1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

122 - మాసోపవాసవ్రతం

ఇది సర్వోత్తమ వ్రతాలలో నొకటి. ఈ వ్రతాన్ని వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు పాలన చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశినాడుపవాసం చేసి వ్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి.

ఆద్యప్రభృత్యహం విష్ణో యావదుత్థానకం తవ ।

అర్చయే త్వామనశ్నంస్తు దినానీ త్రింశదేవ తు ॥

కార్తికా శ్వినయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం ।

మీయే యద్యంతరాలే తువ్రతంభంగో నమేభవేత్ ॥

స్వామీ! నీవు లేచేదాకా నేనేమి తినను. ఈ ఆశ్వయుజ కార్తీక శుద్ధ ద్వాదశులమధ్య నేను మరణిస్తే ఆవిధంగా వ్రతం చెడినా ఫలితం మాత్రం నాకు దక్కించు అని ఆయనను వేడుకొని మధ్యాహ్న, సాయంకాలాలలో స్నానం చేసి, హరిని, దేవాలయానికి పోయి సుగంధాదులతో పూజించాలి. ప్రతి మాత్రము తాను ఉబటన, సుగంధిత గంధాలే పాదులను పూసుకోరాదు.

ద్వాదశినాడు భగవానుడైన హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఒక మాసం దాకా హరినే పూజిస్తూ మంచినీళ్ళే త్రాగుతూ అప్పుడు పారణ చేయాలి. మధ్యలో ప్రతి నీరసంతో మూర్ఛపోతే ఇతరులు ఆయన నోటిలో పాలుపోయవచ్చు. దీనివల్ల ప్రత భంగం కాదు. ఈ వ్రతం భక్తి, భుక్తి, ముక్తిదాయకం.