హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

44 - యుద్ధానికి దేవతలు సిద్ధపడుట

వైశంపాయనుడిలా అన్నాడు.

నాయనా! యుద్ధానికి సిద్ధమైన రాక్షస సైన్యముయొక్క విస్తారం విన్నావుగా, ఇక విష్ణువుకు సంబంధించిన దేవతల సమస్త సైన్యాన్ని గూర్చి విను.

ఆదిత్యులు, వసువులు, రుద్రులు, బలశాలురైన అశ్వినీదేవతలు సైన్యంతో అనుసరించు. వారితో తమ బలానికి తగినట్లు సిద్ధపడ్డారు. దిక్పాలకుడైన సహస్రాక్షడు (ఇంద్రుడు) ముందుగా ఐరావతమనే తన ఏనుగు నెక్కాడు. అతనికి ఎడమప్రక్కన గరుత్మంతునితో సమానవేగం గలదియు అయిన బంగారురథం ఉన్నది. తేజశ్శాలురైన మహర్షులాతని స్తోత్రం చేస్తున్నారు. దేవ సైనికులు అతన్ని రక్షిస్తున్నారు. అతని రథానికి వెయ్యి గుర్రాలు కట్టబడ్డాయి. కోట్లకొలది అప్సరసలు నాట్యం చేశారు. సారధియైన మాతలి రథంపై కూర్చున్నాడు. దేవసేనకు తూర్పున ఇంద్రుడు యమధర్మరాజు, దక్షిణాన, వరుణుడు, పడమరదిక్కున కుబేరుడు ఉత్తరదిక్కున నియమింపబడ్డారు. సూర్యుడు తన రథంమీద కూర్చుని దేవసేనలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా దేవసేన యుద్దానికి సిద్దమైంది. బృహస్పతి దేవ సైన్యానికి శుభమగుగాక! అంటే శుక్రాచార్యులు రాక్షస సైన్యానికి శుభమగుగాక. అని ఆశీర్వదించాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో యుద్ధానికి దేవతలు సిద్ధపడుట అను నలభై నాల్గవ అధ్యాయము