1 - గరుడ పురాణము - ఆచార కాండము
- 1 - విష్ణుభగవానుని మహిమ అవతార వర్ణనం
- 2 - గరుడ పురాణ వక్తృ - శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన, గరుడునికి పురాణసంహిత వరదానం
- 3 - గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు
- 4 - సృష్టి - వర్ణనం
- 5 - మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి - సృష్టి విస్తారం
- 6 - ధ్రువ వంశం - దక్ష సంతతి
- 7 - 10 - దేవపూజా విధానం -వజ్రనాభమండలం విష్ణు దీక్ష లక్ష్మీపూజ
- 11 - నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం
- 12- పూజానుక్రమ - నిరూపణం
- 13 - *విష్ణు పంజరస్తోత్రం
- 14 - ధ్యాన - యోగవర్ణన
- 15 - విష్ణు సహస్రనామం
- 16, 17 - విష్ణుధ్యానం - సూర్యార్చన
- 18 - మృత్యుంజయ మంత్ర జప మహిమ
- 19, 20 - ప్రాణేశ్వరీ విద్య - సర్పవిష, దుష్ట ఉపద్రవ హరం
- 21 - 23 - పంచవక్త్ర పూజనం - శివార్చన విధి
- 24 - 26 - త్రిపురాదేవి గణేశాదుల పూజ
- 27 - విషదూరక మంత్రం
- 28 - 31 - శ్రీ గోపాలదేవుని పూజ - శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం
- 32 - పంచతత్త్వార్చన - విధి
- 33 - సుదర్శన చక్ర పూజా విధి
- 34 - హయగ్రీవ పూజనావిధి
- 35 -37 - గాయత్రి న్యాసం - సంధ్యావిధి
- 38 - 41 - దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మాహేశ్వరీపూజన విధి
- 42 - శివ పవిత్రారోపణ విధి
- 43 - విష్ణు పవిత్రారోపణ విధి
- 44 - బ్రహ్మమూర్తి ధ్యాన నిరూపణం
- 45 - వివిధ *శాలగ్రామ శిలల లక్షణాలు
- 46 - వాస్తు మండల పూజావిధి
- 47 - ప్రాసాద లక్షణాలు
- 48 - దేవప్రతిష్ఠ - సామాన్య విధి
- 49 - వర్ణాశ్రమధర్మాలు
- 50 - నిత్యకర్మలు - అశౌచాలు
- 51 - దానధర్మం - దేవతోపాసన
- 52 - ప్రాయశ్చిత్తాలు
- 53 - నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు
- 54 - భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం
- 55 - భరతవర్ష వర్ణన
- 56 - 57 - ప్లక్ష పుష్కరాది ద్వీపాలు, పాతాళం
- 58 - నవగ్రహాల రథాలు
- 59 - జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభయోగాలు, ముహూర్తాల వర్ణన
- 60 - గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం
- 61 - గ్రహాల శుభాశుభస్థానాలు తదనుసారంగా శుభాశుభఫలాల సంక్షిప్త వివేచన
- 62 - లగ్నఫలాలు, రాశుల చర - స్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల, ఏడు వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్తకార్యాలు
- 63 - సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీపురుషుల శుభాశుభలక్షణాలు, మస్తక, హస్తరేఖలాధారంగా వ్యక్తుల ఆయుఃపరిజ్ఞానం
- 64 - స్త్రీల శుభాశుభలక్షణాలు
- 65 - స్త్రీల, పురుషుల సామాన్యలక్షణాలు
- 66 - చక్రాంకితశాలగ్రామశిలలు తీర్ధమాహాత్మ్యాలు అరవైసంవత్సరాల పేర్లు
- 67 - స్వరోదయ విజ్ఞానం
- 68 - రత్నాలపుట్టుక కథ వజ్ర పరీక్ష
- 69 - ముత్యాలు - వాటిలో రకాలు లక్షణాలు- పరీక్షణ విధి
- 70 - పద్మరాగమణి - లక్షణాలు - పరీక్షావిధి
- 71 - మరకతమణి - లక్షణాలు, పరీక్షావిధి
- 72 - ఇంద్రనీలమణి లక్షణాలు, పరీక్షావిధి
- 73 - వైదూర్యమణి - పరీక్షా విధి
- 74 - 80 - ఇతర మణులు (పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్ఫటిక, విద్రుమ)
- 81 - గంగాది తీర్థాల మహిమ
- 82 - గయామాహాత్మ్యము - శ్రాద్ధాది కర్మల ఫలము
- 83, 84 - గయ, గయా శీర్ష మహిమ విశాలుని కథ
- 85 - గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ
- 86 - ఆదిగదాధర మాహాత్మ్యం
- 87 - పదునాలుగు మన్వంతరాలూ పదునెనిమిది విద్యలూనూ
- 88 - రుచి ప్రజాపతితో పితరుల సంవాదం
- 89, 90 - రుచిగావించిన పితృస్తుతి శ్రాద్ధాలలో ఆ స్తుతి పాఠ మాహాత్మ్యం
- 91, 92 - విష్ణు భగవానుని అమృత ధ్యానస్వరూపం
- 93, 94 - వర్ణధర్మ నిరూపణ
- 95 - గృహస్థ ధర్మ నిరూపణం
- 96 - వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం
- 97 - ద్రవ్యశుద్ధి
- 98 - దానధర్మమహిమ
- 99 - శ్రాద్ధాదికారులు - దాని సంక్షిప్తవిధి మహిమ, ఫలాలు
- 100 - వినాయక శాంతి స్నానం
- 101 - గ్రహశాంతి
- 102 - వానప్రస్థ ధర్మ నిరూపణం
- 103 - సన్యాసధర్మ నిరూపణ
- 104 - కర్మవిపాక నిరూపణ
- 105 - ప్రాయశ్చిత్తాలు-కృష్ట్ర పరాక, చాంద్రాయణాది వ్రతాలస్వరూపాలు
- 106 - అశౌచం, ఆపద్వృత్తి
- 107 - పరాశరమహర్షి చెప్పిన వర్ణాశ్రమధర్మాలు; ప్రాయశ్చిత్తకర్మలు
- 108, 109 - బృహస్పతి ప్రోక్త నీతిసారం
- 110 - నీతిసారం
- 111 - రాజనీతి
- 112
- 113, 114 - నీతిసారం
- 115 - నీతిసారం
- 116 - తిథులూ - వ్రతాలూ
- 117 - అనంగ త్రయోదశీవ్రతం
- 118 - అఖండ ద్వాదశీ వ్రతం
- 119 - అగస్త్యార్ఘ్య వ్రతం
- 120 - రంభాతృతీయ వ్రతం
- 121 - చాతుర్మాస్యవ్రతం
- 122 - మాసోపవాసవ్రతం
- 123 - భీష్మపంచకవ్రతం
- 124 - శివరాత్రి వ్రతకథ - విధానం
- 125 - ఏకాదశీ మహాత్మ్యం
- 126 - విష్ణుమండల పూజావిధి
- 127 - భీమా - ఏకాదశి (భీమైకాదశి)
- 128 - వ్రత పరిభాష, నియమాదులకు సంబంధించిన జ్ఞానం
- 129 - పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు
- 130 - షష్ఠి, సప్తమి వ్రతాలు
- 131 - దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి
- 132 - బుధాష్టమి - వ్రతం, కథ
- 133 - 135 - కొన్ని నవమి వ్రతాలు - ఋష్యేకాదశి
- 136 - శ్రవణద్వాదశీ వ్రతం
- 137 - తిథి, వార, నక్షత్రాది వ్రతాలు
- 138 - సూర్యవంశవర్ణన
- 139, 140 - చంద్రవంశ వర్ణన
- అధ్యాయం - 141 - భవిష్యత్తులో రాజవంశాలు
- 142 - భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రతా మహాత్మ్యం - ఆఖ్యానాలు
- 143 - రామాయణకథ
- 144 - ప్రత్యేకానుబంధం - కొన్ని కఠిన పదాలకి అర్థాలు
- 145 - మహాభారతం - బుద్దాది అవతారాలు
- ఆయుర్వేద ప్రకరణం
- 146 - రోగనిదానం
- 147 - జ్వర నిదానం
- 148 - 152 - రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా రాజయక్ష్మ రోగ నిదానాలు
- అధ్యాయం -153 - అరోచకం
- అధ్యాయం -154 - హృదయతృషారోగము
- 155 - మదాత్యయరోగ నిదానం
- 156 - అర్శలు లేదా మొలలు
- 157 - అతిసార గ్రహణి రోగాలు
- 158 - మూత్ర ఘాత నిదానం
- 159 - ప్రమేహరోగ నిదానం
- 160 - విద్రధ, గుల్మనిదానం
- 161 - ఉదర రోగ నిదానం
- 162 - పాండు - శోథ నిదానం
- 166 - వాత వ్యాధి నిదానం
- 167 - వాత రక్త - నిదానం
- 168 - సంక్షిప్త ఔషధీయ యోగసారం
- 169 - పదార్థాల గుణదోషాలు, ఔషధ సేవనంలో అనుపాన మహత్త్వం
- 170 - జ్వరం, అతిసార నివారణ
- 171 - నాడీ వ్రణాది రోగాల చికిత్స
- 172 - స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోషనివారణ, ఋతుచర్య పథ్యకారక, సర్వౌషధాలు
- 173 - మధుర, అమ్ల, తిక్తాదుల (ద్రవ్యాల) ఔషధీయ ఉపయోగాలు
- 174 - బ్రాహ్మీఘృతాది స్నేహపాకాలు - వాటి వినియోగాలు
- 175 - జ్వర చికిత్స
- 176 - పలితకేశ, కర్ణశూలలకు ఉపచారాలు
- 177 - నేత్రాది ఇతరాంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స
- 178-181 - గర్భసంబంధి, దంత - కర్ణ శూల, రోమాది రోగాలకు చికిత్స
- 182 - భోజ్య పదార్థ విహితసేవన కాలం బల - బుద్ధి వర్ధక ఔషధాలు విషదోషశమనోపాయాలు
- 183 - గ్రహణి, అతిసార, అగ్నిమాంద్య ఛర్ది, అర్శాది రోగాల చికిత్స
- 184 - అర్మ, అజీర్ణ, గండమాలాదుల చికిత్స
- 185 - గణపతి మంత్రం- ఔషధిక యోగం శోథ, అజీర్ణ విషూచిక, పీనసాదిరోగాలకు చికిత్స
- 186 - 187 - ప్రమేహ, మూత్ర నిరోధ, శర్కర, గండమాల భగందరాది రోగాల చికిత్స
- 188 - 189 - ప్రణ, నేత్రరోగ, దంతక్రిమి, విషాదిక, వివిధ జ్వరాదిక చికిత్స
- 190 - 191 - ఒళ్ళునొప్పులు గండమాల, ప్లీహ, విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స సుగంధద్రవ్యాల, విషచికిత్సమందుల వివరాలు
- 192 - వివిధ స్నేహపాకాలద్వారా రోగచికిత్స స్మరణ - మేధాశక్తి వర్ధక బ్రాహ్మీ ఘృతాది నిర్మాణ విధి
- 193 - బుద్ధి శుద్ధకరౌషధి, అభ్యంగాలు, ఉపయోగకర చూర్ణాలు విరేచక ద్రవ్యాలు
- 194 - వ్యాధి హర వైష్ణవ కవచం
- 195 - సర్వకామ ప్రద విద్య
- 196 - విష్ణు ధర్మాఖ్య విద్య
- 197 - గారుడీ విద్య, గరుడ దేవుని విరాట్ స్వరూపం
- 198 - 199 - త్రిపుర భైరవి, జ్వాలాముఖి దేవ్యాదుల పూజావిధి
- 200 - వాయుజయ నిరూపణం
- 201 - అశ్వలక్షణాలు, అశ్వగజ రోగ చికిత్స
- 202 - 203 - స్త్రీల వ్యాధులకు చికిత్స - కొన్ని ప్రత్యేక ఔషధాలు.
- 204 -ఓషధులపేర్లు - పర్యాయపదాలు
- 205 - 206 - (ప్రత్యేకానుబంధం) - సంస్కృత వ్యాకరణం (ప్రవేశిక)
- 207 - 212 - సంస్కృత ఛందస్సు
- 213 - సదాచార శౌచాచారాలు
- 214 - స్నాన, సంధ్యా తర్పణ విధి*
- 215 - తర్పణ విధి వర్ణన
- 216 - బలివైశ్వదేవ నిరూపణం
- 217 - సంక్షిప్త సంధ్యావిధి
- 218 - పార్వణ శ్రాద్ధవిధి
- 219 - నిత్య, వృద్ధి, ఏకోద్దిష్ట శ్రాద్ధాలు
- 220 - సపిండీకరణ శ్రాద్ధవిధి
- 221 - ధర్మసారం
- 222 - ప్రాయశ్చిత్తం, చాంద్రాయణం, మరికొన్ని వ్రతాలు, పంచగవ్య విధానం
- 223, 224 - విష్ణు మహిమ, ధర్మం నాలుగు పాదాలు, పురాణ, ఉపపురాణ పదునెనిమిది విద్యల లెక్క ప్రళయం నాలుగు యుగాలధర్మాలు, కలియుగం - నామ సంకీర్తన
- 225 - కర్మవిపాక కథనము
- 226 - అష్టాంగయోగం, ఏకాక్షర బ్రహ్మ ప్రణవ జపమాహత్మ్యం
- 227 - భగవద్భక్తి నిరూపణం - భక్తులమహిమ
- 228 - నామసంకీర్తన మహిమ
- 229 - విష్ణుపూజలో శ్రద్ధాభక్తుల మహిమ
- 230 - విష్ణుభక్తి మాహాత్మ్యం
- 231 - నృసింహస్తోత్రం - తన్మహిమ
- 232 - కులామృతస్తోత్రం
- 233 - మృత్యునివారకాష్టక స్తోత్రం
- 234 - అచ్యుత స్తోత్రం
- 235 - బ్రహ్మజ్ఞాన నిరూపణం - షడంగ యోగం
- 236 - ఆత్మజ్ఞాన నిరూపణం
- 237, 238 - గీతాసారం
- 239, 240 - బ్రహ్మగీతాసారం
అధ్యాయం -153 - అరోచకం
సుశ్రుతా! ఇప్పుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుకనుండీ, గుండె నుండీ స్రవించే మూడు గ్రంథుల వల్ల వాత పిత్త కఫప్రకోపాల వల్ల మూడు రకాల అరోచకం కలుగుతుంది. నాలుగవ రకం ఈ మూడు ప్రకోపాలూ కలిస్తే వస్తుంది. అయిదవ దానికి కారణం మానసిక రుగ్మత.
వాతం వల్ల వచ్చే అర్చకంలో నోరంతా వగరు తిన్నట్లుగా వుంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటీని కమ్మేస్తాయి.
కోపంగాని దుఃఖం కాని కమ్ముకున్నపుడు మనిషికి ఏ రుచీ పట్టదు. అగోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల వున్న రుచితప్ప ఇంకేరుచీ తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం ఈ కఫ ప్రకోపానికి మూల కారణమేమిటంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురుగొట్టడానికి ప్రయత్నం చేసినపుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం. అది నాభి ప్రాంతాన్ని,
వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటికొస్తుంది. మొత్తం నోరంతా వగరైపోతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. ఎక్కుళ్ళు, గొంతు బిరుసెక్కుట వుంటాయి.
ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు నీరు లాటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత, పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నపుడు నోరంతా చేదుగా, ఘాటుగా వుంటుంది. దాహం, తెలివితప్పుట, శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగా నున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది. నోరు ఉప్పుగా అయిపోతుంది. రోమాంచమూ కలుగుతుంది.
ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా, మనిషిలో స్థిరతపోయి, నాడిలో అశాంతి బయలుదేరి, అక్కడ నొప్పి వచ్చి, వెక్కుళ్ళు తరుచుగా వస్తుంటాయి. ఈ దశలో కుదుర్చడం అసాధ్యం.
ఈ రోగికీ ఏది విన్నా, ఏకన్నా అసహ్యతే కలుగుతుంటుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే (పురుగులున్నవైతే) శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం వుంటుంది. వాతం కూడా చెడుతుంది.
