వాయు మహా పురాణము

Table of Contents

7 - కశ్యపీయ ప్రజాసర్గమ్

సూతుడనెను :

ఆ తరువాత దనువు యొక్క పుత్రులను జెప్పెద వినుడు. దనువు పుత్రులు వంశమున పేరుగాంచిన మహాసురులుగా నుండిరి (1). విప్రచిత్తి ప్రధానులైనవారు నూరుగురు. తీవ్రమైన పరాక్రమము గలవారు. వారందరును చక్కగా తపము జేసినవారు పొందిన  వారును (2). సత్యసంధులు, పరాక్రమించినవారు, క్రూరులు, మాయావులును, మహాబలులు యాగము జేయనీపోరు, అబ్రహ్మణ్యులును బ్రాహ్మణహితము గోరనివారు, చంపదగనివారును - ఐన వారు దనుపుత్రులైన దానవులు. ప్రాధాన్యముననుసరించి వీరిని జెప్పెద వినుడు (3). ద్విమూర్ఖుడు, శంకువర్ణుడు, శంకునిరామయుడు, శంకుకర్ణుడు, మహావిశ్వుడు, గవేష్ఠి దుందుభి, అజోముఖుడు, భగవంతుడు, శీలుడు, వామనుడు, మరీచి, అక్షకుడు, మహాగార్యుడు, అంగిరావృతుడు (4, 5), విక్షోభ్యుడు, సుకేతువు, సువీర్యుడు, సుహృదుడు, ఇంద్రజిత్తు, విశ్వజిత్తు, సురవిమర్దనుడు, (6) ఏకచక్రుడు, సుబాహువు, తారకుడు, మహాబలుడు, వైశ్వానరుడు, పులోముడు, ప్రవీణుడు, మహాశిరుడు (7), స్వర్భానువు, వృషపర్వుడు, ముండకుడు, మహాసురుడు, ధృతరాష్ట్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, తాపీనుడు (8), సూక్ష్ముడు, నీచంద్రుడు, ఊర్ణనాభుడు, మహాగిరి, అసిలోముడు, సుకేశుడు, బలకుడు, దశుడు (9), గగనమూర్ధుడు, కుంభనాభుడు, మహోదరుడు, ప్రమోదాహుడు, కుపధుడు, హయగ్రీవుడు, వీర్యవంతుడు (10), అసురుడైన విరూపాక్షుడు, మహాసురుడైన సుపథుడు, అజుడు, హిరణ్మయుడు, శతమాయుడు, శంబరుడు (11), శరభుడు, శలభుడు, సూర్యచంద్రులిద్దరును. ఈ యిద్దరు అసురులలో సురులు. సురులలో సాంప్రతులు (ఇప్పటికినున్నవారు) (12) - అనీ దనువుయొక్క వంశమువారైన పుత్రులు ప్రధానులుగా జెప్పబడిరి. వారికి గూడ పుత్రపౌత్రాదులు లెక్కకు మిక్కుటము అనంతము (13). అని యీ దితి పుత్రులై దనుపుత్రులైన రాక్షసులు చెప్పబడిరి. స్వర్భానువు దీతి సుతుడుగ జెప్పబడినాడు. అనుభనువు దనుపుత్రునిగ జెప్పబడినాడు. వీరు దనువు యొక్క వంశానుగతులైన పుత్రులని చెప్పబడినవారు (14). ఏకాక్షుడు, ఋషభుడు, అరిష్టుడు, ప్రబంధనకరులిద్దరును, ఇంద్రబోధనకేశియు, మేరువు, శంబుడు, ధేనుకుడును (15), గవేష్ఠి, గవాక్షుడు, వీర్యవంతుడైన తాలకేతువును, వీరు మనుష్యధర్ములైన దనుపుత్రులు అని నాచే జెప్పబడినారు. (16). దైత్యదానవులు గలిసిన సంతోషమున బుట్టినపోరును, భయంకర పరాక్రమము గలవారును, సింహికయందు విప్రచిత్తికి జనించిన పుత్రులు వీరు (17). వీరు సైంహికేయులని ప్రసిద్ధి జెందిన పదునలుగురు మహాసురులు. శతగాలుడు, బలవంతుడు, న్యాసుడు, శాంబుడు (18), అనులోముడు, శుచి, వాతాపి, సీతాంశుకుడు, హరుడు, కల్పుడు, కాలనాభుడు, భౌముడు, నరకుడు (19) - వీరందరికీ జ్యేష్ఠుడు రాహువు. ఈతడు చంద్రసూర్యులను విమర్శించు (మ్రింగు)వాడు. - అను వీరు సింహికాపుత్రులు. దేవతలకు గూడ జయింపనలవికానివారు (20). భయంకరులైన బంధువులు గలవారు, క్రూరులు. వారందరును బ్రహ్మను ద్వేషించువారు మరి పదివేలు సైంహికేయగణమనబడువారున్నారు (21).

ఈ గణము జమదగ్ని పుత్రుడై బలవంతుడైన భార్గవునిచే (పరశురామునిచే) జంపబడినది. స్వర్భానువునకు ప్రభయ కలదు. అట్లే పులోమునకు శచియను కన్యయు గలదు (22), ఈమె ఉపదానవి ఈమెకు వృష పర్వుని కూతురుగా శర్మిష్ఠ జన్మి పులో మయు కాలికయు నిద్దరు వైశ్వానరుని పుత్రికలు (23). ప్రభయొక్క పుత్రుడు నహుషుడు. శచియొక్క పుత్రుడు జయ తరువాత, శర్మిష్ఠ పురువును గనెను. ఉపదానవీ దుష్యంతుని గనెను (24). ఈ పులో మాకాలీకలిర్వురును వైశ్వానర పుత్రిక యిద్దరు కన్యలును మారీచుని వివాహమాడిరి (25). వారిరువురి వలన హిరణ్యపురవాసులకు వేలపుత్రులును, అటువది దానవశ్రే ఇతరులు పదునలుగురును గలిగిరి (26). పౌలోములును కాలకేయులునైన దోనవులు మంచి గొప్ప బలము గలవారు. వారు దా. వధింపనలవిగానీ వారు. సవ్యసాచియైన యర్జునునిచే జంపబడిరి (27). మయునకు బుట్టిన పుత్రులందరును వీరులు పరాక్రమవంత వారు మాయావి, దుందుభి, వృషుడు, మహిషుడు, మౌలికుడు, వజ్రకర్ణుడు, మందోదరియను కన్యయును (మయసంతానము దైత్యులయొక్కయు దానవుల యొక్క సృష్టి అని చెప్పబడినది (29). దనాయుషయొక్క పుత్రులైదుగురు మహాబలులను వారు అరూరువు, బలి, జంభుడు, వీరక్షుడు, విషుడు - అనువారు (30). అరూరువు యొక్క పుత్రుడు క్రూరుడైన ధుం మహాసురుడు. ఆతడు ఉత్తంకుని మాటచే కువలాశ్వునిచే జంపబడెనట (31). బలీయొక్క పుత్రులిరువురు మహావీర్యవంతు యిరువురును తమ పరాక్రమముతో సాటిలేనివారు. వారు కుభిలుడు, వర్ముడు అనువారు. ఈ వర్ముడు పూర్వజన్మలో కర్ణుడ వీరక్షునకు గూడ కాలకుడు వరుడు - అను నిరువురు పుత్రులు. విషునకు నలుగురు పుత్రులు గలిగిరి. వారు క్రూర కర్ములు. పో హంత, యజ్ఞ హంత, బ్రహ్మహంత, పశుహంత అనువారు (33). వృత్రునకు గలిగిన దసాయుషాపుత్రులు పరాక్రమవంతులు. వినుడు. వారు ఇంద్రునితో యుద్ధము జేయుచున్న వృత్రుని యొక్క భయంకరమైన యూపీరినుండి పుట్టిరి. మహాబలవం రాక్షసులు (తమ మనస్సుతో) తాము భర్తలుగా జెప్పబడిరి. లక్షలకొలదిగా యా రాక్షసులు మహేంద్రుని యనుచరులు (సే అనబడిరి (35). వారందరు బ్రహ్మవేత్తలు, సౌమ్యులు, ధార్మికులు, సూక్ష్మమూర్తులును. ప్రజలలో నంతర్గతులై ధార్మికులై వా నివసింతురు (36). ఇది దైత్యుల యొక్కయు దానవులయొక్కయు సృష్టియని చెప్పబడినది. యజ్ఞమున ప్రవాహియను సామె గాయకులైన పుత్రులను గనెను (37). వారు సత్త్వనుడు, సత్త్వాత్మకుడు, కలాపుడు, వీర్యవంతుడు, కృతవీర్యుడు, బ్రహ్మచారి, ఏడ సుపాండువు (38). పనుడు, తరణ్యుడు పదవవాడు సుచంద్రుడును. ఈ చెప్పబడిన వీరు గంధర్వులుగా దెలియదగినవారు

ఇది శ్రీవాయుమహాపురాణమున కశ్యపీయప్రజాసర్గమను ఏడవ అధ్యాయము సమాప్తము.