1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

196 - విష్ణు ధర్మాఖ్య విద్య

హే మహేశ్వరా! దేవరాజైన ఇంద్రుడు ఏ ‘విష్ణుధర్మ’ మనుపేరుగల విద్యను జపించి సమస్త శత్రువులను ఓడించి స్థిరంగా దేవరాజైనాడో ఆ విద్యనుపదేశిస్తాను, స్వీకరించండి.

ఈ విద్యా జపానికి ముందు రెండు పాదాలను, రెండు మోకాళ్ళను, ఇరు జంఘ ప్రదేశాలను, ఉదర హృదయ వక్షసుల ముఖాలను, తలను ఓంకారాది బీజ వర్ణాలతో క్రమంగా న్యాసం చేయాలి. ఆ తరువాత అనే అంగాలను వెనుక నుండి ముందుకు నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ న్యాసం చేయాలి. అప్పుడు ద్వాదశాక్షర యుక్తమైన వాసుదేవ మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క అక్షరానికొక్కొక్క అంగం చొప్పున కరముతో మొదలు పెట్టి చివరి ‘య’ కారం తో చిటికెన వ్రేలిని న్యాసం చేయాలి. చివరగా హృదయన్యాసాన్ని ఓంకారంతోనూ మస్తక న్యాసాన్ని సంపూర్ణమంత్రంతోనూ చేయాలి. నేత్రాలను ఓం విష్ణవే నమః తో న్యాసం చేసుకొని పరమశక్తి సంపన్నుడైన పరమాత్మ శేషనారాయణుని ఈ విధంగా ధ్యానించాలి.

మమరక్షాం హరిః కుర్యాస్ ధన్వంతరి శ్చాపథ్యాచ్ఛ

మత్స్య మూర్తి ర్జలే ఽ వతు ॥ నాగః క్రోధ వశాత్ కిల ।

త్రి విక్రమ స్తథాకాతో యజ్ఞో రోగాత్ సమస్తాచ్చ

స్థలే రక్షతు వామనః । వ్యాసో ఽ జ్ఞానాచ్చ రక్షతు ॥

అటవ్యాం నరసింహస్తు బుద్ధః పాషండ సంఘాతాత్

రామో రక్షతు పర్వతే ॥ కల్కీ రక్షతు కల్మషాత్

భూమౌరక్షతు వరాహో పాయాన్మధ్యం దీనే విష్ణుః

వ్యోమి నారాయణో ఽ వతు ప్రాతర్నారాయణో ఽ వతు ॥

కర్మ బంధాచ్చ కపిలో మధుహా చాపరాహ్ణే చ

దత్తో రోగాచ్చ రక్షతు ॥ సాయం రక్షతు మాధవః ।

హయగ్రీవో దేవతాభ్యః హృషీకేశః ప్రదోషే ఽ వ్యాత్

కుమారో మకర ధ్వజాత్ । ప్రత్యూషే ఽ వ్యాజ్జనార్దనః ॥

నారదోన్యార్చనాద్దేవః శ్రీధర్మో వ్యాదర్ధరాత్రే

కూర్మోవై నైరృతే సదా ॥ పద్మనాభో నిశీథకే ।

చక్ర కౌమోదకీ బాణా సదా సర్వత్ర పాతుమాం ।

ఘ్నంతు శత్రూంశ్చ రాక్షసాన్ ॥ విదీక్షు దీక్షుచ సదా

శంఖం పద్మంచ శత్రుభ్యః నరసింహశ్చ రక్షతు ॥

శార్జరీం వై గరుడ స్తథా । ఏతద్ధారయ మాణశ్చయం

బుద్ధిం ద్రియ మనః ప్రాణాప్ యం పశ్యతి చక్షుషా ।

పాండు పార్వ విభూషణః ॥ సవశీ స్యాద్వి పాప్మా చ

శేషః సర్పస్వరూపశ్చ రోగముక్తో దీపం వ్రజేత్ ॥

ఈ విధంగా విష్ణు ధర్మాఖ్య విద్యను ధారణ చేసిన వానికి ఏది కావాలనుకున్నా సమకూరుతుంది. రోగాలనుండీ, పాపాలనుండి ముకుడై దేహాంతంలో స్వర్గలోకానికి వెళతాడు.