1 - గరుడ పురాణము - ఆచార కాండము
215 - తర్పణ విధి వర్ణన
(గరుడ పురాణంలో తర్పణల యొక్క అవశ్యకర్తవ్యాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. మరింత జ్ఞానం కోసం “నిత్యకర్మ పూజా ప్రకాశ’ మనే గ్రంథాన్ని సంప్రదించాలి)
తర్పణలను ఈ క్రింది మంత్రాలతో ఇస్తే దేవగణాలూ పితృగణాలవారూ సంతోషిస్తారు. సర్వప్రథమంగా ఓం మోదాస్త్రృష్యంతాం తో మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దోసిలితో జలాంజలులివ్వాలి. మొత్తం మంత్రాలివి.
ఓం మోదాస్త్రృష్యంతాం । ఓం సుపర్ణా సృష్యంతాం ।
ఓం ప్రమోదాస్తృప్యంతాం । ఓం భూతాని తృప్యంతాం ।
ఓం సుముఖా సృష్యంతాం । ఓం భూతగ్రామాశ్చతుర్విధా స్తృష్యంతాం ।
ఓం దుర్ముఖా స్తృష్యంతాం । ఓం దక్ష స్తృష్యతాం ।
ఓం విఘ్న స్తృష్యంతాం । ఓం ప్రచేతసా స్తృష్యంతాం ।
ఓం విఘ్న కర్తార స్తృష్యంతాం । ఓం మరీచీ స్తృష్యంతాం ।
ఓం ఛందాంసి తృష్యంతాం ఓం అత్రి స్తృష్యతాం ।
ఓం వేదో స్తృష్యంతాం । ఓం అంగిరా స్తృష్యతాం ।
ఓం ఓషధయ సృష్యంతాం । ఓం పులస్త్య స్తృష్యతాం ।
ఓం సనాతన స్తృష్యంతాం । ఓం పులహ స్తృప్యతాం ।
ఓం ఇతరా చార్యా స్తృష్యంతాం । ఓం క్రతు స్తృష్యతాం ।
ఓం సంవత్సర స్సావయవ స్తృష్యంతాం । ఓం నారద స్తృప్యతాం ।
ఓం దేవా స్తృష్యంతాం । ఓం భృగు స్తృప్యతాం ।
ఓం అప్సరస స్తృష్యంతాం । ఓం విశ్వామిత్ర స్తృష్యతాం ।
ఓం దేవాంధకాస్తృప్యంతాం । ఓం కశ్యప స్తృప్యతాం ।
ఓం సాగరా స్త్రృష్యంతాం । ఓం జమదగ్ని స్తృష్యతాం ।
ఓం నాగాస్త్రృష్యంతాం । ఓం వసిష్ఠ స్తృప్యతాం ।
ఓం పర్వతా స్తృష్యంతాం । ఓం స్వాయంభువ స్తృప్యతాం ।
ఓం సరిన్మనుష్యాయక్షా స్తృష్యంతాం । ఓం స్వారోచిష స్తృప్యతాం ।
ఓం రక్షాంసి తృప్యంతాం । ఓం తామస స్తృష్యతాం ।
ఓం పిశాచా స్తృష్యంతాం । ఓం రైవత స్తృప్యతాం ।
ఓం చాక్షష సృష్యతాం । ఓం ధవ స్తృష్యతాం ।
ఓం మహాతేజా సృష్యతాం । ఓం అనీల స్తృప్యతాం ।
ఓం వైవస్వత సృష్యతాం । ఓం ప్రభాస స్తృప్యతాం ।
ఓం ధృవ స్తృష్యతాం ।
అనంతరం సాధకుడు నివీతియై అనగా జంధ్యమును మాలవలె ధరించి ఈ క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి.
ఓం సనక స్తృప్యతాం ।
ఓం సనాతన స్తృప్యతాం ।
ఓం కపిల స్తృప్యతాం ।
ఓం ఆసురి స్తృప్యతాం ।
ఓం వోఢు స్తృష్యతాం ।
ఓం పంచశిఖ స్తృప్యతాం ।
ఓం మనుష్యాణాం కవ్యవాహ స్తృష్యంతాం ।
ఓం అనల స్తృప్యతాం ।
ఓం సోమ స్తృష్యతాం ।
ఓం యమ స్తృష్యతాం ।
ఓం అర్యమా తృప్యతాం ।
తరువాత జందెమును ప్రాచీనావీతి దశలో అనగా కుడిభుజం పైకి వుంచి ఈ క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి.
ఓం అగ్నిష్వాత్రాః పితర స్తృష్యతాం ।
ఓం సోమపాః పితర స్తృప్యతాం ।
ఓం బర్హిషదః పితర స్తృప్యతాం ।
ఓం యమాయనమః । ఓం ధర్మరాజాయనమః ।
ఓం మృత్యువేనమః । ఓం అంతకాయనమః ।
ఓం వైవ స్వతాయనమః । ఓం కాలాయనమః ।
ఓం సర్వభూతక్షయాయ నమః ।
ఓం ఔదుంబరాయనమః । ఓం దుధ్నాయనమః ।
ఓం నీలాయనమః । ఓం పరమేష్ఠి నే నమః ।
ఓం వృకోదరాయనమః ।ఓం చిత్రాయనమః ।
ఓం చిత్ర గుప్తాయనమః । బ్రహ్మాది స్తంబ పర్యంతం జగత్తృష్యతు ।
ఓం పితృభ్యః స్వధా నమః ।
ఓం పితా మహేభ్యః స్వధా నమః ।
ఓం ప్రపితా మహీభ్యః స్వధానమః ।
ఓం మాతృభ్యః స్వధానమః ।
ఓం ప్రమాతా మహేభ్యః స్వధా నమః ।
ఓం వృద్ద ప్రమాతా మహేభ్యః స్వధానమః । తృప్యతామితి ।
పితరులను ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాలను పఠించాలి.
ఓం ఉద్రతా మవర, ఓం అగ్ని రసోనః,
ఓం జయంతునః, ఓం ఊర్జ, ఓం పితృభ్య,
ఓం యే చేహ, ఓం మధువాతా, ఓం నమో వః పితరో...
అనే మంత్రాలను పూర్తిగా చదివి, ధ్యానించి, ఈ క్రింది మంత్రాలతో మరల జలాంజలు లివ్వాలి.
ఓం పితృభ్యః స్వధాయిభ్యః నమః ।
ఓం పితామహేభ్యః స్వధాయిభ్యః స్వధా నమః ।
ఓం ప్రపితా మహేభ్యః స్వధాయిభ్యః స్వధానమః ।
ఓం మాతామహేభ్యః స్వధానమః ।
ఓం ప్రమాతా మహేభ్యః స్వధానమః ।
ఓం వృద్ధ ప్రమాతా మహేభ్యః స్వధానమః మున్నగునవి.
చివరగా బట్టలు పిండిన నీళ్ళతో, వ్యక్తి యొక్క వంశంలోని, పుత్ర హీన జనుల కొఱకు ఈ క్రింది మంత్రంతో తర్పణలివ్వాలి.
యేచాస్మాకం కులేజాతా
అపుత్రా గోత్రిణో మృతాః ।
తే తృష్యంతు మయాదత్తం
వస్త్ర నిష్పీడనోదకం ॥
