హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
35 - శ్రీకృష్ణావతారము - కాలయవన జన్మ
వైశంపాయనుడిలా చెప్పాడు.
వసుదేవుని భార్యలు పద్నాలుగుమంది. వాళ్ళు పేరవి, రోహిణి, ఇందిర, విశాఖి, భద్ర, సునాస, సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ, దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, దేవకి, సుతన, వడవ, వీళ్ళలో శ్రేష్టురాలు, రోహిణి, రోహిణి కడుపున వసుదేవుడికి రాముడు, సారణుడు, శఠుడు, దుర్దముడు, శ్వభ్రుడు, పిండారకుడు, ఉశీనరుడు, అనే పుత్రులు, చిత్ర అనే కన్య జన్మించారు. చిత్రకు అకస్మాత్తుగా మరణం సంభవించింది. ఆమె సుభద్ర అనే పేరుతో రోహిణికి పుట్టింది.
ఇలా రోహిణి సంతానం పదిమంది. గొప్ప యశశ్శాలియైన శ్రీకృష్ణుడు దేవకి కడుపున అవతరించాడు. నిశఠుడు రేవతి బలరాముల పుత్రుడు, సుభద్రార్జునుల కుమారుడు అభిమన్యువు. అక్రూరుడికి కాశీరాజు కూతురుకు సత్యకేతువు పుట్టాడు. ఇప్పుడు వసుదేవుడి ఏడుగురు భార్యలకు పుట్టిన వీరపుత్రుల పేర్లను, వృత్తాంతాన్ని చెపుతాను విను.
శాంతిదేవుడికి భోజుడు, విజయుడు, సుదేవకు వృకదేవుడు, గదుడు, సుదేవకు వృకదేవికి అవగాహుడు, త్రిశరాయణుడు, గార్గ్యుడు, త్రిగర్తరాజైన దేవకునికి పురోహితులు, మహాత్ముడైన గార్యుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, అతనిని నపుంసకుడని, అసత్యమైన కలహం జరిగింది. పన్నెండు సంవత్సరాలు గార్యుడు తపస్సు చేశాడు. ఇతడు ఒక గొల్లపడుచుతో సంగమం చేశాడు. ఆమె గోపాలి అనే అప్సరస. ఆమె గర్భవతియై ప్రసవించిన తరువాత ఆ శిశువును విడిచివెళ్ళగా యవనుడనే రాజు ఆ పిల్లవానిని తనయింటికి తీసుకువెళ్ళి పోషించాడు. పిల్లవాడు దినదినాభివృద్ధి పొందాడు.
అతనికి కాలయవనుడనే పేరు వచ్చింది. కాలయవన జన్మకథ పూర్తి అయింది. కాలయవనుడు యుద్ధం చేయగోరుతూ బ్రాహ్మణులను అడిగాడు. నారదుడు వృష్ణి, అంధక వంశరాజులను గూర్చి చెప్పాడు. అప్పుడు అక్షౌహిణి సైన్యంతో మధురమీదికి దండెత్తాడు. వృష్ణి అంధక వంశీయులకు దూతను పంపాడు. వాళ్ళు గొప్ప బుద్ధిశాలియైన కృష్ణుని ముందుంచుకొని యవనుని భయం చేత ఆలోచించారు. అందరూ నిశ్చయించుకొని అందమైన మధురను విడిచి పారిపోయారు. కుశస్థలిలో ద్వారవతీ ప్రదేశంలో నివసింపదలిచారు. ఈ శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్ని పరిశుద్దుడై ఇంద్రియనిగ్రహం కలిగి సర్వకాలము లందు వినిపించు విద్వాంసుడు ఋణం లేనివాడై సుఖపడతాడు.
