విష్ణు మహా పురాణము

Table of Contents

1 - ప్రథమాంశము - పురాణ సంహితావతారము

 

 

మెత్రేయుడు పూర్వయామ మందనుష్ఠానము చేసికోని యున్న పరాశర మునీంద్రులకు సాష్టాంగముగా నమస్కరించి యిట్లనియె. “ఓ గురుదేవా! నీ వలన వేదములను, వేదాంగములను వరుసగా జదువు కొంటివి. సర్వ శస్త్రములు నద్యయనము చేసితివి. నీ యనుగ్రహమున సర్వ శాస్త్రము లందు మరెవ్వరు చేయని పరిశ్రమ జేసితినని నన్ను పండితులు ప్రశంస జేయుచున్నారు. మఱి నీ వలన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను విన గుతూహల పడుచున్నాను. ఓ బ్రహ్మ మూర్తీ! ఈ జగత్తు దేన నిండినదో, దేని వికారమో, దేనబుట్టి పెరిగి లీన మగు చున్నదో దీనికి మూలమైన, పంచ భూతముల యొక్క సంస్థానము, ప్రమాణము, దేవాదుల వంశములు, మనువులు, మన్వంతర చతుర్యుగ కల్పకల్పనలు, కల్పాంతము యొక్క స్థితి, నాలుగు యుగముల ధర్మములు, దేవర్షి రాజ చరితము, వేద శాఖా విభాగము బ్రాహ్మణాది వర్ణ ధర్మములు, బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములు విన గోరెదను. నీ మనస్సును నా యెడ ప్రసన్న మొనరింపుము. దాన నంతను నేఱుంగ గలన”న