శ్రీపరాశరుడు:
రాజమార్గేతతః కృష్ణస్సానులేపనభాజనామ్।
దదర్శకుబ్జామాయా న్తీంనవయౌవన గోచరామ్॥
తామాహలలితం కృష్ణ! కస్యేదమనులేపనమ్।
భవత్యా నీయతేసత్యం వదేన్దీవరలోచనే॥
సకామేనేవసాప్రోక్తా సానురాగాహరింప్రతి।
ప్రాహసాలలితం కుబ్జా తద్దర్శనబలాత్కృతా॥
కాన్త! కస్మాన్నజానాసి కంసేనవినియోజితామ్।
నై కవక్రేతివిఖ్యాతామనులేపనకర్మణి॥
నాన్యపిష్టం హికంసస్యప్రీతయేహ్యనులేపనమ్।
భవామ్యహమతీవాస్య ప్రసాదధనభాజనమ్॥
శ్రీపరాశరుడు:
శ్రీకృష్ణుడు సుగంధపాత్ర పూనివచ్చుచున్న నవ యౌవనవతి యగు కుబ్జం జూచెను. ఈ కలప మెవ్వని కొఱకు గొంపోవు చున్నావు? ఓ కువలయాక్షీ! నిజాము సెప్పుము. అని కృష్ణుడు సొంపుగ బలుకరించెను. సాభిలాషుడై యడిగి నట్లడుగబడి యామె యా దర్శమునకు వివశయై అనురక్తయై హరితో నింపుగ నిట్లనియె. కాంత! నేను కంసుని దాసినని ఎలా యెరుంగవు? అనేక వక్రయని పసిద్ది గన్న దానను. కంస ప్రభువునకు కలపములు గూర్చుట నా పని ఇంకొకరు దీసిన అను లేపనము కంసున కిష్టము గాదు. నేనీతని పరమానుగ్రహ పాత్రురాలైన దానను. అన విని శ్రీకృష్ణు డిట్లనియె.
శ్రీకృష్ణుడు:
సుగన్ధమేతద్రాజార్హంరుచిరంరుచిరాననే।
అవయోర్గాత్రసదృశందీయతామనులేపనమ్॥
శ్రీకృష్ణుడు:
సుందర ముఖీ! రాజోపభోగ యోగ్యమైన ఈ గంధము మా శరీరములకు ననువైనది మా కిమ్మన
శ్రీపరాశరుడు:
శ్రుత్త్వైతదాహసాకుబ్జగృహ్యతామితిసాదరమ్।
అనులేపనంచప్రదదౌగాత్రయోగ్యమథోభయోః॥
భక్తిచ్చేదానులిప్తాఙ్గౌతతస్థౌపురుషర్షభౌ।
సేన్ద్రచాపౌవ్యరాజేతాంసితకృష్ణావివాంబుదౌ॥
తతస్తాం చుబుకే శౌరిరుల్లాఘనవిదానవిత్।
ఉత్పాట్యతోలయామాసద్వ్యజ్గుళేనాగ్రపాణినా॥
చకర్ష పద్భ్యాం చతదాఋజుత్వం కేశవోఽనయత్॥
తతస్సాఋజుతాంప్రాప్తాయోషితామభవద్వారా॥
విలాసలలితంప్రాహ ప్రేమగర్భభరాలసమ్।
వస్త్రేప్రగృహ్యగోవిన్దం మమగేహం వ్రజేతివై॥
ఏవముక్తస్థాయాశౌరీరామస్యాలోక్యచాననమ్।
ప్రహస్యకుబ్జాంతామాహనై కవక్రామనిన్దితామ్॥
ఆయాస్యేభవతీగేహమితితాం ప్రహసన్ హరిః।
విససర్జజహాసోచ్చై రామస్యాలోక్యచాననమ్॥
భక్తిచ్చేదానులిప్తాఙ్గౌ నీలపీతామ్భరౌతుతౌ।
దునుశ్శాలాంతతోయాతౌ చిత్రమాల్యోపశోభితౌ॥
శ్రీపరాశరుడు:
విని కుబ్జ సాదరముగ నిదే కైకొనుడని యయ్యుభయుల మైపూతయ్యను లేపనము నొసంగెను. ఆ పురుషోత్తములది రంగురంగుల పత్రభంగాది రచనగా బూసికొని యింద్ర ధనువు తోడి తెలుపు, నలుపు మేఘములట్లు విలసిల్లిరి. అవ్వల శౌరి ఉల్లాఘన విధానము (పైకెత్తి సరి చేయుట) చక్కని నెరిగిన ప్రొడ గావున నామె గడ్డమును తర్జనీ మధ్య మాంగుళులతో గూడిన హస్తాగ్రముతో నెత్తి చలింప జేసెను. పైకి తన యడుగులం దాని యడుగులు తొక్కి పట్టి వంకరలు సరి సేసెను. ఆమె వంకలు దీరి చక్కని వారికెల్ల చక్కని దయ్యెను. సవిలాస సుందరముగ నా సుందరి నిండు ప్రేమ తొణక నల్లన గోవిందుని కట్టుపుట్టముం బట్టుకొని మా ఇంటికి రమ్మనెను. హరి విని బలరాము మోముంగని నవ్వి యనింద్యయగు నా కుబ్జం గని మీ యింటికి వచ్చెదనని నవ్వుచుం బలికి దానిని వదలి రాముని మోముంగని పకపక నవ్వెను. గంధముచే జేసికొన్న పత్రరచన యించుకయు సడలకుండ నీలపీతాంబరాలంకృతు లయ్యిద్దరు రంగు రంగు పూల మాలలం గైసేసి ధనుశ్శాలకు నడచిరి.
ఆయాగంతద్దనూరత్నంతాభ్యాంపృష్టైస్తురక్షిభిః।
ఆఖ్యాతేసహసాకృష్ణోగృహీత్వాఽపూరయుద్దనుః॥
తతఃపూర యాతాతేన భాజ్యమానంబలాద్దనుః।
చకారసుమహచ్చబ్దంమథురా యేనపూరితా॥
అనుయుక్తౌ తతస్తౌతు భగ్నేధనుషిరక్షిభిః।
రక్షిసై న్యంనిహతోభౌనిష్క్రాన్తౌకార్ముకాలయాత్॥
అక్రూరాగమమృత్తాన్తముపలభ్యమహద్దనుః।
భగ్నంశ్రుత్వాచకంసోపిప్రాహచాణూరముష్టికౌ॥
అటనున్న ధను శ్రేష్ఠముం గూర్చి యాగసమాప్తి యగునంత దాక తద్రక్షకుల నడిగి తెలిసికొని తటాలున గృష్ణుడు దానిం గైకొని ఎక్కిడెను. ఎక్కిడినదే తడవుగ నది విరుగ మథుర యెల్ల నిండ పెనుసందడి యయ్యెను. ఆ పైని ధనూరక్షకులచే నెదిరింప బడి యిద్దరు నా సైన్యముం గూల్చి ధనుశ్శాల నుండి వెలువడిరి. అక్రూరు డేతెంచిన వార్తను ధనుర్భంగ వార్తను విని కంసుడు చాణూర ముష్టికులతో నిట్లనియె.
కంసుడు:
గోపాలదారకౌప్రాప్తౌభవద్భ్యాంతౌమమాగ్రతః।
మల్లయుద్దేనహన్తవ్యౌమమప్రాణహరౌహితౌ॥
నియుద్దేతద్వినాశేనభవద్భ్యాంతోశితోహ్యహమ్।
దాస్యామ్యభిమతాన్ కామాన్ నాన్యథాతౌమహాబలౌ॥
న్యాయతోఽన్యాయతోవాపిభవద్భ్యాంతౌమమాహితౌ।
హన్తవ్యౌతద్వధాద్రాజ్యంసామాన్యంవాంభవిష్యతి॥
ఇత్యాదిశ్యసతౌమ ల్లౌతతశ్చాహూయ హస్తిపమ్।
ప్రోవాచోచ్చై స్త్వయామల్లసమాజాద్వారికుఞ్జరః।
స్థాపయః కువలయాపీడ స్తేనతౌగోపదారకౌ।
ఘాతనీయౌనియుద్దాయయరఙ్గ ద్వారముపాగతౌ॥
తమప్యాజ్ఞాప్యదృష్ట్వాచసర్వాన్ మంచానుపాకృతాన్।
ఆసన్నమరణః కంసః సూర్యోదయముదైక్షత॥
కంసుడు:
గోపాల బాలురిద్దరు వచ్చిరి. నా యెదుట మీరు వారలతో మల్ల యుద్దము సేసి నా ప్రాణాంతకులయిన వారిని దుదముట్టింపుడు. బాహు యుద్దమున మీరు వారిం గూల్చిన నేను సంతోషించి మీ కోరినవెల్ల యిచ్చెదను. నా శత్రువుల వాండ్ర నిద్దరను న్యాయమున నేని అన్యాయమున నేని మీరు చంపవలయు. అందువలన నా రాజ్యము మీకును నాకును సామాన్యమైన సొత్తగును. అని యాదేశించి యాపైని మావటీనిం బిలిచి సభా ద్వారము నందు కువలయా పీడమను నేనుగుం బెట్టి యాగోప దారకుల బాహు యుద్దమునకు రంగ ద్వారమునకు వచ్చిన తరిం జావ ద్రొక్కింపుమనియాన యిచ్చి ప్రేక్షకులు గూర్చుండుటకై మంచెలెల్ల సిద్దమగుట పర్యవేక్షించి చావు దాపురించిన కంసుడు సూర్యోదయమున కెదురు సూచెను.
తత్సమస్తమఞ్చేశునాగరస్సతదాజనః।
రాజమఞ్చేషుచారూఢాస్సహభృత్యైర్నరాధిపాః॥
మల్లప్రాశ్నికవర్గశ్చ రఙ్గమధ్యసమీపగః।
కృతః కంసేనకంసోఽపితూఙ్గమఞ్చేవ్యవస్థితః।
అన్తః పురాణాం మంఞ్చాశ్చతథాఽన్యేపరికల్పితాః।
అన్యేచవారముఖ్యానామన్యేనాగరయోషితామ్॥
నన్ధగోపాదయోగోపామఞ్చేష్వన్యేష్వవస్థితాః।
అక్రూరవసుదేవౌచమఞ్చప్రాన్తేవ్యవస్థితౌ॥
నాగారీయోషితాం మధ్యేదేవకీపుత్రగర్ధినీ।
అన్తకాలేపిపుత్రస్యద్రక్ష్యామీతిముఖంస్థితా॥
వాద్యమానేషుతూర్యేషుచాణూరేచాతివల్గతి।
హాహాకారపరేలోకేహ్యాస్ఫోటయతిముష్టికే॥
ఈషద్దసన్థౌ తౌవీరౌ బలభాద్రజనార్ధనౌ।
గోపవేశాధరౌబలౌరఙ్గద్వారముపాగతౌ॥
అవ్వల మంచెలన్నిటను నగర జనము రాచమంచెల భృత్యులతో నరాధిపులు నదిష్టింప మల్లుర పరీక్షకుల యొక్క వర్గమును రంగమధ్య సమీపమున కంసుడు నిలిపెను. కంసుడన్నిటి కెత్తైన మంచమందు గూర్చుండెను. అంతఃపురము కూర్చుండుటకు మఱికొన్ని మంచెలు ఏర్పరుప బడెను. వారాంగనలు నాగరస్త్రీలు నాసీనులగుటకు మరిప్రక్క మంచము లేర్పరుప బడియె. నంద గోపాదులు వేరు మంచము లందుండిరి. అక్రూర వసుదేవులు మంచములకు దగ్గర నాసీనులైరి. దేవకీ పుత్రుని యెడ నుబలాటమున తుది సమయమందైన కొడుకు మొగము చూతునని నాగరస్త్రీల నడుమ గూర్చుండెను. అంతట తూర్యములు మ్రోగినవి. చాణూరుడు రంగస్థలమున గంతులు వేయుచుండ ముష్టికుడు జబ్బలుం దొడలు చరచుచుండ బలభద్ర జనార్దనులల్లన నవ్వుచు గోపాల బాలుర వేషమున రంగ ద్వారమునకు వచ్చిరి.
తతః కువలయాపీడో మహామాత్రప్రచిదితః।
అభ్యదావత్సువేగేన హన్తుంగోపకుమారకౌ॥
హాహాకారోమహాన్ జజ్ఞేరఙ్గమధ్యేద్విజోత్తమ!।
బలదేవోనుజందృష్ట్వావచనంచేదమబ్రవీత్॥
హన్తవ్యోహిమహాభాగ।
నాగోఽయంశత్రుచోదితః॥
ఇత్యుక్తస్సోఽగ్రజేనాథ బలదేవేన వైద్విజ।
సింహనాదంతాతాశ్చక్రే మాధవః పరవీరహా॥
కరేణకరమాకృష్య తస్యకేశినిషూదనః।
భ్రామయామాసతంశౌరి రైరావతసమంబలే॥
ఈశోఽపిసర్వజగతాం బాలలీలానుసారతః।
క్రీడిత్వాసుచిరంకృష్ణః కరిద న్తపదా న్తరే॥
ఉత్పాట్యవామద న్తంతు దక్షిణేనై వపాణిన।
తాడయామాసయన్తారం తస్యాసీచ్చతధా శిరః॥
దక్షిణంద న్తముత్పాట్యబలభాద్రోపితత్ క్షణాత్।
సరోష స్తేనపార్ శ్వస్థాన్ గజపాలానపోథయత్॥
తతస్తూత్ ప్లుత్య వేగేనరౌహిణేయోమహాబలః।
జఘాన వామపాదేన మస్తకే హస్తినంరుషా॥
స పపాత హత స్తేన బలభ ద్రేణ లీలయా।
సహస్రాక్షేణవజ్రేణ తాడితః పర్వతో యథా॥
హత్వాకువలయాపీడం హస్త్యారోహప్రచోదితమ్।
మదాసృగనులిపాఙ్గౌహస్తిద న్తవరయుధౌ॥
మృగమధ్యేయథాసింహౌ గర్వలీలావలోకినౌ।
స్రవిష్టౌసుమహారఙ్గం బలభద్రజనార్ధనౌ॥
అపుడు కువలయాపీడము మావటీనిచే బ్రేరితమై గోప కుమారులం జంప మిక్కిలి వేగముగ బరుగెత్తె. రంగమందయ్యెడ హాహాకారము పెల్లెగసె. బలభద్రుడు తమ్మునింగని శత్రువు లుసికొల్పిన ఈ నాగముం గడతెర్ప వలెనన మాధవుడు సింహ గర్జనము సేసి తన చేతం దాని తుండమాకర్షించి కేశి సంహారకుడగు హరి యైరావతము బోలిన దాని నింగి నట్టిట్టు లూచెను. తానసర్వజగ దీశుడయ్యు బాలలీలానుసారము చాలాసేపు క్రీడించి కుడి చేతం దాని ఎడమ దంత మూడబెరికి మావటీనిం గొట్టెను. బలరాముడు కుడిదంతముం బెరికి రోసముతో ప్రక్కనున్న గజపాలురం గూల్చెను. ఆపై వేగముగ మీది కెగిరి రౌహిణేయు డెడమ పాదమున నేన్గు మస్తకము నదిమెను. అవలీలగ హలికూల్పగ సహస్రాక్షుండు వజ్రమున నడచిన పర్వతమట్లా యేనుగు పడిపోయెను. ఇట్లా కువ యాపీడముం జంపి దాని మదము రక్తము నొడలెల్ల పూతపడ నా గజదంతము లాయుధములుగా గొని లేళ్ళ నడుమ సింహములట్లు గర్వలీలలం జూపుచు బలభద్ర జనార్ధనులు మహా రంగముం బ్రవేశించిరి.
హాహాకారోమహాన్ జజ్ఞేమహారాజ్ఞేత్వనన్తరమ్।
కృష్ణోఽయంబలభద్రోఽయమితిలోకస్యవిస్మయః॥
సోయంయేనహతాఘోరాపూతనాబాలఘాతినీ।
క్షిప్తంతుశకటం యేనభాగ్నౌతుయమళార్జునౌ॥
సోఽయంయః కాళియంనాగం మమర్దారుహ్యబాలకః।
ధృతోగోవర్ధనోయేన సప్తరాత్రంమహాగిరి॥
అరిష్టోధేనుకః కేశీ లీలయైవామహాత్మనా।
నిహతాయేనదుర్ వృత్తాదృశ్యతామేషసోఽచ్యుతః।
అయంచాస్యమహాబాహుః బలభద్రోఽగ్రతోఽగ్రజః।
ప్రయాతిలీలయాయోషిన్మనోనయననన్దనః॥
అయంసకథ్యతేప్రాజ్ఞేః పురాణార్థవిశారదైః।
గోపాలోయాదవంవంశ మగ్నమభ్యుద్దరిష్యతి॥
అయంహిసర్వలోకస్యవిష్ణోరఖిలజన్మనః।
అవతీర్ణోమహీమంశో నూనంభారహరోభువః॥
ఇత్యేవంవర్ణితేపౌరై రామేకృష్ణేచతత్ క్షణాత్।
ఉర స్తతాపదేవక్యాః స్నేహస్నుతపయోధరమ్॥
మహోత్సవమివాసాద్య పుత్రాననవిలోకనాత్।
యువేవవసుదేవోఽభూద్విహాయాభ్యాగతాంజరామ్॥
అయ్యెడ ఈతడు కృష్ణుడు ఇడుగో బలరాముడని లోకమాశ్చర్యము పొందెను. ఆ రంగ స్థలమున పెద్ద హాహాకారము చెలరేగెను. బాలఘాతిని పూతనను జంపిన వాడితడు. బండిని తలక్రిందులు సేసినవాడు యమలార్జునములను గూల్చిన వాడితడే. కాళియ సర్పదమనము సేసిన బాలుడు ఏడు రోజులు గోవర్ధన గిరినెత్తి పట్టిన ప్రోడ యితడే. అరిష్టుడు, ధేనుకుడు, కేశియను దుష్టుల నవలీలగ జంపిన మహానుభావు డచ్యుతుం డిడిగో! ఈతని ముందున్న ఈయన యన్న బలభద్రుడీతడు సుందరీ నయనానందమూర్తి సవిలాసముగ నిదె వచ్చుచున్నాడు. పురాణజ్ఞులు ప్రాజ్ఞులునగు పౌరులు నీతడు గోపాలమూర్తియై యాదవ వంశము నుద్ధరించనున్న విష్ణువు యొక్క అంశావతారమూర్తి. భూభారము హరింప వచ్చినాడు. అని రాముని కృష్ణుని వర్ణింప దేవకి వాత్సల్యమున పాలు చేపువచ్చి హృదయము తాపభరిత మయ్యెను. పుత్ర ముఖ దర్శనముచే బెద్ద యుత్సవమట్లైన వసుదేవుడు ఆగంతుకమైన ముదిమిం బాసి యువకుడట్లయ్యెను.
విస్తారితాక్షియుగళో రాజాన్తః పురయోషితామ్।
నాగరస్త్రీసమూహశ్చద్రష్టుంనావిరరామతమ్॥
సఖ్యః పశ్యతకృష్ణస్యముఖమత్యరుణేక్షణమ్।
గజయుద్దకృతాయాసస్వేదామ్బుకణికాచితమ్॥
వికాసిశరదమ్భోజమవశ్యాయాజలోక్షితమ్।
పరిభూయస్థితంజన్మ సఫలం క్రియతాందృశః॥
శ్రీవత్సాఙ్కంమహాద్దామబాలస్యైతద్విలోక్యతామ్।
విపక్షక్షపణంవక్షోభుజయుగ్మంచభామిని॥
కింనపశ్యసిదుగ్దేన్దు మృణాళధవళాకృతిమ్।
బలభాద్రమిమం నీలపరిధానముపాగతమ్॥
వల్గతాముష్టికేనైవ చాణూరేణతథాసఖి।
క్రీడతో బలభాద్రస్యహరేరహస్యం విలోక్యతామ్॥
సఖ్యః పశ్యతచాణూరంనియుద్దార్థమయం హరిః।
సముపైతినస న్త్యత్ర కింవృద్దాయు క్తకారిణః॥
క్వయౌవనోన్ముఖీభూతసుకుమారతనుర్ హరిః।
క్వవజ్రకఠినాభోగశరీరోఽయం మహాసురః॥
ఇమౌసులలితై రాఙ్గైవర్తేతేనయౌవనౌ।
దై తేయమల్లాశ్చణూర ప్రముఖా స్త్వతిదారుణాః॥
నియుద్దప్రాశ్నికానాంతుమహానేషవ్యతిక్రమః।
యద్బాలబలినోర్యుద్దంమధ్యస్థైస్సముపేక్ష్యతే॥
ఇత్థంపుర స్త్రీలోకస్యవదతశ్చాలయన్ భువమ్।
వవల్గబద్దకక్ష్యోఽన్తర్జనస్యభగవాన్ హరిః॥
బలభద్రోఽపిచాస్ఫోట్య వవల్గాలలితం తథా।
పదేపదేతథాభూమిర్యన్న శీర్ణాతదద్భుతమ్॥
చాణూరేణతతః కృష్ణో యుయుధేఽ మితవిక్రమః।
నియద్దకుశలోదైత్యో బలభద్రేణముష్టికః॥
మధురా నగరాంగనలు కనుగవ చక్క విచ్చి కృష్ణని నిర్విరామముగ దిలకింప జొచ్చిరి. సఖులారా! ఎరుపారిన కన్నులతో గజ యుద్ద నిమిత్తమైన యలసటచే జెమట బిందువుల నిండి మంచుబిందువు లగుటకు శరత్కాల మందలి వికసించిన కమలమును కృష్ణుని మోము తిరస్కరించు చున్నది. చూడుడు. కన్నుల జన్మను సఫల మొనరించు కొనుడు. భామినీ! శ్రీవత్సాంకితము లక్ష్మి మొదలగు గొప్పవానికాశ్రయము శత్రుదమానమునైన యీ బాలుని వక్షమును బాహు యజ్ఞములం దిలకింపుము! అప్పుడే పితికిన పాలవలె చంద్రునివలె దామర తూండట్లచ్చము తెల్లనై నీలాంబర ధారియై యితువచ్చిన బలభద్రుని జూడవలె చెలీ! గంతులిడు ముష్టికునితో చాణూరునితో క్రీడించు బలరామ కృష్ణుల పరియాచకము కనుగొనవే! సఖులార! కనుగొనుడిదె చాణూరునితో బాహు యుద్దమునకు బైకొను చున్నాడు. సుకుమార మూర్తి కృష్ణుడక్కడ న్యాయము సేయు పెద్దలే లేరటె! ఇప్పుడిప్పుడ యంకురించునెల ప్రాయము వాడు సుకుమారుడు నంద కుమారు డెక్కడ! వజ్రమట్ల గడిదేరిన కర్కశ శరీరమువాడీ మహారాక్షసు డెక్కడ! ఈ ఇద్ద్దరు మిగుల సొగసు గుల్కు మేనుల నవయౌవనులయి యున్నారు. దైతేయ మల్లులు చాణూరాదులో అతి దారుణులు. ఈ మల్లయుద్ద పరీక్షకులు బాలురకు బలియురకును యుద్దము సంఘటించిరిది గొప్ప తప్పిదము. మధ్యస్థు లిది చూచి యురకొనుట మహాదారుణము అని ఇట్లు నగరాంగన లనుకొనుచుండ భగవంతుడు హరి కచ్చ బిగించి భూమి చలింప యాజనములో రంగమునం దట్టియు గంతులిడెను. బలరాముండును జబ్బులు సరచి చక్కగ గంతులు వేసెను. అడుగడుగునా భూమి బీటలు వారకుండుటడి యద్భుతము. అంతట కృష్ణుడు చాణూరునితో దలపడెను. మల్లయుద్ద కుశలుడు ముష్టిక రాక్షసుడు బలభద్రుదితో బోరెను.
సన్నిపాత అవధూతము ప్రక్షేపణము కీలవజ్రనిపాతనము పాదోద్దూతము ప్రసృష్టము మొదలయిన మల్లయుద్ద శాస్త్ర ప్రసిద్దములైన బాహుయుద్దగతి విశేషములతో యోండొరులు గ్రుద్దుకొనుటతో వారికి పెద్ద యుద్దము జరిగెను. వారి యయ్యుద్దము నిరాయుధము. బలిమికొలది యూపిరాడు కొలది సమజోత్సవ సన్నిధానము దారుణ మయ్యెను. చాణూరు డెంతెంత దనుక హరితో బోరె నంతంత కించించుకగ పరమ ప్రాణహానిం బొందెను. దిగులు వడి కోపముచే తన సిగనున్న పూలదండం గదలించునంత మాత్రముగ సేయ జాలిన వానితో గృష్ణుడు విలాసముగనే (లీలా మాత్రముగనే) పోరెను. చాణూరుని బలక్షయమును శ్రీకృష్ణుని అభివృద్ధిని గాంచి కోప నిమగ్నుడై కంసుడు ఆ వైపు మృదంగాది వాద్యములు వాయింప వలదని యాపినంతలో నాకసమున దేవదుందుభు లనేకములు మ్రోగెను. గోవిందా! జయింపుము కేశవా! చాణూరుని వధింపుము అని యంతర్ధాన గతులైన దేవతలు మిక్కిలి హర్షించుచు పలికిరి. చాణూరునితో చిరకాలము హరి పోరి వాని గడతేర్ప బూని బైకెత్తి యట్టిట్టులూచెను. అట్లు నూరుమారు లూచియూచి యా రాక్షసమల్లు నాకసమందే జీవితము పోయిన వానిని నేలపై వేసి కొట్టెను. దాన వాడు నూరు తునకలై రక్తము గ్రక్కి నేలను బేను రొంపిం బొదవించెను.
బలరాముడును నయ్యెడ ముష్టికునితో దలపడి మల్లుడగు చాణూరునితో కృష్ణుడు పోరినట్లే పోరెను. అతడును వీని నడినెత్తిన పిడికిట నడచి మోకాలి చేత రొమ్మునం గ్రుమ్మి భూతలమునం బడద్రొబ్బి ప్రాణములు పోవ కాలఱాచెను. కృష్ణుడవ్వల తోసలకుడను మల్లరాజుల బలియుని యెడమ పిడికిటం గ్రుద్ది యవనిం బడవేసెను. చాణూరుడు ముష్టికుడునుం గూల్పబడ తోసలకుడు సంపబడ నెల్లమల్లురుం బారిపోయిరి. అవ్వల కృష్ణ సంకర్షణులు దమ యీడువారిం గోపాలురం బలిమిమై లాగి యిద్దరూ నానంద భరితులై యామల్ల రంగమున నిట్టటు దుముక నారంభించిరి. కంసుడును గోపమున కన్నులెరుపార దన భటులను బెద్ద గుంపుగ నున్న వాండ్రను గని నీ గోపకుల నీ సమాజము నుండి బలిమిమై గెంటుడని నిట్టూర్చెను. మహాపాపి నందునిం గూడ సంకెళ్ళు వేసి పట్టుడు. వృద్దులకు చితము గాని దండనమున వాసుదేవునిం గూడ గడతేర్పు డనియె. కృష్ణునితో గూడ గంతులు వేయు నీ గోపకుల గోవులను వీరికడ నున్న ధనమును లాగి కొనుడనియె.
ఇట్లాన యిచ్చుచున్న కంసుని హరి గెలిసేసి ఎగిరి మంచమెక్కి వాని బట్టుకొనెను. జుట్టు బట్టిలాగి కిరీట మవనిం బడుచుండ పుడమి బడవేసి తాను వానిపై బడెను. అశేష జగదాధార గురువైన (బరువైన) హరిపైబడ నుగ్రసేను కొడుకప్పుడు ప్రాణములు విడిచెను. చచ్చిన వాని జుట్టు పట్టుకుని యా రంగా మధ్యమున మధువైరి బరబర యీడ్చెను. పెద్ద బరువున పడిన కంసుని శరీరము నీడ్చునెడ కృష్ణుని చేతనున్న యునుప గుదియ పెద్ద జల ప్రవాహము యొక్క వేగమును వహించెను. కృష్ణుడు గూల్చినంత వాని తమ్ముడు సునాము డెత్తిరాగ వానిని బలరాముడు విలాస మాత్రముగా గూల్చెను. కృష్ణుడు మథురాధి పతియగు కంసుని తిరస్కార భావముతో చంపుట చూచి నా రంగమండపము నందు హాహాకారా మెసగెను. కృష్ణుడు వసుదేవుని యొక్కయు దేవకీ యొక్కయు పాదములం బలరామునితో గూడ నేగి పట్టుకొనెను. దేవకీ వసుదేవు లాతనిని పుట్టిన వేళ హరి చెప్పిన మాటల జ్ఞప్తికి తెచ్చుకొని వారే స్వామికి ప్రణతులై నిలువ బడిరి అయ్యెడ వసుదేవు డిట్లనియె
ప్రభూ! బాధలంగుములు దేవతలకు నీ దయ చేసిన వరము మాపై ననుగ్రహముచే సఫలము సేయ బడినది. భగవంతుని నిన్నారాధించి యుంటిని. దాన నా యింట నీ వవతరించితివి. దుష్ట సంహారమునకే యీ యవతారము. దాన మా వంశము పవిత్రమైనది. భూతముల యందంతర్యామివై యా భూతము లెల్ల నీవయి యున్నారు. నీ చేతనే భూత భవిష్యత్తులు ప్రవర్తించును. యజ్ఞములచే నీవు యజింప బడుడువు. అచింత్యుడవు. సర్వదేవ మయుడవు నీవు. నీవె యజ్ఞము. యజించు వాడును యజ్వలకు బరమేశ్వరుడవు. అచింత్యుడవు. సర్వదేవ మయుడవు నీవు. నాకును, దేవకికిని నీ యెడల మనస్సు మా పుత్రుడవను ప్రీతిచే గలుగు భావము కృత్రిమము. విడంబన (వేడబము) నీవు సర్వభూత కర్తవు. నీ కాదిలేదు. అంతము లేదు. అట్టి నిన్నొక మానవ మాత్రుని నాలుక పుత్రుడని పిలుచు చున్నది. ఈ సర్వమెవ్వని వలన బుట్టినది యట్టివాడు మాయ కాక మా వలన బుట్టుటెట్లు సంభవము? చరాచర ప్రపంచ మెవ్వని యందున్నదో అట్టివాడు మాత్రు గర్భమందు నొడిలోను శయనించి మనుష్యుడై జనించు టెట్లు? పరమేశ్వర! ప్రసన్నుడ వగుము అంశావతార సాధన సంపదచే నీవీ విశ్వముం బ్రోవుము. నీవు నాకు కొడుకవు గావు. బ్రహ్మాది స్తంబపర్యంత మీ జగము నీ నుండి బోడమినది. పురుషోత్తమా! మమ్మేల మోహింప జేసేదవు? మాయ గప్పిన చూపుచే నా బిడ్డవని కంసుని వలన జడిసితిని. ఏ జడుపు లేని నిన్ను గోకులమునకుం గొనిపోయితిని. అచట పెరిగితివి. నాకేలాటి మమకారము లేదు. నీ లీలలు రుద్రమరుదశ్విశతమఖాదులకేని సాధ్యములు గావు. అట్టివానిం జూచితిమి. నీవు విష్ణువవు జగదుపకారము సేయ నిట్లు వచ్చితివి. నా విమోహము పోయినది.
Summary of chapter 20 of the Vishnu Mahā Purāṇa is as follows:
Kubja, the hunchbacked woman (kubjā), is healed: Kṛṣṇa places two fingers on her feet, pushes downward, and lifts her chin with his thumb — straightening her instantly. At the Dhanuśālā, Kṛṣṇa breaks the enormous bow kept there for the festival. The next morning, Kuvalayāpīḍa the arena elephant is killed at the gate. In the wrestling arena, Cāṇūra and Muṣṭika are slain. Kaṃsa is then pulled down from his throne by Kṛṣṇa and killed. Kaṃsa's brother Sunāma is killed by Balarāma. Devakī and Vasudeva offer a deeply moving stotra to the victorious Bhagavān who stands before them as their son.