1 - గరుడ పురాణము - ఆచార కాండము
116 - తిథులూ - వ్రతాలూ
బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికీ ఇంకా ఇలా చెప్పాడు. ‘హే వ్యాసమునీ! ఇపుడు నేను కొన్ని వ్రతాలను నీకుపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసే వారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్నిమాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్నితిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి. *
(*ఏకభుక్తం, నక్తవతం, ఉపవాసం లేదా ఫలాహారవ్రతం - ఏది చేసినా శ్రీహరి ఆవతికి ధన, ధాన్య, పుత్ర, రాజ్య, విజయాలలో ఎన్నైనా గానీ అన్ని అయినా గాని ప్రసాదిస్తాడు.
దీనార్ధ సమయే తీతే భుజ్యతే నియమేనయత్ ।
ఏకభుక్త మితిప్రోక్తం రాత్రౌ తన్న కదాచన ॥
పగటిలో సగం కాలం గడిచాక భోజనం చేసి మరల ఇరువది నాలుగు గంటలు గడిచేదాకా ఏమీ తినకుండా చేసే వ్రతం ఏకభుక్తం.
దీవ సస్యాష్టమే భాగే మందీభూతే దీవాకరే ।
నక్తం తచ్చ విజానీయాన్న నక్తం నిశిభోజనం ॥
నక్షత్ర దర్శనాన్నక్తం గృహస్థేన విధీయతే ।
యతేర్ది నాష్టమే భాగే రాత్రౌ తస్య నిషేధనం ॥
పగటిలో ఎనిమిదవ భాగం గడిచాక, సూర్య ప్రభలు మందమైపోతున్నపుడు భోజనం చేసి మరల ఇరువది నాలుగు గంటలలోపల ఏమీ తినకుండా వుండడాన్ని నక్షవ్రతమంటారు. గృహస్థు నక్షత్ర దర్శనమయ్యాక తినాలి. యతులు సూర్యాస్తమయానికి కాస్తముందు భిక్షాటన చేసి తినాలి.)
పాడ్యమి శిథి నాడు వైశ్వానరునీ, కుబేరునీ పూజించాలి. వారు సాధకునికి అర్జలాభాన్ని అంటే ధన, కనక, వస్తు వాహనాదులను ప్రదానం చేస్తారు. పాడ్యమీ, అశ్వనీ నక్షత్రాలు కలిసిన నాడు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడు, సంతోషించి అర్థాన్నిస్తాడు.
తిథి పూజ్యదైవతాలు ఫలాలు
విదియ యముడు, లక్ష్మీనారాయణుడు అర్థలాభం
తదియ గౌరి, శివుడు, గణేశుడు
చవితి చతుర్వ్యూహాలతో విష్ణువు
పంచమి హరి
షష్ఠి కార్తికేయుడు, సూర్యుడు (రవి)
సప్తమి భాస్కరుడు (ఉపవాసంచేయాలి) అర్థలాభం
అష్టమీ దుర్గ
నవమీ మాతృకలు, దిశలు అర్థలాభం
దశమి యముడు, చంద్రుడు
ఏకాదశి ఋషీగణాలు
ద్వాదశి హరి, మన్మధుడు
త్రయోదశి శిపుడు చతుర్ధశి, పున్నం బ్రహ్మ అమావాస్య పితృగణాలు ధనసంపత్తి
ఆదివారం అశ్వనితో మొదలుపెట్టి వరుసగా నాలుగు నక్షత్రాలను, సోమవారం అయిదునుండి మరోనాల్గింటిని అలా శనివారం మూడిటితో మొత్తం ఇరవైయేడు నక్షత్రా లనూ పూజించినవారి కోరికలన్నిటినీ ఆ నక్షత్రాలు నెరవేర్చగలవు.
