బ్రహ్మయొక్క తామస సృష్టిని దెల్పితిని మైత్రేయ! ఇక రుద్రసృష్టి తెలుపు చున్నాను వినుము. బ్రహ్మ కల్పాదిని దనకీడగు కొడుకునకై ధ్యానించి నంత నాయన యొడిలో నీలలోహితు డను గుమారు డుదయించెను. అతడు సుస్వరముగ రోదనము సేయుచు బరుగెత్తెను. బ్రహ్మ ఎందుల కేడ్చుచున్నా వనెను. ఆ ప్రజాపతి నాకు ఒక పేరిమ్మనెను. ‘రుద్రుడు’ అను పేరు గల వాడవు నీవు. ఏడువకు. ధైర్యము గొనుమన నా శిశువు మరల యేడు మార్లేడ్చెను. అంతట విధి యాతని కేడుపేర్లు పెట్టెను. మొత్త మా ఎనుమండుగురు రుద్రులకు నెనిమిది స్థానములను ఎనమండుగురు భార్యలను బుత్రుల నొసంగెను. ఆ యేడుగురు పేర్లివి, భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు వారికి స్థానములు సూర్యుడు, జలము, మహి, వాయువు, వహ్ని, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు సోముడు ననువారు. ఇవే అష్టమూర్తులు సువర్చల ఉష సువేశి శివస్వాహ దిక్కులు దీక్షారోహిణి యనువారు వారి భార్యలు. వీరి సంతానము, వీరి పుత్ర పౌత్ర పరంపరతో జగమెల్ల నిండినది.
శని శుక్రుడు లోహితాంగుడు (కుజుడు) మనోజవుడు స్కందుడు స్వర్గము సంతానుడు బుధుడు ననువారు వారి కొడుకులు. ఈ విధముగా సృష్టిని బెంచిన రుద్రుడు సతీదేవీం భార్యగా గైకొనెను. ఆమె దక్ష ప్రజాపతి కూతురు, దక్షుని యెడ కోపించి యామె తన శరీరమును బాసి హిమవంతునికి మేనకయందు దయించెను. అపుడామె ‘ఉమ’ యను పేరందెను. ఆమెను భగవంతుడు హరుడు పెండ్లాడెను. భ్రుగువు వలన ఖ్యాతి ధాత విధాతయను దేవతలం గనెను. నారాయణుని పత్నియగు శ్రీదేవిం గనెను.
అమృత మథన సమయమున లక్ష్మి పల్కడలి నుండి యవతరించేనని వినబడును గదా! భృగువునకు ఖ్యాతి యందుదయించెనను చున్న విది ఎట్లన, శ్రీపరాశరు డిట్లనియె.
ఈ శ్రీదేవి విష్ణువున కనపాయిని. విష్ణువెట్లు నిత్యుడు సర్వాంతర్యామియో యీమేయు నిత్య స్వరూప విష్ణునితో నిత్యముండునది. విష్ణువు అర్ధము ఈమె శబ్దము. ఈమె నీతి హరినయము (న్యాయము) విష్ణువు బోదము (జ్ఞానము) ఈమె బుద్ది. అతడు ధర్మము. ఈమె సత్క్రియ, హరిస్రష్ట ఈమె సృష్టి. శ్వాతురాలు. భగవంతుడు కామము ఈమె యిచ్ఛ విష్ణువు యజ్ఞము. శ్రీదేవి దక్షిణ. లక్ష్మి ఆఘౌహుతి (నేయి రూపమున నిచ్చు హవిస్సు) హరి పురోడాశము(హోమోపయోగిపిష్ట ద్రవ్యము).
లక్ష్మీ పత్నిశాల మధుసూదనుడు ప్రాగ్వంశము. త్రేతాగ్ని పాలకుడు. శ్రీదేవి చితి(దేవి) హరియూప స్తంభము. శ్రీయిధ్మ, హరికుశ. భగవంతుడు సామస్వరూపి ఉద్గీతి(సామ) కమలాలయ. ఇందిస్వాహా రూపిణి జగన్నాథుడు అగ్ని శంకర భగవానుడు విష్ణువు గౌరీ లక్ష్మి. సూర్యుడు కేశవుడు ప్రభ పద్మాలయ విష్ణువు, పితృగణము స్వధాదేవి. ఈమె శాశ్వతమైన పుష్టి నిచ్చునది. శ్రీదేవి ద్యులోకము. అతి విస్తారమైన అవకాశము. ఆకాశము విష్ణువు. శ్రీధరుడు(విష్ణువు). శశాంకుడు (చంద్రుడు) కాంతి లక్ష్మి. అనుపాయిని ధృతి. రమ, జగచ్చేష్టాత్మకుడు వాయు సర్వగుడగు వాయువు, సముద్రము గోవిందుడు వేల (చెలియలి గట్టు) లక్ష్మి, శచీదేవి లక్ష్మి. దేవేంద్రుడు మధుసూదనుడు. యముడు చక్రిధూమోర్ణ (యమ పత్ని) కమలాలయ. సమృద్ది (సంపద) శ్రీ శ్రీధరుడు. కుబేరుడు. గౌరీ. లక్ష్మి. వరుణుడు. హరి శ్రీదేవి దేవసేన. దేవసేనాధిపతి హరిగధాపాణి అవష్టంభము (ఊత, పూనిక) లక్ష్మీ శక్తి. కాష్ఠలక్ష్మీ నిమేషము హరి. ముహూర్తము ముకుందుడు కలారూపిణి కమలాలయ. వెన్నెల సిరి సకలమైన వెలుగు సర్వేశ్వరుడు. తీగ జగన్మాత చెట్టు శ్రీ విష్ణువు. విభావరి (రేయి) శ్రీదేవి దివసము (పగలు) చక్ర గదాపాణి వరప్రదుడు(హరి) వరుడు (పెండ్లికొడుకు) పద్మ వనవాసిని(లక్ష్మి) వధువు (పెండ్లిక కూతురు) నాదము భగవంతుడు. శ్రీదేవి నది. పతాక కమల గేహిని. తృష్ణ లక్ష్మీ, లోభము జగత్స్వామి నారాయణుడు. రథి లక్ష్మి, రాగము గోవిందుడు. ఇట వేయి మాటలెందులకు? దేవతలలో పశు పక్ష్యాదులలో మనుష్యులలో పురుష నామమైన దెల్ల పురుషోత్తముడు భగవంతుడు విష్ణువు. స్త్రీ నామమైన దెల్ల శ్రీదేవి. వీరికంటె మఱి పరము లేదు.
Summary of chapter 8 of the Vishnu Mahā Purāṇa is as follows:
When Brahmā's creation proceeds too slowly, he becomes angry. From his anger and annoyance, Rudra (Śiva) arises — blazing, of dual form (male-female), filling all the three worlds. Brahmā asks Rudra to separate his male and female aspects and assist in creation. Rudra does so, giving rise to the eleven Rudras (Ajaikapāt, Ahirbudhnya, Virūpākṣa, Raivata, Hara, Tryambaka, Sāvitra, Jayanta, Pinākin, Aparājita, Mṛtyurūpa). Dakṣa Prajāpati is born from Brahmā's right thumb.