1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

131 - దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి

భాద్రపద శుద్ధ అష్టమినాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్నీ శంభవేనమః, శివాయనమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్థించాలి.

త్వందూర్వేఽమృతజన్మాసీ వందితా చ సురాసురైః ।

సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్య కరీభవ ॥

యథాశాఖా ప్రశాఖాభిర్విస్తు తాసి మహీతలే ।

తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే ॥

ఈ దూర్వాష్టమీ వ్రతాన్ని చేసిన వారికీ సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్ని పక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తు లౌతారు.

 శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్థరాత్రి రోహిణీనక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా ప్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి మూడు జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా

ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ ।

యోగ సంభవాయ గోవిందాయ నమోనమః ॥

అనే మంత్రంతో యోగేశ్వరుడూ యోగీశ్వరుడూనైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి.

ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే

యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః ।

 అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి.

ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే

విశ్వ సంభవాయ గోవిందాయ నమో నమః ।

పిమ్మట ఈ మంత్రంతో స్వామిని శయనింపజేయాలి.

ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే

సర్వసంభవాయ గోవిందాయ నమోనమః ।

ఒక స్థండిలం (వేది) పై చంద్రునీ, రోహినీ శ్రీకృష్ణభగవానునీ ఉంచి పూజించాలి. పుష్ప, జల, చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకొని మోకాళ్ళపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రుని కర్ఘ్యమివ్వాలి.

క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ ।

గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ॥ (ఆచార - 131/8, 9)

తరువాత మహాలక్ష్మికీ, వసుదేవునికీ, నందబలరామ యశోదలకూ అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి.

అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం ॥

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం ।

వరాహంపుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ॥

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం ।

గోవింద మచ్యుతం దేవమునంతమప రాజితం ॥

అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంత కారణం ।

అనాది నిధనం విష్ణుం త్రిలోకేశంత్రివిక్రమం ॥

నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం ।

పీతాంబర ధరం దివ్యం వనమాలావిభూషితం ॥

శ్రీ వత్సాంకం జగద్ధామం శ్రీ పతిం శ్రీధరం హరిం ।

యేదేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ ॥

భౌమస్య బ్రాహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః । (ఆచార - 131/10 - 16)

ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్గతికై ఇలా ప్రార్థించాలి.

త్రాహిమాం దేవ దేవేశ హరే సంసార సాగరాత్ ।

త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్లవాత్ ప్రభో ॥

దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ ।

దుర్వృత్తాం స్రాయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్ ॥

సోఽహం దేవాతి దుర్వృత్త స్త్రాహి మాం శోక సాగరాత్ ।

పుష్కరాక్ష నిమగ్నోఽ హం మహత్యజ్ఞాన సాగరే ॥

త్రాహి మాం దేవ దేవేశ త్వామృతేఽన్యో న రక్షితా ।

స్వ జన్మవాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ॥

జగద్దితాయ కృష్ణాయ గోవిందాయనమో నమః ।

శాంతి రస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్య భాక్ ॥ (ఆచార - 131/17 - ఽ1)

ఈ ప్రార్థనలో వేడుకొన్నవన్నీ అనగా, అశాంతినుండి రక్షణ, దురాచారం నుండి వీడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, వీఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసినవారికీ లభిస్తాయి.