హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

40 - వరాహాది అవతారముల వివరణ

జనమేజయుడిలా అడిగాడు.

మహానుభావా! నేను పురాణాల్లో అవతారకధల సందర్భంలో సజ్జనులు, అమిత తేజశ్శాలియైన నారాయణుడు వరాహరూపం ధరించాడని చెప్పగా విన్నాను. కాని ఆయన చరిత్ర, అనేకవిధాలైన ఆయన గుణములు, పనులు మొదలైన వాటిని బాగా ఎరుగను. ఒకప్పుడు ఒకానొక యజ్ఞంలో చాలామంది బ్రాహ్మణులు ఒకచోట చేరారు. వాళ్ళద్వారా వేదవ్యాసుడు చెప్పిన వరాహ చరిత్ర మాట విన్నాను. నారాయణుడు వరాహరూపం ధరించి తన కోరలతో భూమిని, సముద్రం నుంచి పైకి తెచ్చాడని తెలిసింది. ఇప్పుడు విస్తృతంగా ఆయన అవతారం, అతని పని వీటినన్నిటినీ బాగా వర్ణించండి. విష్ణుతత్వాన్ని వివరించి చెప్పండి.

ఇది శ్రీమహభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో వరాహది అవతారముల వివరణ అను నలభైయవ అధ్యాయము.