వాయు మహా పురాణము
27 - మహాదేవతనువర్ణనం
ఋషయ ఊచు:-
అస్మిన్ కల్పే త్వయా చోక్తః ప్రాదుర్భావో మహాత్మనః ।
మహాదేవస్య రుద్రస్య సాధకైర్మునిభిః సహ ॥
ఋషులనిరి:- ఈ కల్పమున సాధకులైన మునులతో బాటు మహాత్ముడు మహాదేవుడునైన రుద్రుని యొక్క ప్రాదుర్భావము నీచే చెప్పబడినది-1.
సూత్రువాచ:-
ఉత్పత్తిరాదిసర్గస్య మయా ప్రోక్తా సమాసతః ॥
విస్తరేణాస్య వక్ష్యామి నామాని తనుభిః సహ॥
పత్నీషు జనయామాస మహాదేవః సుతాన్ బహూన్ ।
కల్పేఽ ష్టమే వ్యతీతే తు యస్మిన్ కల్పే తు తచ్ఛృణు॥
కల్పాదౌ చాత్మనస్తుత్యం సుతం ప్రధ్యాయతః ప్రభోః ।
ప్రాదురాసీత్తతోఽజేఽ స్య కుమారో నీల లోహితః।
తం దదే సుస్వరం ఘోరం నిర్దహన్నిన తేజసా॥
దృష్ట్యా రుదస్తం సహసా కుమారం నీల లోహితమ్ ।
కిం రోదిషి కుమారేతి బ్రహ్మా తం ప్రత్యభ్యాషత॥
సోఽ బ్రవీద్దేహి మే నామ ప్రథమం వై పితామహ! ॥
రుద్రస్త్యం దేవ నామ్నాసి ఇత్యుక్తః సోఽరుదత్పునః ॥
కిం రోదిషీతి తం బ్రహ్మా రుదన్తం పునరబ్రవీత్ ।
నామదేహి ద్వితీయం మే ఇత్యువాచ స్వయంభువమ్॥
భవస్త్యం దేవ నామ్నాసి ఇత్యుక్తః సోఽరుదత్పునః ।
కిం రోదిషీతి తం బ్రహ్మా ప్రత్యువాచాథ శఙ్కరమ్॥
తృతీయం దేహి మే నామ ఇత్యుక్తః ప్రత్యువాచ తమ్ ।
శివస్త్యం దేవ నామ్నాసి ఇత్యుక్తః సోఽరుదత్పునః ॥
కిం రోదిషీతి తం బ్రహ్మా రుదన్తం పునరబ్రవీత్ ।
చతుర్థం దేహి మే నామ ఇత్యుక్త్యా చ స్వయంభువమ్॥
పశూనాం త్వం పతిర్దేవ ఇత్యుక్తః సోఽరుదత్పునః ।
కింరోదిషీతి తం బ్రహ్మా రుదన్తం పునరబ్రవీత్॥
పంచమం దేహి మే నామ ఇత్యుక్తః ప్రత్యువాచ తమ్ ।
ఈశస్త్యం దేవ నామ్నాసి ఇత్యుక్తః సోఽరుదత్పునః ॥
కిం రోదిషన్త తం బ్రహ్మా రుదన్తం పునరబ్రవీత్ ।
షష్టం మే నామదేహీతి ఇత్యువాచాథ తం ప్రభుమ్॥
భీమస్త్వం దేవ నామ్నాసి ఇత్యుక్తః సోఽరుదత్పునః ।
కిం రోదిషీతి తం బ్రహ్మా రుదన్తం పునరబ్రవీత్॥
సప్తమం దేహి మే నామ ఇత్యుక్తః ప్రత్యువాచ తమ్ ।
ఉగ్రస్త్యం దేవ నామ్నాసి ఇత్యుక్తః సోఽరుదత్పునః ॥
కిం రోదిషీతి తం బ్రహ్మారుదన్తం పునరబ్రవీత్ ।
అష్టమం దేహి మే నామ త్వం విభో పునరబ్రవీత్।
మహాదేవస్తు నామ్నాసి ఇత్యుక్తో విరరామహ॥
సూతుడనెను:- మొదటి సృష్టియొక్కయుత్పత్తి నాచేతసంగ్రహముగా జెప్పబడినది. దీని యొక్క నామములను వాని శరీరములతోబాటు విస్తరముగా జెప్పెదను-2. ఎనిమిదవ కల్పము గడచి పోగా యే కల్పమున (9వ కల్పమున) మహాదేవుడు తన భార్యల యందు అనేకులగు పుత్రులను బుట్టించెను-3. కల్పాదిలో తనతో సమానమైన పుత్రుని ధ్యానించుచున్న ప్రభువు శంకరుని తొడనుండి నీలలోహితుడైన (నలుపు ఎఱుపుగల) కుమారుడు బుట్టెను. మంచీస్వరము గలిగి తేజస్సుతో మండుచున్నట్లున్న యాతనిని ధరించేను-4. అకస్మాత్తుగా నేడ్చుచున్న కుమారుడైన నీలలోహితుని జూచి బ్రహ్మకుమార! ఏడ్చుచుంటి వేమి?యనెను-5. అతడు (నీలలోహితుడు) ఓ బ్రహ్మ నాకు మొదటి పేరునిడుము- అనెను బ్రహ్మ నీవు పేరుతో రుద్రుడవు అనే ను. ఆ కుమారుడు మరలనే డ్చెను -6. ఏడ్చుచున్న యాతనిని బ్రహ్మయెందులకేడ్చుచుంటివనెను. కుమారుడు తనకు రెండవ పేరు జెప్పుమని బ్రహ్మనడిగెను-7. ఓ దేవా!' పేరుతో నీవు భవుడవగుదువు. అనెను. కుమారుడు మరలనేడ్చెను-8,9. బ్రహ్మయేల మరల నేడ్చుచుంటివనెను. శివుడు నాకు నాల్గవ పేరు జెప్పుమనెను-10. బ్రహ్మ నీవు పశుపతివి అనెను. కుమారుడు మరలనేడ్చెను. బ్రహ్మయేల యేడ్చుచుంటివనేను-11. శివుడు నాకు ఐదవ పేరును జెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో ఈశుడవగుదువనెను, కుమారుడు మరల నేడ్చెను-12. బ్రహ్మ మరల నేడ్చుచుంటివేల అనెను. కుమారుడు నాకొఱవ పేరు జెప్పుమని యాప్రభువైన బ్రహ్మనడిగెను-13. బ్రహ్మనీవు పేరుతో భీముడవగుదువు అనెను. కుమారుడు మరల నేడ్చెను. బ్రహ్మ యేల మరల ఏడ్చుచుంటివనెను-14. కుమారుడు నా కేడవ పేరును జెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో ఉగ్రుడవగుదువు అనెను. కుమారుడు మరల నేడ్చెను-15. బ్రహ్మ ఏల మరల యేడ్చుచుంటివనెను. కుమారుడు నాకెనిమిదవ పేరును జెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో మహాదేవుడవగుదువనెను-16.
లబ్ద్వా నామాని చైతాని బ్రహ్మణో నీలలోహితః ।
ప్రోవాచ నామ్నా మేతేషాం భూతాని ప్రదిశేతి హ॥
తతొఽభిసృష్టా స్తనమఃఏషాం నామ్నాం స్వయంభువా॥
దీక్షితో బ్రహ్మణశ్చంద్ర ఇత్యేతే బ్రహ్మధాతవః ।
తేషు పూజ్యశ్చ వన్ద్యః స్యాద్రుద్రస్తాన్నహినస్తిలైః॥
బ్రహ్మనుండి శివుడీ నామములను బొంది యీ నామములకు సరియైన భౌతిక శరీరముల (భూతములను) జెప్పుమని బ్రహ్మనడిగెను-17. దాని వలన బ్రహ్మ చే పైనామములకు శరీరములు సృష్టింపబడినవి. సూర్యుడు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము-18, దీక్షితుడైన బ్రాహ్మణుడు, చంద్రుడు ఈయివి బ్రహ్మ ధాతువులు, వానిలో రుద్రుడు పూజ్యుడును. వంద్యుడును అగును. కావున రుద్రుడు వారిని బాధించడు-19.
తతోఽ బ్రవీత్పునర్బ్రహ్మా తంఽదేవం నీలలోహితమ్ ।
ద్వితీయం నామధేయన్తే మయాప్రోక్తం భవేతి యత్॥
ఏతస్యాపో ద్వితీయాతే తనుర్నామ్నా భవిష్యతి ॥
ఇత్యుక్తే యత్ స్థిరం తస్య శరీరస్థం రసాత్మకమ్ ।
తద్వివేశ తతస్తోయం తస్మాదాపో భవః స్మృతః ॥
యస్మాద్భవన్తి భూతాని తాభ్యస్తా భావయన్తి చ ।
భవనాద్భావనాచ్ఛైవ భూతానాం సంభవః స్మృతః॥
తస్మాన్మూత్రం పురీషం చ నాఽప్సు కుర్వీత సర్వదా ।
న స్నాయేదప్సు నగ్నశ్చ నష్ఠీవేత్కదాచన॥
మైథునం నైవసేవేత శిరః స్నానం చ వర్జయేత్ ।
న ప్రీతః పరిచక్షీత వహన్నసంస్థీతోఽ పి వా ॥
మేధ్యా మేధ్యశరీరత్వాన్నైవ దుష్యన్ త్యపః క్వచిత్ ।
వివర్ణరసగన్ ధాశ్చ అల్పాశ్చపరివర్జయేత్॥
అపాం యోనిః సముద్రశ్చ తస్మాత్తం కామయన్తి తాః ।
మేధ్యాశ్చైవామృతశ్చైవ భవన్తి ప్రాప్యసాగరమ్॥
తస్మాదాపో న రున్దీత సముద్రం కామయన్తి తాః ।
న హినస్తి భవో దేవః సదైవం యోఽప్సువర్తతే ॥
తరువాత బ్రహ్మ రుద్రునితో మరల నిట్లనెను. నీ రెండవ పేరు భవుడవంటిని దీనికి జలరూపమైన శరీరము గలుగగలదు. అని యనగానే యారుద్రుని యొక్క స్థిరమై రసాత్మకమైన శరీరము ఆజలమున బ్రవేశించెను. కావున జలములు భవుడనబడేను-21. జలములవలన బుట్టి భూతములు (శరీరములు) జలములనే భవించు భవన భావనములవలన (ఉండుట భావించుట వలన) భూతముల సంభవము జెప్పబడినది. శివుడు జలములలోనుండి జలముల భావించుటచే జలములు శివుడయ్యెను-22. కావున జలములలో మూత్రమలవిసర్జనములు విడువరాదు. నగ్నముగా స్నానము చేయరాదు. ఉమ్మివేయరాదు 43, స్త్రీ సంభోగము జేయరాదు. తలస్నానము జేయరాదు. సంతుష్టుడైకాని, మోయుచున్నవాడైకాని, సరిగానుండని వాడైకాని నీళ్లను వదలరాదు. పవిత్ర పవిత్రశరీరములగుటవలన జలములు దుష్టములు గావు. రంగుమారిన రసము వాసనయు గలవియు అల్పములైనవియునైన జలములను వదలి వేయ వలెను-23,24, 25. నీటికి యోని (పుట్టుకారణము) సముద్రమును జేరి పవిత్రములును అమృతములును అగును-26. కావున జలములను అడ్డుకొనరాదు. అవి సముద్రమున జేరగోరును. ఈ విధముగ నీటి విషయమై యెవడు ప్రవర్తించునో వానిని శివదేవుడు హింసించడు-27.
తతోఽ బ్రవీత్ పునర్బ్రహ్మా తం దేవం కృష్ణలోహితమ్ ।
శర్వస్త్వమితియన్నామ తృతీయం సముదాహృతమ్॥
తస్య భూమిస్తృతీయా తు తనుర్నామ్నా భవత్వియమ్॥
ఇత్యుక్తే యత్ స్థిరం తస్య శరీరస్యాస్థి సంజ్ఞితమ్ ।
తద్వివేశ తతో భూమిస్తస్మాద్భూః శర్వ ఉచ్యతే॥
తస్మాత్కుర్వీత నోవిద్వాన్ పురీషం మూత్రమేవ వా ।
న చ్ఛాయాయాం న సోపానే స్వచ్ఛాయాం నాపి మేహయేత్॥
శిరః ప్రావృత్య కుర్వీత అన్తర్థాయ తృణైర్మహీమ్ ।
య ఏవం వర్తతే భూమౌ తం శర్వో న హినస్తి వై।
తరువాత బ్రహ్మ శివునితో ననెను. ఓ శివదేవ నీ మూడవ పేరుగా నిడబడిన శర్వ అను పేరునకు మూడవ శరీరముగా ఈ భూమి యగును-28. అనియనగానే శివుని యొక్క యెముకయనబడు స్థిరమైన (శరీర) భాగము భూమిలో ప్రవేశించెను. కావున భూమి శర్వుడనబడును-29. కావున విద్వాంసుడు (తెలిసినవాడు) నీడలోగాని, మెట్టునందుగాని, తననీడయందుగాని మలమూత్రములు వదలరాదు-30. తల పైవస్త్రము గప్పుకొని భూమిని గడ్డితో గప్పి మలమూత్రముల జేయవలెను ఈ విధముగా నడుచుకొన్నవానిని శర్వుడు హింసించడు.
తతోఽ బ్రవీత్పునర్బ్రహ్మా తం దేవం నీలలోహితమ్ ।
ఈశాన ఇతియత్ప్రోక్తం చతుర్థం నామ తే మయా ॥
చతుర్థస్య చతుర్థస్యాద్వాయుర్నామ్నాతనుస్తవ ।
ఇత్యుక్తే యచ్చరీరస్థం పంచధా ప్రాణసంజ్ఞితమ్ ॥
వివేశ తం యదా వాయురీశానో వాయురుచ్యతే ।
తస్మాదేనం పరివదేహియతం వాయుమిశ్వరమ్॥
ఏవం యుక్త మథేశానో నైవ దేవో హినస్తితమ్॥
తరువాత బ్రహ్మ శివదేవుని తోనిట్లనెను. నేను నీ నాల్గవ పేరు ఈశానుడని యంటిని-32. దానికి (ఆ నామమునకు) నాల్గవ శరీరము వాయువగును. అనియనగనే శివుని శరీరమున నైదు విధములుగా ప్రాణమను పేరనున్న (ప్రావణ) వాయువు ఆ వాయువులో జేరెను. అపుడు వాయువు ఈశానుడనబడెను. కావున విశాలముగా వ్యాపించిన మీ వాయువును ఈశ్వరునిగా జెప్పవలెను. ఈ విధముగానున్న వానినీశానుడు హింసింపడు.
తతోఽ బ్రవీత్పునర్బ్రహ్మా తం దేవం ధూమ్రలోహితమ్ ।
యత్తే పశుపతీత్యుక్తం మయా నామేహ పంచమమ్॥
పంచమి పంచమస్త్యైవ తనుర్నామ్నాగ్నిరస్తుతే ॥
ఇత్యుక్తే యచ్చరీరస్థం తేజస్తస్యోప సంజ్ఞితమ్ ।
వివేశ తత్తదాహ్యగ్నిస్తస్మాత్పశుపతిః పతిః॥
చంద్రమాస్తు స్మృతః సోమస్తస్యాత్మాహ్యోషధీ గణఫ ।
ఏవం యో వర్తతే విద్వాన్ సదా పర్వణి పర్వణి।
న హన్తి తం మహాదేవ ఏవం వందేత తం ప్రభుమ్॥
గోపాయతి దివాదిత్యః ప్రజా నక్తన్తు చంద్రమాః ।
ఏకరాత్రే సమే యాతాం సూర్యాచంద్రమసావుభౌ॥
అమావాస్యానిశాయాంతు తస్యాం యుక్తః సదా వసేత్॥
తత్రావిష్టం సర్వమిదం తనుభిర్నామభిః సహ ।
ఏకాకీయశ్చరత్యేషః సూర్యోఽసౌ చంద్ర ఉచ్యతే॥
సూర్యస్య యత్ప్రకాశేన వీక్ష్యన్తే చక్షుషా ప్రజాః ।
శుక్లాత్మా సంస్థితో రుద్రః పిబత్యంభో గభస్తిభిః॥
అద్యతే పీయతే చైవాప్యన్నపానాత్మకాని యా ।
తనురాత్మభవా సా వై దేహేష్వోవోపచీయతే॥
యయా ధత్తే ప్రజాః సర్వా స్థిరీభూతేన చేతసా।
పార్థివీ సా తనుస్తస్య శార్వీ ధారయతి ప్రజాః॥
తరువాత మరల బ్రహ్మ ధూమ్రలోహితుడగు శివునితో ననేను. నేను నీ యైదవ పేరు పశుపతి యని యంటిని ఆయైదవ పేరున కైదవ శరీరము అగ్నియగును-35, అనియనగనే శివుని శరీరముననుండి యాతని చిహ్నముగా నున్న తేజస్సు అగ్నిలో ప్రవేశించెను. కావున అపుడాయగ్ని పశుపతియై పతియయ్యెను-36. చంద్రుడు సోముడన బడెను. ఆతని యాత్మయోషధీగుణము, ఈ విధముగ దెలిసియే విద్వాంసుడు ప్రతి పర్వమున (పూర్ణిమయందు)నుండునో యాతనిని మహాదేవుడు చంపడు. ఈ విధముగ ఆ ప్రభువును (శివుని) నమస్కరింపవలేను-37. సూర్యుడు పగలు ప్రజలను రక్షించును. రాత్రి యందు చంద్రుడు రక్షించును. సూర్యచంద్రులు గలిసిన యొక యమావాస్య రాత్రియందు చంద్రుడు ఎల్లప్పుడు సూర్యునితో గలిసి యుండును-38. అక్కడ ఇదియంతయు (శివశరీరమంతయు) తన పేరులతో శరీరములతోను ప్రవేశించి యావరించియుండును. కావున ఈ యొక్కడుగా (ఆకాశమున) చరించుచున్న సూర్యుడే చంద్రుడనబడును-39. సూర్యుని యేకార్తితో ప్రజలు చూచుచున్నారో అది శుక్ల (తెల్లని) స్వరూపముననున్న రుద్రుడు అతడు కిరణములచే నీటిని త్రాగును 40. ఏది అన్నపానాత్మకములను తీని త్రాగుచున్నదో అది శివాత్మనుండి బుట్టిన శరీరములలో నేయభివృద్ధినొందును-41. దేని చేత స్థిరమైన చిత్తముతో సమస్త ప్రజలను ధరించుచున్నదో అది శివుని యొక్క శార్వీయను వర్థితమైన శరీరము. అది ప్రజలను ధరించును.
యావత్ స్థితా శరీరేషు భూతానాం ప్రాణవృత్తిభిః ।
వాయ్వాత్మకా తు ఐశానీ సాప్రాణాః ప్రాణినా సహ॥
పీతా శితాని పచతి భూతానాం జఠరేషు యా ।
తతః పాశుపతీ తస్య పాచికా శక్తిరుచ్యతే ॥
ప్రాణవ్యాపారములచేత ప్రాణుల శరీరములలో నెంతవరకు వాయ్యాత్మకమై (వాయురూపమే) యుండునో, ఆది ఐ శానియై ప్రాణితోబాటు ప్రాణముల రూపమునొందును-43. జఠరములందు (జీర్ణకోశములందు) త్రాగినవానిని, తిన్న వానిని పక్వము (జీర్ణము) జేయునది ఆ శివుని యొక్క పాశుపతియను పాచికశక్తియనబడును.
యానీహ సుషిరాణి సుద్దే హేష్వన్తర్గతాని వై ।
వాయోః సంచరణార్థాయ సాభీమాచోచ్యతే తనుః॥
వైతానదీక్షితానాం తు యాస్థితిర్బ్రహ్మవాదినామ్ ।
తనురుగ్రాత్మికా సా తు తేనోగ్రో దీక్షితః స్మృతః॥
యత్తు సంకల్పకం తస్య ప్రజాస్విహ సమం స్థితమ్ ।
సా తనుర్మానసీ తస చంద్రమాః ప్రాణిషు స్థితః॥
నవో నవో భవతి హి జాయమానః పునః పునః ।
నీయతే యో యథాకామం విబుధైః పితృభిః సహ।
మహాదేవోఽ మృతాత్మా సౌహ్యమ్మ యశ్చంద్రమాః స్మృతః॥
ఇచట దేహములలో వాయుసంచారము కొఱకై యంతర్గతములై యున్న రంధ్రములు శివుని భీమయను శరీరమనబడును-45. బ్రహ్మవాదులై వైతాన (వ్రత)దీక్షితులయొక్క స్థితి శివుని యుగ్రరూపమైన శరీరమనబడును. కావున దీక్షితుడు ఉగ్రుడనబడును-46. ఇట ప్రజలలో సమముగా నున్న శివుని సంకల్పము (శివసంకల్పము) ఆ శివుని మానసీతనువైన చంద్రుడు. అతడు ప్రాణులలో నుండును-47. మరలమరల బుట్టుచున్నవాడై క్రొంగొత్తవాడగును. ఆతడు దేవతలతోను పితృదేవతలతోను గూడ స్వేచ్చగా (కామానుసారముగా) తీసికొనిపోబడును. మహాదేవుడు అమృతాత్ముడు అట్టియీ శివుడు జలమయుడైన చంద్రుడనబడెను.
తస్య యా ప్రథమా నామ్నా తనూరౌద్రీ ప్రకీర్తితా ।
పత్నీ సువర్చలా తస్య పుత్రస్తస్యాః శనైశ్చరః॥
భవస్య యా ద్వితీయాతు తనురాపః స్మృతా తు వై ।
తస్యోషాఽత్ర స్మృతా పత్నీ పుత్రశ్చాప్యుశనా స్మృతః॥
శర్వస్య యా తృతీయా తు నామ భూమిస్తనుః స్మృతా ।
పత్నీ తస్య వికేశీతి పుత్రశ్చాంగారకః స్మృతః॥
ఈశానస్య చతుర్థస్య స్వర్గతస్య చ యా తనుః ।
తస్య పత్నీ శివనామ పుత్రస్యాస్య మనోజవః॥
నామ్నా పశుపతే ర్యాతు తనురగ్నిర్డ్విజైః స్మృతా ।
తస్యపత్నీ స్మృతా స్వాహా స్కన్దశ్చాపి సుతః స్మృతః॥
నామ్నా షష్ఠస్య యా భీమా తనురాకాశ ఉచ్యతే ।
దిశః పత్న్యః స్మృతా స్తస్య స్వర్గశ్చాస్య సుతః స్మృతః॥
ఉగ్రతనుః సప్తమి యా దీక్షితై ర్బ్రాహ్మణైః స్మృతా ।
దీక్షా పత్నీస్మృతా తస్యసన్తానః పుత్ర ఉచ్యతే॥
నామ్నాఽస్టమస్య మహత్తస్తనుర్యా చంద్రమాః స్మృతః ।
పత్నీ తు రోహిణీ తస్యపుత్రశ్చాస్య బుధః స్మృతః॥
ఆ శివుని యొక్క మొదటి శరీరము రౌద్రియను పేర జెప్పబడినది. అట్టి రుద్రుని యొక్క భార్య సువర్చల ఆతని కామెకును బుట్టిన పుత్రుడు శనైశ్చరుడు-49. శివుని రెండవ తనువు (శరీరము) జలములనబడినది. అట్టి శివ జలతనువునకు భార్య 'ఉష' అనబడినది. వారి పుత్రుడు ఉశనుడు (శుక్రుడు) అనబడెను-50. శివుని మూడవతనువు భూమి యనబడినది. అట్టి శీవభూతనువునకు భార్య వికేశి' యనబడినది. వారి పుత్రుడు 'అంగారకుడు ' అనబడెను-51. శివుని నాల్గవదై స్వర్గతమైన ఈశానతనువునకు శివ యను పత్ని వారికి పుత్రుడు మనోజవుడు-52. పశుపతికి యైదవ తనువగ్నియని ద్విజులచే జెప్పబడినది. ఆ(శివ)యగ్నికీ భార్య స్వాహాదేవి. వారి పుత్రుడు స్కందుడనబడెను-53. శివుని యారవదీయైన భీమయను తనువు ఆకాశమనబడినది. ఆ శివాకాశతనువునకు దిక్కులు భార్యలు స్వర్గము పుత్రుడనబడెను-54. దీక్షిత బ్రాహ్మణులచే శివుని యేడవ తనువు ఉగ్రయనబడినది. ఆయుగ్రతనువునకు భార్య దీక్ష 'భార్య వారిరువురి పుత్రుడు 'సన్తాన'ము (కల్పవృక్షము) అనబడెను-55. శివుని యష్టమతనువైన చంద్రునకు పత్ని రోహిణీ వారి పుత్రుడు బుధుడనబడెను.
ఇత్యేతాస్తనవస్తస్యనామభిః పరికీర్తితాః ।
తాస్సువన్ద్యనమస్యాశ్చ ప్రతినామ తనూషు వై॥
భక్తేః సూర్యేఽప్సు పృథివ్యాం వాయ్వగ్ని వ్యోమ దీక్షిత్ ।
తథాచ వై చంద్రమసి తనుభిర్నామభిః సహ॥
ప్రజావానేతి సాయుజ్య మీశ్వరస్య నరో హి సః॥
ఇత్యేతద్వో మయా ఖ్యాతం గుహ్యం భీమస్య తద్యశః ।
శన్నోఽస్తు ద్విపదే నిత్యం శన్నోఽస్తు చ చతుష్పదే॥
ఏత త్ప్రోక్తం నిదానం వస్తనూనాం నామభిః సహ ।
మహాదేవస్య దేవస్య భృగోఽస్తు శృణుత ప్రజాః॥
ఇతిశ్రీమహాపురాణే వాయుప్రోక్తే మహాదేవతను వర్ణనంనామ
సప్తవింశోఽధ్యాయః ॥
అని శివుని యొక్క నామములతో తనువులు చెప్పబడినవి. ప్రతి నామతనువులలో చక్కగా వందనముజేయదగినవి. చక్కగా నమస్కరింపదగినవియును-57. శివుని యొక్క తనువులతోను నామములతోబాటు శివ తనువులైన సూర్యునియందు, జలములందు, భూమియందు, వాయువునందు, అగ్నియందు, ఆకాశమునందు, దీక్షితునియందు, చంద్రుని యందును. భక్తివలన నరుడు ప్రజావంతుడై యీశ్వరునితో సాయుజ్యమును బొందును-58. భీముడైన శివుని యొక్క యీ రహస్యమయిన యశము మీకు జెప్పబడినది. ద్విపదులైన నరులకు సుఖము గలుగుగాక. చతుష్పదులైన మృగములకును సుఖము గలుగుగాక 59. ఓ ప్రజలారాః దేవుడై మహాదేవుడైన శివునియొక్క (భృగువుయొక్క) నామములతోబాటు తనువులయొక్క మూలకారణము ఇది మీకు జెప్పబడినది వినుడు.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున మహాదేవతనువర్ణనమను ఇరువది యేడవ అధ్యాయము.