1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

233 - మృత్యునివారకాష్టక స్తోత్రం

శౌనకాదులారా! ఇపుడొక మృత్యు నివారకాష్టకమును అనగా ఎనిమిది శ్లోకాల స్తోత్రమును వినిపిస్తాను. ఇది మార్కండేయ కృతం.

దామోదరం ప్రపన్నోఽస్మికిన్నో మృత్యుః కరిష్యతి ॥

శంఖచక్రధరం దేవం వ్యక్త రూపిణ మవ్యయం ।

అధోక్షజం ప్రపన్నోఽసి కిన్నో మృత్యుః కరిష్యతి ॥

వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం ।

మాధవంచ ప్రపన్నోఽస్మి కిన్నోమృత్యుః కరిష్యతి ।

పురుషం పుష్కర క్షేత్ర బీజం పుణ్యం జగత్పతిం ।

లోకనాథం ప్రపన్నోఽసి కిన్నోమృత్యుః కరిష్యతి ॥

సహస్రశిరసం దేవం వ్యక్తా వ్యక్తం సనాతనం ।

మహాయోగం ప్రపన్నోఽస్మి కిన్నో మృత్యుః కరిష్యతి ।

భూతాత్మానం మహాత్మానం యజ్ఞ యోని మయోనిజం ॥

విశ్వరూపం ప్రపన్నోఽస్మి కీన్నో మృత్యుః కరిష్యతి ॥

ఇత్యుదీరిత మాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః ।

అపయాతస్తతో మృత్యు ర్విష్ణు దూతైః ప్రపీడితః ॥

ఇతితేన జితో మృత్యుర్శార్కండేయేన ధీమతా ।

ప్రసన్నే పుండరీకాక్షే నృసింహా నాస్తి దుర్లభం ॥

ఈ మృత్య్వష్టక స్తోత్రం మహా పుణ్యశాలి, మృత్యు వినాశకారి, మంగళదాయకము. భగవంతుడైన శ్రీ మహావిష్ణువే దీనిని మార్కండేయ మహామునికుపదేశించాడు. పవిత్రుడై, త్రికాలాల్లో, భక్తిగా నియమపూర్వకంగా ఈ స్తుతిని చేసిన విష్ణుభక్తునికి అకాల మృత్యువుండదు. తన హృదయకమలంలో ఆ పురాణపురుషుడు సనాతనుడు, అప్రమే యుడు, సూర్యాధిక తేజస్వీయగు శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ఈ స్తోత్రం ద్వారా ధ్యానించుయోగి మృత్యువుపై కూడా విజయాన్ని సాధించగలడు.