1 - గరుడ పురాణము - ఆచార కాండము
205 - 206 - (ప్రత్యేకానుబంధం) - సంస్కృత వ్యాకరణం (ప్రవేశిక)
ఏ భాషలోనైనా పదాలు ప్రాతిపదికలనుండి సృష్టింపబడతాయి. పదాలు కర్మలనో కర్మేతగాలనో, క్రియలనో తెలపాలి కదా! సుబడతాలో జగితాలో అయి మండాలి. సుష్ చివర వుండే పదాలు ఏడు వీభక్తులను తెలియజేస్తాయి. సుటే, జస్ అనే అంశాలు కర్తలుగానో కర్మలుగానో వచ్చే పదాలకుంటాయి.
ప్రాతిపదిక అంటే మూలం దీనికీ ఏపదమూ, అక్షరమూ చేరకుండానే ఒక నిర్దిష్టమైన అర్థం వుండాలి.
నామవాచకం పూర్తిగా కర్మగా వాడబడినపుడు అం, ఔ, శస్, అనేవి పదం చివర చేరతాయి. కర్త, కర్మ అనేవి సాధారణంగా నామవాచకాలో సర్వనామాలో అవుతాయి. సంస్కృతంలో ప్రతి పేరుకీ ఏడు విభక్తులలో మూడు వచనాలతో వెరసి ఇరువది యొక్క రూపాలుంటాయి. *
(*మిగతా భాషలలో ఏకవచనం, బహువచనం అని రెండు వచనాలే కనిపిస్తాయి. కానీ సంస్కృతంలో వచనాలు ఏక, ద్వీ, బహు విధాలతో మూడుంటాయి. విభక్తులలో ప్రధము నుండి- సప్తమి వణుకు రకరకాల రూపాలుంటాయి. కాబట్టి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలనుకునేవారు శబ్దమంజరిని బట్టీపట్టడం తప్పనిసరి.)
టా, భ్యాం, భిస్ - తృతీయ అనగా ఆయుధం లేదా పనిముట్టుకీ వచనాన్ని బట్టి ఈ అక్షరాలను చేర్చాలి. దేని ద్వారా ఒక కార్యం సంపన్నమైందో దానిని ‘కరణ’మనీ ఎవరైతే ఆ పనిని చేస్తారో వారిని (దానిని) ‘కర్త’ యనీ వ్యవహారము కదా! ఆ కరణానికీ టా, భ్యాం, భీస్లను చేర్చాలి.
సంప్రదాన కారకానికి డే, భ్యాం, భాస్లనూ, అపాదాన కారకాలకి నసి, భ్యాం, భాస్లను చేర్చాలి. యొక్క అనే అర్థంలో నాస్, ఓస్, అం లనూ లోపల అనే అర్థంలో నీ, ఓస్, సుప్లను చేర్చాలి.
ఆధారమే అధికరణము. రక్షణనుద్దేశించినప్పుడు తృతీయా లేదా సప్తమీ విభక్తిని వాడాలి. కోరుకున్నదీ, ఇష్టపడనిదీ కూడా అపాదానకాలే అవుతాయి. వాటికీ తృతీయ, సప్తమీ విభక్తులతో నున్న క్రియలనే వాడాలి. పరి, అష, ఆస్, ఇతర, గ్రే అనేవి వచ్చినపుడు కూడా పై వీభక్తులనే వాడాలి. ఇలా చాలా విషయాలను చెప్పిన తరువాత సంహితలను కూడా చెప్పాడు కార్తికేయుడు. ఇవీ తెలుగు భాషలోని సంస్కృతసంధులు అనే శీర్షికలో కనిపించే సవర్ణదీర్ఘ గుణాది సంధులే.
తరువాత సమాసాలలో కర్మధారయ, ద్విగు, తత్పురుష, బహువ్రీహి, అవ్యయీభావ, ద్వంద్వాలను తెలిపి కార్తికేయుడు త్రిలింగాదులను గూర్చిన జ్ఞానాన్ని ఉదాహరణలతో సహా ప్రవచించాడు ఇలా:
సంస్కృతంలో కూడా పుం, స్త్రీ, నపుంసక లింగాలే వున్నా వాటిలో కొన్ని అర్థాన్ని బట్టి కాక శబ్దాన్ని బట్టి ఏర్పరుపబడడం వల్ల, ముఖ్యంగా నపుంసకలింగ శబ్దాలతో, జాగరూకత అవసరం. ఎందుకంటే లింగాన్ని బట్టి విభక్తి రూపాలు కూడా మారిపోతుంటాయి కదా!
దేవ, అగ్ని, సఖి, పతి, అంశు, కోష్టు, స్వయంభూ, పితృ, నృ, ప్రశస్త -ఇవన్నీ పుళ్లింగాలు. అలాగే సాధారణంగా హలంతాలు - అనగా పదం చివర హల్లు గలవి పుల్లింగాలవుతాయి. దీనిని బట్టి అసక్, క్షమాభృత్, మృగావిధ్, రాజన్, యువన్, పతిన్, పూష(న్) బ్రహ్మ(న్) విడ్, వేధస్, ఉశన్, అనద్వహ (హ్), మధులిత్, కాష్ఠటక్ష వంటి వన్నీ పుల్లింగాలే.
వన, వారి, అస్థి, వస్తు, జగత్, సామ(న్), కర్మన్) సర్పిస్, తేజస్ వంటి శబ్దాలు నపుంసక లింగానికి చెందుతాయి.
సాధారణంగా దీద్దాంతాలు స్త్రీ లింగాలవుతాయి. జయా, నదీ, శ్రీలక్ష్మీ, స్త్రీ, భూ, వధూ, భ్రూ, పునర్భూ, మాతృ, ధేను (దీర్ఘం లేకున్నా), చమూ మున్నగు శబ్దాలు స్త్రీ లింగాలు కాగా, ఈ నియమానికి లోబడని వాక్, శ్రేక్, సక్, దిక్, క్రుధ్, యువ, కకుప్, ద్యౌ, ఉపావృత్, సుమనః, ఉష్ఠీక మొదలగు శబ్దాలు కూడా స్త్రీలింగాలే. విశేషణాదులు కొన్ని అనగా శుక్ల, కీలాలు, శుచిః, గ్రామణీ, సుధీః వంటివి అన్ని లింగాలలోనూ వాడబడతాయి.
బాహు, కమలభూః, కర, స్వమాతృ, స్వనౌః, సత్య, దీర్ఘపాత్ పుల్లింగాలు.
సర్వ, విశ్వ, ఉభయ, ఉభ, అన్య అన్యతర (విభక్తులుగా జాతర, దాశము} పూర్వ, అపర, అధర, యావత్, కిం, యుష్మత్, అస్మత్ ఇవన్నీ సర్వనామాలు, అలింగాలు. అన్ని లింగాలతోనూ వాడబడతాయి.
శ్రుతి, జుహోతి, జహాతి, దధాతి, దీప్యతి, సూయతి, పుత్రీయతి, ధనాయతి, త్రుట్యతి, ప్రియతే, చిచీషతి, నినీషతి ఇవి క్రియలకీ ఉదాహరణాలు. సుఖంత శబ్ద రూపనిష్పత్తి, విశిష్ట శబ్దాలైన సర్వ, సర్వే, సర్వసై సర్వస్మాత్, సర్వతః సర్వేషాం, సర్వస్మిన్... వంటి వాటిని శ్రద్దగా చదవవలసి వుంటుంది. విశ్వ శబ్దాన్నుండి వివిధ విభక్తులతో వచ్చే మాటలను కూడా గమనించాలి. పూర్వశబ్దం నుండి ప్రత్యేక సందర్భాలలో పూర్వస్మాత్, పూర్వాత్, పూర్వే, పూర్వాశి, పూర్వస్మిన్, పూర్వే మున్నగు శబ్దాలు నిష్పన్నమవుతాయి.
(మరిన్ని వివరాలు అనుబంధం- 14లో చూడండి)
