1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

195 - సర్వకామ ప్రద విద్య

హేశా! నేనిపుడు సర్వకామప్రద అను ఒక విద్యను ఉపదేశిస్తాను. దీనిని ఏడు రాత్రులపాటు ఉపాసిస్తే అన్ని ప్రయత్నాలలోనూ విజయం లభిస్తుంది. ఇది స్తోత్ర రూపంలో వుంటుంది, ఇలా:

సర్వకామ ప్రదాం విద్యాం తస్మాత్ తుభ్యం నమోనమః ॥

సప్తరాత్రేణ తాం శ్రుణు । హృషీ కేశాయ మహతే

నమస్తుభ్యం భగవతే నమస్తేఽ నంత మూర్తయే ।

వాసుదేవాయ ధీమహి ॥ యస్మిన్నిదం యతశ్చైతత్

ప్రద్యుమ్నాయా నిరుద్ధాయ తిష్ఠ త్యగ్రే ఽపీ జాయతే ॥

నమః సంకర్షణా యచ । మృణ్మయీం విహసి క్షోణీం

నమో విజ్ఞాన మాత్రాయ తస్మైతే బ్రహ్మణే నమః ।

పరమానంద మూర్తయే ॥ యన్న స్పృశంతి న విదుః

ఆత్మారామాయ శాంతాయ మనోబు ద్ధీంద్రియా సవః ।

నివృత్త ద్వైత దృష్టయే । అంతర్బహి స్త్వం చరసి

త్వద్రూ పాణిచ సర్వాణి వ్యోమ తుల్యం నమామ్యహం ॥

ఓం నమో భగవతే మహాపురుషాయ మహా భూత పతయే సకల సత్త్వ భావి వ్రీడని కర కమల రేణూత్పల నిభ ధర్మాఖ్య విద్యయా చరణారవింద యుగళ పరమేష్ఠిన్ నమస్తే! అవాప విద్యా ధరతాం చిత్ర కేతుశ్చ విద్యయా  ॥  (ఆచార 195/1-6)

చిత్ర కేతువను సామాన్యుడు ఈ విద్య ద్వారానే ఉత్కృష్టమైన విద్యాధరత్వాన్ని పొందగలిగాడు.