1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

217 - సంక్షిప్త సంధ్యావిధి

ఇప్పుడు ద్విజులంతా చేయవలసిన సంధ్యావీధిని వినిపిస్తాను. ముందుగా ఈ క్రింది మంత్రం ద్వారా బాహ్య, అభ్యంతర శుద్ధిని చేసుకోవాలి.

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపివా ।

యః స్మరేత్పుండరీ కాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥

పుండరీ కాక్షుడైన విష్ణుమూర్తిని ఈ విధంగా స్మరించి శుద్ధియైన ద్విజుడు తన ఉపనయన వేళ ఉపదేశంగా పొందిన గాయత్రి జపాన్నే సంధ్యోపాసనలో కూడా చేయాలి. అయితే గాయత్రి మంత్రానికి ముందు వినియోగ మంత్రాన్నిలా పఠించాలి.

ఓం గాయత్రీఛందః, విశ్వామిత్ర ఋషిః, త్రిపాత్, సముద్రాః కుక్షిః, చంద్రా దివ్యౌలోచనౌ, అగ్నిర్ముఖం, విష్ణుహృదయం, బ్రహ్మరుదౌ శిరః, రుద్ర శిఖా, ఉపనయనే వినియోగః  । సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించడానికి ముందు ఇలా శరీరభాగాలను న్యాసం చేయాలి.

ఓం భూః - పాదాలు, ఓంభువః - జాను

ఓం స్వః - గుండె, ఓం మహః - తల

ఓం జనః - పిలక, ఓం తపః - గొంతు

ఓం సత్యం - నుదురు.

ఆ తరువాత ఏయే అంగాలను ఆయా మంత్రాలతో ఇలా జపిస్తూ సుశీంచాలి.

ఓం హృదయాయ నమః, ఓం భూః శిరసే స్వాహా,

ఓం భువః శిఖాయై వౌషట్, ఓం స్వః కవచాయహుం,

ఓం భూర్భువః స్వః అస్త్రాయ ఫట్ । (అస్త్ర అనగా చేతులు)

అనంతరం ప్రణవ, భూర్భువాది సప్త వ్యాహృతులతో బాటు గాయత్రిపాదమైన

ఓం ఆపోజ్యోతీ రసోమృతం భూర్భువః స్వరోం ను జపిస్తూ ప్రాణాయామం చేయాలి.

తదనంతరం ప్రాతస్సంధ్యలో ఓం సూర్యశ్చ .. అనే మంత్రాన్నీ, మధ్యాహ్న సంధ్యలో ఓం ఆపః పునంతు.. అనే మంత్రాన్నీ సాయం సంధ్యలో ఓం అగ్నిశ్చ... అనే మంత్రాన్నీ జపిస్తూ ఆచమనం చేయాలి. తరువాత ఆవాహన పూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అపుడు ఓం ఆపోహిష్ఠా మయోభువః.... ఓం సుమిత్రి యా న ఆపః.... ఓం ద్రుపదాదివ..... అనే మంత్రాలను చదువుతూ శరీరాన్ని నీటితో తుడుచుకొని ఓం ఋతం చ సత్యం... అనే మంత్రం ద్వారా అఘమర్షణం చేసుకోవాలి. తరువాత ముందుగా గాయత్రి వినియోగాన్ని ఇలా పఠించాలి.

ఓం గాయత్ర్యా విశ్వామిత్ర ఋషి

ర్గాయత్రీ ఛందః సవితా దేవతా

జపే వినియోగః ఓం ఉదుత్యం జాత వేదస... ఓం చిత్రం దేవానాం... ఓం తచ్ఛక్షుః... ఈ సూర్యోపస్థాన మంత్రాలను పఠించి వీలైనంత సేపు గాయత్రిని జపించాలి. అనంతరం ఓం విశ్వతశ్చక్షు.. ఓం దేవాగాతు... ఓం ఉత్తరేశిఖరే... అనే మంత్ర జప సమర్పణ పూర్వకంగా పూజను ముగించాలి.