సౌంఖ్యము, తపస్సు, విద్యా విధి, క్రియ భూతము, సత్యము, బ్రహ్మయనునది, అహింస, సన్తతి క్రమములు ధ్యానము, ధ్యానవపువు (శరీరము) -శాస్త్రి, విద్య, అవిద్య, మతి, ధృతి, కాని, శాస్త్రి, స్మృతి, మేధ లజ్జ, శుద్ధి, సరస్వతి, తుష్టి, పుష్టి, క్రియ, లజ్జ, క్షాని, ప్రతిష్ఠితము, లైనవి-48. ఆమె ఇరువది యారు తద్గుణములు (?) గలది. ముప్పది రెండక్షరములచే పేరుగలదిగా గుర్తింపబడినది. ఓ బ్రహ్మా, దీనిని ప్రకృతిని గాను నిన్నుగన్న మహేశ్వరిని గాను దెలియుము-49. అట్టి యీమె భగవతియైనదేవి. ఆమె కన్న సంతానము బ్రహ్మ, ఆమె చతుర్ముఖజగత్తును జన్మింపజేసిన ప్రకృతియైన గోవు అని చెప్పబడినది. తత్యశిక్షకులు ఆమెను ప్రధానమనియు ప్రకృతియనియు జెప్పుదురు-50.

అజామేతాం లోహితాం శుక్లకృష్ణామ్ విశ్వం ప్రసృజమానాం సురూపామ్

అజోఽహం వై బుద్ధి మాన్విశ్వరూపాం గాయిత్రీం గార విశ్వరూపాం హి బుద్ద్వా

ఈమె అజ అనగా జన్మలేనిది. లోహిత అనగా రజోగుణవతి, శుక్లయు కృష్ణయు, అనగా సత్వగుణవతి తమోగుణవతి విశ్వములను చక్కగా సృష్టించుచున్నది. చక్కని రూపము గలది. ఇట్టి యీ ప్రకృతి రూపము గాయత్రిగా (గానముజేయు వానిని రక్షించుదానినిగా) గాం. గోవునుగా, విశ్వరూపనుగా (విశ్వస్వరూపిణిగా) దెలిసికొని నేను అజుడను (జన్మలేనివాడను) బుద్ధిమంతుడును ఐతిని, మహదేవుడనేను-51.

ఏవముక్త్యా మహాదేవః అట్టహాసమథాకరోత్

వలితాస్పోటితరం కహాకహనదం తథా

 తతోఽస్య పార్శ్వఽతో దివ్యాః సర్వరూపాః కుమారకాః

 జటీముండీ శిఖండీ చ అర్ధముండశ్చ జజ్ఞిరే

తతస్తే తు యథోక్తేన యోగేన సుమహౌజసః

 దివ్యం వర్షసహస్రం తు ఉపానత్వా మహేశ్వరమ్

ధర్మోపదేశం నియతం కత్వాయోగమయం దృఢమ్

శిస్టానాం నియతాత్మనః ప్రవిష్టారుద్రమిశ్వరమ్

            ఈ విధముగ జెప్పి మహాదేవుడు (శివుడు) అట్టహాసము (పెద్దనవ్వు) జేసెను. జుట్టిచరచిన ధ్వనియును (చప్పటల ధ్వని) కహా కహ అను ధ్వనీయునుగల యట్టహాసమును జేసెను-52. తరువాత మహాదేవుని ప్రక్కనుండి దివ్యులై సర్వరూపముల గల కుమారకులు జనించిరి జటి (జడలు గలవాడు) ముండి (కొరిగిన తలగలవాడు) శిఖండీ (నెమిలితల పైన గలవాడు) అర్థముండుడు (సగముతలగొరిగి కొన్నవాడు) వీరు మహా దేవుని ప్రక్కలనుండి జన్మించిన వారు-53. అంతవారు శాస్రకమైన యోగములతో చక్కని గొప్ప ఓజస్సుగలవారై దేవయానపు వేయియేండ్లు మహేశ్వరునుపాసించిరీ-54. తరువాత శిష్టులకు యోగపూర్ణమై దృఢమై నియతమైన ధర్మోపదేశముజేసిరి అట్లే నియతాత్మలై ఈశ్వరుడైన రుద్రునిలో ప్రవేశించిరి-55.

వాయురువాచ:-

 తతో విస్మయమాపన్నో బ్రహ్మలోక పితామహా

 ప్రపన్నస్తు మహాదేవం భక్తియుక్తేన చేతసా

ఉవాచ వచనం సర్వం శ్వేతత్వం తే కథం విభో

భగవానువాచ:-

 శ్వేతకల్పోయదాహ్యాసీ దహం శ్వేతస్తతోఽ భవమ్

 శ్వేతోష్ణీషః శ్వేత మాల్యః శ్వేతమాల్యాంబరధరః శివః

 శ్వేతాస్థిమాంసరోమా చ శ్వేతత్వక్ శ్వేతలోహితః

 తేన నామ్నా చ విఖ్యాతః శ్వేతకల్పస్తదాహ్యసౌ

మత్ప్రసాదాచ్చ దేవేశః శ్వేతాంగః శ్వేతలోహితః

శ్వేతవర్ణా తదాహ్యాసీద్గాయత్రీ బ్రహ్మసంజ్ఞితా

యస్మాదహం చ దేవేశ త్వయా గుహ్యేపదే స్థితః

విజ్ఞాతః స్వేన తపసా సద్యో జాతః సనాతనః

 సద్యోజాతేతి బ్రహ్మైతద్గుహ్యం చైవ ప్రకీర్తితమ్

తస్మాద్గుహ్యత్వమాపన్నం యే వేత్స్యన్తి ద్విజాతయః

 తత్సమిపం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

 వాయువు బలికెను:- తరువాత ఆశ్చర్యమునందిన లోకపితామహుడగు బ్రహ్మ భక్తియుక్తమయిన చిత్తముతో మహాదేవుని శ్రరణుబొంది) జేరి, ఓవిభో, మహాదేవ, నీకు అంతట శ్వేతత్వము (తెలుపు దనము) ఎట్లు వచ్చినది? అని యడిగెను-56. భగవంతుడు శివుడు పలికెను. శ్వేతకల్పమున్నప్పుడు నేను శ్వేతుడనయితిని తెల్లని తలపాగా గలవాడను. తెల్లని మాలలు గలవాడను. తెల్లని వస్త్రములు గలవాడను, శివుడను, తెల్లని యెముకలు మాంసము వెంట్రుకలు గలవాడను, తెల్లని చర్మము గలవాడను. తెలుపు, ఎఱుపు వర్ణము గలవాడను అయితిని ఆకారణముననే అప్పుడీకల్పము శ్వేతకల్పమని ప్రసిద్ధిజెందినది-57,58. నాయనుగ్రహముననే దేవేశుడయిన బ్రహ్మ శ్వేతాంగుడు తెలుపు ఎఱుపు వర్ణముగలవాడయ్యెను. అపుడు గాయత్రి (సరస్వతి) శ్వేతవర్ణమై బ్రహ్మ (బ్రహ్మీ) యని పేర్కొనబడినది-59. ఓ దేవేశుడవైన బ్రహ్మా నీ చేత నేను రహస్య పద(స్థాన) మునందున్నందునను, నా తపస్సు చేతను సద్యోజాతుడైన సనాతనునిగా తెలియబడితిని. సద్యోజాతమను నీది పరబ్రహ్మము రహస్యమని చెప్పబడినది-60. కావున రహస్యత్వమును బొందిన నన్ను దెలిసిన ద్విజాతులు బ్రాహ్మణ క్షత్రియవైశ్యులు) పునర్జన్మ లేని యాతని(శివ) సామీప్యమును బొందుదురు-61.

యదాహం చ పునస్త్వాసం లోహితో నామ నామతః

మమ కృతేన వర్ణేన కల్పోవై లోహితః స్మృతః

 తదాలోహిత మాంసాస్థిలోహిత క్షీరసన్నిభా

 లోహితాక్షస్తనవతీ గాయత్రి గౌః ప్రకీర్తితా

 తతోఽస్య లోహితత్వేన వరుణస్య చ విపర్యయే

 వామత్వాచ్చైవ యోగస్య వామదేవత్వ మాగతా

 తథాపి హి మహాసత్త్వ త్యయాహం నియతాత్మనా

తతోఽహం వామదేవేతి ఖ్యాతిం యాతో మహీతలే

 యేచాపి వామదేవత్వం జ్ఞ్యాస్యన్తీహ ద్విజాతయః

విజ్ఞాయ చేమాం రుద్రాణీం గాయత్రీం మాతరం విభో

సర్వపాప వినిర్ముక్తా విరజా బ్రహ్మవర్చసః

రుద్రలోకం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

నేను పేరుతో లోహితుడనై (మరల) నున్నప్పుడు నావర్ణముచేతనే యాకల్పములోహితకల్పమనబడినదీ-62. అప్పుడు. గాయత్రీ రూపిణియగు గోవు ఎర్రని మాంసము ఎముకలు పాలు కలదై ఎఱ్ఱని కన్నులు స్తనములు గలదై కీర్తింపబడినది 63. ఆ తరువాత లోహితుడగుటచే వర్ణము తారుమారుకాగా యోగము వామముయి నందున వామదేవత్వము పొందబడెను 64. అయినను ఆత్మను వశీకరించి మహా బలవంతుడనగుటచే శ్వేత వర్ణముతోనే తెలియబడితిని. కావున వర్గోత్తముడనైతిని. ఆ తరువాత భూమి పైన వాయుదేవునిగా ప్రసిద్దిబొందితిని-65. నావామదేవత్వమును దెలిసిన ద్విజాతులు ఈమెను రుద్రాణియై గాయిత్రియైన మాతనుగా దెలిసికొని సర్వపాపములనుండి విముక్తులై రజోగుణమువీడిన వారై బ్రహ్మతేజము గలవారై పునర్జన్మలేని రుద్రలోకమును బొందగలరు-67.

యదా తు పునరేవాయం (హం) కృష్ణవర్ణో భయానకః

మత్కృతేన చ వర్ణేన మత్కల్పః కృష్ణ ఉచ్యతే

 తత్రాహం కాలసంకాశః కాలో లోకప్రకాశనః

విజ్ఞాతోఽహం త్వయా బ్రహ్మన్ ఘోరో ఘోరపరాక్రమ

తస్మాద్ఘోరత్వమాపన్నం యేమాం వేత్స్యన్తి భూతలే

 తేషామఘోరః శాన్తశ్చ భవిష్యామ్యహమవ్యయః

తస్మాద్విశ్వత్వమాపన్నం యే మాం వేత్స్యన్తి భూతలే

తేషాం శివశ్చ సౌమ్యశ్చ భవిష్యామి సదైవ తు

తస్మాచ్చ విశ్వరూపో వై కల్పోఽయం సముదాహృతః

విశ్వరూపా తథాచేయం సావిత్రీ సముదాహృతా

 సర్వరూపాస్తథా చేమే సంవృత్తా మమ పుత్రకాః

 చత్వార స్తే సమాఖ్యాతాః పాదా వై లోకసంమతాః

తస్మాచ్చ సర్వవర్ణత్వం ప్రజా త్వం మే భవిష్యతి

సర్వభక్ష్యా చ మేధ్యా చ వర్ణతశ్చ భవిష్యతి

మోక్షో ధర్మస్తదార్థశ్చ కామశ్చేతి చతుష్టయమ్

 తస్మా దేత్తా చ వేద్యం చ చదుర్థా వై భవిష్యతి

 భూతగ్రామాశ్చ చత్వారః ఆశ్రమాశ్చతుర స్తథా

ధర్మస్య పాదా శ్చత్వారశ్చత్వారో మమ పుత్రికాః

 తస్మా చ్చతుర్యుగావస్థం జగద్యై స చరాచరమ్

చతుర్ధావస్థితం చైవ చతుష్పాదం భవిష్యతి

 భూర్లోకోఽథభువర్లోకః స్వర్లోకోఽథ మహస్తథా

జనస్తపశ్చ శాన్తశ్చ రుద్రలోకస్తతః పరమ్

స్వర్లోకో హి తృతీయస్తు చతుర్థస్తు మహః స్మృతుః

తత్ర లోకః పరం స్థానం పరం తద్యోగినం స్మృతమ్

నిర్మమానిరహంకారాః కామక్రోధ వివర్జితాః

 ద్రక్ష్యన్తే తద్విదో యుక్తా ధ్యానతత్పర యుంజకాః

 యస్మాచ్చతుష్పదా హ్యేషా త్యయా దృష్టా సరస్వతీ

తస్మాచ్చ పశవః సర్వే భవిష్యన్తి చతుష్పదాః

 తస్మాచ్చైషాం భవిష్యన్తి చత్వారో వై పయోదరాః

 సోమశ్చ మన్త్రసంయుక్తో యస్మాన్మయ ముఖాచ్యుతః

జీవః ప్రాణభృతాం బ్రహ్మన్ సర్వః పీత్యా సనైర్ఘతమ్

 తస్మాత్ సోమమయం చైతదమృతం చైవ సంజ్ఞితమ్

చతుష్పాదా భవిష్యన్తి శ్వేతత్వం చాస్య తేన తత్

యస్మాచ్చైవం క్రియా భూత్వా ద్విపాదా వై మహేశ్వరీ

దృష్టా పునస్త్యయాచైషా సావిత్రీలోకభావినీ

 తస్మాద్యై ద్విపదాః సర్వే ద్విస్తనాశ్చ నరా స్మృతాః

 యస్మాచ్చైవ మజాభూత్వా సర్వవర్ణా మహేశ్వరీ

 దృష్టాత్వయా మహాసత్త్వా సర్వభూతధరాపరా

 తస్మాత్తు విశ్వరూపత్వమజానాం వై భవిష్యతి

 అజశ్చైవ మహాతేజా విశ్వరూపో భవిష్యతి

 అమోఘరేతాః సర్వత్ర ముఖేఽచాస్య హుతాశనః

 తపసా భావితాత్మానో యే వై ద్రక్ష్యన్తి వై ద్విజాః

 ఈశిత్వే చ శివత్వే చ సర్వగం సర్వతః స్థిరమ్

 రజస్తమో వినిర్ముక్తా స్త్యక్త్యా మానుష్యకం భువి

మత్సమిపం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

 ఇత్యేవముక్తో భగవాన్ బ్రహ్మారుద్రేణ వై ద్విజాః

 ప్రణమ్య ప్రయతో భూత్వా పునరాహ పితామహః

నేను కృష్ణవర్ణుడై (నల్లనివాడనై) భయంకరునిగా నున్నప్పుడు నాచే చేయబడిన వర్ణము చేత నా కల్పము గూడ కృష్ణ కల్పమనబడినది-68. అచట నేను కాలముతో సమానమైన వాడను కొలము లోకమును ప్రకాశింపచేయునది. ఓ బ్రహ్మా నేను మౌరుడను ఆ ఘోర పరాక్రముడను అని నీ వెఱుగుదువు. కావున భూమి పైన నన్ను ఘోరత్వమును (భయంకరత్వమును) బొందిన వానిగా దెలిసిన వారికి నేను అభయంకరుడను శాస్తుడను అవ్యయుడను అగుదును-70. కావున భూమిపై నన్ను విశ్వత్వమునుబొందిన వానిగా దెలిసిన వారికి నేనెల్లప్పుడు శివుడను సౌమ్యుడను. అగుదును-71. కావున నీ కల్పము విశ్వరూపకల్పమనబడినది. అట్లే యీ సావిత్రి కూడా విశ్వరూపయనబడినది-72. అట్లే సర్వరూపములు గల వీరందరు నీయొక్క పుత్రులైనారు. వారు లోకసమ్మతమై నాలుగు పాదములుగా జెప్పబడిరి-73. కావున నాకు సర్వవర్ణములు గల సంతానము గలిగియుండుట జరుగగలదు. వర్ణములను బట్టి ప్రజసర్వభక్ష్యమును పవిత్రమును గో గలదు.74 మోక్షము ధర్మము అర్థము కామము అనునీ నాలుగు నుండ గలవు. కావున తెలిసికొనువాడును తెలియదగినదియు నాలుగు విధములుగా గలదు-75. భూతసమూహములు (పృధివ్యమేజస్సులు నాలుగు అట్లే ఆశ్రమములు (బ్రహ్మ క్షత్రియవైశ్యశూద్రులు) గూడ నాలుగు ధర్మము యొక్క నాలుగు పాదములు నా నలుగురు పుత్రులు-76. కావున చరాచరమైన జగము నాలుగు యుగావస్థలు (కృత త్రేతాద్వాపరకలిరూపములు) గలది. అట్లు నాలుగు విధములు గానున్నదియు (ప్రతిది) నాలుగు పాదులు గలది గాగలదు-77. 1. భూర్లోకము, 2. భువర్లోకము, 3.స్వర్లోకము, 4.మహర్లోకము, 5.జనోలోకము, 6.తపోలోకము, 7.శాస్తలోకము, 8. రుద్రలోకము-78. వీనిలో మూడవది స్వర్లోకము, నాలుగవది మహర్లోకమనబడినది. అచట లోకము ఉత్కృష్టమైన స్థానము అది యోగులకు పరమమైన స్థానమనబడినది-79. అచట వారు నిర్మములు (మమకారము లేనివారు) నిరహంకారులు, కామ క్రోధములు లేనివారు, తద్విదులై (పరమాత్మను దెలిసిన వారై) యోగధారణమున నున్నవారు, (పరబ్రహ్మధ్యానతత్పరులునై కనబడుదురు-80. నీవు సరస్వతిని నాలుగు పాదములు గల దానినిగా జూచితివి. ఆమె యట్లున్నందున అన్ని పశువులును నాలుగు పాదములు గలవిగా గలవు. కావుననే వానికి నాలుగు స్తనములుండగలవు-81. మన్తసంయుక్తమైన సోమము నాముఖము నుండి జారిపడినదై స్తనములనుండి మొత్తము ఘృతమును (నేతిని) త్రాగి ఓ బ్రహ్మా!-82. ప్రాణులకందరికి జీవమయినందున నిదియంతయు(?) జగమంతయు సోమమయముగను అమృతముగ పేర్కొనబడినది-82. ఆకారణముననే నాలుగు పాదములుండగలవు. దీనికి ఆశ్వేతత్వము గూడదానిచేతనే యుండగలదు 83. ఈ లోకభావినియై సావిత్రి యైన మహేశ్వరి యీ విధమైన క్రియ గలదై ద్విపాదగా (రెండు పాదములు గలదిగా) చూడబడినందున నరులందరు రెండు పాదములు రెండు స్తనములను గలవారనబడిరి-84. మహాసత్యము (బలము) గలదై సర్వప్రాణులను ధరించునదై పరారూపిణియైన మహేశ్వరి అజయై మేకయై (జన్మలేనిదై) సర్వవర్ణములు గలదిగా నీచే జూడబడినందున అజములకు (మేకలకు విశ్వరూపత్వము రాగలదు-85. మహాతేజమైన మేకగూడ మహాతేజము గలదిగాగలదు. ఈ మేకముఖమున నంతటను అగ్నిహోత్రుడు వ్యర్థముగా నిస్రఫలమైన) రేతస్సుగలవాడగును. కావున అగ్ని పశురూపియై అంతటనున్న వాడైకూడ పవిత్రుడే-86. తపస్సుచే భావితమైన యాత్మలు గల ద్విజులు ఈశిత్వము చేత శివత్వముచేత సర్వగతుడై యంతటను స్థిరుడైన వానినిగా-87, నన్ను (ఈశ్వరుని) జూచినవారు రజస్తమోగుణములను వదలి భూమిజ మానుష్యకరూపమును గూడ వదలియు, పునరావృత్తిలేని (పునర్జన్మలతో లభ్యముగాని) నా సమీపమును బొందుదురు-88. ఓ ద్విజులారా! అని యీ విధముగ రుద్రునిచేజెప్పబడిన బ్రహ్మ నమస్కరించి పరిశుద్ధుడై మరల నీ విధముననెను-89.

బ్రహ్మోవాచ:-

భగవన్ దేవదేవేశ విశ్వరూపీ మహేశ్వరః

ఇమాస్తవ మహాదేవ తనవో లోకవందితాః

విశ్వరూపః మహాసత్త్వ కస్మిన్ కాలే మహాభుజః

కస్యాం వా యుగసంభుత్యాం ద్రక్ష్యన్తి త్వాం ద్విజాతయః

 కేన వా తత్త్వయోగేన ధ్యానయోగేన కేన వా

తనవస్తే మహాదేవ శక్యా ద్రష్టుం ద్విజాతిభిః

బ్రహ్మ పలికెను:- ఓ భగవన్! ఓ దేవదేవేశ! విశ్వరూపియైన మహేశ్వర! ఓ మహాదేవ! ఈ నీ తనువులు లోకవందితములైనవి. ఓ విశ్వరూప! ఓ మహాసత్త్వ! ఓ మహాభుజములుగలవాడా! ద్విజాతులు ఏ యుగసంభూతియందు నిన్ను జూడగలదు? ఓ మహాదేవ! ద్విజాతులకు ఏతత్యయోగముతో లేదా ఏ ధ్యానయోగముతో నీ తనువులను జూడశక్యమగును?-92.

భగవానువాచ:-

తపసా నైవ యోగేన దానధర్మఫలేన వా

 న తీర్థఫలయోగేన క్రతుభిర్వా సదక్షిణైః

 న వేదాధ్యాపనైర్వాపిన చిత్తేన నివేదనైః

శక్యో హం మానుషై ర్ద్రంష్టుంఽఋతే ధ్యానాత్పరం న హి

భగవంతుడు పలికెను:- తపస్సు చేతగాని, యోగము చేతగాని, దానధర్మఫలము చేతగాని, తీర్థ (యాత్రా) ఫలయోగము చేతగాని, దక్షిణలతోగూడిన యజ్ఞముల చేతగాని-93, వేదముల జదివించుట చేతగాని, చిత్తము తోడి నివేదనముల చేతగాని నేను మనుష్యులకు కనబడను కేవలమొక ధ్యానము చేతనే గనబడుదును. అంతకన్నవేరుగాదు. 94.

సాధ్యో నారాయణశ్చైవ విష్ణుస్త్రి భువనేశ్వరః

భవిష్యతీహ నామ్నా తు వారాహో నామ విశ్రుతః

 చతుర్బాహుశ్చతుష్పాదశ్చత్రర్నేత్రశ్చతుర్ముఖః

 తదా సంవత్సరో భూత్వా యజ్ఞరూపీ భవిష్యతి

 షడఙ్గశ్చ త్రిశీర్షశ్చ త్రిస్థానే త్రిశరీరవాన్

ముల్లోకములకీశ్వరుడై విష్ణువైన నారాయణుడు గూడ ఈ లోకమున సాధ్యుడు గాగలడు. పేరుతో నాతడు వారాహుడని ప్రసిద్ధుడు-95. నాలుగు బాహువులు నాలుగు పాదములు నాలుగు నేత్రములు నాలుగు ముఖములును గల యాతడు అప్పుడు సంవత్సరముగానయి యజ్ఞరూపుడగును. ఆతడు ఆజంగములు గలవాడు. మూడుశిరములు గలవాడు, మూడుస్థానములలో మూడు శరీరములు గలవాడును అగును-96.

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చైవ చతుర్యుగమ్

ఏతస్య పాదాశ్చత్వారః అఙ్గాని క్రతవస్తథా

 భుజాశ్చ వేదాశ్చత్వాఋతుః సన్ధిముఖాని చ

ద్వే ముఖే ద్వే చ అయనే నేత్రాశ్చ చతురస్తథా

 శిరాంసి త్రీణి పర్వాణి ఫాల్గున్యాషాఢకృత్తికాః

 దివ్యాన్తరిక్ష భౌమాని త్రీణి స్థానాని యాని తు

 సంభవః ప్రలయశ్చైవ ఆశ్రమే ద్వౌ ప్రకీర్తితౌ

 స యదా కాలరూపాభో వరాహత్వే వ్యవస్థితః

 భవిష్యతి యదా సాధ్యోవిష్ణుర్నారాయణః ప్రభుః

కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, అని నాలుగుయుగములు, దీనియొక్క పాదములు నాలుగు అంగములు, క్రతువులు, భుజములు నాలుగు వేదములు, ఋతువు సంధి ముఖములు (షడంగకములు) రెండు ముఖములు రెండు ఆయనములు నాలుగు నేత్రములు-98. ఫాల్గున ఆషాఢ కార్తీక మాసములు అను మూడు సర్వములు మూడు శిరములు దివ్య అన్తరిక్ష-భౌమములనునవి మూడు స్థానములు సంభవము ప్రలయము అనునవి రెండు ఆశ్రమములు-99. ప్రభువై విష్ణువై నారాయణుడు కాలరూపుడై వరాహత్వమున నున్నప్పుడు సాధ్యుడు గాగలడు-100.

తదా త్యమపి దేవేశ చతుర్వక్త్రో భవిష్యతి

 బ్రహ్మలోక నమస్కార్యో విష్ణుర్నారాయణః ప్రభుః

 ఏకార్ణవే ప్లవే చైవ శయానం పురుషం హరిమ్

యదా ద్రక్ష్యసి దేవేశం ధ్యానయుక్తం మహామునిమ్

తదా వాం యమయోగేన మోహితో నష్టచేతసౌ

 అన్యోన్య స్పర్థినౌ రాత్రావవిజ్ఞాయ పరస్పరమ్

ఏకైకస్యోదరస్థాంస్తు దృష్ట్వా లోకాంశ్చరాచరాన్

 విస్మయం పరమం గత్వా ధ్యానాద్బుద్ధ్యాతు మానుషౌ  

అప్పుడు ఓ దేవేశ నీవు నాలుగు ముఖములు గలవాడవుగా గలవు. ప్రభువైన విష్ణువైన నారాయణుడు బ్రహ్మాలోకమునకు నమస్కరింపదగిన వాడు-101. భూమియంతయు సముద్రము కాగా దానిలో తెప్పపై పడుకొనుచున్న పురుషుడైన దేవేశుడై ధ్యానయుక్తుడై మహామునియైన హరిని నీవు జూడగలవు. అపుడు మీ రిద్దరు నాయోగముచే (యోగశక్తిచే) మోహితుడై చిత్తమును గోల్పోవుదురు. రాత్రిలో ఒకరినొకరు తెలియక బండారులు పోటీపడిన వారగుదురు-102,103 మానుషులైన బ్రహ్మనారాయణులు ధ్యాన(యోగ)ము వలన ఒక్కొకరికడుపులలో నున్న చరాచరలోకములను జూచి తెలిసికొని యాశ్చర్యము నొందుదురు-104.

తతస్త్వం పద్మసంభూతః పద్మనాభః సనాతనః

 పద్మాంకితస్తదా కల్పే ఖ్యాతిం యాస్యసి పుష్కలామ్

తరువాత నీవు పద్మమున బుట్టిన వాడవు. సనాతనుడైన విష్ణువు పద్మము నాభియందు గలవాడై పద్మనాభుడు నీవు పద్మాంకితుడవై గొప్ప ప్రసిద్ధిని బొందగలవు-105.

తతస్తస్మింస్తదా కల్పే వారాహే సప్తమే ప్రభోః

 పునర్విష్ణుర్మహాతేజాః కాలోలోక ప్రకాలనః

మనుర్యైవ స్వతో నామ తవ పుత్రో భవిష్యతి

తదా చతుర్యుగావస్థే కల్పే తస్మిన్ యుగాన్తకే

 భవిష్యామి శిఖాయుక్తః శ్వేతో నామ మహామునిః

 హిమవచ్ఛిఖరే రమ్యే ఛాగలే పర్వతోత్తమే

చతుః శిష్యాః శివే యుక్తా భవిష్యన్తి తదా మమ

శ్వేతశ్చైవ శిఖశ్చైవ శ్వేతాశ్వః శ్వేతలోమితః

చత్వారస్తే మహాత్మానో బ్రాహ్మణా వేదపారగాః

తతస్తే బ్రహ్మాభూయిష్ఠాః దృష్ట్యా బ్రహ్మగతిం పరామ్

 తత్సమిపం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

ఆ తరువాత ప్రభువు యొక్క వారాహకల్పములో మరల మహాతేజుడైన విష్ణువు కొలుడై లోక ప్రకాలను డగును. అపుడు వైవస్వతుడను మనువు నీ పుత్రుడు గాగలడు-106. అపుడు నాలుగు యుగావస్థలు గల యా యుగాన్తకమైన కల్పమునందు శిఖతోగూడుకొని శ్వేతుడను మునినై యుండగలను-107. అపుడు నాకు రమ్యమైన హిమగిరి శిఖరమున మేకలతో నిండిన పర్వత శ్రేష్ఠమున శివయోగ్యులైన నలుగురు శిష్యులు గాగలరు-108. వారు శ్వేతుడు. శిఖుడు శ్వేతాశ్వుడు. శ్వేతలోహితుడు అనువారు నలుగురు వేదపారగులు, మహాత్ములునైన బ్రాహ్మలు-109. కావున వారు పరబ్రహ్మ మార్గమును జూచి బ్రహ్మమయులై పునరావృత్తి లేని యాబ్రహ్మసమీపమును (నా సమీపమును) జేరుదురు-110.

పునస్తు మమ దేవేశో ద్వితీయద్వాపరే ప్రభుః

 ప్రజాపతిర్యదా వ్యాసః సత్యో నామ భవిష్యతి

 తదా లోకహితార్థాయ సుతారో నామనామతః

 భవిష్యామి కలౌతస్మిన్ లోకానుగ్రహకారణాత్

తత్రాపి మమ తేపుత్రా భవిష్యానామ నామతః

దున్దుభిః శీతరూపశ్చ బుచీకః క్రతుమాంస్తథా

ప్రాప్య యోగం తథా జ్ఞానం బ్రహ్మచైవ సనాతనమ్

రుద్రలోకం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

మరల నాదేవేశుడైన ప్రభువు ద్వితీయద్వాపరమున బ్రహ్మనపుడు సత్యుడను పేరుగల వ్యాసుడుండగలడు. అపుడు లోకహితము కొఱకు లోకమునను గ్రహించుటకై యా కలియుగములో సుతారుడను పేరుతో నుండగలను-111,112. అచ్చట గూడ నాకు పుత్రులు కలుగ గలరు. వారు దున్దుభి శతరూపుడు. ఋచీకుడు క్రతుమాన్ - అనువారు-113. వారు యోగమును జ్ఞానమును సనాతనమైన బ్రహ్మను పొంది పునరావృత్తి లేని బహు జన్మలలో లభ్యముగాని) రుద్రలోకమును బొందగలరు-114.

తృతీయే ద్వాపరే చైవ యదా వ్యాసస్తు భార్గవః

 తదాహ్యహు భవిష్యామిద మనస్తు యుగాన్తికే

 తత్రాపి చ భవిష్యన్తి చత్వారో మమ పుత్రకాః

 విశోకశ్చ వికేశశ్చ విశాపః శాపనాశనః

తేఽపి తేనైవ మార్గేణ యోగోక్తేన మహౌ జసః

రుద్రలోకం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

మూడవ ద్వాపరమున భార్గవుడు వ్యాసుడై యుండును. అపుడు యుగాన్తమున దమునుడనై నేనుండగలను-115 అచటగూడ నాకు నలుగురు పుత్రులుందురు. వారు విశోకుడు వికేశుడు, విశాపుడు శాపనాశనుడు అనువారు. వారు గూడ ఆయోగోక్తమార్గముననే గొప్ప ఓజోవంతులై పునరావృత్తి లేని రుద్రలోకమును బొందగలరు-116, 117.

చతుర్థే ద్వాపరే చైవ యదాఽవ్యాసోఽజ్గిరాః స్మృతాః

 తదాప్యహం భవిష్యామి సుహోత్ర నామ నామతః

తత్రాపి మమ సత్పుత్రాశ్చత్వారశ్చ తపోధనాః

 భవిష్యన్తి ద్విజశ్రేష్ఠాః యోగాత్మానో దృఢవ్రతాః

 సుముఖోదుర్ముఖశ్చైవ దుర్దయో దురతిక్రమః

ప్రాప్యయోగ గతిః సూక్ష్మాం విమలాదగ్ధకిల్బిషాః

 తేఽపి తేనైవ మార్గేణ గమిష్యన్తి న సంశయః

నాలుగవ ద్వాపరయుగమున అంగిరసుడు వ్యాసుడనబడును అపుడు నేను సుహోత్రుడను పేరుతో నుండగలను 118. అక్కడ గూడ తపోధనులు దృఢవ్రతులు యోగాత్ములైన బ్రాహ్మణ శ్రేష్టులునైన నలుగురు నలుగురు సత్పుత్రులు గలుగుదురు-119. వారు సుముఖుడు, దుర్ముఖుడు, దుర్దముడు, దురతిక్రముడు-అనువారు వారు సూక్ష్మమైన యోగమార్గమును పొంది పాపముల దహించి నిర్మలులగుదురు వారు గూడ ఆ యోగమార్గముననే (పూర్వులవలె) నిశ్చయముగా రుద్రలోకమును బొందుదురు-120.

పంచమే ద్వాపరే చైవ వ్యాసస్తు సవితా యదా

 తదా చాపి భవిష్యామి కంగోనామ మహాతపాః

 అనుగ్రహార్థంలోకానాం యోగాత్మా నైక కర్మకృత్

 చత్వారస్తు మహాభాగా విరజాః శుద్ధయోనయః

 పుత్రా మమ భవిష్యన్తి యోగాత్మానో దృఢవుతాః

సనః సనందనశ్చైవ ప్రభుర్యశ్చ సనాతనః

 ఋతుః సనత్కుమారశ్చ నిర్మమా నిరహంకృతాః

 మత్సమిపం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

ఐదవ ద్వాపరయుగములో సవితవ్యాసుడగును. అపుడు లోకానుగ్రహమునకై యోగాత్ముడను మహాతపస్విని అనేక కార్యముల జేయువాడను. అయిన అయిన కంగుడను వాడను గాగలను–121. మహాభాగ్యవంతులు, రజోగుణములేనివారు. పరిశుద్దజన్యులు, దృఢవ్రతులు, యోగాత్ములునైన నలుగు నాకు పుత్రులు గలుగగలరు-122. సనుడు సనందనుడు, ప్రభులైన సనాతనుడు, ఋతువు సనత్కుమారుడు, వీరు మమకారము లేని వారై యహంకారము లేనివారై అనేక జన్మలచే గూడ పొందరాని నాసమీపమును (రుద్రలోకమును) పొందగలరు-123.

పరివృత్తే పునఃషష్ఠే మృత్యుర్వ్యాసో యదా విభుః

 తదాప్యహం భవిష్యామి లోకాక్షిర్నామనామతః

శిష్యాశ్చ మమ తే దివ్యా యోగాత్మానో దృఢవ్రతాః

 భవిష్యన్తి మహాభాగాశ్చత్వారో లోకసమ్మతాః

 సుధామా విరజశ్చైవ శంఖపాద్రవ ఏవచ

యోగాత్మానోమహాత్మానస్తే సర్వేదగ్ధకిల్బిషాః

 తేఽపి తేనైవ మార్గేణ గమిష్యన్తి న సంశయః

తిరిగివచ్చిన యారవ ద్యాపర యుగమున విభువైన మృత్యువు వ్యాసుడగును అపుడు నేను లోకాక్షియను పేరు నుండగలను- 124, 125. దివ్యులు దృఢవ్రతులు యోగాత్ములు లోకసమ్మతులు నైన నలుగురు నాకు శిశ్యులు (పుత్రులు) కలుగగలరు. వారు సుధాముడు, విరజుడు, శంఖపాదుడు, రవుడు అనువారు యోగాత్ములైనవారందరు పాపములను దహించి మహాత్ములై యాయోగమార్గముననే నిస్సంశయముగ నా రుద్రలోకమును బొందుదురు-126.

సప్తమే పరివర్తేతు యదా వ్యాసః శతక్రతుః

విభుర్నామ మహాతేజాః పూర్వమాసీచ్చతక్రతుః

 తదాప్యహం భవిష్యామి కలౌతస్మిన్ యుగాన్ తికే

జైగీషవ్యేతి విఖ్యాతాః సర్వేషాం యోగినాం వరః

 తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి యుగే తదా

 సారస్వతాః సుమేధాశ్చ వసువాహః సువాహనః

తేఽపి తేనైవ మార్గేణ ధ్యానయుక్తిం సమాశ్రితాః

 భవిష్యన్తి మహాత్మానో రుద్రలోక పరాయణాః

తిరుగుచు వచ్చిన యేడవ ద్వాపరయుగమున మహాతేజస్కుడైన విభువైన శతక్రతువు వ్యాసుడగును-127. అపుడుగూడ ఆయుగాన్తకమైన కలిలో సమస్త యోగులలో శ్రేష్ఠుడనై జై గీషవ్యుడని ప్రసిద్ది జెందిన వాడను గాగలను.-128. అచ్చట గూడ నా యుగములో నాకు నలుగురు పుత్రులు గలుగుదురు. వారు సారస్వతుడు. సుమేధుడు. వసువాహుడు, సువా, హనుడు. అను వారు-129. వారు గూడ అదే మార్గమున ధ్యానయోగమునా శ్రయించి మహాత్ములై రుద్రలోకపరాయణులు (చేరినవారు) కాగలరు-130.

వసిష్ఠశ్చాష్టమే వ్యాసః పరివర్తే భవిష్యతి

 కపిలశ్చాసురిశ్చైవ తథా పంచశిఖో మునిః

వాగ్బలిశ్చ మహాయోగీ సర్వఏవ మహౌజసః

ప్రాప్య మాహేశ్వరం యోగం ధ్యానినో దగ్దకల్మషాః

 మత్సమిపం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

తిరుగుచు వచ్చిన యెనిమిదవ ద్వాపరయుగమున వసిష్ఠుడు వ్యాసుడగును. కపిలుడు. ఆసురి, మునియైన పంచశిఖుడు, మహాయోగియైన వాగ్బలియు వీరందరు గొప్ప ఓజస్సు గలవారు. వీరు ధ్యానయోగులై పాపములదహించి మాహేశ్వరయోగమును బొంది పునః పునః జన్మలలో గూడ లభింపనలవిగాని నా సమీపమును (రుద్రలోకమును) జేరుదురు -131,132. (ఇట రుద్రుడు ఏ నామముతో ఉండునో తెలుపలేదు

పరివర్తేఽథనవమే వ్యాసః సారస్వతోయదా

తదాచాహం భవిష్యామి ఋషభోనామనామతః

తత్రాపి మమతే పుత్రాః భవిష్యన్తి మహౌజసః

 పరాశరశ్చగార్గ్యశ్చ భార్గవో హ్యంగిరాస్తథా

 భవిష్యన్తి మహోత్మానో బ్రాహ్మణా వేద పారగాః

 సర్వే తపోబలోత్కృష్టాః శాపానుగ్ర కోవిదాః

 తేఽపి తేనైవ మార్గేణ యోగోక్తేన తపస్వినః

ధ్యానమార్గం సమాసాద్య గమిష్యన్తి తథైవ తే

తరువాత తిరుగుచు వచ్చిన తొమ్మిదవ ద్వాపరమున సారస్వతుడు వ్యాసుడగును.అపుడు నేను ఋషభుడను పేరుతో నుండగలను అచట గూడ నాకు మహాతేజస్సు గల పుత్రులు గలుగుదురు-133. వారు పరాశరుడు గార్గ్యుడు భార్గవుడు, అంగిరుడు అనువారు. వారందరు మహాత్ములు వేదపారగులు, తపోబలముచే గొప్పవారు శాపమిచ్చుటలోను ఉపసంహరించి యను గ్రహించుటలోను సమర్థులు వారు గూడ యోగోక్షమార్గమునే తపస్వినులై ధ్యానమార్గమును బొంది నా రుద్రలోకమును జేరుదురు-135.

దశమే ద్వాపరే వ్యాసస్త్రిధామా నామ నామతః

యదా భవిష్యత(?) వి ప్రాస్తదాహం భవితా పునః

 హిమవచ్ఛిఖరే రమ్యే భుగుతుంగే నగొత్తమే

 నామ్నా భృగోస్తు శిఖరం తస్మాత్తచ్ఛిఖరం భృగుః

 తత్రైవ మమ తే పుత్రా భవిష్యన్తి దృఢవ్రతాః

 బలబంధుర్నిరామిత్రః కేతుశృంగస్తపోధనః

యోగాత్మానో మహాత్మానో ధ్యానయోగ సమన్వితాః

 రుద్రలోకం గమిష్యన్తి తపసా దగ్దకల్మషాః

పదియవ ద్వాపరమున త్రిధాముడనువాడు వ్యాసుడగును. ఓ బ్రాహ్మణులారా అపుడు మరల నేను రాగలను-136. హిమాలయ శిఖరమున కొండ చరియలతో నెతైన పర్వతము గలదు. దాని పేరు. భృగువుయొక్క శిఖరము-137. కావున నాశిఖరము భృగువైనది. అచటనే దృఢవ్రతులైన (యా) పుత్రులు నాకు గలుగుదురు. వారు బలబంధువు, నిరామిత్రుడు కేతుశృంగుడు తపోధనువారు-138. వీరు యోగాత్ములు మహాత్ములు ధ్యానయోగముతోగూడిన వారు వీరు తమ తపస్సులచే తపపాపములను దహింపజేసిన వారై రుద్రలోకమును జేరగలరు-139.

ఏకాదశే ద్వాపరే తు త్రివృద్వ్యాసో భవిష్యతి

తదాప్యహం భవిష్యామి గంగా ద్వారే కలర్ధురి

ఉగ్రానామ మహానాదాస్తత్రైవ యమపుత్రకాః

భవిష్యన్తి మహౌజస్కాః సువృత్తా లోకవిశ్రుతాః

లంబోదరశ్చ లంబశ్చలంబాక్షో లంబకేశకః

 ప్రాప్య మాహేశ్వరం యోగం రుద్రలోకాయ సంస్థితాః

తేSపి తేనైవ మార్గేణ గమిష్యన్తి పరాం గతిమ్

పదునొకండవ ద్వాపరమున త్రివృత్ అనువాడు వ్యాసుడగును అప్పుడుగూడ కలియెదుట గంగా ద్వారమున నేను రాగలను-140. అచటనే ఉగ్రులను వారు మహానాదముగలవారై నాకు పుత్రులు గాగలరు. వారు గొప్ప ఓజస్సు గలవారు మంచినడవడిగలవారు లోకప్రసిద్ధులు-141. వారి పేరులు లంబోదరుడు, లంబుడు, లంబాక్షుడు, లంబకేశుడు, వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమునకు బయలుదేరుదురు. వారుగూడ ఆ మార్గమున (ధ్యాన యోగ మార్గమున)నే పరమగతిని (రుద్రలోకమునకు) బొందుదురు-142.

ద్వాదశే పరివర్తే తు శతతేజా మహామునిః

 భవిష్యతి మహాసత్త్వో వ్యాసః కవివరోత్తమః

తతోఽప్య భవిష్యామి ఆవిర్నామ యుగాన్తికే

 హైమకం వనమాసాద్య యోగమాస్థాయ భూతలే

అత్రాపి మమ తే పుత్రా భస్మస్నానానులేపనాః

 భవిష్యన్తి మహాయోగాః రుద్రలోక పరాయణాః

సర్వజ్ఞః సమబుద్ధిశ్చ సాధ్యః సర్వస్తథైవ చ

రుద్రలోకం గమిష్యన్తి ధ్యానయోగ పరాయణాః

పండ్రెండవ ద్వాపరమున శతతేజుడను మహాముని మహాసత్త్యుడై కవి వరుడైన వ్యాసుడు గాగలడు. అపుడు గూడ యుగాంతమునవిః అను పేరుతో హైమక వనమును (బంగారులేక మంచుగల వనమును) బొంది యోగమును బూని భూతలమున నుండగలను-144. ఇచట గుణ భస్మతో స్నానము జేసి, భస్మను బూసికొన్న వారు మహాయోగులు రుద్రలోకపరాయణులైనవారు నాకా పుత్రులు గలుగగలరు-145. వారు సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యుడు సర్వుడు అనువారు. వారు ధ్యానయోగపరాయణులై రుద్రలోకమును బొందగలరు-146.

త్రయోదశే పునః ప్రాప్తే పరివర్తే క్రమేణ తు

 ధర్మో నారాయణోనామ వ్యాసస్తు భవితా యదా

తదాఽప్యహం భవిష్యామి వాలిర్నామ మహామునిః

వాలఖిల్యాశ్రమే పుణ్యే పర్వతే గన్ధమాదనే

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి తపోధనాః

 సుధామా కాశ్యపశ్చైవ వసిష్టో విరజాస్తథా

 మహాయోగ బలోపేతా విమలా ఊర్ధ్వరేతసః

తేనైవ యోగమార్గేణ గమిష్యన్తి న సంశయః

క్రమముగా పదమూడవ పరిభ్రమణమైన ద్వాపరము రాగా నారాయణుడను ధర్ముడు వ్యాసుడు గాగలడు-147. అపుడు నేను గంధమాదన పర్వతమున పుణ్యమైన వాలఖల్యాశ్రమమున వాలియను మహామునిగా రాగలను-148. అచట గూడ నాకు ఆతపోధనులు పుత్రులుగా గలరు. వారు సుధాముడు, కాశ్యపుడు వసిష్ఠుడు, విరజుడు-అనువారు-149. మహాయోగబలముతో గూడి విమలుడై యూర్ధ్వరేతస్కులైన వారు గూడ ఆయోగదారణముతోనే రుద్రలోకమును చేరగలరు-150.

సురక్షణో యదా వ్యాసః పర్యాయే తు చతుర్దశే

 తత్రాపి పునరేవాఽహం భవిష్యామి యుగాన్తికే 

 వంశే త్వంగిరసః శ్రేష్ఠో, గౌతమో నామ యోగవిత్

 తస్మాద్భవిష్యతే పుణ్యం గౌతమం నామ తద్వనమ్

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి కలౌతథా

 అత్రిరుగ్రత పాశ్చైవ శ్రావణోఽథసవిష్టకః

 యోగాత్మానో మహాత్మానో ధ్యానయోగరాయణాః

తేఽపి తేనైవ మార్గేణ రుద్రలోక నివాసినః

 పదునాలుగవ పర్యాయమైన ద్వాపరమున సురక్షణుడను వాడు వ్యాసుడగును. అచట గూడ యుగాన్తమున-151. అంగీరస వంశశ్రేష్ఠుడనై గౌతముడను యోగవేత్తనుగా రాగలను ఆగౌతముని నుండియే యాగౌతమవన మేర్పడగలదు-152. అచట గూడ కలిలో నాకు నలుగురు పుత్రులు గలుగగలరు. వారు అత్రి ఉగ్రతపుడు శ్రావణుడు స్రవిష్టుడు-అనువారు-153. యోగాత్ములు, మహాత్ములు, ధ్యానాయోగ పరాయణులు నైన వారు గూడ ధ్యానయోగమార్గముననే రుద్రలోకవాసులగుదురు-154.

తతః ప్రాప్తే పంచదశే పరివర్తే క్రమాగతే

ఆరుణిస్తు యదా వ్యాసో ద్వాపరే భవితా ప్రభుః

 తదాఽప్యహం భవిష్యామి నామ్నా వేదశిరాద్విజాః

తత్ర వేదశిరా నామ అస్త్రం తత్పరమేశ్వరమ్

 భవిష్యతి మహావీర్యం వేదశీర్షా చ పర్వతః

 హిమవత్పృష్ఠమాశ్రిత్య సరస్వత్యా నగోత్తమే

 తదాపి మమ తే పుత్రా భవిష్యన్తి తపోధనాః

 కుణిశ్చ కుణిబాహుశ్చ కుశరీరః కునేత్రకః

 యోగాత్మానో మహాత్మానో బ్రహ్మిష్ఠాశ్చోర్థ్వరేతసః

తేపి తేనైవ మార్గేణ రుద్రలోకం గతాస్తుతే

పర్యాయక్రమమున వచ్చు పదియైదవ ద్వాపరమున ప్రభువైన ఆరుణియనువాడు వ్యాసుడు గాగలడు-155. ఓ బ్రాహ్మణులారా అపుడు నేను గూడ వేదశిరుడను పేరు వాడను గాగలను అచట పరమేశ్వర దేవతాకమైన వేదశిరోనామకాస్త్రము కలుగగలదు-156. అది మహావీర్వవంతమైన యస్త్రము హిమవత్పర్వతపు వెనుకటి భాగమునాశ్రయించి సరస్వతీనదీ తీర్థస్థమైన పర్వతశ్రేష్ఠమున (సరస్వతీ పర్వతముగా వచ్చును) వేద శీర్షమను పర్వతము గూడ నుండును అపుడు గూడ నాకాతపోధనులు పుత్రలుగొ గలరు. వారు కుణి, కుణిబాహువు, శుశరీరుడు, కునేత్రకుడు -అనువారు-158. యోగాత్ములై మహాత్ములై బ్రహ్మిష్ఠులై (బ్రహ్మమునందున్న వారై) ఊర్థ్వరేతస్కులైన వారుగూడ యోగధారణముచేతనే రుద్రలోకమును జేరిరి-159.

తతఃషోడశమే చాపి పరివర్తే క్రమాగతే

వ్యాసస్తు సంజయో నామ భవిష్యతి తదా ప్రభుః

 తదాఽప్యహం భవిష్యామి గోకర్ణే నామ నామతః

 తస్మాద్భవిష్యతే పుణ్యం గోకర్ణం నామ తద్వనమ్

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి మహౌజసః

 కశ్యపోహ్యుశనాశ్చైవ చ్యవనోఽ థబృహస్పతిః

 తేఽపి తేనైవ మార్గేణ గమిష్యన్తి పరంపదమ్

పర్వాయక్రమమున తిరుగుచు వచ్చు పదునారవ ద్వాపరమున సంజయుడను వ్యాసుడు ప్రభువు గాగలడు-160 అప్పుడు గూడ గోకర్ణుడను పేరుతో నుండగలను. ఆ గోకర్ణుని నుండియే గోకర్ణమను నా వనము ఏర్పడగలదు-161. అచట గూడ మహౌజస్కులైన యాపుత్రులు కలుగగలరు. వారు కశ్యపుడు, ఉశనుడు, చ్యవనుడు, బృహస్పతియను వారు వారు గూడ యోగధారణమార్గముననే పరమపదమైన రుద్రలోకమును బొందగలరు-162.

తతఃసప్తదశే చైవ పరివర్తే క్రమాగతే

తదా భవిష్యతి వ్యాసో నామ్నాదేవకృతం జయ

 తదాప్యహం భవిష్యామి గుహావాసీతి నామతః

 హిమవచ్చిఖరే చైవ మహాతుంగే మహాలయే

సిద్ది క్షేత్రం మహాపుణ్యం భవిష్యతి మహాలయమ్

 తత్రాపి మమ తే పుత్రా బ్రహ్మణ్యా యోగవేదినః

 భవిష్యన్తి మహాత్మానః సర్వజ్ఞాని రహంకృతాః

 ఉతధ్యో వామదేవశ్చ మహాకాలో మహాలయః

 తేషాం శతసహస్రం తు శిష్యాణాం ధ్యానసాధనమ్

 భవిష్యన్తి తదా కల్పే సర్వే తే ధ్యానయుంజకాః

 తే తు సన్నిహితాయోగే హృది కృత్వా మహేశ్వరమ్

 మహాలయే పదుక్షిప్త్యా ప్రవిష్టాః శివమవ్యయమ్

యేచాన్యేఽపి మహాత్మానః కాలే తస్మిన్ యుగాన్తికే

ధ్యానయుక్తేన మనసా విమలాః శుద్దబుద్ధయః

గత్వామహాలయం పుణ్యం దష్ట్యా మాహేశ్వరం పరాన్

ఆత్మానమేకవింశం చ తారయిత్వా మహార్ణవమ్

 మమ ప్రసా ద్యాస్య దాంతి రుద్రలోకం గతజ్వరాః

తరువాత పర్యాయక్రమమున తిరిగి వచ్చు పదునేడవ ద్వాపరమున దేవకృతంజయుడను వాడు వ్యాసుడుగాగలడు 163. అపుడు గూడ నేను గుహావాసియను పేరనుండగలను. ఎత్తైన హిమాలయపర్వత శిఖరమున మహాలయమను దానియందు మహాపుణ్యవంతమైన మహాలయమను సిద్ది క్షేత్రముండగలదు-164. అటగూడ బ్రాహ్మణ్యులు యోగమును దెలిసినవారు మహాత్ములు సర్వజ్ఞులు నిరంహంకారులైన యాపుత్రులు నాకు గలుగగలరు-165. వారు ఉతథ్యుడు, వామదేవుడు, మహాకాలుడు, మహాలయుడు-అనువారు వారికి లక్షమంది శిష్యులు ధ్యానయోగసాధనముజేయుదురు-166, 166. అప్పుడా కల్పమున వారందరు ధ్యానయోగులు కాగలరు. వారు ధ్యాయోగధారణమును చక్కగా జేసిన వారై హృదయమున మహేశ్వరుని నిలిపి మహాలయమున (అన్ని ప్రాణులులీనమగు గొప్పయాలయమైన శివపదము) అడుగిడి నాశరహితుడైన శివునిలో ప్రవేశింతురు-167. ఇతరులైన మహాత్ములుగూడ నాయుగానమైన కాలమున ధ్యానయుక్తమైన మనస్సుతో నిర్మలులై శుద్ధమైన బుద్ధులు గలవారై-168. మహాలయమును బొంది. మహేశ్వర పదము (స్థానమును) జూచి, వెంటనే వేగముగా తమకు పది తరముల పూర్వులను పది తరములములందు వారిని తరింపజేయుదురు-169. తనను కలిపి మొత్తము ఇరువది యొక్కరిని మహాసముద్రమును తరింపజేసి జ్వరము లేని వారై రుద్రలోకమును జేరుదురు-170.

తతోఽష్టాదశమే చైవ పరీవర్తే యదా భవేత్

తదా బుతంజయో నామ వ్యాసస్తు భవితా మునిః

 తదాఽప్యహం భవిష్యామి శిఖండీ నామనామతః

 సిద్ధక్షేత్రే మహాపుణ్యే దేవదానవపూజితే

హిమవచ్ఛిఖరే పుణ్యే శిఖండీ యత్ర పర్వతః

శిఖండినో వనం చాపి ఋషిసిద్ధ నిషేవితమ్

 తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి తపోధనాః

 వాచఃశ్రవా ఋతీకాశ్చ శావాసశ్చ దృఢవ్రతాః

యోగాత్మానో మహాశక్తాః సర్వే తే వేదపారగాః

 ప్రాప్య మాహేశ్వరం యోగం రుద్రలోకం వ్రజన్తి తే

తరువాత పర్యాయక్రమమున తిరగి వచ్చు పదునెనిమిదవ ద్వాపరమున ఋతుంజయుడను ముని వ్యాసుడగును. అపుడు గూడ నేను శిఖండియను పేరనుండగలను-171. సిద్దిక్షేత్రమై మహాపుణ్యమై దేవదానవులచే పూజింపబడినదై హిమాలయశిఖరమున శిఖండియను పర్వతముండును. అచటనే ఋషుల చేతను సిద్ధులచేతను సేవింపబడిన (నివసింపబడిన)-172. శిఖండివనము (నెమలి వనము) ఉండును. అచటగూడ ఆ తపోధనులైన వారు నాకు పుత్రులు గాగలరు. వారు వాచః శ్రవుడు, ఋతి(చీ)కుడు, శావాసుడు దృఢవ్రతుడు అనువారు-173. యోగాత్ములై మహాశక్తి గలవారైన వారందరు వేదములయంతముల వరకు చదివి తెలిసికొన్నవారు. వారు మాహేశ్వరమైన యోగమును బొంది వారు రుద్రలోకమును జేరుదురు-174.

తతస్త్వేకోనవింశే తు పరివర్తే క్రమాగతే

 వ్యాసస్తు భవితా నామ్నా భరద్వాజో మహామునిః

 తత్రాప్యహం భవిష్యామి జటామాలీతి నామతః

 హిమవచ్చిఖరే రమ్యే జటాయుర్యత్ర పర్వతః

తత్రాహి మమ తే పుత్రా భవిష్యన్తి మహౌజసః

 హిరణ్యనామాకౌశిల్యః కాక్షీవః కుధిమస్తథా

 ఈశ్వరాయోగధర్మాణః సర్వే తే హ్యూర్థ్వరేతసః

 ప్రాప్య మాహేశ్వరం యోగం గమిష్యన్తి న సంశయః

ఆ తరువాత పర్యాయ క్రమమున వచ్చు పందొమ్మిదవ ద్వాపరమున భరద్వాజుడను మహాముని వ్యాసుడగును-175. అటగూడ నేను జటామాలియను పేర జటాయుపర్వతమున్న రమ్యమయిన హిమాలయశిఖరము పైన నుందును-176 అటగూడ మహౌజస్కులైన యాపుత్రులు నాకు గలుగుదురు. వారు హిరణ్యుడు. కౌశిల్యుడు, కాక్షీవుడు, కుథిముడు, అనువారు-177. యోగధర్మము గలిగి యీశ్వరులైన వారందరు ఊర్థ్వరేతస్కులు వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరుదురు-178.

తతో వింశతి తమే సర్గే పరివర్తే క్రమేణతు

 వాచరిశ్రవాః స్మృతో వ్యాసోభవిష్యతి మహామతిః

 తదాప్యహం భవిష్యామి హ్యట్టహాసీతి నామతః

 అట్టహాసప్రియాశ్చాపి భవిష్యన్తి తదా నరాః

తత్రైవ హిమవత్ప్సష్ఠే సిద్ధచారణ సేవితే

 తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్ తి మహౌజసః

యుక్తాత్మానో మహాసత్త్వా ధ్యానినో నియతవ్రతాః

సుమన్తుర్వర్వరిర్విద్వాన్ సుబంధః కుశికంధరః

 ప్రాప్య మాహేశ్వరం యోగం రుద్రలోకాయ తే గతాః

తరువాత పర్యాయక్రమమున తిరిగి వచ్చు ఇరువదియవ ద్వాపరసృష్టిలో మహామతియైన వాచః శ్రవుడను వాడు వ్యాసుడు గాగలడు-179. అప్పుడు గూడ నేనే అట్టహాసియను పేరనుండగలను అపుడు నరులందరు అట్టహాస (పెద్దనవ్వు) ప్రియులగుదురు-180. సిద్ధులు చారణులు నివసించు నా హిమాలయము పైన నాకు మహౌజస్కులైన యాపుత్రులు గలుగుదురు. వారు యోగముతో గూడిన యాత్మలు గలవారు. మహాబలులు, ధ్యానయోగముగలవారు నియతమైన వ్రతములు గలవారు-181. వారు సుమంతుడు. విద్యాంసుడైనవర్వరి సుబంధువు, కుశీకంధరుడు- అనువారు వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరిరి-182.

ఏకవింశే పునః ప్రాప్తే పరివర్తే క్రమేణ తు

 వాచస్పతిః స్మృతో వ్యాసో యదా న ఋషిసత్తమః

 తదాఽప్య హం భవిష్యామి దారుకో నామ నామతః

 తస్మాద్భవిష్యతే పుణ్యం దేవదారువనం మహత్

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి మహౌజసః

 ప్లక్షో దాక్షాయణిశ్చైవ కేతుమాలీ బకస్తథా

యోగాత్మానో మహాత్మానో నియతాహ్యూర్థ్వరేతసః

 పరమం యోగమాస్థాయ రుద్రం ప్రాప్తాస్తథాఽనఘాః

పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది యొకటవద్యాపరమున వాచస్పతియను ఋషి సత్తముడు వ్యాసుడగును-183. ఆపుడు గూడ నేను దారుకుడను పేరనుందును. అందునుండియే గొప్పనైపుణ్యమైన దేవదారువనము ఏర్పడగలదు-184. అటగూడ నాకు నా మహౌజస్కులైన పుత్రులు గలుగగలరు. వారు ప్లక్షుడు దాక్షాయణి, కేతుమాలి, బకుడు-అనువారు-185. యోగాత్ములు మహాత్ములు నియతులు, ఊర్థ్వరేతస్కులు అట్లే అనఘులు (ప్రాపరహితులు) ఐన, వారు పరమయోగమున నుండి రుద్రుని. బొందుదురు-186.

ద్వావింశే పరివర్తే తు వ్యాసః శుక్లాయనో యదా

 తదాఽప్య హం భవిష్యామి వారణస్యాం మహామునిః

నామ్నా వైలాంగలీ భీమోయత్ర దేవాః సవాసవాః

 ద్రక్ష్యన్తి మాం కలౌతస్మిన్నవతీర్ణం హలాయుధమ్

తత్రాహి మమ తే పుత్రా భవిష్యన్తి సుధార్మికాః

 తుల్యార్చిర్మధుపింగాక్షః శ్వేతకేతుస్తథైవ చ

తేఽపి మాహేశ్వరం యోగం ప్రాప్యధ్యాన పరాయణాః

విరజాబ్రహ్మభూయిష్టా రుద్రలోకాయ సంస్థితాః

పర్యాయ క్రమమున తిరగి వచ్చు ఇరువది రెండవ ద్వాపరమున శుక్లాయనుడను వాడు వ్యాసుడగును. అప్పుడు గూడ నేను మహామునినై నాగలిధరించిన (లాంగలియైన) భీముడను పేరనుండగలను. అచట ఇంద్రునితో గూడిన దేవతలు కలిలో అవతరించిన హలాయుధుని (భీమునిగా జూడగలరు-187,188. అచటగూడ నాకు సుధార్మికులైన యాపుత్రులు గలుగగలరు. వారు తుల్యార్చి మధువు పింగాక్షుడు, శ్వేతకేతువు అనువారు-189. వారు గూడ మహేశ్వర యోగమునవలంబించి ధ్యానపరాయణులై రజోగుణము లేనివారై బ్రహ్మమయులై రుద్రలోకమునకు వెళ్ళేదరు-190.

పరివర్తే త్రయోవింశే తృణబిందుర్యదామునిః

 వ్యాసో భవిష్యతి బ్రహ్మాదాఽహంభవితా పునః

 శ్వేతో నామ మహాకాయో ముని పుత్రః సుధార్మికః

 తత్ర కాలం జరిస్యామి తదా గిరివరోత్తమే

తేన కాలం జరో నామ భవిష్యతి సపర్వతః

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి మహౌజసః

 ఉషిజోబృహదుక్థశ్చ దేవలః కవిరేవ చ

 ప్రాప్య మాహేశ్వరం యోగం రుద్రలోకం గతా హి తే

పర్యాయక్రమమున తిరగి వచ్చు ఇరువది మూడవ ద్వాపరమున తృణ బిందువనుముని వ్యాసుడగును. ఆవ్యాసుడు బ్రహ్మ అపుడు నేను శ్వేతుడను పేర మహాకాయుడనై ముని పుత్రుడనై సుధార్మికుడనై యుండగలను-191. అట్టినేను పర్వత శ్రేష్ఠములలో గూడ నుత్తమమైన పర్వతమున (హిమాలయమున) కాలమును గడుపగలను ఆ కారణమున నా పర్వతమున (హిమాలయమున) కాలమును గడుపగలను ఆ కారణమున నా పర్వతము కాలంజరమను పర్వతముగాగలదు-192. అచటగూడ నాకు ఆ మహౌజస్కులైన పుత్రులు గలుగగలరు. వారు-ఉషిజుడు, బృహదుక్తుడు, దేవలుడు, కవి అనువారు. వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును బొందుదురు-193.

పరివర్తే చతుర్వింశే ఋక్షో వ్యాసో భవిష్యతి

తత్రాఽహం భవితా బ్రహ్మన్ కలౌతస్మిన్ యుగాన్తికే

 శూత నామ మహాయోగీ నైమిషే యోగివందితే

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి తపస్వినః

 శాలిహోత్రోఽగ్ని వేశ్యశ్చ యువనాశ్వః శరద్వసుః

 తేఽపి యోగబలోపేతాః రుద్రం యాస్యన్తి సువ్రతాః

పర్యాయక్రమమున తిరగివచ్చు ఇదువది నాలుగవ ద్వాపరమున ఋక్షుడను వాడు వ్యాసుడు గాగలడు. ఓ బ్రహ్మ అచట నా కలియుగ సమీపమున యోగివందితమయిన నైమిషమున (నైమిషారణ్యమున), శూలయను. పేర మహాయోగినై యుందును-194. అచటగూడ నాకు తపస్వినులైన యా పుత్రులు గలుగ గలరు. వారు శాలిహోత్రుడు, అగ్నివేశ్యుడు, యువనాశ్వుడు, శరద్వసువు,-అనువారు. వారుగూడ యోగబలముతోగూడిన వారై సువ్రతులై రుద్రుని జేరుదురు-195.

పంచవింశే పునః ప్రాప్తే పరివర్తే యథాక్రమమ్

వసిష్ఠస్తు యదా వ్యాసః శక్తిర్నామ భవిష్యతి

 తదాఽప్యహం భవిష్యామి దండీ ముండీ శరః ప్రభుః

కోటివర్షం సమాసాద్య నగరం దేవపూజితమ్

 తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్తి క్రమాగతాః

యోగాత్మానో మహాత్మానః సర్వే తే హ్యూర్ధ్వరేతసః

 ఛగలః కుంభకర్షాశ్యః కుంభశ్చైవ ప్రబాహుకః

 ప్రాప్య మాహేశ్వరం యోగం గమిష్యన్తి తథైవ తే

పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువదియైదవ ద్వాపరమున వసిష్ఠుడను వ్యాసుడు శక్తియను పేర నుండగలడు-196. అపుడుగూడ నేను దండినై (దండధారినై) ముండినై (శిరో ముండనము జేసికొన్న వాడనై) శరుడనై ప్రభువునై దేవతలచే పూజింపబడిన కోటివరమను నగరమును బొందియుండగలను. అచటగూడ నాకు ఆక్రమాగతులైన పుత్రులు గలుగగలరు. వారు యోగాత్ములు, మహాత్ములునైన వారందరు ఊర్థ్వరేతస్కులు-198. వారు ఛగలుడు, కుంభకర్షాశ్యుడు (కుభకర్ణాస్యుడు) కుంభుడు, ప్రబాహుకుడు - అనువారు. వారు మాహేశ్వరయోగమునుబొంది పూర్వము వారివలెనే రుద్రలోకమును జేరుదురు- 199.

షడ్వింశే పరివర్తేతు యదా వ్యాసః పరాశరః

 తదాఽప్యహం భవిష్యామి సహిష్ణుర్నామ నామతః

 పుణ్యం రుద్రవనం ప్రాప్య కలౌతస్మిన్ యుగాన్తి కే

తత్రాపి మమ తే పుత్రా భవిష్యన్ తి సుధార్మికాః

ఉలూ కోవైద్యుతశ్చైవ సర్వకోహ్యశ్వలాయనః

ప్రాప్య మాహేశ్వరం యోగం గన్తారస్తే తథైవహి

పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇదువది యారవ ద్వాపరమున పరాశరుడనువాడు వ్యాసుడగును. ఆపుడుగూడ నా కలియుగ సమీపమున రుద్రవనమును బొంది నేను సహిష్ణువను పేర నుండగలను-200. అచటగూడ నాకు సుధార్మికులైన, యా పుత్రులు గలుగగలరు. వారు-ఉలూకుడు వైద్యుతుడు, సర్వకుడు, ఆశ్వలాయనుడు-అనువారు. వారుగూడ మాహేశ్వర యోగమును బొంది పూర్వము వారివలెనే రుద్రుని జేరగలరు-201.

సప్తవింశతిమే ప్రాప్తే పరివర్తే క్రమాగతే

 జాతూకర్ణ్యో యదా వ్యాసో భవిష్యతి తపోధనః

తదాఽప్యహం భవిష్యామి సోమశర్మా ద్విజోత్తమః

 ప్రభాసతీర్థ మాసాద్యయోగాత్మా లోక విశ్రుతః

తత్రాపి మమ తే పుత్రాభవిష్యన్తి తపోధనాః

అక్షపాదః కణాదశ్చ ఉలూకో వత్స ఏవ చ

యోగాత్మానో మహాత్మానో విమలాః శుద్ధబుద్ధయః

 ప్రాప్య మాహేశ్వరం యోగం రుద్రలోకం తతో గతాః

పర్యాయక్రమమున తిరిగి వచ్చు ఇరువది యేడవ ద్వాపరమున జాతూకర్ల్యుడను తపోధనుడు వ్యాసుడగును-202. అపుడుగూడ నేను సోమశర్మ యను పేర బ్రాహ్మణోత్తముడనై ప్రభాసతీర్థమును జేరియోగాత్ముడనై లోకప్రసిద్దుడను గాగలను-203. అచట గూడ నాకు ఆతపోధనులైన పుత్రులు గలుగగలగరు. వారు అక్షపాదుడు, కణాదుడు, ఉలూకుడు, వత్సుడు, అనువారు, వారు యోగాత్ములు మహాత్ములు నిర్మలులు శుద్ధమైన బుద్ధులు గలవారు. వారు గూడ మహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరుదురు-204, 205.

అష్టావింశే పునః ప్రాప్తే పరివర్తే క్రమాగతే

 పరశరసుతః శ్రీమాన్ విష్ణుర్లోక పితామహః

యదా భవిష్యతి వ్యాసో నామ్నాద్వైపాయనః ప్రభుః

తదా షష్ఠేన చాంశేన కృష్ణః పురుషోత్తమః

వసుదేవాద్యదుశ్రేష్ఠో వాసుదేవో భవిష్యతి

తదాచాహం భవిష్యామి యోగాత్మా యోగమాయయా

 లోకవిస్మయనార్థాయ బ్రహ్మచారి శరీరకః

శ్మశానే మృతముత్సృష్టం దష్ట్యా లోకమనాథకమ్

 బ్రాహ్మణానాం హితార్థాయ ప్రవిష్ణో యోగమాయయా

దివ్యాం మేరుగుహాం పుణ్యాం త్వయాసార్థం చవిష్ణునా

 భవిష్యామి తదా బ్రహ్మన్ నకుతో నామనామతః

 కాయారోహణమిత్యేవం సిద్ధక్షేత్రం చ వై తదా

 భవిష్యతి తు విఖ్యాతం యావద్భూమిర్ధరిష్యతి

 తత్రాహి మమ తే పుత్రా భవిష్యన్తి తపస్వినః

 కుశికశ్చైవ గార్గ్యశ్చ మిత్రకోరుష్ట ఏవ చ

యోగయుక్తా మహాత్మానో బ్రాహ్మణా వేదపారగాః

 ప్రాప్య మాహేశ్వరం యోగం విమలాహ్యూర్థ్వరేతసః

రుద్రలోకం గమిష్యన్తి పునరావృత్తి దుర్లభమ్

ఇత్యేతద్వైమయాపోక్తమవతారేషు లక్షణమ్

 మన్వాదికృష్ణపర్యన్తమష్టావింశ యుగక్రమాత్

 తత్ర స్మృతి సమూహానాం విభాగో ధర్మలక్షణమ్

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే మాహేశ్వరావతారయోగో నామ త్రయోవింశోఽధ్యాయః

పర్యాయక్రమమున తిరగి వచ్చు ఇరువది యెనిమిదవ ద్వాపరమున పరాశరుని కుమారుడు. శ్రీమంతుడైన విష్ణువు లోకపితామహుడు (లోకబ్రహ్మయై-206, ద్వైపాయనుడను పేర వ్యాసుడై ప్రభువగును. అపుడు (నా) ఆరదవ వంశమున కృష్ణుడైన పురుషసత్తముడు (పురుషోత్తముడగు విష్ణువు), వసుదేవుని నుండి యదుశ్రేష్ఠుడై వాసుదేవుడు అవతరింపగలడు-207. అపుడు గూడ నేను యోగాత్ముడనై యోగమాయచేత లోకమునాశ్చర్యపరచుటకై బ్రహ్మచారి శరీరముగలవాడనగుదును-208. శ్మశానమున చనిపోయి వదలి పెట్టబడిన యనాథయైన లోకమును జూచి బ్రాహ్మణుల హితము కోరకై విష్ణువుతోను నీతోను సహితముగా యోగమాయచే-209, పుణ్యమై దివ్యమై (దేవ సంబంధమైన) మేరుపర్వతము యొక్క గుహను బ్రవేశింతును. అపుడు ఓ బ్రహ్మా, నకులీయనుపేరనుండగలను. అపుడు భూమియున్నంతవఱకు ఇది కాయారోహణమను సిద్ది క్షేత్రముగా గలదు-211. అచట గూడ నాకా తపస్వినులు పుత్రులుగా గలరు. వారు కుశికుడు, గార్యుడు, మిత్రకుడు, రుష్టుడు-అనువారు-212. యోగయుక్తులై మహాత్ములై వేదపారగులైన బ్రాహ్మణులై వారు మాహేశ్వర యోగమును బొంది విమలులై యూర్థ్వరేతస్కులునై పునః పునః జన్మలతో లభింపనలవిగాని రుద్రలోకమును జేరగలరు-213. అనియీ విధముగా మనువు మొదలుకొని కృష్ణుని వరకు ఇరువదియెనిమిది యుగముల వరుసలో నాచేత అవతారములలోని లక్షణము జెప్పబడినది. అచట స్మృతుల సమూహముల విభాగము ధర్మలక్షణము-214.

అని శ్రీవాయుప్రోక్తే మహాపురాణమునందు మాహేశ్వరావతారయోగమను ఇరువదిమూడవయధ్యాయము.