1 - గరుడ పురాణము - ఆచార కాండము
201 - అశ్వలక్షణాలు, అశ్వగజ రోగ చికిత్స
కాకి పెదవులు, నల్లనాలుక, ఎలుగు ముఖం, వేడితాలువు, ఉగ్రదృక్కులు, దంత హీనత, కొమ్ములు, స్తనబాహుళ్యం, పిల్లిపాదాలు, పులిపోలికలు, కుష్టుమచ్చలు, పొక్కులు, కోతి కనులు - వీటిలో ఏ ఒక్కక్షణం ఒక గుఱ్ఱంలో కనిపించినా దానిని ప్రక్కన పెట్టెయ్యాలి, స్వీకరించరాదు. తురుష్కజ గుల్షాన్ని ప్రథమశ్రేణిదిగానూ, అయిదు హస్తాల ఎత్తున్నదాన్ని ద్వితీయశ్రేణిదిగానూ, మూడు హస్తాల ఎత్తున్నదాన్ని తృతీయశ్రేణి గుఱ్ఱంగానూ పరిగణిస్తారు.
పొడుగు కాళ్ళు, కురుచ చెవులు, చర్మంపై రంగులో బహుఛాయలు గల గుట్టలు ఆరోగ్యకరంగా, ఆరోగ్యంగా వుంటాయి. అశ్వం ఆరోగ్యంగా కలకాలం జీవించాలంటే దాని యజమాని రేవంతుని పూజించాలి. బ్రాహ్మణులకు అడపాదడపా భోజనాలు పెడుతుండాలి. సరళ, నింబ, పత్ర, గుగ్గుల, సర్షప, తీల, వచ, హింగుల మిశ్రమాన్ని వెన్నతో కలిపి గుఱ్ఱం మెడ చుట్టూ రాస్తుండాలి.
గుఱ్ఱానికీ పట్టే కురుపులలో వాతజాల వేగం చీము పట్టవు. కఫజాలు పడతాయి. పిత్తజాలు గొంతులో మంటను, పొక్కులను రేపి రక్తాన్ని చెడగొడతాయి. నొప్పి ఏ కురుపులోనూ పెద్దగా వుండదు. ఇంకోరకం కురుపులు ఆయుధాదులు చేసిన గాయాల వల్ల ఏర్పడతాయి. వాటిని ఎరండవేరు, రెండు హరిద్రకాండాలు, చిత్రక, విశ్వభేషజ, రసొన లేదా సైంధవాలను బాగా నూరి వెన్నతో పుల్లంబలితో కలిపి వాడడం ద్వారా రూపుమాపవచ్చును. శిల, మాడ్చిన, బియ్యపుపిండి, ఉప్పులను అన్నం ముద్దతో కలిపి గాయంపై పూసి వేపాకుతో పట్టీ వేసినా కూడా అవి తగ్గుతాయి. అవనూనెను అశ్వానికి రాయడం మంచిది.
కొన్ని రకాల గుఱ్ఱపు తెగుళ్ళకు నశ్యం అనివార్యమైనపుడు మాతులుంగ లేదా మాంసి రసాన్ని వాడాలి. తొలిరోజు ఒక పళం నిచ్చి రోజుకొక పళాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ మందును ఉత్తమాశ్వానికి పదునెనిమిది రోజులు, మధ్యమ, అధమాశ్వాలకి క్రమంగా పదునాలు, ఎనిమిది రోజులూ వాడవచ్చు. దీనిని అకురాలు కాలమందూ, వేసవిలోనూ వాడరాదు.
వాతజ సమస్యలకు నూనెతో పంచదార, వెన్న, పాలు లను కలిపి వాడాలి. కఫజన్య సమస్యలకు ఆవనూనెతో మందును కలిపి వాడాలి. పిత్త సమస్యలకు త్రిఫల, జలమిశ్రమానికి మందును కలిపి పట్టాలి. షష్టిక శాలి గింజలను తిని పెరిగిన గుజ్ఞానికీ అలసటా, వృద్ధత్వమూ ఉండవు. మగ్గిన జంబూఫల, వర్ణంలో గాని బంగారు రంగులోగాని వుండే అశ్వాలకు ముసలితనముండదు. అశ్వానికి వినికిడి సమస్య యేర్పడితే, కఫ సమస్య కూడా వుంటే దానికి పుల్లగా ఘాటుగా వుండే అహారాన్ని పెట్టాలి. కుంటుతున్నా, పొక్కులెక్కినా, కుష్టు కనిపించినా ఆ గునికి త్రిఫల కషాయాన్నీ గోమూత్రాన్నీ పట్టాలి. వాత పిత్త, కురుపులకు ఆవుపాలూ, వెన్నా మంచి మందు.
బలం బాగా తగ్గిన గుజ్ఞానికి మంసాన్ని పెట్టవచ్చు. ఏ జబ్బూ లేకపోయినా అశ్వానికీ శిశిర, గ్రీష్మఋతువులలో రోజూ అయిదు పళంల గుడూచి చూర్ణాన్ని వెన్నతో కలిపి తినిపిస్తే దానికీ జవసత్వాలినుమడిస్తాయి.
ఇక గణాయుర్వేదాన్ని విన్నవిస్తాను. పైన చెప్పిన మందులూ, కషాయాలూ, ఏనుగుకీ కూడా పనిచేస్తాయి. ఎటొచ్చీ) పరిమాణాన్ని నాలుగింతలకి పెంచి ఇవ్వాలి. శాంతికర్మలు, బ్రాహ్మణ భోజనాలు, గోదానాలు, *దేవపూజనాలే గజరక్షణలో పెద్దపాత్రను పోషిస్తాయి.
(*కపిల గోవునే ఇవ్వాలి.)
వైద్యుడు ఉపవాసముండి ఒక దండను, వచ, సిద్ధార్థక మందులచే సమపాళ్ళలో గుచ్చబడిన దానిని ఏనుగు దంతాలకు చుట్టి సూర్య, శివ, దుర్గ, లక్ష్మి, విష్ణుదేవతలను పూజించి భూతశాంతికి వాడిన నాలుకుండల నీటితో ఏనుగుకీ స్నానం చేయిస్తే, మంత్రం చదువుతూ మేతపెడితే దానికీక ఏ సమస్యారాదు. ఒకవేళ పూజలో లోపం వల్ల వస్తే గుజానికి వాడిన మందులనే ఇదీవణుకు చెప్పినట్లుగానే వాడాలి.
ఇక్కడితో భైరవ ప్రవచనం ఆగిపోతుంది. తరువాతి అధ్యాయం విష్ణుపు శివారులకిస్తున్న అనుగ్రహ భాషణమే.
