ఆ ప్రహ్లాదునీ రీతిని చూచి రాజు వలన భయమున రాక్షసులు రాజుతో చెప్పగా నాతడు వంట వారిని పిలిచి యిట్లు చెప్పెను.
“ఓ పాచకులారా! నా పుత్రుడు దుష్టబుద్దియై యితరులకూగూడ కుమార్గము నుపదేశించు చున్నాడు. దుష్టుడగు నీతనిని ఆలశ్యము చేయక చంపి వేయుడు. తిను పదార్ధములలో హాలాహలమును కలిపి తెలియనీయ కుండ నాతనికీయుడు. ఆలోచింప వలదు.”
రాజాజ్ఞ ననుసరించి వంటవారు మహానుభావుడగ సంకీర్తనమున విషము నిర్వీర్య మాయెను. ఆ సంగతి విని వంటవారు రాజున కెరింగింపగా రాజు తన పురోహితులతో
“శీఘ్రముగ కృత్యయను శక్తిని పుట్టింపు డనెను”.
పురోహితులు ప్రహ్లాదుని కడకేతెంచి సవినయముగ సామ పూర్వకముగ వినయాన్వితుడగు ప్రహ్లాడునకిట్లు చెప్పిరి.
బ్రహ్మ వంశమున పుట్టి త్రైలోక్య విఖ్యాతిగన్న దైత్యనాథుడగు హిరణ్యకశిపుని పుత్రుడవగు నీకు నితర దేవతలతో నేమి ప్రయోజనము! సర్వ లోకములకు ఆశ్రయుడైన నీ తండ్రి వలెనే నీవు కూడా కాగలవు. కావున నీవు శత్రుపక్ష ప్రశంసను మానుము. అందరిచే శ్లాఘింపబడు నీ తండ్రి గురువులకు గూడ గురువు అని పలుకగా ప్రహ్లాదుడు ఇట్లనెను.
ఈ వంశము మరీచి మహాముని వంశము. చాల గొప్పది. గురువులలో తండ్రియే పరమ గురువు. పూజ్యుడు. అందు సంశయము లేదు. ఆ విషయమై నేను పొరబడను. అనంతునితో నేమి ప్రయోజనమని మీరనిన మాట నిజము కాదు. అని పలికి గురువు లందలి గౌరవముతో మౌనము వహించి నవ్వి “అనంతునిచే నేమి లాభము” అని బాగా పలికినారు. మీకు కష్టము లేనిచో ఏమి లాభమో చెప్పెద వినుడు.
ధర్మార్ధ కామ మోక్షములు నాలుగు పురుషార్ధములు, అవి ఎవని వలన సిద్దించునో యట్టి అనంతుని వలన నేమిలాభ మనుట బాగున్నది. మరీచి దక్షుడు మున్నగు వారు అనంతుని వలననే ధర్ము పొందిరి. మరి కొందరు అర్ధమును, మరి కొందఱు కామమును పొందిరి. తత్త్వవేత్తలగు మరి కొందఱు జ్ఞాన ధ్యాన సమాదులచే ద్వాస్తమైన అజ్ఞాన బంధము గలవారై ముక్తిని పొందిరి. అనంతుడగు హరి యారాధనమే సంపత్తికి, ఇష్వర్యమునకు, మహాత్మ్యమునకు, జ్ఞానమునకు మూల కారణము, సర్వ పురుషార్ధములు. ఆ ఆరాధనమునకు ఫల భూతములు. అట్టి అనంతుని వలన ఫలమేల యనుట బాగున్నది. వేయి మాటలెల? తాము మాకు గురువులు మంచియో చెడో చెప్పండి. మా వివేకము మిక్కిలి అల్పము. ఈ విషయమై వేరు చెప్పనేల? ఆ అనంతుడే జగత్పతి. అతడే కర్త వికర్త సహర్తయు అందరి హృదయము లందు గలడు. భోక్త భోజ్యము కూడా నాతడే. ఆతడే జగదీశ్వరుడు. బాల్యముచే నేను చెప్పిన దానిని క్షమించుడు.
“ఇక మరల నీవిట్లు పలుకవు గదాయను భావముతో అగ్నిచే దగ్దమగు చున్న మీవు మాచే రక్షింప బడితివి. నీవింత అవివేకివని మేము తలంచ లేదు. ఈ దురాగ్రహ్మును విడువ లేని దుర్భుధ్దీ! నీ వినాశము కొఱకై కృత్యను సృజించెదము.”
ఎవడెవ్వనిచే చంప బడును? ఎవనిచే రక్షింప బడును? అధర్మ మాచరించని వాడు రక్షితు డగును. సమస్తమునకు కర్మయే కారణము. కావున సర్వ ప్రయత్నములచే సత్కర్మ నాచరింప వలెను.
ఇట్లనగనే రాజ పురోహితులు కుపితులై అతి భయంకరమైన జ్వాలా మాలలచే నొప్పుచున్న కృత్యను సృజించిరి. ఆ కృత్య పాదములతో భూమి తాడనము చేసి మహా కోపముతో ప్రహ్లాదుని హృదయమును శూలముతో గొట్టగా నా శూలము శత ఖండములుగా భగ్న మాయెను. ఎవ్వని హృదయమును ననపాయిగా హరి యుండునో అచట వజ్రమే భిన్న మగును. శూలము మాట చెప్పనేల? పాపాత్ములగు దైత్య పురోహితులచే పాప రహితుడైన ప్రహ్లాదునిపై ప్రయోగింప బడిన కృత్య వారినే చంపాను. దగ్ధ మగుచున్న వారిని చూచి ఆ బాలుడు కృష్ణా! అనంతా! రక్షింపుమని వెంట బడెను. మఱియు నిట్లనెను. సర్వవ్యాపివి! జగత్ర్సష్టవు! జగద్రూపుడవు! ఈ బ్రాహ్మణులను దుస్సహమగు మంత్రాగ్ని వలన రక్షింపుము. జగద్గురు వగు నీవే సర్వ భూతము లందు వ్యాపించి యున్నావు. కావున వీరు బ్రతుకుదురు గాక!
విష్ణువగు నిన్ను సర్వత్ర అనపాయిగా నున్నట్లు భావించు చున్నాను. కావున శత్రు పక్షీయు లైనను వీరు జీవింతురు గాక! నన్ను చంప జూచినవారు విషము పెట్టిన వారు అగ్నిని నాపై
రగులు కోల్పినవారు దిగ్గజములచే త్రోక్కించిన వారు సర్పముల కరపించిన వారు వీరందరి యందు నేను సమమైన మైత్రితోనే యుంటిని.
అని పలికిన ఆ బాలుని ఆహ్సీర్వదించిరి “వత్సా! బలవీర్యో పేతుడవై దీర్ఘాయువువై అడ్డులేని వాడవై పుత్రపౌత్ర ధనైశ్వర్యోపెతుడవై అని పలికి పురోహితులు రాక్షస ప్రభువునకు జరిగిన వృత్తంతమును నివేదించిరి.
Summary of chapter 18 of the Vishnu Mahā Purāṇa is as follows:
Hiraṇyakaśipu, filled with pride from his power, declares himself the supreme lord and forbids worship of Viṣṇu throughout his kingdom. His own son Prahlāda, however, is born with innate Viṣṇu-bhakti — his devotion having been transmitted while in the womb, as his mother had listened to Nārada's teachings during her pregnancy. As Prahlāda grows, his bhakti is unshakeable. He teaches his fellow students about Viṣṇu. Hiraṇyakaśipu, enraged, subjects Prahlāda to every form of torture — poisoning, trampling by elephants, throwing from mountains, submersion in water, attack by weapons — but nothing harms him. Viṣṇu's presence protects him in each ordeal.