1 - గరుడ పురాణము - ఆచార కాండము
202 - 203 - స్త్రీల వ్యాధులకు చికిత్స - కొన్ని ప్రత్యేక ఔషధాలు.
“పరమేశాదులారా! స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వేరుని గాని అపామార్గవేరుని గాని దూర్చి ఉంచితే అక్కడి బాధలు పురిటి నొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి. స్తనాలందలి నొప్పి ఇంద్రవారుణీ వేళ్ళను ముద్దగా చేసి రాస్తే నిమ్మళిస్తుంది. మాతులుంగ మూలాలను గర్భవతి మొలచుట్టూ కడితే వేగంగానూ, సుఖంగానూ ఫురుడు వస్తుంది. కర్పూర, మదనఫల, మధుకల మిశ్రమంతో స్త్రీ జననేంద్రియ ద్వారాన్ని అడపాదడపా నింపుతూ వుంటే ముసలితనమనేది రానేరాదు.
బాలుర నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్దె కుష్ట, పంచదారలను కలిపిన నీటిని త్రాగిస్తే ఇక వారికి ఏ దోషాలూ అంటవు. ఏ విషాలూ పనిచేయవు. శంఖనాభి, వచకుష్ణ, ఇనుపగజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఏ రోగాలు అంటవు. రావు.
పలాశ, విడంగ, ఆమలక మిశ్రమంలో తేనే ఆవు వెన్నా కలుపుకొని తినే పురుషునికీ తెలివితేటలు వెంటనే పెరుగుతాయి. అలా ఒక నెలపాటు త్రాగితే ముసలితనాన్నెలాగూ జయిస్తాడు, మరణాన్ని కూడా జయించినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఆమలక చూర్ణాన్ని తేనె, నూనె, వెన్నలతో కలుపుకొని రోజుకీ మూడు మార్లు ఒక నెలపాటు నిరంతరాయంగా తినేవాడు నిత్యయవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప వక్త కూడా కాగలడు. యవ్వనుడీ తప్పనీ ‘మౌవనుడీ’ అనే వ్రాయాలని పెద్దలంటారు!
శివ, ఆమలక చూర్ణాలను తేనెతో గాని నీటితో గాని కలుపుకొని రోజూ పొద్దున్నే తాగితే ముక్కు దానితోడీ అంగాలు అన్నీ ఎన్నేళ్ళొచ్చినా చెడవు. కుష్ఠ చూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకొని ప్రత్యుదయమూ తాగేవాని శరీరానికీ సహజసుగంధమబుతుంది. వేయి సంవత్సరాల వయసు వచ్చేదాకా జీవించగలడు. మాశ బీజాలను బద్దలు చేసి ఊక లేకుండా చూసి వెన్నలో వేసి వేడి పాలతో కలిపి నుంచి రోజూ ఒకే సమయంలో తేనె, వెన్న, పాలతో కలుపుకొని ఒక వారం రోజులపాటు తింటే మదన కళావీరత్వం విపరీతంగా పెరిగి నూరుగురు మహిళలనైనా అందులో సంతృప్తి పలచగలిగే శక్తి వస్తుంది. పాదరసాన్ని గంధకంతో ఆముదంతో కలిపి తీసుకుంటే గొప్ప బలశాలులవుతారు. ఓ మహాదేవాదులారా! ఊకను జాగ్రత్తగా వేరు చేసిన మాశబీజాలను శింబి బీజాలతో కలిపి పాలలో ఉడికించి చల్లార్చి అపామార్గ తైలంతో కలుపుకొని తాగినా కూడా వందమంది వనితలను మదనకేళిలో సంతృప్తి పఅచగలిగే జవసత్తాలు కలుగుతాయి.
ఇక జంతు వైద్యంలో కొన్ని మెళకువలను చూద్దాం. ఆవు తన దూడపై తానే కోపం తెచ్చేసుకొని దాన్ని తన్నేస్తూ వుం టే, అటువంటి తెగులు పట్టిన ఆవుకి తన పాలలోనే ఉప్పు కలిపి తాగిస్తే ఆ తెగులు నశించి తన దూడను ఇదివఱకు కన్న నెక్కువగా ప్రేమిస్తుంది. కుక్క ఎముకను అవు మెడకు గాని గేదె మెడకు గాని కట్టి వుంచితే వాటిని పట్టిన క్రిములన్నీ జారిపోతాయి. వరుణ ఫలరసాన్ని ఏ చతుష్పాదికీ పట్టించినా క్రిములన్నీ జారిపోతాయి. జయచూర్ణాన్ని గాయంలో వేస్తే అది మానిపోతుంది. గోవులచేత గజమూత్రాన్ని త్రాగిస్తే వాటి తెగుళ్ళన్నీ కట్టేస్తాయి. ఎద్దులకీ మసూర, శాలి చూర్ణాలను పాలతో కలిపి పడితే ఏ జబ్బూ రాకుండా వర్ధిల్లుతాయి.
గుఱ్ఱాల జూలులో పుట్టే వరిస్పోటమనే రోగం శరపుంఖ పత్రాలను లవణంతో కలిపి వాడితే నశిస్తుంది. అశ్వాలకు తలభాగం (శిరోభాగం) లో పట్టే దురదలు ఘృతకుమారి ఆకులను లవణముతో కలిపి వాడితే పోతాయి.
పరమేశాదులారా! ఈ మందులను వాడడానికి ముందు మ నూ, అనుభవ జులనూ సంప్రదించడం శ్రేయస్కరం.
