వాయు మహా పురాణము

Table of Contents

17 - పరమాశ్రమ కథనం

వాయురువాచ :-

వాయువు పలికెను:- మూడోశ్రమములను (బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థములను) వదిలి,పరమాశ్రమమైన ‘భిక్షా’ ఆశ్రమమును బొంది, తరువాత సంవత్సరానమున ఉత్తమోత్తమమైన (దీనికన్న మరొక యుత్తమములేనిది) జ్ఞానమును బొందవలేను-1. తరువాత గురువుగారికి తెలిపి ఈ భూమినంతయు తిరుగవలెను. అసలు జేయమైన పరమాత్మను తెలిసికొనుటకు సాధనమైన సారభూతమైన జ్ఞానమును పాటింపవలెను-2. ఇది జ్ఞానము. ఇది యము అని సంతుష్టిజెంది తిరుగువాడు కల్పసహస్రమైన యాయువుగలవాడైనను జ్ఞేయమును బొందలేడు-3. సంగమును త్యజించి, క్రోధమును జయించి, అల్పాహారియై యిద్రియములను జయించి, బుద్ధిచే ద్వారములన్నియు మూసివైచి, మనస్సును ధ్యానమున నిలువ వలెను-4. శూన్యములై నిర్జన ప్రదేశములందు, గుహలయందు వనమునందును, నదులయొక్క యిసుకతిన్నెలందును నిత్యము యోగయుక్తుడుగావలెను-5. వాక్కు అను దండము, కర్మయను దండము, మనస్సు అనుదండము- అనునవి మూడు దండములు. ఈ మూడు దండములు నియతముగా లవాడు త్రిదండిగా పరిగణింపబడును-6, నిశ్చలముగా నున్నవాడు, ధ్యానమునందాసక్తుడైనవాడు, ఇంద్రియములజయించినవాడు, శుభములును అశుభములునైన రెండు కర్మలను త్యజించి, ఈ శరీరమును వాడు శాస్త్ర ప్రకారంగా ఎప్పుడుగూడ పుట్టడు చావడు-7.

ఇది వాయుమహాపురాణమున పరమాశ్రమ ప్రాప్తికథనమను పదునేడవ యధ్యాయము.