1 - గరుడ పురాణము - ఆచార కాండము
234 - అచ్యుత స్తోత్రం
శౌనకాదులారా! ఇప్పుడు సర్వప్రాణి గణాలకూ సర్వమునూ సమకూర్చే అచ్యుత స్తోత్రాన్ని వినిపిస్తాను. ఇది కూడా లోక కల్యాణవారధియైన నారద మహాముని తెచ్చి మనకిచ్చినదే. ఒకనాడాయన బ్రహ్మ వద్దకు పోయి “హే దేవదేవేశా! నేను పూజా సమయంలో అక్షయుడు, అవ్యయుడు, వరప్రదాతయగు విష్ణు భగవానుని స్తుతించాలి. ఎందుకంటే అ అచ్యుత భగవానుని నిత్యం స్తుతించే ప్రాణులే ధన్యులు, వారి జన్మలే సఫలములు, వారే అన్నిటినీ పొందగలరు, ఆ సజ్జనుల జీవనములే సార్థకాలు. అటువంటి స్తోత్రాన్ని నాకుపదేశించండి’ అని ప్రార్థించాడు.
బ్రహ్మ ఇలా చెప్పాడు, ‘నాయనా! ప్రాణులకు సుఖమునూ, మోక్షమునూ ఇచ్చేదీ నారాయణుని ప్రసన్నుని చేసేదీ, ప్రతి ఒక్కరూ పూజావేళలో పఠించవలసినదీనగు అచ్యుత స్తోత్రాన్ని అవధరించు :
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సహస్ర శీర్షాయ
నమః సర్వాపహారిణే । నమో నాగాంగ శాయినే ॥
నమో విశుద్ధదేహాయ నమః పరశుహస్తాయ
నమో జ్ఞాన స్వరూపిణే ॥ నమః క్షత్రాంత కారిణే ।
నమః సర్వ సురేశాయ నమః సత్యప్రతిజ్ఞాయ ।
నమః శ్రీ వత్సధారిణే ॥ హ్యజితాయ నమో నమః
నమశ్చర్మాసి హస్తాయ నమః స్త్రైలోక్య నాథాయ
నమః పంకజ మాలినే ॥ నమశ్చక్రధరాయచ ।
నమో విశ్వ ప్రతిష్టాయ నమః శివాయ సూక్ష్మాయ
నమః పీతాంబరాయచ । పురాణాయ నమోనమః ॥
నమో నృసింహరూపాయ నమో వామనరూపాయ
వైకుంఠాయ నమో నమః । । బలిరాజ్యాపహారిణే ।
నమః పంకజనాభాయ నమో యజ్ఞ వరాహాయ
నమః క్షీరోదశాయినే ॥ గోవిందాయ నమో నమః ॥
నమస్తే పరమానంద నమస్తే పరమాక్షర ।
నమస్తే జ్ఞానసద్భావ నమస్తే జ్ఞానదాయక ॥
నమస్తే పరమాద్వైత నమస్తే పురుషోత్తమ ।
నమస్తే విశ్వకృద్దేవ నమస్తే విశ్వభావన ॥
నమస్తే స్తాద్విశ్వనాథ నమస్తే విశ్వకారణ ।
నమస్తే మధు దైత్యఘ్న నమస్తే రావణాంతక ॥
నమస్తే కంసకేశిఘ్న నమస్తే కైటభార్దన ।
నమస్తే శతపత్రాక్ష నమస్తే గరుడధ్వజ ॥
నమస్తే కాలనేమిఘ్న నమస్తే వృష్టి నందన ।
నమస్తే దేవకీపుత్ర నమస్తే గరుడాసన ॥
నమస్తే రుక్మిణీకాంత నమస్తేఽదితినందన ।
నమస్తే గోకులావాస నమస్తే గోకులప్రియ ॥
జయగోపవపుఃకృష్ణ జయగోపీ జనప్రియ ।
జయగోవర్ధనాధార జయగోకులవర్ధన ॥
జయ రావణ వీరఘ్న జయచాణూర నాశన ।
జయవృష్ణి కులోద్యోత జయకాలీయ మర్దన ॥
జయ సత్య జగత్సాక్షిన్ జయసర్వార్థ సాధక ।
జయ వేదాంత విద్వేద్య జయ సర్వద మాధవ ॥
జయ సర్వాశ్రయావ్యక్త జయసర్వగమాధవ ।
జయ సూక్ష్మ చిదానంద జయచిత్త నిరంజన ॥
జయస్తేఽస్తు నిరాలంబ జయశాంత సనాతన ।
ఆయనాథ జగత్పుష్ట జయవిష్ణో నమోఽస్తుతే ॥
త్వం గురుస్త్వం హరే శిష్య స్త్వం దీక్షామంత్రమండలం ।
త్వం న్యాసముద్రాసమయాస్త్వం చ పుష్పాది సాధనం ॥
త్వయా ధారస్త్వం హ్యనంత స్త్వం కూర్మస్త్వంధరాంబుజం ।
ధర్మజ్ఞా నాదయస్త్వంహి వేది మండల శక్తయః ।
త్వం ప్రభో ఛలభృద్రామస్వం పునః స ఖరాంతకః ।
త్వం బ్రహ్మర్షిశ్చ దేవస్త్వం విష్ణుః సత్యపరాక్రమః ॥
త్వం నృసింహః పరానందో వరాహస్త్వం ధరాధరః ।
త్వం సుపర్ణస్తథా చక్రం త్వం గదాశంఖ ఏవ చ ॥
త్వం శ్రీః ప్రభోత్వం పుష్టిస్త్వం మాలాదేవశాశ్వతీ ।
శ్రీ వత్సః కౌస్తుభ స్త్వం హి శారంగీత్వం చతథేషుధిః ॥
త్వం ఖడ్గ చర్మణా సార్ధం త్వం దిక్పాలాస్తథా ప్రభో ।
త్వం వేధిస్త్వం విధాతా చత్వం యమస్త్వం హుతాశనః ॥
త్వంధనేశస్త్వ మీశానస్త్వ మింద్ర స్త్వ మపాంపతిః ।
త్వం రక్షోఽధిపతిః సాధ్యస్త్వం వాయుస్త్వం నిశాకరః ॥
ఆదిత్యావ సవోరుద్రా అశ్వినౌత్వం మరుద్గణాః ।
త్వం దైత్యా దానవా నాగాస్త్వం యక్షారాక్షసాఖగః ॥
గంధర్వాప్సరస సిద్ధాః పితరస్త్వం మహామరాః ।
భూతానీ విషయస్త్వం హి త్వమవ్యక్తేంద్రియాణి చ ॥
మనోబుద్ధిరహంకారః క్షేత్రజ్ఞుస్త్వం హృదీశ్వరః ।
త్వం యజ్ఞస్త్వం వషట్కార స్త్వమోంకారః సమిత్కుశాః ॥
త్వ వేదీత్వం హరే దీక్షాత్వం యూపస్త్వం హుతాశనః ।
త్వం పత్నీ త్వంపురోడాశ స్త్వంశాలాసుక్చత్వం సువః II
గ్రావాణః సకలంత్వం హి సదస్యస్త్వం సదక్షిణః ।
త్వం శూర్వాదిస్వంచ బ్రహ్మాముసలోలూఖలేధ్రువం ॥
త్వం హోతాయజమానస్త్వం త్వంధాన్యం పశుయాజకః ।
త్వమథ్వర్యుస్త్వముద్గాతా త్వం యజ్ఞః పురుషోత్తమః ॥
దిక్పాతాల మహివ్యోమ ద్యౌస్త్వం నక్షత్రకారకః ।
దేవ తిర్యగ్ మనుష్యేషు జగదేతచ్చరాచరం ॥
యత్కించిద్ దృశ్యతే దేవ బ్రహ్మాండ మఖిలం జగత్ ॥
తవరూప మిదం సర్వం సృష్ట్యర్థం సంప్రకాశితం ॥
నాథయం తే పరంబ్రహ్మ దేవైరపి దురాసదం ।
కస్త్వాం జానాతి విమలం యోగ గమ్యమతీంద్రియం ॥
అక్షయం పురుషం నిత్యమవ్యక్త మజమవ్యయం ।
ప్రలయోత్పత్తి రహితం సర్వవ్యాపిన మీశ్వరం ॥
సర్వజ్ఞం నిర్గుణం శుద్ధ మానందమజరం పరం ।
బోధరూపం ధ్రువం శాంతం పూర్ణమద్వైతమక్షరం II
అవతారేషుయామూర్తి ర్విదూరేదేవ దృశ్యతే ।
పరంభావమజానంతస్త్వాం భజంతి దివౌకసః ॥
కథం త్వామీ దృశం సూక్ష్మం శక్నోమి పురుషోత్తమ ।
ఆరాధయితు మీశాన మనోఽగమ్య మగోచరం ॥
ఇహయన్మండలే నాథ పూజ్యతే విధివత్ క్రమైః ।
పుష్పధూపాది భిర్యత్ర తత్ర సర్వావిభూతయః ॥
సంకర్షణాది భేదేన తవయత్పూజితం మయా ।
క్షంతు మర్హసి తత్సర్వం యత్కృతం నకృతం మయా ॥
నశక్నోమివిభో సమ్యక్ కర్తృం పూజాం యథోదితాం ।
యత్కృతం జపహోమాది అసాధ్యం పురుషోత్తమ ॥
వినిష్పాదయితుం భక్త్యా అతస్త్వాం క్షమయామ్యహం ।
దివారాత్రౌచ సంధ్యాయాం సర్వావస్థాసు చేష్టతః II
అచలా తుహరేభక్తిస్త వాంఘ్రియుగలే మమ ।
శరీరేన (ణ) తథాప్రీతిర్నచ ధర్మాది కేషు చ ॥
యథాత్వయి జగన్నాథ ప్రీతిరాత్యంతికీ మమ ।
కిం తేన కృతం కర్మ స్వర్గమోక్షాది సాధనం ॥
యస్య విష్ణౌ దృభక్తిః సర్వకామ ఫలప్రదే ।
పూజాం కర్తుం తథా స్తోత్రం కః శక్నోతి తవాచ్యుత ॥
స్తుతంచ పూజితం మేఽద్యతత్ క్షమస్వనమోఽస్తుతే ।
మునులారా! పరమ వైష్ణవ పదమును పొందదలచుకున్న వారెవరైనా ఆ చక్రధరుని, ఆయచ్యుతుని ఈ స్తోత్రం ద్వారా ప్రార్థించాలి, పూజించాలి. రోజూ పూజ వేళ ఈ స్తోత్రాన్ని పఠించేవారు అనాయాసంగా జీవించి మోక్ష ప్రాప్తినందగలరు. వైష్ణవులే కాక అన్యులు కూడా ఇరుసందెలలో పవిత్రులై భజన ధూపంలో ఈ స్తోత్రాన్ని పాడితే సమస్తాభీష్టసిద్ధి నొందగలరు. ఈ స్తోత్ర పాఠాన్ని చేసినవారు ఏది కోరుకుంటే అది శీఘ్రమే లభిస్తుంది. కొడుకు పుట్టాలని కోరేవారికి కొడుకు పుడతాడు; డబ్బు కావాలనుకొనేవారు ధనవంతుల వుతారు; విద్యార్థి విద్యావంతుడవుతాడు. జాతిస్మరత్వం (పూర్వజన్మ జ్ఞానం) కోరుకున్న వారికది కూడా లభిస్తుంది.
విష్ణు పూజ లేని పండితుడి గృహమైనా సరే పశువుల కొట్టం వంటిదే. విష్ణువుని పూజించే మనిషే మనిషి, అతడే జ్ఞాని, బుద్ధిమంతుడు, సత్కర్మ కర్త, పవిత్రుడు, దాత, సాధువు. అచ్యుతునిపై అచల భక్తి లేనివాడు సదాత్ముడు, శుద్ధ వచనుడు కాలేడు. పురుషోత్తముడు, భగవానుడునైన విష్ణువు తనను విధ్యుక్తంగా భక్తితో పూజించేవానిని అవసరమైతే మంచివానిగా మార్చి అన్ని సుఖాలనూ అమరుస్తాడు.
ప్రతి భక్తుడూ ఇలా మనసా, వాచా, కర్మణా విష్ణుదేవుని భావిస్తూ జీవించాలి.
సకలమునిఖిరాద్యశ్చింత్యతే యోహి శుద్ధో
నిఖిల హృది నివిష్టో వేత్తియః సర్వసాక్షీ ।
తమజమమృత మీశం వాసుదేవం నతోఽస్మి
భయమరణ విహీనం నిత్యమానంద రూపం ॥
నిఖిల భువన నాథం శాశ్వతం సుప్రసన్నం
త్వతి విమల విశుద్ధం నిర్గుణం భావపుషైః ।
సుఖ ముదిత సమస్తం పూజయా మ్యాత్మభావం
విశతు హృదయ పద్మే సర్వసాక్షీ చిదాత్మా ॥
ఈ విధంగా ఆద్యంతరహితుడూ, పరాత్పర, బ్రహ్మ స్వరూపుడనైన విష్ణువు వర్ణింప బడ్డాడు. కనుక, మోక్షమందిచ్ఛ గలవారు ఆయన చింతనమునే చేయాలి. ఈ విశ్వంలోని యోగులందరూ ఆ బోధగమ్య పురాణపురుషుడు, సూర్యసమాన తేజస్వి, విమలుడు, విశుద్ధాత్మ, శ్రేష్ఠుడూ, అద్వితీయుడనగు మహావిష్ణువు చింతనలోనే జీవించి దేహాంతంలో ఆయనలోనే కలిసిపోయారు. పైన చెప్పబడిన స్తుతిని జీవితాంతము పఠించువాడు ఆ మహావిష్ణువులాగే ప్రశాంతచిత్తుడూ, పాపరహితుడూ కాగలడు. అలాగే ధర్మార్థకామాలను ఆయన కోసమే చేసి ఆయన కోసమే వదిలేసి సన్యాసియై ఈ లోకాన్ని విడిచినవాడు తిన్నగా విష్ణుని యొద్దకే పోవుచున్నాడు.
విభుం ప్రభుం విశ్వధరం విశుద్ధ
మశేష సంసార వినాశ హేతుం ।
యో వాసుదేవం విమలం ప్రపన్నః
సమోక్ష మాప్నోతి విముక్త సంగః ॥
వీశ్వవిభుడు, ప్రాణిస్వామి, విశ్వాన్నే ధరించువాడు, విశుద్ధాత్మ సమస్త సంసార వినాశహేతువు, విమలుడు, భగవానుడునైనా భక్త సులభుడైన వాసుదేవుని అనాసక్త భావంతో శరణు గోరువాడు మోక్షము నొందగలడు.
