1 - గరుడ పురాణము - ఆచార కాండము
34 - హయగ్రీవ పూజనావిధి
సూతుడు శౌనకాది మహామునులకు వీషువు శివునికీ ఇతర దేవతలకూ ఉపదేశించిన హయగ్రీవపూజను ఇలా వినిపించసాగాడు.
“హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యాశాలి, సకల విద్యలనూ ప్రసాదించేది. ఓంకార యుక్తం. అది ఇది :
ఓం సౌం క్రైం శిరసే నమః
ముందుగా ఎప్పటి వలెనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. (ఈ మంత్రాలిది వలకే ఇవ్వబడ్డాయి) అయినా (అనుబంధం - 5లో చూదవచ్చు).
హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుప్పం వలె, చంద్రుని వలే శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాళతంతు, రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది. నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ఆవు పాలలాగ, కోటి సూర్యప్రభలను వీరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపియైన దేవత ముకుట, కుండల, వనమాలా సుశోభితుడై సుదర్శనయుక్తుడై, సుందరదరహా సవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియై మంగళ స్వరూపుడై వుంటాడు.
ఈ స్వామిని, అన్ని దేవతలనూ తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకొని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి. తరువాత మూలమంత్రంతోనే శంఖ, పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో వున్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి. ఈ మంత్రంతో :
ఓం హయగ్రీవాసనస్య ఆగచ్ఛత చ దేవతాః ।
తరువాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతనూ విధాతనూ పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగ, మహాదేవీలను, శంఖ, పద్మ, నామక నిధులనూ, అగ్రభాగంలో గరుడునీ, మధ్యభాగంలో అధారశక్తినీ పూజించాలి. (ఈ మంత్రాలన్నీ ఇదివఱకే చెప్పబడ్డాయి!)
అపుడు కూర్మ, అనంత, పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలోధర్మునీ, నైరృత్యంలో జ్ఞానాన్నీ, వాయవ్యంలో వైరాగ్యాన్నీ, ఈశాన్యంలో ఐశ్వర్యాన్నీ పూజించాలి. ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండలమధ్యంలో సత్త్వ రజస్తమోగుణాలనూ, అక్కడే కంద, నాళ, పద్మాలనూ విధ్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి.
(కందగడ్డ, హారతి కర్పూరం అనే అర్థాలున్నాయి.)
విమలాది శక్తులు తొమ్మిదింటినీ తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో (శ్రీధర పూజానావీధిలో వలెనే) పూజించాలి.
తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు, భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకొని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, అచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్రప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్నివ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి.
తరువాత శుభదాయినీ, ఐశ్వర్యప్రదాత్రీయైన లక్ష్మీదేవిని పూజించాలి.
తరువాత నలుదిక్కులలో ఇలా
తూర్పులో ఓం శంఖాయ నమః
దక్షిణంలో ఓం పద్మాయ నమః
పడమట ఓం చక్రాయ నమః
ఉత్తరంలో ఓం గదాయై నమః అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే దిక్క్రమంలో ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాశాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలనీ వాటి మధ్యలో ఓం సశరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లమ్ములనూ స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాలా(యై) పీతాంబరాలనూ పూజించి మరల శంఖాదిధారియైన హయగ్రీవస్వామిని అర్చించాలి.
అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరగురు, గురు పాదుకలను క్రమంగా ఈ విధంగా ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరగురుభ్యో నమః, ఓం గురుపాదుకాభ్యాం నమః అనే మంత్రాలతో పూజించాలి.
(కందగడ్డ, హారతి క్ర్పూరం అనే అర్థాలున్నాయి.)
ఇపుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులనూ, ఊర్ధ్వ అధో దిశలలో బ్రహ్మనూ అనంతునీ ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ ఇంద్రాయ నమః, అన్నయే నమః, యమాయ నమః, నిర్పతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, సోమాయ నమః, ఈశానాయ నమః, బ్రహ్మణే నమః, అనంతాయ నమఃలతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట
ఓం వజ్రాయ నమః, ఓం శక్తయే నమః,
ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః,
ఓం పాశాయ నమః, ఓం ధ్వజాయ నమః,
ఓం గదాయై నమః, ఓం చక్రాయ నమః,
అనే మంత్రాలతో ఆయుధాలనూ ఓం పద్మాయ నమః
అనే మంత్రంతో పద్మాన్నీ, ఈశానకోణంలో ఓం విష్వక్సేనాయ నమః అనే మంత్రంతో ఆయననీ పూజించి అనంతరం అనంతుని మరల అర్చించాలి. ఓమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్నిచేసి దానిని ఆయనకే అగ్పించి ఇలా స్తుతించాలి :
ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయవై నమః
నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః ।
నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః ॥
సురాసుర నిహంత్రేచ సర్వదుష్ట వినాశినే ।
సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః ॥
నమశ్చేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ ॥
నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్త్వ హితాయ చ ॥
త్రిగుణాయా గుణాయైవ బ్రహ్మవిష్ణు స్వరూపిణే ।
కర్త్రే హర్త్ర సురేశాయ సర్వగాయ నమోనమః ॥ (ఆచార - 34/50 - 54)
ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనః కమలమధ్యంలో శంఖచక్రగదాధారి, కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు, సర్వాంగసుందరుడు, అవినాశియగు మహేశునికే ఈశుడు, దేవాధిదేవుడు, పరమాత్మయగు హయగ్రీవుని నిలుపుకొని ధ్యానం చేయాలి. హే ఫాలలోచనా! ఈ పూజను గూర్చి చదివినవారికి పరమపదం ప్రాప్తిస్తుంది.
