1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

207 - 212 - సంస్కృత ఛందస్సు

ఇపుడు నేను వాసుదేవ, గురు, గణపతి, శంభు, సరస్వతీ దైవతములను తలచుకొని వారికీ మనసానతులు నుతులు నొనర్చి అల్పబుద్దులకు కూడా అనన్య బుద్ధి సంపద నీయగల, మాత్రావర్ణ భేద సమన్విత ఛందశ్శాస్త్రాన్ని సంక్షిప్తంగా విన్నవిస్తాను..

ఛందస్సు *కి మూలం మాత్ర; అనగా చిటికె వేయడానికి పట్టే కాలం. ఏమాత్రాక్షరం లఘువు (U) ద్విమాత్రాక్షరం గురువు (S) తెలుగులో గురువుని ‘U’ అనే చిహ్నంతో సూచిస్తారు. లఘువుకి చిహ్నం (I)

(*ప్రాచీనకాలంలో ఛందస్సు అనే మాటలోని చకి ఒత్తు వుండేది కాదు. చందః అనే మాట వేదానికి పర్యాయంగానూ ‘చాందసుడు’ అనేమాట వేద పండితునికి బదులుగానూ వాడబడేవి)

దీర్ఘాక్షరాలూ (ఉదా ॥ కాకీ లోకా) సున్నతోనున్నవీ (హంసలో హం) పొల్లు హల్లుతో నున్నవి (హసన్ లో సస్) ద్విత్వానికి ముందున్నవీ (అమ్మలో అ) సంక్లిష్ట్రానికి ముందున్నవీ(లక్షలో ల) గురువులవుతాయి. సున్నకీ పొల్లు హుకీ వేరే సంజ్ఞ వుండదు. గురువులు కాని వన్నీ లఘువులే. అనగా సాధారణంగా హ్రస్వాక్షరాలు లఘువులు కావచ్చును.

ఈ గురు లఘువులు మూడేసి వచ్చే గణాలు ఎనిమిదున్నాయి.

 

ఆదిగురువు               (SII)            భ గణము

మధ్యగురువు             (ISI)            జ గణము

అంత్యగురువు            (IIS)            స గణము

సర్వగురువు               (SSS)          మ గణము

ఆదిలఘువు               (ISS)           య గణము

మధ్యలఘువు             (SIS)           ర గణము

అంత్యలఘువు          (SSI)              త గణము

సర్వలఘువు             (III)                న గణము

సంస్కృతంలో ముందుగా చెప్పుకోదగినది ఆర్యాఛందము. దీనిలో ఎనిమిది గవాలంటాయి. వీటిలో బేసి గణము ‘జ’ గణము కాగాదు. ఆగవగణం లఘువుతో పూర్తికావాలి. ఏడవగణాదిని లఘువుండాలి. ఆర్య యొక్క రెండవభాగంలో అయిదవ గణంలో అన్నీ లఘువులే వుంటే దాని మొదటి అక్షరమే పద లేక పాదారంభానికి ముందుంటుంది. ఆర్యాఛందంలో మొదటి, రెండవ భాగాల్లో మూడేసి గణాల తరువాత విరామం (తొలిపాదానికి) వుంటే దాన్ని ‘పథ్యా’ అనే ఆర్యఛందంగా పరిగణిస్తారు. ఆధ్యా యొక్క పూర్వారంలో గానీ ఉత్తరార్ధంలో గాని లేదా రెండింటిలో గాని మూడు గణాలపై పాదవిరామముంటే దానిని ‘విపులా’ అంటారు. దీనిలో మరల అది విపులా, అత్యవిపులా, ఉభయవీపులాయని మూడు రకాలుంటాయి. రెండవ, నాలుగవ గణాలు జ గణాలై వుండి వాటికిరువైపులా గురువు (S) లుంటే ఆ ఆర్యని ‘ముఖపూర్వాచపలా’ అంటారు. రెండవ ఉత్తరార్ధంలో చపలాలక్షణమున్న ఆర్యని ‘సజఘనా’ అంటారు. పూర్వోత్తరార్ధాలు ఒకేలా వుండే ఆర్యను ‘గీతి’అనీ తేడాగా వుంటే ‘ఉద్గీతి’ అనీ గీతిచందంలో చివరి వర్ణం గురువైతే ‘ఆర్యాగీతి’ అనీ వ్యవహరిస్తారు.

విషమపాదాలలో (1,3) ఆరేసి సమపాదాలలో (2,4) ఎనిమిదేసి మాత్రలుండి, ప్రతిపాదంలో ఒక ర గణం, ఒక లఘువు, ఒక గురువు ఉంటే అది వైశాలీయ ఛందమనబడుతుంది. ఇందులోనే ప్రతి చరణంలోనూ ఒక్కొక్క గురువు అధికంగా కూర్పబడితే అది ఔపచ్చందసిక మవుతుంది.

పైన చెప్పబడిన వైతాయ చందంలో గగణ, ము, గురువులకు బదులుగా భ గణమూ, రెండు గురువులూ ప్రతిపాదంలో కూర్పబడితే అది ఆపాతలికాఛంద మనబడుతుంది. ఇందులో ప్రతిపాదంలోనూ ద్వితీయ మాత్ర పరాశ్రితమైతే దానిని దక్షీణాంతికా ఛందమంటారు.

వైతాళీయ విషమ పాదాలలో ఉదీచ్య, సమపాదాలలో ప్రాచ్య వృత్తాలను ప్రయోగిస్తారు. సమపాదాలలో పంచమ మాత్రతో చతుర్ణమాత్ర కలిసిపోతే దానిని భేదాలు కూడా ఉన్నాయి.

మరొక ఛందోజాతి వక్ష జాతి. ఉదాహరణలూ ప్రయోగాలూ లేకుండా ఈ అర్థం కావు కాబట్టి ఛందోదర్పణం నుండి స్వీకరించడం జరిగింది.)

యమతరజభనస అనే గణాలు మాత్రమే ఇంతకుముందు చెప్పబడ్డాయి. ఆ తరువాత ఈక్రింది గణాలు కూడా కనిపిస్తున్నాయి.

(గరుడపురాణంలోనూ ఛందోదర్పణంలోనూ కూడా చెప్పబడిన వాటినే అనువదించడం జరిగింది)

ఇలాగే స, గలతో కూడా నష, నలల గగ, తగ, నగ, నలు, సల అనే గణాలేర్పడతాయి. న, హలు సూర్యగణములనీ, సగల, గల, నగల, తల, సలల, భల, నలల, లు చంద్రగణములనీ, మిగతావి ఇంద్రగణములనీ పెద్దల వ్యవహారము.

SI - హ                IISII - సలల

IS - మ                SIII - భల

SS - గగ               SIIS - భగణగురువు

II    - లల             SSSI  - మగణలఘువు

IIII - సల               IISIS   - సవ

IIIUI - నగ              IISSI - నహ

IISI  - సల              SSII  - తల

సమవృత్తములు

ఒక్కొక్క పాదమున కొక్కొక్క గురువు మాత్రమే ఉండే దానిని శ్రీ వృత్తమంటారు. ఉదా ॥ శ్రీ /భా /విం/తున్

పేరు                          లక్షణం                                ఉదాహరణ

స్త్రీ(అత్యుత్త               రెండేసి గురువులు                    స్త్రీరూ/పారున్; ఘోరా/ఘారీ

వినయం(మధ్యా)      పాదానికొక సగణం                   వినయం / బొనరిం

                             రెండవ అక్షరం మారరాదు         తుననం / తునకున్

బింబము(ప్రతష్ఠా)      భగణగురువులు                      శ్రీ కలితా స్తోకభగల్

                                                                          పైకొనుబింబాకృతికిన్

సుకాంతి(అదే)           జగణగురువులు                     అగున్సుకాం తీగూర్పగా

                                                                          జగంబులన్ జగత్పతీ

అంబుజం                 భలగలు                              పంబీభలగా డంబరముగా

(సుప్రతిష్ఠా)                                                         నంబుజముచెల్వంబగుహరీ

పంక్తి (అదే)                 భగగలు                           ఒక్క భకారం బెక్కుగగంబుల్

                                                                      నెక్కొను పంక్తిం దక్కబ శౌరీ

 తనుమధ్య                 తయలు                           గోపాలుని దేవే నాపాలికి

 (గాయత్రి)                 (తగణ యగణం)                  నాగాభై పై తనుమధ్యస్

                                                                       బ్రాపించుదయంబుల్

మధుమతి                   స,న,గ                             మధురిపుడనినన్

(మదన వీలసిత                                                  మధురపు ననగల్

మని కూడా దీనినే                                               మధురములగుచున్

అంటారు                                                          మధుమతి నమరున్

మదరేఖ                      మ,స,గ                           రూపింపన్మగణాద్యం

                                                                       బై పెంపార సగంబుల్

                                                                       దీపించున్మద రేఖన్

                                                                       గోపస్త్రీ హృదయేశా

 పై వృత్తాలలో సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్టికచ్ఛందాలున్నాయి.

ఇక అనుష్టుప్ ఛందములు

ఇదివకులాగే చందంపేరు, లక్షణాలు, ఉదాహరణ ఇవ్వబడతాయి.మూడు రకాలు అనుష్టుప్ఛంచాలకూ కూడా రెండవ అక్షరం ఒకటే అయివుండాలి. ఈ రెండవ అక్షరం నియమం తెలుగులో తప్పనిసరిగా పాటింపబడుతుంది. సంస్కృతం లో ఆ నియమం తప్పనిసరి కాదు.

     విద్యున్మాల        మ,మ,గ,గ      ఉదాహరణలు :

                                                మాద్యద్భక్తి న్మాగాయుక్తిన్ విద్యున్మాలా

                                                 వృత్తంబొప్పన్ చైద్యధ్వంసిన్ సంబోధింపన్

                                                  సద్యశ్రేయోజాతం బయ్యెస్

       చిత్రపద               భభగగ   వారక భాగురు యుగ్మం బారక జిత్ర పదాఖ్యం

                                              జేరిన వేడ్క గవీంద్రుల్ గోరినుతింతురు శౌరిన్

       ప్రమాణీ             జ,ర,లగ   సరోజనాభుడచ్యుతుండరాతి భంజనుండనన్

                                             జరేఫలస్ లగంబులన్ ధరం బ్రమణియొప్పగన్

             తరువాతి బృహతీ ఛందము

    హలముఖి         ధన,స         ఉదా: చిత్తజాతుని గురునికై యెత్తుడంజలులనిన

     (బృహతి)                          చోసత్తుగా రనసము లొగిన్ బొత్తుగా హలముఖి

                                        యగుస్. ఇకవచ్చు పదక్షరాల ఛందాలను

                                        పంకీచందాలంటారు.

    రుక్మవతి            భ,మ,సగ    ఉదా ॥రూపిత రీతిన్ రుక్మవతీసం రూపభ

                                        మంబుల్ రూఢి సగంబుల్ ట్రిపుర భూత

                                         వ్రాత యతుల్గా శ్రీపతి లీలన్ జెప్పగనొప్పున్

                                         యతిస్థానము -6

    మత్త                  మ,భ,స,గ   ఉదా ॥ మొత్తంబారున్ మభములు నిత్యోదాతం

                                           బై సస్ఫురిత గకార యత్తంబై షర్మీత యతి

                                           నొందున్ మత్తావృత్తంబగు మహీగృష్ణా

                                          యతిస్థానం-7.

   ప్రణవ             మన,య,గ      యతి -6 ఆ రంగాచనయగ సంయుక్రీన్

                                          సారోదంచిత శరవిశ్రాండిస్ శ్రీరాజుబొగసిన

                                          నత్యంత స్థారంబై చను ప్రణవంబుర్విన్

     మయూరసారి  ర,జ,ర,గ   యతి-7, ఉదా ॥చూతమాయశోద సూనునంచున్

                                          ప్రేత పలుదర్క విశ్రమంబుల్ భాతిగా గజంబు

                                          పై రగంబుల్ జాతిగా మయూరసారి జెప్పున్

    శుద్ధవిరాటీ     మ,స,జ,గ     యతి-6, ఉదా ॥శ్రీమంతుడగు చిన్న కృష్ణునిన్

                                           ధీమంతుల్ప్రణుతింప బాణవి శ్రామంబుస్మస

                                           జంబుగంబునై ధామాశుద్ధవిరాటియొప్పగున్

     మణిరంగము          ర,స,స,గ     యతి-6, ఉదా ॥శ్రీమనస్సరసీరుహ మిత్రున్

                                         మమొప్పగ బేర్కొను చోటన్ రామ నస్త్ర వీరా

                                          మరసాగల్ కోమలంబులగు న్మరంగన్.

      తోదకం   భభభగగ           యతి-7, ఉదా ॥ తోరపు వేడుక దోదక వృత్తా

       (త్రిష్టుఛందం)               కారముగా ద్రిభకార గణంబుల్ నీరజనాభుని

                                           నెమ్మినుతింపజారు విరామముషణ్మితినొందున్

    ఇంద్రవజ్ర

    (త్రిష్టుప్)               తతజగగ  యతి-8, సామర్య లీలస్ తతజగంబుల్

                                            భూమిధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్

                                            ప్రేమంబుతో నైందవబింబ వక్త్రున్ హేమాంబ

                                            గుంజాడుదురింద్ర వజ్రన్

ఉపేంద్రవజ్ర    జతజగగ            యతి-8, ఉదా ॥ పురారిముఖ్యా మరుపూజ

 (త్రిష్టుప్)                                నీయున్

                                             సరోజనాభున్ జతజద్విగోక్తిన్ దిరంబుగా

                                             నద్రియశిన్నుతింపస్ ఇరాసుతా ధీశునుపేంద్ర

                                              వజ్రన్

ఉపజాతి ...1,3 పాదములుపేంద్ర వజ్ర 2,4 పాదములీంద్ర వజ్ర...

ఉదా: పినాకి, కోదండము బిట్టు ద్రుంచెన్ దానొప్ప గెల్చెన్ జమదగ్ని సూనున్ అనంత సత్వుండితడం చుమెచ్చన్ జానైన వృత్తంబు పజాతి యయ్యెస్

(*దీనినే కాంత, కాంతి, కవితాంతనామములతో నితరలాక్షణికులు పేర్కొనిరి. డా!! చీర్రావూరి శ్రీరామశర్మ ఛందోదర్పణము)

రథోద్ధతము: ర,న,ర,లగ యతి-7, దీనికి మరో పేరు పరాంతకము

ఉదా: నందగోపవరనందనున్ రమా నందుబ్రస్తుతి యొనర్చి షడ్యతిన్ అందమైరనర వాహ్వయంబు లిం పొంద జెప్పిన రథోద్ధతంబగున్

గీతాలంబనం: త,జ,జ, లగ, యతి-8,

ఉదా: నాళీక భవామనాడులోగిన్ శ్రీ లోలుని గీర్తన సేయనొగిన్ బోలంగ గజానల బొందిన గీతాలంబన మైచను నద్రియతిన్

స్వాగతము: రనభగర : యతి-7,

ఉదా: నారదాది ముని నాయక వంద్యున్ శౌరి జేరుడన స్వాగతమొప్పున్ సారమైన యతి షణ్మితి నొందన్ భూరీ రేఫనభముల్ గగయుక్తిన్

శాలిని: మత,త,గర, యతి-7,

ఉదా: చేతో రాగంబుల్ల సిల్లన్మతాగా ద్యోతంబై షడ్వర్ణయుక్త విరామం బేతేరంగా నీందిరేశ ప్రభావా నీతం బైనన్ శాలినీ వృత్తమయ్యెన్

శ్వేని (త్రిష్టుప్): ర,జ,ర,ల,గ యతి-7

ఉదా: ఆరమాధి నాథుడక్షయంబుగా జీరలిచ్చె యాజ్ఞసేని కంచు బెం పారజెప్ప శ్యేని యయెయషడ్యతిన్ స్ఫారమై గజంబుపై రవంబుగన్

వాతోర్మి (త్రిష్టుప్): మ,భ,త,లగ, యతి -7

ఉదా: దేవాధీశున్ హరి దేజో వనధిన్ భావింపగా ఋతుభాసద్వి రతిన్ ఈవాతోర్మిస్ మభలేపారుదకా రావాసంపై లగ మర్థిన్ గదియన్

చంద్రిక (త్రిష్టుప్): నన,ర,లగ, యతి-7

ఉదా: నగణయుగమునన్ గవంబులన్ బ్రగుణ రస విరామ సంగతిన్ తగిలి హరికథా సమేతమై నెగడు గృతులనిండి చంద్రికన్

భుజంగ ప్రయాతము: (జగతీఛందము) : య, య, య,య. యతి : 8.

ఉదా: భుజంగేశ పర్యంక పూర్ణానురాగున్ భుజంగ ప్రభూ తాఖ్య బూరించునోటన్ నిజంబై ప్రభూతావనీ భృధ్విరామం బజస్తంబుగా గూర్పయాడ్వంద్వమొప్పున్.

ద్రుతవిలంబితం (త్రిష్ణుప్): న,భ,భ,ర, యతి:- 7

ఉదా: శ్రుతి మతాంగ నీరూరమహాయతీన్ యతీ వర ప్రముఖార్య జనం బోగిన్ యుత విలంబిత తోషిత రీతులన్ కీతి ధరున్ ను సేయు సభాధలన్

జలధరమాల (త్రిష్టుప్): మ,భ,గ,మ, యతి: 9

ఉదా: శ్రీతన్వీశుందగిలి ఉత్తంబారన్ మాత్రాయంచున్ జలధరమాలావృత్తం బేతేరంగా మభనమ భీంపొందంగా బ్రీతిం బల్కన్ నిర్వతికరిన్ బ్రాపించున్.

ప్రియంవద (అదే): న,భ,జ,ర.. యతి: 8

ఉదా: త్రిబుపనాభి నుతు దేవదేవునిన్ బ్రభు ముకుందు నిలు ప్రస్తుతింపగా సభజ చల్లదిసినన్ బ్రియంవదా విభవ మొప్పు గిరి విశ్రమంబులన్

మత్త మయూరము (అతి జగతి) : మత,య,స,గ, యతి: 8

ఉదా: భోజాధీశుండంచు బ్రభూతాత్మకుడంచున్ భ్రాజిష్ణుండంచున్ యతిబాగౌ గిరి సంజ్ఞన్ ఓజస్పీ తంబై మతయోపేత సగంబుల్ ఓజం బలన్మత్త మయూరం బలరారున్.

జలదము: భర,న,భగ... యతి-10

ఉదా: మొక్కులకెల్ల నెల్ల యగుమూర్తి గదా యక్కమలాక్షుడంచు జతుగాస్యయతిన్ దక్కక ప్రస్తుతింప జలదంబగు ని ట్లొక్కటియై భరేఫ సభలొందు గురున్

మంజుభాషిణి: స,జ,స,జ,గ యతి-9

ఉదా: దివిజేంద్రుడాదియగు దేవ సంఘముల్ భువి మంజుభాషిణికి భోగి రాడ్యతిన్ సవరింపగా సజసజంబుగాంతమై భువనోదర స్తుతి యపూర్వమై చనున్.

ప్రహరిణి: మన,జ,ర,గ... యతీ-8

ఉదా: ముక్తి శ్రీకరు భవమోచనున్ మురారిన్ భక్తిం ప్రోడజనులు ప్రస్తుతింప నొప్పున వ్యక్త గ్రావయతి బ్రహ్మర్షిణి సమాఖ్యన్ యుక్తంబై మసజరగోజ్జ్వలద్గణాప్తిన్

 ప్రభాతము : న,జ,జ,ర,గ.... యతి-8

ఉదా: సరసి జనాభ భుజంగరాజ తలాల శరణము నీవని సన్మతిందలంపన్ బెరయు నజాలు పేర్మినొప్పగున్ గన్ జరగు బ్రభాతము శైల విశ్రమంబున్

రుచిరము: జ,భ, సజ,గ... యతి: - 9

ఉదా: అనంగకోటి విలసదంగ వైభవున్ మనంబులో నిలిపిన మాను నా పదల్ అనన్ జభంబులు, సజగాను సంగతిన్ దనర్చు నీ రుచిగకు దంతిరాడ్యతిన్

వసంతతిలకము (శక్వరీచ్ఛందము) : *త,భ,జ,జ,గ,గ.. యతి-8.

(*వసంత తిలకమే వృత్తరత్నాకరంలో సింహోన్నతయని వేరొకచో ఉద్ధర్షిణి లేదా ఉధర్షిణి యని పేర్కొనబడింది.)

ఉదా: గౌరీనితాంత జపకాగణ నామధేయున్ దూరీకృత ప్రణత దుష్కృతునంబు జాక్షన్ ధీరోత్తముల్గిరి యతిన్ తభజాగగ ల్పెంపారన్వసంత తిలకాఖ్య మొనర్తు రొప్పున్

ప్రహరణ కలిత: న,న,భ,,ల,గ : యతి -8

ఉదా: వనరుహ సఖుడున్ వనరుహరి పుడున్ గనుగవయరు నాకరివరదు నకున్ ననభనలగము న్నుగ యతి బలుకన్ బనుపడు గృతులన్ బ్రహరణ కలితన్

అపరాజిత: నన,ర,స,లగ , యతి: 9

ఉదా:మునిజనవినుతుండ మోఘజయోన్నతుం డనితర సదృశుండ గంగ గురుండనం జనుననయుతమై రసంబులగంబులై తన రగనపరాజితం బహిరాడ్యతిన్

 అసంబాధ: మ,త,న,స,గర : యతి-12

ఉదా: సౌమ్యంబై విష్ణుస్తుతులను నతిసేవ్యంబైరమ్య స్ఫూర్తిన్ రుద్రవిరమణము రమ్యంబై గమ్యాకారం బొప్పు మతనసగగ ప్రాప్తిన్ సమ్యగ్భావంబై పొలుపమరు నసంబాధన్

మణిగణనీకరం: న,న,న,న,స: యతి- 9.

ఉదా: కనకపు వలువలు గరకట కములున్ గునుపగుత్తులుమును నొసలి కొలకమున్ దనరెడు హరిగని తగననననసల్ నినిచిన మణిగణనికర మిభయణిన్

 మాలిని : న, న,మ,య,య : యతి-9

ఉదా: సకల నిగమవేద్యున్ సంస్కృతి వ్యాధి వైద్యున్ మకుట విమల మూర్తినమాలినీ వృత్తపూర్తిన్ నకలిత నమయోక్తి న్నాగవిశ్రాంతయుక్తిన్ సుకవులు వివరింపన్ సొంపగు న్వీస్తరింపన్

సుకేసర: న, జ, భ, జ, గ: య -11

ఉదా: యతి యవతార సంఖ్యనిడియాదంబుతో నతిశయమై నజంబులు భజాంతరేఫున్ వితతముగా నొనర్చియరవిందలో చనున్ క్షితి ధగు సంస్తుతించిన సుకేసరంబగున్ (ఇప్పటిదాకా శక్వరీచ్ఛందమే)

శిఖరిణీ (అత్యష్టిచ్ఛందము) : య,మ,న,స,భ,లగ - యతి-13

ఉదా: గజేంద్రాపద్ధ్వంసిన్ ముదిర సదృశున్ గంజనయనున్ భజింతున్ దాత్పర్యంబున ననినచో భాస్కర యతిన్ ప్రజాహ్లాదంబైనన్ యమనస భవప్రస్ఫురితమై ద్విజశ్రేష్ఠుల్మెచ్చన్ శిఖరిణీ గరున్ విశ్రుతమగున్

మందాక్రాంత: మ,భన,త,త,గగ -యతి-11

ఉదా: చెందెoబాదాంబు రజముచే స్త్రీత్వ మారాతికింజే యుందెం జాపం బిగుతునుకలై యద్బుతం బావహిల్లెన్ మందెన్ మారొడ్డి దశముఖుడున్ రాముచే నంచు జెప్పన్ మందాక్రాంతన్ మభన తతగా మండితాశాయతుల్గాన్ ఇప్పటిదాకా అత్యష్టి ఛందాలే

కుసుమితలతా వేల్లిత (ధృతిచ్ఛందము) : మ,త,నయ,య,య, యతి -12

ఉదా: శ్రీనాథున్ బ్రహ్మాద్యమరవరసం సేవ్య పాదారవిందున్ దీనానాథ వ్రాత భరసుగుణో దీర్ణునిన్ బాడీరోలిన్ గానా రూఢాత్ముల్ మతన యయ యల్ కామజి ద్విశ్రమంబై వీనుల్ నిండారన్ కుసుమితలతా వేల్లితా వృత్తమొప్పన్

మేఘ విస్ఫూర్జితం (అతి ధృతిచ్ఛందము) : య,మ,న,స,ర,ర,గ, యతి:- 13

ఉదా: రమానాథున్ నాథున్ యదుకులశిరో రమ్య రత్నాయ మానున్ సముద్యతే జిష్ణున్ దనుజయువతి స్పార హారాపహారున్……

స్రగ్దర (ప్రకృతిచ్ఛందం) : మ,న,భ,న,య,య,య. యతి- 8-15

ఉదా: తెల్లంబై శైల విశ్రాంతిని మునియనిం దేజగిల్లున్ దృడంబై చెల్లెంబెల్లె మకారాంచిన రభస యయల్ చెందమీదన్ యకారం బుల్లంబారన్ బుధారాధ్యు నురగ శయనున్ యోగివంద్యున్ గడున్ రం జిల్లం జేయగవీంద్రుల్ జితదనుజ గురం జెప్పుదుర్ సగ్దరాఖ్యన్

మహాస్రగ్ధర (ఆకృతి ఛందము) :- స,త,త,న,స,ర,ర,గ. యతి-9-16

ఉదా: కొలిచేంబ్రోత్సాహవృత్తిం గుతల గగనముల్ గూడ రెండంఘ్రులందా బలిజాతాళంబు జేరన్ బనిచెగడమకై బాపురేవామనుండ స్థలితాటో షాఢ్యుడంచున్ గరిగిరి విరమాకారమారన్ సతానోజ్జ్వల సోద్య దైఫయుగ్మా శ్రయ గురుల మహాస్రగ్ధరంజెప్ప నొప్పున్

కవిరాజవిరాజితం(వికృతిచ్ఛందం) :-న,జ,జ,జ,జ,జ,జ,లగ; యతి - 8-14-20

ఉదా: కమలదళంబుల కైవడిజెన్నగు కన్నులు జారు ముఖ ప్రభలున్ సమధిక వృత్త కుచంబుల నొప్పగశైల రసరు వీశాల యతిన్ సముచిత నాన్విత షడ్జలగంబుల జానుగ బాడిరి చక్రధరున్ రమణులు సొంపలరం గవిరాజవి రాజితము బహురాగములన్

 అశ్వలలిత: న,జ,భ,జ, భ, జ, భ, వ; - 13

ఉదా: ఇనవి గమంబునన్ నజభజంబు లింపుగ భజబులున్ భవములై చనజన నొప్పునశ్వలలితంబు సత్కృతుల జెప్పగా విశదమై యనుపమ వైభవోజ్జ్వల హరీ సహస్ర కరదోర్విచారణ చణా నినుగొని యాడధన్యుడు గదయ్య భీకరుణ దాననంతమగుటన్

క్రౌంచపద (సంకృతి ఛందస్సు) : భ,మ,స,భ,న,న,న, య; యతి-11-19

ఉదా: కాంచన భూషాసంచయ మొప్పన్ ఘనకుచభరమున గవున సియాడన్ జచల నేత్రల్వంచనతోడన్ సముచిత గతి ఎనుచని తనుగొల్వన్ అంచిత లీలన్ మీంచిన శౌరిన్ హరిదిభ పరిమిత యతులొనగూడన్ ముంచిరచింపం గ్రౌంచపదం బి మొగి భమసభననముల నయలొందున్

భుజంగ విజృంభిత (ఉత్కృతిచ్ఛందం) : మ,మ,తన,నన,రస,లగు; యతి- 8-9

ఉదా: స్వారా జారీవ్రాతా రాతీ శశి తపన సమనయన సర్వదా మునివందితా గౌరీశాద్యామర్త్య స్తుత్యా కమలభవ జనక మధుకైట భాసుర మర్దనా శ్రీరామా హృత్స్వామీ యంచున్ జెలగి మమత నననల జెంద రేఫసలునలగన్ ఘోరాఘోషాభిద్వేషిన్ జేర్కొనగవసు దశయతియగున్ భుజంగ విజృంభితన్

దండకం:        స,న,హ, గణాలను మొదట కూర్చి వాటిపై కావలసినన్ని ‘త’ గణాలను పెట్టుకుని చివర మాత్రం గురువు నుంచితే అది దండకం.

కొంతమంది మొదటినుండీ అన్నీ త గణాలనే కూర్చి చివర గురువు నుంచారు. అదీ దండకమే.

ఎంతవ్రాసినా ఒక పాదం క్రిందనే లెక్క యతి ప్రాసనియమాల్లేవు.

ఉదా: 1) అమరంగ సనహంబులం దాదిగా నొండె గా దేని నాదిన్ ‘త’ కారంబు గా నొండెలో నందకారమ్ములిమ్మై గకారావసానంబుగా జెప్పినన్ దండకం బండ్రు దీనింగవుల్

ఉదా:2) ఆదిన్ ద(త) కారంబు...నుండి కడదాకా

ఇది సులక్షణసారము (P73,74) నుండి గైకొనబడినది.

మంగళమహాశ్రీ: భ,జ,స,న,భ,జ,సన,గగ; యతి-1-17

ఉదా: చిత్తములు జూపులను జిత్తజుని తండ్రిపయి జెంది గజదంతి యతులోoదన్ నృత్తములతోడ దరుణీమణులు గానరుచు లింపుగను మంగళ మహాశ్రీ వృత్తముల బాడిరి సవృత్త కుచ కుంభముల వింతజిగి యెంతయు దలిర్పన్ మత్తిలుచు నభ్భజనంబు లీగుచోటులద నర్పగ దుదన్ గగ మెలర్పన్

ఆర్య: ఇది తెనుగున కంద పద్యమును బోలివుంటుంది. పథ్య, వీపుల, చపల, ముఖచపల, జఘనచపల భేదములతో సంస్కృతార్యలైదు విధములు.

పథ్యార్య : 1,3 పాదములలో మూడు గణాలతో పదవిచ్ఛేదనం కలిగి 2,4 పాదాలలో మిగిలిన ఆర్యాలక్షణాలుంటే అది పథ్యార్య అనబడుతుంది.

గా,భ,జ,స,నల గణాలు ఎన్ని మార్లయినా వాడబడుట, బేసిగణము జ గణము కాకుండుట, చివర గురువుండుటయను కందలక్షణములే ఆర్యాలక్షణములు కూడ,

1,3 పాదములలో మూడు గణములతో పదవిచ్ఛేదము కలిగి 2,4 పాదాలలో మిగిలిన ఆర్యాలక్షణములున్నచోనది పథ్యార్య.

ఉదా:బేసులు త్రిగణయుతములై యాసమపాదముల బొగసి యార్యయనగడున్

విపులార్య ; సమపాదాలలో పదవిచ్ఛేదం కలుగకుండా మొదటి, మూడవ పాదాల చివరవుండే గణం తరువాతి పాదాలలోకి కూడ కొనసాగుట విప్పులార్య. ఇక్కడ సమపాదము అసంగతమనీ, అన్ని పాదాలలోనూ అనవచ్చుననీ, గణము కాకుండా ‘పదము’ తరువాతి పాదములలోకి కొనసాగుననీ వివరించి గిడుగు వారీ పద్యాన్ని లక్షణయుక్తంగా ఉదహరించారు.

ప్రకట సమపాదముల నిలు వక శబ్దము నవలజొచ్చి వచ్చినద కక విప్పులార్యయగును సే వక జన మందార ధీర వనజదళాక్షా.

చపలార్య ; రెండవ, నాల్గవ గణములు జగణములు కావాలి. మిగిలిన లక్షణాలలాగే వుండాలి.

ఉదా: వరుసను ద్వితీయ మంత్యము స్ఫురణన్ మధ్యగజకారములను దగన్ రెం

 ముఖచపలార్య : పూర్వార్ధం చపలార్య లక్షణాలుండి, ఉత్తరార్ధం అలా వుండక పోతే అదీ ముఖచపలార్య.

ఉదా: చపలాగణప్రకారం బపార కారుణ్య సాగరా ప్రథమార్ధపరంబగు చున్నది ముఖచపలార్య యనంగ జనుగృతులన్

జఘనచపలార్య: ఉత్తరార్ధంలో మాత్రం చపలార్య వుండాలి.

ఉదా: మొదటి సగము చపలార్యా స్పదగణలక్షణము సొగక చరమార్ధంబుదిత ప్రకార రేఖన్ గదాధరా చనుజఘన చపలన్

ఇక ప్రస్తార నిరూపణమును వినండి. ఏ ఛందంలో ఎన్ని భేదాలుండవచ్చో సామాన్య రూపంలో చెప్పే దానిని ప్రసారనుంటారు. ఇందులో ఆరు ప్రణాళికలుంటాయి. అవి ప్రస్తార, నష్ట, ఉర్దిష్ట, ఏకద్వయాది లగక్రియ, సంఖ్య, అధ్వ యోగాలు.