1 - గరుడ పురాణము - ఆచార కాండము
66 - చక్రాంకితశాలగ్రామశిలలు తీర్ధమాహాత్మ్యాలు అరవైసంవత్సరాల పేర్లు
దేవతలారా! చక్రాంకిత శాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలూ, సౌఖ్యాలూ కలుగుతాయి.
శాలగ్రామంలో చక్రాల సంఖ్య దానిపేరు
ఒకటి సుదర్శన
రెండు లక్ష్మీనారాయణ
మూడు అచ్యుత
నాలుగు చతుర్భుజ
అయిదు వాసుదేవ
ఆరు ప్రద్యుమ్న
ఏడు సంకర్షణ
ఎనిమిది పురుషోత్తమ
తొమ్మిది నవవ్యూహ
పది దశాత్మక
పదకొండు అనిరుద్ద
పన్నెండు ద్వాదశాత్మక
పన్నెండు కన్న నెక్కువగా ఎన్ని చక్రాలున్నా ఆ శిలామూర్తి నామము అనంత భగవానుడే. సుందరమైన ఈ శాలగ్రామాలను పూజించినవారికి కోరికలన్నీ తీరుతాయి.
శాలగ్రామ, ద్వారకాశిలల సంగమముండే చోట ముక్తి కూడా వుంటుందని ఇలా చెప్పబడింది.
శాలగ్రామ శిలాయత్ర దేవోద్వారవతీ భవః ।
ఉభయో సంగమోయత్ర తత్ర ముక్తిర్నసంశయః ॥ (ఆచార 66/5)
హే శంకరదేవా! శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుడధివసించియున్న ఉజ్జయని - ఈ తీర్థాలన్నీ అన్నిపాపాలనూ నశింపచేసి భక్తి, ముక్తి ప్రదాయకాలవుతున్నాయి*.
(*శాలగ్రామోద్వారకం చ నైమిషం పుష్కరం గయా ।
వారాణసీ ప్రయాగశ్చ కురుక్షేత్రం చ సూకరం ॥
గంగా చ నర్మదా చైవ చంద్రభాగా సరస్వతీ ।
పురుషోత్తమో మహాకాలస్తీర్ణాన్యేతాని శంకర ॥
సర్వపాప హౌరాణ్యేవ భక్తి ముక్తి ప్రదానివై ।....) (ఆచార 66/8)
ఇక నామసార్థకాలైన మన అరవై సంవత్సరాల పేర్లను వినండి.
ప్రభవ, ప్రజాపతి, యువ, ప్రమాదే,
విభవ, ఆంగీరా, ధాత, విక్రమ,
శుక్ల , శ్రీముఖ, ఈశ్వర, విఘ
ప్రమోద, భావ, బహుధాన్య, చిత్రభాను,
స్వభాను, జయ, వీశ్వావసు, నల,
తారణ, మన్మథ, పరాభవ, పింగల,
పార్థివ, దుర్ముఖ, ప్లవంగ, కాల
వ్యయ, హేమలంబ, కీలక, సిద్దార్థ
సర్వజిత్, విలంభ, సౌమ్య, రౌద్రి,
సర్వధారి, వికార, సాధారణ, దుర్మతి,
విరోది, శర్వరి, విరోధికృత్, దుందుభి,
వికృతి, ప్లవ, పరిధావి, రుధిరోద్గారి,
ఖర, శుభకృత్, ప్రమాది, రక్తాక్షి,
నందన, శోభన, ఆనంద, క్రోధన,
విజయ, క్రోధి, రాక్షస, అక్షయ
