విష్ణు మహా పురాణము

12 - నవగ్రహాది జ్యోతిర్మండల స్వరూపము

చంద్రుని రథమునకు మూడు చక్రములు. మల్లెమొగ్గ వంటి తెల్లని గుర్రములుదక గర్భము నుండి పుట్టినవి. ఆ రథముతో నితడు తిరుగును. కాడికి కుడి ఎడుమ భాగము లందు మొత్తమది పది. అంతరిక్ష వీదియండు వేగవంతమై ధ్రువము నాధారముగా గొని (ధ్రువ నక్షత్రము యొక్క ఆకర్షణ శక్తిచే) నక్షత్రము లున్నవి. సూర్య కిరణములకు వలెనే చంద్ర కిరణ ములకును తరుగు పెరుగులు జరుగును. ఉదక గర్భము నందు బుట్టిన అశ్వములు సూర్యాశ్వముల వలెనే యా చంద్రుని రథము నొక కల్పాంత కాలము మోయును. దేవతలచే దాపబడి క్షీణించి యున్న చంద్రుని దీప్తి మంతుడైన రవి తృప్తి పరచును. అమావాస్య నాడు పితరుల చేత బడునేనవ కళ, పానము చేయబడగా, పదునాఱవ కళ యొక్కటి మాత్రము మిగిలి యున్న చంద్రుని, భాస్కరుడొక్క కిరణముచే సుషుమ్నయను పేరుగల దానిచే దృప్తి చెందించును. క్రమముగా కృష్ణ పక్షమున నే తిథి యందెంత చంద్ర భాగమును దేవతలు పానము చేయగా తగ్గినదో, శుక్ల పక్షమున నా భాగమును నా తిథి యందంతే పుష్టిని వారి తస్కరుడైన భాస్కరుడు చేక్కోర్చు చుండును. పదునేను రోజులిట్లు ప్రోగుపడిన చంద్ర బింబ మండలి యమృతమును దేవతలు పానము చేయుదురు. అందుచేతనే సుధాహారులై వారమరులై పేరు వడసిరి. ముప్పది మూడు వేలు, ముప్పది మూడు వందలు, ముప్పది ముగ్గురు దేవతలు చంద్రునిట్లు త్రావుదురు. అప్పుడు చంద్రుడు రెండు కళలచే మాత్రము మిగిలి సూర్య మండలమున బ్రవేశించి “అమా” యను కిరణమున వసించి యుండును. కాన నా తిథికి ‘అమావాస్య’ అను పేరు గల్గెను. ఆనా డహోరాత్రము లందు నీటి యందు వసించును. పిమ్మట లతాడు లందు వసించును. ఆవల క్రమముగా సూర్యుని లోనికి జోచ్చును. వీరుత్తు లందు జంద్రుడుండుటచే అమావాస్య నాడు వీరుత్తులను గాని, వానియాకును కాని, యెవ్వడు త్రెంచునో వాడు బ్రహ్మ హత్యను బొందును. పదునైదవ కళా భాగమున నించుక భాగముచే మిగిలియున్న చంద్రుని, అపరాహ్న సమయమున పానము చేయుటకై పితృ దేవతలు సేవింతురు. చంద్ర కిరణముల నుండి, స్రవించు నయ్యమృతము నమావాస్య యందు ‘ద్రావి’ యొక్క మాసము చక్కగా తృప్తిపడి, పితరు లుందురు. వారు సౌమ్యులు, బర్హిశాదులు అగ్నిష్వాత్తులునను మూడు తెఱంగుల నున్నారు. ఇట్లా దేవతలను శుక్ల పక్షము నందు పితరులను కృష్ణ పక్షము నందు చల్లని జల నానందముచే మనుష్యులను, బశువులను, కీటకములను దనివి సెందించును.

చంద్ర కుమారుడగు బుధుని రథము, పిశంగ వర్ణము కలిగి వాయుజవము కల్గిన ఎనిమిది గుర్రములతో గూడి యున్నది. అది వాయువు అగ్నియను ద్రవ్యము నేర్పడినది. వరూధము (రథ కవచము) అను కర్శము (రథము కింది కఱ్ఱ) ఉపాసంగము (రథము ముందు భాగము) పతాకము అనువానితో గూడి భూమి మీద జనించిన గుఱ్ఱములతో గూడి శుక్రుని గొప్ప రథమున్నది. కుజుని బంగారు రథ మెనిమిది పద్మరాగ మణుల వలెనెర్రనగు గుర్రములతో గూడి శోభా వంతమై యుండును. ఆ గుఱ్ఱము లగ్ని వలన బుట్టినవి. బృహస్పతి రథము పాండుర వర్ణము కల ఎనిమిది గుర్రములు కలది. స్వర్ణ మయము. ఆ రథము మీద నాతడు ప్రతిరాశి యందు నొక్కొక్క వత్సరము వసించును. శని మెల్లగా నాకాశమున జనించిన శబల వర్ణము కల గుఱ్ఱములు కల రథముపై నేగును. రాహువు రథము దూసర వర్ణము కలది. (ఇంచుక తెలుపు) గుఱ్ఱములు తుమ్మెదల వలె నల్లగా నెనిమిది యున్నవి. ఒక్కమారు పూన్చ బడినవై కల్పకలను నిరంతరం వహించును, పర్వము లందు రాహు వాదిత్యుని నుండి వెడలి సోముని బొందును. సోముని నుండి సౌర పర్వం లందు సూర్యుని బొందును. అనగా సూర్య చంద్రుల మీద మూడవద్యు లోకమున జరించుచు రాహువు వారి గ్రహణ సమయము లందు గ్రిందుగా నుండి భూచ్చాయా స్వరూపమై తమోమయ మైన బింబము గల్గి దానిచే వారిని మేఘమట్లు కప్పి యా గ్రహణ మందే కాన వచ్చు చుండును. (కూర్మ పురాణమున నిట్లే యున్నది). కేతువు రథమునకు వాయు వేగము గల ఎనిమిది గుర్రములు గలవు. పలాల (ఊకవలె) ధూమ్ర వర్ణములు లాక్షారస (లక్క) వలె నెర్రనివి.

ఇవి తొమ్మిది గ్రహముల రథములు. ఇవన్నియు వాయు రూపము లయిన పగ్గములచే ధ్రువుని యందు గట్టబడి ఆకర్షింప బడి యున్నవి. గ్రహములయు ఋక్షములయు నక్షత్రములయు మండలములు. సర్వము ధ్రువుని యందు వాయురశనలచే బద్దములై దగినట్లు తిరుగుచున్నవి. ఎన్ని తారలున్నవో యన్ని వాయురజ్జువు లున్నవి. అవన్నియు ధ్రువుని యందు నిబద్దములై తిరుగుచు నాతని గూడ ద్రిప్పుచున్నవి. ప్రవాహమును వాయువుచే బ్రేరేపింప బడి, జ్యోతిస్సులు తైలపీడలు (అనగా నూనె గానుగ ఆడే పళ్ళ చక్రములు కావలయును) తాము తిరుగుచు తైల చక్రమును (గానుగను) త్రిప్పునట్లు తాము దిరుగుచు ధ్రువుని ద్రిప్పుచున్నవి. ఆ ధ్రువుని లయమేధి యందు దిరుగు గో చక్రమట్లు రూపము పొందు చున్నావో ఆ వాయువు ప్రవాహమన బడుచున్నది. ద్రువుడున్న స్థానమే శింశుమార మనబడును. ఆ చక్రమును దర్శించి మనుజుడు పగటి పాపమును విడిచి పోవును. శింశుమారము నంటి ఎన్ని తారలున్నవో, యన్ని వర్షములు దానిం దర్శించు నతడు జీవించును. దానికి క్రిందుగా నుత్తరహనువై ఉత్తాన పాదుడున్నాడు. యజ్ఞము క్రింది దౌడయై యున్నది. ధర్మము శిరస్సు నాశ్రయించినది. నారాయణుడు హృదయమున నున్నాడు. అశ్వినీ దేవతలు పూర్వ పాదములుగా నున్నారు. వరుణుడు సూర్యుడు పశ్చిమోరువు. సంవత్సరము శిశ్నము. మిత్రు డపానము నాశ్రయించి యున్నాడు. తోక యందగ్ని మహేంద్రుడు కాశ్యపుడు ధ్రువుడు నను నలుగురు తారక లున్నారు. వారస్తమింపరు. భూమి జ్యోతిర్గము ద్వీపములు సముద్రము పర్వతములు వీని సన్నివేశము చెప్ప బడెను.

వర్షాణాంచనదీనాంచ యేచతేషువసన్తివై

తేషాంస్వరూపమాఖ్యాతం సంక్షేపశ్శ్రూయతాంపునః

యదమ్బు వైష్ణవః కాయస్థతోవిప్ర! వసుంధరా

పద్మాకారాసముద్భూతా పర్వతాబ్ధ్యాదిసంయుతా

జ్యోతీంషివిష్ణుర్భువనానివిష్ణుర్వనానివిష్ణుర్గిరయో దిశశ్చ

నద్యస్సముద్రాశ్చసఏవసర్వం యద స్తియన్నాస్తిచవిప్రవార్య!

జ్ఞానస్వరూపోభగవాన్ యతోఽసావశేషమూర్తిర్నతువస్తుభూతః

తతోహిశైలాబ్దిధరాదిభేదాన్ జానీహివిజ్ఞానవిజృమ్భితాని

యదాతుశుద్ధంనిజరూపిసర్వం కర్మక్షయేజ్ఞానమాపాస్తదోషమ్

తదాహిసంకల్పతరోఃఫలాని భవంతినోవస్తుషున స్తుభేదాః

వస్త్వస్తికిం కుత్రచి దాడిమధ్యపర్యన్తహీనంచ సదైకరూపమ్

యచ్చాన్యథాత్వంద్విజ! యాతిభూయో నతత్తథతత్రాకుతోహి తత్త్వమ్

మహీఘటత్వంఘటతః కపాలికా కపాలికాచూర్ణరాజస్తాతోఽణు

జనైః స్వకర్మ స్తిమితాత్మనిశ్చయైరాలక్ష్యతే బ్రూహికిమత్రవస్తు

తస్మాన్నవిజ్ఞానమృతేఽ స్తికించిత్క్వచిత్క్వచిత్కదాచిద్ద్విజ! వస్తుజాతమ్

విజ్ఞానమేకంబిజకర్మభేదవిభిన్నచిత్తైర్బహుదాఽభ్యుపేతమ్

జ్ఞానంవిశుద్ధంవిమలంచనిత్యమశేషశోకాదినిరస్తసఙ్గమ్

ఏకస్సదై కంపరమః పరేశస్సవాసుదేవోసయతోఽన్యదస్తి

సద్భాసఏషోభవతోమయోక్తోజ్ఞానంయథాసత్యమసత్యమన్యత్

ఏతత్తుయథ్సంవ్యవహారభూతం తత్రాపిచో క్తంభువనాశ్రితంతే

యజ్ఞఃపశుర్వహ్నిర శేషఋత్విమస్సురాస్స్వర్గమయశ్చకాయః

ఇత్యాదికర్మాశ్రితమార్గదృష్టం భూరాదిభోగాశ్చ ఫలానితేషామ్

యచ్పైతద్భువనగతంమయాతవోక్తం సర్వత్రవాజతిహితత్రక్రమవశ్యః

జ్ఞాత్వైతద్ద్రువమచలంసదై కరూపం తత్కుర్వన్విశతిహియేనవాసుదేవమ్

వర్షములు, నదులు, వాని యందున్న వారు వారి స్వరూపము చెప్పబడెను. సంక్షేమ వచనమును వినుము. విష్ణు శరీరమైనది నీరు, దాని నుండి భూమి పర్వత నదీ సాగరములతో గూడి పద్మాకారముగా జనించినది. జ్యోతిస్సులు లోకములు గిరులు నదులు, సముద్రములు దిక్కులు మొదలగు సర్వము విష్ణువే. భగవానుడు జ్ఞాన స్వరూపుడు సర్వమూర్తి కావున పర్వతాదు లన్నియు విజ్ఞాన విజృంభితములే కాని వాస్తవికములు కావని యెరుంగుము. సర్వ కర్మక్షయము కాగానే సర్వదోష వర్జితమై, శుద్దమై యాత్మ రూపము గోచరించు నపుడు సంకల్పమను వృక్షమునకు ఫలములైన యవాస్తవికమైన పృథివ్యాది వస్తువుల లందు కాదిమధ్యాంతములు గోచరించును. పంచ భౌతికంబైన యీ యచిత్తును వస్తువుగా బేర్కొన జెల్లదు. ఇది నాస్తి శబ్ద వాచ్యము. అస్తు అసత్యమునవి యిది పిలువ బడును. పరిణామ శూన్యమై నిత్యైక రూపమై యలరారు ఆత్మయొక్క ‘ఆస్థి’ శబ్ద వాచ్యమై చిత్తు సత్తు సత్యము నను పేరుల బిలువ బాడుచు నరూపమై యనామమై యోప్పును. మట్టి నానా వికారంబులం బొందినపుడు దానినేమని పిలువ వలయును? జ్ఞానులుకా వికార జాతమున మృత్తే గోచరించును. కావున విజ్ఞానము కంటే నొక్కటి లేనేలేదు. అదొక్కటే నిజకర్మ భేదముచే పెక్కు తెరంగు లయినట్లు చూడ బడుచున్నది. విశుద్దము వికులమునైన జ్ఞానమై నిత్యమై సమస్త శోకాది వికారములు లేనిదై ఏకమై సత్తై యొప్పు పరమాత్మ పరమేశ్వరుడు నగు వాసుదేవు డొక్కడే. అంతకు మించి వేరొక్కరి లేదు. ఇది సత్యము. ఈ జ్ఞానము పశువు అగ్ని రుత్త్విక్కులు సోముడు దేవతలు స్వర్గ మాయమైన కోరిక ఇవన్నియు కర్మ మార్గమున గోచరించునవి. భూర్లోకాది భోగములు వాని ఫలములు, కర్మము నమ్మిన వాడు వీనియందు దగుల్కొనును. ఇక నచాలుడు సదైక రూపుడగు నాత్మను ద్రువుడుగా నెఱింగి యుపాసించునో యతడు వాసుదేవునే పొందును.