1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

ఆయుర్వేద ప్రకరణం

గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి ఇరవై అధ్యాయాలలో నిదాన - స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి రోగ కారణాలనూ లక్షణాలను బట్టి రోగనిర్ణయాన్ని చేయడాన్నే రోగ నిదానమంటారు. తరువాతి నలభై అధ్యాయాలలో రోగచికిత్స, ఔషధాలు - వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి. అంతేగాక మందుకి తగిన అనుపానం, వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి, ఒకే రోగానికి అనేకములైన మందులు సూచించబడ్డాయి. కానీ వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి.

ఈ ప్రకరణంలో (పురాణంలో) అక్కడక్కడ గల ఖండితాలనూ, అస్పష్టతనూ ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలనాశ్రయించి సరిచేయడం జరిగింది