1 - గరుడ పురాణము - ఆచార కాండము
120 - రంభాతృతీయ వ్రతం
బ్రహ్మదేవుడింకా ఇలా చెప్పసాగాడు, “సౌభాగ్యం, లక్ష్మి, పుత్రాది ఫలప్రదమైన రంభాతృతీయ వ్రతానుపదేశిస్తాను. దీనిని మార్గశిర శుద్ధ తదియనాడు చేయాలి. ప్రతి ఈ రోజు ఉపవసించి (కుశాలను ఉదకాన్ని కలపి ఆ) కుశోదకాన్ని చేత బట్టుకుని బిల్వ పత్రాల చివరలను దానిలో ముంచి వాటితో మహాగౌరిని పూజించాలి. ఈ పూజలో కదంబవృక్షాన్నుండి తీసిన పలుచోముపుల్లను వాడాలి. పుష్యమాసంలో మరుబక పుష్పాలతో పార్వతీదేవిని పూజించి క్రుసర (కృశర) అనగా బియ్యం, నువ్వులు కలిపి వండిన సీద్దాన్నమును నైవేద్యం పెట్టి మల్లికా దంతధావన సాధనాన్ని దేవికి సమర్పించాలి. ఉపవాసం చేసి కర్పూరాన్ని మాత్రమే ప్రాశీంచాలి. మిగతా మాసాల్లో.........
మాసం ప్రాశ్న పూలు నైవేద్యం దేవత పల్దోము పుల్ల మాఘ నెయ్యి తెల్లకమల పెరుగన్నం సుభద్రాదేవి
ఫాలున జీవ కుంద శష్కులి గోమతి కుందనాళం
చైత్ర పెరుగు దమనక కృశరాన్నం విశాలాక్షి తగరకాష్ఠ
వైశాఖ అశోకమొగ్గ కర్ణికార శ్రీముఖి వట
జ్యేష్ఠ లవంగం శతపల్లి చక్కెర నారాయణీ శతపర్ణి ఆషాడ తిల బిల్వపత్ర నెయ్యి, పాయసం మాధవి గూలర
శ్రావణ తగర క్షీరాన్నం శ్రీదేవి మల్లిక
భాద్రపద సింగడా పద్మ బెల్లం ఉత్తమాదేవి
అశ్వయుజ అన్నం జపా సుగంధానం రాజపుత్రి
కార్తిక పంచగవ్య జాతి కృశగాన్నం పద్మజ
(జీవ అనేది ఒకకాయగూర పేరు. ఇది పంచదారంత తీయగా వుంటుంది.
శష్కులి అంటే పూరీయే గాక తిల, తండుల, ఉడద చూర్ణుతోచేసిన యవాగు అనే అర్థం కూడా ఉంటుంది.
తగర అనే పదానికి పూలచెట్టు, తెల్లపూలు, మదన వృక్షమనే అర్థాలున్నాయి.)
ప్రాశ్నయనగా నోటిలో వేసుకొనుట.
ఈ ప్రకారంగా మార్గశిరం నుండి కార్తికం దాకా ఒక ఏడాదిపాటు ప్రతాన్న వలంబించి చివర కొందరు బ్రాహ్మణులను వారీ పత్నులతో బాటు పూజించి వారికి నేయి, నువ్వులతో వండిన వంటలతో భోజనం పెట్టాలి. పిమ్మట శివపార్వతులకు వస్త్ర, చత్ర, సువర్ణాదులతో పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ రాత్రంతా జాగారం చేసి గీత వాద్యాదులతో భజనలను ఏర్పాటుచేసి తెల్లవారగానే యథాశక్తి గోదానాదులను చేయాలి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి అన్ని సంపదలూ అబ్బుతాయి.
ఈ వ్రతాన్ని రంభ తొలిసారి చేసి ధన్యురాలైనది కాబట్టి ఆమె పేరిటనే దీన్ని వ్యవహరిస్తున్నారు.
