వాయు మహా పురాణము

Table of Contents

3 - వైవస్వత సర్గ వర్ణనమ్

సూతుడనెను :

ఆ తరువాత ఏడవ పర్యాయమున వైవస్వత మన్వంతరమున మరీచి పుత్రుడైన కశ్యపుని వలన దేవతలు పరమరులును బుట్టిరి. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవులు, మరుద్గణములు, భృగువులు, అంగీరసులు, ఈయెనమండుగురు దేవగణములనబడుదురు. ఆదిత్యులు, మరుతులు, రుద్రులు వీరిని కశ్యపాత్మజులుగా దెలియవలె. సాధ్యులు, విశ్వేదేవులు ధర్మపుత్రులును మూడు గణములు. భృగువు నుండి బుట్టినవాడు భార్గవదేవుడు. అంగిరుడు అంగిరసుని పుత్రుడు. ఈ వైవస్వతమన్వంతరమున వారు నిత్య స్వేచ్ఛతో జనించిన దేవతలు. ఈ సృష్టి మారీచముగా (మరీచమహర్షి నుండి బుట్టినదిగా) తెలియదగినది. వీడు సాంప్రతుడు, శుభుడు. వారిలో తేజస్వి సాంప్రతుడు. ఇంద్రుడు పేరుతో మహాబలుడు. భూత భవిష్యత్ వర్తమానములనున్న మన్వంతరేంద్రులందఱును సమాన లక్షణముల గలవారని యెఱుగవలెను. భూత భవిషద్వర్తమాన కాలముల ప్రభువైనవాడు సహస్రాక్షుడైన పురందరుడు (ఇంద్రుడు), ఆ యింద్రులందఱును శృంగములు గలవారై వజ్రమును చేత ధరించినవారు. వారందరు వేరు వేరుగా నూరు యాగముల జేసిరి, ముల్లోకములో నడకగలిగి దుర్బలములైన ప్రాణులను ధర్మాది కారణములచే తిరస్కరించి నిలుతురు. వారు తేజము చేతను, తపముచేతను, బుద్ధిచేతను, బల పాండితీ - పరాక్రమముల చేతను భూత భవిష్య వర్తమానములకు ప్రభువులై యే విధముగ సమర్థులైరో దానినంతయు జెప్పెదను. నా నుండి వినుడు.

భూతము, భవ్యము, భవిష్యము అనునవి ద్విజులచే లోకత్రయముగా జెప్పబడినవి. భూర్లోకమనునిది భూమియ(భూతమ)నబరీ అంతరిక్షం (ఆకాశము) భువమనబడినది. భవ్యమను నది దివమనబడినది. దానికి సాధనమును జెప్పెదను. పూర్వము పు గోరిన బ్రహ్మ ముందు 'భూః' అని యుచ్చరించెను. అప్పుడిది భూర్లోకమయ్యెను. భూ సత్తాయాం అని భూ ధాతువు సత్తార్థ (ఉండు అను నర్థమున) చెప్పబడినది. అట్లే యిది లోకదర్శనార్థమున గూడ జెప్పబడినది. అంతనప్పుడు భూతమైనందు దర్శనమైనందునను ఇది భూలోకమైనది. కావుననిది మొదటి లోకము. భూతమైనది (మొదటనేర్పడియున్నది)గాన ద్విజులచే 'భ యనబడినది. ఇది యిట్లు జరుగగా బ్రహ్మచే మరల రెండవదిగా 'భవత్' అనబడినది. పుట్టుచుండుటచే ‘భవతి' అన కాలశబ్దముగా జెప్పబడినది (13). భవనాత్ భువర్లోకః = ఉండుట వలన భువర్లోకమని నిరుక్తము దెలిసిన వారిచే జెప్పబడినది. అందువలన నాకాశము భూమి కంటే రెండవలోకముగా జెప్పబడినది (14), భువర్లోకమీవిధముగ బుట్టగా మరల బ్రహ్మ మూడవదిగా "భవ్య' అని యుచ్చరించెను. అందువలననపుడు భవ్యమను లోకమేర్పడెను (15). భవిష్యకాలమున ‘భవ్య' అను శబ్దము సంభావింపబడుచున్నది. కావున భవ్యమను నీలోకము పేరుతో స్వర్గమని చెప్పబడినది (16). స్వర్గమని వేరుగా జెప్పబడిన మూడవది యపుడు 'భావ్య'మనబడినది. ‘భావ్య' అను నీ ధాతువు భవిష్యత్కాలార్థమున విశేషముగ భావింపబడుచున్నది (17). "భూః' అనునిది భూమియనబడినది. భువమనునిది అంతరిక్షమనబడినది. అట్లే దివము భావ్యమనబడినది. ముల్లోకమునకిది సంగ్రహము (18). ముల్లోకముతో గూడిన వ్యాహారములచే (ఉచ్చారణ మాటలచే) మూడు వ్యాహృతులైనవి. ధాతువుల దెలిసిన పండితులు నాథధాతువును పాలించుట యను నర్థముగలదిగా జెప్పిరి (19). భూత భవిష్యద్వర్తమాన లోకత్రయమునకు నాథులైన (పాలకులైన) వారుగా ఇంద్రాదులు చెప్పబడిరి (20), దేవేంద్రులు ప్రధానులుగాను అప్రధానులుగాను ఉందురు. మన్వంతరములలోని దేవతలు య (21). యక్షులు, గంధర్వులు, రక్షస్సులు, పిశాచులు, ఉరగులు, దానవులు - వీరు అంతటను దేవేంద్రుల మహిమలు గలవారు అనబడినారు (22). ఈ లోకమున దేవేంద్రులు, గురువులు, పొలకులైన రాజులు, ఆ దేవతాశ్రేష్టులును ఈ ప్రజలనందరిని ధర్మముగా రక్షింతురు (23), అని యీ దేవేంద్రుల లక్షణము సంగ్రహముగా జెప్పబడినది. ఇపుడు ఆకాశమున నును. సప్తర్వులను జె (24). గాధిపుత్రుడును కౌశికుడును, ధీమంతుడును మహాతపస్వియునైన విశ్వామిత్రుడగు భృగుపుత్రుడును, ఊరువు నుండి బుట్టినవాడును, ప్రతాపవంతుడునైన జమదగ్ని (25), బృహస్పతి కుమారుడును, మహాతపస్వియునైన భారద్వాజుడు, ఉతథ్యపుత్రుడును, విద్వాంసుడును, శరద్వంతుడు, ధార్మికుడునైన గౌతముడు, స్వాయంభువుడు, భగవంతుడు, బ్రహ్మకోశుడునైన అత్రి యైదవవాడు, ఆఱవవాడును, వసుమంతుడును, లోకప్రసిద్ధుడునైన వాసిష్ఠపుత్రుడు (వసిష్ఠుడు) (27), వత్సారుడైన కాశ్యపుడు (కశ్యపుడు) - ఈ యేడుగురు సాధుసమ్మతులు. సిద్ధులైన సప్తర్షులు ఇప్పటి మన్వంతరమున నుందురు (28). ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడైన శర్యాతి, విఖ్యాతుడైన నరీష్యంతుడు, సౌభుడు, ఉద్దిష్టుడు (29), కరుషుడు, పృషధ్రుడు, వసుమంతుడు - అను వీరు వైవస్వతమనువు యొక్క తొమ్మండుగురు పుత్రులుగా జెప్పబడినారు. నా చేత గూడ వీరు చెప్పబడినారు. ఇది యేడవ యంతరము (మన్వంతరము) (30). ఓ ద్విజులారా! ఈ విధముగా రెండవపాదము విస్తరముగను ఆనుపూర్వితోను నాచే జెప్పబడినది. మరల నింకేమి నేను వర్ణించి చెప్పవలెను? .

ఇది శ్రీవాయుమహాపురాణమున వైవస్వతసర్గవర్ణనమను తృతీయాధ్యాయము సమాప్తము. ఇది యుపోదాత పాదము.