విష్ణు మహా పురాణము

Table of Contents

17 - ద్రుహ్యు వంశము

 

 

ద్రుహ్యుని తనయుడు బభ్రువు. ఆయన వాడు సేతువు. సేతువు కొడుకు ఆరబ్దుడు. అతని కొడుకు గాంధారుడు. అతని వాడు ఘర్ముడు. ఘర్మునికి ఘృతుడు. అతనికి దుర్ధముడు, అతనికి ప్రచేతసుడు, అతని కొడుకు శతధర్ముడు పుట్టిరి. ఈతడు ఔత్తరాహులగు (భారత ఖండమునకు నుత్తర దిశనున్న) మ్లేచ్చులకు దొర యయ్యెను.