వాయు మహా పురాణము

Table of Contents

4 - ప్రజాపతి వంశానుకీర్తనమ్

ఋషులనిరి :

బుద్ధిమంతుడైన సూతునిచే జెప్పబడిన రెండవ పాదమును విని, శాంశపాయనుడు మూడవ పాదమును జెప్పుమని యడిగెను (1). అనుక్రమముగా నీవు రెండవ పాదమును జెప్పితివి. మూడవ పాదమును ఉపోద్ఘాతముతో వివరించుము. ఈ విధముగా నడుగబడిన సూతుడు సంతుష్టాంతరంగుడై యిట్లనెను .

 సూత ఉవాచ :-

సూతుడనెను :

ఉపోద్ఘాతముతో బాటు విస్తరముగా మూడవ పాదమును జెప్పెదను. ఓ ద్విజులారా! ఆ పాదమును మొదటి నుండి చే వినుడు (3). ఓ ద్విజులారా! మహాత్ముడైన ఇప్పటి వైవస్వతమనువు యొక్క సృష్టిని పూర్వానుక్రమముగా విస్తరముగ విను డెబ్బదియొక్క చతుర్యుగముల (కృతాది కల్యంత యుగముల) పూర్వమే దేవగణముల తోను, ఋషుల తోను, దానవుల తోను, పితృ-గ యక్షులను దేవగణముల తోను, రాక్షస - భూత గణముల తోను, మనుష్యుల తోను, పశువుల తోను, పక్షుల తోను చెట్లు మొదలగు స్థావరము మనువు మొదలు భవిష్యము వరకు గల యాఖ్యానములతో (కథాప్రవచనములతో)ను, వైవస్వత మన్వంతర) సృష్టిని సూ! నమస్కరించి చెప్పెదను .

మొదట మన్వంతరమున గడచిన సృష్టులును, వానిని ప్రవర్తింపజేయువారును స్వాయంభువ మన్వంతరుమన నేఁ మహర్షులుగా నుండిరి. చాక్షుష మన్వంతరము గడచి మరల వైవస్వత మన్వంతరము రాగా (8), మహేశ్వరుని శాపము వలన యొక్కయు, మహౌజస్కులై మహాత్ములైన భృగువు మొదలగు ఋషుల యొక్కయు ప్రాదుర్భావము జరిగినది (9). మరల నాస మానస సృష్టిగా బుట్టిరి. స్వయంభువుడైన బ్రహ్మచే తనపుత్రులుగా జేయబడిరి (10). ప్రజా సంతానకారులై పుట్టుచున్న యా మహాత గ్రహ నక్షత్రములతో నలంకరింపబడిన సృష్టి మరల ప్రవర్తింపబడినది (11). విశుద్ధమైన జ్ఞానము కర్మలును గల్గిన వారియొక్క (స యొక్క) సంతానమును సంగ్రహ విస్తరములతో అనుక్రమముగ జెప్పెదను.

ఆ ఋషుల వంశములచేత బుట్టిన సృష్టి యీ చరాచరములతో నిండినదై గ్రహ నక్షత్రములతో నలంకరింపడినదై నావిర్భవించినది. అతని యీ వచనమును విని మునులకు సంశయము గలిగెను. తరువాత సంశయముతో గూడిన వారై ప్రశంసింప వ్రతములు గల యా మునులు సూతుని సత్కరించి సంశయమును దీర్పుమని యడిగిరి .

ఋషులనిరి :

పూర్వము సప్తర్చులు మానస సృష్టిగా నెట్లు బుట్టిరి? బ్రహ్మచే వారు పుత్రులుగా నెట్లు చేయబడిరి? ఓ పండితశ్రేష్ఠా! మాకు జెప్పుము అనిరి. తరువాత మహాతేజస్వియైన సూతపౌరాణికుడు శుభముగా నిట్లు చెప్పెను (15). స్వాయంభువ మన్వంతరమునందలి సప్తర్షులు మరల వైవస్వత మన్వంతరమును జేరి సిద్ధులైరట (16). వారు అప్పుడు శివుని శాపముచే కొట్టబడినవారై తపోలోకమును జేరలేదు. మరల వారు 'జన' లోకమునకు మరలి వచ్చి చేరిరి (17). తరువాత నా మహరులందరు ఆ 'జన' లోకమున వారుణమైన క్రతువు ఏర్పడగా పరస్పరముగా నిట్లనుకొనిరి (18}. చాక్షుషమన్వంతరమున మనమందరము బ్రహ్మ (మానస) పుత్రలమై జన్మించెదము. దాని వలన శ్రేయస్సు గలుగును (19). స్వాయంభువ మన్వంతరమున సప్తార్థముగా శపింపబడిన వారై యీ లోకమున మరల జనించిరి. తరువాత జనలోకము నుండి దీవమునకు (స్వర్గమునకు) వెడలిరి (20). మహాదేవుని యజ్ఞమున బ్రహ్మ వరుణ శరీరమును ధరించెను. సంతానేచ్చతో అగ్నిలో నాతనిశుక్రమును హోమము జేయుచుండగా దాని నుండి ఈ ఋషులు పూర్వము రెండవ మారుగా జన్మించిరి - అని వినికిడి (21). భృగువు, అంగిరసుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడను ఈ యెనమండుగురు ఆ బ్రహ్మపుత్రులు.

అట్లే యీతని (బ్రహ్మ) యొక్క విశాలమైన యజ్ఞమున దేవత లందరును వచ్చిరి. సమస్తములైన యజ్ఞాంగములును, వషట్కారమును మూర్తిమంతము లైనవి (23). వేలకొలది సామములును యజుస్సులును మూర్తిమంతములైనవి. ఆకారముల దాల్చినవి. పదక్రమములతో నలంకరింప బడిన ఋగ్వేదము గూడ నట మూర్తిమంతమయ్యెను (24). వృత్తములతో గూడిన యజుర్వేదము ఓంకారమే ముఖముననుజ్జ్వలముగా వెలిగినదై, యజ్ఞమునకై జోడించిన సూక్తములు - బ్రాహ్మణములు, మంత్రములును గలదై యుండెను (25), సామవేదము గూడ వృత్తములతో నొప్పినదై, సమస్త గేయములు ముందుగానున్నదై విశ్వావస్వాదులతోను గంధర్వులతోను సంపాదింప బడియుండెను (26). బ్రహ్మ వేదము. అట్లే యది ఘోరములైన కృత్యావిధులతో గూడినదై, ప్రత్యంగిరసయోగములతోను గూడినదై రెండు శరీర - శిరములు గలదయ్యెను (27). లక్షణములు - స్వరములు, స్తోభములు, నిరుక్త స్వరభక్తులును, ఆశ్రయమైన వషట్కారమును, నిగ్రహ - ప్రగ్రహములును (లక్షణములు) (28). దీప్తమైన (మండిన) దీప్తి (వెలుగు) గల . ఇలాదేవియు (భూదేవియు), దిక్కులును, ఆగ్నేయాది కోణ దిక్కులును, వాక్పతులును, దేవకన్యలును, పత్నులును, అట్లే మాతృ దేవతలును (29), ఆయ వీరందరును యజ్ఞము జేయుచున్న దేవుని (అగ్నిదేవుని) ఎదుటనంతటను ఆకారము గలవారై శరీరము దాల్చిన వరుణుని స్వరు నావిర్భవించిరి (30). వారందరిని జూచి స్వయంభువున (బ్రహ్మ)కు భూమి పై రేతఃపతనమాయెను. అది బ్రహ్మర్షి భావనా : వల్లనే జరిగినది. నిశ్చయము (31). బ్రహ్మదానిని స్రువముతో పరిగ్రహించి స్రుక్కులతో ఆజ్యము వలె మంత్రవంతముగా : జేసెను .

దాని నుండి యా ప్రజాపతి (బ్రహ్మ) భూత సమూహమును సృష్టించెను. దానికి ముందుగనే యజ్ఞమందలి యా తేజ లోకములలోని తైజసము ఆవిర్భవించినది. తమస్సుతో భావవ్యాప్యత్వరూపమైన తమస్సు, అట్లే సత్త్వము, అట్లే రజస్సును జని (33). సగుణమైన తేజస్సు వలన ఆకాశమున తమమున నిత్యము (భూత గ్రామము) ఉన్నది. తమస్సు తేజస్సగుట వలన సర్వభూ జనించినవి (34). కర్మజులైన పుత్రులు దానియందు బుట్టినపుడు బ్రహ్మ తన శుక్రమును ఆజ్యస్థాలిలో (యజ్ఞపునేతిపాత్రలో), హోమము జేసెనట (35). ఆ శుక్రము హోమము జేయబడగా దాని నుండి ప్రసవగుణముతో గూడినవారై శరీరములతో (అగ్నుల వలె) ప్రకాశించినవారై సప్త మహర్షులు బుట్టిరి (36). అగ్నిలో శుక్రము ఒక్కమారు హోమము చేయగనే యాజ్వాల (శుక్రుడు) బయల్వెడలేను. ఆ తీరుగా మంటను భేదించుకొని బయలు వెడలిన యాతనిని బ్రహ్మ చూచి నీవు భృగుడవు అని ప అందువలన నాతడు భృగువయ్యేను (37). మహాదేవుడు శివుడు ఆ విధముగా జ్వాల నుండి బయలు వెడలిన బ్రాహ్మణు బ్రహ్మతో నిట్లనెను. ఓ ప్రభూ! బ్రహ్మా! పుత్రకాముడనై దీక్షితుడనైన నాకీ భృగువను దేవుడు జనించెను. ఇక వీడు నా పుత్రుడి అని యనెను (38). బ్రహ్మదేవుడంగీకరించగనే మహాదేవుడు ఆ 'భృగు 'వును తన పుత్రునిగా జేసికొనెను. కావున వా భృగువులు ఆ ప్రభువైన భృగువు వారి సంతానము .

తరువాత రెండవ శుక్రము అగ్నిలో బడెను. ఆయంగారములలో (శుక్రము) అంగములను గూర్చుకొని ప్రభువగు అంగిరసుడి (40). ఆ విధముగ అంగిరసుని యుత్పత్తిని జూచి యగ్ని బ్రహ్మతో నిట్లనెను. ఓ బ్రహ్మా! నీకొరకే నేను రేతస్సును ధరించితి రెండవవాడు నాకు పుత్రుడగు గాక - అని యడిగెను (41). అట్లేయగుగాకయని బ్రహ్మ సదసస్పతియైన యగ్నితో ననేను. అంగిరసులు ఆగ్నేయులని మేము ఏంటీమి .

            లోకకారియైన బ్రహ్మచే మరల సౌకుమారులు శుక్రము హోమము చేయబడగా అందుండి యాఱుగురు బ్రహ్మలు బుట్టరని మేము వింటిమి (43). అందులో మొదటి వాడు మరీచి. మరీచుల (కీరణముల) నుండి పుట్టినవాడు. ఆ క్రతువునందొక కొడుకు బుట్టెను. దాని వలన సౌతడు క్రతువనబడెను (44). నేను మూడవవానిని - అను నర్థముతో మూడవవాడు అత్రీ (అహంత్రిః) అని కీర్తింపబడెను. నిశితములైన (వాడియైన) కేశములతో బుట్టినందున (తరువాతివాడు) పులస్త్యుడనబడెను (45). పొడవైన వెంట్రుకలతో బుట్టినందున తరువాతివాడు) పులహుడనబడెను. వసు (ధన) మధ్యము నుండి బుట్టి (తరువాతివాడు) వసుమంతుడై వసుధకు (భూమికి) ఆశ్రయుడై (46), తత్త్వజ్ఞులైన బ్రహ్మవాదులచే వసిష్ఠుడనబడెను. ఈ యాఱుగురు మహరులు బ్రహ్మ మానసపుత్రులు (47). లోకమునకు సంతానకారులు, వీరిచే ప్రజలు వృద్ధిజేయబడిరి. బ్రహ్మపుత్రులైన వీరు ప్రజాపతులనబడుదురు .

ఈ మహర్షుల చేతనే జనించిన పితరులను వేడొక ఋషిగణములు ఏడు. లోకములలో బ్రసిద్ధములు (49). మారీచగణములు, భార్గవ గణములు, ఆంగిరసగణములు, పౌలస్త్యగణములు, పౌలహగణములు, వాసిష్ఠగణములు, ఆత్రేయగణములు - అనునవి లోకప్రసిద్ధములైన పితృగణములనబడినవి (50). ఓయి! వీరు సంగ్రహముగా పూర్వమే మూడు గణములుగా జెప్పబడిరి. అవి - అపూర్వములు, ప్రకాశములు, జ్యోతిష్మంతములును - అని మూడుగా ప్రసిద్ధిజెందినవి.

వారికి రాజు యమదేవుడు. అహింసాది నియమములతో వీడిన పాపములు గల యితరులు ప్రజాపతులు. వారిని జెప్పెదను మీరు ఏమరుపాటు లేక వినుడు (52). కర్దముడు, కశ్యపుడు, శేషుడు, విక్రాంతుడు, సుశ్రువుడు, బహుపుత్రుడు, కుమ వివస్వంతుడు, శుచిశ్రవుడు, (53) ప్రచేతసుడు, అరిష్టనేమీ, బహులుడు, ప్రజాపతి - అను నీ మొదలగు వారు ఇతరులును ఆ ప్రజాపతులు (54). దర్భలంత యెత్తు గలవారును, మనోవేగము గలవారును, సర్వము నందుండువారును - ఐన వాలఖిల్యుల, పరమరులు సార్వభౌములునునై జన్మించిరి (55). భస్మవ్యపోహిని యందు (భస్మమును దూరము జేయు దానియందు) బుల్స్ బ్రహ్మర్షిగణముచే సమ్మతులై తపో వేదములందు పరాయణులైనవారు వైఖానసులను ముని గణము వారు (56), ఆతని (బ్రహ్మ యింద్రియముల నుండి పుట్టిన యశ్వినీ దేవతలు చక్కని రూపములతో గూడినవారు. జన్మాక్షరజసులు విమలురై నేత్రముల బుట్టినవారుగా దెలియుదురు (57). ఆతని (బ్రహ్మ, అగ్ని) యింద్రియముల నుండి జ్యేష్ఠులైన ప్రజాపతులు పుట్టిరి. రోమకూ నుండియు అట్లే స్వేద (చెమట) మలము నుండియు ఋషులు పుట్టిరి (58). రుతమున మాసములు, జిగురులు, పక్షసంధ వత్సరములును, అహోరాత్రములును, దారుణములు (భయంకరములు) పుట్టినవి (59). రౌద్రమును లోహితమందురు. లో కనకమనబడినది. అది మైత్రమని (సూర్యసంబంధమని) తెలియవలెను. ధూమము పశువులనబడినవి (60). ఆ యగ్నిజ రుద్రులు అట్లే జనించిన ఆదిత్యులు (సూర్యులు). అంగారముల నుండి పుట్టిన జ్యోతిస్సులు దివ్యమానుష రూపములు (దే మనుష్యులును) (61). వేదము నుండి పుట్టిన బ్రహ్మ యీ లోకమునకు మొదటివాడు. దీనిని సర్వకామదమని యందురు. కన్యనుదాహరించిరి (62). అచట దేవగురువైన బ్రహ్మ దేవతలచే ప్రసన్నుడగును. ఈ ప్రజాపతులందరు ప్రజలను బుట్టీ (63). వారందరు ప్రజాపతులు. వారందరును తపస్వులు, వారియనుగ్రహమున నీలోకముల నీక్రియలు ధరించును (64). అగ్ని తేజమును వర్ధిల్లజేయు జంటను వర్ధిల్లజేసెను. అట్లే దేవతలలో వేద విద్వాంసులందరు రాజర్షులైరి (65). అం వేదమంత్రుపరులును, ప్రజాపతి గుణములతో బుట్టినవారునైరి. భూమిలో తపము అనంతమై బ్రహ్మస్వరూపమై, సత్యస్వర పరమమైనదగును (66). ఓ ప్రభూ! ఈమేమందరము నీ సంతానరూపులమే. బ్రహ్మయు, బ్రాహ్మణులును, చరాచరములైన లోకమ నీ సంతానమే (67). మరీచి మహర్షిని మొదటనుంచుకొని ఋషులతోబాటు దేవతలు - మేము నీ అపత్యములను (సంతానమ కోరుచున్నామని సంతానమును గోరిరి (68), ఆ యజ్ఞమున మహాభాగులైన దేవతలు ఋషులతో గూడ నీ వంశమున బుట్టి స్థానకాలాభిమానులైరి (69). వారు ఈ ప్రజలను ఆ రూపముతోనే నిలుపరు. యుగాద్యంతముల దాక ఈ ప్రజలను నిలుపుదురు.

తరువాత లోకగురుడైన బ్రహ్మ పరుడని విచారింపక యిట్లు పలికెను. ఈ విధముగా నిశ్చయించి నా చేత దేవతలు సృష్టింపబడిరి. సంశయము లేదు. మరల నీ మహర్షులు మీ యొక్క వంశమున బుట్టిరి (71). వారిలో పూర్వ మహాత్ముడైన భృగువుయొక్క వంశమును కీర్తించెదను (చెప్పెదను) ప్రథమప్రజాపతియైన యా భృగువుయొక్క వంశమును విస్తరముగను ఆనుపూర్వీతోను జెప్పెదను (72). భృగువు యొక్క భార్యలు సాటిలేనివారు, ఉత్తమురాండ్రు, బాంధవ్యము గలవారు, శుభకరులై వారునైన యిరువురుండిరి. అందులో నొకటి హిరణ్యకశిపుని యొక్క కన్య ‘దివ్య’ యని ప్రసిద్ది జెందినది - రెండవది పులోముని పుత్రిక పౌలోమి శ్రేష్టురాలైనది (73). భృగువు వలన దివ్య వేదవేత్తలలో శ్రేష్ఠుడైన కావ్యుని (శుక్రుని) గనెను. ఆతడు దేవాసురులకు ఆచార్యుడు, కనీసుతుడు, గ్రహరూపుడునైన శుక్రుడు (74). ఆ శుక్రుడు ఉశనుడని ప్రసిద్ధుడు. పేరున కొవ్యుడని పిలువడినవాడు, సోమపులైన పితరుల మానసీకన్యయు యశస్వినియునైన 'అంగి' యను శుక్రుని భార్య నలుగురను పుత్రులను గనెను (75), భృగు - దివ్యల వల్ల బుటిన శుక్రుడు బ్రహ్మతేజముతో గూడినవాడు. బ్రహ్మవేత్తలలో నుత్తముడు. ఆ శుక్రునకు భార్యయైన యంగియందు నలుగురు పుత్రులు పుట్టిరి (76). త్వష్ట, వరూత్రీ - అను నీయిరువురును, శండుడు - అమర్కుడు - అనువారిరువురును. వారు ఆ సూర్యునితో సమానమైన కాంతి గలవారు. ప్రభావమున బ్రహ్మతో సమానులు (77). రంజనుడు, పృథురశ్మి, విద్వాంసుడైన బృహఠిరుడును - వీరు వరూత్రియొక్క సుతులు బ్రపి సురులకు యాజకులు (యజ్ఞముల జేయించువారు) (78). వారు ఇజ్యా (యాగ) ధర్మ వినాశము కొరకు మనువును జేరి కలిసి విధముగా నిరసింపబడుచున్న ధర్మమును జూచి మనువనెను. వీరిచేతనే స్వేచ్చగా నిన్ను యాజనమును (యజ్ఞము జేయ పొందించగలను (అని యనెను). ఇంద్రుని యా వాక్యమును విని యా ప్రదేశము నుండి వారు తొలగిరి (80). వారు తొలిగి కనబడి ఇంద్రుడు ధర్మపత్నియైన చేతనను గ్రహముతో ముక్తురాలినిగా జేయించి, తరువాత నాతడామె ననుసరించెను (81). త ఇంద్రవినాశనమునకై యత్నించుచున్న నాయకులను అక్కడికి వచ్చిన వారిని మరల నింద్రుడు చూచెను. చూచి యింద్రుడా జంపి, తరువాత దక్షిణమునందు దేవదేవుని యొక్క వేదియందు పరుండెను (82), శాలావృకములతో (శాలలోనీ తోడేళ్ళతో) తినబరి వారియొక్క శిరములు పడినవి. అవి తరువాత ఖర్జూరములైనవి (83). ఈ విధముగ వరూత్రీయొక్క పుత్రులు పూర్వమిం హతులైరి. శుక్రునకు యజనియందు దేవయాని పుత్రికగా జనించెను (84), త్రిశిరుడై మహాత్ముడైన విశ్వరూపుడు త్వష్ట పుత్రుడయ్యెను. విశ్వరూపుని తోబుట్టువు గూడ విశ్వకర్మయే యముడనబడెను (85). భృగువు వలన దేవతలైన భృగువులు పండ్రెం పుత్రులుగా జన్మించిరి. ప్రభువైన కావ్యుడు దేవియందు వారందరిని పుత్రులుగా గనెను (86). వారు భువనుడు, భావనుడు, అ అన్యాయతుడు, క్రతువు, శ్రవుడు, మూర్ధుడు, వ్యజయుడు, వ్యశ్రుషుడు, ప్రసవుడు, అజుడు, పండ్రెండవవాడు అధిపతియు న (87) వీరు దేవతలైన భృగువులు, పండ్రెండుగురు, యాజ్ఞికులును. (భృగువు వలన) పౌలోమీ బ్రహ్మిష్ణుడు వశియు విభు పుత్రుని గనెను (88). ఆతడు ఎనిమిదవ నెలలో గర్భక్రూరమైన కర్మచే చ్యవనమగుట (జారినవాడగుట) వలన చ్యవనుడన తరువాత ప్రచేతసుని నుండి చేతనుడు చ్యవనక్రోధుడైన ప్రాచేతసు (చేతను) నుండి అధ్వానుడు, పురుషుని నుండి యజుడును జ (89). భార్గవుడైన చ్యవనుడు సుకన్యయందు ఆత్మవానుడు, దధీచుడు అను నిరువురు పుత్రులను గనెను. వారిరువురు సమ్మతులు (90). దధీచి వలన సరస్వతియందు సారస్వతుడు పుట్టెను. నహుష పుత్రియైన 'రుచి' అను మహాభాగ్యవతి ఆత్మ పత్నియైనది (91). ఆ ఆత్మవానుని యొక్క తొడల నుండి యా తోడలను భేదించుకొని ఋషియైన ఔర్వుడు' పుట్టెను. మహాయశస్వి. ఔర్వునకు మండుటగ్ని వలె ప్రకాశించు ఋచీకుడు పుట్టెను (92). ఋచీకునకు సత్యవతియందు జమదగ్ని  భృగువునకు రుచి పర్యాయమున రౌద్ర - వైష్ణవములలో వైష్ణవాగ్నియొక్క (93) జమనము వలన (భుజించుట వలన) జ జనించెను. రేణుక జమదగ్ని వలన ఇంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడును, బ్రహ్మ - క్షత్ర తేజములు నిండినవ అమిత తేజస్కుడైన పరశురాముని గనెను (94). ఔర్వునకు జమదగ్ని మొదలుగా గల పుత్రశతము గలిగెను. ఆ భార్గవులకు పరస్పర వేల పుత్రులు గలిగిరి (95). ఋష్యంతరులలోను బాహ్యలుగా ననేకులు భార్గవులనబడిరి. వారు - వత్సుడు, విశ్వుడు, అశ్విపే పాండుడు, పథ్యుడు, శౌనకుడును. గోత్రముతో వీరు ఏడవవారు ఈ పక్షములు భార్గవ పక్షములుగా దెలియదగినవి.

         అగ్నిపుత్రుడై ధీమంతుడైన యంగిరసుని యొక్క వంశమును వినుడు. ఆతని వంశమున గౌతమునితో బాటు భారద్వాజులు పుట్టిరి. దేవతలైన యాంగిరసులు మహౌజస్కులై ఇపుమంతులై (బాణములు గలవారై) ముఖ్యులైనవారు (97). మరీచి మహర్షి పుత్రి మారీచియైన సురూపయు, స్వరాట్టెవ కర్దమప్రజాపతి పుత్రియైన కార్టమియు, మనుపుత్రి మానవియైన పథ్యయు - అను నీ మువ్వురు అధర్వణునీ (అంగీరసుని) భార్యలు. ఇవ్వీరు అంగిరసుని భార్యలు. వారియందలి సంతతిని జెప్పెదను (98). ఆ పత్నులందు అధర్వణునకు అంగిరసునకు కులోద్వహులైన దాయాదులు (పుత్రులు) పుట్టిరి. మహాతపస్సుతో భావించిన యాత్మలు గలవారికి మహాతపస్సుతో పుత్రులు పుట్టిరి (99). సురూపయందు (అంగిరసుడు) స్వరాష్ట్రాన గౌతముని బృహస్పతిని అవంధ్యుని వామదేవుని ఉతథ్యుని ఉజుని కనెను (100). పథ్యయందు ధిష్ణువను పుత్రుడు కలిగెను. మానసుడైన సంవర్తుడు ఆయస్యుడైన (నల్లనివాడైన) విచితుడును కలిగిరి. ఉతథ్యుని పుత్రుడు శరద్వంతుడు (101), అశిజుడు (ఉశిజుడు) దీర్ఘతముడు. వామదేవజుడు బృహదుతుడు. ధీష్ణువు యొక్కపుత్రుడు సుధన్వానుడు. సుధన్వనునీ పుత్రుడు ఋషభుడు (102). ఋషులని ప్రసిద్ది జెందినవారు. రథకారులైన దేవతలుగా జెప్పబడిరి. బృహస్పతికి ప్రసిద్ధుడును మహాయశస్కుడునైన భరద్వాజుడు కలిగెను (103). అంగిరసునకు సంవర్తుడు కలిగెను. ఇక అంగీరసులైన దేవతలను వీనుడు. దేవతలైన యంగీరసులు బృహస్పతి కన్న చిన్న వారనబడిరి (104). సురూపయందు ఔరసులైన యంగిరసుని పుత్రులు పుట్టిరి. వారు - ఔదార్యుడు, ఆయువు, దనువు, దక్షుడు, దర్భుడు, ప్రాణుడు, హవిష్మంతుడు, హవిష్ణుడు, క్రతువు, సత్యుడు - అను వారు పదుగురు (105). అయస్యుడు, ఉతథ్యుడు, వామదేవుడు, ఉశిజుడు, భారద్వాజులు, శాంకృతికులు, గార్యులు, కాణ్వులు, రథితరులు (106),ముద్గలులు, విష్ణువృద్ధులు, హరితులు, వాయువులు, భాక్షులు, భరద్వాజులు, ఆర్షభులు, కొంభయులు (107) - వీరు అంగీరసుని పక్షము వారుగా పదియైదుగురిని దెలియవలెను. ఋష్యంతరులలో బాప్యులైన యంగిరసులు అనేకులనబడినారు .

            ఇక ఉత్తమ పురుషులు గల మారీచ వంశమును జెప్పెదను. ఆ వంశమున స్థావరజంగమాత్మకమయమైన జగము పుట్టినది (109). మరీచి ఆపోదేవతలను (నీటిదేవతలను) కామించెను. సంతానేచ్ఛతో వారినే (తపస్సులనే) ధ్యానించుచుండెను. ప్రజావంతుడై సర్వగుణములతో గూడిన పుత్రుడు గూడ కలిగెను. చక్కని కాంతిగల దితి మనస్సుచే భావింపబడినదై యుండెను. ప్రభువైన ప్రశస్తురాలైన యామె యందు పూజింపబడుచుండెను (110). తరువాత సమస్త జలములు (జలస్త్రీలు) పిలువబడిరి. ప్రభువు వారియందు నివసించెను (111). వారిలో ప్రభువైన మరీచి తానుంచీన యాత్మకలవానిని ఒక పుత్రని జనింపజేసేను. ఆ సాటిలేనివాడు, అరిష్టనేమియను (రెండవ) పేరు గల కశ్యప ప్రజాపతి. వధేవేశుడు సూర్యకాంతి గల మరీచుని పుత్రునిగా జనిం: (112). సత్పురుషుల వాక్యమును ధ్యానించుచు పుత్రార్థియై జలమందు ఏడువేలయేండ్లుండి యా మరీచి సాటిలేని వాడయ్యెన కశ్యపుడు సూర్యుని వలన విద్వాంసుడయ్యెను. ఆకారణమున ఆతడు బ్రహ్మతో సమానుడు. అన్ని మన్వంతరములలోను బ్రాహ్మ కన్యా నిమిత్తముగా జనించును (114). అని చెప్పగనే దక్షునిచే ప్రజలు సంతానములు) కోపింపబడిరి. అపుడు మరీచి : కశ్యమును ద్రాగెను. ఇచట కశ్యమనగా మద్యము అని చెప్పబడినది (115). బ్రహ్మ సంబంధము కశయనీ తెలియవలెను. బ్రప వచ్చినది. కశ్యయనబడును. విప్రులు కశ్యమును మద్యమందురు. కశ్యమును (మద్యమును) పానము చేయుట వలన క అయినాడు (116). దక్షునిచే శపింపబడి కోపించినవాడై క్రూరముగా బలుకబడిన వాక్కులను నిర్వర్తించుటచే నాతడు కశ్యపు (117). కావుననే పరమేష్టియు బ్రహ్మయునైన కశ్యపునిచే పలుకబడినది. కావుననే దక్షుడు తన కన్యలను కశ్యపునకిచ్చెను చేసియిచ్చెను). ఆ కన్యలందరును బ్రహ్మవాదినులు వారందరును లోకమాతలును అయిరి (118). అను నీ వారుణమై పుణ్యమై సృష్టిని దెలిసినవాడు ఆయుష్మంతుడును, పుణ్యవంతుడును, శుదుడునై యుత్తమ సుఖమును బొందును. దీనిని (కథను) బుద్ధి ధారణ జేయుట వలన, వినుటవల్లను సర్వపాపముల నుండి ముక్తుడగును.

ఆ తరువాత మునులందరు రోమహర్షునితో (సూతునితో) నిట్లనిరి. ఆఱవదైన చాక్షుషమన్వంతర ప్రజాసృష్టి జరిగిపోగా నీ సృష్టి జరిగినది .

సూత ఉవాచ :

సూతుడనెను :

 స్వయంభువైన బ్రహ్మచేత “స్వయముగా ప్రజలను సృష్టింపుము” అని యాదేశింపబడినవాడై దక్షుడు జంగమములను స్థావరములును అగు ప్రాణులను సృష్టించెను. వైవస్వత మన్వంతరము రాగా ఇది జరిగినది (121). తరువాత దక్షుడు నాలుగు విధములైన ప్రజలను సృష్టింప మొదలిడెను. వారు - జరాయుజులు (మావి వల్ల బుట్టినవారు), అండజులు (గ్రుడ్లనుండి బుట్టిన వారు), ఉద్భిజ్జులు భూమిని ఛేదించకొని పుట్టిన తరులతాదులు, స్వేదజులు (చెమట వల్ల బుట్టినవారు) అను నాలుగు విధములైన వారు (122). పదివేలయేండ్లు ఘోరమైన, గొప్పనైన తపమును జేసి, యోగ ఫలములచేతను, విశేషించి యణిమాదిసిద్ధులచేతను సంభావింపబడి (123), శ్రీమంతుడైన దక్షుడు తనను విభజించి మనుష్యులను, ఉరగులను, రాక్షసులను, దేవతలను, అసురులను, గంధర్వులను దివ్యవిగ్రహములు (ఆకారములు) గల ప్రజలను, ఈశ్వరులైన వారిని రూపములోను - ద్రవ్యములోను - తేజములోను తనతో సమానులైనవారిని (124), అట్లే యితరులను స్థావరములును జంగమములును అయిన ప్రాణులను మానసికముగనే సృష్టింపదలచి యనేక విధములైన ప్రజలను (125), ఋషులను, దేవతలను, గంధర్వులను, మనుష్యులను, ఉరగులను, రాక్షసులను, యక్ష - భూత - పిశాచులను, పక్షులను, పశువులను, మృగములను సృష్టించెను (126), మనస్సుతో సృష్టించిన యా ప్రజలు చక్కగా వర్ధిల్లకుండిరి. అపుడు బుద్ధిమంతుడై మహాదేవుడైన భగవంతునిచే వేరుగా ధ్యానింప (చింతింప) బడినది (127). వివిధ ప్రజలను మైథున భావముతో పదలచేను. వీరణ ప్రజాపతియొక్క పుత్రీయైన ‘అసిక్ని’ యను నామెను వహించెను (వివాహమై భార్యనుగా జేసికొనెను) (128). ఆమే గొప్ప తపముతో గూడినది. లోకమును ధరించునది. ఆమెచే ఈ సమస్త స్థావరజంగమాత్మకమైన జగత్తు ధరింపబడినది (129). ఇట కూడ ఉత్కృష్టురాలై వీరణ ప్రజాపతి పుత్రీయైన 'అసిక్ని'ని భార్యగా పెండ్లాడుచున్న ప్రాచేతసుని (దక్షుని) గూర్చి ఈ రెండు శ్లోకములను జెప్పుదురు (130). ప్రభువైన దక్షుడు నదీగిరులలో లక్షబావులను, అభిమానవంతులకు సర్పిణిని (ప్రవహించుదానిని) సృజించుచు వాని వెనుకనే యనుసరించి వెడలెను (131). ఆతనిని జూచి ఋషులు - ఇట మొదటిది ప్రజలను ప్రతిష్టాపించగలదు - అని యనిరి. రెండవది (అసిక్ని) దక్షప్రజాపతియొక్క ప్రజలను (సంతానమును) ప్రతిష్టాపించగలదు అని యరి (132). ప్రాచేతసుడైన దక్షుడెచట వీరిణీ పుత్రియగు అసిక్నిని భార్యగా పెండ్లాడెనో అచటనాతడు కాలానుగుణముగా లక్షబావులజేరెను (133). ఆ తరువాత ప్రాచేతస ప్రభువు (దక్షుడు) తనయమీతమైన యోజస్సుచే వీరిణీ పుత్రియైన 'అసిక్ని' యందు వేవురను పుత్రులను జనింపజేసెను (134). వారిని జూచి ప్రజలను (సంతానమును) వృద్దిబోందిపదలచెను. మహాతేజస్వియు, దేవర్షియు, ప్రియముగ నై బ్రహ్మపుత్రుడైన నారదుడు వారి నాశము కొరకును ఆత్మశాపమునకును వచనమును బలికెను (135). ఎవ్వడు విప్రుడని చెప్పబడునో యాతడు కశ్యపుని వాడనుట కృత్రిమము, ఆ పనిచేత బ్రహ్మర్షి నారదుడు దక్షశాప భయమున భయము జెందెను (136). తరువాత, ఎవ్వడు కశ్యపసుతునకు పరమేష్ఠియై (బ్రహ్మలై) పుట్టెనో, ఆతడే యిట దక్షశాపభయమున మరల కశ్యపునకు మానసపుత్రుడుగా  జనించెను (137). ఆకారణమున నాతడు (నారదుడు) రెండవ మానసపుత్రుడయ్యెను. ఆతడు (నారదుడు) బ్రహ్మకు మొదట (మానస బుట్టినవాడు (138). ఆతనిచేతనే యా దక్షుని పుత్రులందరు హర్యశ్వులని ప్రసిద్ధులైరి. నిందకొఱకై వారందరు నశిపజేయ కావున దష్టులైరి. సంశయము లేదు (139). దానికి ప్రభువైన దక్షుడు కోపించినవాడై వాని నాశమునకు బయలుదేరెను. బ్రహ్మరులను ముందడుకొని బ్రహ్మచే యాచింపబడెను (140). దాని వల్ల దక్షుడు బ్రహ్మతో అభిసంధితమును (ఒప్పంద జేసికొనెను. నా కన్యయందు నీ యొక్క (బ్రహ్మయొక్క) పుత్రుడు నా కొఱకు జనించు గాక - అని యా యొప్పందము (141). ఆ దక్షుడు తన ప్రియపుత్రిని పరమేష్ఠికి (బ్రహ్మకు) ఇచ్చెను. ఆ బ్రహ్మ వల్ల నారదుడు మరల జనించెను. ఆ నారదఋషియు భ నుండి శాంతించెను (భయము బా సెను) (142). అది విని యా విప్రులు మరల కుతూహలము కలిగినవారై ప్రవక్తలలో శ్రే తత్త్వార్థమును దర్శించువాడును ఐన సూతునడిగిరి .

దక్షప్రజాపతి పుత్రులును ప్రాచేతసాత్మజులునైన దక్షపుత్రులు మహాత్ముడైన సోరదునిచే నెట్లు నశింపజేయబడిరి - అని ఋషు (144). సూతుడు ఆ నిజమైన వాక్యమును తెలిసికొను కోరికతో బయలు వెడలి మధురమైన సర్వగుణములతో గూడిన వచన పలికెను (145). దక్షపుత్రులు హర్యశ్వులను వారు. వారు వృద్ధి బొందగోరిన (దక్షుని) సంతానము. మహావీర్యులైన వారు నే కడకు వచ్చిరి. నారదుడు వారితో నిట్లనెను .

అయ్యో! మీరు చిన్నపిల్లవాండ్రు. భూతలమును తెలియరు. దానియంతమును, ఊర్ధ్వమును, క్రిందుభాగమును దెలి ప్రజలనెట్లు సృష్టించగలరు (147). భూమి యొక్క ప్రమాణమెంత? సృష్టింపదగినవారెంతటివారు? సృష్టింపదగిన దానిని తెలిం వేరొక విధముగా మీరేమీ సృష్టింతురు? అది కొద్దిదై నను గొప్పదైనను అచట దోసము కనబడుచున్నది .

ఆహర్యశ్వులు నారదుని మాటను విని వాయువుతో జేరి అన్ని దిక్కులకు (చెల్లాచెదరుగా) వెడలిపోయిరి. ఆ విధముగ వారు పరాభవమును బొందిరి (149). వాయువుతో గలిసి తిరుగుచున్న వారిప్పటికి మరల రాలేదు. ఈ విధముగా నా మహరులు వాయుమార్గమును జేరి తిరుగుచునే యున్నారు (150). ఈ విధముగా తన పుత్రులు నష్టులు (కనబడనివారు) గాగా ప్రాచేతసుడైన ప్రభువైన దక్షుడు మరల వీరిణియందు వేయి పుత్రులను సృజించెను (151). ప్రజలను వృద్ధిజేయదలచినవారు శబలాశ్వులనబడిరి. మహౌజసులైన యా కుమారులందరును నారదుడు హర్యశ్వులనన్నమాటను వినిరి - నారద మహర్షి చక్కగాననెను - అనిపరస్పరమనుకొనిరి. మనము గూడ మనయన్నల మార్గముననే బోవలసియున్నది. సంశయము లేదు అనిరి (153). భూమి యొక్క ప్రమాణమును తెలిసికొని సుఖముగా ప్రజలను సృజింతము అని యనుకొని వారు గూడ యా (వాయు) మార్గముననే అన్ని దెసలకు వెడలిపోయిరి. సముద్రమునుండి నదులవలె నిప్పటికీని వారు మరలిరారైరి (154). అప్పటినుండి అన్నలను వెదకుటలో నాసక్తుడై పోవువాడు నశించును. తెలిసి యాపనిని జేయరాదు - అనుకొనిరి (155). ఈశబలాశ్వులు నష్టులు గాగా విభువైన దక్షుడు కుపితుడయ్యెను. నారదుని నాశమును బొందుమనియు గర్భవాసమున నుండుమనియును శపించెను (156). ఆ విధముగ మహాత్ములైన శబలాశ్వులు పూర్వము నష్టులు కాగా దక్షుడు వీరణపుత్రియైన వీరిణియందు ప్రసిద్దలైన యువది కన్యలను సృజించెను. (157). అపుడు ప్రభువైన కశ్యపుడు వారిని తన భార్యలుగా స్వీకరించెను. ధర్ముడు, భగవంతుడైన సోముడు, అట్లే ఇతర మహరులును (158) కన్యలను స్వీకరించిరి. ఈ దక్షుని సమస్త సృష్టిని దెలిసినవాడు ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, ధన్యుడు, ప్రజా (సంతాన)వంతుడును అగును (159).

ఇది శ్రీ వాయుమహాపురాణమున ప్రజాపతి వంశానుకీర్తనమను నాలుగవ యధ్యాయము సమాప్తము.