1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

216 - బలివైశ్వదేవ నిరూపణం

ఇపుడు వైశ్యదేవహామవిధిని బోధిస్తాను. ముందు అగ్నిని రగిల్చి ఓం కవ్యాదమగ్ని.... ఇత్యాది మంత్రాలతో హవ్యాంశాలను కొన్నిటిని అగ్నిలో వ్రేల్చాలి. తరువాత ఓం పావకవైశ్వానర... అనే మంత్రంతో అగ్నిని ఆవాహన చేసి ఈ క్రింది మంత్రాలతో ఆహుతులనివ్వాలి.

ఓం ప్రజాపతయే స్వాహా । ఓం ఓషధివనస్పతిభ్యః స్వాహా । ఓం సోమాయ స్వాహా । ఓం గృహ్యాయ స్వాహా । ఓం బృహస్పతయే స్వాహా । ఓం దేవదేవతా భ్యః స్వాహా । ఓం అగ్నిహోమాభ్యాం స్వాహా । ఓం ఇంద్రాయ స్వాహా । ఓం ఇంద్రాగ్ని భ్యాం స్వాహా । ఓం ఇంద్ర పురుషేభ్యః స్వాహా । ఓం ద్యావా పృథివీభ్యాం స్వాహా । ఓం యమాయ స్వాహా । ఓం ఇంద్రాయ స్వాహా । ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా । ఓం యమపురుషాయ స్వాహా । ఓం సర్వేభ్యో భూతేభ్యో దివాచారిభ్యః స్వాహా ।

ఓం బ్రహ్మణే స్వాహా । ఓం అద్ భ్యఃస్వాహా । ఓం వసుధా పితృభ్యః స్వాహా ।

తరువాత ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దాని ద్వారా బలి, పుష్టిలను కోరుతూ ప్రార్థించాలి.

ఓం యే భూతాః ప్రచరంతి దీనాశ్చ

నిమిహంతో భువనస్య మధ్యే ।

తేభ్యో బలిం పుష్టి కామో

దదామీమయి పుష్టిం పుష్టి పతిర్దధాతు ॥

చివరగా ఓం ఆచాండాల పతిత వాయ సేభ్యోనమః అనే మంత్రం ద్వారా కూడా కాకి మున్నగు వాటికి బదులివ్వాలి.