1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

219 - నిత్య, వృద్ధి, ఏకోద్దిష్ట శ్రాద్ధాలు

నిత్య శ్రాద్ధ విధి ఇంతకుముందే చెప్పబడిన దానికి ఇంచుమించు సమానమే. ఇందులో విశ్వేదేవుల ప్రమేయముండదు. సంకల్పం ఇలా వుంటుంది.

ఓం అముక గోత్రాణా మస్మత్పితృపితామ

హానాం అముక శర్మాణాం సపత్నీకానాం

శ్రాద్ధం సిద్ధాన్నేన యుష్మా స్వహం కరిష్యే

ఇక వృద్ధి శ్రాద్ధవిధిని వినిపిస్తాను. ఈ వృద్ధి శ్రాద్ధాన్నే ఆభ్యుదయిక, మాంగలిక, నందీముఖ శ్రాద్ధమని కూడా వ్యవహరిస్తారు. ఇదివఱకు చెప్పినట్టుగానే కార్యక్రమం వుంటుంది. ఇందులోని ప్రత్యేకత యేమిటంటే పుత్రోదయమై ఆ పుత్రుని ముఖం చూడడానికి ముందే తండ్రి ఈ వృద్ధి శ్రాద్ధాన్ని పెట్టాలి. పూర్వాభిముఖంగా సవ్యంగా వుండి యవలు, బదరీఫలాలు, కుశదర్భలు వాడుతూ దీనిని చేయాలి. దేవతీర్థ, నమస్కార, దక్షిణాదులు పాత శ్రాద్ధాలలాగే వుంటాయి. యజమాని తన మోకాలిపై చేతిని వేసి ఆనందంగా చరుస్తూ విశ్వేదేవులను బ్రాహ్మణులపైకీ ఆవాహన చేస్తూ వారితో ‘దేవా! మా ఇంట పుత్రోదయమైన శుభసమయాన నా మాతృ, పితృపక్షాల పితరులకు శ్రాద్ధం పెట్టదలచుకొని, వసు, సత్య అనే పేళ్ళు గల విశ్వేదేవతలను మీపైకి ఆహ్వానిస్తున్నాను. అని ప్రార్థించి వారి అనుమతిని పొంది ఓం విశ్వేదేవా స ఆగత...అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి. అలాగే సీతగులను కూడా పిలచి కూర్చోబెట్టాలి.

ఓం వసు సత్యసంజ్ఞకేభ్యః... ఇత్యాదిగా దేవతలనూ, వారి వారి గోత్ర నామాలతో పితరులనూ కొలుచుకోవాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధంలో విశేషమేమనగా ఈ క్రింది సంకల్పవాక్యాన్ని చదివి, బ్రాహ్మణుల అనుమతిని పొంది వారికి ఆసనాదిక మర్యాదలు చేయాలి.

అద్య అముక గోత్రస్య మత్పితుర ముకదేవ

శర్మణః ప్రతిసాంవత్సరిక మేకోద్దిష్ట శ్రాద్ధం

సిద్ధాన్నేనయు ష్మాస్వహం కరిష్యే

(ఓం పిండాః సంపన్నాః, ఓం సుసంపన్నాః)

దీనిలోని మరొక ప్రత్యేక తరుచిరస్తవాదిక పఠనం. చివరగా దక్షిణం వైపు తిరిగి అపసవ్యమై మిగిలిన అన్నాన్ని అగ్నిదగ్ధాళ్ళ...... తో మొదలయ్యే మంత్రాన్ని చదువుతూ అగ్నికర్పించాలి. తరువాత అముక గోత్రమత్పితః.... అని చెప్తూ మండలరేఖపై జలాన్ని కుమ్మరించాలి.